• TFIDB EN
  • ఈగల్ (2024)
    U/ATelugu

    సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. ఓ రోజు అతడు మిస్‌ అవుతాడు. సహదేవ్‌పై ఓ జర్నలిస్టు (అనుపమా) కథనం రాయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అతడి కోసం ఏకంగా సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఇంతకి సహదేవ్‌ గతం ఏంటి? అతడు ఏం చేేసేవాడు? చివరికి ఏమైంది? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvApp
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @isma5525604790

    Good Movie for Ravi Teja Fans

    Ravi Teja Fans will like this move and his histronics.

    2 months ago

    సిబ్బంది
    టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
    వివేక్ కూచిభొట్లనిర్మాత
    దావ్జాండ్సంగీతకారుడు
    కథనాలు
    Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
    Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు : రవితేజ, కావ్య థాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌, మధు, వినయ్‌ రాయ్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, ప్రణీత పట్నాయక్‌, అజయ్‌ ఘోష్‌, నితిన్‌ మెహతా, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: దావ్‌జాంద్ సినిమాటోగ్రఫీ: కార్తీక్, కమిల్ ప్లాకి, కర్మ చావ్లా నిర్మాతలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. విడుదల తేది: 09-02-2024 రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా (Eagle Movie Review) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? అనుపమ, కావ్య తమ అందాలతో ప్రేక్షకులను అలరించారా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తలకోన అడవిలోని ఓ గిరిజన తండాలో జీవించే సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. అనుకోకుండా ఓ రోజు అతడు మిస్‌ అవుతాడు. ఓ విషయాన్ని అన్వేషిస్తూ ఆ తండాకు వచ్చిన క్రైమ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు నళిని రావు (అనుపమా పరమేశ్వరన్‌) దృష్టి అతడిపై పడుతుంది. అతడి అదృశ్యంపై ఓ ఆర్టికల్‌ రాయగా వెంటనే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? ఎక్కడికి వెళ్లాడు? అతని గురించి పేపర్లో చూసి సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సహదేవ్ భార్య రచన (కావ్య)కి ఏమైంది? అక్రమ ఆయుధాలతో హీరోకు ఉన్న సంబంధం ఏంటి? ఈ లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే మాస్‌ మహారాజ్‌ రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్‌ వర్మ పాత్రలో నటించాడు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినప్పటికీ స్టైలిష్‌ లుక్‌తో కళ్లతోనే తన హావభావాలను పలకించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి పాత్రే దక్కింది. నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ సినిమా మెుత్తం ఆమెనే కనిపిస్తుంది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ తమ కామెడీ ట్రాక్‌తో నవ్వించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. గన్‌ కల్చర్‌ను ప్రధానాంశంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించారు. రవితేజకు కేజీఎఫ్‌ స్థాయిలో ఎలివేషన్స్‌ ఇచ్చిన తీరు బాగుంది. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్‌లో చూపించి ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్‌. అయితే రవితేజ మార్క్‌ కామెడీని ఆశించే వారికి ఈ సినిమా నిరాశనే మిగిలిస్తుంది. సినిమా మెుత్తం మాస్‌ మాహారాజ్‌ సిరియస్‌ లుక్‌లోనే కనిపిస్తాడు. మరోవైపు సినిమాను చాప్టర్లుగా విడగొట్టి చూపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపించినా ఓవరాల్‌గా సినిమా మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలాగే ఉంటుంది. టెక్నికల్‌గా.. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు కూడా ‘ఆడు మచ్చ’, ‘గల్లంతు’ వంటివి వినడానికే కాదు విజువల్‌గా కూడా బాగున్నాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోవాల్సిందే. ప్లస్‌ పాయింట్స్ రవితేజ నటనహీరో ఎలివేషన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ సాగదీతలాజిక్‌కు అందని సీన్లు రేటింగ్‌: 3/5
    ఫిబ్రవరి 09 , 2024
    Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
    Eagle Movie: ‘ఈగల్‌’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
    మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), కావ్యా థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్‌ మరింత పెరిగింది.  ‘ఈగల్’ క్లైమాక్స్‌.. నెవర్‌ బిఫోర్‌! తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన 'ఈగల్' నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈగల్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.  టికెట్‌ రేట్లు సాధారణమే.. గత కొంతకాలంగా స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే టికెట్‌ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్‌’ (Eagle) చిత్రం మాత్రం టికెట్‌ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్‌ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ‘ఈగ‌ల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌! ఇక ఈగల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.21 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఏపీ, తెలంగాణ‌లో క‌లిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్ల‌కు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌ర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ఇత‌ర రాష్ట్రాలు కలిపి మ‌రో రూ.2 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్‌ రిలీజ్ అవుతోంది. తగ్గిన రవితేజ మార్కెట్‌! రవితేజ రీసెంట్‌ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’తో పోలిస్తే ‘ఈగల్‌’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్‌ నాగేశ్వరరావు థియేట్రిక‌ల్ హ‌క్కులు గతంలో రూ.37 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ర‌వితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగ‌ల్’ మాత్రం రూ.16 కోట్లు త‌క్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా చూస్తే మాత్రం ర‌వితేజ టాప్-5 చిత్రాల్లో ఒక‌టిగా ఈగ‌ల్ నిలిచింది. రావ‌ణాసుర‌, ఖిలాడి సినిమాల థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.22 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోగా.. వాటి త‌ర్వాత నాలుగో స్థానంలో ఈగ‌ల్ నిలిచింది. ఈగల్‌లో రవితేజ పాత్ర అదే! ఈగ‌ల్ సినిమాలో ర‌వితేజ రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాడే షూట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రైలర్‌, టీజర్‌ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్‌ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బ‌రిలో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌, హ‌నుమాన్ రిలీజ్ కావ‌డంతో ఈగ‌ల్ వాయిదాప‌డింది. అటు రవితేజ తన త‌ర్వాతి చిత్రాన్ని డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. 
    ఫిబ్రవరి 08 , 2024
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!  
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!  
    మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్‌ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.  తొలి కలెక్షన్స్ ఎంతంటే? తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్‌ దూకుడు ప్రదర్శించింది. యూఎస్‌ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు. రవితేజ టాప్‌-10 కలెక్షన్స్‌! (Ravi Teja Top 10 Highest Grossing Movies) ‘ఈగల్’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్‌ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. ధమాకా (Dhamaka) రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్‌ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.20 కోట్ల వరకూ జరిగింది.  బడ్జెట్: 35 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు క్రాక్‌ (Krack)  ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్‌, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్‌ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.  బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు తీర్పు: బ్లాక్ బస్టర్ రాజా ది గ్రేట్‌ (Raja the Great) రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్‌ కాగా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.  బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు తీర్పు: హిట్ బలుపు (BALUPU) రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.  బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రవితేజ గత చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.  బడ్జెట్: 55 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు పవర్‌ (Power) రవితేజ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్‌’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్‌.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్‌ గణాంకాలను నమోదు చేసింది.  బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు తీర్పు: సగటు కంటే ఎక్కువ బెంగాల్ టైగర్‌ (Bengal Tiger) ఈ సినిమా బడ్జెట్‌ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.  బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు విక్రమార్కుడు (Vikramarkudu) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్‌ హిట్‌ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.  బడ్జెట్: 11 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు కిక్‌ (Kick) రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్‌’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ కూడా అంతకే జరగడం గమనార్హం.  బడ్జెట్: 14 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు కిక్‌ (KICK 2) అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్‌ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ బిజినెస్‌ రూ.36 కోట్లు. కిక్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.  బడ్జెట్:  30Cr ప్రపంచవ్యాప్తంగా గ్రాస్:  43cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
    ఫిబ్రవరి 10 , 2024
    <strong>Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!</strong>
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్‌ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఈగల్‌ రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్‌ యాక్షన్‌ మూవీగా ‘ఈగల్‌’ అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది.&nbsp; లాల్‌ సలామ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్‌ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో అలరించనున్నారు.&nbsp; యాత్ర-2&nbsp; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి, జగన్‌ పాత్రలో జీవా నటించారు. ట్రూ లవర్ మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; పవన్‌ మూవీ రీ-రిలీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయికగా చేసింది. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బబుల్‌గమ్‌ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease DateOne Day&nbsp;MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
    ఫిబ్రవరి 05 , 2024
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.&nbsp; ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.&nbsp; భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.&nbsp; గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.&nbsp; వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.&nbsp; అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.&nbsp;
    జనవరి 17 , 2024
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    యంగ్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్‌ లుక్స్‌, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.&nbsp; ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన&nbsp; 'డీజే టిల్లు 2' ట్రైలర్‌ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.&nbsp; కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.&nbsp; ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.&nbsp; రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.&nbsp; ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.&nbsp; అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.&nbsp; గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .&nbsp; కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్‌ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు. మాస్‌ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్‌ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.&nbsp; అలాగే తమిళంలో 'సైరెన్‌' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం. మీనాక్షి చౌదరి యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp; శ్రీలీల గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.&nbsp; ఆషికా రంగనాథ్‌ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ గతేడాది ‘అమిగోస్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.&nbsp; రుక్సార్‌ థిల్లాన్‌ యంగ్‌ హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; మిర్నా మీనన్‌ తమిళ నటి మిర్నా మీనన్‌.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్‌ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది. అమృత అయ్యర్‌ కన్నడ నటి అమృత అయ్యర్‌.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపొందిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కాబోతుంది. శ్రద్ధ శ్రీనాథ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ నటించిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్‌ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది. రుహానీ శర్మ 2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్‌ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఈగల్‌’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్‌ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది. కావ్యా థాపర్‌ 'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్‌ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్‌’ సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
    జనవరి 02 , 2024
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సార్లు వారే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి ప్రేక్షకుల్లో తమ చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాతలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ హీరో పోస్టర్‌లో గన్‌ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాల పోస్టర్లను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? తుపాకీ పట్టుకున్న స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; భోళా శంకర్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భోళాశంకర్‌’ (Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ కానుండగా.. ఇంకా తొమ్మిది రోజులే ఉందంటూ ఇటీవల మేకర్స్‌ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో చిరు రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. యాక్షన్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌ను ‌అమితంగా ఆకట్టుకుంది.&nbsp; జైలర్‌ సూపర్‌ రజనీకాంత్‌ రీసెంట్‌గా ‘జైలర్‌’ (Jailer) మూవీ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో రజనీ గన్‌తో మెరిసారు. చేతిలో పెద్ద తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా హీరోయిన్‌గా చేసింది.&nbsp; కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ లేటెస్ట్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజయ్యింది. మునుపెన్నడూ చూడని లుక్‌లో ధనుష్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు. తుపాకీని ఫైర్‌ చేస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి అరుణ్‌ మతేశ్వరం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.&nbsp; జవాన్‌ ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘జవాన్‌’ (Jawan) చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో షారుక్‌ రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా ఆమె కూడా తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో తుపాకీతోనే దర్శనమిచ్చింది. కాగా, ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; సలార్‌ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, KGF డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. గన్‌పై చేయి పెట్టుకొని, అగ్రెసివ్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; గాండీవధారి అర్జున మెగా హీరో వరణ్‌ తేజ్‌ తాజాగా ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌లోనూ వరణ్‌ చేతిలో గన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షివైద్య హీరోయిన్‌గా చేస్తోంది. మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘సైంధవ్‌’ (Saindhav) మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఇందులో వెంకటేష్‌ చేతితో గన్‌ పట్టుకొని దాన్ని చూస్తూ కనిపించాడు. కాగా, ఈ చిత్రాన్ని సైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈగల్‌ మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్‌ నాగేశ్వర్‌ (Tiger Nageswara Rao) చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘ఈగల్‌’ (Eagle) సినిమా చేయనున్నాడు. కాగా ఈగల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని కనిపించాడు. చేతిలో గన్‌ కూడా ఉంది. కాగా, ఈ చిత్రంలో కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; స్పై&nbsp; ఇటీవలే విడుదలైన ‘స్పై’ (Spy) చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో నిఖిల్‌ కూడా పిస్టల్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp;
    ఆగస్టు 04 , 2023
    Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ
    Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ
    సినిమాల ఎంపిక విషయంలో అనుపమ పరమేశ్వరన్ రూటే సపరేటు. స్క్రిప్టులను ఆచితూచి ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంటుంది ఈ కేరళ కుట్టి. ఇలా క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్‌లో ఏనాడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, ఈ మధ్యన అనుపమ యూ టర్న్ తీసుకుంది. అందాలను ఆరబెడితేనే ఫ్యాన్స్ గాలి తగులుతుందేమోనని అనుకున్నట్లుంది. ఇక తగ్గేదే లే అంటూ గ్లామర్ డోజ్ పెంచి నెటిజన్లను మత్తులోకి దించుతోంది.&nbsp; లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వీరంగం సృష్టించింది. ఎద అందాలను ఏకరువు పెడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. సెల్ఫీ తీసుకుంటూ మూతిని వయ్యారంగా పక్కకు తిప్పింది.&nbsp; ఏకంగా ఎద ఎత్తులపై టాటూను వేసుకుంది. కొత్తగా టాటూ వేసుకున్నా ఎలా ఉందంటూ సైడ్ యాంగిల్‌లో చూపించింది. టాటూను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.&nbsp;&nbsp; ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘హంగ్రీ’ అంటూ కామెంట్ చేసింది. ఆకలి అంటూ అర్థం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్ పెడుతూ ఫొటోలు దిగింది అనుపమ.&nbsp; ఈ ఆకలి దేనికోసం అంటూ నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆకలిని తీరుస్తామంటూ రిప్లై ఇస్తున్నారు. ఈ టాటూ ఏంటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. రౌడీ బాయ్స్ సినిమాతో కొత్త అనుపమను పరిచయం చేసింది. ఈ సినిమాలో ప్రియ అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ పాత్రను పోషించింది. అంతకు ముందు వరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ ఈ సినిమాలో తన ముద్రను చెరిపేసుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=jKxDgdOO6P4 లిప్ లాక్ సీన్లలో నటించి బాగా రెచ్చిపోయింది. సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=BG2YC0VSuIA రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; https://www.youtube.com/watch?v=pOvRUu61TUk కార్తికేయ2, 18 పేజెస్ సినిమాతో హిట్ అందుకుంది ఉంగరాల జుట్టు చిన్నది. బటర్ ఫ్లై అనే వెబ్‌సిరీస్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) టిల్లు స్క్వేర్ సినిమాలోనూ అనుపమ నటిస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో సిద్ధుతో అనుపమ కారులోనే రొమాన్స్ చేస్తోంది. లిప్ లాక్‌కి మధ్యలో వేలు పెట్టి కవ్విస్తోంది.&nbsp;
    జూన్ 15 , 2023
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..&nbsp; స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్‌ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న. https://www.youtube.com/watch?v=z3zTPvCLNcI సింహాద్రి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్‌ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్‌ దేవ్‌ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా కథను తొలుత&nbsp; ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=53DHset7VEw సై.. నితిన్‌ హీరోగా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్‌ ప్రదీప్‌ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్‌ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు. https://www.youtube.com/watch?v=FUqXJb37DU4 ఛత్రపతి ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్‌ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్‌ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=_rImbIj2wp8 విక్రమార్కుడు విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్‌ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి.&nbsp; ఈ సీన్‌ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=Tf8N3VNHt8w మగధీర మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు.&nbsp; మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి&nbsp; క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్‌ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. https://www.youtube.com/watch?v=Fl2plgSlZnE ఈగ ఈగలో కిచ్చ సుదీప్‌ క్యారెక్టర్‌ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్‌ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. https://www.youtube.com/watch?v=fUY1hIAZyzo బాహుబలి 2 బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది.&nbsp; దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్‌ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.&nbsp; https://youtube.com/shorts/Ih_Dnp-BbaI?feature=share https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 25 , 2023
    <strong>Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీ నటులు : అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్‌ : మల్లీ అంకం సినిమాటోగ్రాఫర్‌ : సూర్య సంగీతం : గోపి సుందర్‌ నిర్మాత : రాజీవ్‌ చిలక నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: 3 మే, 2024 అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి&nbsp; అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే గణపతి పాత్రలో అల్లరి నరేష్‌ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్‌ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్‌ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్‌, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్‌ తీసుకొని డైరెక్టర్‌ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రాజ్‌ సుందర్‌ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్‌ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అల్లరి నరేష్‌ నటనకామెడీ మైనస్‌ పాయింట్స్ కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మే 03 , 2024
    <strong>డింపుల్ హయాతి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    డింపుల్ హయాతి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న డింపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about dimple hayathi) విషయాలు ఓసారి చూద్దాం. డింపుల్ హయాతి ముద్దు పేరు? డింపుల్ &nbsp;డింపుల్ హయాతి ఎప్పుడు పుట్టింది? 1988, ఆగస్టు 21న జన్మించింది డింపుల్ హయాతి తొలి సినిమా? గల్ఫ్ (2017) డింపుల్ హయాతి ఎత్తు ఎంత? 5 అడుగుల 8అంగుళాలు&nbsp; డింపుల్ హయాతి ఎక్కడ పుట్టింది? విజయవాడ&nbsp; డింపుల్ హయాతి ఏం చదివింది? డిగ్రీ డింపుల్ హయాతి అభిరుచులు? ట్రావెలింగ్ డింపుల్ హయాతికి ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ డింపుల్ హయాతికి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్ డింపుల్ హయాతి ఇష్టమైన హీరో? మహేష్ బాబు, అల్లు అర్జున్ డింపుల్ హయాతి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది డింపుల్ హయాతి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/dimplehayathi/ https://www.youtube.com/watch?v=Padz5P7mPsI
    ఏప్రిల్ 06 , 2024
    Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
    Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు దర్శకుడు : సాయికిరణ్ దైదా సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్ ఎడిటర్: శిరీష్ ప్రసాద్ నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023 ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో హార‌ర్ జానర్‌ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జాన‌ర్‌ని స్పృశిస్తూ ద‌ర్శ‌కనిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియ‌స్ట్ ఫిలిం ఎవ‌ర్’ అనే ఉప‌శీర్షిక‌తో సినిమా రూపుదిద్దుకుంది. ప్ర‌చార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే శ్రీరామ్‌, ఖుషి ర‌వి మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన జంట‌గా ఇమిడిపోయారు. హార‌ర్ సీన్లలో శ్రీరామ్ న‌ట‌న ఆకట్టుకుంటుంది. ఖుషి ర‌వి గ‌ర్భ‌వ‌తిగా, ఇద్ద‌రు బిడ్డల త‌ల్లిగా పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించింది. తాంత్రిక శ‌క్తులున్న మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు న‌ట‌న మెప్పిస్తుంది. ఇద్ద‌రు చిన్నారుల్లో తారగా న‌టించిన అమ్మాయి సైగల‌తో మాట్లాడుతూ ప్రేక్షకులను క‌ట్టిప‌డేస్తుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్రల ప్రాధాన్యం మేర‌కు న‌టించారు&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు సాయికిరణ్ దైదా క‌థ‌నంపైన‌, క‌థ‌లోని భావోద్వేగాల‌పైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వ‌చ్చాక ఆత్మ‌లు క‌నిపించ‌డం, అంద‌రూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించే స‌న్నివేశాల్ని భ‌యం క‌లిగించేలా తీయ‌డంలో ఆయన స‌ఫ‌ల‌మ‌య్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ స‌న్నివేశాల్లో క‌లిగినంత భ‌యం ఆ త‌ర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ సెకండ్‌ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. క‌డుపులో పిండానికీ, బ‌య‌టి ఆత్మ‌కీ ముడిపెట్ట‌డంలో పెద్దగా లాజిక్ క‌నిపించ‌దు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని కనబరిచాయి. శబ్దాల‌తోనే భ‌య‌పెట్టడంలో సంగీత ద‌ర్శ‌కుడు కృష్ణ సౌరభ్ సక్సెస్‌ అయ్యాడు. విష్ణు నాయ‌ర్ క‌ళా ప్ర‌తిభ తెర‌పై క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్టే స‌న్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంప‌రంగా లోపాలేమీ లేవు. ప్లస్ పాయింట్స్‌ హారర్‌ సన్నివేశాలునటీనటులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 15 , 2023
    <strong>నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. &nbsp;నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ముద్దు పేరు? &nbsp;నేహా &nbsp;నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;నేహా శెట్టి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి&nbsp; ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే &nbsp;నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి&nbsp; ఏం చదివింది? డిగ్రీ &nbsp;నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.&nbsp; నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ&nbsp; కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.&nbsp; వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.&nbsp; డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.&nbsp; ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.&nbsp; రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.&nbsp; నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.&nbsp; View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.&nbsp; View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.&nbsp; నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.&nbsp; టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:&nbsp; నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.&nbsp; https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.&nbsp; రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.&nbsp; రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ &nbsp;నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో మరో బ్లాక్ బాస్టర్ చిత్రం టిల్లు స్కేర్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), క్యూట్ గల్ అనుపమ పరమేశ్వరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. నాగ్ అశ్వీన్ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ డెరెక్ట్ చేసిన టిల్లు స్కేర్ చిత్రానికి మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్‌కి సంబంధించి క్రేజీ బజ్ తెలిసింది. టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా? డీజే టిల్లు నుంచి 'టిల్లు స్కేర్' సీక్వేల్‌గా వచ్చింది. మరి టిల్లు స్కేర్ నుంచి మరో సీక్వేల్ వస్తే బాగుంటుందని ఈ సినిమా హిట్ తర్వాత అభిమానులు అనుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ బజ్ ఉండగా.. సినిమా విడుదల తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఇదే విషయంపై మేకర్స్ టిల్లు స్క్వేర్‌ విడుదల తర్వాత స్పష్టత ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వ లేదు. దీంతో మరో సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. అయితే ప్రేక్షకుల మదిలో ఎక్కడో ఓ మూలన టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక పోతే ఇబ్బందుల్లో పడుతామని తొలుత మేకర్స్ ఆలోచించారు. ఇదే విషయాన్ని&nbsp; చిత్ర నిర్మాత నాగ్ వంశీ కూడా తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో టిల్లు క్యూబ్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నిజానికి మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సీక్వేల్‌పై ఓ ఐడియా ఇచ్చారు. ఇదే విషయంపై హీరో సిద్ధూ నేను మాట్లాడుకున్నాం. అతి త్వరలోనే&nbsp; చేద్దామని నిర్ణయించుకున్నాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ స్లో మోషన్‌ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తాం. సోమవారం నుంచి ప్రేక్షకులకు అది కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. టిల్లు క్యూబ్ అనౌన్స్ చేయడంలో డీజే టిల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. https://twitter.com/GulteOfficial/status/1773664243654471818?s=20
    మార్చి 30 , 2024
    <strong>నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    నితిన్ (Nithiin) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో నితిన్ ఒకడు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు నితిన్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న&nbsp; నితిన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నితిన్ అసలు పేరు? నితిన్ కుమార్ రెడ్డి నితిన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నితిన్&nbsp; ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ రామ్‌ పొత్తినేని తేదీ ఎప్పుడు? 1988 మే 15 నితిన్ వివాహం అయిందా? శాలిని కందుకూరితో 2020లో పెళ్లి జరిగింది. నితిన్‌కి ఇష్టమైన రంగు? వైట్, రెడ్ నితిన్ తల్లిదండ్రుల పేరు సుధాకర్ రెడ్డి, విద్యారెడ్డి నితిన్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం నితిన్‌కి ఇష్టమైన ఆహారం? అలుగడ్డ కర్రీ నితిన్&nbsp; అభిమాన నటుడు? పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి నితిన్‌కు నచ్చిన సినిమా? ఖుషి నితిన్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? సై, దిల్, జయం నితిన్&nbsp; ఏం చదివాడు? ఇంజనీరింగ్&nbsp; https://www.youtube.com/watch?v=5SzH8VHhUVw నితిన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 32 సినిమాల్లో నటించాడు నితిన్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.15కోట్లు తీసుకుంటున్నాడు. నితిన్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? జయం, శ్రీఆంజనేయం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
    మార్చి 21 , 2024
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌ సంగీతం: రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌ విడుదల: 22-12-2023 పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌లార్‌’. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఎప్ప‌ట్నుంచో  ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ కటౌట్‌కు తగిన హిట్‌ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు ఖాతాలో మరో బ్లాక్‌ హిస్టర్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్‌ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని ఖాన్సార్‌కు రూలర్‌గా చూడాలనేది రాజమన్నార్‌ కోరిక‌. దీంతో వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్‌. తన కటౌట్‌కు తగ్గట్లు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని స్నేహితుడిగా ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి,&nbsp; శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’తో మరోమారు తన మార్క్‌ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత&nbsp; ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన క‌థ‌ని అల్లారు. కె.జి.యఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్ర‌భాస్‌కి త‌గ్గట్టు మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్‌కు ఎలివేష‌న్ల‌ు ఇచ్చి అభిమానుల‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు డైరెక్టర్. ఓవరాల్‌గా స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్‌నీల్‌ సక్సెస్ అయ్యారు.&nbsp; సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రభాస్, పృథ్వీ నటనయాక్షన్‌ సన్నివేశాలుభావోద్వేగాలు, క్లైమాక్స్ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 22 , 2023
    Venkatesh Dual role Movies:&nbsp; విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Venkatesh Dual role Movies:&nbsp; విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. కూలీ నంబర్ 1 (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ?????????????????????????????????????????????????????????????? ముద్దుల ప్రియుడు(1994) ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ..&nbsp; ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోకిరి రాజా(1995) ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు. సూర్య వంశం(1998) ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. జయం మనదేరా(2000) జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవీ పుత్రుడు (2001) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర బోస్ (2005) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.&nbsp; నాగవల్లి(2010) ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు. ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    నవంబర్ 10 , 2023

    @2021 KTree