• TFIDB EN
  • దొరసాని
    UATelugu
    పెదవాడైన రాజు.. భూస్వామి కూతురు దొరసానితో ప్రేమలో పడుతారు. ఈ విషయం తెలుసుకున్న దొరసాని తండ్రి వారి ప్రేమను ఎలా ముగించాడు అనేది కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఆనంద్ దేవరకొండ
    రాజు
    శివాత్మిక రాజశేఖర్
    దొరసాని దేవకి రెడ్డి
    వినయ్ వర్మ
    డోరా
    శరణ్య ప్రదీప్దేశీయ పనిమనిషి లేదా దాసి
    బైరెడ్డి వంశీ కృష్ణా రెడ్డిప్రతాప్ రెడ్డి
    సురభి ప్రభావతిరాజు తల్లి
    ఎన్. దశరథ రెడ్డిరాజు తండ్రి
    సిబ్బంది
    కేవీఆర్ మహేంద్రదర్శకుడు
    మధుర శ్రీధర్ రెడ్డి
    నిర్మాత
    ప్రశాంత్ ఆర్ విహారి
    సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్
    కథనాలు
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
    రాజశేఖర్ - జీవిత నట వారసురాలు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్‌ మీడియాలో మరోమారు రెచ్చిపోయింది.  తాజా ఫొటో షూట్‌లో హద్దులన్నీ చెరిపేసిన ఈ చిన్నది నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.  శివాత్మిక అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.  2019లో ‘దొరసాని’ చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్‌మీడియాపై ఫోకస్ పెట్టింది.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. హాట్‌ డోస్‌ను రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను పంచుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.  శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3 లక్షల 95 వేల మంది ఫాలో అవుతున్నారు.
    ఫిబ్రవరి 16 , 2024
    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
    యంగ్‌ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన ‌అందచందాలతో సోషల్‌మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  తాజా ఫొటోల్లో మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.  స్టార్‌ హీరోయిన్‌ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది. ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 
    నవంబర్ 16 , 2023
    Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న శివాత్మిక అందాలు
    Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న శివాత్మిక అందాలు
    రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది. నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ భామను హాట్‌ లుక్స్‌లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.  2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.  దొరసాని తర్వాత పంచతంత్రం, ఆకాశం చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 
    ఏప్రిల్ 04 , 2023
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం :  వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.  మూవీ ప్లాట్‌ ఏంటంటే..  కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.  మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..  గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.  కథ ఏంటంటే..  ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.  ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.  కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే..  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌. 
    జూన్ 06 , 2024
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే! 
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే! 
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్‌ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం. [toc]  గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి  విశ్వ‌క్ సేన్ లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’.. శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.2 కోట్ల‌కు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఫలితంగా విశ్వ‌క్ సేన్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. శ‌ని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద జోరు చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. విశ్వక్‌ వన్‌మ్యాన్‌ షో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో లంక‌ల ర‌త్న అనే యువ‌కుడిగా విశ్వ‌క్ సేన్ యాక్టింగ్‌, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల‌ను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్‌ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.  కథేంటి కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  గం.. గం.. గణేశా  ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘గం గం గ‌ణేశా’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ విష్వక్‌ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ  మూవీ ఫ‌స్ట్ డే రూ.80-90 లక్షల వ‌ర‌కు గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 ల‌క్ష‌ల‌కుపైగా షేర్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.  కామెడీ ప్రధానం బలం క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కామెడీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. గం గం గ‌ణేశా మూవీలో ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌, న‌య‌న్‌సారిక హీరోయిన్లుగా న‌టించారు. బేబీ స‌క్సెస్ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిషోర్‌తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.  కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన ‘భ‌జే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్‌ రాబట్టినట్లు ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి.  క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్‌, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.  కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. 
    జూన్ 01 , 2024
    <strong>Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!</strong>
    Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!
    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'క' (Ka Movie). యువ డైరెక్టర్లు సుజీత్‌ - సందీప్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్​గా నటించింది. 2024 దీపావళి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. తొలి 4 డేస్‌లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కంటెంట్‌ పరంగా చూస్తే&nbsp; అంతకంటే ఎక్కువ వసూళ్లనే ‘క’ రాబట్టి ఉండేది. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయం వల్ల ఈ మూవీ కలెక్షన్స్‌లో భారీ కోత పడింది. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్‌లో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నాకర్థంగా మారవచ్చు.&nbsp; థియేటర్ల కేటాయింపులో అన్యాయం కిరణ్‌ అబ్బవరం నటించిన ‘క’ చిత్రాన్ని దీపావళికి తీసుకొస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చేటప్పటికీ దివాలీ రేసులో ఏ చిత్రం లేదు. ఆ తర్వాత దీపావళి బరిలోకి ‘క’ (Ka)తో పాటు ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar), ‘అమరన్‌’ (Amaran), ‘బఘీరా’ (Bagheera) వచ్చి చేరాయి. ఇందులో ‘లక్కీ భాస్కర్‌’ మినహా మిగిలిన రెండు చిత్రాలు పరభాష చిత్రాలే. తమిళ, కన్నడ చిత్రాలైనా ‘అమరన్‌’, ‘బఘీరా’ను తెలుగులో రిలీజ్‌ చేయడం వల్ల ‘క’ సినిమాకు ఆశించిన థియేటర్లు లభించలేదు. పైగా అమరన్‌ చిత్రాన్ని ప్రదర్శించేందుకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఆసక్తికనబరిచాయి. మైత్రి మూవీ మేకర్స్‌ వంటి బలమైన నిర్మాణ సంస్థ లక్కీ భాస్కర్‌ను నిర్మించడంతో థియేటర్ల విషయంలో ఆ సినిమాకు పెద్దగా సమస్య ఏర్పడలేదు. కానీ ‘క’ చిత్రానికి మాత్రం తీవ్ర నష్టం ఎదురైంది. చిన్న సినిమా కావడం, పెద్ద స్టార్ హీరో లేకపోవడంతో ‘క’ సినిమాను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముందుకు రాలేదు. దీనివల్ల తెలుగు స్టేట్స్‌లో కేవలం 147 థియేటర్లలోనే ‘క’ రిలీజ్‌ కావాల్సి వచ్చింది. ఒకవేళ ముందుగానే అమరన్‌, బఘీరా చిత్రాలను దీపావళికి రాకుండా అడ్డుకొని ఉంటే ‘క’ చిత్రానికి థియేటర్లు పుష్కలంగా లభించేవి. మంచి హిట్ టాక్‌ వచ్చినందున సులువుగానే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది.&nbsp; తెలుగు చిత్రాలను పట్టించుకోని ‘కోలీవుడ్‌’! తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారు. కోలీవుడ్‌ స్టార్స్‌ సూర్య, కార్తీ, విక్రమ్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తమిళ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించడంలో తెలుగు ఆడియన్స్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, మన చిత్రాల విషయానికి వచ్చే సరికి తమిళనాడులో ఆ స్థాయి ఆదరణ లేదు. తమిళ దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులకు తెలుగు చిత్రాలంటే కాస్త చిన్నచూపు. ‘క’ విషయంలో ఇది మరోమారు బయటపడింది. పాన్‌ ఇండియా రిలీజ్‌లో భాగంగా ‘క’ చిత్రాన్ని తమిళనాడులో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేశారు. కానీ, తమిళ దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ‘క’ చిత్రాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. త‌మిళంలో దీపావ‌ళికి వ‌స్తున్న సినిమాల‌కు ‘క‌’ అడ్డుత‌గులుతుంద‌ని భావించి ఒక్క థియేటర్‌ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రకటించారు. అదే తమిళనాడులో ‘క’ రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు దొరకని కారణంగా ‘క’ వారం రోజులు ఆలస్యంగా అక్కడ రిలీజ్‌ కాబోతోంది.&nbsp; పట్టించుకోని మీడియా! తమిళనాడుతో పాటు, తెలుగు స్టేట్స్‌లోనూ ‘క’ సినిమాకు అన్యాయం జరిగితే టాలీవుడ్‌ పెద్దలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్‌ అబ్బవరం ఫెయిల్యూర్స్‌ గురించి పదే పదే ప్రస్తావించే తెలుగు ఫిల్మ్‌ సైట్స్‌, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా.. భారీ విజయం సాధించినప్పటికీ జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. మీ సినిమాకు అంత బడ్జెట్ అవసరమా? తిరిగి రికవరీ చేయగలరన్న నమ్మకం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించే విలేఖరులు కలెక్షన్స్‌ దారుణంగా కోతకు గురవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మంచి సినిమాను బతికించాల్సిన బాధ్యత ఎంటర్‌టైన్‌ మీడియాకు లేదా?. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ముఖ్యంగా పండగ సీజన్లలో చిన్న సినిమాను రిలీజ్‌ చేయాలంటే యంగ్‌ హీరోలు, డైరెక్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి తలెత్తవచ్చు.&nbsp; మార్పు తప్పనిసరి! బాలీవుడ్‌, కోలివుడ్‌, శాండిల్‌వుడ్‌, మల్లువుడ్‌, హాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా విడుద‌లైనా, అది ఎలాంటి సీజ‌న్ అయినా వాళ్ల‌కు థియేట‌ర్లు ఇచ్చేస్తారు. అవసరమైతే పోటీగా నిలిచిన చిన్న చిత్రాలు సైడ్ అయ్యేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, ద‌స‌రా, దీపావ‌ళి, సమ్మర్‌ లాంటి సీజ‌న్ల‌లో ప‌క్క రాష్ట్రాల నుంచి వ‌చ్చే డ‌బ్బింగ్ సినిమాల‌కు చెక్ పెట్టాలి. ఓ వారం ఆల‌స్యంగా విడుద‌ల చేయ‌మ‌నాలి. అప్పుడు తెలుగు సినిమాల‌కు మంచి వ‌సూళ్లు ద‌క్కుతాయి. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రికీ అన్యాయం చేయడం లేదు. త‌మిళనాట త‌మిళ చిత్రాల‌కే ప్రాధాన్యం ఇచ్చిన‌ప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు వ‌ర్తింప‌జేయ‌కూడ‌ద‌ు. దీనిపై టాలీవుడ్‌ పెద్దలు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆలోచన చేయాలి.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Raayan Movie Review: ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్‌’ మెప్పించిందా?</strong>
    Raayan Movie Review: ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్‌’ మెప్పించిందా?
    నటీనటులు : ధనుష్‌, సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, జయరామ్‌, సెల్వరాఘవన్‌, ప్రకాష్‌ రాజ్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు కథ &amp; దర్శకత్వం : ధనుష్‌ సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్‌ సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌ ఎడిటింగ్‌ : ప్రసన్న జి.కె నిర్మాణ సంస్థ : సన్‌ పిక్చర్స్‌ విడుదల తేదీ : 26 జులై, 2024 తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం 'రాయన్‌' (Raayan Movie Telugu Review). ధనుష్‌ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌(Prakash Raj), ఎస్‌. జే. సూర్య (S.J. Surya), జయరామ్‌ (Jayaram), వరలక్ష్మీ (Varalaxmi) ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్‌కు మరో విజయాన్ని అందించిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ సక్సెస్‌ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలో చక్కటి నటన కనబరిచాడు. రాయన్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. అటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తన మార్క్‌ చూపించాడు. టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌కు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. రాయన్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిది. సందీప్‌ ఇప్పటివరకూ చేసిన వాటిలో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అటు ఎస్‌.జే సూర్య, ప్రకాష్‌ రాజ్‌ తమ అద్భుత నటనతో తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సెల్వరాఘవన్‌, దుషారా విజయన్‌, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తన కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్‌కు ధనుష్‌ దర్శకత్వం వహించారు. స్టోరీ పరంగా చూస్తే ఓ సాధారణ రీవేంజ్‌ డ్రామాగా అనిపించినప్పటికీ ధనుష్‌ తనదైన డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు డైమన్షన్స్‌లో కథ నడిపి మెప్పించాడు. పోరాట ఘట్టాలు, ఎమోషనల్‌ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. తద్వారా ప్రేక్షకులను కథలో లీనమయ్యేట్టు చేశారు. అద్భుతమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌, ఎమోషన్స్‌, క్లైమాక్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. అయితే రొటిన్‌ స్టోరీ కావడం, తర్వాత జరగబోయేది ముందే ఊహించగలడం, తమిళ నేటివిటికి దగ్గరగా ఉండటం, అక్కడక్కడ కొన్ని బోరింగ్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. సాంకేతికంగా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఏ.ఆర్‌. రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. బోరింగ్‌ సన్నివేశాలను కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే సినిమాకు మరింత వెయిటేజీ వచ్చేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ధనుష్, సందీప్‌ కిషన్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఅక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; ‘రాయన్‌’ సినిమాపై పబ్లిక్‌ టాక్‌ 'రాయన్‌' చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్‌ నటన, నేపథ్య సంగీతాన్ని హైలెట్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ఏవో చూద్దాం.&nbsp; రాయన్‌ ఫస్టాఫ్‌, సెకండాఫ్‌, ధనుష్‌ ఎంట్రీ, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ బ్యాంగ్‌, సందీప్‌ కిషన్‌ నటన అదిపోయాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా 4.6/5 రేటింగ్‌ ఇచ్చాడు.&nbsp; https://twitter.com/review0813/status/1816622242421522704 రాయన్‌ మూవీ రా అండ్‌ రస్టిక్‌గా ఉందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ధనుష్‌ మేకోవర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోయాయని పేర్కొన్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ను ధనుష్‌ తన వర్కింగ్‌ స్టైల్‌తో గుర్తు చేశారని ప్రశంసించారు. ఎస్‌.జే సూర్య నటన, ఏ.ఆర్‌. రెహమాన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచాయని రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/LetsXOtt/status/1816651224956981478 రాయన్‌ ఒక సాధారణ రివేంజ్‌ డ్రామా అయినప్పటికీ ధనుష్‌ టేకింగ్‌ చాలా కొత్తదనాన్ని ఇచ్చిందని ఇంకో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహమాన్‌ ఈ మూవీకి సెకండ్‌ హీరో అంటూ రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/CinemaWithAB/status/1816657822026764609 రాయన్‌ సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. 'ఆల్‌రౌండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా' అని ధనుష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీలో సందీప్‌ కిషన్‌ మేజర్‌ రోల్‌ పోషించాడని ఎక్కడా ల్యాగ్స్‌, బోరింగ్‌ సీన్స్‌ లేవని రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/PikuOffl/status/1816649186571698503
    జూలై 26 , 2024
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.&nbsp; దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు&nbsp; గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?</strong>
    Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
    కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రాయన్‌' (Rayaan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ముఖ్య పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj), ఎస్‌.జే. సూర్య (S.J Surya), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రం జులై 26న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. రొటిన్ రివేంజ్‌ డ్రామా అని నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చినప్పటికీ ధనుష్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిశాయి. సినిమా తమకు బాగా నచ్చిందని మెజారిటీ ప్రేక్షకులు నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయన్‌ తొలి రోజు ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. తొలి రోజు వసూళ్లు ఎంతంటే? ధనుష్‌ కెరీర్‌లో 50వ చిత్రంగా ‘రాయన్‌’ రూపొందింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన (జులై 26) ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20.7 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రూ.15.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే 'రాయన్‌'కు తమిళనాడులో అత్యధికంగా&nbsp; రూ.10.6 కోట్లు వచ్చాయి. ఏపీ &amp; తెలంగాణలో రూ. 2 కోట్లు, కర్ణాటకలో రూ.1.8 కోట్లు, కేరళలో రూ.90 లక్షలు, రెస్ ఆఫ్‌ ఇండియా రూ.40 లక్షలు వసూలైనట్లు వివరించాయి. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; డెడ్‌పూల్‌ వోల్వరైన్‌ డామినేషన్‌ మార్వెల్‌ సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘రాయన్‌’కు ఈ హాలీవుడ్‌ చిత్రం నుంచి గట్టిపోటీ ఎదురైంది. దేశంలోని సినీ ఆడియన్స్‌ ఈ మార్వెల్‌ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బుక్‌మైషోలో రాయన్‌కు 2 లక్షల 73 వేల టికెట్లు బుక్‌ అయితే ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’కు 3 లక్షల 25 వేల బుకింగ్స్‌ వచ్చాయి. ఈ హాలీవుడ్‌ చిత్రానికి దేశంలో తొలి రోజు రూ. 21.5 కోట్లు (NET) వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రూ.11.7 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.1.1 కోట్లు వసూలైనట్లు వివరించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రాయన్‌’ వసూళ్లను ఈ హాలీవుడ్‌ చిత్రం ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థమవుతుంది.&nbsp; ‘రాయన్‌’లో హైలెట్స్‌ ఇవే! గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ 'రాయన్‌' సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. న‌ట‌నే కాదు త‌న‌లో ఎంత మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడో కూడా ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు. కథగా చూస్తే ‘రాయన్‌’లో కొత్త‌ద‌న‌ం ఏమీ కనిపించదు. అయితే కొన్ని మ‌లుపులు, కుటుంబ డ్రామా, క‌థా నేప‌థ్యం ఈ సినిమాను ప్ర‌త్యేకంగా మార్చేశాయి. ఒక మామూలు క‌థ‌ని ధ‌నుష్ త‌న అండ‌ర్ ప్లే న‌ట‌న‌తో, వైవిధ్య‌మైన కొన్ని మాస్ ఘ‌ట్టాల‌తో ర‌క్తి క‌ట్టించాడు. ఎ.ఆర్‌.రెహమాన్ నేప‌థ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఆయన ఈ సినిమాకు సెకండ్‌ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ కూడా వచ్చాయి. ‘రాయన్‌’ కథ ఏంటంటే రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.&nbsp; ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ స్టోరీ ఇదే డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వోల్వరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వోల్వరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
    జూలై 27 , 2024

    @2021 KTree