• TFIDB EN
  • ఘర్షణ
    ATelugu2h 39m
    తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక గ్యాంగ్‌స్టర్ డీసీపీ రామచంద్ర లవర్‌ మాయను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను రక్షించేందుకు డీసీపీ రామచంద్ర ఓ మిషన్ చేపడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెంకటేష్
    DCP రామచంద్ర IPS
    అసిన్ తొట్టుంకల్
    మాయ
    సలీం బేగ్
    పాండా
    రవి ప్రకాష్
    రాజేష్
    డేనియల్ బాలాజీ
    శ్రీకాంత్
    వంశీ కృష్ణ
    జగన్
    యోగ్ జపీ
    దాస్
    సత్యం రాజేష్
    రామ్ డ్రైవర్
    మినాలె రవి
    రాజ్ పి కన్నన్
    సుగా నందన్
    గోవా శర్మ
    శ్రీనివాస్
    ఆనంద్
    దీపన్
    అమిత
    చందన
    యానా గుప్తా
    ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    గౌతమ్ వాసుదేవ్ మీనన్
    దర్శకుడు
    కలైపులి ఎస్. థాను
    నిర్మాత
    జి. శివరాజునిర్మాత
    సి.వెంకటరాజునిర్మాత
    హారిస్ జయరాజ్
    సంగీతకారుడు
    ఆర్డీ రాజశేఖర్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం... విజయశాంతి: తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్. "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం... ఆసిన్ విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది. కమలినీ ముఖర్జీ హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది. ఇలియానా రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు. నయనతార లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది. సాయి పల్లవి ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే  'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది. శృతిహాసన్ తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. సన్నిలియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్. షకిలా నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.   కలర్స్ స్వాతి సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి  సంయుక్త మీనన్ ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్  సుహాసిని ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
    సెప్టెంబర్ 05 , 2023
    <strong>Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌ నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని విడుదల తేదీ : జులై 5, 2024 ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్‌' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు&nbsp; ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; గత సీజన్లలో ఏం జరిగిందంటే? మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే&nbsp; ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే&nbsp; ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు&nbsp;గత సీజన్లతో&nbsp; పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating :3/5&nbsp;
    జూలై 05 , 2024
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    నటీనటులు: నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్‌, భావన సాగి, మిర్చి కిరణ్‌, అక్షయ్‌ డోగ్రా తదితరులు దర్శకుడు: అవ‌నీంద్ర సంగీత దర్శకుడు: గోవింద్‌ వసంత్‌ సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్ ఎడిటింగ్: అవనీంద్ర నిర్మాణ సంస్థ : సి స్పేస్‌ విడుదల తేదీ: జూన్‌ 7, 2024 నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli Review). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. న‌వ‌దీప్ 2.0 అంటూ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. జూన్‌ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ‘లవ్‌ మౌళి’.. నవ్‌దీప్‌కు హిట్‌ తెచ్చిపెట్టిందా? యూత్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్‌) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమ‌పై కూడా న‌మ్మ‌కం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్‌ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్ర‌ష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్‌ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్‌ పట్టి అమ్మాయి పెయింటింగ్‌ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్‌ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మౌళి పాత్రలో నటుడు నవదీప్‌ కొత్త కోణంలో కనిపిస్తాడు. అతడి లుక్‌తో పాటు నటనలోనూ వైవిద్యం కనిపించింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో అతడు చక్కటి నటన కనబరిచాడు. కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఆకట్టుకుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌ పండిస్తూనే నటనలోనూ వేరియేషన్స్‌ చూపించింది. ఇక అఘోరాగా గెస్ట్‌ పాత్రలో కనిపించి రానా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అవనీంద్ర.. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ బోల్డ్‌ లవ్‌స్టోరీగా 'లవ్‌ మౌళి'ని తెరకెక్కించారు. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. లిప్‌లాక్‌లు, బోల్డ్‌ సీన్స్‌తో.. కథను రొమాంటిక్‌గా నడిపించారు డైరెక్టర్‌. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. మౌళి లైఫ్‌లోకి చిత్ర వచ్చినప్పటికీ నుంచి అసలు కథ మెుదలవుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌, ఘర్షణలు రొటిన్‌గా అనిపిస్తాయి. అవసరం లేకున్నా వచ్చే కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్‌ను కూడా చాలా సాధారణంగా ముగించాడు. ఓవరాల్‌గా నవదీప్‌ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్‌, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు డైరెక్టర్‌.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ అందించిన మ్యూజిక్‌ పర్వాలేదు. ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన దర్శకుడు అవనీంద్ర అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరామెన్‌ అజయ్ శివశంకర్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్‌ను చాలా సహజంగా, చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నవదీప్‌, పంకూరి గిద్వానీ నటనఎమోషనల్‌ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిగా సాగని కథనంబోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూన్ 07 , 2024
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రలు ఇవే!
    సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌ రోల్‌ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్‌ దర్శకులు హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్‌ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్‌ లభించి సినిమా హిట్‌ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భిక్షు యాదవ్‌ (Sye) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్‌ పాత్ర కంటే.. విలన్‌ బిక్షు యాదవ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్‌ రావత్‌ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్‌ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్‌ రావత్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది.&nbsp; https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b అలీభాయ్‌ (Pokiri) పోకిరిలో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన అలీభాయ్‌ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్‌ రాజ్‌ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్‌ రాజ్‌ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.&nbsp; https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV భల్లాలదేవ (Baahubali) రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్‌)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.&nbsp; https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv పశుపతి (Arundhati) తెలుగులో అతి భయంకరమైన విలన్‌ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్‌ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3 కాట్‌రాజ్‌ (Chatrapathi) ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్‌ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్‌ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.&nbsp; https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9 పండా (Gharshana) ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్‌ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.&nbsp; https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml మద్దాలి శివారెడ్డి (Race Gurram) రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌. అల్లు అర్జున్‌ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్‌ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్‌ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.&nbsp; https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H వైరం ధనుష్‌ (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్‌ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.&nbsp; https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw భవాని (Siva) శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్‌ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్‌ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్‌ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్‌ (Raghuvaran) స్టార్‌ విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT బుక్కా రెడ్డి (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్‌ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.&nbsp; https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0 అమ్రీష్‌ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari) చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్‌ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్‌ నటన మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc రణదేవ్ బిల్లా (Magadheera) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్‌ రణదేవ్‌ బిల్లాకు స్క్రీన్‌ షేరింగ్ ఉంటుంది. దేవ్‌ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.&nbsp; https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN మంగళం శ్రీను (Pushpa) అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa)&nbsp; చిత్రంలో.. నటుడు సునీల్‌ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్‌ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్‌, నటన ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
    మార్చి 20 , 2024
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp; గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన 'స్పై' డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా&nbsp; ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం. &nbsp;బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'.&nbsp; ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది.&nbsp; ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. నాయకుడు&nbsp; ఉద‌య‌నిధి స్టాలిన్‌, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ్&nbsp; హిట్ చిత్రం 'మామ‌న్నన్'. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడ‌ర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన‌ పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్‌ రోల్ చేశాడు. &nbsp;మహావీరుడు శివ కార్తికేయన్‌ లీడ్‌ రోల్‌లో మడోన్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేసిన యాక్షన్‌ చిత్రం మహావీరుడు (Mahaveerudu).&nbsp; ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. భారతీయన్స్‌: ది న్యూ బ్లడ్‌&nbsp; ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం 'భారతీయన్స్'.&nbsp; ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో&nbsp; చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్‌ చిత్రాలకు ధీన్‌ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.&nbsp; మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికరింగ్‌ పార్ట్‌ 1 మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning)&nbsp; క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్‌-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateBird Box BarcelonaMovieEnglishNetflixJuly 14KoharaWeb SeriesHindiNetflixJuly 15Transformers: Rise of the Beasts&nbsp;movieEnglishPrimeJuly 11Mayabazaar For Sale&nbsp;Web SeriesteluguZEE5July 14Janaki Johnny&nbsp;Web SeriesMalayalamDisney + HotstarJuly 11The Trial&nbsp;Web seriesHindiDisney + HotstarJuly 14Crime Patrol – 48 HoursMovieHindiSony LivJuly 10College Romance July 25Web seriesHindiSony LivJuly 25
    జూలై 10 , 2023
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్‌, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.&nbsp; ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్‌, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.&nbsp; గౌతమ్ మీనన్‌ ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్‌ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు. భారతీ రాజా శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా. తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్‌ వచ్చినా తరుణ్ భాస్కర్‌ వదులుకోవట్లేదు.&nbsp; రిషబ్‌ శెట్టి కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్‌ బాయ్‌, స్పాట్ బాయ్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్‌ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియాను షేక్‌ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు.&nbsp;
    ఏప్రిల్ 27 , 2023
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.&nbsp; https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా&nbsp; పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.&nbsp; https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్‌ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్‌’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నెట్టింట సందీప్‌ మేనియా ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్‌ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1760151102740464016 https://twitter.com/i/status/1760137348128358646 ‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’ సందీప్‌ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్‌ ప్రతినిధి సందీప్‌ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి. https://twitter.com/i/status/1758682406754861236 సందీప్‌ ఫేవరేట్‌ స్టార్లు వారే! సందీప్‌ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్‌ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్‌ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్‌ అందరికీ కాంపీటిషన్‌ పెడితే తాను ఫస్ట్‌ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్‌ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1757377128511778830 ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్‌ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.&nbsp; సందీప్‌పై హీరోయిన్‌ సెటైర్! డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; మిగతా అవార్డులు.. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగంలో.. అటు టెలివిజన్‌ విభాగంలో దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.
    ఫిబ్రవరి 21 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024

    @2021 KTree