రివ్యూస్
How was the movie?
తారాగణం
రామ్ చరణ్
ఇషికా ఆసక్తిని ప్రేమిస్తుందిఅరవింద్ స్వామి
చెంగలరాయుడు కొడుకురకుల్ ప్రీత్ సింగ్
ధృవ ప్రేమికుడునవదీప్
ధృవ స్నేహితుడుపోసాని కృష్ణ మురళి
సిద్ధార్థ్ తండ్రిసాయాజీ షిండే
ధీరజ్ చంద్రఅభినయ
సైంటిస్ట్ అక్షరనాసర్
తెలంగాణ ముఖ్యమంత్రిఅలీ రెజా
ధృవ స్నేహితుడురణధీర్ రెడ్డి
ధృవ స్నేహితుడువిద్యుల్లేఖ రామన్
ఇషిక స్నేహితురాలుహిమజ
ఇషిక స్నేహితురాలుసౌరవ్ చక్రవర్తి
ఇర్ఫాన్ అలీ తమ్ముడుమధుసూధన్ రావు
అబ్బాస్అజయ్ రత్నం
ఇషికా తండ్రిసూర్య
రామస్వామిడేనియల్ పైర్స్ ఏంజెలీనా
హిప్హాప్ తమిజా
స్వయంగాసిబ్బంది
సురేందర్ రెడ్డి
దర్శకుడుఅల్లు అరవింద్
నిర్మాతN. V. ప్రసాద్నిర్మాత
హిప్హాప్ తమిజా
సంగీతకారుడుMohan Rajaకథ
పిఎస్ వినోద్
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్కథనాలు
Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’
నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు..
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్‌లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్‌లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారు?
వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్ పరిధి మేరకు నటించాడు.
టెక్నికల్‌గా
తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్‌లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్‌గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
భావోద్వేగ సన్నివేశాలు
క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథ, కథనం
చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’.
రేటింగ్: 3.25/5
జూన్ 09 , 2023
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
అక్టోబర్ 30 , 2024
అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2, ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అడవి శేషు అసలు పేరు?
అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర
అడవి శేషు ఎత్తు ఎంత?
5 అడుగుల 11 అంగుళాలు
అడవి శేషు తొలి సినిమా?
సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.
అడవి శేషుకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు?
5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.
అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు.
అడవి శేషుకు ఇష్టమైన కలర్?
బ్లాక్, వైట్
అడవి శేషు పుట్టిన తేదీ?
17 December 1984
అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు?
చంద్ర, భవాని
అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం?
కాలీఫోర్నియా
అడవి శేషు ఏం చదివాడు?
అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు
అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు
అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు?
అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.
అడవి శేషుకు ఇష్టమైన ఆహారం?
అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు
అడవి శేషు ఇల్లు ఎక్కడ?
అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు
https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
మార్చి 21 , 2024
This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
గతవారం సలార్ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఆ సినిమాకు పోటీగా ఈవారం పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. చాలావరకు తమ సినిమాలను కొత్త ఏడాది జనవరిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో డిసెంబర్ ఇయర్ ఎండింగ్‌లో దాదాపు 25కు పైగా చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. డెవిల్ సినిమాను అభిషేక్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.
ధృవ నక్షత్రం
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదులను ఏరిపారేసే ఆర్మి అధికారిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు
మంగళవారం
వారం రోజులుగా ఓటీటీ రిలీజ్‌పై దాగుడు మూతలు ఆడుతున్న మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో హర్రర్ చిత్రంగా మంగళవారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి.
అన్నపూరాణి
లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన రిసెంట్ చిత్రం 'అన్నపూరాణి' డిసెంబర్ 29 నుంటి ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ డెరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ OTTలో తెలుగు, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateMangalavaaramMovieTeluguDisney Plus HotstarDec 2612th FailMovieTelugu/HindiDisney Plus HotstarDec 29Katatan Si BoyMovieIndonesianAmazon PrimeDec 27Tiger 3MovieHindiAmazon PrimeDec 31Ricky Gervais: Armageddon Standup Comedy ShowEnglishNetflixDec 25Snag MovieEnglishNetflixDec 25Ko Gaye Hum Kaha MovieHindiNetflixDec 26Thank You I'm Sorry MovieSwedishNetflixDec 26Hell Camp: Teen Night Mare MovieEnglishNetflixDec 27A Very Good GirlMovieTagalogNetflixDec 27Miss SampoMovieMandarinNetflixDec 28Little DixieMovieEnglishNetflixDec 28Pokemon Concierge Web SeriesJapaneseNetflixDec 28AnnapooraniMovieTelugu Dubbed NetflixDec 29Shastri Virudh Shastri MovieHindiNetflixDec 29Three of UsMovieHindiNetflixDec 29Bad LandsMovieJapaneseNetflixDec 29Berlin MovieSpanishNetflixDec 29Dangerous Game: The Legacy MurdersMovieEnglishNetflixDec 31The AbandonedMovieMandarinNetflixDec 31Dono MovieHindiZee5Dec 29Once Upon Two TimesMovieHindiZee5Dec 29Safed MovieHindiZee5Dec 29Trolls and TogetherMovieEnglishBook My ShowDec 29The CurseWeb SeriesEnglishLion's Gate PlayDec 29
డిసెంబర్ 26 , 2023
Roti Kapda Romance Review: యూత్‌ను ఆకర్షించే ఎంగేజింగ్ లవ్ స్టోరీలు.. ‘రోటి కపడా రొమాన్స్’ ఎలా ఉందంటే!
నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు
దర్శకత్వం: విక్రమ్ రెడ్డి
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
ఎడిటర్: విజయ్ వర్థన్
సినిమాటోగ్రఫీ : సంతోష్ రెడ్డి
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం
నిర్మాణ సంస్థ : లక్కీ మీడియా
విడుదల తేదీ: 28-11-2024
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Roti Kapda Romance Review)
కథేంటి
ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో జీవిస్తుంటారు. వీరిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా స్నేహితుల డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), హర్షతో సోనియా (కుష్బూ చౌదరి), విక్కీతో శ్వేత (మేఘలేఖ), రాహుల్‌తో ప్రియ (ఠాకూర్) ప్రేమలో పడతారు. అమ్మాయిల రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ప్రేయసితో ఎందుకు విడిపోయారు? బ్రేకప్ తర్వాత నలుగురు కుర్రాళ్లలో వచ్చిన రియలైజేషన్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో చేసినవారంతా దాదాపు కొత్తవాళ్లే (Roti Kapda Romance Review). అయినా తమ తమ పాత్రల్లో వారు చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్‌రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు కూడా ఎంతగానో అలరించారు. సినిమా మెుత్తం ఈ నాలుగు జంటల చుట్టే తిరిగింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఫ్రెండ్‌షిప్, లవ్, బ్రేకప్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ కొత్తగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలను ఒకే ఫ్రేమ్‌పై చూపించడం బాగా కలిసొచ్చింది. పరిణితి నిర్ణయాల వల్ల నేటి యూత్‌కు జరుగుతున్న నష్టాలు, ప్రేమలో ఎదురవుతున్న సమస్యలు, పెళ్లి విషయంలో యూత్ ఆలోచనలను మేళవిస్తూ కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. అందరూ కొత్తవారైనప్పటికీ వారి నుంచి ఉత్తమ నటన రాబట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని సీన్లు ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం, పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్ కావడం మైనస్ చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Roti Kapda Romance Review) అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సందర్భానుసారంగా వచ్చిన పాటలు సైతం వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనయూత్‌ను ఆకర్షించే ఎలిమెంట్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
స్టార్ క్యాస్ట్ లేకపోవడంకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 28 , 2024
HBD Ram Charan: ‘రామ్‌చరణ్’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ (Ram Charan).. టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్ (Allu Sirish) డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.
ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్ కోచింగ్ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం.
రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.
చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్’ ఇచ్చారు చిరు.
చరణ్ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్ స్టూడెంట్. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.
రామ్‌చరణ్ తన బాల్యం నుంచి టీనేజ్ వరకూ తరచూ స్కూల్స్ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.
నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.
సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్ బైక్ రైడింగ్ చేస్తానంటే చిరు ఎంకరేజ్ చేసేవారు కాదట.
రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.
రామ్‌చరణ్ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.
అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.
తన సినిమాలు చూశాక మెగాస్టార్ చిరంజీవి చేసే కామెంట్స్ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్ తెలిపాడు. డ్యాన్స్ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.
ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్‌చరణ్.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 27 , 2024
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆదికేశవ
మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కోట బొమ్మాళి పి.ఎస్
ప్రముఖ నటుడు శ్రీకాంత్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
ధృవ నక్షత్రం
విక్రమ్ (Vikram) హీరోగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
పర్‌ఫ్యూమ్
జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్’ (Perfume). చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
మాధవే మధుసూదన
‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్, సుమన్ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
నవంబర్ 21 , 2023
AKHIL AGENT REVIEW: ఏజెంట్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్ అయ్యిందా ?
అఖిల్ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు
సంగీతం: హిపాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
కథేంటి?
రిక్కీ ( అఖిల్ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్ ప్రారంభించిన మాఫియా డాన్ ది గాడ్ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ.
ఎలా ఉంది?
సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్ ఫామ్ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.
తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.
సెకాండాఫ్ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్ కొడతాయి. హైవోల్డేజ్ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్ లెవల్.
ఎవరెలా చేశారు
సినిమాకు పెద్ద అసెట్ అఖిల్ అక్కినేని. తన రోల్ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్ ఏజెెంట్‌గా అతడి లుక్ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్ డ్రామాలు సెట్ కాలేదు.
సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సాంకేతిక పనితీరు
ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్ స్టోరీ ఇది.
ఏజెంట్ చిత్రానికి మరో మెనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్ తమీజా ఒక్క చాట్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఎడిటింగ్ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
బలాలు
అఖిల్
యాక్షన్ సీన్స్
బలహీనతలు
కథ
కథనం
సంగీతం
రేటింగ్ : 2.5/5
ఏప్రిల్ 28 , 2023
జిమ్‌లో జాన్వీ కపూర్ అందాల సెగలు
]వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘ధావల్’ చిత్రంలోనూ మెరువనుంది.Download Our App
ఫిబ్రవరి 14 , 2023
Citadel Honey Bunny Review: ఇండియన్ స్పైగా అదరగొట్టిన సామ్.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ ధావన్, సమంత, కేకే మేనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్ తదితరులు
రచన: సీత.ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్ నిడిమోరు
సంగీతం : అమన్ పంత్
సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్
ఎడిటింగ్ : సుమిత్ కొటియన్
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : నవంబర్ 7, 2024
హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man), 'ఫర్జీ' (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్‌గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్ సిరీస్ ‘సిటాడెల్’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), గ్లామర్ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్) ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్ గ్యాంగ్ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review)
ఎవరెలా చేశారంటే
బన్నీ పాత్రలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తనమార్క్ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్ లిప్‌లాక్ సీన్స్ యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్ మెుత్తం వరుణ్, సామ్ స్క్రీన్ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్, సిమ్రన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్ అండ్ డీకే టీమ్ తమ మార్క్ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్‌గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్ గ్యాంగ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సమంత, వరుణ్‌ధావన్‌యాక్షన్ సీక్వెన్స్‌టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Samantha: సిటాడెల్ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్.. వీడియోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించినప్పటికీ ఈ అమ్మడి పేరే ప్రధానంగా నెట్టింట వినిపిస్తోంది. ఆమె నటన, యాక్షన్స్ సీక్వెన్స్‌లో విరోచిత పోరాటం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రేజ్ పరంగా సామ్ మరో మెట్టు ఎక్కేసిందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో సామ్ పలు లిప్‌లాక్ సీన్స్‌లో నటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. #SamanthaRuthPrabhu హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
ఘాటు లిప్‌లాక్ సీన్స్
స్పై థ్రిల్లర్‌గా రూపొందిన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌లో నటి సమంత (Samantha) యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రొమాంటిక్‌గాను ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఘాటు ముద్దు సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man) సిరీస్‌లో ఓ ఇంటిమేట్ సీన్‌లో నటించి సమంత అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పుడు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లోనూ ఆ స్థాయిలోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సామ్ లిప్‌లాక్ సీన్స్‌లో నటించింది. వీరిద్దరి మధ్య రెండు ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయి. అంతేకాకుండా సామ్ వేసుకున్న డ్రెస్ బటన్స్‌ను వరుణ్ ధావన్ సడెన్‌గా విప్పుతాడు. అలాగే ఓ సీన్‌లో బ్రాలో కనిపించి సామ్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/sidhirajpu28377/status/1854445217904029842
https://twitter.com/Film01428/status/1854454250312814703
https://twitter.com/leg_beauties/status/1854439177326068112
https://twitter.com/Actress__Lust/status/1854430203361267967
https://twitter.com/NewtweetXx/status/1854353341373190185
https://twitter.com/ActressLoveeee/status/1852259091944456399
నెటిజన్ల భిన్నభిపాయాలు
గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో చేసిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌లోనూ సమంత (Samantha) ఓ హాట్ సీన్ చేసింది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దాని కారణంగానే అప్పట్లో అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని రూమర్లు వచ్చాయి. అది విడాకుల వరకూ దారితీసిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోమారు సామ్ ఆ తరహా ఘాటు సీన్స్‌లో నటించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సామ్ ఇలాంటి ముద్దు సీన్లలో నటిస్తూ పోతే తనను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు సమంతకు గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్లదని గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
ఆ క్యూట్ సమంత మిస్సింగ్!
ఒకప్పుడు సమంత (Samantha) అనగానే పక్కింటి అమ్మాయిలా, సూపర్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన ట్రెడిషనల్ పాత్రలే గుర్తుకు వచ్చేవి. అయితే ఈ మధ్య కాలంలో ఆ సామ్ నుంచి ఆ తరహా ప్రదర్శన కనిపించడం లేదు. తన ఫస్ట్ ఫిల్మ్ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చేసిన జెస్సీ పాత్ర ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎవర్‌గ్రీన్ అనిచెప్పవచ్చు. అలాగే పలు చిత్రాల్లో సామ్ చేసిన అల్లరి, ఆకతాయి తనం రీసెంట్ చిత్రాలు, సిరీస్‌లలో అస్సలు కనిపించడం లేదు. దీనికితోడు గత కొంతకాలంగా లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో సామ్ నటిస్తుండటంతో ఒకప్పటి సమంతను మిస్సైన ఫీలింగ్ కలుగుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిరిగి ఓ క్యూట్ లవ్‌స్టోరీతో తమ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రానాకు సామ్ వార్నింగ్!
ఇటీవల ‘ఐఫా ఉత్సవం - 2024’ (IIFA Utsavam 2024) గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. నటి సమంత (Samantha) 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సైతం అందుకుంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడగా హోస్ట్‌గా చేసిన రానా, తేజ సజ్జ ఆమెపై కొన్ని జోక్స్ వేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రానా-సమంత మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సమంత టాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది. ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది’ అని రానా అంటాడు. దానికి సామ్ గట్టిగా నవ్వి సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా అంటూ స్పందించింది. జోక్స్ వద్దు అంటూ రానాకు స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగచైతన్య రానాకు మేనత్త కొడుకు అవుతాడు. ఈ నేపథ్యంలోనే రానా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
https://twitter.com/HeartNaniSam/status/1853496815389127077
నవంబర్ 07 , 2024
Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సామ్ యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సిటాడెల్’కి ఇది అధికారిక రీమేక్. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో నటించిన నటీనటులు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌తో అలరించింది. ముఖ్యంగా సమంత చేసిన యాక్షన్ సీన్స్ అలరించాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ సిరీస్‌పై భారీ అంచనాలు పెంచింది.ఇప్పుడు విడుదలైన రెండో ట్రైలర్ కూడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (Samantha)యాక్షన్ సన్నివేశాలతో కడుపు కట్టేసే విధంగా ట్రైలర్‌లో కనిపించిన సమంత ఆకట్టుకుంది. తన స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అభిమానులు అయితే, సమంత నటనను ప్రియాంక చోప్రా వెర్షన్ కంటే మెరుగ్గా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ సిరీస్‌లో సమంత “హనీ”గా, వరుణ్ ధావన్ “బన్నీ”గా అదరగొట్టారని అభిమానులు చెబుతున్నారు. సామ్ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే యాక్టింగ్‌తో సరికొత్తగా కనిపించింది. ఇప్పటివరకు సమంత చేసిన ఇతర యాక్షన్ రోల్స్ కంటే మరింత బలంగా, పవర్‌ఫుల్‌గా ఆమెను ఈ సిరీస్‌లో చూపిస్తున్నారు.
అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సమంత ఫేస్‌పై నెటిజన్లు చర్చిస్తున్నారు. మళ్లీ ఆమె ముఖానికి ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు.(Samantha Ruth Prabhu) సామ్ ముఖం, హీరోయిన్ సంయుక్త మీనన్‌లాగా మారిపోయిందంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటో చూస్తే నిజంగానే ఆమె ఐస్ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉన్నాయి.
ఇంకొంత మంది సమంత తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వాదిస్తున్నారు. మమోసైటిస్ వ్యాధి భారిన పడ్డ తర్వాత ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసుకునేందుకు ఆమె పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం మయోసైటిస్ వ్యాధి నయం కోసం సామ్ చాలా పవర్‌ఫుల్ ట్యాబ్లెట్ వాడిందని.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఆమె ముఖంపై ప్రభావం చూపించిందని చెబుతున్నారు.
రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఏడాదికిపైగా పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ పొందింది. మయోసైటిస్ వ్యాధి వల్ల శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంది. విజయ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా ద్వారా తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శాకుంతలం సినిమాలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడంతో ప్రస్తుతం సామ్.. సిటాడెల్ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకుంది.
అక్టోబర్ 30 , 2024
‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’
సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్‌జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్‌జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్‌జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.
స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్‌జాదా కల్పించలేక పోయింది.
స్టోరీ లైన్‌లో మార్పు..
ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్‌జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
‘అల వైకుంఠపురంలో’ రాజ్ మనోహర్(సుశాంత్)కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్‌జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు.
హీరో క్యారెక్టరైజేషన్..
అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్‌జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్‌లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.
ఫైట్స్ కొరియోగ్రఫీ
ఫైట్ సీన్‌లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్‌లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్‌జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.
పాత్రలు
‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్‌జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్‌లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.
సంగీతం
‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్‌ని మూటగట్టుకుంది.
అల్లు అర్జున్ మేనియా
షెహ్‌జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్‌జాదా’కు మైనస్‌గా మారింది.
రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా?
గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్‌జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్‌గన్ మూవీ హిట్ అయ్యింది.
దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్‌గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
ఫిబ్రవరి 23 , 2023
Keerthi Suresh: ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు కీర్తి సురేష్.. అవసరమా?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) అనగానే ముందుగా అందరికీ ‘మహానటి’లో ఆమె చేసిన సావిత్రి పాత్రే గుర్తుకు వస్తుంది. అలాగే ‘నేను శైలజ’, ‘నేను లోకల్’, ‘దసరా’ చిత్రాల్లో ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్‌గా కనిపించిన కీర్తినే తెలుగువారికి జ్ఞాపకం వస్తుంది. అటు తమిళంలోనూ ఎక్కడా స్కిన్ షో చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ గాడి తప్పిందన్న మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్ ‘బాబీ జాన్’ కీర్తి సురేష్‌కు ఎన్నడు లేనన్ని విమర్శలు తీసుకొస్తోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్లామర్ డోస్ పెచ్చిన కీర్తి..!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'బేబీ జాన్' అనే చిత్రంలో కీర్తి సురేష్ (Keerthi Suresh) నటిస్తోది. హిందీలో ఆమెకు ఇదే ఫస్ట్ డైరెక్ట్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కలిస్ తెరకెక్కిస్తున్నారు. దీనిని వన్ స్టూడియోస్, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, మురాద్, ఖేతానీ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పెషల్ క్యామియో కూడా ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ‘బేబీ జాన్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నయన్ మటక్కా’ ప్రొమోను విడుదల చేశారు. నవంబర్ 25న ఫుల్ వీడియో సాంగ్ రానుంది. అయితే ఈ ప్రోమోలో వరుణ్‌తో కలిసి కీర్తి సురేష్ స్టెప్పులు ఇరగదీసింది. క్రేజీ ఎక్స్‌ప్రెషన్స్ మెప్పించింది. గతంలో ఎప్పుడు చేయనంత స్కిన్ షోను పాటలో చేయడం విశేషం. మీరు ఓ లుక్కేయండి.
https://twitter.com/Atlee_dir/status/1860286469799358567
ఏకిపారేస్తున్న నెటిజన్లు
తెలుగు, తమిళ చిత్రాల్లో ఇప్పటివరకూ ట్రెడిషనల్ పాత్రల్లో మెరిసిన కీర్తి సురేష్ (Keerthi Suresh) బాలీవుడ్ మూవీ కోసం ఈ స్థాయి అందాల ప్రదర్శన చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం ఈ స్థాయి గ్లామర్‌షోలు అవసరమా అని నిలదిస్తున్నారు. బాలీవుడ్‌కు వెళ్లాక కీర్తి అస్సలు ఆగడం లేదని, ఇక బికిని ఒక్కటే బ్యాలెన్స్ అని విమర్శిస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 22) రిలీజ్ చేసిన 'నయిన్ మటక్కా' పోస్టర్‌లోని కీర్తి బోల్డ్ లుక్‌ను హైలెట్ చేస్తున్నారు. ఆమె వరకూ క్రాప్ చేసి నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. సౌందర్య లాగా పద్దతిగా కీర్తి సురేష్ ఉంటుందని భావించానని కానీ ఆమె కూడు మెుదలుపెట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇందులో లిప్‌లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెటిజన్లు మరింత ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/actresshub12/status/1860014335965430164
https://twitter.com/vadakkunanbar/status/1860292687834022060
https://twitter.com/starksscollect/status/1860019946300022889
https://twitter.com/Kishore_krrish5/status/1860309046496247907
https://twitter.com/BharathEditzX/status/1860309038719991922
https://twitter.com/BhargavOG/status/1860302445882278305
చిన్ననాటి స్నేహితుడితో కీర్తి పెళ్లి!
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు. ఆంటోని తట్టిల్ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేసే యంగ్ బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు. ‘ఎస్పిరోస్ విండో సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించి దానిని దుబాయ్‌కు విస్తరించాడు. అలాగే కొచ్చిలో పలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి.
https://twitter.com/MogaliReports/status/1858741516308553729
నవంబర్ 23 , 2024
Indian Richest Actress: దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే? దీపికా, ఐశ్వర్యరాయ్, అలియా మాత్రం కాదు!
దేశంలో అత్యధిక సంపాదకులు అనగానే ప్రతీ ఒక్కరు అంబానీ, ఆదానీ పేర్లు ఠక్కున చెప్పేస్తారు. ధనిక హీరోల గురించి అడిగిన కూడా సినిమా నాలెడ్జ్ ఉన్నవారు ఆలోచించకుండా ఆన్సర్ చెప్పగలుగుతారు. మరి రిచెస్ట్ హీరోయిన్స్ అంటే మాత్రం సినీ లవర్స్‌తో సహా ఎవరి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. హీరోయిన్ల ఆస్తులు, రెమ్యూనరేషన్స్ గురించి ఎక్కువగా చర్చ జరగకపోవడమే ఇందుకు కారణం. ఇది గమనించిన హురున్ రిచ్ లిస్ట్ సర్వే (Hurun India Rich List) సంస్థ దేశంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. టాప్-5లో ఉన్న నటీమణుల ఆస్తుల విలువను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
జుహీ చావ్లా (Juhi Chawla)
హురున్ రిచ్ లిస్ట్ సర్వే ప్రకారం దేశంలో అత్యంత ధనవంతురాలైన నటిగా బాలీవుడ్ తార జుహీ చావ్లా (Juhi Chawla) నిలిచింది. ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయన్లను తలదన్ని ఎవరూ ఊహించని విధంగా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.4,600 కోట్ల రూపాయలు ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. 1990వ దశకంలో జుహీ చావ్లా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 1984లో మిస్ ఇండియా కిరిటాన్ని సైతం కైవసం చేసుకుంది. వయసు రిత్యా హీరోయిన్ పాత్రలకు స్వస్థి పలికిన జుహీ గత పదేళ్లుగా అడపాదడపా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే జుహి చావ్లాకు సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు ఉన్నాయి. షారుక్ ఖాన్ రెడ్ చిల్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కోలకత్తా నైట్ రైడర్స్‌లో ఆమెకు భాగస్వామ్యం ఉంది. అలాగే ఆమె భర్త జై మెహతా పెద్ద వ్యాపారవేత్త. కుటుంబ వ్యాపారాల్లోనూ జుహీ చావ్లాకు భాగస్వామ్యం ఉంది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)
దేశంలోని ధనిక హీరోయిన్ల జాబితాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె ఆస్తుల విలువ రూ.860 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ తేల్చింది. ఈమె సంపద చాలా మంది హీరోల కన్నా ఎక్కువనే చెప్పాలి. ఐశ్వర్య ఇటీవల కాలంలో హీరోయిన్‌గా కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం కోసం రూ.15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక ఏదైనా బ్రాండ్‌కు పనిచేస్తే రోజుకు రూ.6-7కోట్లు చార్జ్ చేస్తున్నట్లు టాక్ ఉంది. ప్రస్తుతం పలు అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆమె పనిచేస్తోంది. వీటితో పాటు దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలిగా వెళ్లి తన గుడ్‌విల్‌ను, మార్కెట్ వాల్యూను మరింత పెంచుకుంది.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. ఆమె రూ.650 కోట్ల మేర ఆస్తులను కూడబెట్టినట్లు హురున్ రిచ్ లిస్ట్ సర్వే సంస్థ ప్రకటించింది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. అక్కడ వరుసగా సినిమాలు, ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లు చేసి భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అలాగే నిర్మాణ సంస్థ పర్పుల్ పిక్చర్స్ పార్ట్నర్స్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది. ప్రసిద్ధ డేటింగ్ యాప్ ‘బుంబుల్’లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే హెయిర్ కేర్ కంపెనీ ‘అనామలీ’ని కూడా ఆమె ఇటీవల ప్రారంభించింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా ప్రియాంక సంపాదిస్తోంది.
అలియా భట్ (Alia Bhatt)
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ రూ.550 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార సామ్రాజ్యంలోనూ ఈ అమ్మడు సత్తా చాటుతోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) అనే స్టార్టప్ కంపెనీని లాంచ్ చేసింది. ఈ కంపెనీ 2 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన బట్టలను విక్రయిస్తుంటుంది. వెబ్‌సైట్ ద్వారా 800లకుపైగా ప్రొడక్స్ట్ ఈ కంపెనీ విక్రయిస్తోంది. 12 నెలల్లోనే 10 రెట్ల వృద్ధితో రూ.150 కోట్లు విలువైన సంస్థగా అవతరించడం గమనార్హం. ఈ కంపెనీతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్‌లో వంటి సంస్థల్లో అలియా భట్ పెట్టుబడిదారిగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను 2022 ఏప్రిల్ 14న అలియా వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి రాహా అనే పాప ఉంది.
దీపికా పదుకొనే (Deepika Padukone)
దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకొనే టాప్-5 నిలిచింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. దీపికా ఒక్కో సినిమాకు రూ.15-30 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు పలు బ్యూటీ ప్రాడెక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ రూ. కోట్లలో సంపాదన అర్జిస్తోంది. ఇటీవల హోమ్ ఫర్నిషింగ్ బిజినెస్‌లోకి దీపికా అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ 'పొటరీ బార్న్'లో అమె పెట్టుబడలు పెట్టింది. '82 ఈస్ట్' పేరుతో సొంత సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ఆమె రన్ చేస్తోంది. మరోవైపు నిర్మాతగానూ మారింది. తన సొంత బ్యానర్‌లో ‘చపాక్’ వంటి హిట్ చిత్రాలను నిర్మించింది.
అక్టోబర్ 22 , 2024
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్‌మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కొన్న ఉద్రిక్త సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని, దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకూ పలు సంఘటనలు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.
కలెక్షన్లు ఇలా…
ప్రముఖ వెబ్ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది. మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.
ఇదేనా కారణం?
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది.
పాజిటివ్ రివ్యూస్
మరోవైపు వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన ఫైటర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar) సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు.
అప్పుడే ఓటీటీలోకి!
అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
మార్చి 02 , 2024
Actress Samantha: సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్.. ఎందుకంటే?
స్టార్ హీరోయిన్ సమంత మరోమారు తన క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.
ఫెయిర్ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.
తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్ డెకరేట్ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది.
గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్ (ఇండియన్ వెర్షన్) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది. ‘ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా సామ్ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్-1లో సామ్ చేసిన ఐటెమ్ సాంగ్ అప్పట్లో ఉర్రూతలూగించింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ భామ ఆలియా భట్ మెుదటి ప్లేస్ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం.
ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
జనవరి 17 , 2024
Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.
Courtesy Instagram: samantha
ఆదే కారణమా?
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది.
సమంత రాబోయే సినిమాలు
శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
అభిమానుల అండ
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూలై 05 , 2023
Chatrapathi Review: యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్ కొట్టినట్టేనా?
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ భరుచ్చా, కరణ్‌సింగ్ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్ శివదాస్, రాజేంద్ర గుప్త
డైరెక్టర్: V.V. వినాయక్
సంగీతం: తనిష్క్ బాగ్చీ
నిర్మాత : అక్షయ్, ధవల్, జయంతీ లాల్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్ (కరణ్ సింగ్ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్ కండలు తిరిగిన దేహం.. యాక్షన్ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్ నుష్రత్ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్ నటి భాగ్య శ్రీ, శరద్ ఖేల్కర్, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.
విశ్లేషణ
డైరెక్టర్ వి.వి. వినాయక్ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛత్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెరకెక్కించడం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్ సీన్స్ ఉన్నాయంటే అది యాక్షన్ సీన్స్ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఛత్రపతి ఒక అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు.
ప్లస్ పాయింట్స్
హీరో నటనయాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
పాటలురొటిన్ సీన్స్‌బ్యాగ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్: 2/5
మే 12 , 2023