• TFIDB EN
  • గంగ
    UATelugu2h 44m
    రాఘవ గ్రీన్ టీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అదే చానల్‌లో నందినిని ప్రేమిస్తాడు. వారి టీవి ఛానెల్‌ను ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దెయ్యాల మీద ఓ ప్రోగ్రాం తీద్దాం అని భీమిలి బీచ్‌లోని ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. అక్కడ ఉన్న బీచ్‌లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాఘవ లారెన్స్రాఘవ ,శివ
    తాప్సీ పన్నునందిని
    నిత్యా మీనన్గంగ
    కోవై సరళరాఘవ తల్లి
    జయప్రకాష్మరుదు
    మొట్టా రాజేంద్రన్మరుదుని తమ్ముడు
    సుహాసిని మణిరత్నంగ్రీన్ టీవీ హెడ్
    శ్రీమాన్డాక్టర్ ప్రసాద్
    మయిల్సామివాచ్ మాన్
    పూజా రామచంద్రన్పూజ
    మనోబాలఆర్నాల్డ్
    మధుమితఐశ్వర్య
    పాండుడా. పాండురంగన్ (మానసిక వైద్యుడు)
    చామ్స్అరవింద్ స్వామి
    భాను చందర్చంద్రు
    Mathiచర్చి ఫాదర్
    అబ్బాయిలు రాజన్24టీవీ డైరెక్టర్
    S. ముత్తుకాళై1వ మార్చురీ కార్మికుడు
    సిబ్బంది
    రాఘవ లారెన్స్
    దర్శకుడు
    రాఘవ లారెన్స్
    నిర్మాత
    రాఘవ లారెన్స్
    రచయిత
    లియోన్ జేమ్స్
    సంగీతకారుడు
    రాజవేల్ మోహన్సినిమాటోగ్రాఫర్
    కిషోర్ తే
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో  పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987  పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.  పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.  పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.  పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2’ (Save The Tigers S1 & S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.  పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    అల్లు అర్జున్ (ALLU ARJUN)  గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అల్లు అర్జున్ (ALLU ARJUN)  గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగు సినీ ప్రపంచంలో స్టైలిష్ స్టార్‌‌గా కీర్తించబడి ఐకాన్ స్టార్‌గా అభిమానుల మనసు దోచుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతను వృతిపరమైన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. సినీ నేపథ్య కుటుంబమైనప్పటికీ తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకోని ఓవరాల్ ఇండియాలోనే మేటి నటుడిగా గుర్తింపు సాధించాడు. మరి అలాంటి అల్లు అర్జున్ వ్యక్తిగత, వృతిపరమైన జీవిత విశేషాలు ఏంటో మీరూ తెలుసుకోండి. అల్లు అర్జున్ ఎవరు..? టాలీవుడ్‌లో స్టార్ హీరో, పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎప్పుడు? ఇతను 1982, ఏప్రిల్ 8న చెన్నైలో అల్లు అరవింద్- నిర్మల దంపతులకు జన్మించారు. వీరి తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాలో హాస్య నటుడిగా, మరెన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరి కుటుంబానికి సినీ పరిశ్రమతో చక్కని అనుబంధం ఏర్పడింది. అల్లు అర్జున్ వయస్సు? బన్నీ వయస్సు 42 సంవత్సరాలు.  అల్లు అర్జున్ ఎత్తు ఎంత?  5 అడుగుల 9 అంగుళాలు అల్లు అర్జున్ ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..? అల్లు అర్జున్ ఇప్పటి వరకు 20 సినిమాల్లో  హీరోగా నటించాడు. త్వరలో పుష్ప-2 సినిమా రిలీజ్ కానుంది. తదనాంతరం ఐకాన్, AA 23 మూవీల్లో నటించనున్నట్లు సమాచారం. బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..? మూడేళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యాడు. 1985లో రిలీజ్ అయిన విజేత సినిమాలో శారద కొడుకుగా నటించాడు. స్వాతిముత్యం సినిమాలో శివయ్య మనువడిగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..? 2011, మార్చి 6న స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యూఎస్‌లో ఓ ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్లిన తరుణంలో స్నేహారెడ్డిని చూసి ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ కాస్త పరిణయానికి దారి తీసింది. వీరికి కుమారుడు అయ్యాన్, కుమార్తె అర్హ జన్మించారు. అల్లు అర్జున్‌ ఫ్రొపెషనల్ లైఫ్ చూసుకుంటే, స్నేహారెడ్డి ఫ్యామిలీని బాధ్యతలు చూసుకుంటుంది.  అల్లు అర్జున్ ముద్దు పేర్లు ఏంటి..? ఇతడిని టాలీవుడ్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ముద్దుగా బన్నీ అని పిలుస్తుంటారు. క్లాస్‌మెట్ అయిన రానా చెర్రీ అనేవాడట. అలాగే కేరళ ఫ్యాన్స్ ఇతడిని మల్లు అర్జున్ అంటుంటారు.  అల్లు అర్జున్‌కి ఇష్టమైన మూవీ ఏది..? చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా అంటే బన్నీకి చాలా ఇష్టమట. ఈ సినిమాను 15 సార్లకంటే ఎక్కువగానే చూశాడట. ఇప్పటికీ టైం దొరికినప్పుడల్లా ఈ మూవీ చూడటానికి అల్లు అర్జున్ ఇష్టపడతాడట. అల్లు అర్జున్‌కు ఇష్టమైన ఫుడ్?  బిర్యాని అల్లు అర్జున్‌కు ఇష్టమైన పుస్తకాలు?  డాక్టర్ స్పెన్సర్ రాసిన "Who Moved My Cheese" అనే పుస్తకం చదువుతుంటాడు. ఫొటోగ్రఫీ, స్కెచింగ్ అంటే ఇష్టమట. https://www.youtube.com/watch?v=DkesE-U6V3g అల్లు అర్జున్‌కు ఎన్ని అవార్డులు వరించాయి..? అల్లు అర్జున్ 5 ఫిల్మ్‌ఫేర్, 3 నంది అవార్డులు సాధించాడు. పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
    మార్చి 19 , 2024
    <strong>Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?</strong>
    Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : టొవినో థామస్‌, చెంబన్‌ వినోద్‌, రోషన్‌ మ్యాథ్యూ, రీమా క‌ల్లింగ‌ల్‌, షైన్‌ టామ్‌ చాకో, అభిరామ్‌ రాధా కృష్ణ డైరెక్టర్‌: ఆషిక్‌ అబు సినిమాటోగ్రఫీ : గిరిష్‌ గంగాధరన్‌ ఎడిటింగ్‌ : వి. సాజన్‌ సంగీతం : బిజిబాల్‌, రెక్స్‌ విజయన్‌ నిర్మాతలు : అషిక్‌ అబు, రీమా కల్లింగల్‌ ఓటీటీ : ఆహా డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఈ వారం ఓ మ‌ల‌యాళ హ‌ర్ర‌ర్ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1964లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీల‌వెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామ‌స్‌, రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అశిక్ అబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి స‌ముద్ర‌తీరానికి స‌మీపంలో ఉన్న ప‌ల్లెటూళ్లో భార్గ‌వి నిల‌యం చాలా రోజులుగా మూత‌ప‌డి ఉంటుంది. ఆ బంగ‌ళా పేరు వింట‌నే ఊరివాళ్లు వ‌ణికిపోతుంటారు. భార్గ‌వి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ‌గా మారి ఆ ఇంట్లో తిరుగుతుంద‌ని అందులో అడుగుపెట్టిన వారిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బ‌షీర్ (టోవినో థామ‌స్‌) అనే రైట‌ర్ ఆ ఊరికి కొత్త‌గా వ‌స్తాడు. భార్గ‌వి నిల‌యం చ‌రిత్ర గురించి తెలియ‌క అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్‌ (రోష‌న్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్ట‌రీని బ‌షీర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ర‌చ‌యిత పాత్ర‌లో టోవినో థామ‌స్ న‌ట‌న బాగుంది. అత‌డి లుక్‌, డైలాగ్ డెలివ‌రీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్‌ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంట‌గా రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మ‌థ్యూ ప‌ర్వాలేద‌నిపించారు. విల‌న్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్‌ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఆషిక్‌ అబు ఒక రొటిన్‌ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ ర‌చ‌యిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్‌ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్‌ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్‌ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్‌ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్‌ స్టోరీ, బోరింగ్‌ లవ్ ట్రాక్‌, రెగ్యులర్ హార్రర్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టోవినో థామస్‌ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ హార్రర్‌ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్‌ అంశాలు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 06 , 2024
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం : &nbsp;వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి.. దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి సంగీతం: అజయ్‌ అరసద రచన &amp; నిర్మాత: మహి వి రాఘవ్ స్ట్రీమింగ్‌ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ: 15-03-2024 ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌ కూడా వచ్చింది. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య&nbsp; కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్‌ లీడ్‌ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’లో మహి వి రాఘవ్‌ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్‌ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్‌ న్యూస్‌.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్‌ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్‌ ఈ సిరీస్‌ ద్వారా మంచి సందేశం ఇచ్చారు. టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్‌ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనకామెడీ&nbsp;సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మార్చి 15 , 2024
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.&nbsp; థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    <strong>Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?</strong>
    Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
    కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగాను తన ప్రతిభ చూపించాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్‌’, ‘కాంచన’, ‘గంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చంద్రముఖి 2 వచ్చిన అతడు బాక్సాఫీస్‌ వద్ద దారణంగా విఫలయ్యాడు. దీంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ‘కాల భైరవ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; గంభీరమైన లుక్‌లో లారెన్స్‌! రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా ర‌మేష్ వ‌ర్మ (Ramesh Varma) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం ‘కాల భైరవ’ (Kala Bhairava). తెలుగులో ‘రాక్ష‌సుడు’ (Rakshasudu), రవితేజతో ‘ఖిలాడి’ (Khiladi) వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన రమేష్‌ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేయనుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రానుంది. ఇవాళ (సెప్టెంబర్ 29) లారెన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా సూపర్‌ హీరో ఫిల్మ్‌గా రానున్న ‘కాల భైరవ’ పోస్టర్‌ ఇంటెన్స్‌గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. https://twitter.com/DirRameshVarma/status/1851126864137363612 కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌! లారెన్స్‌ హీరోగా నటించనున్న ‘కాల భైరవ’ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి (A STUDIOS LLP), గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఎంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ బడ్జెట్‌గా రాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలు కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ తెలియజేయనున్నారు.&nbsp; రిస్క్‌ చేస్తున్నారా? ‘కాల భైరవ’ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తారని వార్తలు రావడంపై ఫిల్మ్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లారెన్స్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మార్కెట్‌ పరంగా అతడు వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. అతడు నటించిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ను నమ్మి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే అవుతుందని సూచిస్తున్నారు. రిజల్ట్ ఏమాత్రం అనుకూలంగా లేకపోయిన తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో ఎంతైన ఖర్చు చేసేందుకు మేకర్స్‌ వెనుకాడటం లేదు.&nbsp; లారెన్స్‌ మంచి మనసు రాఘవ లారెన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్ధను స్థాపించిన ఆయన దాని ద్వారా పేదలు, రైతులకు పలుమార్లు సాయం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోమారు మంచి మనసు చాటుకున్నారు. పేద వితంతు మహిళలకు అండగా నిలుస్తూ కుట్టు మిషన్స్‌ను పంపిణీ చేశారు. వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా లారెన్స్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. తారెన్స్‌ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. https://twitter.com/offl_Lawrence/status/1850890389521092953
    అక్టోబర్ 29 , 2024
    <strong>HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్‌ లుక్‌లోనే ఫ్లాట్‌ అయ్యిందట!</strong>
    HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్‌ లుక్‌లోనే ఫ్లాట్‌ అయ్యిందట!
    టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి ‌అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.&nbsp; నిర్మాతల ఫ్యామిలీ చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్‌ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్‌. బాలన్‌ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్‌ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్‌ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది.&nbsp; మలయాళం పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘సర్కస్ సత్తిపండు’.&nbsp; ఆ చిత్రాలతో గుర్తింపు 1997లోనే సర్కస్‌ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత 'ఆశల సందడి' (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.&nbsp; సింగర్‌తో లవ్‌ మ్యారేజ్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్‌ సింగర్‌ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్‌ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్‌ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్‌ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్‌ ప్లాన్‌ చేయగా క్రిష్‌ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్‌, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=OLf1U7c867M సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జోరు! తెలుగులో పలు హిట్‌ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన 'కారా మజాకా' తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్‌ నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్‌ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్‌ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్‌ సాంగ్‌), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.&nbsp; బుల్లితెర హోస్ట్‌గానూ.. నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్‌ డ్యాన్స్‌ షోస్‌ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్‌, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్‌ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు. ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి సంగీతం:&nbsp; వికాస్ బాడిస‌ ఛాయాగ్ర‌హ‌ణం: &nbsp;బి.రాజ‌శేఖ‌ర్‌ నిర్మాత‌: &nbsp;గంగప‌ట్నం శ్రీధ‌ర్‌ విడుద‌ల తేదీ: &nbsp;20-07-2023 టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ఇది. టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టం, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని స‌మ‌ర్పిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ఈ ‘హిడింబ’ క‌థేంటి? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; క‌థేంటి&nbsp; అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్ద‌రూ ఓ కేసు విష‌య‌మై మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాల్సి వస్తుంది. న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేస‌ది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేర‌స్థుడెవ‌రు? అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగ‌కు ఈ క‌థ‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.. ఎవ‌రెలా చేశారంటే న‌టుడిగా అశ్విన్‌ను మ‌రో మెట్టు పైకి ఎక్కించే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం ఆయ‌న మేకోవ‌ర్ అయిన తీరు ఆక‌ట్టుకుంటుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లోనూ, ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్ర‌లో నందితా న‌టించింది. ప్ర‌థ‌మార్థంలో ఓ పాట‌లో రొమాంటిక్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు.&nbsp; ర‌ఘు కుంచె, సంజ‌య్ స్వ‌రూప్‌, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ఎలా సాగిందంటే టైటిల్స్ కార్డ్స్‌తోనే ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి&nbsp; నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. న‌గ‌రంలో అమ్మాయిలు వ‌రుస‌గా కిడ్నాప్ అవ్వ‌డం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్య‌ను రంగంలోకి దింప‌డం.. ఇలా చ‌క‌చ‌కా క‌థ ప‌రుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి సినిమా ఒక్క‌సారిగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా మారిపోతుంది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌దు. మ‌ధ్య‌లో ఓ పాట‌తో నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. దాంట్లో పెద్ద‌గా ఫీల్ క‌నిపించ‌దు. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్‌. హీరోలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే ఎపిసోడ్ అది. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. డైరెక్షన్‌ &amp; టెక్నికల్ అంశాలు ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నమున్నా, దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసిన‌ప్పుడు దీంట్లో ఏదో వెలితి క‌నిపిస్తుంది. చాలా స‌న్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్ర‌థమార్ధంలో మాన‌వ అవ‌య‌వాల అక్ర‌మ ర‌వాణా ఎపిసోడ్‌ను ట‌చ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వ‌లేదు. ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ క‌థా నేప‌థ్యంట్విస్ట్‌లుపోరాట ఘ‌ట్టాలు,నేప‌థ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్‌ రేటింగ్‌ 2.5/5 https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
    ఆగస్టు 08 , 2023
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హిడింబ అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై&nbsp; 20)&nbsp; ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని&nbsp; థ్రిల్లింగ్‌ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.&nbsp; అన్నపూర్ణ ఫొటో స్టూడియో చైతన్య రావ్‌, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్‌ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. హత్య ‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఒప్పెన్‌ హైమర్‌ ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్‌ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. హర్‌ రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. అలా ఇలా ఎలా ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా తెరకెక్కించిన&nbsp; సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. ఇతర సినిమాలు పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe deepest breathMovieEnglishNetflixJuly 19Sweet magnoliasWeb SeriesEnglishNetflixJuly 20The cloned tyroneMovieEnglishNetflixJuly 21BawaalMovieHindiAmazon PrimeJuly 21EstateMovieTamilZee5July 18Spider-Man: Across the Spider-VerseMovieEnglishZee5July 18Trial periodMovieHindiJioCinemaJuly 21
    జూలై 21 , 2023
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!
    ‘అల్లు అర్జున్‌’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html తొలి అడుగు 28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్‌ చేసిన అంశాలేంటో చూద్దాం. కథల ఎంపిక గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్‌. అల్లు అర్జున్‌ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్‌, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్‌ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్‌ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్‌ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్‌ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. డ్యాన్స్‌ మరో మాట లేకుండా ఇండియాలోని&nbsp; హీరోల్లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్‌ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే. సుకుమార్ అల్లు అర్జున్‌ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.&nbsp; https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html అల్లు అర్జున్‌ చేసిన అద్భుతమైన పాత్రలు అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి ఆర్య సుకుమార్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్‌ అని చెప్పాలి. బాల గోవింద్‌ అల్లు అర్జున్‌కు మాస్‌ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్‌ ఉంటుంది. ఇందులో బాలగోవింద్‌ డైలాగ్స్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి. గోన గన్నారెడ్డి స్టైలిష్‌ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ కంప్లీట్‌ డీ గ్లామర్‌ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు. కేబుల్‌ రాజు క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్‌ రాజు. ఎంతోమంది మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్లకు కనెక్ట్‌ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి. పుష్ప ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్‌ అంటూ అల్లు అర్జున్‌ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ కష్టపడుతున్నారు. సుకుమార్‌ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్ చేశాడు. https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
    మార్చి 28 , 2023
    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
    ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; అచ్చమైన తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య. హీరోయిన్ ఛాన్స్‌ గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు. ఫాలోయింగ్ ఎక్కువే సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్‌ ఉన్నారు. అటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్‌ చేస్తోంది. దశ మారుతుందా? వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్‌గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.&nbsp;
    మార్చి 17 , 2023
    <strong>Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?</strong>
    Pushpa 2: ‘పీలింగ్స్‌’ పాటపై ఘోరంగా ట్రోల్స్‌.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2'&nbsp; (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. అలాగే మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఎప్పటికప్పుడు అటెన్షన్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఈ సినిమా నుంచి ‘పీలింగ్స్‌’ (Peelings) అనే ఫోర్త్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. పాట వినసొంపుగా లేకపోవడంతో పాటు చాలా బోల్డ్‌గా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; పీలింగ్స్ సాంగ్‌ (Peelings Song Trolls)లో రష్మిక మందన్న ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. బన్నీ, రష్మిక చేసిన స్టెప్స్‌ చాలా బోల్డ్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బి- గ్రేడ్ ఫిల్మ్స్‌ ప్రసారం చేసే ‘ఉల్లు’ (ULLU)కి ‘పుష్ప 2’ రైట్స్ ఇచ్చారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Janasena200/status/1863202776567918898 https://twitter.com/KettavaN6474/status/1863259521671700959 సాంగ్ బాగున్నప్పటికీ స్టెప్స్‌ మరీ దారుణంగా ఉన్నాయని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. భోజ్‌పూరి సినిమాల డ్యాన్స్‌ వైబ్‌ని తీసుకొస్తోందని అంటున్నారు.&nbsp; https://twitter.com/CricentVerse/status/1863491408193053028 https://twitter.com/ChekrishnaCk/status/1863263237527261384 అటు మహిళా నెటిజన్లు సైతం పీలింగ్స్‌ సాంగ్‌ (Peelings Song Trolls) ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు ఈ సాంగ్‌ను ఎవరు ఇంత దారుణంగా కొరియోగ్రాఫ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/WarriorrQueen/status/1863496938055958540 https://twitter.com/PriyuDvibes/status/1863440643613139035 ‘గంగోత్రి’ సినిమాలో లేడీ గెటప్‌లో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్స్‌ను కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. అలాంటి మాస్‌ డ్యాన్సర్‌ చేత ఇలాంటి క్రింజ్‌ స్టెప్పులు వేయించారేంట్రా అంటూ ఇంకా ట్రోల్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/At_theatres/status/1863488826754175406 పీలింగ్స్‌ పాట (Peelings Song Trolls) లో రష్మిక చేసింది గ్లామర్ షో కాదని, వల్గర్‌ షో అని ఓ తమిళ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఈ సాంగ్‌లోని స్టెప్పులన్నింటిని ఒక దగ్గర చేర్చి ఈ కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/Tamiltoptrollz1/status/1863478959553609755 మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) భన్వర్‌ సింగ్ షెకావత్‌ అనే విలన్‌ పోలీసాఫీసర్‌గా చేశారు. ఫహాద్‌ రీసెంట్‌ చిత్రం ‘ఆవేశం’లో అతడు వేసిన స్టెప్స్‌ను పీలింగ్స్‌ పాటకు నెటిజన్లు జోడించారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/mrjohnnyjohnnny/status/1863468922697351641 రష్మిక డ్యాన్స్‌ మూమెంట్స్ ఏమాత్రం బాగోలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పీలింగ్స్‌లో ఆమె డ్యాన్స్‌ చేశాక తన ఎక్స్‌ప్రెషన్ ఏంటో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/Venkatsinivasan/status/1863444820305559839 సీనియర్‌ ఎన్టీఆర్‌ వేసిన 'ఆకుచాటు పిందె తడిసే' పాటకు 'పీలింగ్స్‌' స్టెప్స్‌ను జోడించి చేసిన ఎడిటింగ్‌ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/karna3102bc/status/1863441808585322790 పీలింగ్స్‌ పాట లిరిక్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా డామినేట్‌ చేసిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ‘అండర్‌స్టాండింగ్‌ 0 శాతం, వైబ్‌ 100 శాతం’ అంటూ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/the_wacko_/status/1863440487367270836 నిజానికి పీలింగ్స్‌ సాంగ్‌ చాలా బాగుందని, కానీ కొరియోగ్రఫీనే అసలు బాలేదని కొందరు స్పష్టం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌కు ఈ పాట ఇచ్చి తప్పుచేశారని మండిపడుతున్నారు.&nbsp; https://twitter.com/Mee_Rudra/status/1863439435393585482 పీలింగ్స్‌ పాటలో బన్నీ వేసిన స్టెప్పు ‘గేమ్‌ ఛేంజర్‌’లో 'రా మచ్చ మచ్చ' అంటు చరణ్‌ వేసిన స్టెప్పుతో కొందరు పోలుస్తున్నారు.&nbsp; https://twitter.com/Mallika40697388/status/1863439034795638940 https://twitter.com/lyf_a_zindagii/status/1863257627733426618
    డిసెంబర్ 02 , 2024
    <strong>Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!</strong>
    Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!
    అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్‌ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్‌ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్‌’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్‌ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్‌ ‘దేవర’తో ‘పొట్టేల్‌’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ‘దేవర కన్నా చాలా బెటర్’ జూ.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్‌ వంటి టాప్ నాచ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్‌, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్‌ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్‌ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్‌ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్‌) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1849871631818293722 కంటెంట్‌కే ప్రాధాన్యత సినిమాలో కంటెంట్‌ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్‌ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్‌ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్‌ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్‌’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.&nbsp; పొట్టేల్ ఎలా ఉందంటే? దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేప‌థ్యాన్ని ‘పొట్టేల్‌’లో ఆవిష్క‌రిస్తూ ఆరంభంలోనే ప్రేక్ష‌కుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్‌ పార్ట్‌ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్ని విల‌న్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయ‌నే భావ‌న‌తో స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు కనిపిస్తుంది. స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.&nbsp; కథ ఇదే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్‌) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్‌ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్‌, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని ద‌క్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జ‌మ్మ (అనన్య నాగళ్ల) క‌థేంటి? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/pottel-movie-review-comparisons-with-rangasthalam-before-release-is-pottel-at-that-level.html
    అక్టోబర్ 26 , 2024
    <strong>Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్‌’ ఆ స్థాయిలో ఉందా?</strong>
    Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్‌’ ఆ స్థాయిలో ఉందా?
    న‌టీన‌టులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ త‌దిత‌రులు రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాణ సంస్థ‌: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ విడుద‌ల‌ తేదీ: 25-10-2024 అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్‌ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్‌ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్‌’కు వచ్చింది. పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్‌) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్‌ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్‌, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని ద‌క్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జ‌మ్మ (అనన్య నాగళ్ల) క‌థేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే పటేల్‌గా అజయ్‌ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్‌ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్‌ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్‌ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఛత్రపతి శేఖర్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రిస్తూ ఆరంభంలోనే ప్రేక్ష‌కుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్‌ పార్ట్‌ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్ని విల‌న్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయ‌నే భావ‌న‌తో స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు కనిపిస్తుంది. స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. సాంకేతిక విష‌యాల‌కొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. పాట‌లు, నేప‌థ్య సంగీతం చిత్రంపై మంచి ప్ర‌భావం చూపించాయి. ఎడిటింగ్ ప‌రంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన తారాగణం న‌ట‌నసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నంసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 25 , 2024
    <strong>Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?</strong>
    Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
    సినిమాకు హీరో, హీరోయిన్‌ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్‌ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) టాలీవుడ్‌లో సెన్సిబుల్‌ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్‌ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్‌, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్‌, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్‌’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్‌ ఈజ్‌బ్యూటీఫుల్‌’లో షగున్‌ కౌర్‌ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్‌ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్‌ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.&nbsp; హను రాఘవపూడి (Hanu Raghavapudi) శేఖర్‌ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్‌, సాయిపల్లవి, మృణాల్‌ ఠాకూర్‌ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్‌ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్‌ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్‌ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) యంగ్‌ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్‌ చేసిన ‘మెంటల్‌ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్‌ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్‌, నివేదా థామస్‌, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. శౌర్యువ్ (Shouryuv) దర్శకుడు శౌర్యువ్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్‌ ఠాకూర్‌ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్‌ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్‌ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్‌ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్‌ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ యూత్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్‌ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్‌ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్‌ బాస్కర్‌ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!</strong>
    Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!
    యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌ - 1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న గత కొంతకాలంగా ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. దీంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' కథను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేశారు.&nbsp; త్రీ వరల్డ్స్‌ స్టోరీ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీ కథ.. మూడు ప్రపంచాల మధ్య తిరుగుతుందని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ లేటెస్ట్‌ వీడియోలో స్పష్టం చేశారు. కాశీ, కాంప్లెక్స్‌ (కాశీ పైన ఉన్న పిరమిడ్‌ లాంటి సిటీ), శంబాలా నగరాల చుట్టూ ప్రధానంగా కల్కి స్టోరీ తిరగనుందని తెలియజేశారు. ‘పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1803649632041419033 కాంప్లెక్స్‌కు వెళ్లడమే లక్ష్యం 3000 ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉంటుంది? గంగ పూర్తిగా ఎండిపోయి ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు? అని ఊహించి రీసెర్చ్‌ చేసి మరి కల్కిలో కాశీ నగరాన్ని సృష్టించినట్లు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో ఉండే 'కాంప్లెక్స్‌'.. ఆకాశంలో కిలో మీటర్‌ మేర ఉండి స్వర్గాన్ని తలపిస్తుంటుందని పేర్కొన్నారు. 'కాంప్లెక్స్‌లో లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌కు వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్‌ (ధనం) కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే' అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు. శంబాలా.. ఒక శరణార్థి క్యాంపు కల్కిలోని మూడో ప్రపంచమైన 'శంబాలా' గురించి కూడా తాజా వీడియోలో నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వివిధ సంస్కృతుల్లో శంబాలా పేరును వినియోగించారు. టిబెటిన్‌ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని పిలిచారు. శంబాలా నుంచే విష్ణు చివరి అవతారం వస్తుందని పురణాలు చెబుతున్నాయి. కాబట్టి శంబాలా ప్రజలు దేవుడి రాక ఇక్కడి నుండి ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అయితే శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లు.. కాంప్లెక్స్‌ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్‌ కూడా ఉంటారు. కాంప్లెక్స్‌ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి కథ’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ‘కల్కి’ రన్‌టైమ్‌ ఎంతంటే? గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ రన్ టైమ్​ గురించి చర్చ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు అధికారికంగా రన్ టైమ్​ బయటకి వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. రన్​​ టైమ్​ 180.55 నిమిషాల నిడివితో రానున్నట్లు పేర్కొన్నారు. అంటే ఈ సినిమాను మేకర్స్ 3 గంటల 55 సెకన్లకు కట్ చేశారు. మరి ఈ భారీ ట్రీట్​ను థియేటర్స్​లో ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, సినిమాలో అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్​, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.
    జూన్ 20 , 2024
    Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!
    Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్‌ ఆరోజు మాత్రమే!
    సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.&nbsp; ఈ ఆఫర్‌ ఎందుకంటే? మే 31న సినిమా లవర్స్‌ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్‌ - ఐనాక్స్‌ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్‌ స్పష్టం చేసింది.&nbsp; https://twitter.com/MAofIndia/status/1795374893879710125 ఇలా బుక్‌ చేసుకోండి! మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్‌ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్‌ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్‌ కౌంటర్ వద్ద టికెట్‌ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.&nbsp; https://twitter.com/girishjohar/status/1795734272068006128 ఈ సినిమాలు చూడొచ్చు! ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్‌ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి. https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853 గతంలోనూ ఇలాగే.. రూ.99లకే మల్టీప్లెక్స్‌ టికెట్‌ ఆఫర్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌ 13న 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్‌ చేసుకోవద్దని అసోసియేషన్‌ ప్రతినిధులు సూచిస్తున్నారు.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
    మే 29 , 2024
    Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
    Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్‌ సైడ్‌ లవ్‌ అనే ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్‌ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం. దిల్‌ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్‌ నితీన్‌ హీరోగా చేసిన ‘దిల్‌’ చిత్రానికి డైరెక్టర్‌ సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్‌ రాజుకు సుకుమార్‌ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్‌ అయిన అతడు..&nbsp; ‘దిల్‌’ సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్‌’.. బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్‌ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ పడింది.&nbsp; మిస్‌ చేసుకున్న అల్లరి నరేష్‌ ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్‌ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్‌ అన్నారు.&nbsp; https://twitter.com/i/status/1787548147520061468 బన్నీని అలా ఫైనల్‌ చేశారు! ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్‌ మూవీ స్పెషల్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్‌ చలాకీ తనం, కామెడీ టైమింగ్‌ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్‌ రాజుతో సుకుమార్‌ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్‌ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్‌ కావడంతో సినిమా పట్టాలెక్కింది.&nbsp; అసిస్టెంట్‌గా చేసిన స్టార్‌ డైరెక్టర్‌ కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్‌ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్‌ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్‌ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.&nbsp; https://twitter.com/i/status/1787674074585714980 120 రోజుల్లో షూటింగ్‌ పూర్తి ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే&nbsp; పూర్తి చేశారు. అటు సుకుమార్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.&nbsp; ఆర్యతో వారికి స్టార్‌డమ్‌ ఆర్య సినిమా సక్సెస్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్‌, డ్యాన్స్‌, గ్రేస్‌, యాక్షన్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
    మే 07 , 2024
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.&nbsp; Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.&nbsp; శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.&nbsp; Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.&nbsp; అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.&nbsp; అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.&nbsp; శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.&nbsp; సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.&nbsp; ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024

    @2021 KTree