• TFIDB EN
  • డాక్టర్ చక్రవర్తి
    UTelugu2h 47m
    డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @maheshYadavv

    Good Movie

    9 months ago

    తారాగణం
    అక్కినేని నాగేశ్వరరావు
    డా. చక్రవర్తి
    సావిత్రి
    మాధవి
    జగ్గయ్య
    రవీంద్ర
    కృష్ణ కుమారి
    డా. శ్రీదేవి
    సౌకార్ జానకి
    నిర్మల
    గుమ్మడి
    ఇన్‌స్పెక్టర్ శ్రీధర్
    పద్మనాభం
    వెంకట స్వామి
    చలం
    వెంకట రమణ
    సూర్యకాంతం
    గీతాంజలి
    సుధ
    జయంతి
    పద్మ
    సిబ్బంది
    ఆదుర్తి సుబ్బారావు
    దర్శకుడు
    డి.మధుసూధనరావు
    నిర్మాత
    ఎస్. రాజేశ్వరరావు
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  బట్టల సత్తి (Battala Satti) టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్‌ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా చేసిన 'లేడీస్‌ ట్రైలర్‌' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.  శుభలేఖ సుధాకర్‌ (Subhalekha Sudhakar) విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్‌ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్‌ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు. రామిరెడ్డి (Spot Nana Rami Reddy) కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్‌ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్‌ హీరోగా చేసిన ‌’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్‌ పెడతా’ అనే డైలాగ్‌ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్‌ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  సుత్తి వీరభద్రరావు  (Sutti Veerabhadra Rao) సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్‌ అయ్యింది.  https://twitter.com/i/status/1674734022793244672 సుత్తివేలు (Suthivelu) అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.  షావుకారు జానకి (Shavukaru janaki) షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.  సాక్షి రంగారావు (Sakshi Ranga rao) ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన  'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు  800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.  అల్లరి నరేష్‌ (Allari Naresh) ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్‌.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్‌’గా నరేష్‌ గుర్తింపు పొందాడు.  వందేమాతరం శ్రీనివాస్‌ (Vandemataram Srinivas) టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్‌’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.  సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri) టాలీవుడ్‌ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు. మహర్షి రాఘవ (Maharshi Raghava) వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.  దిల్‌ రాజు (Dil Raju) ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్‌ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్‌' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్‌ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.  వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) నటుడు వెన్నెల కిషోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్‌.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.  సత్యం రాజేష్‌ (Satyam Rajesh) నటుడు సత్యం రాజేష్‌ అసలు పేరు.. రాజేష్‌ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్‌.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్‌ పాత్రల్లో కనిపించి సాలిడ్‌ విజయాలను అందుకున్నాడు. చిత్రం శ్రీను (Chithram Srinu) చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu bhaskar) డైరెక్టర్ భాస్కర్‌.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్‌’ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆహుతి ప్రసాద్‌ (Ahuti Prasad) నటుడు ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం  ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్‌ బారిన పడి  జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.   జేడీ చక్రవర్తి (JD Chakravarthy) హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు  నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.  బొమ్మాళి రవి శంకర్‌ (Bommali Ravi Shankar) తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్‌ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్‌ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి'  చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవిశంకర్‌.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్‌ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్‌ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.  https://twitter.com/ramanuja2797/status/1393914318530351116 దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్‌ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్‌ తన పేరులో కలుపుకున్నాడు. బాహుబలి ప్రభాకర్‌ (Bahubali Prabhakar) ‘రైట్‌ రైట్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్‌.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.  ప్రభాస్‌ శ్రీను (Prabhas Srinu) పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్‌ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి గాను ప్రభాస్‌ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. 
    మార్చి 07 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    <strong>Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?</strong>
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?
    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌, చిత్ర శుక్లా, రూపా&nbsp; లక్ష్మీ, అనీష్‌ కురువిల్ల, దేవి ప్రసాద్‌ తదితరులు.. దర్శకత్వం : రమాకాంత్‌ రెడ్డి సంగీతం : అజయ్‌ అరసద సినిమాటోగ్రాఫర్‌ : చరణ్‌ మాధవనేని నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ విడుదల తేదీ: 29-03-2024 విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విజయ్-సాగర్‌ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్‌ భయపడుతుంటే సాగర్‌ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్‌ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్‌ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్‌ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్‌ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్‌ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి&nbsp; క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్‌. ఓవరాల్‌గా రమాకాంత్‌ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్‌ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. చాలా సీన్లు లైవ్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్‌ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తోంది.&nbsp; ప్లస్ పాయింట్స్ కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 29 , 2024
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2&nbsp; సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.&nbsp; కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని&nbsp; డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.&nbsp; ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని&nbsp; హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.&nbsp; రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.&nbsp;
    అక్టోబర్ 26 , 2023
    Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
    Brahmanandam: తెలంగాణ పిల్లను కోడలిగా చేసుకున్న బ్రహ్మానందం.. బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా…!
    &nbsp;బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. శ్రీ బూర‌ వినయ్ కుమార్ – పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి హైదరాబాదులోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయితే వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో బ్రహ్మీ చిన్న కోడలు ఎవరా? అన్న ఆసక్తి&nbsp; ఫ్యాన్స్‌లో మొదలైంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి నెట్టింట్లో శోధించడం మొదలు పెట్టారు. ఇంతకు ఆమె ఎవరంటే? బ్రహ్మానందం ఇంట్లోకి చిన్న కోడలుగా&nbsp; పెట్టిన అమ్మాయి బ్యాగ్రౌండ్ చాలా బలంగానే ఉంది. కరీంనగర్‌లో ప్రముఖ వైద్యులుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ పద్మజా వినయ్‌ల గారాల పట్టినే బ్రహ్మీ చిన్న కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు ఐశ్వర్వ. డాక్టర్ చదివింది. తను కూడా గైనకాలజిస్ట్. వీరికి స్థిరచరాస్తులు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య పేరుతో ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు టాక్.&nbsp; కరీంనగర్‌తో పాటు తెలంగాణలోని పలుచోట్ల వీరికి ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిసింది. ఇక అమ్మాయి కూడా చక్కని రూపంతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని లావణ్యంతో మెరిసిపోయింది. అందుకే కొత్త కోడలికి ఎంగేజ్‌మెంట్ సమయంలో బ్రహ్మీ గారు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వజ్రాలు పొదిగిన నక్సెస్‌ను పెళ్లికానుకగా బహూకరించారు. దీని విలువ రూ.30 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. బ్రహ్మానందం ఆస్తి గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్లలో ఆయనది తొలి స్థానం. రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తన స్తోమతకు తగినట్లుగా ఉంటారని బ్రహ్మానందం భావించడంతో డాక్టర్ సంబంధానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.&nbsp; వీరి పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరయ్యారు. ఇక బ్రహ్మానందం పెద్ద కొడుకు&nbsp; రాజా గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. తండ్రి బాటలో సినిమా రంగంలో నడుద్దామని ప్రయత్నించాడు. పల్లకిలో పెళ్లికూతురు – చారుశీల, బాసంతి వంటి సినిమాలలో నటించాడు. అయితే ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వ్యాపారంలో స్థిరపడ్డాడు. అయితే మళ్లీ ఓ వెబ్‌సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. గౌతమ్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.&nbsp; బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్థ గురించి బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. సిద్ధార్థ విదేశాల్లో చదివాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఇక్కడే స్థిరపడి వ్యాపారం చేయాలని సిద్ధార్థ్ భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర నుంచి తెలిసింది. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం తన ఇద్దరు కుమారులను మాత్రం సినీరంగంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు.
    ఆగస్టు 19 , 2023
    <strong>Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;</strong>
    Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో సమంత (Samantha Ruth Prabhu) ఒకరు. అనారోగ్యం రిత్యా కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. తన గ్లామర్‌ పోస్టులతో తరచూ వారికి హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజర్‌ వాడకంపై ఆమె పెట్టిన పోస్టు.. వివాదానికి దారి తీసింది. దీనిపై వైద్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ డాక్టర్‌ ఏకంగా సమంతను జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సమంత కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ నెట్టింట రచ్చరేపుతున్న ఈ వివాదానికి గల కారణాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; సమంత హెల్త్‌టిప్‌ ఇదే! ప్రముఖ నటి సమంత.. మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. తాను తీసుకుంటున్న వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజేషన్‌ గురించి ఆమె పోస్టు పెట్టారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. ‘హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ట్ వాటర్ రెండూ కలిపి నెబులైజర్ చేయండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి’ అంటూ సమంత తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని తనకు సూచించిన మిత్ర బసు చిల్లర్ అనే వైద్యురాలిని కూడా పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టు నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; సమంతను జైల్లో పెట్టాలి: డాక్టర్‌ సమంత పెట్టిన పోస్టు వైరల్‌ కావడంతో.. ఇది చూసిన పలువురు డాక్టర్స్ మండిపడ్డారు. సమంతపై సోషల్‌ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తప్పు అని సూచించారు. ముఖ్యంగా డాక్టర్ అబీ ఫిలిప్స్ అనే డాక్టర్‌ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించారు.&nbsp;‘TheLiverDoc’ పేరుతో ఉన్న తన ఎక్స్‌ ఖాతాలో సమంతపై విరుచుకుపడ్డారు. సమంత చెప్పినట్లు చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమంతకు హెల్త్‌ గురించి, సైన్స్‌ గురించి తెలియదని నిరక్షరాస్యురాలంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకు ఆమెను జైలులో పెట్టాలని లేదా జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/theliverdr/status/1808804909783159003 సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌ తనను జైల్లో పెట్టాలంటూ డాక్టర్‌ ఇచ్చిన వార్నింగ్‌పై నటి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఒక ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. 5 ఏళ్లుగా డీఆర్డీవోకు సేవలందించిన, ఎండీ అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సను సూచించారు. ఒక పెద్దమనిషి నా పోస్టును, నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని సామ్‌ రాసుకొచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
    జూలై 05 , 2024
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన 'చిట్టి' పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఫరియా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ప్రస్తుతం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మరి ఫరియా గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About faria abdullah) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫరియా అబ్దుల్లా దేనికి ఫేమస్? ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది. ఫరియా అబ్దుల్లా వయస్సు ఎంత? 1998 మే 28న జన్మించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు&nbsp; ఫరియా అబ్దుల్లా ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు&nbsp; ఫరియా అబ్దుల్లా ఎక్కడ పుట్టింది? కువైట్‌ ఫరియా అబ్దుల్లా ఉండేది ఎక్కడ? హైదరాబాద్ ఫరియా అబ్దుల్లా ఏం చదివింది? మల్టీమీడియా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది ఫరియా అబ్దుల్లా తల్లిదండ్రుల పేర్లు M.J అబ్దుల్లా(వ్యాపారవేత్త), కౌసర్ సుల్తానా(డాక్టర్) ఫరియా అబ్దుల్లా ఫెవరెట్ హీరో? విజయ్ దేవరకొండ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం? జాతిరత్నాలు, ఈ చిత్రంతో పాటు మసూధ, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది. ఫరియా అబ్దుల్లా అభిరుచులు? మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్ ఫరియా అబ్దుల్లా ఇష్టమైన ఆహారం? బిర్యాని ఫరియా అబ్దుల్లాకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్ ఫరియా అబ్దుల్లా పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చేది. ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/fariaabdullah/?hl=en https://www.youtube.com/watch?v=Xcc_cng9Cl8 ఫరియా అబ్దుల్లా మరికొన్ని విషయాలు ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్‌లో బ్రైట్ స్టూడెంట్‌గా ఉండేది. భారతీయ విద్యా భవన్‌లో హెడ్‌ గర్ల్‌ ఆఫ్ స్కూల్‌గా ఎంపికైంది.ఫరియా కుడి చేతి మీద Veni Vidi Vici అనే పదాలు రాసి ఉంటాయి. వీటి అర్థం "నేను వచ్చాను, చూశాను, జయించాను"ఫరియా అబ్దుల్లాకు ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందిఫరియాకు తన చెల్లెలు ఇనయా అబ్దుల్లా అంటే చాలా ఇష్టం
    ఏప్రిల్ 13 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.&nbsp; గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన&nbsp; తాజా చిత్రం&nbsp; ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter&nbsp;MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    అల్లు అర్జున్ (ALLU ARJUN)  గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అల్లు అర్జున్ (ALLU ARJUN)  గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగు సినీ ప్రపంచంలో స్టైలిష్ స్టార్‌‌గా కీర్తించబడి ఐకాన్ స్టార్‌గా అభిమానుల మనసు దోచుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతను వృతిపరమైన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. సినీ నేపథ్య కుటుంబమైనప్పటికీ తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకోని ఓవరాల్ ఇండియాలోనే మేటి నటుడిగా గుర్తింపు సాధించాడు. మరి అలాంటి అల్లు అర్జున్ వ్యక్తిగత, వృతిపరమైన జీవిత విశేషాలు ఏంటో మీరూ తెలుసుకోండి. అల్లు అర్జున్ ఎవరు..? టాలీవుడ్‌లో స్టార్ హీరో, పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎప్పుడు? ఇతను 1982, ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్- నిర్మల దంపతులకు జన్మించారు. వీరి తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాలో హాస్య నటుడిగా, మరెన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరి కుటుంబానికి సినీ పరిశ్రమతో చక్కని అనుబంధం ఏర్పడింది. అల్లు అర్జున్ వయస్సు? బన్నీ వయస్సు 42 సంవత్సరాలు.&nbsp; అల్లు అర్జున్ ఎత్తు ఎంత? &nbsp;5 అడుగుల 9 అంగుళాలు అల్లు అర్జున్ ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..? అల్లు అర్జున్ ఇప్పటి వరకు 20 సినిమాల్లో&nbsp; హీరోగా నటించాడు. త్వరలో పుష్ప-2 సినిమా రిలీజ్ కానుంది. తదనాంతరం ఐకాన్, AA 23 మూవీల్లో నటించనున్నట్లు సమాచారం. బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..? మూడేళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యాడు. 1985లో రిలీజ్ అయిన విజేత సినిమాలో శారద కొడుకుగా నటించాడు. స్వాతిముత్యం సినిమాలో శివయ్య మనువడిగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..? 2011, మార్చి 6న స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యూఎస్‌లో ఓ ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్లిన తరుణంలో స్నేహారెడ్డిని చూసి ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ కాస్త పరిణయానికి దారి తీసింది. వీరికి కుమారుడు అయ్యాన్, కుమార్తె అర్హ జన్మించారు. అల్లు అర్జున్‌ ఫ్రొపెషనల్ లైఫ్ చూసుకుంటే, స్నేహారెడ్డి ఫ్యామిలీని బాధ్యతలు చూసుకుంటుంది. &nbsp;అల్లు అర్జున్ ముద్దు పేర్లు ఏంటి..? ఇతడిని టాలీవుడ్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ముద్దుగా బన్నీ అని పిలుస్తుంటారు. క్లాస్‌మెట్ అయిన రానా చెర్రీ అనేవాడట. అలాగే కేరళ ఫ్యాన్స్ ఇతడిని మల్లు అర్జున్ అంటుంటారు.&nbsp; అల్లు అర్జున్‌కి ఇష్టమైన మూవీ ఏది..? చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా అంటే బన్నీకి చాలా ఇష్టమట. ఈ సినిమాను 15 సార్లకంటే ఎక్కువగానే చూశాడట. ఇప్పటికీ టైం దొరికినప్పుడల్లా ఈ మూవీ చూడటానికి అల్లు అర్జున్ ఇష్టపడతాడట. అల్లు అర్జున్‌కు ఇష్టమైన ఫుడ్? &nbsp;బిర్యాని అల్లు అర్జున్‌కు ఇష్టమైన పుస్తకాలు? &nbsp;డాక్టర్ స్పెన్సర్ రాసిన "Who Moved My Cheese" అనే పుస్తకం చదువుతుంటాడు. ఫొటోగ్రఫీ, స్కెచింగ్ అంటే ఇష్టమట. https://www.youtube.com/watch?v=DkesE-U6V3g అల్లు అర్జున్‌కు ఎన్ని అవార్డులు వరించాయి..? అల్లు అర్జున్ 5 ఫిల్మ్‌ఫేర్, 3 నంది అవార్డులు సాధించాడు. పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
    మార్చి 19 , 2024
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే.&nbsp; అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.&nbsp; ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.&nbsp; సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.&nbsp; తమిళ స్టార్‌ హీరో కార్తిక్‌.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్‌ - వెంకటేష్‌ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.&nbsp; గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.&nbsp; https://twitter.com/yousaytv/status/1717459822881509489 వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.&nbsp; వెంకటేష్‌.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3)&nbsp; అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.&nbsp; ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.&nbsp;
    మార్చి 16 , 2024
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.&nbsp; భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.&nbsp; వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.&nbsp; రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి ఎమోషనల్.. ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాక‌తో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గ‌ర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాక‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.&nbsp; https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20 అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు. https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది.&nbsp; రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.&nbsp; చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.&nbsp; డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్,&nbsp; డాక్టర్ రూమా సిన్హా&nbsp; అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో&nbsp; ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది. ఐకాన్ స్టార్ రాక.. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ‌అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/ANI/status/1671037419255373824?s=20 &nbsp;అటు చరణ్‌-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్‌ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    HBD ADAH SHARMA: ఆదాశర్మను మీరు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. టాప్‌-10 రేర్‌ పిక్స్ వైరల్‌
    ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ పేరు దేశమంతా మార్మోగుతోంది. ది కేరళ స్టోరీలో ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక సినీ కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీ హిట్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. నేడు హీరోయిన్ ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మ రేర్ పిక్స్‌తో పాటు ఆమె గురించి ప్రత్యేక విషయాలు మీకోసం.. ప్రముఖ నటి ఆదాశర్మ.. ముంబయిలోని నేవీ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి పూర్తి చేసిన వెంటనే సినీ రంగ ప్రవేశం కోసం ఆదాశర్మ యత్నించింది. అయితే మరీ యంగ్‌గా ఉండటంతో పలు ఆడిషన్లలో ఆమెను రిజెక్ట్ చేశారు. 2008లో వచ్చిన ‘1920’ అనే హారర్ చిత్రంతో ఆమె సినిమాల్లోకి ‌అడుగుపెట్టారు.&nbsp; ‘1920’ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించిన ఆదాశర్మ.. హార్ట్‌ ఎటాక్‌ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హయాతి పాత్రలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.&nbsp; ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫ్లాప్‌ అయినా ఆదాశర్మకు మాత్రం ‌అవకాశాలు క్యూ కట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు.&nbsp; తెలుగులో ఆదాశర్మ చేసిన చివరి సినిమా ‘కల్కి’. ఇందులో డాక్టర్ పద్మ అనే పాత్రలో ఈ భామ కనిపించింది. ఈ సినిమా కూడా కలిసిరాకపోవడంతో తెలుగులో అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అటు బాలీవుడ్‌లోనూ ఛాన్సెస్‌ రాకపోవడంతో ఆమె వెబ్‌సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. శివాని భట్నాగర్ అనే పాత్రలో మెప్పించింది.&nbsp; హిందీలో ‘చుహాబిల్లి’ అనే థ్రిల్లర్‌ షార్ట్ ఫిల్మ్‌లో కూడా ఆదాశర్మ నటించింది. అలాగే ‘పియా రే పియా’ అనే ఒక మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి సందడి చేసింది.&nbsp; ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ అనే సినిమాలోనూ ఆదాశర్మ కీలక పాత్ర పోషించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ది కేరళ స్టోరీ సినిమాకు భాజపా పాలిత రాష్ట్రాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. మరికొన్ని స్టేట్స్‌ మాత్రం షరతులు విధిస్తున్నాయి.&nbsp; ఇక సోషల్‌ మీడియాలోనూ ఆదాశర్మ ఎంతో చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది. ఆదాశర్మ ఇన్‌స్టా ఖాతాను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp; https://telugu.yousay.tv/the-kerala-story-review-in-telugu-adah-sharmas-performance-brought-tears-reminds-me-of-another-kashmir-files.html
    మే 11 , 2023
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?
    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్ దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్ రచన: శాలినీ కొండేపూడి సంగీతం: అజయ్ అరసాద ఎడిటర్: సాయి మురళి సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల స్ట్రీమింగ్‌ వేదిక : ఆహా హాస్యనటుడు 'అభినవ్‌ గోమఠం' ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి? సుజాత (షాలిని), డాక్టర్‌ విశాల్‌ (నిఖిల్‌ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్‌ చేసేందుకు విశాల్‌ ఆమె ఫ్రెండ్స్‌తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్‌తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్‌కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి?&nbsp; ఎవరెలా చేశారంటే? నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్‌ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్‌ విశాల్‌ పాత్రలో నిఖిల్‌ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్‌, వెయిటర్‌గా నటించిన వంశీధర్‌ గౌడ్‌ తమ నటనతో ఓకే అనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్‌తో లవ్‌ ఎపిసోడ్‌తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్‌ చేసిన డైరెక్టర్‌.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్‌ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్‌ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్‌ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్‌ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.&nbsp; సాంకేతికంగా&nbsp; సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షాలిని, అభినవ్‌ గోమఠం నటనకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5
    ఏప్రిల్ 20 , 2024
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో&nbsp; ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే&nbsp; నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.&nbsp; సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
    నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాస‌రి, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు దర్శకుడు : డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ నిర్మాత: గౌరీ కృష్ణ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి విడుదల తేదీ : నవంబర్ 03, 2023 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్‌-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్‌ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిదంటే పొలిమేర పార్ట్‌ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్‌ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్‌ 1లో మర్డర్‌ మిస్టరికీ చేతబడిని యాడ్‌ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్‌-1లో లాగే పార్ట్‌-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్‌ 3లో ఉంటుందని ముగించేశారు.&nbsp; ఎవరెలా చేశారంటే? కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్‌ అదరగొట్టాడు. పార్ట్‌ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్‌ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల&nbsp; చక్కగా నటించింది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్‌ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp;&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్‌ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్‌ 1 చూడకపోయినా పార్ట్‌ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనంలాజిక్‌ లేని సీన్స్‌ చివరిగా: థ్రిల్లింగ్‌ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్‌ సీన్స్‌, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.&nbsp; రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్&nbsp;
    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్&nbsp;
    టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్‌ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.  వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ కుమారుడితో వివాహం జరగనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు.&nbsp; మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.&nbsp; ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది. అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం. మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.&nbsp; ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా&nbsp; శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. &nbsp;ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 26 , 2023

    @2021 KTree