రివ్యూస్
How was the movie?
తారాగణం
వరుణ్ సందేశ్
వెంకట్విమలా రామన్
మధుమితగిరి బాబు
మధుమిత తండ్రిఅలీ
మధుమిత కోడలురష్మీ గౌతమ్
మధుమిత సోదరివేణు మాధవ్
డా. భార్గవ్బ్రహ్మానందం
కుటుంబరావు (ప్రత్యేక దర్శనం)ఆదర్శ్ బాలకృష్ణ
రాజాదువ్వాసి మోహన్
రమాప్రభ
రమాప్రభసురేఖ వాణి
సిబ్బంది
మార్తాండ్ కె శంకర్దర్శకుడు
ఎం. శరవణన్ (చిత్ర నిర్మాత)
నిర్మాతMS గుహన్
నిర్మాతమణి శర్మ
సంగీతకారుడువేణుగోపాల్
సినిమాటోగ్రాఫర్మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్కథనాలు
Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్ లవర్ అయిన రష్మి.. సోషల్ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
ఘాటు కొటేషన్..!
యాంకర్ రష్మి.. ఓ వైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలు, జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తిక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రముఖ రచయిత రచల్ మోరన్ రాసిన ఈ కొటేషన్‌ను రష్మి పంచుకుంది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన ప్రస్తావన ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కొటేషన్‌లో 'మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్ కాదు’ అని రాసి ఉంది.
కొటేషన్‌కు మూలం ఇదే
ప్రముఖ రచయిత రచల్ మోరన్.. ఈ కొటేషన్‌ను ఓ వేశ్య నుంచి తీసుకున్నారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలంటూ దానిని కొటేషన్ రూపంలో పేర్కొన్నారు. రష్మి పెట్టిన ఈ పోస్టును అంతర్లీనంగా పరిశీలిస్తే పెద్ద అర్థమే అందులో దాగుంది. ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు.. దాని మనుగడ అసలే ఉండదు’ అన‌్నది రష్మిక పోస్టు వెనుక దాగున్న ఉద్దేశం. అయితే రష్మిక లేటెస్ట్ పోస్టు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వ్యభిచారానికి సంబంధించి పోస్టు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రష్మి ఫ్యాన్స్ మాత్రం ఆమె పనిని సమర్థిస్తున్నారు.
గతంలోనూ ఇలాగే..
దేశంలో బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై గతంలో రష్మిక ఇలాగే ఘాటుగానే స్పందించింది. సె** పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొందరు రష్మి మాటలను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు.
రష్మి సినిమా కెరీర్..
హోలీ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మీ గౌతమ్.. థ్యాంక్స్, కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, వెల్ డన్ అబ్బా, బిందాస్, చలాకి, ప్రస్తానం తదితర చిత్రాల్లో నటించింది. ‘జబర్దస్త్’లో యాంకర్‌గా చేరినప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మి చేసింది. ఆ తర్వాత లీడ్ రోల్స్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది చిరంజీవి 'భోళాశంకర్' సినిమాలోనూ యాంకర్ రష్మి మెరిసింది.
మే 01 , 2024
HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు.
అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది.
యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.
దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సి వచ్చిందట.
View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial)
టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు.
అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది.
అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.
రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్ చేసింది.
ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట.
‘సైజ్ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్ మిస్టేక్ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.
సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్ క్రష్ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది.
'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.
ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
వాస్తవానికి అరుంధతి ఆఫర్ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు.
అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్స్‌తో ఓ బుక్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్ వెయిల్ లాస్ పిల్' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్ చేసింది. 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్ తాగుతూ కనిపించింది.
సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
నవంబర్ 07 , 2024
HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిరులో కసి పెంచిన ఘటన
ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్, మేకప్‌మ్యాన్ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు.
చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి
1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు.
చిరు మెస్మైరైజింగ్ డ్యాన్స్‌కు కారణం ఇదే!
కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట. సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.
రివ్యూవర్ నుంచి పద్మ విభూషణ్ స్థాయికి..
మెగాస్టార్ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్ స్టోరీస్ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.
కుర్ర హీరోలకు అండగా..
కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు.
కళామతల్లి ముద్దు బిడ్డగా..
ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా.
సేవా కార్యక్రమాల్లో ముందజ..
సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
ఆగస్టు 22 , 2024
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్ తెప్పించిన డైలాగ్స్.. ఓ లుక్కేయండి!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ నటన, యాస, బాడీ లాంగ్జేవ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న జీవించేసిందంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీకి సుకుమార్ ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించిందని చెబుతున్నారు. డైలాగ్స్ (Pushpa 2 Dialogues) కూడా సినిమాలో బాగా పేలాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రారంభ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ ఉన్న హైలెట్ డైలాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ఎంట్రీ డైలాగ్
జపాన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ను చూపించారు దర్శకుడు సుకుమార్. పుష్ప నుంచి ఎర్ర చందనం తీసుకున్న జపాన్ డీలర్లు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఈ క్రమంలో కంటైనర్‌లో దుడ్డుతో పాటు వెళ్లిన పుష్ప వారికి చిక్కుతాడు. ఈ క్రమంలో వచ్చే ఎంట్రీ డైలాగ్ హైలేట్‌గా నిలుస్తుంది. జపాన్ భాషలో బన్నీ మాట్లాడటం విశేషం.
పుష్ప రాజ్: హలో! బాగుండారా? నా జపాన్ బ్రదర్స్. (జపాన్ భాషలో)
ఎప్పటి నుండో నా సరుకు యాడికెళ్తుందో సూడాలని అనుకునే వాడిని. ఇన్నాళ్లకు కుదిరుండాది. అంటూ బన్నీ తనను బంధించిన వారిపై విరుచుకుపడతాడు.
కమెడియన్ సత్య : యో.. ఏందప్ప నీకు జపాన్ భాష వచ్చా?
పుష్ప రాజ్ : నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్ భాష (30 రోజుల్లో జపాన్ నేర్చుకోవడం ఎలా అనే బుక్‌ను చూపిస్తూ) నేర్చుకున్నాలే అప్ప. ఎట్టా ఉండాది నా జపనీస్ భాష.
సత్య: అదిరి పోయింది.. అదిరిపోయింది. ఇంతకీ జపాన్ ఎందుకు వచ్చినావ్ అప్ప?
పుష్పరాజ్ : జపాన్‌కు దుడ్డు (ఎర్ర చందనం) వచ్చింది గానీ, డబ్బు రాలేదప్ప. ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చినా..
సత్య: పైసలు కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావా?
పుష్పరాజ్: నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైన ఉన్నా అయినా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు.
పుష్పరాజ్: ఐయామ్ యూనివర్స్ బాస్.. పుష్ప ఈజ్ ద బాస్ (జపాన్ భాషలో)
పోలీసు స్టేషన్ డైలాగ్స్
ఎర్ర చందనం తరలిస్తున్న పుష్ప రాజ్ మనుషులను ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పట్టుకొని జైల్లో వేస్తాడు. తన వారికోసం స్టేషన్‌కు వచ్చిన పుష్ప చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.
పుష్ప: పుష్ప: నా పిల్లకాయలను లోపల ఏశావా ఏంది? ఒక గంటలో మా శీను గాడి (జైల్లో ఉన్న వ్యక్తి) పెళ్లి ఉండాది. వాళ్లని తోలుకపోవడానికి వచ్చిన.
సీఐ: శీనుగాడి పేరున ఎఫ్‌ఐఆర్ రాశారు. మెుత్తం 230 మంది. ఒక్కరు తక్కువైనా లెక్క తేడా వస్తాది.
పుష్ప: అట్నా.. రేయ్ (తన పక్కన ఉన్న వారితో) మన వాళ్లలో శ్రీనివాస్ ఎవరు ఉన్నార్రా. (ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకు వస్తాడు)
సీఐ: అదెట్లా కుదిరిద్ది పుష్ప. ముందు మాదిరి లేదు పుష్ప. రూల్స్ అన్నీ మారిపోయాయ్.
పుష్ప : సీఐ గారికి రూల్స్ మారి పోయాయంట్రా. నేను చెప్పేదా రూల్ ఏంటో. చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఈడ జరిగేదంతా ఒకటే రూలు. అది పుష్పగాడి రూలు.
సీఎంతో మీటింగ్ అప్పుడు..
ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్ప బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి సూచిస్తుంది. దీంతో సీఎంతో ఫొటో దిగేందుకు శాలువ కప్పుతుండగా సీఎం హేళన చేస్తూ చెప్పే డైలాగ్ కథను మలుపు తిప్పుతాయి.
ఎంపీ సిద్ధప్ప: పుష్ఫ భార్య మంచి ఫొటో అడిగుండాది. ఫొటో బాగా తీయ్ (కెమెరామెన్‌తో)
సీఎం: ఏంటీ సిద్దప్పు నువ్వు..
ఎంపీ సిద్దప్ప: ఏ అన్నా..
సీఎం: ఈ స్మగ్లర్లు.. పార్టీకి ఫండ్ ఇచ్చినంత ఈజీగా మనం ఫొటోలు ఇవ్వలేం. చెప్పులు కాళ్లను మోస్తున్నాయని చేతులకు తొడుక్కుంటామా ఏందీ.
సీఎం: సిద్దప్ప.. పిల్లోడు కదా. పెళ్లాం మాట విని ఫొటోల కోసం వచ్చుంటాడు. పుష్ప.. పెళ్లాం మాట విని బాగుపడినోడు ఎవ్వడు లేడు. మదిలో పెట్టుకో.
సీఎంతో మీటింగ్ తర్వాత..
సీఎం చెప్పిన మాటలకు బాగా హార్ట్ అయిన పుష్ప బయటకు వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. సీఎంతో మాట్లాడిన కొద్దిసేపటికి ఎంపీ సిద్దప్ప (రావు రమేష్) బయటకు వస్తాడు. ఈ క్రమంలో పుష్ప - సిద్ధప్ప మధ్య వచ్చే సంభాషణ సినిమాకు కీలక మలుపు తిప్పుతుంది.
పుష్ప: ఏం.. సార్. పని అయ్యుండాదే?
ఎంపీ సిద్దప్ప: శాఖ ఏంటో తెలీదు గానీ.. మినిస్ట్రీ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం దుడ్డు (లంచం) ఎక్కువ తడపాలా!
పుష్ప : అది కాదు.. షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ట్రాన్స్‌ఫర్ అయ్యుండాదా అని అడుగుతున్నా?
ఎంపీ సిద్దప్ప: కుదరదు అన్నాడప్ప. పోలీసు వాళ్లతో సర్దుకుపోవాలి గానీ వచ్చిన ప్రతీ వాడితో కలియపెట్టుకొని ట్రాన్సఫర్ కోరితే కుదరదన్నాడప్పా. నువ్వు కూడా వద్దన్నావని విడిచేసినా.
పుష్ప: వాడు వద్దనడం వేరు.. నేను వద్దనడం వేరు. చాలా తేడా ఉండాది.
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప మాట మారుతుండాది? సీఎం గారిని ఆడు ఈడు అంటున్నావ్. ఫొటో ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్ కదా.
పుష్ప : అదేం లేదప్ప. సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. రేపు ఏ సీఎం అయినా అలాగే అంటాడు.
ఎంపీ సిద్దప్ప: నేను అయితే అలా ఎందుకు అంటా? శుభ్రంగా ఇస్తా
పుష్ప : ఏందీ.. ఫొటో ఇస్తావా?
ఎంపీ సిద్దప్ప: ఇస్తానప్పా.. ఎందుకు ఇవ్వను..
పుష్ప : అయితే మీరే సీఎం (సిద్దప్ప వెంటనే షాకవుతాడు)
ఎంపీ సిద్దప్ప: ఏందీ (షాక్‌లో)
పుష్ప : మీరే సీఎం అప్పా..
ఎంపీ సిద్దప్ప: నేను సీఎం ఆ.. (నవ్వుతూ) మతి ఉండే మాట్లాడుతున్నావా?
పుష్ప: ఏమప్పా.. పుష్ప లాంటోడ్ని పక్కన పెట్టుకొని పిల్లి పిత్రి పదవులు (మంత్రి) ఏంటి సామి. పెద్దగా ఆలోచించండి సారు. నా పక్కన పుష్ప లాంటోడు ఉంటే నేను అట్లనే ఆలోచిస్తా.
ఎంపీ సిద్దప్ప: ఆలోచించొచ్చు గానీ.. సీఎం అంటే చాలా అవుద్దీ అప్పా.
పుష్ప : ఎంత అవుతది?
ఎంపీ సిద్దప్ప: తక్కువలో తక్కువ రూ.100 కోట్లు.
పుష్ప : రూ.500 కోట్లు ఇస్తా.. సరిపోద్దా (థియేటర్లలో ఒకటే విజిల్స్)
ఎంపీ సిద్దప్ప: అంత డబ్బు ఎట్టా తెస్తావప్పా?
పుష్ప: దుడ్డు (డబ్బు) గురించి పుష్పకు వదిలేసి.. ఢిల్లీ వెళ్లి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు)ను కలవండి.
జగపతి బాబుతో ఫస్ట్ ఫోన్‌కాల్..
కేంద్ర మంత్రి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు) సింగ్‌తో పుష్ప ఫోన్‌లో మాట్లాడే సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సీఎం సీటు గురించి ఎంపీ సిద్దప్ప అతడితో మాట్లాడుతున్న క్రమంలోనే ప్రతాప్ సింగ్ సోదరుడ్ని పుష్ప కలిసి రూ.5 కోట్లు ఇస్తాడు. దీంతో తన అన్నకు ఫోన్ చేసి ఆ డబ్బు గురించి చెప్తాడు. అప్పుడు పుష్ప-ప్రతాప్ సింగ్ సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
పుష్ప: హలో.. నమస్తే! నా పేరు పుష్ప. మార్కెట్‌లో అందరూ ఎర్ర చందనం పుష్ప అంటుంటార్లే.
ప్రతాప్‌సింగ్: తెలుసప్పా.. కొండారెడ్డి పావలా వాటానే కదా నువ్వు. వింటూనే ఉన్నా.
పుష్ప: నువ్వు పావల వాటా గాడితో మాట్లాడుతున్నావ్ అనుకుంటే.. నేను క్వారీలో లారీ ఆపే గుమస్తా గాడితో మాట్లాడుతున్నాని ఫీలవ్వాల్సి వస్తది. చరిత్రలు ఎందుకులే అన్నా తవ్వుకోవడం.
ప్రతాప్‌సింగ్: ఏందీ ఆ రూ.5 కోట్ల కథ.
పుష్ప: అది నీకు కాదులే అన్న. నీతోడ బుట్టినోడికి. ఫోన్ కలిపిచ్చినందుకు. ఎన్ని దినాలు పాత సోఫాలో కూర్చొని ఉంటావ్. నీకో కొత్త కూర్చి పంపిస్తాలే. దాంట్లో కూర్చో.
పుష్ప: సోఫా అంటే మామూలు సోఫా కాదన్న అది. చానా కాస్ట్లీ సోఫా. రూ.25 కోట్ల రూపాయల సోఫా అది.
ప్రతాప్ సింగ్: ఏ టెండర్ కోసమో చెప్పు. క్వారీనా? మైనింగా?. స్టేట్‌లో ఏ పక్క కావాలో చెప్పు.
పుష్ప: హా హా హా.. మెుత్తం స్టేటే కావాలా. సిద్దప్ప స్టేట్‌కి సీఎం కావాలా.
ప్రతాప్ సింగ్: నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా?
పుష్ప: సరిపోద్ది అన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి. ఒకసారి ఇచ్చినాక కాదనడానికి లే. కళ్లకద్దుకొని తీసుకోవాల్సిందే. సిద్దప్ప సీఎం అయ్యేది ఖాయం. కాదంటే నాకాడా చాలా సోఫాలు ఉన్నాయిలే.
ప్రతాప్ సింగ్‌తో మీటింగ్ తర్వాత
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప ఇది ఫోన్ కనిపినోడికి రూ.5 కోట్లు, మాట్లాడినోడికి రూ.25 కోట్లా. ఇట్టా సింటికేట్ డబ్బంతా పొప్పులు, బెల్లాల మాదిరి పంచుకుంటూ పోతే ఎవరు సమాధానం చెప్పేది.
పుష్ప: నీకు ఇచ్చే లెక్క మారదు సారు.. సిండికేట్‌కు వచ్చే లెక్క మారుద్ది.
ఎంపీ సిద్దప్ప: టన్నుకు అదే రూ.కోటిన్నర లెక్క.. ఎట్లా మారుద్ది.
పుష్ప: మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకు రూ.50 లక్షలు.. మురుగన్‌కు అమ్మితే టన్ను రూ.కోటిన్నర. అదే మురుగన్ అమ్మేటోడికి మనం పోగలిగితే..
ఎంపీ సిద్దప్ప: ఆశ్చర్యం, ఆనందం కలసిన ముఖంతో
పుష్ప: పుష్పగాడి చూపు దేశం దాటేసుండాది. ఏందీ.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్‌నేషనల్..
ఇంటర్నేషనల్ స్మగ్లర్‌తో డీల్..
స్మగ్లర్: పుష్ప రెండక్షరాలు.. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బడా.. బూమ్
పుష్ప: సౌండ్ నచ్చుండాదా నీకు.. ఇప్పుడు దందా మాట్లాడదాం చెప్పబ్బా.
స్మగ్లర్: మాల్ ఎంత (హిందీలో)
పుష్ప: 2000 టన్నులు (ఎర్ర చందనం)
స్మగ్లర్: హా హా హా.. టన్నుకు ఎంత?
పుష్ప : రూ. రెండున్నర కోట్లు
స్మగ్లర్: జోక్ చేస్తున్నావా? పుష్ప
పుష్ప: దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది.
స్మగ్లర్: సరే 2000 టన్నుల మాల్ రూ.5000 కోట్లు
పుష్ప: కాదు.. రూ.4,900 కోట్లు
స్మగ్లర్: రూ.100 కోట్లు ఎందుకు తగ్గించావ్ పుష్ప? మాల్ సరిపడ లేదా?
పుష్ప: మిగతా రూ.100 కోట్లకి నవ్వుతూ.. (హెలికాఫ్టర్ తీసుకొని వెళ్లిపోతాడు)
సిండికేట్ మీటింగ్ సమయంలో..
సిండికేట్ సభ్యులు: షెకావత్ మన కోసం కాచుకొని ఉన్నాడు. ఈ సమయంలో అంత సరుకు పంపించడం కరెక్టెనా?
పుష్ప: కరెక్టో కాదో పుష్ప ఆలోచించడప్ప.. ఒరు నిర్ణయం తీసుకుంటాడు. అది కరెక్ట్ అవుతుంది అంతే.
పుష్ప - రష్మిక సంభాషణ
ఓ సీన్‌లో శ్రీవల్లి (రష్మిక) కాలుకి దెబ్బ తగలుతుంది. పుష్ప స్వయంగా ఆమె కాలు పట్టుకొని మందు రాస్తుంటాడు. అప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్ క్యూట్‌గా అనిపిస్తాయి.
శ్రీవల్లి: కాలు వదిలేయ్ సామి..
పుష్ప: ఏమి..
శ్రీవల్లి: అసలే మీరు పుష్పరాజ్. పెళ్లా కాలు పట్టుకుంటాడని నాకు మాట రానీకు.
పుష్ప: ఏయ్.. పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్ తగ్గేదేలే (అంటు శ్రీవల్లి కాలితో తన గడ్డని నిమురుతాడు)
పుష్ప - షెకావత్
ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో జరిగిన దానికి పుష్ప సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు పుష్ప- షెకవాత్ మధ్య వచ్చే సంభాషణ వారి మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచుతుంది.
ఎంపీ సిద్దప్ప: పుష్ప చెప్పేయప్పా
పుష్ప: సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి.
పుష్ప: సరే.. సారీ
షెకావత్ : బ్రహ్మాజీతో పుష్ప సారీ చెప్పింది విన్నావా?
బ్రహ్మాజీ: సారీ చెప్పింది కాదు సార్.. చెప్పాడు అనాలి.
షెకావత్: పుష్ప ఫైర్ అయ్యుంటే చెప్పాడు అనేవాడ్ని.. సారి చెప్పి ఫ్లవర్ అయ్యాడుగా అందుకే చెప్పింది.
‘పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’
జాతర సందర్భంలో వచ్చే డైలాగ్స్
అజయ్: వీరందర్నీ కొట్టినావని చెప్పి నిన్ను మాలో కలుపుకోవాలా? నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే.
శ్రీవల్లి: యో పెద్ద మనిషి నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది.
పుష్ప అమ్మ: శ్రీవల్లి.. పెద్ద చిన్న చూసి మాట్లాడు.
శ్రీవల్లి: నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమోగానీ, ఎవడైనా నా మెుగుడ్ని అంటే నేను ఊరుకుండేదే లేదు.
కిడ్నాపర్లకు పుష్పరాజ్ మాస్ వార్నింగ్
సినిమా చివర దశకు చేరుకునే క్రమంలో అజయ్ కూతుర్ని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఓ న్యూస్ ఛానెల్ వేదికగా కిడ్నాపర్లకు పుష్పరాజ్ ఇచ్చే వార్నింగ్ హైలెట్ అనిపిస్తుంది.
పుష్పరాజ్: నా పేరు పుష్ప.. పుష్ప రాజ్. మీరు నాకు పరిచయం అక్కర్లేదు పాయింట్‌కు వస్తున్నా.
పుష్పరాజ్: బిడ్డను ఎత్తుకు పోతార్రా మీరు.. అంత దమ్ముండాదా? కొడ**రా. ఇప్పుడు చెబుతున్నా చెవులు పెద్దవి చేసుకొని వినండి.
పుష్పరాజ్: మీకు ఈ క్షణం నుంచి గంట టైమ్ ఇస్తాండా. ఆ బిడ్డను యాడ నుంచి ఎత్తుకెళ్లారో ఆడనే దింపాలా. అట్ట పోయి ఇట్ట వచ్చినట్లుండాలా.
పుష్పరాజ్: అట్ట కాదని ఆ బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా..
మెగా ఫ్యామిలీకి కౌంటర్లుగా అనిపించే డైలాగ్స్
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్ చర్చనీయాంశమవుతున్నాయి. చిరు ఫ్యామిలీకి కౌంటర్‌గా వాటిని మూవీలో పెట్టారన్ని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.
‘మీ బాస్‌కే నేను బాస్’
'ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు'
‘నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు’
'ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు'
'పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా'
‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా?
'ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’
డిసెంబర్ 05 , 2024
Hero Vishal: విశాల్ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతడు చేసే యాక్షన్ చిత్రాలకు మాస్ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింగంటే?
హీరో విశాల్ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విశాల్ కొన్ని కామెంట్స్ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.
విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్!
‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్ కథిరేసన్ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.
https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070
విశాల్ ఎలా పాపులర్ అంటే?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్ టాలీవుడ్ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.
జూలై 27 , 2024
Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్.. ‘సేవ్ ద టైగర్స్ 2’ నవ్వించిందా?
నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి..
దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి
సంగీతం: అజయ్ అరసద
రచన & నిర్మాత: మహి వి రాఘవ్
స్ట్రీమింగ్ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్
విడుదల తేదీ: 15-03-2024
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చింది. ‘సేవ్ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథ
'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్ లీడ్ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘సేవ్ ద టైగర్స్ 2’లో మహి వి రాఘవ్ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్ న్యూస్.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్ ఈ సిరీస్ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనకామెడీ సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 15 , 2024
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ మూవీకి సాధ్యం కాని కలెక్షన్స్ సాధిస్తూ పలు రికార్డులను కొల్లగొడుతోంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సౌత్, నార్త్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క చోట పుష్ప గాడి ప్రభంజనం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధిస్తే సంబంధిత ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆర్‌ఆర్‌ఆర్, కల్కి, సలార్ సినిమా విషయంలో మనం ఇది చూశాం. కానీ ‘పుష్ప 2’ సక్సెస్ విషయంలో టాలీవుడ్ మౌనం వహిస్తోంది. పైగా కొందరు స్టార్స్ ఆ సినిమాను కించపరుస్తూ మాట్లాడటం చర్చకు తావిస్తోంది.
‘క్వార్టర్ ఇస్తే ఎవరైనా వస్తారు’
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (Siddharth) 'పుష్ప 2' చిత్రంపై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన 'మిస్ యు' చిత్రం ఈ వారమే తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'ను కించపరిచేలా మాట్లాడాడు. పాట్నాలో భారీ జనసందోహంలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై ఆయన సెటైర్లు వేశారు. 'మన దేశంలో జనసమీకరణం పెద్ద విషయమేమి కాదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక కన్‌స్ట్రక్షన్ దగ్గ జేసీబీ వర్క్ జరుగుతున్నప్పుడు జనాలు గుమ్మికూడతారు. బిర్యానీ, క్వార్టర్ సీసా ఇస్తే పొలిటికల్ మీటింగ్‌కు జనాలు ఎగబడతారు. పొలిటికల్ మీటింగ్స్‌కు జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయని నమ్మకం లేదు. ఇండియాలో జనం గుమికూడడం సహజమే. ఇది చాలా చిన్న విషయం' అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. మరోవైపు సోమవారం జరిగిన హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్‌లో ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’ అంటూ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన సంగతి తెలిసిందే.
https://twitter.com/WhatTheFuss_/status/1866378487784742950
రాజమౌళి మౌనం ఎందుకు?
దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) ఇండస్ట్రీ నుంచి ఏ మంచి సినిమా వచ్చిన దగ్గరుండి ప్రశంసలు కురిపిస్తారు. ‘సలార్’ (Salaar), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో పాటు ఇటీవల వచ్చిన ‘దేవర’ గురించి కూడా ఆయన స్పందించారు. అటువంటి రాజమౌళి ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత సినిమా గురించి ఒక్క కామెంట్ చేయకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా హాజరైన రాజమౌళి తాను అప్పటికే చూసిన ఇంట్రడక్షన్ సీన్‌పై భారీగా హైప్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. అటువంటి జక్కన్న సినిమా రిలీజ్ తర్వాత సడెన్‌గా మౌన మునిగా మారిపోవడంపై సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేశాడని తెగ ఆలోచిస్తున్నారు.
మహేష్ రివ్యూ ఎక్కడ?
సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) గత కొంతకాలంగా రివ్యూవర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలను స్వయంగా చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కల్కి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో పాటు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా 2 వంటి చిన్న సినిమాలకు సైతం మహేష్ ప్రశంసలు కురిపించారు. కానీ యావత్ దేశాన్ని షేక్ చేస్తోన్న 'పుష్ప 2' మాత్రం మహేష్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అయితే దీనికి ఓ బలమైన కారణమే ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. బాలయ్య టాక్‌షోలో బన్నీ చేసిన వ్యాఖ్యలు మహేష్‌ను నొప్పించి ఉంటాయని అంటున్నారు. ఆ షోలో ప్రభాస్, మహేష్‌లలో నీకు ఎవరు పోటీ? అని బన్నీని బాలయ్య అడుగుతాడు. అప్పుడు ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ పాడుతూ తనకు తనతోనే పోటీ అంటూ బన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఈ సమాధానం మహేష్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు.
బన్నీ యాటిట్యూడే కారణమా?
‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంపై టాలీవుడ్ పెద్దలు సంతోషంగా ఉన్నప్పటికీ ఆ సినిమా చేసిన డ్యామేజ్ విషయంలో మాత్రం వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని ఓ మహిళ మృతి సంగతి తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెన్‌ఫిట్ షోలకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతికి రాబోయే చిత్రాలు బాగా ఎఫెక్ట్ కానున్నాయి. బన్నీ ఆ రోజు థియేటర్‌కు రాకుండా ఉంటే ఇలాంటి తప్పిదం జరిగేది కాదని సినీ పెద్దలు భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో అతడు వ్యవహార శైలి కూడా సరిగా లేదని అభిప్రాయపడుతున్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సక్సెస్‌పై ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రశంసలు రావట్లేదని టాక్ వినిపిస్తోంది.
డిసెంబర్ 10 , 2024
Janhvi Kapoor Top 10 Saree Tips: చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్ నుంచి ఇలా నేర్చుకోవచ్చు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. మోడ్రన్ డ్రెస్ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రీసెంట్‌గా అనంత్ అంబాని - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్ నెక్లెస్ ధరించి అందరి దృషి ఆకర్షించింది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్ హెయిర్ స్టైల్.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది.
చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్ కలర్ డిజైనర్ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్ కలర్ శారీలో జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్ కలర్ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్, ఇయర్ రింగ్స్ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.
గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.
కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.
పెద్ద పెద్ద డిజైనర్ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్ స్పెషల్‌గా చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ మిస్మరైజింగ్ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
ఈ స్టైలిష్ రెడ్ శారీలో జాన్వీ కపూర్.. ఘాటైన రెడ్ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్ నెవర్ బీఫోర్‌లా అనిపిస్తాయి.
జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్ కలర్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.
మార్చి 06 , 2024
Top 5 Telugu Serial Actress: సీరియల్స్ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్ అవుతున్నట్లే!
ఈ జనరేషన్ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Ayesha Zeenath
స్టార్ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది.
కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది.
సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.
అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది.
Raksha Goud
కన్నడ నటి రక్ష గౌడ్ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.
ఈమె లీడ్ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.
2017లో కన్నడ సీరియల్ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు.
గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.
Jyothi Rai
‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.
కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది.
ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Preethi Sharma
తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్ సీరియల్ 'ఒరు కాదయి పాడతుమా, సార్?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.
తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్ రోల్ సంపాదించి గృహిణుల ఫేవరేట్ నటిగా మారిపోయింది.
Soundarya Reddy
‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్ చేస్తోంది.
కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది.
ఫిబ్రవరి 20 , 2024
Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్ తీసుకొని ఛానెల్ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం..
సుహాసిని
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్ సక్సెస్ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.
ప్రీతి అస్రాని
బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్, మిన్నాలే 9 ఆవర్స్ వంటి ప్రముఖ షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నవ్య స్వామి
నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.
ఐశ్వర్య పిస్సే
33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.
శోభా శెట్టి
కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ప్రియాంక జైన్
నటి ప్రియాంక జైన్ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్ అద్భుతంగా నటించింది.
ఏప్రిల్ 13 , 2023
Akira Nandan: అకీరా నందన్ గురించి ఈ టాప్ - 10 సీక్రెట్స్ తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్ కల్యాణ్ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
అకీరానందన్ 2004 ఏప్రిల్ 8న పవన్ - రేణు దేశాయ్ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.
అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్, రానా, వరుణ్ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.
అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.
అకీరా నందన్ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదట. యంగ్ హీరో అడివి శేష్ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది.
ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు.
అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.
ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్ కల్యాణే చూసుకుంటున్నారు.
తన తల్లికి పవన్ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్ అకీరాలో రాకుండా రేణు దేశాయ్ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట.
అకీరానందన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.
ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.
అక్టోబర్ 21 , 2024
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్, నెగిటివిటీ మెుదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆడియన్స్ ఏమంటున్నారు?
ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ యావరేజ్ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం.
https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234
https://twitter.com/i/status/1776636730034245707
https://twitter.com/plaasya/status/1777072948597428600
విజయ్‌కు ముందే తెలుసా?
‘ఫ్యామిలీ స్టార్’ గురించి ఇద్దరు యూట్యూబ్ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమాపై హేట్ లేదని చెప్పాడు. అయితే విజయ్ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా నిర్మాత దిల్ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/chanticomrade_/status/1776839226312753263
విజయ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మెుదటి నుంచి విజయ్ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. కారణం ఏదైనా విజయ్ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్, నెగిటివ్స్ బయటకు వస్తున్నాయి.
దిల్ రాజుపై నెగిటివిటీ
దిల్ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్ మెుదలయ్యాయి. తమిళ స్టార్ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్ రాజు రిలీజ్ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ విషయంలోనూ దిల్ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు డైరెక్టర్ పరుశురామ్.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్’పై పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఫేక్ రివ్యూస్
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది.
రిలీజ్‌కు ముందే ట్రోల్స్!
వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్ మెుదలయ్యాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్ కాస్ట్యూమ్స్ ధరిస్తాడని.. బ్రాండెండ్ షూస్ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్ రాజు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ అబ్బాయిని సూపర్ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్ రాజు బదులిచ్చారు.
‘గుడ్ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’
తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.
అయితే దిల్ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు.
https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
ఏప్రిల్ 08 , 2024
VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్ కథాంశంతో విరూపాక్ష… సాయి ధరమ్ తేజ్ సూపర్ కమ్ బ్యాక్!
సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం
దర్శకుడు: కార్తీక్ దండు
నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సోనియా సింగ్, రవికృష్ణ
సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
కథ
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
ఎలా ఉందంటే?
రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది.
ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.
ఎవరెలా చేశారు?
సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక పనితీరు
సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.
విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
బలాలు
కథ, కథనం
సాయిధరమ్, సంయుక్త మీనన్
నేపథ్య సంగీతం
బలహీనతలు
క్లైమాక్స్, లవ్ ట్రాక్
రేటింగ్
3.25/5
ఏప్రిల్ 21 , 2023
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. లవ్, డేటింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ రోజున బయటపెడతా’
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు తెలుగుతోపాటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో మీరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ జాతీయ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. దీనిపై విజయ్ మాట్లాడుతూ ‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా’ అని విజయ్ సమాధానం ఇచ్చాడు.
వ్యక్తిగత జీవితంపైనా..
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం తరుచూ వార్తల్లో నిలవడంపైనా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. ‘పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. మీడియా, సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఏదీ మనసుకు తీసుకోనని పరోక్షంగా తెలియజేశాడు.
ప్రేమపై షాకింగ్ కామెంట్స్
‘హద్దులు లేని ప్రేమ’ అనే బంధంపై మీ అభిప్రాయం ఏంటని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనిపై విజయ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’ అని విజయ్ తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ రష్మికను ఉద్దేశించి చేశాడా? అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికను అమితంగా ప్రేమించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నాకు అలాంటివాడే కావాలి: రష్మిక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక కాబోయో వాడు ఎలా ఉండాలో స్పష్టం చేసింది. 'నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా భద్రతనివ్వాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని తెలిపింది. అటు ప్రేమ గురించి సైతం మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు ఉండాలి’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
వచ్చే ఏడాదే పెళ్లి!
‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
డిసెంబర్ 19 , 2024
Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్ రద్దుకు రంగం సిద్ధం?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాజకీయ విమర్శలకు సైతం దారి తీసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో బన్నీ ఆ మర్నాడే జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో సినీ ప్రముఖులంతా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మరోమారు జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన బెయిల్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సుప్రీంకోర్టులో పిటిషన్..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్‌ను రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు తెలుస్తోంది. బెయిల్‌ను సవాల్ చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొక్కిసలాట ఘటనలో అసలు బన్నీ తప్పేలేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్, పుష్ప 2 టీమ్ రాకకు పోలీసులు అనుమతి ఇవ్వలేదనేలా సోమవారం ఓ రిపోర్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసి బెయిల్ రద్దుకు పట్టుబట్టాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని బలమైన ఆధారాలు సేకరించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/TeluguChitraalu/status/1868953613441327274
బెయిల్ రద్దు కానుందా?
పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నారని, ఇందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను కోరింది. అయితే హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు చేప్పినా వినకుండా వచ్చి, అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులోనూ వాదించారు. ఇదే వాదనతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పట్టుబట్టనున్నారు. వారి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే బెయిల్ రద్దై బన్నీ మళ్లీ చంచల్ గూడా జైలుకు వెళ్లే అవకాశముంది.
https://twitter.com/LetsXOtt/status/1867499029116203230
‘ఇదొక గుణపాఠం కావాలి’
సంథ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టుపై కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తొలిసారి స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఎవరైనా సినిమా థియేటర్‌కు ఎంజాయ్ చేయడానికే వెళ్తారు. ఇలాంటి ఓ ఘటన జరగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవ్వరూ ఆశించరు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరు? ఎవర్ని శిక్షించాలి? అనేది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడే దానికి అనుగుణంగా చట్టాలు మారుతూ వస్తుంటాయి. ఇకపై ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలి. ఇదొక గుణపాఠం కావాలి. నెక్ట్స్ టైం ఎవరైనా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరిశీలించుకోవాలి’ అంటూ కిచ్చా సుదీప్ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/AAFanIkkadaa/status/1868868843029856747
డిసెంబర్ 17 , 2024
Jani Master: మరో వివాదంలో జానీ మాస్టర్.. వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని వార్నింగ్
కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వడం, జైలుకు వెళ్లడం తెలిసిందే. తాజాగా, డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను శాశ్వతంగా తొలగించారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై జానీ మాస్టర్ స్వయంగా స్పందించారు.
జానీ మాస్టర్ స్పందన
జానీ మాస్టర్ మాట్లాడుతూ, "ఈ రోజు ఉదయం నుంచి నన్ను డ్యాన్సర్స్ యూనియన్(Dancers Union) నుండి శాశ్వతంగా తొలగించారనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నేను ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే. నా కార్డ్‌ను ఎవరూ తీసివేయలేరు. నా పదవీ కాలం ఇంకా ఉంది. అనధికారికంగా ఎలక్షన్లు నిర్వహించి, తమకు నచ్చిన విధంగా హోదాలు పొందడాన్ని ఒప్పుకోను. చట్టపరంగా దీనిపై పోరాడతాను" అని అన్నారు.
అంతేకాకుండా, తన తాజా ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి కొరియోగ్రఫీ చేశానని, ఆ సినిమాలోని ఓ పాట త్వరలో విడుదలకానుందని చెప్పారు. ఈ సాంగ్ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
https://twitter.com/AlwaysJani/status/1866073580125196680
కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్
డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్(Joseph Prakash) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. గతంలోనూ ఆయన నాలుగు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నియామకంతో జానీ మాస్టర్ అధ్యక్ష పదవి నుంచి తప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ విషయంపై కూడా జానీ మాస్టర్ తాను అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నానని, ఎవరూ తనను హోదా నుంచి తొలగించే హక్కు లేదని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చినందునే తనను అసోసియేషన్ నుండి తప్పించారని వచ్చే కథనాలపై ఆయన విమర్శలు గుప్పించారు.
వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందన
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయమై గతంలో పెద్ద దుమారం రేగింది. ఆయన అసిస్టెంట్ ఓ లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతకాలం జైలులో ఉండిన జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ కేసు నేపథ్యంలోనే అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, జానీ మాస్టర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘నాపై చేసిన ఆరోపణలు నిర్ధారణ కానివి. అలాంటి ఆరోపణల ఆధారంగా నన్ను శాశ్వతంగా తొలగించారనే వార్తలు కేవలం ఫేక్ న్యూసే. నేను లీగల్‌గా పోరాడతాను. నాకు న్యాయం దక్కుతుందని నమ్ముతున్నాను,’’ అని తెలిపారు.
ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే
"కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి పరిశీలన చేయకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి. నన్ను అసోసియేషన్ నుండి తొలగించారన్నది అసత్యం. నాకు సంబంధించిన హక్కులను ఎవరూ హరించలేరు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరూపించబడాల్సినవి. నా పదవీ కాలం ఇంకా ఉంది. ఎవరైనా నాకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, నేను చట్టపరంగా పోరాడతాను’’ అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు.
జానీ మాస్టర్ తన కెరీర్‌ను ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రారంభించి, కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఆయన చేసిన కొరియోగ్రఫీతో చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో చేసిన పాటలు అభిమానులకు తెగ నచ్చాయి. తాను టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఎదగడానికి డ్యాన్సర్స్ యూనియన్ ప్రధాన కారణమని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
తన వద్ద పనిచేసిన డ్యాన్సర్లు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్లుగా ఎదుగుతున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నా వద్ద పని చేసిన వాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదే నా నిజమైన గౌరవం’’ అని తెలిపారు.
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ఎన్నికవడంతో, జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. తన పదవీ కాలం ఇంకా ఉందని, ఎవరి ఒత్తిడి వల్లనో తనను తొలగించలేరని అన్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
డిసెంబర్ 09 , 2024
Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ పీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. అయితే టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సినీ లవర్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.1000 - రూ.3000 వరకూ విక్రయిస్తుండటంపై బన్నీ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావించిన తమను టికెట్ ధరల పెంపు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రగడ నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. సుబ్బారావు ఇడ్లీ స్టోరీ చెప్పి నెట్టింట మరో చర్చకు కారణయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాన్స్ జేబులకు చిల్లులు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం రా.9:30కి స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రీమియర్స్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌లో రూ.1,239 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో బ్లాక్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో టికెట్ ధరలు ఉంటే సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావిస్తే తమ జేబుకి చిల్లులు పడటం ఖాయమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులే తమ బలం అని పదే పదే చెప్పే హీరోలు.. ప్రీమియర్స్ పేరుతో ఇలా దోచుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.
https://twitter.com/icon_uday_09/status/1862842546986058178
https://twitter.com/HemanthSriram14/status/1862891462121152785
‘రేట్లు తగ్గాకే చూడండి’
'పుష్ప 2' టికెట్ ధరలను నియంత్రించాలని నెటిజన్లు కోరుతుండటంతో పాటు ఈ విషయమై పలువురు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోలుస్తూ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. ఆ ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కస్టమర్‌కు ఆ ఇడ్లీలు వర్త్ అనిపించకపోతే హోటల్‌కు వెళ్లడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ కోసం కాదు. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.
https://twitter.com/RGVzoomin/status/1864188826387873892
ఆర్జీవీకి నెటిజన్ల కౌంటర్
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చెప్పిన సుబ్బారావు ఇడ్లీ స్టోరీకి నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 7 స్టార్ హోటల్స్‌లో 10 మంది ఇడ్లీలు తింటే బయట హోటల్‌లో 50వేల మంది తింటారని గుర్తుచేస్తున్నారు. డే 1 రూ.1200 ఉన్న టికెట్‌ను మరుసటి రోజుకు రూ.500, ఆ తర్వాత రూ.200కి మార్చడం అంటే 'పుష్ప 2' విలువ అంత నీచంగా పడిపోయిందని అర్థమా? అని నిలదీస్తున్నారు. ‘మెుదటి రోజు 7 స్టార్ ఇడ్లీలు ఎవరు కొనట్లేదు భయ్యా!’ అంటూ ఖాళీ సీట్లు ఉన్న థియేటర్లను పోస్టు చేస్తున్నారు. గతంలో పవన్ సినిమా టికెట్ ధరను జగన్ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రూ.10 ధరతో తొలి భాగం చూపించి రూ.1000 కడితేనే రెండో సగం చూడాలని కండీషన్ పెడితే అది దోపిడి కాదా? అని మండిపడుతున్నారు. హోటల్‌లో ఇడ్లీ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామని, అలాగే ‘పుష్ప 2’ని ఓటీటీలోకి వచ్చాక చూస్తామని స్పష్టం చేస్తున్నారు.
https://twitter.com/Raja__JSP/status/1864210260183142807
https://twitter.com/shravan_salaar/status/1864190328200179911
డిసెంబర్ 04 , 2024
Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ‘విజయ్ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), ‘టాక్సీవాలా’ (Taxiwala), ‘గీతాగోవిందం’ (Geetha Govindam) హిట్స్‌తో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడు. అతడు చేసిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ దారుణంగా విఫలమయ్యాయి. దీంతో అతడిపై ట్రోల్స్, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండపై దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అది టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
‘ప్రేమతో పాటు ద్వేషమూ చూశాడు’
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ నటుడు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ తరం గొప్పనటులు అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తాను అభిమానించే నటుల్లో విజయ్ ఒకరని వ్యాఖ్యానించారు. 'విజయ్ ఎంతో ప్రేమ చూశాడు. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూసాడు. బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి నవలలో ఒక లైన్ ఉంటుంది. మావాడే మహాగట్టివాడని. విజయ్ దేవరకొండకు అది వర్తిస్తుంది. మా వాడు మహా గట్టోడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=PhzeAy5OUl8
‘ఖలేజా బాలేదంటే కొట్లాటే’
‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సైతం మాట్లాడారు. దర్శకుడు త్రివిక్రమ్ గురించి ప్రస్తావిస్తూ క్రేజీ కామెంట్స్ చేశాడు. పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత తన ఫస్ట్ చెక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరపున త్రివిక్రమ్ ఇచ్చినట్లు చెప్పారు. చెక్ ఇస్తూ నువ్వు స్టార్ అవుతావని చెప్పారని పేర్కొన్నారు. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం తన లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘జల్సా’ చిత్రాలు ఎంత క్రేజ్ సంపాదించుకున్నాయో మన జనరేష్‌కు బాగా తెలుసాని అన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అతడు’, ‘ఖలేజా’ తన ఫేవరేట్స్ అని తెలిపాడు. ‘ఖలేజా’ను ఎవరైనా ఫ్లాప్ అంటే వారితో కొట్లాడేవాడినని వివరించాడు.
https://twitter.com/oneindiatelugu/status/1850807211817369676
దుల్కర్ - విజయ్ మల్టీస్టారర్
లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తన బ్రదర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కోసం వచ్చానని నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వ్యాఖ్యానించారు. ‘కల్కి’, ‘మహానటి’ సినిమాల్లో తామిద్దరం నటించిన విషయాన్ని గుర్తుచేశాడు. కానీ తమ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ పడలేదని పేర్కొన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ దుల్కర్ తనతో మల్టీస్టారర్ చేయాలని భావించినట్లు చెప్పాడు. అప్పుడు చెన్నైలో కలిసి కథ కూడా విన్నట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో కలిసి సినిమా చేయోచ్చేమే అంటూ ఒక్కసారిగా ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు.
https://twitter.com/ihsan21792/status/1850579970093129862
పెళ్లి చూపులు కాంబో రిపీట్
విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన 'పెళ్లి చూపులు' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో విజయ్ హీరోగా మరో సినిమా రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్‌కు కథ కూడా చెప్పేశాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ చేసేందుకు రౌడీ బాయ్ కూడా ఓకే చెప్పాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ ఉంది. యాక్షన్‌తో పాటు, తరుణ్ స్టైల్ ఆఫ్ కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. కాగా, విజయ్ ప్రస్తుతం ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లోనూ మూవీ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
అక్టోబర్ 28 , 2024