• TFIDB EN
  • ఘోస్ట్
    UATelugu2h 12m
    బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శివ రాజ్ కుమార్
    దళవాయి ముద్దన్న అలియాస్ "పెద్ద నాన్న" మరియు ఆనంద్ రావు (ద్వంద్వ పాత్రలు)
    జయరామ్
    ఏసీపీ చెంగప్ప
    అనుపమ్ ఖేర్
    ఆనంద్ తండ్రి ఎ.ఎన్.రావు
    ప్రశాంత్ నారాయణన్
    మాజీ సీబీఐ అధికారి వామన శ్రీనివాసన్
    అర్చన జోయిస్
    లక్ష్మి, న్యూస్ రిపోర్టర్
    సత్య ప్రకాష్
    అభిజిత్
    విజయలక్ష్మి సింగ్
    హోంమంత్రి విజయలక్ష్మి
    ఎం. కామరాజ్దళవాయి ఖైదీ మరియు సహాయకుడు
    ఎంజీ శ్రీనివాస్
    మహేష్ దాస్
    సిబ్బంది
    ఎంజీ శ్రీనివాస్
    దర్శకుడు
    సందేశ్ నాగరాజ్నిర్మాత
    అర్జున్ జన్య
    సంగీతకారుడు
    ఎంజీ శ్రీనివాస్
    కథ
    మహేంద్ర సింహసినిమాటోగ్రాఫర్
    దీపు S. కుమార్ఎడిటర్ర్
    కథనాలు
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం. నటీనటులు నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్ కథ ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ. డైరెక్షన్ ఎలా ఉందంటే? కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు.  కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు.  ఎక్కడ ఎమోషన్స్ మిస్‌ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.  సినిమా ఎలా ఉందంటే? నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది.  దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే? నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్‌ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్‌ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్‌ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్‌ అదిరిపోయింది.  అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్  గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు. టెక్నికల్ విషయాలు… సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు.  చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్‌  చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.  బలాలు నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్ బలహీనతలు ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు. రేటింగ్: 3/5
    జనవరి 14 , 2024
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి  పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం. ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie) కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా  ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.  మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ (GHOST) కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది. ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal MoviePortuguese NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25  Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
    అక్టోబర్ 26 , 2023
    Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
    Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. మరోమారు మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. కళ్లు చెదిరే స్కిన్‌ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  తాజాగా ‘69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ (69th Filmfare Awards)వేడుకల్లో పాల్గొన్న మృణాల్‌.. అక్కడ తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైట్‌ఫిట్‌ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ వీక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం మృణాల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MrunalThakur హ్యాష్‌టాగ్‌తో అవి వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/i/status/1751880621524484350 ‘సీతారామం’ (Sitaramam) సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).. ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన మృణాల్‌ (69th Filmfare Awards) ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. కెరీర్ పరంగా ఎదుగుతున్నా హిందీలో మాత్రం పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని వాపోయింది. ముఖ్యంగా రొమాంటిక్‌ సినిమాల్లో ఆఫర్లు రావట్లేదని మృణాల్‌ స్పష్టం చేసింది. కొందరు రొమాంటిక్‌ సినిమాలంటే ఇష్టం లేదని అంటారని.. కానీ అవే చూస్తారని పేర్కొంది.  ఇక ఈ భామ తెలుగు లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌.  ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన మృణాల్‌ నటిస్తోంది. పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌నే మృణాల్‌ను రిఫర్ చేశాడని సమాచారం.  ఇక తమిళ్‌ స్టార్‌ శివ కార్తికేయన్‌ మూవీలోనూ ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట. దర్శకుడు మురగదాస్‌ ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని టాక్. ఇక మృణాల్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది.  మృణాల్.. ముంబైలోని KC కాలేజీ డిగ్రీ చేస్తుండగానే టెలివిజన్‌ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో నటించి మృణాల్‌ పాపులర్ అయ్యింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ ‘సూపర్ 30’ నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌’లోనూ మృణాలు మెరిసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలోనూ ఈ బ్యూటీ తళుక్కుమంది. 2021లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో మృణాల్‌ నటించింది.  ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లో ఆమె కనిపించింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. 
    జనవరి 29 , 2024
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.  రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.  శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.  తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.  అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.  కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.  కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.  కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది. 
    డిసెంబర్ 14 , 2023
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.  విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.  ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.   ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
    అక్టోబర్ 30 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5  (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.  https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన  రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.  Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.  Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL  ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత  కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.  Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు  BMW X5  ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  Lamborghini Aventador Roadster   లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.  ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography  ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ  కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL  దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2  అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.  వోల్వో XC90 T8 ఇది  వోల్వో  ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు   ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.  ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ  కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.  విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు  https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు  లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.  అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.  Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.  తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,  టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.  అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా  రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,  రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-   రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.  విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో  స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్  హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-  దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్   సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.  దాస్ కా ధమ్కీ టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.  రంగ మార్తాండ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది. ప్రకాశ్ రాజ్‌, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది. ఘోస్టీ  వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్‌ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.  గీత సాక్షిగా ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్‌ సాగే చిత్రమని అర్థమవుతుంది. ఓటీటీ సినిమాలు Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
    మార్చి 20 , 2023
    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు భ్రమయుగం మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని ఫైల్స్‌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.  ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సైరెన్‌ జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నాసామి రంగ ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  ది కేరళ స్టోరీ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
    ఫిబ్రవరి 12 , 2024
    <strong>Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!</strong>
    Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!
    సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చిన ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్‌ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] రాజాసాబ్‌ (The Raja Saab) ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్‌ బాక్సాఫీస్‌ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌ వచ్చే ఏడాది ‘రాజాసాబ్‌’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్‌ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్‌ తెగ ఎదురుచూస్తున్నాడు.&nbsp; ఓజీ (OG) పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్‌ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్‌ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్‌ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.&nbsp; గేమ్‌ ఛేంజర్‌ (Game changer) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత చరణ్‌ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; వార్‌ 2 (War 2) టాలీవుడ్‌ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ‘వార్‌ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్‌ నటిస్తున్నారన్న టాక్‌ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్‌ తర్వాత తారక్‌ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్‌ 2’ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; VD 12 విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్‌ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్‌ లుక్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్‌ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్‌ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; తండేల్‌ (Thandel) నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్‌’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (Love story) మంచి హిట్‌ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.&nbsp; మిరాయ్‌ (Mirai) ‘హనుమాన్‌’ (Hanuman) వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తర్వాత యంగ్‌ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్‌’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్‌ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్‌ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; కుబేరా (Kubera) క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్‌ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్‌ చేస్తున్నట్లు టాక్‌. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్‌ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు.&nbsp; జీ 2 (G2) అడివి శేష్‌ (Adivi Sesh) హీరోగా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్‌ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; NANI 33 ‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్‌ బాస్టర్‌ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్‌.. రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పన్?</strong>
    Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్‌.. రిలీజ్‌ డేట్‌ పోస్ట్‌పన్?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్‌ చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్‌ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్‌ సుకుమార్‌ బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పుష్ప టీమ్‌ తాజాగా తమ ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియో సినీ లవర్స్‌లో కొత్త భయాలను సృష్టిస్తోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బిగ్గెస్ట్ మూవీ కోసం శ్రమిస్తున్న సుకుమార్‌! అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయమే ఉండటంతో అందరూ వెయ్యి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ టీమ్‌ ఓ ఆసక్తికర వీడియోను ఎక్స్‌లో పెట్టింది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్న వీడియోను పంచుకుంది. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కోసం ‘ఏరౌండ్‌ ది క్లాక్‌’ సుకుమార్‌ పనిచేస్తున్నారని మూవీ టీమ్‌ రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్‌ టీమ్‌ వ్యక్తికి సుకుమార్‌ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సుకుమార్‌ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1860015165732978697 ఆందోళన ఎందుకంటే? ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ సుకుమార్‌ పోస్టు ప్రొడక్షన్‌ పనులే చేస్తూ ఉండటంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టాల్సిన సమయంలో ఇంకా పోస్టు ప్రొడక్షన్‌ పనులను పరిశీలిస్తుండటం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా నాలుగో పాట షూటింగ్‌ కూడా శుక్రవారం (నవంబర్‌ 22) నుంచి స్టార్ట్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు సినిమాకు సంబంధించి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న టాక్‌ ఉంది. ఇటీవల థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంపై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడని కథనాలు కూడా వచ్చాయి. ఇన్ని పెండింగ్ వర్క్స్‌ పెట్టుకొని రెండు వారాల్లో సినిమాను ఎలా రిలీజ్‌ చేస్తారోనని బన్నీ ఫ్యాన్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి క్షణంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి హ్యాండ్‌ ఇస్తారేమోనని అనుమానిస్తున్నారు.&nbsp; అదుర్స్‌ అనేలా ‘కిస్సిక్‌’ ప్రోమో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్​కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' కూడా అందరినీ ఊర్రూతలూగించింది. గత చిత్రం పుష్పలోని 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సాంగ్ యావత్‌ దేశాన్ని స్టెప్పులు వేసేలా చేసింది. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ అలాంటి సాంగ్ ఉంది. 'కిస్సిక్‌' అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల స్టెప్పులు వేసింది. నవంబర్‌ 24న ‘కిస్సిక్‌’ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్‌ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్‌ పక్కా హిట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఓ సారి ప్రోమోను మీరూ చూసేయండి. https://www.youtube.com/watch?v=AiJZ3jLajHI ‘కిస్సిక్‌’ హైప్‌కు కారణం ఇదే డైరెక్టర్ సుకుమార్‌ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్‌ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. అయితే ‘కిస్సిక్‌’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్‌ క్రియేట్‌ కాలేదు. అయితే ‘కిస్సిక్‌’కు మాత్రమే ఈ స్థాయి హైప్‌ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్‌ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్‌’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్‌ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్‌ డ్యాన్సర్‌ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు</strong>
    This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
    పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్‌ పోతినేని, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు మిస్టర్‌ బచ్చన్‌ (Mr. Bachchan) మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్‌, భాగ్యశ్రీ అందాలు, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.  డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart)&nbsp; హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తంగలాన్‌ (Thangalaan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  ఆయ్‌ (Aay) ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకు ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్‌’ మూవీ ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతోంది. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్‌ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.  వేదా (Vedaa) జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఖేల్‌ ఖేల్‌ మే (Khel Khel Mein) ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.  అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; డార్లింగ్‌ ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra) ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్‌ చేయబోతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.  మనోరథంగల్‌ (Manorathangal) కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.  మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon&nbsp;August 14JackpotMovieEnglishAmazon&nbsp;August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
    ఆగస్టు 12 , 2024
    <strong>Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!</strong>
    Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!
    బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్‌ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్‌ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్‌ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అనసూయ షాకింగ్‌ పోస్టు బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్‌ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్‌ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791 విజయ్‌ దేవరకొండను ఉద్దేశించేనా? అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్‌ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్‌ మ్యానర్స్‌ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్‌ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్‌ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.&nbsp; గతంలోనూ ఇలాగే.. అనసూయ ఈ తరహా అగ్రెసివ్‌ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్‌ పెట్టి అందరినీ షాక్‌ గురిచేసింది. తన గ్లామరస్‌ ఫోటోలోను షేర్‌ చేస్తూ హాట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అనసూయ ప్రస్థానం జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది.&nbsp;
    జూలై 25 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.&nbsp; ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.&nbsp; https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం? సూపర్ పోలీస్ (1994) విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో&nbsp; వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. పవిత్ర బంధం (1996) వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది. పెళ్లి చేసుకుందాం(1997)&nbsp;&nbsp; ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది. రాజా (1999) ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.&nbsp; ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. జయం మనదేరా (2000)  ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. దేవీ పుత్రుడు(2001) వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.
    నవంబర్ 10 , 2023
    <strong>Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్‌ బై చెప్పనున్న సుకుమార్‌? ఆందోళనలో ఫ్యాన్స్‌!</strong>
    Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్‌ బై చెప్పనున్న సుకుమార్‌? ఆందోళనలో ఫ్యాన్స్‌!
    టాలీవుడ్‌కు చెందిన మోస్ట్‌ టాలెంటెడ్‌ దర్శకుల్లో డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (2021) యావత్‌ దేశాన్ని ఊర్రూతలూగించింది. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోమారు మాయ చేసేందుకు అల్లు అర్జున్‌తో కలిసి సుకుమార్ వస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. మూవీ విడుదలకు ఇంకా పది రోజుల సమయమే ఉండటంతో పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో డైరెక్టర్ సుకుమార్ బిజీ బిజీగా ఉన్నారు. అదే సమయంలో చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సుకుమార్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సుకుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్తలోని నిజానిజాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; రోజుకు 20 గంటలు వర్క్! అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Director Sukumar) కాంబోలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం సరిగ్గా పది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్‌ పనులు పూర్తికాలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో పెండింగ్‌ వర్క్‌ ఫినిష్‌ చేసేందుకు డైరెక్టర్ సుకుమార్‌ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 20 గంటలు 'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసమే కేటాయిస్తున్నట్లు సమాచారం. బెస్ట్‌ ఔట్‌పుట్‌ కోసం పని రాక్షసుడిగా సుకుమార్‌ మారిపోయారని మూవీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ వర్క్‌ నేపథ్యంలోనే బిహార్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం, తాజాగా జరిగిన చెన్నై ఈవెంట్‌కు సుకుమార్ హాజరుకాలేదని అంటున్నారు.&nbsp; రాత్రిళ్లు సైతం శ్రమ..&nbsp; ‘పుష్ప2’ కోసం సుకుమార్‌ శ్రమిస్తున్న వీడియోను మూవీ టీమ్‌ ఎక్స్‌ వేదికగా పంచుకుంది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారని తెలియజేస్తూ పోస్టు చేసింది. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కోసం ‘ఏరౌండ్‌ ది క్లాక్‌’ సుకుమార్‌ పనిచేస్తున్నారని రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్‌ టీమ్‌ వ్యక్తికి సుకుమార్‌ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సుకుమార్‌ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/PushpaMovie/status/1860015165732978697 సినిమాలకు గుడ్‌బై చెబుతారా? ‘పుష్ప పార్ట్‌ 1 మెుదలైనప్పటి నుంచి సుకుమార్‌ (Director Sukumar) ఆ సినిమానే లోకంగా గడుపుతున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ‘పుష్ప.. పుష్ప..’ అంటూ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' తర్వాత ఆయన ఇండస్ట్రీ నుంచి దూరమవుతారన్న కామెంట్స్‌ నెట్టింట స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. పూర్తిగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. అయితే ఇందులో నిజమున్నా శాశ్వతంగా మాత్రం కాదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘పుష్ప 2’ విడుదలయ్యాక 6 నెలల నుంచి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తారని చెబుతున్నాయి. ఆ తర్వాతనే రామ్‌చరణ్‌ (Ramcharan)తో అనౌన్స్‌ చేసిన 'RC 17' ప్రాజెక్ట్‌ను సుకుమార్‌ పట్టాలెక్కిస్తారని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఫ్యాన్స్‌ ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. చరణ్‌కు జోడీగా సాయిపల్లవి! ‘రంగస్థలం’ (Rangasthalam) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత సుకుమార్, రామ్‌ చరణ్‌ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ’RC17’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ రూపొందనుంది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి సైతం ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్‌ను చాలా బలంగా చూపించే సుకుమార్‌ సాయిపల్లవిని ఇంక ఏ స్థాయిలో చూపిస్తారోనని ఇప్పటినుంచే చర్చ మెుదలైంది. చరణ్‌, సాయిపల్లవి జోడీ మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పెయిర్‌ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై 'RC 17' మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp;
    నవంబర్ 25 , 2024
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    టాలీవుడ్‌లో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయగా అది పాన్‌ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్‌కు కూడా చిత్ర యూనిట్‌ ముహోర్తం ఖరారు చేసింది.&nbsp; రిలీజ్‌ ఎప్పుడంటే! ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్‌ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్‌తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.&nbsp; ఆ పాటను మరిపిస్తుందా! పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్‌ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్‌ చేసి వేసే హుక్‌ స్టెప్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ స్టెప్‌ను అప్పట్లో యూత్‌ రీల్స్‌ చేసి తెగ ట్రెండ్‌ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్‌ సింగిల్‌.. రొమాంటిక్‌ సాంగ్‌ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్‌లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk ఐటెం సాంగ్‌పై ఫోకస్‌! (Pushpa 2 Item Song) ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్‌ పాట రేపు (మే 23) ఫ్యాన్స్‌ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ దృష్టి ఐటెం సాంగ్‌ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్‌ కానుండటంతో త్వరగా సాంగ్‌ను రూపొందించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    మే 22 , 2024
    Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;
    Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్‌ కపుల్‌ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్‌ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే? మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్‌ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో చేసిన ‘సిటాడెల్‌ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్‌ కూాడా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్‌ యూనిట్‌ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్‌ కూడా త్వరలో రిలీజ్‌ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.&nbsp; https://twitter.com/i/status/1770184438099410982 చైతు - సమంత మాట్లాడుకున్నారా? అమెజాన్‌ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1770045272049279412 అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి.. మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్‌ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్‌ ఇండియా వెర్షన్‌’ త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించాడు. ఇటీవల ఈ సిరీస్‌ పేరును మేకర్స్‌&nbsp; ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.&nbsp; https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
    మార్చి 20 , 2024
    <strong>Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;</strong>
    Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;
    టాలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్‌ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్‌ పెళ్లి టాపిక్‌ చాలా సార్లు సోషల్‌ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్‌ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే? ప్రభాస్‌ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్‌ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్‌ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్‌ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్‌ తర్వాత యావత్‌ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది.&nbsp; మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్‌ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్​తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.&nbsp; ‘ఫౌజీ’ షూట్‌లో ప్రభాస్‌! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ తాజాగా ఈ మూవీ షూట్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్‌ మలయాల భామ నమిత ప్రమోద్‌ కూడా సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్‌ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    అక్టోబర్ 26 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.&nbsp; ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.&nbsp; https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024

    @2021 KTree