రివ్యూస్
How was the movie?
తారాగణం
అర్జున్ సర్జా
మధు షా (మధుబాల)
సుభాశ్రీ
MN నంబియార్
మనోరమ
గౌండమణి
సెంథిల్
చరణ్ రాజ్
గౌతమి
ప్రభుదేవా
రాజు సుందరం
వినీత్
జివి ప్రకాష్ కుమార్
రాజన్ పి. దేవ్
అజయ్ రత్నం
రాఘవ లారెన్స్
రాజేంద్రన్
సిబ్బంది
ఎస్. శంకర్
దర్శకుడుకెటి కుంజుమోన్
నిర్మాతAR రెహమాన్
సంగీతకారుడుకథనాలు
Game Changer Teaser: లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్.. ఎందుకంటే?
‘RRR’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ తేదీని చిత్ర బృందం లాక్ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
టీజర్ ఎప్పుడంటే?
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
లక్నోలోనే ఎందుకు?
గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్డేట్ ఇస్తూ గేమ్ ఛేంజర్ గురించి చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్ చేస్తారో లేదో చూడాలి.
ఇదే తొలి చిత్రం!
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్మెన్’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్ అయిన చిత్రాలు. ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్ చేశారు. కెరీర్లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్ ‘గేమ్ ఛేంజర్’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.
ఆ ఫైట్ సినిమాకే హైలెట్!
ఇటీవల టీజర్ సూన్ అంటూ గేమ్ ఛేంజర్ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో చరణ్ ఓ టేబుల్ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్ ఛేంజర్’ ఇంట్రడక్షన్ సీన్ అని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్బంప్స్ తెప్పించేలా ఈ మాబ్ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్ హెలికాఫ్టర్ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్ వస్తుందని చెబుతున్నారు.
రికార్డు బిజినెస్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్’ను డిసెంబర్లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నవంబర్ 05 , 2024
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ సెట్ నుంచి రామ్‌చరణ్ ఫొటోస్ లీక్.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్ మామూల్గా లేదుగా !
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).. టాప్ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్లో రామ్‌చరణ్ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వైజాగ్‌లో షూటింగ్
'గేమ్ ఛేంజర్' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్లో రామ్ చరణ్, ఎస్.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1768563620739453357
https://twitter.com/n_suren/status/1768531852414079277
https://twitter.com/i/status/1767734419715133518
https://twitter.com/venkysayzzz/status/1768539657896087692
చరణ్‌కు ఘన స్వాగతం
వైజాగ్ షూటింగ్ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్, తమిళ నటుడు ఎస్.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్ చేరుకుంది. వైజాగ్ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/i/status/1768308149847753158
https://twitter.com/i/status/1768557163746656272
https://twitter.com/i/status/1768447264660296074
చరణ్ బర్త్‌డే రోజున స్పెషల్ సాంగ్
రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్!
‘గేమ్ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్ చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
మూవీ టైటిల్ అదేనా!
రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
మార్చి 16 , 2024
Dasara: రూ.100 కోట్ల క్లబ్లో దసరా..! నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
Updated On 6-4-2023
రూ.100 కోట్ల క్లబ్లో..
నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
https://twitter.com/NameisNani/status/1643656266248777728
ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.
ఓవర్సీస్లో ‘దసరా’ జోరు..
ఓవర్సీస్లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్లో దసరా కలెక్షన్స్ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్సీస్లో ఈ వికెండ్ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అంతటా హౌస్ ఫుల్..
నాని కెరీర్లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html
ఏప్రిల్ 7 వరకు పోటీలేదు..
హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్లో బడా సినిమాల రిలీజ్లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఈ వికెండ్ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నాని కెరీర్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.
దసరా రూ. 100 కోట్లు
ఎంసీఏ రూ.70 కోట్లు
గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు
శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు
నేను లోకల్ రూ.60 కోట్లు
మజ్ను రూ.58 కోట్లు
నిన్ను కోరి రూ.55 కోట్లు
భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు
దేవదాస్ రూ.48 కోట్లు
జెర్సీ రూ.45 కోట్లు
అంటే సుందరానికి రూ.40 కోట్లు
జెంటిల్మెన్ రూ.32 కోట్లు
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు.
Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్సైట్ ‘YouSay’నే..!
ఏప్రిల్ 06 , 2023