రివ్యూస్
How was the movie?
తారాగణం
అల్లు శిరీష్
అర్జున్యామీ గౌతమ్
యామినిప్రకాష్ రాజ్
పశుపతిహరీష్ ఉత్తమన్
జగపతినాసర్
సౌందరపాండ్యఎలాంగో కుమారవేల్
బాచిశ్రీచరణ్
as Venkyఎల్బీ శ్రీరామ్
శంకర్ తండ్రిలక్ష్మీ ప్రియ చంద్రమౌళి
జగపతి భార్యపవిత్ర లోకేష్
పశుపతి భార్యబ్రహ్మాజీ
రాంబాబుకాజల్ పశుపతి
సుమంతిఅనుపమ కుమార్
సిబ్బంది
రాధా మోహన్
దర్శకుడుప్రకాష్ రాజ్
నిర్మాతతమన్ ఎస్
సంగీతకారుడుప్రీతా జయరామన్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు!
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27నుంచి 29 మధ్య మూడురోజుల పాటు జరగనున్న ఈవెంట్‌లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఈ ఇద్దరు అగ్రహీరోలు ఒకే వేదికపై అవార్డులు తీసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్‌కు మరో గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఈ ఏడాది వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నుంచి పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ -2024 వేడుకల్లో మరో అవార్డును సొంతం చేసుకున్నారు. అవుడ్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును కైవసం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ జావేద్ అక్తర్ చేతుల మీదగా మెగాస్టార్ ఈ అవార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/PulagamOfficial/status/1839749384667316719
https://twitter.com/PROSaiSatish/status/1839938794956439677
https://twitter.com/PraveeGv/status/1839930181143703686
బాలకృష్ణకు సైతం..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ల నటన జీవితం పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించి టాలీవుడ్‌లో పెద్ద ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఐఫా - 2024 వేడుకల్లో బాలయ్యను అవార్డుతో నిర్వాహకులు గౌరవిచంారు. ప్రతిష్టాత్మక గోల్డెన్ లెగసీ అవార్డ్‌ను బాలకృష్ణకు అందజేశారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందచేశారు. అవార్డు ఇవ్వడానికి ముందు బాలయ్య కాళ్లకు కరణ్ జోహర్ నమస్కారం చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ వీటిని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/SureshPRO_/status/1839855063390454090
ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ
అబుదాబిలో జరుగుతున్న ఐఫా వేడుకలకు టాలీవుడ్ నుంచి దిగ్గజ నటుడు వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గుర్ని ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో ఈవెంట్లో ఒక్కసారిగా సందడి వచ్చింది. ఒకే వేదికపై ఈ ముగ్గురు స్టార్ హీరోలను చూసి అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేదికపైన బాలయ్య, చిరు, వెంకీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవికి అవుడ్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంతో ఆ అవార్డుని పట్టుకొని వెంకటేష్, బాలకృష్ణలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫొటోల్లో నాగార్జున కూడా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/TeluguCinema7/status/1839748107602444312
ఐఫా - 2024 అవార్డు విజేతలు..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- చిరంజీవి ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంత గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా ఉత్తమ నటుడు (తెలుగు)- నాని ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ) ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర) ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబు ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉత్తమ సాహిత్యం - జైలర్ (హుకుం) ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ నేపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ విలన్ (మలయాళం) - అర్జున్ రాధాకృష్ణన్
సెప్టెంబర్ 28 , 2024
Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం...
విజయశాంతి:
తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్.
"ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్వినీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ
రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం...
ఆసిన్
విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్ రోల్ నటించి మెప్పించింది.
కమలినీ ముఖర్జీ
హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది.
ఇలియానా
రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు.
నయనతార
లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది.
అనుపమ పరమేశ్వరన్
క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది.
సాయి పల్లవి
ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్ ఏదైన ఉందంటే 'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది.
శృతిహాసన్
తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే.
సన్నిలియోన్
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్.
షకిలా
నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.
కలర్స్ స్వాతి
సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి
సంయుక్త మీనన్
ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్
సుహాసిని
ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 05 , 2023
సమంత చెప్పిన జీవిత పాఠాలు
]నాకు పని చేసుకునే తల్లులంటే అమితమైన గౌరవం.తల్లిని గౌరవించు
ఫిబ్రవరి 13 , 2023
అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ స్ఫూర్తితో నటుడిగా మారాలని నిర్ణంచుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. గౌరవం చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రం మంచి బ్రెక్ ఇచ్చింది. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన అల్లు శిరీష్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
అల్లు శిరీష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
అల్లు శిరీష్ తొలి సినిమా?
గౌరవం(2013)
అల్లు శిరీష్ ఎక్కడ పుట్టాడు?
చెన్నై
అల్లు శిరీష్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1987, మే 30
అల్లు శిరీష్ వివాహం అయిందా?
ఇంకా జరగలేదు.
అల్లు శిరీష్‌కు లవర్ ఉందా?
అను ఇమాన్యూవెల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
అల్లు కిషన్ ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్
అల్లు శిరీష్ తొలి హిట్ సినిమా?
ఊర్వశివో రాక్షసివో చిత్రం శిరీష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.
అల్లు శిరీష్ ఇష్టమైన కలర్?
వైట్
అల్లు శిరీష్ తల్లిదండ్రుల పేరు?
నిర్మల, అల్లు అరవింద్
అల్లు శిరీష్ ఇష్టమైన ప్రదేశం?
కులు మనాలి
అల్లు శిరీష్ ఏం చదివాడు?
MCJ
అల్లు శిరీష్ అభిరుచులు?
డ్రైవింగ్, జిమ్మింగ్
అల్లు శిరీష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.
అల్లు శిరీష్‌కు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
అల్లు శిరీష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ. 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=Wg-K4QjOf_Q
మార్చి 21 , 2024
తెలుగు చిత్రాల్లో బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్స్
]Cream Section Separatorప్రత్యేకంగా శర్వానంద్, నిత్యమీనన్ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్.watch now
ఫిబ్రవరి 13 , 2023
Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ!
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.
రాజమౌళిపై సైతం
దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్, రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్!
ప్రభాస్, గోపిచంద్ మధ్య మంచి ప్రెండ్‌షిప్ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్ సందర్భంగా గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
ప్రభాస్ బర్త్‌డే కానుక
ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్ చేసి రిలీజ్ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్’ అంటూ వదిలిన ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
https://www.youtube.com/watch?v=gTA9ghC4ehs
అక్టోబర్ 15 , 2024
Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్, బన్నీ సరసన రామ్ చరణ్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ (Ram Charan) టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR)తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.
సింగపూర్‌లో మైనపు విగ్రహం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్ టీమ్ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Nilzrav/status/1840120654193897699
ఫస్ట్ తెలుగు హీరోగా రికార్డు!
టాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్ తెలుగు యాక్టర్ రామ్ చరణ్ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.
చరణ్ కంటే ముందే..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
బాలీవుడ్ స్టార్స్ విగ్రహాలు
బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.
చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రామ్‌చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్, సుకుమార్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 30 , 2024
Rajamouli Oscar Academy: మరోమారు దేశం గర్వపడేలా చేసిన రాజమౌళి..!
భారత సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుల్లో ఎస్.ఎస్ రాజమౌళి కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో మరోమారు తన సత్తా ఏంటో నిరూపించారు. అప్పటి వరకూ భారత చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిచయమైన రాజమౌళి పేరు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ గ్లోబల్ స్థాయిలో మారుమోగింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయారు. అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే, తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. భార్యతో సహా ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం లభించింది.
రాజమౌళికి అరుదైన గౌరవం
దర్శకధీరుడు రాజమౌళికి అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
గతేడాది చరణ్, తారక్‌లకు ఆహ్వానం!
టాలీవుడ్ నుంచి గతేడాది కొందరు ప్రముఖులు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కీలక పాత్రలు పోషించిన ‘రామ్ చరణ్’ (Ramcharan), ఎన్టీఆర్ (Jr NTR) లతో పాటు కీరవాణి, చంద్రబోస్, సెంథిల్‌కుమార్ సైతం ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు. ఇక ఈ ఏడాది కొత్త వారికి ఆహ్వానం పంపినందుకు సంతోషంగా ఉందని అకాడమీ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోంది’ అని పిలుపునిచ్చారు.
రాజమౌళి స్థాయిని పెంచిన ‘ఆర్‌ఆర్‌ఆర్’
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది ‘గోల్డెన్ గ్లోబ్స్’తో పాటు ‘ఆస్కార్’ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆస్కార్ అవార్డ్ కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరాన్‌ను అప్పట్లో రాజమౌళి కలిశారు. తాను కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూశానని.. అదోక అద్భుతం అంటూ ఆ సందర్భంగా రాజమౌళితో కామెరూన్ వ్యాఖ్యానించారు. తన భార్యకు కూడా ‘ఆర్ఆర్ఆర్’ చూడాలని సూచించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ప్రశంసించడంతో ఆ వార్త యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
https://twitter.com/i/status/1616676262118064132
రాజమౌళి బిజీ బిజీ..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. వారం రోజుల్లో కథ ఫైనల్ అవుతుందని సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.
జూన్ 26 , 2024
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్‌గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్‌గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Lokesh Kanagaraj: రజనీకాంత్ ఆరోగ్యంపై లోకేష్ కనగరాజ్ తాజా అప్‌డేట్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘రజనీ కంటే షూటింగ్ ముఖ్యం కాదు’
రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్ కనగరాజ్ మండిపడ్డారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.
రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే?
రజనీకాంత్ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కూలీలో స్టార్ క్యాస్ట్!
రజనీకాంత్ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
సైమన్ యాక్షన్ సీన్ లీక్
రజనికాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ పోషిస్తున్న సైమన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ గతంలో రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్ సీన్ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్ రూత్ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్ (విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్ కూడా చెప్పాడు. ఈ క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్ చేశారు..
https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582
లోకేష్‌పై పవన్ ప్రశంసలు
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్ వంటి స్టార్ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
https://twitter.com/i/status/1841446808888758277
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
అక్టోబర్ 05 , 2024
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరు, బన్నీ, తారక్, మహేష్ స్ట్రాంగ్ కౌంటర్!
వెనక్కి తగ్గిన కొండా సురేఖ
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కూడా కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమంటూ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన స్వశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఎంతో ఆదర్శమని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.
కోర్టుకు వెళ్లిన నాగార్జున
తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) న్యాయస్థానం తలుపుతట్టాడు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.
అసలేం జరిగిందంటే?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను వివాదంలోకి లాగారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్ పార్టీలు చేయడంతో పాటు సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. అంతటితో ఆగకుండా నాగ చైతన్య - సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు సమంతను నాగార్జున ఫోర్స్ చేయగా ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో మాట వింటే విను.. లేదంటే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారని మంత్రి సురేఖ అన్నారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపడంతో నాగార్జున, అమలతో పాటు ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
https://twitter.com/i/status/1841433938297807337
https://twitter.com/FierceZen82/status/1841698670783189472
మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొండి: నాగార్జున
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా నాగార్జున పోస్టు పెట్టాడు.
https://twitter.com/iamnagarjuna/status/1841446247242035233
యాక్టర్ల జీవితాలను హైడ్‌లైన్స్ కోసం వాడొద్దు: నాగ చైతన్య
మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు ఆమోదనీయం కాదని నటుడు నాగచైతన్య వ్యాఖ్యానించారు. ‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య (Naga Chaitanya) పేర్కొన్నారు.
https://twitter.com/chay_akkineni/status/1841529895031050723
నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు: సమంత
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల (Konda Surekha Comments)పై సమంత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను (Samantha) వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని సామ్ పేర్కొంది.
ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు : చిరంజీవి
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1841684462767313169
చౌకబారు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేష్ బాబు
నటుడు మహేష్ బాబు సైతం ఎక్స్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. 'మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకూ వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే సినీరంగాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి’ అని మహేష్‌బాబు పేర్కొన్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1841752300517290457
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: తారక్
వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని జూ. ఎన్టీఆర్ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని రాసుకొచ్చారు.
https://twitter.com/tarak9999/status/1841571689982730392
అసహ్యం వేస్తోంది: నాని
యంగ్ హీరో నాని కూడా మంత్రి కొండ సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’ అని ఎక్స్‌లో నాని పోస్టు పెట్టారు.
https://twitter.com/NameisNani/status/1841541476083499197
రాజకీయ లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు: వెంకటేష్
సీనియర్ నటుడు వెంకటేష్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
https://twitter.com/VenkyMama/status/1841696634889240644
ఈ ప్రవర్తన చాలా అగౌరవం: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
https://twitter.com/alluarjun/status/1841692652388970952
అక్టోబర్ 03 , 2024
Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న మూవీ ప్రాజక్ట్స్‌ను ఫినిష్ చేసేందుకు పవన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అక్కడి స్టార్ డైరెక్టర్‌పై పవన్ ప్రశంసలు కురిపించారు. అతడి ఫిలిం మేకింగ్ బాగుంటుదంటూ ఆకాశానికి ఎత్తారు. దీంతో ఆ డైరెక్టర్‌తో సినిమా పడితే వేరే లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అటు పవన్ కామెంట్స్‌పై సదరు డైరెక్టర్ కూడా తాజాగా స్పందించడంతో వీరి కాంబోకు ఎక్కువ రోజులు పట్టదన్న చర్చ మెుదలైంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? పవన్ చేసిన కామెంట్స్ ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ మేకింగ్ ఇష్టం: పవన్
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. అలాగే తమిళ హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) కామెడీ అంటే తనకు బాగా నచ్చుతుందని పవన్ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌పై తమిళ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి భేషజాలం లేకుండా పక్క ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లను ఆకాశానికి ఎత్తడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1841446808888758277
పవన్‌కు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్
తన మేకింగ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఆయన తక్కువ టైమ్‌లోనే ఎంతో పాపులర్ అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి కలిగించారు. అటువంటి డైరెక్టర్ గురించి పవన్ మాట్లాడటంతో వీరిద్దరి కాంబోపై ఒక్కసారిగా చర్చమెుదలైంది. వీరి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే థియేటర్లు దద్దరిల్లిపోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను పవన్ అంగీకరిస్తారో లేదో చూడాలి మరి.
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
త్వరలో పట్టాలపైకి ‘ఉస్తాద్’, ‘ఓజీ’!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. ఇటీవల హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 03 , 2024
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 24) పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పవన్ ఏఐ పోస్టు..?
తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్ జీపీటీ లేదా ఏఐ సాయంతో పదాల కూర్పును జనరేట్ చేయించి పవన్ ఈ ట్వీట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
https://twitter.com/PawanKalyan/status/1838587619745087518
‘ఏఐ’ వినియోగంలో తప్పుందా!
కార్తీపై పవన్ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రమిటికల్ తప్పులు లేకుండా ఏఐ సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్ ఏఐ టూల్ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్ ఏఐ ట్వీట్ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
కార్తీ చేసిన తప్పేంటి?
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ లడ్డు టాపిక్ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470
పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్!
కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్ రియాక్షన్ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సెప్టెంబర్ 25 , 2024
Tirumala Laddu : సినీ హీరోలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!
తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్‌కు వార్నింగ్!
తిరుమల లడ్డుపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన వివాదస్పద ట్వీట్‌పై పవన్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్‌కు సంబంధం ఏంటని నిలదీశారు. తిరుపతిలో మరోమారు అపవిత్రం జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఇస్లాంని నిందించానా? లేక క్రిస్టియానిటీని తప్పుబట్టానా? అంటూ పవన్ అన్నారు. హిందువుల దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? అంటూ ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏం జరిగింతో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు.
https://twitter.com/i/status/1838470602098913294
‘అపహాస్యం చేస్తే ఊరుకోను’
ప్రకాష్ రాజ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. ‘లడ్డు చాలా సెన్సిటివ్’ అంటూ జోకులు వేస్తున్నారని నటుడు కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. మరోమారు అలా అనొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండని సూచించారు.
https://twitter.com/i/status/1838465598713372823
‘నటుల కంటే సనాతన ధర్మమే గొప్పది’
టికెట్ల కోసం ఎన్నో ప్రయాశలు పడి సినిమా చూసే అభిమానులకు సైతం పవన్ చురకలు అంటించారు. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. వారు కూడా తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడాలని సూచించారు. సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడతారని, సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. హీరోల కంటే పైస్థాయిలో హిందూ ధర్మాన్ని చూడాలని, ఒక హీరోగా తానే ఈ విషయాన్ని చెబుతున్నానని సినీ లవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరన్న భావన సమాజంలో ఉందని పవన్ అన్నారు. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోవాలని అంతే కాని మమ్మల్ని ఏమి అనొద్దని, సెక్యులరిజం గురించి సూక్తులు చెప్పొద్దని పేర్కొన్నారు.
పవన్‌కు సారి చెప్పిన కార్తీ
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. తిరుమల వివాదం గురించి మాట్లాడమని కార్తీని కోరగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు.
https://twitter.com/CinemaniaIndia/status/1838484585325215936
వచ్చాక మీకు ఆన్సర్ ఇస్తా: ప్రకాష్ రాజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ట్వీట్ చేశారు. 'పవన్ కల్యాణ్ గారు ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.
https://twitter.com/prakashraaj/status/1838505132025168154
అంతకుముందు ఏం జరిగిందంటే?
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్ ఇటీవల శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ఎక్స్ వేదికగా స్పదించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్ చేస్తూ ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) #జస్ట్ ఆస్కింగ్’ అని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే నటుడు మంచు విష్ణు స్పందించారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు. మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ హెచ్చరించారు.
https://twitter.com/prakashraaj/status/1837104811419775430
సెప్టెంబర్ 24 , 2024
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు.
‘నా అనుమతి తీసుకోలేదు’
సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.
View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)
'అన్యాయంగా నాపై నిందలు'
జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు.
ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు.
https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611
తారా స్థాయికి గొడవలు!
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు
1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024
Mahesh Babu Voice To Mufasa: మహేష్ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్ సింహాం ‘ముఫాసా’..!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహానికి మహేష్ డబ్బింగ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/taran_adarsh/status/1826142693149327810
డబ్బింగ్‌పై మహేష్ ఏమన్నారంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ యానిమేషన్ చిత్రంలో మెయిన్ లీడ్‌కు డబ్బింగ్ చెప్పడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను బిగ్ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
హిందీలో డబ్బింగ్ ఎవరంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారుక్ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
ఆగస్టు 21 , 2024
Puri Jagannadh: ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ క్లాస్ పీకారు.. పూరి జగన్నాథ్ క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్‌కు చెందిన స్టార్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్ డైలాగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్ మ్యాన్’ ‘టెంపర్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ (Liger) దారుణంగా ఫెయిల్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) పూరికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.
‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు.
https://twitter.com/i/status/1822878179679203353
కథ చెప్పాల్సింది కదా!
డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.
మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి!
‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. 'మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1822887370594877712
ఆగస్టు 12 , 2024
SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్.. మరీ ఇలా చేశారేంటీ!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏకీపారేస్తున్న నెటిజన్లు!
దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్‌నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్ చూసి మాత్రం షాక్‌కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్‌లో ప్రభాస్, రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ తమ సొంత వాయిస్‌తో రాజమౌళితో తమకున్న వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల చేత డబ్బింగ్ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్, చరణ్, తారక్‌లకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్ వల్ల డాక్యుమెంటరీని ఓన్ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=OTHKWEZilL4
డబ్బింగ్ చెప్పే సమయం లేదా?
రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్ ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రభాస్, తారక్, రామ్‌చరణ్ తమ ఓన్ వాయిస్‌తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్‌కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్ డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే?
‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary) రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, రమా రాజమౌళి, కరణ్‌జోహార్, జేమ్స్ కామెరూన్, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..
ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్
ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్
రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్ కామెరూన్
ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్
ఈ దర్శకుడు ఓ లెజెండ్ - కరణ్ జోహార్
https://twitter.com/NetflixIndia/status/1815243072801763362
సెట్స్‌లో ఎన్నో మైక్స్ పగలడం చూశా: చరణ్
రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్ పర్సన్' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.
ఆస్కార్ కమిటీకి రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
జూలై 23 , 2024