• TFIDB EN
  • ఫియర్
    UATelugu
    వేదిక కవల పుత్రికలు. అక్క చిన్నప్పటి నుంచి దెయ్యాల సినిమాలు చూస్తూ చెల్లెలికి కూడా బలవంతంగా చూపించడంతో ఆమె మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. అది తీవ్రస్థాయికి చేరడంతో ఆమెను ట్రీట్‌మెంట్‌ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్‌ సంపత్‌ను కలవరిస్తుండేది. ఇంతకీ అతడెవరు? ఆమె అక్క భయాలకు కారణం ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?

    ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్‌...read more

    How was the movie?

    తారాగణం
    పవిత్ర లోకేష్
    వేదిక
    అరవింద్ కృష్ణ
    అనీష్ కురువిల్లా
    సాయాజీ షిండే
    సిబ్బంది
    హరిత గోగినేనిదర్శకుడు
    ఏఆర్ అభినిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    ఐ అండ్రూసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు  దర్శకత్వం : డా. హరిత గోగినేని సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి  విడుదల తేదీ: డిసెంబర్‌ 14, 2024 ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్‌ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్‌ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్‌ సంపత్‌ (అరవింద్‌ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్‌ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్‌ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review) ఎవరెలా చేశారంటే నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్‌ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్‌ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్‌ కథతో పాటే ట్రావెల్‌ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్‌, సీనియర్‌ నటి పవిత్ర లోకేష్‌ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  https://twitter.com/IndianClicks/status/1867486641822347748 డైరెక్షన్ ఎలా ఉందంటే ‘ఫియర్‌’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఫార్మెట్‌ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్‌ వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్‌ వర్క్‌ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్‌ వేదిక నటనఫియర్‌ ఎలిమెంట్స్‌ట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ కథనంలో తడబాటుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    డిసెంబర్ 13 , 2024
    <strong>Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!</strong>
    Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్‌ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ భయం అక్కర్లేదు! దేవర చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో సాంగ్‌ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్‌ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా మూవీ మిడిల్‌లో సాధ్యం కాకపోతే ఎండ్‌ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1832446641393246291 దుమ్మురేపిన తారక్‌ ‘దేవర’ నుంచి సెప్టెంబర్‌ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్‌ ‘బీస్ట్‌’ సినిమాలోని ‘అరబిక్‌ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్‌ హైట్‌పైనా కొందరు కామెంట్స్‌ చేశారు. వాటన్నిటినీ తారక్‌ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్‌ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1835018489784123480 జాతీయస్థాయిలో ట్రెండింగ్‌ దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్​లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్​. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్​లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. https://twitter.com/DevaraMovie/status/1835682846092226856 'పుష్ప 2'ను దాటేసిన 'దేవర' విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!</strong>
    Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 4) థర్డ్‌ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'దావూదీ' (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్‌ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’ ‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్‌’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్‌ బుధవారం (సెప్టెంబర్‌ 4) సాయంత్రం 'దావూదీ' పేరుతో ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తారక్‌ తన ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.&nbsp; యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌.. ‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్‌, జాన్వీ కపూర్‌ బ్యూటీఫుల్‌ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్‌ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్‌ పెంచుకుంటూ 50 మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతోంది.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1831578339078787537 మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌ దావూదీ సాంగ్‌లో తారక్‌ డ్యాన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్‌ ఎనర్జిటిక్‌ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్‌ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్‌ జోష్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్‌ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్‌ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. దావూదీ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్‌ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్‌ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Thyview/status/1831302488340725836 https://twitter.com/krrishnolan/status/1831335770289820070 వెంటాడుతున్న ట్రోల్స్‌ దేవర థర్డ్‌ సింగిల్‌ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని 'అరబిక్‌ కుత్తు'ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్‌, తారక్‌ వేసిన స్టెప్స్‌ కూడా సేమ్‌ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్‌ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్‌ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్‌ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్‌ హైహీల్స్‌ లాంటి షూస్‌ను&nbsp; వేసుకోవాడాన్ని కొందరు హైలేట్‌ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.&nbsp; https://twitter.com/iam_venkatsai_/status/1831547990722671066 https://twitter.com/Sunnykesh/status/1831302199160299619 సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర' ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారోనని తారక్‌ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా,&nbsp; 'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌ం, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.
    సెప్టెంబర్ 05 , 2024
    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!&nbsp;
    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!&nbsp;
    ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్‌ బర్త్‌డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్‌.. తొలి సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్‌ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; దూసుకెళ్తున్న సాంగ్‌ దేవర సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్‌ సాంగ్‌' (Fear Song) పేరుతో సాంగ్‌ లిరికల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్‌ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=CKpbdCciELk&amp;list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&amp;index=3 ‘అనిరుధ్‌ ఎలివేషన్స్‌ ఏంటి’ దేవర ఫస్ట్‌ సాంగ్‌ చూసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చినా.. మిగతా మ్యూజిక్‌ లవర్స్‌, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌ బర్త్‌డే సాంగ్‌లో అనిరుద్‌ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్‌ కంటే ఎక్కువగా అనిరుధ్‌ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్‌ సినిమా టైటిల్‌ ట్రాక్‌ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్‌ డామినేట్‌ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్‌ మధ్యలో లిరిక్స్‌ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్‌ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.&nbsp; ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ‘దేవర’లోని ఫియర్‌ సాంగ్‌ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్‌తో కంపేర్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్‌ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్‌ యాస్‌' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్‌ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్‌ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్‌ బాక్స్‌లో పోస్టులు చేస్తున్నారు.&nbsp; ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.&nbsp;
    మే 20 , 2024
    <strong>Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు</strong>
    Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు
    గ్లామర్‌ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.&nbsp; తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్‌ చల్‌ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్‌ చేసి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్‌ అంతా ముంబయిలో జరిగింది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది.&nbsp; తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది.&nbsp; 2007లో రాఘవ లారెన్స్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఆ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు.&nbsp; దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; తద్వారా 2009లో నారా రోహిత్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'బాణం'లో&nbsp; హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.&nbsp; ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.&nbsp; బాణం సినిమా సక్సెస్‌ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది.&nbsp; అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత&nbsp;దగ్గరగా దూరంగా, రూలర్‌, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్‌' చిత్రాల్లో వేదిక మెరిసింది.&nbsp; ప్రస్తుతం తెలుగులో ఫియర్‌ అనే చిత్రంలో వేదిక&nbsp; (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్‌ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    డిసెంబర్ 09 , 2024
    <strong>This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ఈ వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ద హీరోల చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. దీంతో చిన్న సినిమాలు ఈ వీక్ (OTT Releases Telugu) సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ యు (Miss You) ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజాగా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని పేర్కొంది.  ప్రణయగోదారి (Pranaya Godari) సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari). ఈ చిత్రానికి పి.ఎల్‌.విఘ్నేష్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌ కీలక పాత్ర పోషించారు. పారమళ్ల లింగయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి తప్పక నచ్చుతుందని మూవీ టీమ్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.  ఫియర్‌ (Fear) ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఈ మూవీ డిసెంబర్‌ 14న విడుదల కాబోతోంది. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ (OTT Releases Telugu) చేస్తారని చిత్ర బృందం చెబుతోంది.&nbsp; పా.. పా.. (Pa Pa) తమిళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'డా.. డా..'ను తెలుగులో ‘పా.. పా..’ పేరుతో రిలీజ్‌ చేయబోతున్నారు. డిసెంబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కెవిన్‌, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. గణేష్‌ కె. బాబు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను సైతం తప్పక అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు హరికథ (Harikatha) పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.&nbsp; రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateOne Hundred Years of SolitudeMovieEnglishNetflixDec 11The Auditors&nbsp;MovieEnglish/KoreanNetflixDec 11How To Make Millions Before Grandma DiesMovieEnglish/ThaiNetflixDec 11Dead list CaughtMovieEnglishNetflixDec 12Law PalmaMovieEnglishNetflixDec 12Miss MatchedMovieEnglishNetflixDec 13Carry on&nbsp;MovieEnglishNetflixDec 131992MovieEnglishNetflixDec 14Inside out 2SeriesEnglishHotstarDec 12Jamay no.1MovieHindiZee 5Dec 09DispatchMovieHindiZee 5Dec 13BougainvilleaMovieTelugu/MalayalamSonyLIVDec 13
    డిసెంబర్ 09 , 2024
    <strong>DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;</strong>
    DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్‌!&nbsp;
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'దేవర'. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్‌ సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్‌ రికార్డును తారక్‌ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్‌ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రాజమౌళి ఫ్లాప్‌ సెంటిమెంట్‌! దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్‌ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్‌ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్‌, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్‌ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.&nbsp; 23 ఏళ్ల రికార్డు బద్దలు రాజమౌళి ఫ్లాప్‌ రికార్డు సెంటిమెంట్‌ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్‌ 27, 2001లో రిలీజైన స్టూడెంట్‌ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్‌ 27న దేవర రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్‌ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్‌ సెంటిమెంట్‌ను తారక్‌ బద్దలు కొట్టాడని సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.&nbsp; కార్తికేయ స్పెషల్‌ పోస్టు ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్​గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్​ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్​ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్​నెస్​ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. https://twitter.com/ssk1122/status/1839476779175567669 ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్‌ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌. చిత్రంలోని ఫియర్‌ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు.&nbsp; https://twitter.com/ArtistryBuzz/status/1839517947548794958 https://twitter.com/AnirudhTrend/status/1839516079560802450
    సెప్టెంబర్ 27 , 2024
    <strong>Devara: </strong><strong>‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్ఫూర్తితో ‘దేవర’ టైటిల్‌.. జాన్వీ, అనిరుధ్‌పై తారక్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌!</strong>
    Devara: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్ఫూర్తితో ‘దేవర’ టైటిల్‌.. జాన్వీ, అనిరుధ్‌పై తారక్‌ సెన్సేషన్‌ కామెంట్స్‌!
    ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం కావడంతో దేవర టీమ్‌ గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో వరుస ప్రమోషన్స్‌ నిర్వహించారు. తాజాగా తమిళనాడులోనూ ఓ ఈవెంట్‌ నిర్వహించి అక్కడ కూడా దేవరపై హైప్‌ తీసుకొచ్చారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్ది తారక్‌ కూడా తీరిక లేకుండా దేవర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో దేవరతో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.&nbsp; ‘ఫస్ట్‌ జాన్వీని అనుకోలేదు’ ‘దేవర’ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించింది. ఈ సినిమా ద్వారానే ఆమె మెుదటిసారి తెలుగు తెరకు పరిచయమవుతోంది. అయితే ‘దేవర’ సినిమాకు హీరోయిన్‌గా మెుదట జాన్వీని అనుకోలేదని తాజా ఇంటర్యూలో తారక్‌ తెలిపారు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఎలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో కరణ్‌ జోహార్‌ కాల్‌ చేసి ‘జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుంది’ అని అన్నారని తారక్‌ తెలిపాడు. ‘ఆ తర్వాత కూడా మేము ఆమెను తీసుకోవాలని అనుకోలేదు. కానీ, జాన్వీకపూర్‌ ఇందులో భాగం కావాలని బలంగా కోరుకున్నారు. స్క్రిప్ట్‌ రైటింగ్‌ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్‌, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారుపడ్డారు. కానీ చక్కగా యాక్ట్‌ చేశారు. ఆమె యాక్టింగ్‌తో షాక్‌కు గురి చేశారు’ అని తారక్‌ వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ స్ఫూర్తితో.. ఏ సినిమాకైనా టైటిల్‌ అనేది చాలా కీలకం. అటువంటిది పాన్ ఇండియా స్థాయిలో సినిమా వస్తుందంటే టైటిల్‌కు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అది జాతీయ స్థాయిలో అందరికీ కనెక్టింగ్‌గా అనిపించాలి. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలకు టైటిల్‌ విషయంలో చాలా హోమ్‌ వర్క్‌ చేస్తుంటారు. దేవర విషయంలోనూ అదే జరిగినట్లు తారక్‌ తాజా ఇంటర్యూలో తెలియజేశారు. దేవర టైటిల్‌ను ఫిక్స్‌ చేయడం వెనకున్న కారణాన్ని కూడా తెలియజేసాడు. ఈ సినిమాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలో దేశవ్యాప్తంగా అందరికీ చెరువయ్యే టైటిల్‌ పెట్టాలని ముందే భావించినట్లు తారక్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే ‘దేవర’ను ఫైనల్‌ చేసినట్లు స్పష్టం చేశారు. దేవర అంటే ‘దేవుడు’ అని అర్థమని తారక్‌ చెప్పుకొచ్చాడు. రెహమాన్‌ స్థాయికి అనిరుధ్‌ దేవర చిత్రానికి అనిరుధ్‌ సెన్సేషన్‌ మ్యూజిక్‌ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫియర్‌, బుట్టమల్లె, దావూదీ సాంగ్స్‌ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో అనిరుధ్‌పై తారక్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తోందంటూ ఆకాశానికెత్తారు. ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అనిరుధ్‌కు బాగా తెలుసని, అతను అద్భుతమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అనుకున్నవిధంగా రిజల్ట్‌ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఏఆర్‌ రెహమాన్‌ స్థాయికి అనిరుధ్‌ వెళ్తాడని తారక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్‌ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.&nbsp; తొలి ఇండియన్‌ ఫిల్మ్‌గా 'దేవర' రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొడుతున్న ‘దేవర’ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్‌ ఫెస్ట్‌ (2024 Beyond Fest)లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. బియాండ్‌ ఫెస్ట్‌లో ఇప్పటివరకూ ఏ ఇండియన్‌ సినిమాను ప్రదర్శించలేదు. ఈ రికార్డు తారక్‌కే దక్కనుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. మరోవైపు నార్త్‌ అమెరికాలో టికెట్ల ప్రీసేల్‌ రికార్డును కూడా దేవర కొల్లగొట్టింది. ప్రీసేల్‌ ద్వారా అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసిన ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా నిలిచింది.&nbsp;&nbsp;
    సెప్టెంబర్ 19 , 2024
    <strong>Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!</strong>
    Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!
    యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్‌కు 28 రోజుల సమయం ఉండగానే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ప్రీ బుకింగ్స్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో రిలీజ్‌కు ముందే ‘దేవర’ రికార్డుల వేట మెుదలైందంటూ తారక్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ జోరు! తారక్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్‌ 27 ఎప్పుడు వస్తుందా అని తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ తారక్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ కూడా ‘దేవర’పై మంచి హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ‘దేవర’ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేశారు. డల్లాస్‌లోని XD స్క్రీన్స్‌లో తొలుత ఈ టికెట్స్‌ అందుబాటులోకి తీసుకొని రాగా నిమిషాల వ్యవధిలోనే అవి సేల్ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటివరకూ 19 ప్రాంతాల్లో 52 షోల కోసం టికెట్స్‌ విక్రయించారు. దాని ద్వారా ఇప్పటికే 75,727 డాలర్లు దేవర ఖాతాలోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర ప్రీ బుకింగ్‌ కలెక్షన్స్ 100K డాలర్ల దిశగా పయనిస్తున్నట్లు అక్కడి ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.&nbsp; https://twitter.com/PrathyangiraUS/status/1829778068090863715 ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 31 , 2024
    <strong>Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!</strong>
    Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!
    జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) లాంటి బ్లాక్‌ బాస్టర్‌ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;</strong>
    Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌ తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్‌ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌! తారక్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ 'ఫియర్‌' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’&nbsp; నుంచి రెండో పాట రిలీజ్‌ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్‌, జాన్వీ కపూర్‌ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతూ మరింత దూసుకెళ్తోంది.&nbsp; పెద్ద ఎత్తున ట్రోల్స్‌! 'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాట సోప్‌ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్‌ యాడ్‌ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. అటు మీమ్స్‌ పేజెస్‌ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌ ట్యూన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్‌ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్‌ ఒకే సమయంలో పాజిటివ్‌, నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకొని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; స్ట్రాంగ్‌ కౌంటర్‌ దేవర సెకండ్‌ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్‌ మాత్రం సూపర్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్‌..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1820689638714998854 ‘దేవర’ వచ్చేస్తునాడు..! ‘దేవర’ మూవీ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
    ఆగస్టు 07 , 2024
    <strong>HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?</strong>
    HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
    తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్‌ నటనతో సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్‌ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; సూర్య అసలు పేరు ఇదే! సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్‌ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్‌ (Vijay)తో కలిసి సూర్య నటించాడు. ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి! సూర్య తండ్రి శివ కుమార్‌ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్‌ శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్‌ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.&nbsp; రూ.600 జీతంతో ఉద్యోగం హీరోగా నటించిన తండ్రి శివకుమార్‌, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.&nbsp; కెమెరా ఫియర్‌ కెరీర్‌ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్‌ చెప్పడం, ఎమోషన్స్‌ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్‌ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట. రఘువరన్‌ వ్యాఖ్యలతో మార్పు సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు. తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు షార్ట్‌ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై’వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.&nbsp; సూర్య డబ్బింగ్‌ చెప్పారని తెలుసా! ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్‌ వెర్షన్‌లో హీరో అభిషేక్‌ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్‌ చూపించారు. అవార్డులే అవార్డులు 27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్‌, 5 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌, 2 సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డ్స్‌, 2, ఎడిసన్‌ అవార్డ్స్‌, 2 సైమా అవార్డ్స్‌, 6 విజయ్ అవార్డ్స్‌ అందుకున్నారు.&nbsp; సేవా కార్యక్రమాలు మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్‌’ను ప్రారంభించడం గమనార్హం. ‘కంగువా’గా రాబోతున్న సూర్య&nbsp; సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్‌ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
    జూలై 23 , 2024
    <strong>Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు</strong>
    Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు
    టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్‌ ప్రసాద్‌ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ సైతం విధించింది.&nbsp; ఏం జరిగిందంటే? సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ (Prasad Behera Arrest)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ప్రసాద్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. షూటింగ్‌ టైమ్‌లో తన ప్రైవేటు భాగాలను తాకాడని ఆరోపించింది. ఈ క్రమంలో గట్టిగా నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత కూడా పదే పదే తప్పుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.&nbsp; https://twitter.com/Theteluguone/status/1869352505127407721 ‘తిడుతూ దాడి కూడా చేశాడు’ కొద్ది రోజుల తర్వాత మరో వెబ్‌సిరీస్‌లో కలిసి పనిచేసినప్పుడు కూడా మరోమారు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని ప్రశ్నించగా అందరిముందు దూషించాడని చెప్పింది. డిసెంబర్‌ 11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి కూడా చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌పై 75(2), 79, 351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.&nbsp; ప్రసాద్‌ ఎలా ఫేమస్‌ అంటే? ‘మా విడాకులు’, ‘పెళ్లి వారమండి’, ‘దిల్ పసంద్’, ‘వింధ్యా విహారి’ వంటి యూట్యూబ్‌ కామెడీ సిరీస్‌లతో ప్రసాద్ బెహరా మంచి గుర్తింపు సంపాదించాడు. అతడి కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో చిన్నగా సినిమా అవకాశాలు సైతం అతడ్ని వరించాయి. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) మూవీలో ప్రసాద్‌ మంచి రోల్‌ పోషించాడు. తనలో కమెడియన్‌తో పాటు మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు.&nbsp; కెరీర్‌ ముగిసినట్లేనా? కమిటీ కుర్రోళ్లు సక్సెస్‌తో ప్రసాద్‌ బెహారాకు టాలీవుడ్‌లో అవకాశాలు మెుదలయ్యాయి. ఈ క్రమంలో అతడు అరెస్టు కావడం ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి. అది కూడా యువతిని లైంగికంగా వేధించిన కేసులో జైలుకు వెళ్లడం తీవ్ర చర్చకు తావిస్తోంది. క్రమశిక్షణ, మంచి ప్రవర్తన లేని వ్యక్తులకు అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తుంటాం. తాజా అరెస్టు నేపథ్యంలో సినిమాల్లోకి ప్రసాద్‌ను తీసుకోవడం కష్టమేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా కేసులో దోషి అని తేలితే ఇండస్ట్రీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలక మానదని అంటున్నారు.&nbsp;
    డిసెంబర్ 18 , 2024
    <strong>Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్‌స్టాప్‌? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్‌!&nbsp;</strong>
    Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్‌స్టాప్‌? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్‌!&nbsp;
    మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్‌ బాబు, మనోజ్‌ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇంటి వద్ద నెలకొన్న ఘర్షణ పరిస్థితులు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఆదివారం (డిసెంబర్‌ 8) మెుదలైన ఈ వ్యవహారం బుధవారం (డిసెంబర్‌ 11) సాయంత్రం వరకు దాదాపు నాలుగు రోజుల పాటు రచ్చ చేస్తూనే వచ్చింది. రాచకొండ సీపీ సుదీర్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పడింది. బుధవారం మంచు మనోజ్‌తో పాటు సోదరుడు మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ ఇవ్వడంతో వివాదానికి కేంద్రమైన హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పడింది. షూటింగ్‌కు వెళ్లిన మనోజ్‌.. తండ్రి మోహన్‌బాబుతో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌ గత నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గాయాలతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపై రాచకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, తనకు జరిగిన అన్యాయంపై వరుస ప్రెస్‌మీట్లతో ప్రజలకు తెలియజేయడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అటువంటి మనోజ్‌ బుధవారం రాచకొండ సీపీ సుదీర్‌ బాబు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వివాదానికి తాత్కాలికంగా చెక్‌ పెట్టారు. గురువారం సినిమా షూటింగ్‌కు ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్‌ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో మనోజ్‌ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. ఇటీవల నారా రోహిత్‌ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి.  తముళ్లకు మంచు లక్ష్మి కౌంటర్‌.. మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేసినప్పటికీ మంచు లక్ష్మీ ఎక్కడా ఈ వివాదంలో తలదూర్చలేదు. పైగా సోదరులు ఇద్దరు మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే మంచు లక్ష్మీ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంతటితో ఊరుకోకుండా నెట్టింట పరోక్ష కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ప్రవచనాన్ని గురువారం ఉదయం మంచు లక్ష్మీ పోస్టు చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు? అని మంచు లక్ష్మీ కొటేషన్‌ పెట్టింది. సోదరులు ఇద్దరు ఆస్తుల కోసం గొడవపతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె సూక్తి పెట్టినట్లు అర్ధమవుతోంది.  https://twitter.com/LakshmiManchu/status/1867031240064504027 మోహన్‌ బాబుపై హత్య కేసు మీడియాపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సీనియర్ నటుడు మోహన్‌పై హత్య కేసు నమోదైంది. మోహన్‌ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొలుత మోహన్‌ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని పెద్దఎత్తున్న జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మరోమారు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలను పరిశీలించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్‌ 109 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసును పెట్టారు. దీనికి సంబంధించి త్వరలో మోహన్‌బాబును పోలీసులు విచారించే అవకాశముంది.  ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు’ మంచు మనోజ్‌ చేసిన ఫిర్యాదులో భాగంగా రాచకొండ సీపీ కార్యాలయానికి గురువారం సాయంత్రం మంచు విష్ణు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా జరిగిన మంచు కుటుంబం వివాదాలపై సీపీ సుదీర్‌ బాబు ఆరా తీశారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడ్డవద్దని సూచించారు. సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, గొడవలు చేయవద్దని చెప్పారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్న సరే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇకపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిలే వ్యవహరిస్తే లక్షరూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.&nbsp;
    డిసెంబర్ 12 , 2024
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    <strong>Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!</strong>
    Raj Tarun Case: కడుపు చేసి అబార్షన్‌ చేయించాడు..రాజ్‌తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు!
    టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్‌ (Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; తాజా ఫిర్యాదులో ఏముందంటే? లావణ్య ఇచ్చిన లేటెస్ట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్‌ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. అంతకుముందు లావణ్య తన ఫిర్యాదులో వారిపై మరిన్ని అభియోగాలు మోపారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. రాజ్‌తరుణ్‌ కుటుంబానికి తన ఫ్యామిలీ రూ.70 లక్షలు ఇచ్చిందని లావణ్య తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని రెండో నెలలోనే అతడు అబార్షన్‌ చేయించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. సర్జరీకి సంబంధించిన ఆసుపత్రి బిల్లులు రాజ్‌ చెల్లించినట్లు చెప్పారు. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్‌ తన నుంచి దూరమయ్యాడని పోలీసులకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నటి మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. https://twitter.com/i/status/1811302046747803956 కీలక ఆధారాలు అందజేత! రాజ్‌తరుణ్‌ను హెచ్చరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియో క్లిప్స్‌పై లావణ్య స్పందించారు. తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వంగా ఆడియో రికార్డ్‌ చేశారని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా, రాజ్‌తరుణ్‌ విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తమ బెదిరింపు, చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్, టెక్నికీల్‌ ఎవిడెన్స్‌ను నార్సింగి పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1811055519525679537 లావణ్యనే బెదిరించింది : మాల్వీ నటుడు రాజ్‌తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని 6 నెలలుగా తాము మాట్లాడుకుందే లేదని ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తాను లావణ్యను బెదిరించలేదని, కనీసం ఆమె ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు లావణ్యనే తనకు కాల్‌ చేసి వేధించిందని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని లావణ్య మెంటల్‌గా హేరాస్‌ చేసిందని చెప్పారు. తన నెంబర్ బ్లాక్‌ చేస్తే ఆమె నేరుగా తన తల్లిదండ్రులకు కాల్‌ చేసి వాళ్లని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తన పేరెంట్స్‌ నెంబర్‌ ఎవరితోనూ షేర్‌ చేసుకోలేదని అయినా ఆమె వద్దకు ఎలా వచ్చిందని మాల్వీ ప్రశ్నించారు. లావణ్య తన మీద అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్‌ కేవలం తనకు సహచర నటుడు మాత్రమేనని మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటామని మాల్వీ స్పష్టం చేశారు. అంతకుమించి అతడిలో ఎలాంటి సంబంధం లేదని ఇంటర్యూలో వెల్లడించారు. తన సోదరుడు గురించి చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు.&nbsp; https://twitter.com/i/status/1809555802203607322 లావణ్యపై ఫిర్యాదు మరోవైపు నటి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిల్మ్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మాల్వీ మల్హోత్ర ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టోలిచౌకి అజీజ్‌బాగ్‌కాలనీలోని విక్టోరియం ఆదిత్య ఎంప్రెస్‌ టవర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సోదరుడికి లావణ్య వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతుందని మాల్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఫిల్మ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&nbsp;
    జూలై 11 , 2024
    <strong>Raj Tarun Case: </strong><strong>రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!</strong>
    Raj Tarun Case: రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!
    హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య శుక్రవారం (జులై 5) పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో యంగ్‌ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ్‌తరుణ్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. లావణ్యతో గతంలో జరిగిన వ్యవహారం మెుత్తాన్ని బయటపెట్టాడు. టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారిపోయిన ఈ కేసులో శనివారం (జులై 6) ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకి ఉల్టాగా పోలీసులు నోటీసులు పంపారు.&nbsp; నోటీసులు ఎందుకంటే? హీరో రాజ్‌తరుణ్‌పై మాజీ ప్రేయసి లావణ్య.. శుక్రవారం (జులై 5) నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని పేర్కొంది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్ర, ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్‌లో పేర్కొంది. మరోవైపు అందులో ఎలాంటి వాస్తవం లేదని రాజ్‌తరుణ్‌ కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నార్సింగి పోలీసులు లావణ్యకు ఊహించని షాక్‌ ఇచ్చారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ నోటీసుల్లో కోరారు. 91 CRPC కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నోటీసులపై లావణ్య ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఆమె సమర్పించే ఆధారాలను బట్టి ఈ కేసు ముందుకు కదలనుంది.&nbsp; ఫిర్యాదులోని మరిన్ని విషయాలు! శుక్రవారం నార్సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య మరిన్ని ఆరోపణలు చేశారు. 2012 నుంచి రాజ్‌తరుణ్‌ తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్‌ స్టార్ట్‌ చేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు గురువారమే స్పష్టం చేశారు. అయితే స్టార్‌ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆధారాల కోసం ఇవాళ లావణ్యకు నోటీసులు పంపారు. అది చూసి తట్టుకోలేకపోయా: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ శుక్రవారమే (జులై 5) స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; ‘తన తండ్రినీ బెదిరించింది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 06 , 2024
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ను హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.  షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్‌ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.&nbsp;&nbsp;&nbsp; https://twitter.com/InformedAlerts/status/1760553942201852102 మౌనిక సంచలన ఆరోపణలు! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్‌ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; https://twitter.com/i/status/1760553061007937805 బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
    ఫిబ్రవరి 22 , 2024
    <strong>Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌</strong>
    Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్‌ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్‌ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్‌ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్‌ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్‌ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. మంచు మనోజ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘విష్ణు గొడవ చేయలేదు’ మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవపై ఆయన భార్య నిర్మల (Manchu Nirmala) మెుదటిసారి రియాక్ట్‌ అయ్యారు. శనివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ‘డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడు. అయితే ఈ విషయంపై విష్ణు మీద మంచు మనోజ్‌ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.  https://twitter.com/FilmyBowl/status/1868917278437482648 మనోజ్‌ ప్రెస్‌నోట్‌లో ఏముందంటే? తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్‌ ఆదివారం (డిసెంబర్‌ 15) ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశాడు. ‘నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్‌ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా’ అని మనోజ్‌ తన ప్రకటనలో తెలియజేశాడు. అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.  https://twitter.com/pakkatelugunewz/status/1868322391496999391 పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇదిలా ఉంటే సినీ నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారంటూ ప్రధాన మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మనోజ్‌ సోమవారం భార్య, పిల్లలతో ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామిని మనోజ్‌ దంపతులు సందర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దైవ దర్శనం అనంతరం మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తున్న ఆళ్లగడ్డ ప్రజలు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో జనసేనలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్‌’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అయితే రాజకీయ ఎంట్రీని ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/abntelugutv/status/1868898831271968798 https://twitter.com/abntelugutv/status/1868886038598602791
    డిసెంబర్ 17 , 2024
    <strong>Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!</strong>
    Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!
    మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తండ్రి కొడుకులు మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌(Manchu Manoj)లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు సోమవారం రాత్రి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిద్దరి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన హైదరాబాద్‌ పహాడిషరీఫ్‌ పోలీసులు విడివిడిగా రెండు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్‌ ఈ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు.&nbsp; గేట్లు తోసుకెళ్లిన మనోజ్‌.. హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్‌, అతడి భార్య మౌనిక తిరిగి ఇంటికి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. వారి వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో మనోజ్‌ దంపతులు కారులోనే చాలా సేపు ఉండాల్సి వచ్చింది. వారి 7 నెలల పాప లోపలే ఉండటంతో కారు నుంచి బయటకు దిగిన మనోజ్‌ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఏం గొడవ జరుగుతుందా? అని స్థానికంగా ఆందోళన నెలకొంది. మనోజ్‌కు అల్టిమేటం.. మోహన్‌ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శంషాబాద్‌ జల్‌పల్లి నివాసం నుంచి మనోజ్‌ను పంపించేయాలని మోహన్‌ బాబు నిర్ణయించారు. తాజా ఘర్షణ నేపథ్యంలో మనోజ్‌ ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదని అల్టీమేటం జారిచేసినట్లు తెలుస్తోంది. అటు మనోజ్‌ సైతం వెళ్లి పోవాలని డిసైడ్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వాహనాలు తెప్పించి సామాన్లు తరలించేందుకు మనోజ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.&nbsp; గన్‌మెన్‌ల కోసం రిక్వెస్ట్‌ తన తండ్రి మోహన్‌బాబుతో వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సంబంధిత అధికారికి తెలియజేశారు. తమ ఇద్దరికీ గన్‌మెన్లను కేటాయించాలని మనోజ్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసు అధికారి అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.&nbsp; మంచు విష్ణు వార్నింగ్‌.. దుబాయి నుంచి వచ్చిన మంచు విష్ణు.. ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్‌ తరపున వచ్చిన బౌన్సర్లకు విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ బౌన్సర్‌కు వేలు చూపిస్తూ విష్ణు సీరియస్‌గా మాట్లాడటం గమనించవచ్చు.&nbsp; https://twitter.com/prime9news/status/1866426632845832420 ఫామ్‌ హౌస్ చుట్టే లొల్లి.. మోహన్‌ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్‌ సంస్థల ఆస్తుల పంపకాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ మెుదలైనట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ కూడా తనకు సంబంధంలేని జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉండటంతో మోహన్‌బాబు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. తమ కుమారుడు మనోజ్‌, కోడలు మౌనిక తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని హైదరాబాద్‌ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.&nbsp; ‘అమ్మ ఒంటరిగా ఉండటంతో’..&nbsp; ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడన్న మోహన్‌బాబు ఆరోపణలను మంచు మనోజ్‌ ఖండించారు. ఆ ఇంట్లో ఉంటున్నందుకు గల కారణాన్ని సోమవారం అర్ధరాత్రి పోస్టు చేసిన సుదీర్ఘ పోస్టులో వివరించారు. 'నా సోదరుడు (మంచు విష్ణు) కొన్ని కారణాల వల్ల దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. మా నాన్న, అతని స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇంట్లోకి వెళ్లా. ఏడాదిపైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్‌ ఫోన్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నా’ అని అన్నారు.&nbsp;&nbsp; డబ్బు వృథా చేస్తోంది నేనా? విష్ణునా? మనోజ్‌ కారణంగా తన విలువైన వస్తువులు, ఆస్తుల భద్రత విషయంలో భయపడుతున్నట్లు మోహన్‌బాబు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో మోహన్‌బాబు పేర్కొన్నారు. దీనిపైనా మంచు మనోజ్‌ తన ఎక్స్‌పోస్టులో స్పందించారు. 'నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రగా ఉంటూ కెరీర్‌ను నిర్మించుకున్నా. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశా. ఒక్కరూపాయి తీసుకోలేదు. నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. అడిగినట్టు నిరూపించండని సవాల్‌ చేస్తున్నా. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృథా చేస్తున్నారు.. నేనా? విష్ణునా?' అంటూ నిలదీశారు. నన్ను అణిచివేసేందుకే.. వివాదానికి కేంద్రమైన హైదరాబాద్‌ జల్‌పల్లిలోని మోహన్‌ బాబు (Mohan Babu) ఇంటి వద్ద నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘నేను చేస్తోంది ఆత్మగౌరవ పోరాటం. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన అంశం. ఒక మగాడిగా నాతో నేరుగా వచ్చి ఇదంతా చేసినా పర్వాలేదు. కానీ, నన్ను అణిచివేసేందుకు నా భార్యను బెదిరించడం, ఏడు నెలల తన పాపను వివాదంలోకి లాగుతున్నారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే నాపై దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదు’ అని చెప్పారు.&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1866385879117553785 పోలీసుల చర్యలపైనా.. ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంటి వద్ద మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్‌ తరపున భారీగా బౌన్సర్లు పోగయ్యారు. సోమవారమే మంచు విష్ణు తరపున 40 బౌన్సర్లు రాగా, మనోజ్‌ మరో 30 మందిని తన భద్రత కోసం పిలిపించారు. తాజాగా ఈ అంశంపై మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తనకు రక్షణగా తెప్పించుకున్న వ్యక్తులను బెదరగొట్టి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. తనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’ అని మనోజ్ అన్నారు.&nbsp; https://twitter.com/tv5newsnow/status/1866376337285636475 బౌన్సర్ల మధ్య ఘర్షణ మరోవైపు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద మంచు విష్ణు, మంచు మనోజ్‌ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్‌ తరపు బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు, సెక్యురిటీ సిబ్బంది బలవంతంగా బయటకి పంపించేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో వారు దౌర్జన్యంగా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుతున్నట్లు సమాచారం. ఒకరినొకరు తోసుకున్నారని వార్తలు వస్తున్నాయి.&nbsp; https://twitter.com/AadhanTelugu/status/1866381934546575621 సోమవారం రాత్రి హైడ్రామా సోమవారం రాత్రి పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్‌కు తన అనుచరులతో స్వయంగా వెళ్లిన మనోజ్‌ తనపై గుర్తు తెలియనివారు దాడి చేశారంటూ తొలుత ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు లేఖ రాశారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌, చిన్న కోడలు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని సీపీని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్‌, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్‌ కుట్ర చేస్తున్నారని సీపీకి తెలియజేశారు.&nbsp; https://twitter.com/jsuryareddy/status/1866227364629520738 పవన్‌ కల్యాణ్‌కు మనోజ్‌ రిక్వెస్ట్‌ తండ్రి మోహన్‌ బాబు రాసిన లేఖను సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్‌వేదికగా ఖండించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ సహా ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలకు ట్యాగ్‌ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తనపై తన భార్య మౌనకపై తన తండ్రి మోహన్‌ బాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తన పరువు మర్యాదాలను కావాలనే తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగేలా చేశారని రాసుకొచ్చారు. ఈ మేరకు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ మంచు మనోజ్‌ ఇచ్చారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. https://twitter.com/HeroManoj1/status/1866180910472974706
    డిసెంబర్ 10 , 2024

    @2021 KTree