• TFIDB EN
  • ఫ్యామిలీ స్టార్
    UATelugu
    గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఓ రోజు ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? కుటుంబ క‌ష్టాల నుంచి గోవర్ధన్‌ గట్టెక్కాడా లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Tamil )
    Watch
    2024 June 264 months ago
    ఫ్యామిలీ స్టార్ హిందీ వెర్షన్ జూన్ 28 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
    2024 June 105 months ago
    ఫ్యామిలీ స్టార్ చిత్రం జూన్ 17న స్టార్‌ మాలో సాయంత్ర 6గంటలకు ప్రసారం కానుంది.
    2024 June 45 months ago
    ఫ్యామిలీ స్టార్ సినిమా త్వరలో మా టీవీలో డిజిటల్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది
    మరింత చూపించు
    రివ్యూస్
    YouSay Review

    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?

    విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌‘ (Family Star Review In Telugu). నేడు (ఏప్ర...read more

    How was the movie?

    తారాగణం
    విజయ్ దేవరకొండ
    గోవర్ధన్
    మృణాల్ ఠాకూర్
    ఇందు
    దివ్యాంశ కౌశిక్
    జగపతి బాబు
    ఇందు తండ్రి
    వెన్నెల కిషోర్
    సమర్థ్
    రవి ప్రకాష్
    గోవర్ధన్ సోదరుడు
    రాజా చెంబోలుగోవర్ధన్ సోదరుడు
    రోహిణి హట్టంగడి
    గోవర్ధన్ అమ్మమ్మ
    వాసుకి ఆనంద్
    అభినయ
    రవిబాబు
    అచ్యుత్ కుమార్
    అజయ్ ఘోష్
    ప్రభాస్ శ్రీను
    వీటీవీ గణేష్
    జబర్దస్త్ రాంప్రసాద్
    రష్మిక మందన్న
    (ప్రత్యేక స్వరూపం)
    సిబ్బంది
    పరశురామ్
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    శిరీష్నిర్మాత
    పరశురామ్
    రచయిత
    గోపీ సుందర్
    సంగీతకారుడు
    KU మోహనన్
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్ర్
    కథనాలు
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌ 5) ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్‌ చేస్తూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు! ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్‌, డిజిటల్‌ పేజ్‌ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్‌ స్టెప్పులు వేసి అదరగొట్టారు.  ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.  https://twitter.com/mr_rowdi/status/1775554308127551770?s=20 https://twitter.com/mr_rowdi/status/1775581652800131408 విజయ్‌, మృణాల్‌ కూడా ఇంతే! ఫ్యామిలీ స్టార్‌ సినిమాలోని 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. హుక్‌ స్టెప్పులతో ఆడియన్స్‌ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి. https://twitter.com/i/status/1775183286417125744 సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఇదే ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు  వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.  'హిట్ కొట్టేసారండీ'  ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్‌ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని 'హిట్ కొట్టేసారండీ' అని కంప్లీమెంట్‌ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్‌ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్‌ ఇట్‌ అంటూ దేవరకొండను హగ్‌ చేసుకుందట. మరోవైపు విజయ్‌ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు. 
    ఏప్రిల్ 04 , 2024
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
    సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్‌ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్‌ దశలోనే ఉన్న టాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్‌ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్‌ అయిన టాలీవుడ్‌ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ క్రిష్‌ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్‌ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్‌.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్‌ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్‌ స్వయంగా పోస్టర్‌ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్‌ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్‌ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టీజర్‌ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఫ్యామిలీ స్టార్‌ (Family Star) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది.  తమ్ముడు (Thammudu) స్టార్‌ హీరో నితిన్‌ (Nithiin) అప్‌కమింగ్‌ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.  ఘాతీ (GHAATI) స్టార్‌ హీరోయిన్‌ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్‌ మూవీ 'ఘాతీ' కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. కాంతారా 2 (Kantara 2) రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్‌ దక్కించుకోవడం విశేషం.  కంగువా (Kanguva) 2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.
    ఏప్రిల్ 03 , 2024
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..!
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌కు’సెన్సార్‌ బోర్డు ఝలక్..!
    విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం  మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత విజయ్‌-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.  ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది.  సెన్సార్‌ ఝలక్‌! ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం. ఆ చిత్రాలతో గట్టి పోటీ! విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్‌ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్‌కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్‌ బాస్టర్ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్‌ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్‌ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌.. ఏప్రిల్‌ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏమేర రాణిస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 03 , 2024
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.  హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.  సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. 
    మార్చి 21 , 2024
    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). పరుశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే మిక్స్‌డ్‌ టాక్ రావడంతో తొలి రోజు కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. విజయ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ డే 1 కలెక్షన్స్ ఈ సినిమాకే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరి వీకెండ్‌కైనా ఈ మూవీ కలెక్షన్లలో పురోగతి వచ్చిందా? శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే? ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ వీకెండ్‌ ముగిసే సరికి భారత్‌లో రూ.11.95 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.5.75 కోట్లు, రెండో రోజు రూ.3.2 కోట్లు, మూడో రోజు రూ. 3 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంపై వస్తోన్న ట్రోల్స్, నెగిటివ్‌ ప్రచారం.. ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 5లక్షలకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్‌ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే. కథేంటి? గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ. 
    ఏప్రిల్ 08 , 2024
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ కథనంలో చూద్దాం.  లోయెస్ట్‌ కలెక్షన్స్‌! మిక్స్‌డ్‌ టాక్‌ ఎఫెక్ట్.. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star Day 1 Collections) కలెక్షన్స్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10.60 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకంటిచాయి. భారత్‌లో రూ. 6.6 కోట్ల గ్రాస్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.4 కోట్లు, తమిళనాడు రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రూ.20 లక్షలు రాబట్టినట్లు వివరించాయి. దీంతో  విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ నిలిచింది. విజయ్‌ గత చిత్రం ‘ఖుషి’.. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్‌ సాధించడం గమనార్హం. ఓవర్సీస్‌లో దూకుడు! లోకల్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా డాలర్ల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ 4.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఈ వీకెండ్‌లో మరిన్ని డాలర్లు సాధించే దిశగా ‘ఫ్యామిలీ స్టార్‌’ పరుగులు పెడుతోంది.  బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? భారీ అంచనాలతో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత డే1 కలెక్షన్స్‌ బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాగా శ్రమించాల్సి ఉంది.  ‘ఫ్యామిలీ స్టార్‌’.. కథేంటి గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.  https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 06 , 2024
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ పరుశురామ్‌ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఓ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ కూడా అవుతోంది.  ఈ సాంగ్‌ నా ఫేవరేట్‌: విజయ్‌ 'ఫ్యామిలీస్టార్‌'కి సంబంధించి మొదటి సాంగ్‌ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్‌  చేసింది. 'నంద నందన' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్‌ BGM అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్‌ శ్రీరామ్‌ స్వరపరచగా సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్‌ చేసిన విజయ్‌.. 'మొదటిపాట.. నా ఫెవరేట్‌.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్‌ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం ‌అందిస్తున్నారు.  View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) ఫిదా చేస్తున్న మృణాల్‌..! ఈ సాంగ్‌ ప్రోమోలో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 'సీతారామం' తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్‌ లుక్‌లో మృణాల్‌ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్‌ ఈ స్థాయి ఇంపాక్ట్‌ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్‌ చేస్తుందోనని ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్‌ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్‌ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి. ‘దేవర’ స్థానంలో..! 'ఫ్యామిలీ స్టార్‌'  రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda) కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్‌ (Jr NTR) 'దేవర' (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో 'ఫ్యామిలీ స్టార్‌'ను రిలీజ్‌ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. 'ఖుషీతో మంచి హిట్‌ అందుకున్న విజయ్‌.. ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! గతంలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' గ్లింప్స్‌.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి?' అని విజయ్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్‌పై రీల్స్‌ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్‌ ఫెమినిస్ట్‌ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.  సినిమా కథపై క్రేజీ అప్‌డేట్‌! ఇక ఫ్యామిలీ స్టార్‌ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్‌ మూవీ కూడా ‘గ్యాంగ్‌ లీడర్‌’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్‌ రీవెంజ్‌ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
    ఫిబ్రవరి 06 , 2024
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు రచన & దర్శకత్వం : పరుశురామ్‌ పెట్ల సంగీతం : గోపి సుందర్‌ ఛాయా గ్రహణం : కె.యు మోహనన్‌ ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ విడుదల తేదీ : ఏప్రిల్‌ 5, 2024 విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star Review In Telugu). నేడు (ఏప్రిల్‌ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్‌ తర్వాత విజయ్‌తో డైరెక్టర్‌ పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను అందించిందా? వంటి అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి గోవ‌ర్ధన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధన్ చేతికందుతుంది. ఆ పుస్తకం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇంత‌కీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధన్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే నటుడు విజయ్‌ దేవరకొండ (Family Star Review In Telugu) ఎప్పటిలాగానే తన మార్క్ యాటిట్యూడ్‌తో ఈ మూవీలోనూ అదరగొట్టాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో జీవించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ చూపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.  యాక్షన్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నా... తనదైన స్టైల్‌లో మెప్పించాడు. విజయ్- మృణాల్ మధ్య వచ్చే సీన్లు.. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. తన నటనతో పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్‌ - మృణాల్‌ మధ్య కెమెస్ట్రీ  వీరి మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇక వాసుకి, రోహిణి అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్ పరుశురామ్‌.. ఫ్యామిలీ స్టార్‌ ద్వారా మరోమారు తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ ఫ్యామిలి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలతో నింపేసిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ అంశాలు మేళవించి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా విజయ్- మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే ఇగో తాలుకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబం కోసం మిడిల్‌ క్లాస్‌ వారు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు పరుశురామ్. అయితే ఇదే ఫ్లోను సెకండాఫ్‌లో ఇంకాస్త కొనసాగిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్‌లో విజయ్- మృణాల్ మధ్య వచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.   రొటిన్‌ కథను ఎంచుకోవడం, డైలాగ్స్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.   ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Family Star Review In Telugu).. విజయ్‌-పరుశురామ్‌ కాంబోలో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ మూవీకి మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యింది. అయితే  ఈ సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇంట్రోసాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా, నందా నందన సాంగ్స్ ఫీల్‌ గుడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దిల్‌రాజు ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్ విజయ్‌ - మృణాల్‌ కెమెస్ట్రీఎమోషనల్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vijay-devarkonda.html
    ఏప్రిల్ 08 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం.   కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.  దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.  అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.  అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.  అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.  విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.  సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.  నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.  తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.  అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.  ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన  'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు. 
    ఏప్రిల్ 17 , 2024
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం యంగ్‌ సెన్సేషన్‌ మమితా బైజును హీరోయిన్‌గా లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ! ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్‌ భావించిందట. ఈ ఆఫర్‌ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్‌తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.&nbsp; ఆ హీరోయిన్ల సరసన చోటు! మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌, నివేదా థామస్‌, మాళవిక మోహనన్‌ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్‌ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్‌ ఆడియన్స్‌.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్‌ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) మమితాపై ఆసక్తికి కారణమదేనా? 'VD 12' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇటీవల వచ్చిన&nbsp; ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడం.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్‌ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 20 , 2024
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.&nbsp; మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 31 సంవత్సరాలు&nbsp; మృణాల్ ఠాకూర్&nbsp; ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
    ఏప్రిల్ 08 , 2024
    Rashmika Mandanna: విజయ్‌, రష్మిక దొరికిపోయారుగా..ఇవిగో సాక్ష్యాలు!
    Rashmika Mandanna: విజయ్‌, రష్మిక దొరికిపోయారుగా..ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్‌ స్టార్స్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా.. సహజీవనం మాత్రం చేస్తున్నారంటూ తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో విజయ్‌, రష్మికలు షేర్‌ చేసుకున్న సోషల్‌ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.&nbsp; https://twitter.com/middaygujarati/status/1746832311000400204?s=20 విజయ్‌, రష్మికలు సీక్రెట్‌గా వియత్నాం వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ విడివిడిగా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో వీరిద్దరూ పలుమార్లు విడివిడిగా ఫోటోలను షేర్ చేశారు. దీంతో వీరు లివింగ్‌ రిలేషన్‌షిప్ (సహజీవనం) చేస్తున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే వారు పెళ్లికి ఆసక్తి చూపడం లేదని చెప్పుకొస్తోంది. విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ గురించి వార్తలు కూడా ఇటీవల తెగ వైరల్‌ అయ్యాయి. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై విజయ్‌, రష్మిక ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే విజయ్‌ టీమ్ మాత్రం అవి కేవలం రూమర్స్‌ మాత్రమేనని ఇందులో నిజం లేదని కొట్టిపారేసింది.&nbsp; అయితే విజయ్‌, రష్మిక రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు చాలా హ్యాపీగా ఉన్నారని ఇప్పట్లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకునే ఆలోచన వారికి లేదని తెలిపారు. ఈ జంట ఫోకస్‌ ప్రస్తుతం కెరీర్‌పై ఉందని, సినిమాల్లో నటిస్తూ బిజీగా వారు ఉన్నారని గుర్తుచేశారు.&nbsp; ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల రష్మిక.. రణబీర్ కపూర్‌తో జోడీకడుతూ ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన ‘యానిమల్’ వరల్డ్‌లో గీతాంజలి పాత్రలో రష్మిక నటన చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. యానిమల్‌ సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు ఉన్నాయి.&nbsp; ఇక విజయ్‌ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సమంతతో చేసిన ఖుషి చిత్రం పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.&nbsp; విజయ్ ప్రస్తుతం ‘గీతా గోవిందం’ డైరెక్టర్‌ పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడు.
    జనవరి 18 , 2024
    <strong>Game Changer: డల్లాస్‌ టూ తిరుపతి.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ లాక్‌!</strong>
    Game Changer: డల్లాస్‌ టూ తిరుపతి.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ లాక్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గేమ్‌ ఛేంజర్ ప్రమోషన్స్‌, అప్‌డేట్స్‌ విషయంలో గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలోనైనా ప్రమోషన్స్‌పై మూవీ టీమ్‌ ఫోకస్‌ పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఈవెంట్స్‌ ఏ తేదీల్లో, ఎక్కడ జరగనున్నాయో ముందే చెప్పేశారు. దీంతో మెగా ప్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ప్రమోషన్ ప్లాన్స్ రివీల్‌ గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) ప్రమోషన్‌ ఈవెంట్స్‌పై నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రమోషన్స్‌పై తమ ప్లాన్‌ ఎంటో తెలియజేశారు. ఈ నెల 9న లక్నోలో టీజర్ లాంచ్ చేయనున్నట్లు దిల్‌రాజు చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని డల్లాస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం చెన్నైలో మరో ఈవెంట్ ఉండనున్నట్లు తెలిపారు. జ‌న‌వ‌రి తొలి వారంలో ఏపీ, తెలంగాణ‌ల్లో స్పెషల్‌ ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు.. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి స్పెష‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమాను రిలీజ్ పేర్కొన్నారు. సాంగ్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా గేమ్‌ ఛేంజర్‌లో ఉంటుందని దిల్‌రాజు చెప్పారు.&nbsp; https://twitter.com/TeamRCGuntur_/status/1854106243595690248 https://twitter.com/TheAakashavaani/status/1853657034605953343 తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్‌ నిర్వహించాలని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్‌ ప్లేసులో ఈవెంట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్‌ చరణ్‌ బాబాయ్ అయిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్‌ ఆహ్వానాన్ని పవన్‌ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.&nbsp; దిల్‌ రాజు 50వ చిత్రంగా.. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఫిల్మ్‌ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్‌ ఛేంజర్‌ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్‌ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్‌ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్‌ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్‌ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్‌ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు 'గేమ్‌ ఛేంజర్‌'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. శంకర్‌ ఫామ్‌తో కలవరం! RRR వంటి బ్లాక్‌ బాస్టర్ తర్వాత శంకర్‌తో రామ్‌చరణ్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ఎగిరిగంతేశారు. అయితే ఇటీవల శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌తో వారి ఉత్సాహం పూర్తిగా దెబ్బతింది. ‘భారతీయుడు 2’ అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ డైరెక్షన్‌పై మెగా అభిమానుల్లో అనుమానాలు ఏర్పడ్డాయి. ’గేమ్‌ ఛేంజర్‌’ అటు ఇటు అయితే తీవ్ర నిరాశ తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శంకర్‌కు సైతం సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజు కూడా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో తీవ్రంగా నష్టపోయి గేమ్‌ ఛేంజర్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.&nbsp; ట్రెండింగ్‌లో అన్‌ప్రిడిక్టబుల్ గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి సంబంధించి అన్‌ప్రిడిక్టబుల్ (#Unpredictable) పదం రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం ఏంటో తెలియక చాలా మంది నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ‘అన్‌ప్రిడిక్టబుల్‌’ అనేది గేమ్ ఛేంజర్ టీజర్‌లో ఉండే శక్తివంతమైన లైన్ అని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. చరణ్‌ నోట ఈ పదం వస్తుందని అంటున్నారు. దీంతో సినిమాలోని ఏ సందర్భంలో చరణ్‌ ఈ పదం వాడతారోనని అభిమానులు ఇప్పటినుంచే తెగ థింక్‌ చేస్తున్నారు. కాగా, నవంబర్‌ 9న రాబోయో టీజర్‌ 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉంటుందని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్‌ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్‌ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; రిలీజ్‌ ఆ రోజేనా? పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్‌’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్‌ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్‌ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్‌ ఛేంజర్‌'ను డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/i/status/1815052022200013098 ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్‌ 22న వచ్చిన సలార్‌ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ &amp; కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.&nbsp; గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.&nbsp; కథ ఇదేనా? ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్‌ ఛేంజర్‌’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్‌ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్‌ పేర్కొంది. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
    జూలై 22 , 2024
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  హిస్టారికల్‌ మూవీ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/MythriOfficial/status/1788443050177659232 భారీ అంచనాలు 'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.  ‘VD12’ నుంచి అప్‌డేట్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.  https://twitter.com/SitharaEnts/status/1788428225003278352 విజయ్‌ డేరింగ్ డెసిషన్‌! 'VD12' సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 
    మే 09 , 2024
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్‌ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ స్టార్(Family Star) రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా... పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.&nbsp; ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.&nbsp; భరత నాట్యం కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రొజెక్ట్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం 'మాయవన్'... తెలుగులో ప్రొజెక్ట్‌గా రానుంది.&nbsp; సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో ఈ చిత్రం&nbsp; తెరకెక్కింది.&nbsp; ఈ సినిమా ఏప్రిల్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ,&nbsp; జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.&nbsp; బహుముఖం హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్&nbsp; అండ్ యాక్టర్ ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా స్వర్ణిమా సింగ్,&nbsp; మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTogetherSeriesEnglishNetflixApril 2Files Of The UnexplainedSeriesEnglishNetflixApril 3RipleySeriesEnglishNetflixApril 4ScoopSeriesEnglishNetflixApril 5MusicaMovieEnglishAmazon primeApril 5Yeh Meri FamilySeriesHindiAmazon primeApril 4How to Date Billy WalshSeriesEnglishAmazon primeApril 5FarreyMovieHindiZee5April 5LambasingiMovieTelugu&nbsp;Disney+ HotstarApril 2
    ఏప్రిల్ 01 , 2024
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్‌ కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్లు అందించిన&nbsp; ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో మెుదలైంది.&nbsp; ఎందుకు కలిశారంటే! హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌.. ప్రశాంత్‌ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్‌ 2’లో విజయ్‌ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్‌ 2' క్లైమాక్స్‌లో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్‌ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్‌. అయితే దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; చిక్కుల్లో విజయ్‌ కెరీర్‌! విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్‌ ఖాతాలో పడితే అతడి కెరీర్‌ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పడేనా? విజయ్‌(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్‌ స్టోరీ కావడం, విజయ్‌ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పెడుతుందో లేదో చూడాలి. https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
    ఏప్రిల్ 24 , 2024
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే.&nbsp; అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.&nbsp; ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.&nbsp; సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.&nbsp; తమిళ స్టార్‌ హీరో కార్తిక్‌.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్‌ - వెంకటేష్‌ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.&nbsp; గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.&nbsp; https://twitter.com/yousaytv/status/1717459822881509489 వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.&nbsp; వెంకటేష్‌.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3)&nbsp; అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.&nbsp; ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.&nbsp;
    మార్చి 16 , 2024

    @2021 KTree