• TFIDB EN
  • ఎవరైనా ఎపుడైనా
    UATelugu
    ఎవరైనా ఎపుడైనా 2009లో విడుదలైన తెలుగు-భాషా రొమాంటిక్ కామెడీ చలనచిత్రం మార్తాండ్ కె శంకర్ దర్శకత్వం వహించి మరియు రచించారు. ఇందులో వరుణ్ సందేశ్ మరియు విమలా రామన్ నటించారు, ఇది 26 జూన్ 2009న విడుదలైంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ సందేశ్
    వెంకట్
    విమలా రామన్
    మధుమిత
    గిరి బాబు
    మధుమిత తండ్రి
    అలీ
    మధుమిత కోడలు
    రష్మీ గౌతమ్
    మధుమిత సోదరి
    వేణు మాధవ్
    డా. భార్గవ్
    బ్రహ్మానందం
    కుటుంబరావు (ప్రత్యేక దర్శనం)
    ఆదర్శ్ బాలకృష్ణ
    రాజా
    దువ్వాసి మోహన్
    రమాప్రభ
    రమాప్రభ
    సురేఖ వాణి
    సిబ్బంది
    మార్తాండ్ కె శంకర్దర్శకుడు
    ఎం. శరవణన్ (చిత్ర నిర్మాత)
    నిర్మాత
    MS గుహన్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    వేణుగోపాల్
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    కథనాలు
    Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
    Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
    తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్‌ లవర్‌ అయిన రష్మి.. సోషల్‌ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  ఘాటు కొటేషన్‌..! యాంకర్‌ రష్మి.. ఓ వైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలు, జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తిక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌ రాసిన ఈ కొటేషన్‌ను రష్మి పంచుకుంది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన ప్రస్తావన ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కొటేషన్‌లో 'మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్‌ కాదు’ అని రాసి ఉంది.  కొటేషన్‌కు మూలం ఇదే ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌.. ఈ కొటేషన్‌ను ఓ వేశ్య నుంచి తీసుకున్నారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలంటూ దానిని కొటేషన్‌ రూపంలో పేర్కొన్నారు. రష్మి పెట్టిన ఈ పోస్టును అంతర్లీనంగా పరిశీలిస్తే పెద్ద అర్థమే అందులో దాగుంది. ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు.. దాని మనుగడ అసలే ఉండదు’ అన‌్నది రష్మిక పోస్టు వెనుక దాగున్న ఉద్దేశం. అయితే రష్మిక లేటెస్ట్ పోస్టు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వ్యభిచారానికి సంబంధించి పోస్టు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రష్మి ఫ్యాన్స్‌ మాత్రం ఆమె పనిని సమర్థిస్తున్నారు.  గతంలోనూ ఇలాగే.. దేశంలో బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై గతంలో రష్మిక ఇలాగే ఘాటుగానే స్పందించింది. సె** పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొందరు రష్మి మాటలను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు.  రష్మి సినిమా కెరీర్‌.. హోలీ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మీ గౌతమ్‌.. థ్యాంక్స్‌, కరెంట్‌, ఎవరైనా ఎప్పుడైనా, వెల్‌ డన్‌ అబ్బా, బిందాస్‌, చలాకి, ప్రస్తానం తదితర చిత్రాల్లో నటించింది. ‘జబర్దస్త్‌’లో యాంకర్‌గా చేరినప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మి చేసింది. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది చిరంజీవి 'భోళాశంకర్‌' సినిమాలోనూ యాంకర్‌ రష్మి మెరిసింది. 
    మే 01 , 2024
    <strong>HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?</strong>
    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.&nbsp; తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరులో కసి పెంచిన ఘటన ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్‌ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్‌ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్‌ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు. చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి 1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్‌ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు. చిరు మెస్మైరైజింగ్‌ డ్యాన్స్‌కు కారణం ఇదే! కెరీర్‌ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట.&nbsp; సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్‌ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.&nbsp; రివ్యూవర్‌ నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి.. మెగాస్టార్‌ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్‌ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్‌ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.&nbsp; కుర్ర హీరోలకు అండగా.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డగా.. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. సేవా కార్యక్రమాల్లో ముందజ.. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
    ఆగస్టు 22 , 2024
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    <strong>Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;</strong>
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.&nbsp; విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!&nbsp; ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.&nbsp; https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.&nbsp;
    జూలై 27 , 2024
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి.. దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి సంగీతం: అజయ్‌ అరసద రచన &amp; నిర్మాత: మహి వి రాఘవ్ స్ట్రీమింగ్‌ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ: 15-03-2024 ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌ కూడా వచ్చింది. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య&nbsp; కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్‌ లీడ్‌ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’లో మహి వి రాఘవ్‌ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్‌ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్‌ న్యూస్‌.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్‌ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్‌ ఈ సిరీస్‌ ద్వారా మంచి సందేశం ఇచ్చారు. టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్‌ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనకామెడీ&nbsp;సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మార్చి 15 , 2024
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. మోడ్రన్‌ డ్రెస్‌ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్‌ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రీసెంట్‌గా అనంత్‌ అంబాని - రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్‌ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్‌ నెక్లెస్‌ ధరించి అందరి దృషి ఆకర్షించింది.&nbsp; స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్‌ హెయిర్‌ స్టైల్‌.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది. చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్‌ కలర్‌ డిజైనర్‌ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.&nbsp;&nbsp; ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్‌ కలర్‌ శారీలో జాన్వీ కపూర్‌ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.&nbsp; గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు.&nbsp;పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.&nbsp; కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్‌ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.&nbsp; పెద్ద పెద్ద డిజైనర్‌ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్‌ స్పెషల్‌గా చెప్పవచ్చు.&nbsp; జాన్వీ కపూర్‌ మిస్మరైజింగ్‌ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.&nbsp; ఈ స్టైలిష్‌ రెడ్ శారీలో జాన్వీ కపూర్‌.. ఘాటైన రెడ్‌ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్‌ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్‌ నెవర్‌ బీఫోర్‌లా అనిపిస్తాయి.&nbsp; జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్‌ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌తో మ్యాచింగ్‌ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.&nbsp;
    మార్చి 06 , 2024
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; Ayesha Zeenath స్టార్‌ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్‌ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది.&nbsp;ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్‌ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది. సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది. Raksha Goud కన్నడ నటి రక్ష గౌడ్‌ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.&nbsp; ఈమె లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.&nbsp; 2017లో కన్నడ సీరియల్‌ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్‌ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.&nbsp; Jyothi Rai ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్‌ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.&nbsp; కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్‌.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్‌’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; Preethi Sharma తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్‌ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్‌ సీరియల్‌ 'ఒరు కాదయి పాడతుమా, సార్‌?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.&nbsp; తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ సంపాదించి గృహిణుల ఫేవరేట్‌ నటిగా మారిపోయింది.&nbsp; Soundarya Reddy ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం.. సుహాసిని బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్‌ సక్సెస్‌ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.&nbsp; ప్రీతి అస్రాని బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్‌ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్‌, మిన్నాలే 9 ఆవర్స్‌ వంటి ప్రముఖ&nbsp; షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్‌, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; నవ్య స్వామి నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్‌ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.&nbsp; ఐశ్వర్య పిస్సే 33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్‌ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.&nbsp; శోభా శెట్టి కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్‌’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.&nbsp; ప్రియాంక జైన్‌ నటి ప్రియాంక జైన్‌ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది.&nbsp;\రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్‌ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్‌ అద్భుతంగా నటించింది.&nbsp;
    ఏప్రిల్ 13 , 2023
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. &nbsp; కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.&nbsp; దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.&nbsp; అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.&nbsp; అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.&nbsp; అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్‌ కథాంశంతో&nbsp; విరూపాక్ష… సాయి ధరమ్‌ తేజ్‌ సూపర్ కమ్‌ బ్యాక్!
    సాయి ధరమ్‌ తేజ్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం దర్శకుడు: కార్తీక్ దండు నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌, సోనియా సింగ్, రవికృష్ణ సంగీతం:&nbsp; అజనీశ్ లోక్‌నాథ్‌ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ కథ రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ. ఎలా ఉందంటే? రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్‌ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.&nbsp; ఎవరెలా చేశారు? సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్‌ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్‌ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; సాంకేతిక పనితీరు సుకుమార్ కాంపౌండ్‌ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్‌ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్‌ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్‌ పాయింట్‌ స్క్రీన్‌ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.&nbsp; విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్‌ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బలాలు కథ, కథనం సాయిధరమ్, సంయుక్త మీనన్ నేపథ్య సంగీతం బలహీనతలు క్లైమాక్స్‌, లవ్‌ ట్రాక్‌ రేటింగ్ 3.25/5
    ఏప్రిల్ 21 , 2023
    <strong>Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్‌.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్‌?</strong>
    Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్‌.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్‌?
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్‌ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; బాలయ్యతో మల్టీస్టారర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి క్రేజీ కామెంట్స్‌ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్‌ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్‌ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్‌ చేశారు. అదే సమయంలో వైవీఎస్‌ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.&nbsp; https://twitter.com/i/status/1830519890249421017 బోయపాటే ఎందుకు? బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్‌ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్‌ బోయపాటి.. ఛాలెంజ్‌’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్‌ డైరెక్టర్ వై.వీ.యస్‌. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.&nbsp; రంగంలోకి వై.వి.ఎస్‌..? ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్‌లో నెవర్‌ బిఫోర్‌ మల్టీస్టారర్‌ రావడం పక్కా అని చెప్పవచ్చు.&nbsp; ఫ్యాన్‌ వార్‌పై చిరు క్రేజీ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్‌ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ అన్నారు.
    సెప్టెంబర్ 02 , 2024
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్‌ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్‌ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.&nbsp; ‘మేము గొప్ప స్నేహితులం’ స్టార్‌ హీరోయిన్‌ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్‌ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/yoursanjali/status/1796260781551682021 నెటిజన్లు భిన్నాభిప్రాయాలు అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్‌ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్‌ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. https://twitter.com/GoneWorse/status/1796158320778117123 నిర్మాత ఏమన్నారంటే.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్‌ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.&nbsp; https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044 నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్‌ వైడ్‌గా మాత్రం ట్రెండ్‌ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి.&nbsp;ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.&nbsp;
    మే 31 , 2024
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.&nbsp; అసలేం జరిగిందంటే? దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్‌ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్‌ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1785936991726743773 మండిపడుతున్న ఫ్యాన్స్ అనిల్‌ రావిపూడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగానే బదులిస్తున్నారు.&nbsp; అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్‌ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్‌ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు.&nbsp; ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్‌ డేట్‌ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్‌ డే? జానర్‌? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1785935511531511969
    మే 02 , 2024
    SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్‌ బాబు ఫైనల్ లుక్ ఇదేనా?&nbsp;
    SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్‌ బాబు ఫైనల్ లుక్ ఇదేనా?&nbsp;
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని అటు మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం 'SSMB29' చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్‌ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్స్క్‌లోనే మూవీలో మహేష్‌ లుక్‌ ఏ విధంగా ఉండాలన్న డిస్కషన్స్‌ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.  మహేష్‌ లుక్‌ అదేనా? ‘SSMB 29’లో మహేష్‌ లుక్‌ ఎలా ఉండనుందన్న క్యూరియాసిటీ ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.&nbsp; మహేష్‌ కోసం 8 లుక్స్‌ డిజైన్‌! దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన సినిమాల్లోని హీరోల లుక్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. కథకు తగ్గట్టుగా హీరో లుక్‌ను మెయిన్‌టైన్‌ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఇందుకు అనుగుణంగానే తన అప్‌కమింగ్‌ మూవీ ‘SSMB29‘లోనూ మహేష్‌ లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మహేష్‌ పాత్రకు సంబంధించి ఎనిమిది లుక్ డిజైన్స్‌ను ఆయన సిద్ధం చేశారట. వాటిని స్కెచ్‌ రూపంలోకి మార్చి అందులో ఏది మహేష్‌కు బాగా సెట్‌ అవుతుందో రాజమౌళి దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే మహేష్‌ లేటెస్ట్‌ లుక్‌ బయటకు రావడం ఆసక్తిని పెంచింది.  కృష్ణుడి గెటప్‌లో మహేష్‌! రాజమౌళి ఆ ఎనిమిది లుక్స్‌కు సంబంధించి మహేష్‌తో ఫొటోషూట్‌ కూడా నిర్వహించారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఆ ఎనిమిది లుక్స్‌లో కృష్ణుడి గెటప్‌ కూడా ఉందట. ఇటీవల మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో షూట్‌ కూడా చేశారని సమాచారం. ఆ లుక్‌ మహేష్‌కు మాటల్లో చెప్పలేనంత బాగా కుదిరిందని అంటున్నారు. మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో చూసి చిత్ర యూనిట్‌ ఎంతగానో మురిసిపోయిందని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; 200 మందితో ప్రీ ప్రొడక్షన్‌ పనులు! ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్, స్కెచ్, లుక్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారట. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రమని ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు ఇటీవల వార్తలు సైతం వచ్చాయి.&nbsp; ‘చెల్సియా ఎంత ఫేమస్సో తెలుసా? అమెరికన్ - ఇండోనేషియా నటిగా బ్యూచెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌కి మంచి గుర్తింపు ఉంది. ‘చెల్సియా ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.&nbsp;
    మార్చి 08 , 2024
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవిశంకర్, వైవా హర్ష, వడివక్కరసి తదితరులు దర్శకుడు: వీఐ ఆనంద్ కథ : భాను భోగవరపు సంగీతం: శేఖర్ చంద్ర&nbsp; నిర్మాణ సంస్థ:&nbsp; ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్&nbsp; నిర్మాత : అనిల్ సుంకర, బాలాజీ గుత్తా విడుదల తేదీ: 16-02-2024 సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ రూపొందించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరో సందీప్‌ కిషన్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథ బసవ (సందీప్ కిషన్) (Ooru Peru Bhairavakona Review) ఓ స్టంట్‌ మ్యాన్‌. అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం తన గ్యాంగ్‌ జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భైరవకోన అనే ఊరిలోకి వెళ్తాడు. అయితే ఈ ఊరికి ఎవరైనా వెళ్లడం తప్ప.. అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన ఉండరు. మరి భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? భైరవకోన చరిత్ర ఏమిటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఆ ఊరికి సంబంధం ఏమిటి? బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే బసవ పాత్రకు సందీప్ కిషన్ (Ooru Peru Bhairavakona Review) న్యాయం చేశాడు. కెరీర్‌ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలో జీవిస్తూ భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ పర్వాలేదు. ఆమెకు రాసిన సీన్లలో బలం లేకపోవడంతో ఆమె ప్రభావం సినిమాలో తక్కువే. ఇక కావ్య థాపర్ ఉన్నంతలో అందంగా కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష కాంబోలో సీన్లు, వాళ్లిద్దరి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ సైతం నవ్వించారు. రవి శంకర్, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ఊరుని చూపించి భైరవకోనపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు దర్శకుడు. కథలో బలం ఉన్నప్పటికీ కథనంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. భైరవకోనలో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లాక ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్లిద్దరి బంధం కూడా సాదా సీదాగానే చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రగలించినా.. విశ్రాంతి తర్వాత దానిని మెయిన్‌టెన్‌ చేయడంలో విఫలమయ్యారు. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష, బ్రహ్మాజీ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్ బృందం (Ooru Peru Bhairavakona ) నుంచి దర్శకుడు వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథలో కొత్తదనంసందీప్‌ నటనట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్ ఆసక్తి లేని సన్నివేశాలుసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    ఫిబ్రవరి 16 , 2024
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. అయితే, నటి మరణ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పూనం పాండేనే ప్రకటించారు. తాను బతికే ఉన్నట్లు ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు. అందుకే ఇలా చేశా: పూనం పాండే తను చనిపోయినట్లు స్వయంగా ప్రకటించుకున్న పూనం పాండే.. అందుకు గల కారణాలను తాజా వీడియోలో వివరించారు. తాను బాధపడుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడి ఏటా వేలాది మంది మహిళలు చనిపోతున్నట్లు పూనం తెలిపారు. ఆ వ్యాధి బారిన పడితే ఏమి చేయాలన్న అవగాహన చాలా మంది మహిళలకు ఉండటం లేదన్నారు. ఇతర క్యాన్సర్ల లాగే సర్వైకల్‌ క్యాన్సర్‌ను కూడా జయించవచ్చని తెలిపారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ (HPV Vaccine) తీసుకోవడం ద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడ్డవచ్చని ఆమె సందేశం ఇచ్చారు.&nbsp; https://twitter.com/i/status/1753677207913070756 ఏకిపారేస్తున్న నెటిజన్లు మరోవైపు పూనం పాండే చేసిన పనిపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వైకర్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్న ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదని అంటున్నారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి కూడా ఆ వ్యాధిపై అవగాహన కల్పించే మార్గముందని చెబుతున్నారు. మరణం అనేది ఎప్పటికీ జోక్‌ కాదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.&nbsp; పూనం పాండే తీసుకున్న నిర్ణయం అగౌరవంగా ఉందని.. ఇలాంటివి యాక్టింగ్‌ స్కూల్‌లో చేసుకుంటే బాగుంటుందని మరో నెటిజన్‌ అన్నారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరువ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు.&nbsp; అటు పూనం పాండే ఫేక్‌ మరణవార్త గురించి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఒక డెడ్‌బాడీని లిఫ్ట్‌లోకి తీసుకురాగా అది పూనం పాండే లాగా నేను బతికే ఉన్నానని తిరిగి లేచినట్లు ఆ వీడియోలో ఉంది.&nbsp; https://twitter.com/araza52505/status/1753689758847611052 మరికొందరు నెటిజన్లు ఇంకా విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత డీప్‌ఫేక్‌ వీడియోలు విస్తృతంగా పెరిగిపోవడంతో ఆమె రిలీజ్‌ చేసిన వీడియో కూడా అలాంటిదేనని ఓ నెటిజన్లు కామెంట్‌ పెట్టాడు. ఆమె నిజంగానే చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.&nbsp; ఇది ఆమె పబ్లిసిటీ స్టంట్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ఇది పూర్తిగా హేయమైన చర్య అంటూ మరో వ్యక్తి అభిప్రాయ పడ్డాడు.&nbsp; ఆమె క్యాన్యర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయదని తన గురించి ప్రచారం కోసమే హేయమైన చర్యకు పూనుకున్నారని ఓ నెటిజన్‌ అన్నారు. ఆమె మరణవార్త విని తాను చాలా ఫీల్‌ అయ్యాయని.. ఎందుకంటే తన తండ్రి కూడా అలాగే చనిపోయాడని అతడు చెప్పుకొచ్చాడు. ‘అందరూ నన్ను క్షమించండి’ పూనం ఫేక్‌ మరణవార్తపై విమర్శలు వస్తోన్న వేళ ఆమె మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారు క్షమించాలని అందులో కోరారు. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేయాలన్నది తన ఉద్దేశం కాదని.. సర్వైకల్‌ క్యాన్సర్‌పై విస్తృత ప్రచారం కోసమే తాను ఇలా చేశానని పునరుద్ఘటించారు. ఈ ఫేక్‌ మరణవార్తను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ సర్వైకర్‌ క్యాన్సర్‌ గురించే చర్చించుకున్నారని గుర్తు చేసారు. ఆ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం అత్యవసరమని చెప్పారు. తన మరణవార్త ద్వారా ఏం జరగాలని ఆశించానో అది నేరవేరిందని అన్నారు. ఇలా చెప్తునందుకు తాను గర్వపడుతున్నట్లు వీడియోను ముగించారు.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1753677387232096338
    ఫిబ్రవరి 03 , 2024
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది. థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్  ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు. 3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్‌ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.  సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది. ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి. ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్. &nbsp;ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
    అక్టోబర్ 23 , 2023
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు. డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20 ఎలా ఉంది? కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20 ఎవరెలా చేశారు? జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.&nbsp; టెక్నికల్‌గా.. గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్‌ బాగున్నాయి. https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20 పాజిటివ్ పాయింట్స్ రజినీ ఎలివేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ కామెడీ నెగెటివ్ పాయింట్స్ బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 2.75/5
    ఆగస్టు 11 , 2023
    BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
    BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
    కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన 'బేబీ' చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌​లో బిజీ బీజీగా గడుపుతోంది.&nbsp; దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే.&nbsp; 1996లో జనవరి 4న 1996&nbsp; విజయవాడలో జన్మించింది. యాక్టింగ్‌లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్‌లో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి ఫేమస్ అయింది యుట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరిస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. &nbsp;అలవైకుంఠాపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇంకా పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ కెరీర్‌లో జెట్‌ వేగంతో దూసుకెళ్తోంది నటిగా, మోడల్‌గా , డ్యాన్సర్‌గా బహుముఖ పాటవాన్ని చూపుతూ తాజాగా హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది ఈ విజయవాడ పిల్ల సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు ఈ మధ్య భారీగానే పెంచుకుంటోంది. లెలేత అందాల ప్రదర్శనతో కుర్రకారుకు వల విసురుతోంది. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మరో మూడు రోజుల్లో బేబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.&nbsp; ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ జోడీగా నటిస్తోంది ఇప్పటికే&nbsp; బేబీ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ఇద్దరు యువకుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువతి పాత్రలో వైష్ణవీ కనిపించనుంది.&nbsp; ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం బృందం వినూత్నంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.&nbsp; సోమవారం హైదరాబాద్- బోరబండలో ఆటో డ్రైవర్లతో కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
    జూలై 11 , 2023

    @2021 KTree