• TFIDB EN
  • దేవదాస్
    UTelugu2h 44m
    దేవ (నాగార్జున) పెద్ద డాన్‌. ఓ రోజు బుల్లెట్‌ గాయంతో దాస్‌ (నాని) క్లినిక్‌కు వస్తాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాస్‌తో స్నేహం దేవ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? తనని చంపాలని చూస్తున్న డేవిడ్‌ను దేవ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగార్జున
    దేవ
    నాని
    డా. ఎం.కె.దాస్
    రష్మిక మందన్న
    ఇన్‌స్పెక్టర్ పూజ
    ఆకాంక్ష సింగ్
    రిపోర్టర్ జాహ్నవి
    ఆర్. శరత్‌కుమార్
    దేవా పెంపుడు తండ్రి (అతిథి పాత్ర)
    కునాల్ కిషోర్ కపూర్
    డేవిడ్
    నవీన్ చంద్రన్
    దాదా కొడుకు
    నరేష్
    దాస్ సోదరుడు
    సత్య కృష్ణ
    దాస్ కోడలు
    మురళీ శర్మ
    రావు రమేష్
    డా. భరద్వాజ్
    వెన్నెల కిషోర్
    ఒక మానసిక వైద్యుడు
    శ్రీనివాస్ అవసరాల
    దేవా వ్యక్తిగత సహాయకుడు
    మనోబాల
    పూజా అసిస్టెంట్
    ఐశ్వర్య భాస్కరన్
    ఫిష్‌ఫ్రై లక్ష్మి
    శివన్నారాయణ నారిపెద్ది
    పూజ తండ్రి
    ప్రభాకర్
    దేవ అనుచరుడు
    పృధ్వీ రాజ్
    జాహ్నవి మేనేజర్
    రఘు కారుమంచి
    లోకల్ రౌడీ
    ప్రభాస్ శ్రీను
    డేవిడ్ అనుచరులు
    సమీర్
    డాక్టర్
    ఉత్తేజ్
    సీతారామయ్య డ్రైవర్
    సత్య అక్కల
    దాస్ క్లినిక్ కాంపౌండర్
    సంపూర్ణేష్ బాబు
    నటుడు (అతి అతిధి పాత్ర)
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    మెడిమాక్స్ హాస్పిటల్ చైర్మన్ సీతారామయ్య (అతి అతిధి పాత్ర)
    సిబ్బంది
    శ్రీరామ్ ఆదిత్య
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>HBD Ileana D'Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!</strong>
    HBD Ileana D'Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!
    గ్లామరస్ డాల్ ఇలియానా నేడు 38 వ వంసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 38వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి&nbsp; ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది.&nbsp; ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; &nbsp;'బాద్షాహో', 'రుస్తోమ్' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ (HBD IlleanIleana D'Cruz) ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.&nbsp; &nbsp;2018లో మెకాఫీ 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె,&nbsp; ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది 10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది. &nbsp;ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి. https://twitter.com/tejdeharam/status/1852220221001732234 డేటింగ్ హిస్టరీ ఇలియానా సినీ కెరీర్ హిట్‌ అయినంతగా... పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు.&nbsp; తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరు చాలా ఏళ్లు సహజీవనం చేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు 2019లో విడిపోయారు. ఆండ్రూ నీబోన్‌తు విడిపోయిన తర్వాత.. ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖెల్‌తో జతకట్టింది. వీరిద్దరు 2023 వరకు సహజీవనం చేశారు.&nbsp; సెబాస్టియన్‌తోనూ పొసగక ఇలియానా అతనికి ఈ గోవా సుందరి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత వెంటనే 2023 జులైలో మైకెల్ డోలాన్‌తో తన రిలేషన్‌ షిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది.&nbsp; తామిద్దరం డేట్ నైట్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాలో(HBD IlleanIleana D'Cruz) హార్ట్‌ ఎమోజీతో తమ రిలేషనన్ షిప్‌ను కన్ఫామ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి (మే 13.2023) ద్వారా ఈ ఇద్దరు ఏకం అయ్యారు. అయితే ఇలియానా పెళ్లికి ముందే తన ప్రెగ్నెన్సీని ఏప్రిల్ కన్ఫామ్ చేసింది. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 2023 ఆగస్టు 1న ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.&nbsp; మరోవైపు 'ఫాటా పోస్టర్ నిక్లా' హీరో సినిమా చిత్రీకరణ సమయంలో.. హీరో షాహిద్ కపూర్‌తో ఎఫైర్‌ కొనసాగించినట్లు గాసిప్స్ ఉన్నాయి. వివాదాలు సెక్స్‌పై ఇలియానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. "sex is a major relaxation to my body. it keeps me Young and I dont mind to talk about that in Public" ("సెక్స్ నా శరీరానికి ముఖ్యమైన విశ్రాంతి. ఇది నా యవ్వనాన్ని కాపాడుతుంది, ఈ&nbsp; విషయాన్ని ప్రజల ముందు మాట్లాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.") ఇలియానాకు హైదరాబాదీ బిర్యాని అంటే చాలా ఇష్టం, చైనీస్, ఇటాలియన్ ఫుడ్ వెరైటీస్‌ను కూడా ఇష్టంగా తింటుంది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలిఖాన్‌లు తన అభిమాన నటులు అని పలు సందర్భాల్లో చెప్పింది. ఇలియానా దక్షిణాదిలో కోటీ రూపాయలు రెమ్యునరేషన్‌గా పొందిన తొలి హీరోయిన్‌గా పేరు గడించింది. ఆమె కెరీక్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేసింది. ఇలియానాకు మద్యం అలవాటు ఉంది. పార్టీ సమయాల్లో రెగ్యులర్‌గా మద్యం సేవిస్తూ ఉంటుంది. ఇలియానాకు హిందీ భాష పూర్తిగా రాదు, గోవాలో పుట్టి పెరగడంతో ఆ భాషపై అంతగా పట్టు సాధించలేదు. క్రమంగా బర్పీ చిత్రం నుంచి హిందీపై పట్టు సాధించింది. ఇలియానాకు మింట్ చాక్లెట్స్ అంటే తెగ ఇష్టం. వాటికి తాను అడిక్టెడ్. ఎప్పుడూ నములుతూనే ఉంటుంది.
    నవంబర్ 01 , 2024
    HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్... ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?
    HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్... ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?
    తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; &nbsp;'బాద్షాహో', 'రుస్తోమ్' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.&nbsp; &nbsp;2018లో మెకాఫీ 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె,&nbsp; ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది 10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది. &nbsp;ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి. &nbsp;ఆమె ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. ఇలియానా సినీ కెరీర్ హిట్‌ అయినంతగా... పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్‌లో కొనసాగుతోంది.
    నవంబర్ 01 , 2023
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో అనగానే ముందుగా రామ్‌ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్‌, యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా ప్రతీదానిలోనూ రామ్‌ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్‌ పోతినేని ఒకరు. తెరపై రామ్‌ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్‌’తోనే తానేంటో రామ్‌&nbsp; నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్‌ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీసిన పాటలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. బుల్లెట్ (వారియర్) రామ్‌ పోతినేని - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా వారియర్‌. దేవిశ్రీ ఇచ్చిన సంగీతానికి రామ్‌ స్టెప్పులు తోడు కావడంతో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ రిబ్బన్‌ పట్టుకొని వేసే హుక్‌ స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు హీరోయిన్‌ కృతి శెట్టి కూడా రామ్ ఎనర్జీని మ్యాచ్‌ చేస్తూ అదరగొట్టింది.&nbsp; https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 2. ఇస్మార్ట్ టైటిల్‌ సాంగ్ (ఇస్మార్ట్‌ శంకర్‌) ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోని ‘ఇస్మార్ట్‌’ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో రామ్‌ ఫుల్‌ ఎనర్జీతో డ్యాన్స్‌ చేశాడు. కొత్త కొత్త స్టెప్పులతో వీక్షకుల మతి పొగొట్టాడు. శరీరాన్ని స్పింగ్‌లా తిప్పుతూ అలరించాడు. ముఖ్యంగా చార్మినార్‌ ముందు మోకాళ్లపై చేసే స్టెప్పు ట్రెండ్‌ సెటర్‌గా నిలిచింది.&nbsp; రామ్ బెస్ట్‌ డ్యాన్సింగ్‌ వీడియోల్లో ‘ ఇస్మార్ట్‌’ పాట కచ్చితంగా టాప్‌-5లో ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Ox4ih-vJu7E 3. వాట్‌ అమ్మా (ఉన్నది ఒకటే జిందగీ) రామ్‌ డ్యాన్స్‌ అంటే స్పీడు స్టెప్పులకు పెట్టింది పేరు. అటువంటి రామ్‌ స్లో డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ‘వాట్‌ అమ్మా’ అనే పాటలో రామ్‌ డ్యాన్స్‌ అప్పటివరకూ చేసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా సాగే పాటకు తగ్గట్లు స్టెప్పులు వేసి రామ్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా చేశారు. https://www.youtube.com/watch?v=UbrbvbA3yD4 4. డిచుకు డిచుకు డంకా (రెడ్‌) రెడ్ సినిమాలోని &nbsp;డిచుకు డిచుకు డంకా ఐటెం సాంగ్‌లో రామ్‌ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఐటెం డాల్‌ హెబ్బపటేల్‌ను టీజ్‌ చేస్తూ సాగే ఈ పాటలో రామ్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఈ పాట యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. https://www.youtube.com/watch?v=2BxxwJiqI_w 5. కల్లోకి దిల్లోకి (మస్కా) రామ్‌ - హన్సిక జంటగా చేసిన మస్కా సినిమా తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని అన్ని పాటలు అప్పట్లో యమా క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా కల్లోకి దిల్లోకి పాట ప్రతీ ఫంక్షన్లలో వినిపించేది. ఇందులో రామ్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సాంగ్‌కు తగ్గట్లే ఫుల్‌ జోష్‌తో స్టెప్పులు వేశాడు. ఇందులో మోకాళ్ల మీద వేసే స్టెప్పులు.. ట్రైనింగ్‌ లేకుండా వేయవద్దని సాంగ్‌లో స్క్రోల్‌ కూడా వచ్చింది. https://www.youtube.com/watch?v=cKpNVmAs-b0
    మే 15 , 2023
    <strong>Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!</strong>
    Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్‌ మైథాలజీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్‌, హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్‌ ప్రభాస్‌ను మెగాస్టార్‌ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.&nbsp; ‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’! ప్రభాస్‌ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్‌ అని తెలియకుండా ఈ సెట్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్‌ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్‌ వేశారని టాక్‌. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్‌ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.&nbsp; కల్కి తర్వాత విశ్వంభరే టాప్‌! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్‌ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్‌ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను మెగాస్టార్‌ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.&nbsp; మెగాస్టార్ అసంతృప్తి లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'విశ్వంభర' సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్‌ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్‌ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్‌ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్‌ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. View this post on Instagram A post shared by Kunal Kapoor (@kunalkkapoor)
    ఆగస్టు 03 , 2024
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న.. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. టైట్‌ ఫిట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోసింది. కొంటె చూపులతో మత్తెక్కించే ఫోజుల్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి.&nbsp; విజయ్‌ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తాజాగా పుకార్లు రేకెత్తాయి.&nbsp; విజయ్‌, రష్మిక వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని టాక్‌ వినిపించింది. మంచి రోజు చూసుకొని ఎంగేజ్‌మెంట్‌, కొద్ది రోజుల వ్యవధిలోనే వివాహాం కూడా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్‌ టీమ్‌ తాజాగా స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.&nbsp; ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం విజయ్‌, రష్మిక కలిసి వర్క్‌ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్‌, డిన్నర్‌ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్‌ వినిపించాయి.&nbsp; రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్‌ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&nbsp; ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్‌ వీడియో ఘటనపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్‌ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్‌' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.&nbsp; 2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.&nbsp; అదే ఏడాదిలో వచ్చిన విజయ్‌ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్‌ మూవీ పర్వాలేదనిపించింది.&nbsp; ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్‌’, బన్నీతో&nbsp; ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.&nbsp; హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌ బై’, సిద్దార్థ్‌ మల్హోత్రాతో జంటగా ‘మిషన్‌ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.&nbsp; ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో ఈ భామ నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; పుష్ప-2తో పాటు రష్మిక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది.&nbsp;
    జనవరి 09 , 2024
    Rashmika Mandanna: రష్మిక మరో ఫేక్ వీడియో ప్రత్యక్షం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌!
    Rashmika Mandanna: రష్మిక మరో ఫేక్ వీడియో ప్రత్యక్షం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌!
    స్టార్‌ హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandanna)ను సోషల్‌మీడియాలోని ఆకతాయిలు మరోసారి టార్గెట్‌ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్‌ వీడియోను క్రియేట్‌ చేసి ఇబ్బందిపెట్టగా తాజాగా మరో డీప్‌ ఫేక్‌ వీడియోను సృష్టించారు.&nbsp; https://twitter.com/MrReactionWala/status/1722643605729550835 ఇందులో ఆమె జిమ్ సూట్‌ ధరించి డ్యాన్స్‌ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయేన్సర్‌ జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.&nbsp; రష్మిక ఫేక్‌ వీడియోపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.&nbsp; ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్‌ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్‌' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.&nbsp; 2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.&nbsp; అదే ఏడాదిలో వచ్చిన విజయ్‌ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్‌ మూవీ పర్వాలేదనిపించింది.&nbsp; ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్‌’, బన్నీతో&nbsp; ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.&nbsp; హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌ బై’, సిద్దార్థ్‌ మల్హోత్రాతో జంటగా ‘మిషన్‌ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.&nbsp; ప్రస్తుతం రష్మిక&nbsp; బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2తో పాటు, బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal)లోనూ రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటు రష్మిక ఫీ మేల్‌ సెంట్రిక్‌ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు ‘రెయిన్‌ బో’ (Rainbow) టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    నవంబర్ 10 , 2023
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.&nbsp; దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు&nbsp; గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రామ్‌ పొత్తినేని ఒకడు. దేవదాసు, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు RAPO దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉస్తాద్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రామ్‌ పొత్తినేని గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్‌ పొత్తినేని ఎవరు? వ్యాపారవేత్త మురళి పొత్తినేని కుమారుడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోషోర్ స్వయానా మేనళ్లుడు. రామ్‌ పొత్తినేని ముద్దు పేర్లు? RAPO, ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు రామ్‌ పొత్తినేని ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ రామ్‌ పొత్తినేని పుట్టిన తేదీ ఎప్పుడు? 1988 మే 15 రామ్‌ పొత్తినేనికి వివాహం అయిందా? ఇంకా కాలేదు. రామ్‌ పొత్తినేనికి ఇష్టమైన రంగు? వైట్, బ్లూ రామ్‌ పొత్తినేని తల్లిపేరు పద్మ శ్రీ రామ్‌ పొత్తినేని అభిరుచులు? డ్యాన్స్ చేయడం, క్రికెట్ ఆడటం రామ్‌ పొత్తినేనికి&nbsp; ఇష్టమైన ఆహారం? బిర్యాని రామ్‌ పొత్తినేని అభిమాన నటుడు? వెంకటేష్ రామ్‌ పొత్తినేనికి నచ్చిన సినిమా? కలిసుందాం రా రామ్‌ పొత్తినేని&nbsp; స్టార్ డం అందించిన సినిమాలు? దేవదాసు, ఇస్మార్ట్ శంకర్, రెడీ రామ్‌ పొత్తినేని&nbsp; ఏం చదివాడు? చెన్నై యూనివర్సిటీలో డిగ్రీ రామ్‌ పొత్తినేని ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=nqh6O2HFT-g రామ్‌ పొత్తినేని సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నాడు. రామ్‌ పొత్తినేని ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? దేవదాసు, రెడీ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,&nbsp; ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.&nbsp; పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.&nbsp; ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్‌(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్‌ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.&nbsp; ప్రభాస్‌కు మాస్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు. https://twitter.com/SumanthOffl/status/1670414528235073537?s=20 RAPOకు డ్యాన్స్ శిక్షణ యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్... RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. https://twitter.com/RamUniversal1/status/1670429314993594368?s=20 మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని&nbsp; ఫుల్ సాంగ్‌లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు. https://twitter.com/avinashgoud00/status/1670430461372534785?s=20 1500 సినిమాలకు కొరియోగ్రఫీ రాకేశ్ మాస్టర్‌ ఒకానొక దశలో టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20 జనసేనకు ఓటు వేస్తా.. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్‌కే వేస్తానని పేర్కొన్నారు. https://twitter.com/Vamsitweetzz/status/1670428040638386181?s=20 శేఖర్‌కు లైఫ్‌ ఇచ్చాడు.. తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.&nbsp; https://www.facebook.com/watch/?v=188462650858056 శేఖర్‌ మాస్టర్‌తో చెడింది ఇక్కడే.. శేఖర్ మాస్టర్‌ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్‌కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్‌కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే... తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు. అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్‌ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్‌గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్‌ అయ్యాక రాకేష్ మాస్టర్‌కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..
    జూన్ 19 , 2023
    <strong>Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?</strong>
    Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్‌’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) మూవీ షూటింగ్‌ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. కారణం ఏంటంటే? శివకార్తికేయన్‌ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్‌’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్‌ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్‌ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్‌ షూట్‌ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’ రాత్రి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy) షూటింగ్‌ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్‌ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్‌ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.&nbsp; దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్‌ రోల్స్‌ చేశాడు. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రిలీజ్‌ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్‌'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తొలి పార్ట్‌ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    నవంబర్ 12 , 2024
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.&nbsp; డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? గామి సినిమా మొదటి రోజే (Gaami Day 1 Collections) రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా తొలి రోజు 2.50 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 1 మిలియన్‌ డాలర్స్‌ దిశగా ‘గామి’ పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. విష్వక్‌ సేన్‌ ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే అత్యధిక డే వన్‌ కలెక్షన్స్‌ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.&nbsp; View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) సాక్నిక్‌ లెక్కల ప్రకారం గామి చిత్రం తొలిరోజు కలెక్షన్స్‌ను ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) కూడా ప్రకటించింది. ఈ సినిమా తొలి రోజు రూ. 4.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Gaami Day1 Net Collections)ను వసూలు చేసినట్లు తన సైట్‌లో పేర్కొంది. అయితే వరల్డ్‌ వైడ్‌గా ఎంత వసూళ్లను రాబట్టిందోనన్న విషయాన్ని మాత్రం సాక్నిక్‌ తన సైట్‌లో ప్రస్తావించలేదు. అటు ‘గామి’ ఫస్ట్‌డే రోజున చెప్పుకోతగ్గ స్థాయిలో థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్నిక్‌ తెలిపింది. మార్కింగ్‌ షోకు 45.58%, మధ్యాహ్నం 56.47%, సాయంత్రం 49.88%, సెకండ్ షో 71.69% ఆక్యుపెన్సీ రేట్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఈ వీకెండ్‌లో ఆక్యుపెన్సీతో పాటు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషించింది.&nbsp; ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. అంటే గామి హిట్ అవ్వాలంటే రూ. 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. తొలిరోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ మూవీ ఈజీగానే లాభాల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; విష్వక్‌ నటనపై ప్రశంసలు అఘోరా శంకర్‌ పాత్రలో విశ్వక్‌ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. శంకర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అతడు నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో. యాక్ష విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
    మార్చి 09 , 2024
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’&nbsp; ఎలా ఉందంటే?
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’&nbsp; ఎలా ఉందంటే?
    నటీనటులు: విష్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, అభినయ, రమ్య పసుపులేటి, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, మయాంక్‌ పరాక్‌, రాజీవ్‌ కుమార్‌,&nbsp; దర్శకుడు: విద్యాధర్‌ కాగిత సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ సినిమాటోగ్రాఫర్‌: &nbsp;విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ నందీగాం నిర్మాత: కార్తిక్‌ శబరీష్‌, శ్వేత మోరవనేని విడుదల తేదీ: 8 మార్చి, 2024 విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఇందులో విష్వక్ తొలిసారి అఘోరా గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్‌ ట్రీట్‌ చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కాగా, భారీ అంచనాల నడుమ గామి చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అఘోరా గెటప్‌లో విష్వక్‌ మెప్పించాడా? అందరి అంచనాలను ఈ సినిమా నిలబెట్టిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్‌ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడికి చాందిని చౌదరి చేసిన సాయం ఏంటి? దేవదాసిని తరిమేసిన గ్రామస్తులే తిరిగి ఆమెకోసం ఎందుకు వెతకాల్సి వచ్చింది? హ్యుమన్‌ ట్రైల్స్‌ ఎందుకు చేస్తున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరేలా చేశారంటే&nbsp; ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. అఘోరా శంకర్‌ పాత్రలో అతడు విశ్వరూపం చూపించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్‌, ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు విద్యాధర్ కాగిత.. ‘గామి’ చిత్రాన్ని సరికొత్త కథతో తెరకెక్కించారు. ఇప్పటివరకూ రాని యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి.. అరంగేట్రంలోని మంచి ఇంప్రెషన్‌ సంపాదించాడు. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన దర్శకుడు.. శంకర్‌ పాత్రలో ప్రేక్షకులు త్వరగా లీనమయ్యేలా చేశారు. ఓ వైపు శంకర్‌ పాత్రను నడిపిస్తూనే సమాంతరంగా మరో రెండు విభిన్న స్టోరీలను తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచింది. చివర్లో ఆ మూడు కథలను లింకప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే లయన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ విజువల్‌ ట్రీట్‌గా అనిపిస్తుంది. అయితే సబ్‌ప్లాట్ స్టోరీలైన దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ ఎపిసోడ్‌ను సమర్థవంతంగా చూపించడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అటు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరీ సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ విద్యాధర్ ఇచ్చిన ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి. టెక్నికల్‌గా&nbsp; ఈ సినిమాకు సాంకేతిక విభాగం చాలా బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ విభాగం తమ పనికి 100 శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీల కెమెరా పనితనం మెప్పిస్తుంది. స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథ, కథనంవిష్వన్‌ నటనటెక్నికల్‌ టీమ్‌ మైనస్‌ పాయింట్స్‌ సబ్‌ప్లాట్ స్టోరీలుసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా.. విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన 'గామి' (Gaami) చిత్రం.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విష్వక్‌ తొలిసారి అఘోరా పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా&nbsp; 'గామి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్వక్‌కు ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌ను మరోస్థాయికి ‘గామి’ తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘గామి’ ట్రైలర్‌ చూసిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.&nbsp; ప్రభాస్‌ ఏమన్నాడంటే! విజువల్‌ వండర్‌గా విడుదలైన 'గామి' (Gaami) ట్రైలర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. హీరో ప్రభాస్‌ ‘గామి’ ట్రైలర్‌పై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో బైట్‌నే రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటాడని ప్రశంసించాడు. ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా ఉందని.. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రతీ ఒక్కరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తోందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1763423427510370770 ‘గామి’ అరుదైన చిత్రం’ ‘గామి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశాడు. అనంతరం సందీప్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు.&nbsp; https://twitter.com/HanuNews/status/1763062517746831765 ‘గామి’ అంటే అర్థం ఇదే! ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేసినప్పటి నుంచి 'గామి' టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికి అర్థం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థంపర్థం లేని టైటిల్‌గా అనిపిస్తోందంటూ కొందరు విమర్శలు సైతం చేశారు. అయితే దీనిపై ట్రైలర్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత క్లారిటి ఇచ్చారు. ‘గామి అంటే గమ్యాన్ని గమించేవాడు’ అని మీనింగ్ వస్తుందని తెలిపాడు. చిన్నగా మెుదలైన ‘గామి’.. విష్వక్‌, నిర్మాత ప్రోత్సాహంతో పెద్ద చిత్రంగా మారిందని అన్నారు. విజువల్‌ వండర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/NtvTeluguEnt/status/1763212759653810231 ‘ఫీచర్ ఫిల్మ్ అంటే నమ్మలేదు’ డెఫ్‌ &amp; డంబ్‌ నటి అభినయ (Actress Abhinaya) ‘గామి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దేవదాసి పాత్రలో ఆమె కనిపించనుంది. మాటలు రాకపోయినా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అభినయ సైగలతో చేసిన స్పీచ్‌ ఆసక్తి రేపుతోంది. ‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తొలుత నమ్మలేదు. వైజాగ్‌ షూటింగ్‌లో ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్‌ పూర్తి చేసేశారు డైరెక్టర్‌’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ. https://twitter.com/i/status/1763209148253213116
    మార్చి 01 , 2024
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌&nbsp; తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.&nbsp; వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో&nbsp; ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.&nbsp; డాక్టర్లు ఏమన్నారు? &nbsp;రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని&nbsp; గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం. &nbsp; ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.&nbsp; తండ్రి ఎవరు?&nbsp; ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా&nbsp; ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.&nbsp; పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 18 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    <strong>Devaki Nandana Vasudeva Review: మ్యాటర్‌ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్‌ వర్మ? పాపం అశోక్‌ గల్లా!</strong>
    Devaki Nandana Vasudeva Review: మ్యాటర్‌ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్‌ వర్మ? పాపం అశోక్‌ గల్లా!
    నటీనటులు : అశోక్‌ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే తదితరులు డైరెక్టర్‌ : అర్జున్ జంధ్యాల కథ : ప్రశాంత్ వర్మ డైలాగ్స్‌: బుర్ర సాయి మాధవ్‌ సినిమాటోగ్రాఫీ: ప్రసాద్‌ మురెళ్ల, రసూల్‌ ఎడిటింగ్‌: తిమ్మరాజు విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నవంబర్‌ 22న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కథలో ప్రశాంత్ వర్మ మార్క్‌ కనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం. కథేంటి కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. ఒక రోజు కాశీకి వెళ్లిన కంసరాజుకు అఘోరా తారసపడి నీ మరణం నీ చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం చేతిలో ఉందని చెప్తాడు. దీంతో కడుపుతో ఉన్న చెల్లి (దేవయాని)పై కంసరాజు దాడి చేస్తాడు. ఆమె భర్త చనిపోవడంతో 21 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. అయితే కంసరాజు చెల్లికి ఆడపిల్ల సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్‌ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన కంసరాజు మేనకోడలు సత్యను ఏం చేశాడు? కంసరాజుకు తెలియకుండా అతడి చెల్లెలు దాచిన సీక్రెట్ ఏంటి? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సత్య ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కృష్ణ పాత్ర కోసం అశోక్‌ గల్లా (Devaki Nandana Vasudeva Review) చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. గత చిత్రంతో పోలిస్తే నటన, బాడీ లాంగ్వెజ్‌పరంగా అశోక్‌ మెరుగయ్యాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా మానస వారణాసి అలరించింది. తెరపై వారి కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే భావోద్వేగాలు పలికించే విషయంలో మానస అక్కడక్కడ తడబడింది. విలన్‌గా దేవదత్తా నాగే ఆకట్టుకున్నాడు. అతడి చెల్లెలు పాత్రలో దేవయాని నటన బాగుంది. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ చక్కగా చేసింది. సంజయ్‌ స్వరూప్‌, శత్రు, శ్రీధర్‌ రెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే హనుమాన్‌ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) అందించిన కథలో పెద్దగా స్టఫ్‌ లేదు. స్టోరీకి మైథాలజీని ముడిపెట్టినప్పటికీ అది ఎక్కడా సింక్‌ అయినట్లు అనిపించదు. పురాణాల నేపథ్యం లాజిక్‌ లెస్‌గా అనిపిస్తుంది. దర్శకుడు అర్జున్‌ జంధ్యాల కథనంలోనైనా మ్యాజిక్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. స్క్రీన్‌ప్లేను ఇంట్రస్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. ఓ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కించిన సీన్స్‌ స్వాగతించేలా లేవు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కూడా పేలవంగా అనిపిస్తుంది. కృష్ణ, కంసరాజు మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సైతం బలంగా చూపించలేకపోయారు. కృష్ణ పాత్రను ఎలివేట్‌ చేసేందుకు తీసిన కొన్ని సీన్స్‌ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మెుత్తానికి దర్శకుడు చాలా చోట్లనే ప్రేక్షకులకు బోర్‌ కలిగించాడు.&nbsp; సాంకేతిక అంశాలు టెక్నికల్‌ విషయాలకు వస్తే భీమ్స్‌ సిసిలియో సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను అతడి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్‌ తమ్మిరాజు పనితనం ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ అశోక్‌ గల్లా నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ మెరుపులు లేని కథనంలవ్‌ట్రాక్‌మిస్‌ఫైర్‌ అయిన మైథాలజీ టచ్‌ Telugu.yousay.tv Rating : 2/5&nbsp;
    నవంబర్ 22 , 2024

    @2021 KTree