UATelugu2h 46m
తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి పాల్ అట్రీడియస్ తప్పించుకొని తల్లితో పాటు అరాకిస్ గ్రహానికి పారిపోతాడు. కొన్ని పరిణామాలతో అక్కడి ఫ్రెమెన్ తెగకు రక్షకుడిగా మారతాడు. ఆ తెగకు హార్కొనెన్ తెగ నుంచి ముప్పు ఎదురవుతుంది. తన తండ్రిని చంపింది ఆ తెగకు చెందిన వారేనన్న నిజం పాల్‌కు తెలుస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? ఎలా రీవేంజ్ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్JioCinemaఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Kannada, Tamil, English )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
జెండయా
రెబెక్కా ఫెర్గూసన్
జోష్ బ్రోలిన్
ఫ్లోరెన్స్ పగ్
డేవ్ బటిస్టా
జేవియర్ బార్డెమ్
సిబ్బంది
డెనిస్ విల్లెనెయువ్దర్శకుడు
మేరీ పేరెంట్
నిర్మాతకాలే బోయ్టర్
నిర్మాతపాట్రిక్ మెక్‌కార్మిక్నిర్మాత
తాన్య లాపాయింట్నిర్మాత
హన్స్ జిమ్మెర్
సంగీతకారుడుజో వాకర్ఎడిటర్ర్
కథనాలు
Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
40 ఏళ్ల తర్వాత..
కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.
కమల్ లుక్ కష్టాలు..
‘కల్కి 2898 ఏడీ’ కమల్ హాసన్ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్ ఫైనల్ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే మేకప్ నిపుణులను కల్కి టీమ్ సంప్రదించట. అలా కమల్ హాసన్ ప్రస్తుత లుక్ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.
మేకప్‌కు కోసం 5 గంటలు
కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్ మేకప్ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
బుజ్జి కోసం రూ.4 కోట్లు
‘కల్కి’లో ప్రభాస్ రైడ్ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
700VFX షాట్స్
కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్ అనే మూడు ఫ్యూచరిక్ ప్రపంచాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించినట్లు సమాచారం.
హాలీవుడ్ యంత్రాంగం
‘కల్కి 2898 ఏడీ’ విజువల్ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్ వస్తోంది. హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్, ఇంటర్‌స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్ ‘కల్కి’ కోసం పనిచేసింది.
రికార్డు స్థాయి బడ్జెట్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట.
https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
జూన్ 27 , 2024
LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
బడ్డీ
చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
శివం భజే
యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది.
ఉషా పరిణయం
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.
తిరగబడర సామి
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్, డ్యూన్ పార్ట్ 2, కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి.
PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
జూలై 29 , 2024
Venom 3 Review In Telugu: యాక్షన్ సీక్వెన్స్‌లో టాప్ నాచ్.. ‘వెనమ్ 3’ ఎలా ఉందంటే?
నటీనటులు : టామ్ హార్డీ, ఆండీ సెర్కిస్, చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు
దర్శకత్వం : కెల్లి మార్సెల్
సినిమాటోగ్రఫీ : ఫబియన్ వాగ్నర్
ఎడిటింగ్ : మార్క్ సంగర్
సంగీతం : డ్యాన్ డీకాన్
నిర్మాతలు : అవి అరద్, మ్యాట్ టాల్‌మచ్, కెల్లీ మార్సెల్, టాప్ హార్డీ
విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024
హాలీవుడ్ చిత్రాల్లో 'వెనమ్' సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సూపర్ హీరో చిత్రాలను బాగా ఇష్టపడే వారిని 'వెనమ్' సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. తాజాగా వాటికి కొనసాగింపుగా 'వెనమ్ 3' థియేటర్లలోకి వచ్చింది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ (Venom: The Last Dance) పేరుతో అక్టోబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ టామ్ హార్డీ కథానాయకుడిగా చేశాడు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. మరి పార్ట్ 3 కూడా ప్రేక్షకులను మెప్పించిందా? అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో విజువల్ వండర్‌గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
‘వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మూడో పార్ట్ మెుదలవుతుంది. వెనమ్‌తో విడిపోయిన తర్వాత ఎడ్డీ బ్రాక్ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు. మరోవైపు వెనమ్‌ని కూడా తన గ్రహానికి చెందిన వాసులు వెంటాడుతూ ఉంటాయి. ఇంతలో వీరిద్దరికీ ఒక కొత్త ప్రమాదం ఎదురవుతుంది. వేరే లోకంలో బంధించి ఉన్న నల్ (ఆండీ సెర్కిస్) అనే సూపర్ విలన్ విడుదలకు అవసరమైన ఒక ఎలిమెంట్ వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. దీంతో నల్ సైన్యం కూడా వీరి వెంట పడుతుంది. నల్ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే ఎడ్డీ, వెనమ్‌ల్లో ఒకరు మరణించాలి. లేదంటే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్డీ, వెనమ్ ఏం చేశారు? నల్‌ను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
వెనమ్ 3 మూవీలో టామ్ హార్డీ వన్ మ్యాన్ షో చేశాడు. ఎడ్డీ బ్రాక్ పాత్రలో మరోమారు చక్కగా ఒదిగిపోయాడు. లేని వెనమ్‌ని ఊహించుకుని దాంతో కెమిస్ట్రీని పండించడం మామూలు విషయం కాదు. గత చిత్రాలలో లాగానే ఇందులోనూ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపాడు. ఎంతో సాహసోపేతంగా ఫైట్స్ చేసి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. నల్ పాత్రలో ఆండీ సెర్కిస్ కూడా ఆకట్టుకున్నాడు. చివెటెల్ ఎజియోఫోర్, జునో టెంపుల్, పెగ్గీ, రీస్ ఇఫాన్స్, క్రిస్టో ఫెర్నాండెజ్, స్టీఫెన్ గ్రాహమ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.
https://twitter.com/VenomMovie/status/1834215396595101934
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కెల్లి మార్సెల్ తొలి రెండు భాగాలు తరహాలోనే ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చిత్రాన్ని కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించారు. ప్రారంభంలో ఫ్లైట్ యాక్షన్ సీన్‌తో సినిమాను మెుదలపెట్టిన దర్శకుడు ఆ జోరు చివరకూ కొనసాగించాడు. మూడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. 20 నిమిషాల పాటు సాగే ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. ఒక పెద్ద శత్రువు కోసం వెనమ్, ఇతర సింబియోట్లు, మిలటరీ అందరూ కలిసి చేసే పోరాటం అలరిస్తుంది. అయితే వెనమ్ సిరీస్‌లో ఈ మూవీనే లాస్ట్ అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎడ్డీ, వెనమ్ బాండింగ్‌ను హైలెట్ చేస్తూ ఎమోషనల్ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక్క సీన్ మాత్రం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా తప్పక అలరిస్తుంది.
https://twitter.com/VenomMovie/status/1846663977784562073
టెక్నికల్‌గా
సాంకేతిక విషయాలకు వస్తే వీఎఫ్‌ఎక్స్ టీమ్ అద్భుత పనితీరు కనబరిచిది. విజువల్ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టామ్ హార్డీ నటనయాక్షన్ సీక్వెన్స్‌వీఎఫ్‌ఎక్స్ వర్క్
మైనస్ పాయింట్స్
కొరవడిన ఎడ్డీ, వెనమ్ బాండింగ్‌కథలో డ్రామా లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Spirit Updates: ‘స్పిరిట్’పై దిమ్మతిరిగే బజ్.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. విలన్‌గా ఆమె భర్త!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ‘స్పిరిట్’కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
హీరోయిన్ ఎవరంటే?
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయినా కరీనా కపూర్ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రభాస్ విలన్ మళ్లీ రిపీట్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్ అలీఖాన్ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్ ప్రకారం సైఫ్ అలీఖాన్ ఇందులోనూ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ పాత్రలో సైఫ్ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్.. సైఫ్ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
స్పిరిట్ బడ్జెట్ అన్ని కోట్లా?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా. అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్ సినిమాల బడ్జెట్ వందల కోట్లతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా చిత్రానికి సంబంధించి ఓ వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో స్పిరిట్ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం మేకర్స్ రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో కలిసి డైరెక్టర్ సందీప్ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ రూ.700 కోట్ల బడ్జెట్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యే వచ్చిన కల్కి రూ.600 కోట్లతో సెకండ్ ప్లేస్ సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రాబోతున్న మూడో ఫిల్మ్‌గా ‘స్పిరిట్’ నిలవనుంది.
సెప్టెంబర్ 18 , 2024
Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే స్క్రీన్స్‌పై చూసేవాళ్లకు రియల్‌గా అనిపిస్తుంటుంది. యాక్షన్ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరుశురాముడిగా ప్రభాస్!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్‌కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్‌ను కూడా కలిసినట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
విలన్స్‌గా స్టార్ కపుల్స్
‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్’లో కరీనా కపూర్ సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్ లైఫ్‌లో కపుల్స్ అయిన కరీనా, సైఫ్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్స్‌గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ డ్యూయల్ రోల్స్ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 10న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్‌తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
సెప్టెంబర్ 28 , 2024
SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
‘ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అది చూసిన మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
మహేష్ ద్విపాత్రిభినయం!
లేటెస్ట్ బజ్ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
SSMB29 కథకు ప్రేరణ అతడే!
మహేష్ - రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నాని స్పెషల్ రోల్..!
'SSMB 29' గురించి మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నాని (Nani) ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.
శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు!
ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్ అంటే సెట్స్ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
https://telugu.yousay.tv/ssmb-29-is-this-mahesh-babus-final-look-in-rajamoulis-film.html
మార్చి 12 , 2024
Spirit Updates: ‘స్పిరిట్’పై అధికారిక అప్‌డేట్స్.. రెండు సాంగ్స్ రెడీ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్ హిట్ కాగా, సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై చాలా గాసిప్స్ ఉన్నప్పటికీ అఫిషియల్‌గా ఏ ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్పిరిట్ నిర్మాత.. మూవీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
‘2026 మిడిల్‌లో రిలీజ్’
సందీప్ రెడ్డి గత చిత్రం 'యానిమల్'ను నిర్మించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ‘స్పిరిట్’ను సైతం ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన టీ సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' గురించి తొలిసారి స్పందించారు. ప్రభాస్ 'స్పిరిట్' చిత్రాన్ని డిసెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలోనే ముహోర్తం షాట్ ఉంటుందని చెప్పారు. 2026 మిడిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్టోరీ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే స్పిరిట్ సాంగ్స్ గురించి కూడా ఆయన వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. తాను రెండు సాంగ్స్ విన్నానని, అవి బాగున్నాయని వివరించారు. కాగా, యానిమల్‌కు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్‌కు సైతం మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఇటీవల హర్షవర్దన్ కంపోజ్ చేసిన సాంగ్‌ను సందీప్ రెడ్డి వింటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
https://twitter.com/Fukkard/status/1856301078016303591
View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar)
రాజా సాబ్‌పై ప్రశంసలు..
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్' (The Raja Saab) సినిమాపై కూడా నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు. తాను రాజా సాబ్ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ చూశానని, విజువల్స్ అద్భుతంగా వచ్చాయని ప్రశంసించారు. హాలీవుడ్ సినిమా 'హ్యారీ పోటర్'ను తలపించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని ఆకాశానికెత్తారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. ప్రభాస్ ఓల్డ్ లుక్‌కు సంబంధించి ఇటీవల ఓ పోస్టర్ సైతం రిలీజైంది. ఇందులో ప్రభాస్ డెవిల్ అట్మాస్పియర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.
తొలుత పోలీసు.. తర్వాత!
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది. దాని ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్’కు మించిన వైలెన్స్, ఫైట్ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్’లో చూస్తారని అంటున్నారు. దీంతో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
భారీ బడ్జెట్‌తో..
స్పిరిట్ చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది. బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్.
నవంబర్ 13 , 2024
Spirit Updates: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్ చేశావ్ సందీప్ మామా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ గత చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ బయటకొచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్!
‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ రోల్‌లో కనిపించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్‌తో సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు చిరు సానుకూలంగా స్పందిస్తే స్పిరిట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం స్పిరిట్‌లో మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర కూడా ఎంతో కీలకం కానుందని అంటున్నారు. వీటిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్, చైనీస్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.
షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అవి తుది దశకు చేరుకోవడంతో నవంబర్ నుంచి షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి వంగా తొలుత భావించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్ కూడా జరుపుకుంటున్నాయి. ప్రభాస్ ఆయా చిత్రాలకు డేట్స్ కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ వీక్‌లో స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సందీప్ రెడ్డి వంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికీ రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పాటు ఫౌజీ 50% పైగా షూటింగ్ ఫినిష్ చేసుకుంటుంది. దీంతో ప్రభాస్ షూటింగ్స్ పరంగా కాస్త ఫ్రీ అవుతాడని సందీప్ భావిస్తున్నారట. అంతేకాదు ప్రభాస్ ఫోకస్ మెుత్తం స్పిరిట్ పైనే ఉండేలా సందీప్ వంగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా జనవరి ఫస్ట్ వీక్‌లో స్పిరిట్ పూజ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. సంక్రాంతి తర్వాత నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని లేటెస్ట్‌గా అప్‌డేట్ అందుతోంది.
బడ్టెట్ తెలిస్తే షాకే!
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది.
ప్రభాస్‌కు రికార్డు రెమ్యూనరేషన్!
‘స్పిరిట్’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఎందుకంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. ఇదే నిజమైతే రూ.300 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్ (Anil Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపుర్ (Kareena Kapoor) ఇందులో స్పెషల్ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 09 , 2024
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్ రిలీజ్ చేసిన దేవర టీమ్ మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్‌నూ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తారక్ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూయల్ అంటే ఫసక్కేనా!
‘దేవర’ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్’ కేవలం రెండు కోట్ల మార్జిన్ (రూ.28 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. అయితే తారక్ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.
‘దేవర’ హిట్ కష్టమేనా!
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్ చెక్ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్!
తారక్ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడే ప్రమాదం ఉంది.
దేవర ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.
https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
సెప్టెంబర్ 11 , 2024
SSMB29 Cast: రాజమౌళి బిగ్ ప్లాన్.. నెగిటివ్ రోల్‌లో మహేష్.. ఆ రోజున అధికారిక ప్రకటన!
ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేష్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) సినిమా ఒకటి. గ్లోబల్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద ఎత్తున అప్‌డేట్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా ‘SSMB29’కు సంబంధించిన మరిన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ ద్విపాత్రాభినయం
లేటెస్ట్ బజ్ ప్రకారం ‘SSMB29’ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు. మహేష్ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్ రోల్ చేయలేదు. అయితే తొలిసారి రాజమౌళి అతడ్ని డ్యూయల్ రోల్‌లో చూపించబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఇందులోని ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. ఇదే నిజమైతే ‘SSMB29’పై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని చెప్పవచ్చు. మహేష్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఫుల్ మీల్స్‌లా మారనుంది.
https://twitter.com/MovieTamil4/status/1810544815492432380
అధికారిక ప్రకటన ఆ రోజే!
'SSMB29' సంబంధించి హీరో మహేష్‌బాబు మినహా ఏ ఇతర నటీనటులను దర్శకుడు రాజమౌళి ప్రకటించలేదు. కనీసం ఇప్పటివరకూ సినిమా లాంచింగ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం చురుగ్గా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'SSMB29' సినిమాపై అధికారిక ప్రకటన ఉండొచ్చని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావడంతో పుట్టిన రోజు కానుకగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో మహేష్ లుక్‌కు సంబంధించిన పోస్టర్ వస్తుందా? ఏదైనా ప్రీవిజువల్ టీజర్ ఉంటుందా? అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
మూవీ టీమ్‌లోకి నాజర్!
తాజాగా మరో ఆసక్తికర వార్త కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబుతో పాటు పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్ షాప్‌లో నాజర్ పాల్గొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో మహేష్ బాబుకు ఆయన విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలకు కూడా నాజర్ ఇదే తరహా సేవలు అందించారు. ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా సంభాషణలు ఎలా పలకాలో ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు నేర్పించారు. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు అయిన నాజర్ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన బాహుబలిలోనూ బిజ్జలదేవగా తన ఎవర్‌గ్రీన్ నటనతో నాజర్ ఆకట్టుకున్నారు.
https://twitter.com/Fukkard/status/1810503350913585650
విలన్‌గా మలయాళ స్టార్!
ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబును ఢీకొట్టే ప్రతినాయకుడి కోసం ఆయన చేస్తున్న కసరత్తు దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 'SSMB29'లో విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండొచ్చని అంటున్నారు. కాగా, ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన ‘సలార్’లోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేశారు. తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సలార్ ప్రమోషన్స్ సందర్భంగా చేసిన ఇంటర్యూలో పృథ్వీరాజ్ నటనపై రాజమౌళి ప్రసంశలు కురిపించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.
మహేష్ లేటెస్ట్ లుక్ వైరల్!
ఇటీవల మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్ నుంచి మహేష్ బయటకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో మహేష్ పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్ పెట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. ఇది కచ్చితంగా ‘SSMB29’లో మహేష్ లుక్ అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి చిత్రం కోసం మహేష్‌బాబు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/i/status/1809857211088212096
జూలై 09 , 2024
Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్.. ప్రభాస్, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr. NTR) నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం, తారక్ డ్యూయల్ రోల్‌లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని లెక్కలు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ సినిమాల కంటే వెనకే!
లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్ కెరీర్‌లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్‌లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్‌లో బన్నీ, తారక్‌కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు.
ప్రీరిలీజ్ బిజినెస్ అంచనాలు ఇవే!
లేటెస్ట్ బజ్ ప్రకారం దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్‌ను రూ.33 కోట్లకు టి సిరీస్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
‘దేవర’ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్ పార్ట్‌కే ఈ స్థాయిలో బిజినెస్ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఫిల్మ్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 16 , 2024
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
డ్యాన్స్‌కు కేరాఫ్!
‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్-15 సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రగులుతోంది మొగలిపొద (ఖైదీ)
చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్ ఓసారి మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q
చక్కని చుక్క (పసివాడి ప్రాణం)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్ ద్వారానే చిరు బ్రేక్ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.
https://www.youtube.com/watch?v=q5aetbezCqM
నవ్వింది మల్లె చెండు (అభిలాష)
‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది.
https://www.youtube.com/watch?v=82hUDmPYazk
హే పాప (త్రినేత్రుడు)
‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్ చేసింది.
https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y
పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)
‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ క్లాప్ అంటూ సాంగ్‌ను స్టార్ట్ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=fsnOGypjHI0
గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k
స్టార్ స్టార్ మెగాస్టార్ (కొదమ సింహం)
కొదమ సింహం సినిమాలోని 'స్టార్ స్టార్ మెగాస్టార్' సాంగ్ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్ వేయలేదు.
https://www.youtube.com/watch?v=cFKyIHvudzI
బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk
రూపుతేరా మస్తానా (రిక్షావోడు)
రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్ బీట్‌ను మ్యాచ్ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=mugdo_VO9pY
నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=j2HY4G63qaE
ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)
ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్ చేసి భుజాలు ఎగరేసే స్టెప్ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్ చుట్టుకొని మాస్ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.
https://www.youtube.com/watch?v=oppz5I9KeQA
దాయి దాయి దామ్మ (ఇంద్ర)
‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=39W78Hp4E8A
ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)
‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.
https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY
మన్మథ మన్మథ (ఠాగూర్)
వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్ మెస్మరైజ్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)
‘ఖైదీ నెంబర్ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
సెప్టెంబర్ 23 , 2024
HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్ ఒకరు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం.
శ్రియా శరణ్ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్ చేశారు.
2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది.
తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.
రామ్‌చరణ్, తారక్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్ రోల్‌లో నటించింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.
గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్ స్కూల్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్‌గా ‘షోటైమ్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్ పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్ వీడియోలలోనూ శ్రియా శరణ్ మెరిసింది. 'తిరకటి క్యూన్ హవా', 'కహిన్ దూర్', 'రంగ్ దే చునారియా', 'బరి బరి సాంగ్' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.
ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్.. నీల్ మామ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా!
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం తారక్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ‘NTR 31’ ప్రాజెక్ట్‌లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
డ్యూయల్ రోల్‌లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
నర రూప రాక్షసుడిగా..!
'NTR 31' చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఓ పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అతడు నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. తారక్ పాత్రను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరికొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.
డ్రాగన్ టైటిల్ ఫిక్స్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
రూ.300 కోట్ల ఖర్చుతో..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
‘దేవర’ రిలీజ్ ఎప్పుడంటే?
క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
జూలై 26 , 2024
Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా..
1. నకిలీ మనిషి (1980)
చిరంజీవి తొలిసారి 'నకిలీ మనిషి' చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు.
2. బిల్లా రంగా (1982)
ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
3. రోషగాడు (1983)
చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్ స్మిత నటించారు.
4. సింహపురి సింహం (1983)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.
5. జ్వాల(1985)
రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు.
6. రక్త సింధూరం (1985)
రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు.
7. దొంగమొగుడు (1987)
ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు.
8. యముడికి మొగుడు (1988)
రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో మెప్పించారు.
9.రౌడీ అల్లుడు (1991)
కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.
10. ముగ్గురు మొనగాళ్లు (1994)
ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి... పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. రిక్షావోడు (1995)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు.
12. స్నేహం కోసం (1999)
కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది.
13. అందరివాడు (2005)
చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
14. ఖైదీ నంబర్ 150 (2017)
ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.
నవంబర్ 10 , 2023
Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది.
కేజీఎఫ్‌తో సలార్ లింక్
సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చూపించారు. అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు.
అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
ఫ్యాన్స్ రచ్చ రచ్చ
మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
సలార్‌తో నడిచేది వీరే..
ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
జూలై 06 , 2023
Spirit Movie: ‘స్పిరిట్’ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్!
‘యానిమల్’ (Animal) చిత్రంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్ స్కిల్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో సందీప్ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ ‘యానిమల్’తో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా స్పిరిట్ నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారీ బడ్జెట్‌తో..
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది.
రెమ్యూనరేషన్లకే రూ.600 కోట్లు!
‘స్పిరిట్’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఎందుకంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. అదే విధంగా బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్ (Anil Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపుర్ (Kareena Kapoor) ఇందులో స్పెషల్ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మేకింగ్ కోసం రూ.300 కోట్లు, గ్రాఫిక్స్ కోసం రూ.120-150 కోట్లు, ప్రమోషన్స్‌కు మరో రూ.50-80 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
మమ్ముట్టీ స్పెషల్ రోల్!
‘స్పిరిట్’ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్, చైనీస్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.
పోలీసు vs మాఫియా డాన్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. డాన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్. మరోవైపు ప్రభాస్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’ సిరీస్‌లోనూ డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’లోనూ ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
అక్టోబర్ 08 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024
New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
[toc]
జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్
జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.
బాద్‌షా
బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్' హేయిర్ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ యూత్ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
జనతా గ్యారేజ్
ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.
టెంపర్
ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్ ప్యాక్ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్(Spiked hairStyle) స్టైల్‌తో కనిపించాడు.
యమదొంగ
యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
నాన్నకు ప్రేమతో
ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది.
జై లవకుశ
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు.
దేవర
పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్ ‘దేవర’ సినిమాలో డ్యూయల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు.
మహేష్ బాబు హేయిర్ స్టైల్స్
బాబి
తన కెరీర్ ప్రారంభంలో మహేష్ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు.
పోకిరి
పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
సైనికుడు
ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు.
అతిథి
అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు
వన్ నేనొక్కడినే
ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
SSMB29
‘SSMB 29 నేపథ్యంలో మహేష్ షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.
సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్
డీజే టిల్లు& టిల్లు స్కేర్
డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా. ఈ హెయిర్ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్ అని పిలుస్తారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్
భద్రినాథ్
ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది. మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు.
అల వైకుంఠపురములో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్ బాటమ్‌లో వేవీ హెయిర్ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు.
హ్యాపీ
హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.
దువ్వాడ జగన్నాథం
ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs)
సరైనోడు
ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్ పేరు పొంపాడర్ హేయిర్ లుక్
(Pompadour)
బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్
అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్ స్టైల్ బన్నీ ఫెవరెట్ అని తెలిసింది.
రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్
గోవిందుడు అందరివాడేలే
ఈ చిత్రంలో రామ్ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు.
గేమ్ ఛేంజర్
లెటేస్ట్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ గెల్డ్ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు.
రామ్ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్
రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు.
మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.
కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు.
విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్
లైగర్
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు.
ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు.
డియర్ కామ్రెడ్
డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఖుషి
ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
ఫ్యామిలీ స్టార్
ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు.
రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్
స్కంద
ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్ స్టైల్ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు.
ఇస్మార్ట్ శంకర్
ఈ చిత్రంలో రామ్ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్ ట్రెండ్ సెట్ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది.
మే 22 , 2024
Game Changer Story: షాకింగ్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కథ లీక్.. ఆందోళనలో రామ్ చరణ్ ఫ్యాన్స్!
'ఆర్ఆర్ఆర్' (RRR) వంటి గ్లోబల్ స్థాయి సక్సెస్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్.. ఈ కథను లీక్ చేయడం గమనార్హం.
కథ ఏంటంటే?
మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్ ఛేంజర్ ప్లాట్‌ను అమెజాన్ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
వామ్మో ఏకంగా అన్ని కోట్లా!
‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ నిలవనుంది.
గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఆమె తండ్రి బోని కపూర్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/1012_raj/status/1770365882738573469
ఆ రోజున డబుల్ ధమాకా!
మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్ యూనిట్ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ లభించనుంది.
మార్చి 20 , 2024