• TFIDB EN
  • డర్టీ హరి
    ATelugu1h 47m
    హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రవణ్ రెడ్డి
    హరి
    రుహాని శర్మ
    వసుధ
    సిమ్రత్ కౌర్
    జాస్మిన్
    రోషన్ బషీర్
    ఆకాష్
    అజయ్
    సురేఖ వాణిప్రమీల
    అప్పాజీ అంబరీష దర్బార్రవిశంకర్
    సిబ్బంది
    ఎంఎస్ రాజు
    దర్శకుడు
    గూడూరు సతీష్ బాబునిర్మాత
    గూడూరు సాయి పునీత్నిర్మాత
    మార్క్ K. రాబిన్సంగీతకారుడు
    కథనాలు
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    యంగ్‌ హీరోయిన్‌ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా వెంకటేష్‌ ‘సైంధవ్‌’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్‌.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రుహానీ శర్మ ఎవరు? రుహానీ.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది. రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది? సోలన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది? 18 సెప్టెంబర్‌, 1994 రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు? సుభాష్‌ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది.  రుహానీ శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ) రుహానీ శర్మ వయసు ఎంత?  30 సంవత్సరాలు (2024) రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు రుహానీ శర్మ ఏం చదువుకుంది? బీఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేసింది. రుహానీ శర్మ.. కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'కుడి టూ పటాకా' పంజాబి సాంగ్‌ యూట్యూబ్‌లో సూపర్‌ హిట్ అయ్యింది. రుహానీ శర్మ.. మెుదటి చిత్రం? 2017లో తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది? 2018లో వచ్చిన 'చి ల సౌ' (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యింది.  రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి? ‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్‌: ఛాప్టర్‌ 1’, ‘సైంధవ్‌’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం? శ్రీరంగ నీతులు రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు? కడైసి బెంచ్‌ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం) రుహానీ శర్మ ఫేవరేట్‌ హీరో ఎవరు? టాలీవుడ్‌లో వెంకటేష్‌, బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది.  రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్‌ ఏవి? బ్లాక్‌ (Black), గ్రే (Grey) రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం? ఫ్లోరిడా రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది? క్రికెట్‌ రుహానీ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌? https://www.instagram.com/ruhanisharma94/?hl=en https://www.youtube.com/watch?v=pTdgQNy8BxI
    ఏప్రిల్ 12 , 2024
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు రాజు యాదవ్‌ జబర్దస్త్ ఫేమ్‌ గెటప్‌ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju yadav). అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. లవ్‌ మీ ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్‌ యూ డేర్‌’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని  ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  డర్టీ ఫెలో శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్‌ డ్రామా చిత్రమని మూవీ యూనిట్‌ తెలిపింది.  ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man MovieEnglishLions Gate PlayMay 24
    మే 20 , 2024
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.  ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.  Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.  శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.  Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.  అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.  అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.  శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.  సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.  ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు   రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ  సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023   మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.  ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు  రేటింగ్‌: 2.5/5
    నవంబర్ 24 , 2023
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.  బ్రహ్మానందం టాలీవుడ్‌ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.  ఆలీ టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్‌ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.  వెన్నెల కిషోర్‌ వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్‌ ఆ సినిమాతోనే స్టార్‌ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్‌ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్‌ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది.  సునీల్‌ టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్స్‌లో సునీల్‌ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్‌ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా సునీల్‌ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్‌ కనిపిస్తున్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.  పృథ్వీ థర్టీ ఇయర్స్‌ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్‌ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.  ప్రియదర్శి పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.  సప్తగిరి పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్‌ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.  సత్య అక్కల టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా  సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.  శ్రీనివాస రెడ్డి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్‌ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.  షకలక శంకర్‌ జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ఆరంభించిన షకలక శంకర్‌ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్‌ ఆకట్టుకున్నాడు. 
    ఏప్రిల్ 07 , 2023

    @2021 KTree