• TFIDB EN
  • ధృవ (2016)
    U/ATelugu2h 45m

    ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్ ఇషికా ఆసక్తిని ప్రేమిస్తుంది
    అరవింద్ స్వామిచెంగలరాయుడు కొడుకు
    రకుల్ ప్రీత్ సింగ్ధృవ ప్రేమికుడు
    నవదీప్ ధృవ స్నేహితుడు
    పోసాని కృష్ణ మురళి సిద్ధార్థ్ తండ్రి
    సాయాజీ షిండేధీరజ్ చంద్ర
    అభినయసైంటిస్ట్ అక్షర
    నాసర్తెలంగాణ ముఖ్యమంత్రి
    అలీ రెజాధృవ స్నేహితుడు
    రణధీర్ రెడ్డి ధృవ స్నేహితుడు
    విద్యుల్లేఖ రామన్ఇషిక స్నేహితురాలు
    హిమజఇషిక స్నేహితురాలు
    సౌరవ్ చక్రవర్తి ఇర్ఫాన్ అలీ తమ్ముడు
    అజయ్ రత్నంఇషికా తండ్రి
    సూర్యరామస్వామి
    డేనియల్ పైర్స్ ఏంజెలీనా
    సిబ్బంది
    N. V. ప్రసాద్నిర్మాత
    హిప్హాప్ తమిజాసంగీతకారుడు
    Mohan Rajaకథ
    పిఎస్ వినోద్సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’ 
    Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’ 
    నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు.. దర్శకత్వం: శివప్రసాద్ యానాల సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు సంగీతం: చరణ్ అర్జున్ నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్‌లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్‌లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.  కథేంటి? ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్‌, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.  ఎవరెలా చేశారు? వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్ పరిధి మేరకు నటించాడు.  టెక్నికల్‌గా తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్‌లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్‌గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ప్లస్ పాయింట్స్ నటీనటులు  భావోద్వేగ సన్నివేశాలు క్లైమాక్స్ సీన్స్ మైనస్ పాయింట్స్ ఊహకు అందే కథ, కథనం చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’. రేటింగ్: 3.25/5
    జూన్ 09 , 2023
    <strong>అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2,  ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అడవి శేషు అసలు పేరు? అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర అడవి శేషు ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు అడవి శేషు తొలి సినిమా? సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.  అడవి శేషుకు వివాహం అయిందా? ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు? 5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.&nbsp; అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్? అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అడవి శేషుకు ఇష్టమైన కలర్? బ్లాక్, వైట్ అడవి శేషు పుట్టిన తేదీ? 17 December 1984 అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు? చంద్ర, భవాని అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం? కాలీఫోర్నియా అడవి శేషు ఏం చదివాడు? అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు? అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.&nbsp; అడవి శేషుకు ఇష్టమైన ఆహారం? అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు అడవి శేషు ఇల్లు ఎక్కడ? అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
    మార్చి 21 , 2024
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    గతవారం సలార్ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఆ సినిమాకు పోటీగా ఈవారం పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. చాలావరకు తమ సినిమాలను కొత్త ఏడాది జనవరిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో డిసెంబర్ ఇయర్ ఎండింగ్‌లో దాదాపు 25కు పైగా చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. డెవిల్ సినిమాను అభిషేక్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.&nbsp; ధృవ నక్షత్రం తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదులను ఏరిపారేసే ఆర్మి అధికారిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు మంగళవారం వారం రోజులుగా ఓటీటీ రిలీజ్‌పై దాగుడు మూతలు ఆడుతున్న మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో హర్రర్ చిత్రంగా మంగళవారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; అన్నపూరాణి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన రిసెంట్ చిత్రం 'అన్నపూరాణి' డిసెంబర్ 29 నుంటి ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ&nbsp; డెరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ OTTలో తెలుగు, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateMangalavaaramMovieTeluguDisney Plus HotstarDec 2612th FailMovieTelugu/HindiDisney Plus HotstarDec 29Katatan Si BoyMovieIndonesianAmazon PrimeDec 27Tiger 3MovieHindiAmazon PrimeDec 31Ricky Gervais: Armageddon&nbsp;Standup Comedy ShowEnglishNetflixDec 25Snag&nbsp;MovieEnglishNetflixDec 25Ko Gaye Hum Kaha&nbsp;MovieHindiNetflixDec 26Thank You I'm Sorry&nbsp;MovieSwedishNetflixDec 26Hell Camp: Teen Night Mare&nbsp;MovieEnglishNetflixDec 27A Very Good GirlMovieTagalogNetflixDec 27Miss SampoMovieMandarinNetflixDec 28Little DixieMovieEnglishNetflixDec 28Pokemon Concierge&nbsp;Web SeriesJapaneseNetflixDec 28AnnapooraniMovieTelugu Dubbed&nbsp;NetflixDec 29Shastri Virudh Shastri&nbsp;MovieHindiNetflixDec 29Three of UsMovieHindiNetflixDec 29Bad LandsMovieJapaneseNetflixDec 29Berlin&nbsp;MovieSpanishNetflixDec 29Dangerous Game: The Legacy MurdersMovieEnglishNetflixDec 31The AbandonedMovieMandarinNetflixDec 31Dono&nbsp;MovieHindiZee5Dec 29Once Upon Two TimesMovieHindiZee5Dec 29Safed&nbsp;MovieHindiZee5Dec 29Trolls and TogetherMovieEnglishBook My ShowDec 29The CurseWeb SeriesEnglishLion's Gate PlayDec 29
    డిసెంబర్ 26 , 2023
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan).. టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్‌.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్‌ (Allu Arjun), శిరీష్‌ (Allu Sirish) డ్యాన్స్‌ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.&nbsp; ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్‌ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్‌ కోచింగ్‌ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం. రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.&nbsp; చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు. చరణ్‌ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌ తన బాల్యం నుంచి టీనేజ్‌ వరకూ తరచూ స్కూల్స్‌ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.&nbsp; నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.&nbsp; సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్‌ బైక్‌ రైడింగ్‌ చేస్తానంటే చిరు ఎంకరేజ్‌ చేసేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు. రామ్‌చరణ్‌ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.&nbsp; అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్‌ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.&nbsp;&nbsp; తన సినిమాలు చూశాక మెగాస్టార్‌ చిరంజీవి చేసే కామెంట్స్‌ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్‌ తెలిపాడు. డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.&nbsp; ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్‌ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్‌’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.&nbsp; ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.&nbsp; ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్‌ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.&nbsp; రామ్‌చరణ్‌.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్‌ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్‌ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    మార్చి 27 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning&nbsp;MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
    నవంబర్ 21 , 2023
    AKHIL  AGENT  REVIEW: ఏజెంట్‌ సినిమాతో అఖిల్ హిట్‌ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్‌ అయ్యిందా ?
    AKHIL AGENT  REVIEW: ఏజెంట్‌ సినిమాతో అఖిల్ హిట్‌ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్‌ అయ్యిందా ?
    అఖిల్‌ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్‌ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.&nbsp; దర్శకుడు: సురేందర్ రెడ్డి నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు సంగీతం: హిపాప్ తమిజా సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్ కథేంటి? రిక్కీ ( అఖిల్‌ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్‌ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్‌ ప్రారంభించిన మాఫియా డాన్‌ ది గాడ్‌ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్‌. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ. &nbsp; ఎలా ఉంది? సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్‌ ఫామ్‌ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్‌ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.&nbsp; తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; సెకాండాఫ్‌ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్‌ కొడతాయి. హైవోల్డేజ్‌ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్‌ లెవల్‌.  ఎవరెలా చేశారు సినిమాకు పెద్ద అసెట్‌ అఖిల్‌ అక్కినేని. తన రోల్‌ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్‌ ఏజెెంట్‌గా అతడి లుక్‌ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్‌ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్‌ డ్రామాలు సెట్‌ కాలేదు. సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్‌ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్‌ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.&nbsp; సాంకేతిక పనితీరు ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్‌ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్‌ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్‌ స్టోరీ ఇది.&nbsp; ఏజెంట్ చిత్రానికి మరో మెనస్‌ పాయింట్‌ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్‌ తమీజా ఒక్క చాట్‌ బస్టర్‌ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.&nbsp; ఎడిటింగ్‌ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.  బలాలు అఖిల్ యాక్షన్ సీన్స్‌ బలహీనతలు కథ కథనం సంగీతం రేటింగ్ : 2.5/5
    ఏప్రిల్ 28 , 2023
    ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’ 
    ‘అల వైకుంఠపురంలో’ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదు..? డిజాస్టర్‌గా కార్తీక్ ఆర్యన్ ‘షెహ్‌జాదా’ 
    సౌత్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేసే సంప్రదాయం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ‘షెహ్‌జాదా’గా రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్‌కి జంటగా కృతి సనన్ నటించింది. రోహిత్ ధవన్ డైరెక్షన్ వహించారు. అయితే, ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ‘షెహ్‌జాదా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రబృందానికి ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? ‘అల వైకుంఠపురం’ సినిమాకి, ‘షెహ్‌జాదా’కి మధ్య ప్రధాన తేడా ఏంటో చూద్దాం.&nbsp; స్టోరీ లైన్, అల్లు అర్జున్ నటన, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్,డ్యాన్స్ కొరియోగ్రఫీ త్రివిక్రమ్ మార్క్ టేకింగ్.. ‘అల వైకుంఠపురం’ సినిమా భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు. ‘నాన్ బాహుబలి’ కేటగిరీలో అత్యధిక వసూళ్లను సాధించి ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతటి విజయవంతమైన సినిమాను రీమేక్ చేయగా కనీస స్పందన రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే, ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వీటి వల్ల మాతృక సినిమా కలిగించిన అనుభూతిని షెహ్‌జాదా కల్పించలేక పోయింది. స్టోరీ లైన్‌లో మార్పు.. ఒరిజినల్ సినిమాలో బంటు(అల్లు అర్జున్) వాల్మీకి(మురళీ కృష్ణ) కుమారుడిగా పెరుగుతాడు. వాల్మీకి భార్య(రోహిణి) పాత్ర ఇందులో కీలకం. తల్లిగా తన మాతృత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ‘షెహ్‌జాదా’లో వాల్మీకి భార్య పాత్రని చంపేశారు. తద్వారా హీరోకి వాల్మీకి కుటుంబాన్ని వదిలించుకోవడానికి మార్గం సులువు చేశారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పెంచిన తల్లికి ప్రాధాన్యమివ్వాలా? జన్మనిచ్చిన అమ్మ వైపు మొగ్గు చూపాలా? అనే విషయాన్ని బంటు విచక్షణకే వదిలేశారు. కానీ, షెహ్‌జాదాలో పెంచిన కుటుంబం నుంచి దూరం కావడానికి హీరోకు బలమైన కారణాన్ని సృష్టించారు. ఇలా పెంపుడు తల్లి పాత్రను తీసేయడం ప్రేక్షకులకు రుచించలేదు.&nbsp; ‘అల వైకుంఠపురంలో’&nbsp; రాజ్‌ మనోహర్(సుశాంత్)‌కి ప్రేయసిగా నందిని(నివేతా పెత్తురాజ్) పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అమూల్య(పూజా హెగ్డే)ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పడే ఇబ్బందికి ఇదే ప్రధాన కారణం. ‘షెహ్‌జాదా’లో నందిని పాత్రని తీసేశారు. ‘అమూల్య’ని పెళ్లి చేసుకోవడంలో రాజ్ పాత్రకి అభ్యంతరం లేకుండా చేశారు. ఇది కూడా సినిమాకు మైనస్‌గా నిలిచింది. అంతేగాకకుండా ‘రాజ్ మనోహర్’ పాత్రలో చేసిన మార్పులు ప్రేక్షకులను మెప్పించలేదు. హీరో క్యారెక్టరైజేషన్.. అల వైకుంఠపురం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయింది. అమూల్య(పూజా హెగ్డే)ని చిక్కుల్లో నుంచి విడిపించే సమయంలో తన క్యారెక్టర్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. విలన్లకు కొట్టి బుద్ధి చెబుతాడు. కానీ, ‘షెహ్‌జాదా’లో ఇదే లోపించింది. ఈ సీన్‌లో తన క్యారెక్టర్‌కి విరుద్ధంగా కార్తీక్ ఆర్యన్ ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాకుండా సావధానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే కాస్త అసహజంగా అనిపించింది.&nbsp; ఫైట్స్ కొరియోగ్రఫీ ఫైట్ సీన్‌లను రీక్రియేట్ చేయొచ్చు. కానీ, ఒక హీరో శైలిని రీక్రియేట్ చేయలేం. చెల్లెలి దుపట్టాను ఆకతాయిలు తీసుకెళ్లిన సమయంలో హీరో చేసే ఫైట్, తాతను రక్షించడంలో వచ్చే సీన్, క్లైమాక్స్ ఫైట్‌లు అల్లు అర్జున్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. స్టైలిష్‌గా ఈ సీన్లు సాగుతుంటాయి. ‘షెహ్‌జాదా’లో కార్తీక్ ఆర్యన్ ఈ సీన్లలో విఫలమయ్యాడు. సీన్లను ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టినా, తన పర్ఫార్మెన్స్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్తదనాన్ని తీసుకురాలేక పోయాడు.&nbsp; పాత్రలు ‘అల వైకుంఠపురంలో’ కనిపించే ప్రతి పాత్రకు నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘షెహ్‌జాదా’లో ఇది లోపించింది. పైగా, బంటు సహోద్యోగుల పాత్రలు శేఖర్(నవదీప్), రవీందర్(రాహుల్ రామకృష్ణ), సునీల్ క్యారెక్టర్‌లు రీమేక్‌లో లేవు. బోర్డ్ రూమ్‌లో జరిగే సన్నివేశం లేదు. ఇలా మార్పులు చేయడంతో ఆ మజాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. విలన్ పాత్రల్లో కూడా సహజత్వం లోపించినట్లు అనిపించింది.&nbsp; సంగీతం ‘అల వైకుంఠపురం’ సినిమాకు సంగీతం పెద్ద అసెట్‌గా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బుట్టబొమ్మ, రాములో రాములా, సామజ వరగమన, టైటిల్ సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సిత్తరాల సిరపడు, డాడీ సాంగ్.. ఇలా ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. షెహ్‌జాదాలో చెప్పుకోదగ్గ సంగీతం లేదు. ఒకటి రెండు మినహా మిగతావి చప్పగా సాగాయి. ఫలితంగా సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చింది. ఓవరాల్‌గా ‘అల వైకుంఠపురం’ సినిమాతో పోలిస్తే ‘షెహ్‌జాదా’ ఎక్కడా పోటీ పడలేక పోయింది. ఫలితంగా ‘డిజాస్టర్’ టాక్‌ని మూటగట్టుకుంది.&nbsp; అల్లు అర్జున్ మేనియా షెహ్‌జాదా సక్సెస్ సాధించకపోవడానికి అల్లు అర్జున్ మేనియా కూడా ఒక కారణమే. గతంతో పోలిస్తే దక్షిణాది సినిమాల పరిధి పెరిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. దీంతో బీ టౌన్ ప్రేక్షకులు బన్నీ మునపటి సినిమాలను వీక్షించారు. ఇది కూడా ‘షెహ్‌జాదా’కు మైనస్‌గా మారింది. రీమేక్‌లు వర్కౌట్ అవుతాయా? గతేడాది ఐదు దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్‌ల ‘విక్రమ్ వేధ’, అక్షయ్ కుమార్ ‘కట్‌పుట్లి’ సినిమాలు ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేదు. ఇక జాన్వీ కపూర్ ‘మిలీ’, రాజ్‌కుమార్ ‘హిట్- ద ఫస్ట్ కేస్’, రాధిక ఆప్టే ‘ఫోరెన్సిక్’ సినిమాలు బోల్తా కొట్టాయి. తాజాగా ఈ లిస్టులోకి ‘షెహ్‌జాదా’ చేరింది. దీంతో రీమేక్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అన్న సందేహం మొదలైంది. అయితే, అజయ్ దేవ్‌గన్ ‘దృశ్యం2’ మాత్రం ఘన విజయం సాధించింది. మళయాలంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం, హిందీలోకి డబ్ కాకపోవడంతో అజయ్ దేవ్‌గన్ మూవీ హిట్ అయ్యింది. దక్షిణాది భాషల సినిమా పరిధి పెరిగింది. ఇక్కడి కథలు బాలీవుడ్ మాస్ ఆడియెన్స్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలకు సబ్‌టైటిల్స్ ఇస్తుండటంతో హిందీలోనూ వాటిని చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలపై ఆసక్తి కొరవడింది. అయితే, ప్రస్తుతం మరికొన్ని రీమేక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’(వీరం రీమేక్), అజయ్ దేవ్‌గన్ భోళా(లోకేష్ కనగరాజ్ ఖైదీ రీమేక్) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2023
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.&nbsp; మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.&nbsp; ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)&nbsp; సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే &nbsp;ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోమారు తన క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్‌ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.&nbsp; ఫెయిర్‌ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో&nbsp; సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.&nbsp; తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్‌ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్‌ డెకరేట్‌ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది. గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్‌ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.&nbsp; మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.&nbsp; ‘ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.&nbsp; కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌ గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్‌-1లో సామ్ చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అప్పట్లో ఉర్రూతలూగించింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.&nbsp; బాలీవుడ్ భామ ఆలియా భట్‌ మెుదటి ప్లేస్‌ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్‌, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జనవరి 17 , 2024
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్‌ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న  చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.  Courtesy Instagram: samantha ఆదే కారణమా? గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది.  ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది. సమంత రాబోయే సినిమాలు శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న  మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్‌ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. అభిమానుల అండ ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు  కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    జూలై 05 , 2023
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ:&nbsp; ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్‌ (కరణ్‌ సింగ్‌ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్‌ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహం.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్‌ నుష్రత్‌ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్‌ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్‌ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటి భాగ్య శ్రీ, శరద్‌ ఖేల్కర్‌, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్‌ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.&nbsp; విశ్లేషణ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్‌ సీన్స్‌ ఉన్నాయంటే అది యాక్షన్‌ సీన్స్‌ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్‌ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ పాటలురొటిన్‌ సీన్స్‌బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ రేటింగ్‌: 2/5
    మే 12 , 2023
    <strong>Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రణ్‌బీర్ కపూర్ సతీమణి అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో 100 మోస్ట్ ఇన్‌ప్లూయెన్సియల్ పీపుల్ జాబితలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమై వ్యక్తుల జాబితాను ఏటా టైమ్స్ మ్యగజైన్ విడుదల చేస్తుంటుంది. గతేడాది.. మూవీ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్‌ ఖాన్ మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది అలియా భట్ చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సినీవర్గాల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంలో అలియా భట్ గురించి టాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; అలియా భట్ ముద్దు పేరు? అలూ.. అలియా భట్ వయస్సు ఎంత? అలియా భట్&nbsp; 1993 మార్చి 15న జన్మించింది అలియా భట్ తెలుగులో నటించిన తొలి సినిమా? RRR అలియా భట్ హిందీలో నటించిన తొలి సినిమా? సంఘర్ష్‌(1999) చిత్రంలో బాల నటిగా పరిచయమైంది అలియా భట్ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం? స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్(2012) అలియా భట్ ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు (160cm) అలియా భట్ ఫిగర్ మెసర్‌మెంట్స్ ? 33-26-34 అలియా భట్ ఎక్కడ పుట్టింది? ముంబై, మహారాష్ట్ర అలియా భట్&nbsp; ఏం చదివింది? హైస్కూల్ అలియా భట్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? జమ్నాబాయి నార్సీ స్కూల్, ముంబై అలియా భట్ అభిరుచులు? సింగింగ్, యోగా చేయడం, షాపింగ్, ట్రావెలింగ్, కూకింగ్ అలియా భట్‌కు ఇష్టం లేని పనులు? వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినడం అలియా భట్‌కు ఎక్కడ టాటూ ఉంది? అలియా వీపు వెనుక భాగంలో 'Pataka' అని హిందీలో రాని ఉంటుంది అలియా భట్‌కి ఇష్టమైన ఆహారం? పోహా, ఫిష్, రాగి చిప్స్, రసగుల్ల, మూంగ్ దాల్ హల్వా అలియా భట్‌కు అఫైర్స్ ఉన్నాయా? అలియా తొలుత వరుణ్ ధావన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత వ్యాపారవేత్త కవిన్ మిట్టల్‌తో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలియా భట్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అలియా భట్ వివాహం ఎప్పుడు జరిగింది? అలియా భట్ వివాహం బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో 2022లో ఏప్రిల్ 14న పెళ్లి జరిగింది&nbsp; అలియా భట్, రణ్‌బీర్ దంపతులకు ఎంత మంది పిల్లలు? 2022 నవంబర్ 6న ఈ దంపతులకు పాప జన్మించింది. పాప పేరు రహా అలియా భట్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రణ్‌బీర్ కపూర్, హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో అలియా భట్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్, కంగనా రనౌత్ అలియా భట్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఏఆర్ రెహ్మాన్ అలియా భట్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.10 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. అలియా భట్‌ తల్లిదండ్రుల పేరు? మహేష్ భట్, సోని రజదాన్ https://twitter.com/DexterBaddie/status/1694933272059642020 అలియా భట్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అలియా భట్‌ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది అలియా భట్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/aliaabhatt/ అలియా భట్ నెట్‌వర్త్ ఎంత? అలియా భట్ నెట్ వర్త్ సుమారు రూ.40 కోట్లు&nbsp; అలియా భట్ అల్కాహాల్ తాగుతుందా? అవును తాగుతుంది. అలియా భట్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి? ల్యాండ్ రోవర్, ఆడీ క్యూ7, ఆడీ క్యూ5,BMW7 సిరీస్ అలియా భట్ గురించి మరికొన్ని ఆసక్తి విషయాలు అలియా భట్‌కు చీకటి అంటే భయం, రాత్రి సమయంలో లైట్లు వేసుకునే పడుకుంటుంది.అలియా భట్‌కు హాట్ డ్రింక్స్‌కంటే కూల్ డ్రింక్స్ అంటే ఇష్టంస్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ సినిమా కోసం చేసి ఆడిషన్స్‌లో అలియా భట్ 400 మంది అమ్మాయిలతో పోటీ పడి మరి హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయింది.అలియా ఎప్పుడు తన ఫింగర్స్‌ను వాసన చూసే అలవాటు ఉంది.అలియాకు పెంపుడు జంతువులంటే ఇష్టం 'పెటా'తో కలిసి హోమ్‌లెస్ జంతువులను కాపాడుతుంటుంది.అలియా భట్‌కు విమానంలో వెళ్లడమంటే భయం https://www.youtube.com/watch?v=CgwSY4DZHwM
    ఏప్రిల్ 18 , 2024
    <strong>రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?</strong>
    రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
    నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.&nbsp; డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్న ఎవరు? రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక మందన్న దేనికి ఫేమస్? రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రష్మిక మందన్న వయస్సు ఎంత? రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు&nbsp; రష్మిక మందన్న ముద్దు పేరు? నేషనల్ క్రష్ రష్మిక రష్మిక మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు&nbsp; రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది? విరాజ్ పేట, కర్ణాటక రష్మిక మందన్నకు వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు. రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు? బ్లాక్ రష్మిక మందన్న అభిరుచులు? ట్రావెలింగ్ రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం? చికెన్, చాక్లెట్ రష్మిక మందన్న అభిమాన నటుడు? అక్షయ్ కుమార్ రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి రష్మిక మందన్న తొలి సినిమా? కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు) రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు? గీతాగోవిందం, పుష్ప రష్మిక మందన్న ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత? రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు? సుమన్, మదన్ మందన్న రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది? రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది. రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. రష్మిక మందన్న సిస్టర్ పేరు? సిమ్రాన్ మందన్న రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా? లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rashmika_mandanna/?hl=en రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది. https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
    ఏప్రిల్ 16 , 2024
    <strong>Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;</strong>
    Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్‌ కపుల్‌ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్‌ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే? మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్‌ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో చేసిన ‘సిటాడెల్‌ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్‌ కూాడా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్‌ యూనిట్‌ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్‌ కూడా త్వరలో రిలీజ్‌ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.&nbsp; https://twitter.com/i/status/1770184438099410982 చైతు - సమంత మాట్లాడుకున్నారా? అమెజాన్‌ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1770045272049279412 అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి.. మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్‌ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్‌ ఇండియా వెర్షన్‌’ త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించాడు. ఇటీవల ఈ సిరీస్‌ పేరును మేకర్స్‌&nbsp; ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.&nbsp; https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
    మార్చి 20 , 2024
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.&nbsp; https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.&nbsp; https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Nupur Sanon: బ్లాక్ శారీలో నుపూర్ నడుమందాలను చూసి తట్టుకోగలరా? 
    Nupur Sanon: బ్లాక్ శారీలో నుపూర్ నడుమందాలను చూసి తట్టుకోగలరా? 
    బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్‌ సనన్‌.. మరోమారు సోషల్‌ మీడియాలో తళతళ మెరిసిపోయింది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లను ఊర్రూతలూగించింది. https://twitter.com/MoviesUpdatez/status/1760945753596576055 నల్లటి శారీలో దగ దగ మెరుస్తూ నుపుర్‌ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.. తన ఒంపుసొంపులతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది.&nbsp;&nbsp; బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్‌ సనన్‌.. ‘టైగర్ నాగేశ్వర్‌’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది.&nbsp; రవితేజతో పోటీపడి మరి నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్‌కు నుపుర్‌ స్వయాన సోదరి. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) నుపుర్‌.. 2019లో వచ్చిన ‘ఫిల్హాల్‌’ అనే ప్రైవేటు ఆల్బమ్‌ సాంగ్‌లో కనిపించింది.&nbsp; ఆ పాటలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సరసన డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది.&nbsp; తర్వాత 'పాప్‌ కౌన్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి నుపుర్‌ అందరి దృష్టిలో పడింది.&nbsp; ప్రస్తుతం హిందీలో 'నూరానీ చెహ్రా' అనే సినిమాలో నుపుర్‌ నటిస్తోంది.&nbsp; యంగ్‌ హీరో నవాజుద్దీన్‌ సిద్ధిఖీకు జోడీగా ఆమె తెరను పంచుకుంటోంది. నుపుర్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్‌ 15, 1993లో డిల్లీలో జన్మించింది.&nbsp; ఈ భామకు బాలీవుడ్‌లో షారుఖ్‌, హృతిక్‌, వరుణ్‌ ధావన్‌ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్స్‌లో అక్క కృతి సనన్‌తో పాటు దీపికా, జాక్వెలిన్‌, ప్రియాంక చోప్రా అంటే ఇష్టమట. సినిమాల్లో ‘తాల్‌’, ‘దిల్‌ చాహతా హై’, ‘3 ఇడియట్స్‌’ మూవీస్‌ అంటే నుపుర్‌కు ప్రాణమట. నుపుర్‌ స్వతహాగా సింగర్ కూడా. ఆమె అద్భుతంగా పాటలు పాడగలదు.&nbsp; గాయకుల్లో మహ్మద్‌ రఫీ, సునీధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌, సోను నిగమ్‌, రెహమాన్‌ అంటే ఇష్టమట. ఇక ‘టైగర్‌ నాగేశ్వరరావు’ హిట్‌ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. ప్రస్తుతం హిందీలో ‘నురానీ చెహ్రా’ అనే చిత్రంలో నుపుర్‌ నటిస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 24 , 2024
    Samantha in Bikini: బికినీలో తడిసిన అందాలతో రెచ్చగొడుతున్న సమంత.. దానికోసమేనా?
    Samantha in Bikini: బికినీలో తడిసిన అందాలతో రెచ్చగొడుతున్న సమంత.. దానికోసమేనా?
    టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత తన గ్లామర్‌ ఫొటోతో మరోమారు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బికినీ సూట్‌ డ్రెస్‌లో ఉన్న ఈ భామ బోల్డ్ ఫొటో షూట్ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఆఫ్రికన్ అడవుల్లోని సెలయేరులో సమంత జలకాళాడుతున్న ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. పోక రంగు బికినీలో అందాలు ప్రదర్శన చేస్తూ చెమటలు పట్టిస్తోంది.&nbsp; ఈ ఫోటోలు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. లుకింగ్ హాట్, అంటూ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు. ఈ మధ్య వరుస పరాజయాలతో డీలా పడిన సమంత.. ఖుషి సినిమా విజయంతో కాస్త ఊరట పొందింది. అయితే టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఆశించినంతగా లభించడం లేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) కుర్ర హీరోయిన్లు శ్రీలీల, నుపుర్ సనన్, ఆషికా రంగనాథ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.&nbsp; దీంతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారేందుకు ఇలా హాట్ ఫొటో షూట్‌ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తనలో ఏమాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తోంది. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది.&nbsp; మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. &nbsp;తెలుగుతో పాటు&nbsp; కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. &nbsp;ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది.&nbsp; తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి భారిన పడిన సామ్ కోలుకుని వరుసగా&nbsp; సినిమాలు చేస్తోంది. &nbsp;ప్రుస్తుతం బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సీరిస్ రిలీజ్ కావాల్సి ఉంది.&nbsp; మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.&nbsp; 'ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.&nbsp; కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. కుర్ర హీరోయిన్ల కంటే పదునైన అందాల దాడి తాను చేయగలనని హింట్ ఇస్తోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్‌ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ఉదయనిధి స్టాలిన్ తన చివరి సినిమా అవకాశాన్ని మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కథ: రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయాక లీల ఉచిత వైద్యం కోసం ఇన్‌స్టిట్యూట్ స్థాపిస్తుంది. దీనికోసం రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) మనుషులు ఇన్‌స్టిట్యూట్‌ దాడి చేసి బిల్డింగ్‌ను ధ్వంసం చేస్తారు. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాకు వడివేలు నటనే హైలెట్‌ అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురించే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్‌ విషయానికొస్తే ఆయన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ రోల్‌ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయనిధి తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు ఫహాద్‌ ఫాజిల్‌ కూడా అత్యుత్తమ నటన కనబరిచాడు. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు నటించారు. ఎలా సాగిందంటే ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీల చుట్టూ తిరుగుతుంది. కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంతోనే ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటివి వీక్షకులకు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక సినిమాకు డైలాగ్స్‌ ప్రధాన బలం అని చెప్పొచ్చు. టెక్నికల్‌గా మారి సెల్వరాజ్‌ ఈ సినిమాలోనూ తనదైన మార్క్‌ చూపించాడు.&nbsp; హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. పాత్రల పరిచయం వేగంగా చేసిన దర్శకుడు కొన్ని సీన్లను కూడా ట్రిమ్‌ చేసుంటే బాగుండేదని అనిపించింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే&nbsp; ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతగానో దోహదం చేశాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆక్టటుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ కథవడివేలు నటనరెహమాన్‌ సంగీతంఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మైనస్ పాయింట్స్ సాగదీత సీన్స్నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3.25/5
    జూలై 14 , 2023

    @2021 KTree