• TFIDB EN
  • ద్రోణ
    ATelugu2h 28m
    తన రివాల్వర్‌తో ఆడుతున్నందుకు ద్రోణని అతని తండ్రి మందలిస్తాడు. దీంతో అతను ఇంట్లో నుంచి పారిపోతాడు. చాలా సంవత్సరాల తరువాత, అతను ఇంటికి తిరిగి వస్తాడు, కానీ అతని తల్లిదండ్రుల తను ఎవరనే నిజాన్ని దాచిపెడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నితిన్
    ద్రోణ
    ప్రియమణి
    ఇందు
    ముఖేష్ రిషి
    ద్రోణ తండ్రి మరియు పోలీసు అధికారి
    కెల్లీ డోర్జీ
    సర్కార్ (అంతర్జాతీయ ఉగ్రవాది)
    సునీల్
    రఘు బాబు
    శివప్రసాద్
    సత్య అక్కల
    సత్య
    కరాటే కళ్యాణి
    రాఖీ సావంత్
    ఐటెమ్ నంబర్ సయ్యారే సయ్యా
    సిబ్బంది
    J. కరుణ్ కుమార్దర్శకుడు
    డిఎస్ రావునిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్‌.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్‌ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.  అశ్వత్థామ ఎవరంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్‌ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్‌ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్‌ లుక్స్‌ అచ్చం అలాగే ఉండటం గమనార్హం. గ్లింప్స్‌లో ఏముంది? కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్‌ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్‌ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. https://twitter.com/i/status/1782338404421927223 రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్‌! అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్‌, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్‌ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్‌ అశ్విన్‌ కూడా అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్‌ ‘భైరవ’ టీజర్‌ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్‌ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.   దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?  ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.  నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్‌ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్‌’లోనే విడుదల తేదీని రివీల్‌ చేస్తారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. 
    ఏప్రిల్ 22 , 2024
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
    Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
    సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ చేసిన అద్భుత నటనకు బాలీవుడ్‌ ఆడియన్స్‌ సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఎర్ర చందనం చుట్టూ తిరిగే ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. కూలి స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ నాయకుడిగా బన్నీ ఎదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌కు అదిరిపోయే రేంజ్‌లో బన్నీ వార్నింగ్‌ ఇవ్వడంతో తొలి పార్ట్‌ ముగుస్తుంది.&nbsp; పుష్ప తొలి పార్ట్‌ను చాలా ప్రశ్నలతోనే సుకుమార్‌ ముగించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే రెండో పార్ట్‌ చూడాల్సిందే అన్న ఆసక్తిని సగటు ప్రేక్షకుడి కలిగించాడు. దీంతో పుష్ప 2 కథను ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకున్నారు. కేజీఎఫ్‌-2 లాగా పుష్ప సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని జోస్యం చెప్పడం ప్రారంభించారు. వీటన్నింటికిి సుకుమార్‌ చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. పుష్ప 2కు సంబంధించిన 20 సెకన్ల వీడియోను విడుదల చేసి సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు.&nbsp; https://youtu.be/JG-u9rNLq50 ఆసక్తికరంగా గ్లింప్స్ చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌ను బట్టి… హీరో పుష్ప(అల్లుఅర్జున్‌) పై పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్ షెకావత్‌ రివేంజ్‌ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పుష్పను అరెస్టు చేసి తిరుపతి జైలులో బంధించినట్లు కనిపిస్తోంది. పుష్ప జైలు నుంచి తప్పుకోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో పుష్ప మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. పోలీసులు డౌన్‌ డౌన్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తారు. అసలు పుష్ప ఎక్కడ?. అంటూ 20 సెకన్లలో ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే ఏప్రిల్‌ 7th&nbsp; సా. 4.05 ఆగాల్సిందేనని వీడియోలో కనిపిస్తోంది.&nbsp;అయితే తాజాగా రిలీజైన వీడియో పుష్ప 2పై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.&nbsp; పుష్పకు ప్రజాదరణ తొలిపార్ట్‌లో పుష్ప ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగలను తరలించి సిండికేట్‌ సభ్యులను ఆకర్షిస్తాడు. మెుదటి పార్ట్‌లో హీరోకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉండదు. అయితే సెకండ్‌ పార్ట్‌లో పుష్పకు ఫాలోయింగ్‌ ఉన్నట్లు తాజాగా రిలీజైన వీడియోలో చూపించారు. మరి ఒక్కసారిగా పుష్పకు ప్రజల మద్దతు ఎలా పెరిగిందన్న అంశం ఆసక్తిరేపుతోంది. ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బును పుష్ప ఏమైనా ప్రజా శ్రేయస్సుకు ఖర్చు చేసి ఉంటాడా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రజలకు మేలు కలిగించే పనులు చేసి వారి మద్దతు చొరగొన్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కేశవ నమ్మక ద్రోహం? &nbsp; పోలీసుల కళ్లుగప్పి తిరిగే పుష్ప ఎలా అరెస్టయ్యాడనేది ఆసక్తికరం. పుష్పను పోలీసులకు తన ప్రాణ స్నేహితుడు కేశవే పట్టించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఊహిస్తున్నారు. ఇదే సినిమాలో ట్విస్ట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; శ్రీవల్లి క్యారెక్టర్‌ కూడా పుష్పకు దూరమయ్యే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.&nbsp; పుష్ప 2లో ప్రతికారం.. మెుదటి పార్ట్‌లో మంగళం శీను (సునీల్‌), దాక్షాయణి (అనసూయ), జాలిరెడ్డి (ధనుంజయ్‌) డీఎస్పీ గోవిందప్పను పుష్ప చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, మంగళం శీను తన బామ్మర్దిని కోల్పోతాడు. మరి సెకండ్‌ పార్ట్‌లో వారు కూడా షెకవాత్‌తో చేయి కలిపి పుష్పపై పగ తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రజాదరణ పొందిన పుష్పను షెకావత్‌ ఏ కేసులో అరెస్టు చేశాడో తెలియాల్సి ఉంది. మరి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప షెకావత్‌పై ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? శ్రీవల్లి కడవరకు ఉంటుందా?&nbsp; పుష్ప స్నేహితుడు కేశవ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నమ్మకద్రోహం చే &nbsp; తెలియాలంటే పుష్ప-2 చూడాల్సిందే.&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    <strong>Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్‌ ఎంతంటే?</strong>
    Indian 2 Weekend Collections: దారుణంగా పడిపోయిన ‘భారతీయుడు 2’ వసూళ్లు.. వీకెండ్‌ ఎంతంటే?
    కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్‌ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్‌ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోతుందన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్‌ ఎంతంటే? ‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్‌ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్‌కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్‌ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్‌కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.&nbsp; ఇకపై మరింత పతనం! తొలి వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్‌ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్‌ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.&nbsp; డే1 కలెక్షన్స్ ఎంతంటే? ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్‌ రివ్యూస్‌ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి. ఒక్క త‌మిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు క‌లెక్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఈ మూవీ పూర్తిగా విఫ‌ల‌మైందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్‌ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి. ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత! కమల్‌ హాసన్‌ గత చిత్రం 'విక్రమ్‌' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్‌ భారీగా పడిపోయాయి. విక్రమ్‌ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్‌ హాసన్‌ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్‌ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్‌ శంకర్‌ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.&nbsp; అందుకే వసూళ్లు తగ్గాయా? ‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్‌ డేటెడ్‌ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్‌ హాసన్‌) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; కథేంటి చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
    జూలై 15 , 2024
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.&nbsp; అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.&nbsp; అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.&nbsp; కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.&nbsp; 1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.&nbsp; ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.&nbsp; వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.&nbsp; విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.&nbsp;
    మార్చి 22 , 2024
    <strong>Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!</strong>
    Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!
    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్‌ మెుదలు పెట్టారు.&nbsp; ఓటీటీలోనూ వెక్కిరింపే! మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్‌ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్‌ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్‌ బచ్చన్‌’కు కనీస వ్యూస్‌ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్‌ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.&nbsp; దారుణంగా ట్రోల్స్‌ మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్‌ చూడటానికి ఆడల్ట్‌ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్‌ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్‌’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్‌ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/nenuneneh/status/1834511822277234953 https://twitter.com/BalaRTCultFan/status/1834481953619542526 https://twitter.com/koppalapn/status/1834462816470007925 https://twitter.com/IamanMCA/status/1834453046287630562 https://twitter.com/Dynamic_boy_7/status/1834439289717096574 https://twitter.com/BunnyJashu3/status/1834299241700757520 కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
    సెప్టెంబర్ 13 , 2024
    APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!
    APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!
    ఏప్రిల్ 28…. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసొచ్చిన రోజు. టాప్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాయి. ఈ సెంటిమెంట్‌తోనే అఖిల్‌ ఏజెంట్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ, దారుణమైన టాక్‌తో ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ తేదీన అప్పట్లో విడుదలైన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.&nbsp; అడవి రాముడు నందమూరి తారకరామరావు నటించిన అడవి రాముడు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటకు జయప్రద, ఎన్టీఆర్ చేసిన డాన్స్‌ ఇప్పటికీ ఫేమస్. 366 రోజులు థియేటర్లలో ఈ సినిమా ఆడింది. యమలీల కమెడియన్ ఆలీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్‌తో పాటు చిత్రగుప్తుడు, యమధర్మరాజు క్యారెక్టర్లతో కామెడీ పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా 100 రోజులు థియేటర్లలో ఆడింది. అంతేకాదు, ఇందులో నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అంటూ వచ్చే సాంగ్‌ ప్రేక్షకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంది. 1994లో ఏప్రిల్ 28న వచ్చింది.&nbsp; పోకిరి&nbsp; పూరీ జగన్నాథ్, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ కమ్ పోలీస్‌ రోల్‌లో మహేశ్ యాక్షన్ ఇరగదీశాడు. పూరీ మార్క్ డైలాగ్స్‌ యాక్షన్‌తో సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లిపోయింది. రూ. 10 కోట్లు పెట్టి తీస్తే రూ. 66 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో 100 డేస్‌ ఆడింది ఈ సినిమా. ఏప్రిల్ 28, 2006లో విడుదలయ్యింది.&nbsp; బాహుబలి 2 దేశవ్యాప్తంగా బాహుబలి 2 మేనియా కొనసాగింది. ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లను షేక్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో రూ. 1800 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఈ సినిమాతోనే.&nbsp; ఏజెంట్‌ పెద్ద సినిమాలు రిలీజై హిట్‌ కొట్టిన రోజున సెంటిమెంట్‌గా అక్కినేని అఖిల్‌ కూడా ఏజెంట్ సినిమాతో వచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిర్మాతలు ఇలా అనుకుంటున్న కారణంగా డేట్ ఫిక్స్ చేశామని వెల్లడించాడు. కానీ, సరైన కథ లేకపోతే ఏ సెంటిమెంట్ వర్కౌట‌్ కాదు. ఏజెంట్ అట్టర్‌ ప్లాప్ కావటమే ఇందుకు నిదర్శనం.
    ఏప్రిల్ 28 , 2023
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    <strong>Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!</strong>
    Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్‌ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్‌ డైలాగ్స్‌ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్‌ మ్యాన్‌’ ‘టెంపర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్‌ గత చిత్రం ‘లైగర్‌’ (Liger) దారుణంగా ఫెయిల్‌ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) పూరికి క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.&nbsp; ‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’ రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్‌ సినిమా తీస్తే చాలామంది ఫోన్‌ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్‌ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్‌ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్‌. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్‌. నేనేం హెల్ప్‌ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్‌ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు. https://twitter.com/i/status/1822878179679203353 కథ చెప్పాల్సింది కదా! డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్‌ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్‌ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.&nbsp; మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి! ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రామ్‌ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్‌ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. 'మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్‌ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్‌ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్‌ వల్ల నీ ఒపీనియన్‌ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్‌ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్‌ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1822887370594877712
    ఆగస్టు 12 , 2024
    <strong>VD12 Leaked Pic: ‘VD12’ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండ ఫొటో లీక్‌.. నెట్టింట రచ్చ రచ్చ!&nbsp;</strong>
    VD12 Leaked Pic: ‘VD12’ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండ ఫొటో లీక్‌.. నెట్టింట రచ్చ రచ్చ!&nbsp;
    యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో స్టార్‌ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్‌కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్‌ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్‌ దేవరకొండ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; విజయ్‌ పిక్‌ వైరల్‌! విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్‌ సెట్‌ నుంచి విజయ్‌ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్‌పై వెనక కూర్చుని మాస్‌ లుక్‌లో కనిపించాడు. తలపై లైట్‌ హెయిర్‌, ముఖాన గడ్డంతో మెస్మరైజ్‌ చేసేలా అతడి లుక్‌ ఉంది. ఇది చూసిన విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్‌ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/king_ntr9999/status/1815611065381896259 థియేటర్లు బద్దలే! ‘VD 12’ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌ మాస్‌లుక్‌కు అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్‌ లుక్‌ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్‌ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్‌లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207 డ్యుయల్‌ రోల్‌లో రౌడీ బాయ్‌! ‘VD 12’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్‌ పోస్టర్‌ను సైతం అధికారికంగా రిలీజ్‌ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్‌ దేవరకొండ ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్‌ చూస్తే థియేటర్‌లో మాస్‌ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.&nbsp; క్యూట్‌ లవ్‌స్టోరీ! విజయ్‌ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్‌రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.&nbsp;
    జూలై 23 , 2024
    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). పరుశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే మిక్స్‌డ్‌ టాక్ రావడంతో తొలి రోజు కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. విజయ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ డే 1 కలెక్షన్స్ ఈ సినిమాకే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరి వీకెండ్‌కైనా ఈ మూవీ కలెక్షన్లలో పురోగతి వచ్చిందా? శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే? ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ వీకెండ్‌ ముగిసే సరికి భారత్‌లో రూ.11.95 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.5.75 కోట్లు, రెండో రోజు రూ.3.2 కోట్లు, మూడో రోజు రూ. 3 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంపై వస్తోన్న ట్రోల్స్, నెగిటివ్‌ ప్రచారం.. ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.&nbsp; ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 5లక్షలకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్‌ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే. కథేంటి? గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp;
    ఏప్రిల్ 08 , 2024
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; లోయెస్ట్‌ కలెక్షన్స్‌! మిక్స్‌డ్‌ టాక్‌ ఎఫెక్ట్.. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star Day 1 Collections) కలెక్షన్స్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10.60 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకంటిచాయి. భారత్‌లో రూ. 6.6 కోట్ల గ్రాస్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.4 కోట్లు, తమిళనాడు రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రూ.20 లక్షలు రాబట్టినట్లు వివరించాయి. దీంతో&nbsp; విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ నిలిచింది. విజయ్‌ గత చిత్రం ‘ఖుషి’.. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్‌ సాధించడం గమనార్హం. ఓవర్సీస్‌లో దూకుడు! లోకల్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా డాలర్ల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ 4.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఈ వీకెండ్‌లో మరిన్ని డాలర్లు సాధించే దిశగా ‘ఫ్యామిలీ స్టార్‌’ పరుగులు పెడుతోంది.&nbsp; బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? భారీ అంచనాలతో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత డే1 కలెక్షన్స్‌ బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాగా శ్రమించాల్సి ఉంది.&nbsp; ‘ఫ్యామిలీ స్టార్‌’.. కథేంటి గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp; https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 06 , 2024
    Operation Valentine Box Office Collections:&nbsp; ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    Operation Valentine Box Office Collections:&nbsp; ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో.. ఫైటర్‌ పైలెట్‌గా వరుణ్‌ తేజ్‌ మంచి నటన కనబరిచాడు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని అంతా భావించారు. కానీ ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కలెక్షన్స్‌కు ఎంతో కీలకమైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం రూ.6 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.&nbsp; బ్రేక్ ఈవెన్‌ కష్టమే! భారత వైమానిక దళం (Operation Valentine Weekend Collections) ఆధారంగా వచ్చిన తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. దీంతో సహజంగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం విడుదలకు ముందు కూడా మంచి బిజినెస్‌ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. తొలి షోకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ను బట్టి ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంతా భావించారు. అయితే తొలి వీకెండ్‌ వసూళ్లను చూసి మూవీ టీమ్‌ అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. కనీసం బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.&nbsp; 50% దాటని ఆక్యుపెన్సీ! ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని వరుణ్ తేజ్‌ (Varun Tej)తో పాటు చిత్ర యూనిట్‌ చాలా బాగా ప్రమోట్‌ చేసింది. క్రమం తప్పకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్స్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఒకేసారి రిలీజ్‌ చేయడంతో బాలీవుడ్‌లోనూ మేకర్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహించారు. అయితే హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు. ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు (Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది హిందీలో దెబ్బతీసిన ‘ఫైటర్‌’! ఇటీవల హిందీలో హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందిన ‘ఫైటర్‌’ (Fighter) చిత్రం రిలీజైంది. ఈ చిత్రం కూడా భారత వైమానిక దళం కాన్సెప్ట్‌తోనే విడుదలైంది. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. పైగా ఈ రెండు చిత్రాల విడుదలకు పెద్దగా గ్యాప్ కూడా లేకపోవడంతో హిందీలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్’ పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్‌కు తెలుగు, హిందీ భాషల్లో ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిరాశనే మిగిల్చింది. సినిమాను అవే దెబ్బతీశాయా? ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ సెట‌ప్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో యాక్టింగ్ బాగున్నా.. కథలో స్ట్రాంగ్ ఎమోష‌న్ క‌నిపించ‌దు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను స‌క్సెస్ చేయ‌డంలో వైమానిక ద‌ళం ప‌డిన క‌ష్టాన్ని పైపైన చెప్పిన‌ట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ల‌వ్‌స్టోరీ సైతం స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామ‌న్ ఆడియెన్స్‌కు చాలా వరకు అర్థం కాలేదు. గ్రాఫిక్స్ విష‌యంలో కూడా అక్క‌డ‌క్క‌డ కాంప్ర‌మైజ్ అయిన‌ట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; త్వరగానే ఓటీటీలోకి! ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కా (Matka)లో నటిస్తున్నాడు. సాక్నిక్‌ లెక్కల ప్రకారం ఇదిలా ఉంటే 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' కలెక్షన్స్‌ వివరాలను ప్రముఖ సినిమా వెబ్‌సైట్‌ 'సాక్నిక్‌' వెల్లడించింది. దాని ప్రకారం వరుణ్ తేజ్‌ సినిమా కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ - రూ.4.42 కోట్లు హిందీలో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ -రూ. 1.29 కోట్లు దేశవ్యాప్తంగా మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ. 5.71 కోట్లు ఓవర్సీస్‌లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ.0.25కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్స్ వసూళ్లు - రూ.6 కోట్లు
    మార్చి 04 , 2024
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    బాలీవుడ్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'దంగల్‌'లో బాల నటిగా చేసిన ‘సుహాని భట్నాగర్’ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. https://twitter.com/kadak_chai_/status/1758784936247746905?s=20 కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి.&nbsp; సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సుహానీ ఈ ఉదయం ప్రాణాలు విడిచింది.&nbsp; సుహానికి సంబంధించిన అంత్యక్రియలను ఫరిదాబాద్‌ సెక్టార్‌ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. సుహానీ 2016లో వచ్చిన ‘దంగల్‌’ (Dangal) సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అమీర్‌ఖాన్‌తో పాటు కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్‌కు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది.&nbsp; ఈ సినిమా తరువాత ఈ ఫాతిమా, సన్యాస, సుహానిలకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్‌ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకున్నారు.&nbsp; కానీ సుహాని (Suhani Bhatnagar) మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై చదువులో బిజీ అయ్యింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను సుహాని పలకరిస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని వారితో పంచుకునేది.&nbsp; ఈ క్రమంలో సుహాని పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్‌, అందం చూసి ఆశ్చర్యపోయేవారు.&nbsp; సుహాని అందాన్ని కచ్చితంగా వెండితెరపై చూడాల్సిందేనని బాలీవుడ్ ఆడియన్స్‌ భావించారు. ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ ఎదురైంది.&nbsp; సుహాని అకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు. https://twitter.com/i/status/1714234869629558869 జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714263091029107087 పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు. https://twitter.com/bharatidubey/status/1714279017837474231 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714256005079704005 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్నారు. https://twitter.com/i/status/1714253448215228480 ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు. https://twitter.com/i/status/1714255504153993419 టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు. https://twitter.com/i/status/1714253832241422699 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్‌ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం. https://twitter.com/i/status/1714266870713647487 టాలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714230631885062219 జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714224832316080266 ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714218637362659515 జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్‌, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం. https://twitter.com/alluarjun/status/1714300482934751553
    అక్టోబర్ 18 , 2023
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:&nbsp; అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.&nbsp; ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.&nbsp; విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!</strong>
    Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!
    నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్‌ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ట్రైలర్‌ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దేవర ట్రైలర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మార్క్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. కొన్ని డైలాగ్స్‌ చాలా బాగా పేలాయి.&nbsp; ట్రైలర్‌ రిలీజ్‌..! ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మొత్తం 2 నిమిషాల 39 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌ు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం ఈ ట్రైలర్‌ యాక్షన్‌తో నిండిపోయింది. ఇందులో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo ఎలా సాగిందంటే? ట్రైల‌ర్‌ను పరిశీలిస్తే ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; ట్రైలర్‌లో అవే హైలెట్స్‌! ట్రైలర్‌ చూశాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ తెగ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కూడా చాలా క్యూట్‌గా పల్లెటూరి పిల్లగా కనిపించింది. 'వాడికి వాడి అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే' అని తారక్‌ను జాన్వీ కపూర్ అంటుంది. దీంతో ఎన్టీఆర ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ ఆకట్టుకుంది. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అటు ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో మరో లెవల్లో ఉంటాయని ట్రైలర్‌ని బట్టే తెలిసిపోతుంది. అనిరుధ్‌ మార్క్‌ బీజీఎంతో సెప్టెంబర్‌ 27న థియేటర్లు మోతమోగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌!</strong>
    Bhagyashri Borse: పాన్ ఇండియా ఆఫర్‌ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్‌ వచ్చిన తగ్గని క్రేజ్‌!
    టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు తొలి చిత్రంతోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్‌ ఫిల్మ్‌ మిస్టర్ బచ్చన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ భామకు మంచి ఫ్యూచర్‌ ఉంటుందంటూ కితాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి మరో బంపరాఫర్‌ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. భాగ్యశ్రీ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కాంత’ (Kaantha) ఒకటి. ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా సినీ లవర్స్‌ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అంతేకాదు పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే దీని రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 1950 నేపథ్యంలో.. కాంత మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ మూవీకి టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ ఫస్ట్‌ క్లాప్‌ కొట్టారు. కాగా, ఈ చిత్రాన్ని 1950 మద్రాసు నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్ర ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. భాగ్యశ్రీకి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందని అంటున్నారు. వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే మెుదలవుతుందని ఫిల్మ్‌ వర్గాలు తెలియజేశాయి.&nbsp; ఏమాత్రం తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; విజయ్‌ దేవరకొండ మూవీలోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;</strong>
    Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌ తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్‌ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌! తారక్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ 'ఫియర్‌' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’&nbsp; నుంచి రెండో పాట రిలీజ్‌ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్‌, జాన్వీ కపూర్‌ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతూ మరింత దూసుకెళ్తోంది.&nbsp; పెద్ద ఎత్తున ట్రోల్స్‌! 'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాట సోప్‌ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్‌ యాడ్‌ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. అటు మీమ్స్‌ పేజెస్‌ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌ ట్యూన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్‌ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్‌ ఒకే సమయంలో పాజిటివ్‌, నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకొని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; స్ట్రాంగ్‌ కౌంటర్‌ దేవర సెకండ్‌ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్‌ మాత్రం సూపర్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్‌..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1820689638714998854 ‘దేవర’ వచ్చేస్తునాడు..! ‘దేవర’ మూవీ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
    ఆగస్టు 07 , 2024

    @2021 KTree