రివ్యూస్
How was the movie?
తారాగణం
అర్జున్ సర్జా
కృష్ణజగపతి బాబు
దాసువేణు తొట్టెంపూడి
అజాతశత్రు అకా శత్రుడులయ
సంగీతస్నేహ
మీనాక్షివిజయలక్ష్మి
దేవిజయ ప్రకాష్ రెడ్డి
దేవుడయ్యబ్రహ్మానందం
సంగీత మేనమామకోవై సరళ
సంగీత అత్తఅలీ
జనగణమనవెన్నిరా ఆడై నిర్మల
దేవుడయ్య భార్యఎల్బీ శ్రీరామ్
చక్రంపరుచూరి బ్రదర్స్
పరుచూరి వెంటేశ్వరరావుఎంఎస్ నారాయణ
అబ్బులువేణు మాధవ్
దేవుడయ్య సహాయకుడురాళ్లపల్లి
బిసెంట్ రవి
హెంచ్మాన్శ్రీ దివ్య
సుదీప పింకీ
యంగ్ మీనాక్షిసిబ్బంది
మోహన్ రాజా
దర్శకుడుఎంవీ లక్ష్మి నిర్మాత
ఎడిటర్ మోహన్నిర్మాత
సురేష్ పీటర్స్
సంగీతకారుడురఫీ మరియు మెకార్టిన్
కథఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024
Top TV Hosts In South India: సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!
దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.
వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.
విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
అషూ రెడ్డి (Ashu reddy)
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.
సౌమ్యరావు (Sowmya rao)
జబర్దస్త్ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
శ్యామల (Shyamala)
అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది.
దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu)
కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.
అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
రష్మి (Rashmi)
జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.
శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.
వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఈమెనే. ఐపీఎల్ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.
రచిత (Rachitha)
ప్రముఖ సీరియల్ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.
పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty)
బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్ మహిళా’, ‘క్యాష్’ వంటి టెలివిజన్ షోలలోనూ ఈమె పాల్గొంది.
ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)
‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్ షోలలోను కనిపించి సందడి చేసింది.
ప్రీతి అస్రాని (Preeti Asrani)
గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar)
ప్రముఖ స్టార్ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్ అరింధాల్' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్ తమిళ్ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.
వైష్ణవి గౌడ (Vaishnavi Gowda)
కన్నడలో బాగా పాపులర్ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
దీపికా దాస్ (Deepika Das)
కర్ణాటకకు చెందిన దీపికా దాస్.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్ గర్ల్' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 22 , 2024
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.
‘హనుమాన్’గా తొలుత యష్
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
అక్టోబర్ 30 , 2024
Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన 'కల్కి', 'పుష్ప 2', హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం.
1. ఈగల్
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా డిజాస్టర్ల జాబితాలో చేరారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాల ప్రభావంతో, నేటి యువ దర్శకులు సరికొత్త కథలు తీసుకోకుండా, భారీ బడ్జెట్‌తో యాక్షన్ సన్నివేశాలు, భారీ గన్స్, విచిత్రమైన ఫ్లాష్‌బ్యాక్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ 'ఈగల్' కథపై దృష్టి పెట్టకుండా ఒక్కో సన్నివేశం మాత్రమే బాగా రావాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. భారీ బడ్జెట్ వృథాగా అయిందని చెప్పుకోవచ్చు.
2. మిస్టర్ బచ్చన్
2024లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రీమేక్ సినిమాల విషయంలో ఎలా చేయకూడదో అనిపించేలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టల్ క్లియర్ కథనం లేకపోవడం, క్రింజ్ కామెడీ సన్నివేశాలు సినిమాను పూర్తిగా డీలా పడేయించాయి. మంచి నటీనటుల ఫేస్ వాల్యూ వృథా అయింది. ఒక రీమేక్ సినిమాలో కథకు ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు సులభంగా తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది.
3. సైంధవ్
వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉండేవి. కానీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం లేకపోవడంతో పండగ రోజు సినిమా థియేటర్ల నుంచి రానివ్వకుండా వెళ్లిపోయింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటుడు సైతం ఈ సినిమాలో ప్రాభవాన్ని చూపించలేకపోయాడు. కథలో లోపాలు, ఆర్య పాత్ర లాంటి అనవసరమైన పాత్రలు సినిమాను మరింతగా దెబ్బతీశాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
4. డబుల్ ఇస్మార్ట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు పూరికి ఇటు రామ్ పొత్తినేనికి వరుస ఫ్లాప్స్ ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. పూరీ స్టైల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన ప్రామాణికతను అందించకపోవడం ఈ చిత్రానికి పెద్ద షాక్‌గా మారింది. వరుస ఫ్లాప్‌లతో రామ్‌కు ఈ సినిమా మరో పెద్ద మైనస్‌గా మారింది.
5. ఆపరేషన్ వాలెంటైన్ & మట్కా
మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు – 'ఆపరేషన్ వాలెంటైన్' మరియు 'మట్కా'. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ లాంటి ప్రామాణిక నటుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వినూత్న కథా సామర్థ్యం లేకపోవడం ఈ సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం.
6. ఫ్యామిలీ స్టార్
విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 2024లో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కామెడీ డ్రామా జానర్‌ను ప్రయత్నించినప్పటికీ, కథలో లోపాలు సినిమాను కిందికి దించాయి.
7. మనమే
శర్వానంద్ నటించిన 'మనమే' కూడా ఈ ఏడాది మరో నిరాశపరిచిన మరో సినిమా. వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ ఈసారి సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమా మొత్తం స్లో నేరేషన్, అర్థరహితమైన ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యమైన పాయింట్లను సరిగా హైలైట్ చేయకపోవడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది.
8. తిరగబడరా సామీ, బడ్డీ, శివంభజే
ఇంకా యంగ్ హీరోలు అశ్విన్ బాబు, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలు కూడా నిరాశపరిచారు. అశ్విన్ బాబు నటించిన 'శివంభజే', అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ', రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామీ' చిత్రాలు నాటకీయ అంచనాలను తలపించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయకపోవడంతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి.
9. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
కార్తికేయ సిరీస్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్‌కు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించారు.
10. చిన్న సినిమాలు
2024లో చిన్న సినిమాల జాబితాలో కూడా చాలా నిరాశ ఎదురైంది. మంచి కథా బలం ఉన్నా సరైన ప్రమోషన్ లేకపోవడం, కొత్త దర్శకుల సినిమాలు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోలేదు. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలకు ఆర్థిక నష్టాలు మిగిలాయి.
2024లో టాలీవుడ్ పెద్ద ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచాయి. రవితేజ, వెంకటేష్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ విజయాల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. ఒక వైపు 'పుష్ప 2', 'కల్కి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టాలీవుడ్‌ను ముందుకు నడిపిస్తే, మరో వైపు ఈ డిజాస్టర్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. కొత్త సంవత్సరం 2025లో వీరు తిరిగి పుంజుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.
డిసెంబర్ 19 , 2024
Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీనికి ‘హనుమాన్’(Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ మూవీకి ‘సింబ’(Simba) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కానీ ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇందులో హీరోయిన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
హీరోయిన్‌గా స్టార్ నటి కూతురు!
మోక్షజ్ఞ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ కూతుర్ని హీరోయిన్‌గా సెట్ చేసినట్లు నెట్టింట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా థడానిని (Rasha thadani) కథానాయికగా ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే డిసెంబర్ నుంచి ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారు కావడంతో వారిని ప్రశాంత్ ఏ విధంగా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
విలన్‌గా రానా!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌లో విలన్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు దగ్గుబాటి రానా పేరును ప్రశాంత్ వర్మ పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్రూరమైన విలన్ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని చిత్ర బృందం కూడా నమ్ముతోందట. దీనిపై రానాతో సంప్రదింపులు కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. దీంతో డిసెంబర్ 2న మూవీ షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున సినిమాకు క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఈ చిత్రానికి బాలయ్య చిన్నకూతురు ఎం. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
బాలయ్య స్పెషల్ రోల్!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని అంటున్నారు చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేదంటే అర్జునుడి పాత్రలోనైనా బాలయ్య కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కుమారుడి ఎంట్రీ ఫిల్మ్‌లో బాలయ్య నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.
మహాకాళి ప్రాజెక్ట్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మోక్షజ్ఞ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే తన యూనివర్స్ నుంచి మరో చిత్రాన్ని కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘మహా కాళీ’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించరు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ మూవీని తెరకెక్కిస్తారు.
అక్టోబర్ 26 , 2024
Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్’.. హృతిక్, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), మహేష్ బాబు (Mahesh Babu), అజయ్ దేవగణ్ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
[toc]
హనుమాన్ (HanuMan)
తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైటర్ (Fighter)
హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్ కపూర్ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్ చిత్రం 'ఫైటర్'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)
మలయాళం సెన్సేషన్ ‘మంజుమ్మెల్ బాయ్స్’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.
షైతాన్ (Shaitaan)
బాలీవుడ్ లేటెస్ట్ చిత్రం 'షైతాన్' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్ దేవగణ్ (Ajay Devgan), మాదవన్ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.
గుంటూరు కారం (Guntur Kaaram)
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.
ది గోట్ లైఫ్ (The Goat Life)
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లీడ్ రోల్‌లో చేసిన 'ది గోట్ లైఫ్'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
క్రూ (Crew)
టబూ, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
ఆవేశం (Aavesham)
ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ (Fahad Faasil) లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.
ప్రేమలు (Premalu)
మలయాళం సెన్సేషన్ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్ చిత్రం.. టిల్లు స్క్వేర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.
అక్టోబర్ 22 , 2024
Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్.. తేల్చేసిన డైరెక్టర్!
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్ (Hanuman) యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రంతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏర్పడింది. ఇక ‘హనుమాన్’కు సీక్వెల్ కూడా ఉండనున్నట్లు ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ‘జై హనుమాన్’ రిలీజ్, తమ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘బాధ్యత పెరిగింది’
పాన్ ఇండియా స్థాయిలో హనుమాన్ సక్సెస్ కావడం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. ‘హనుమాన్’ రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే ఈ పాటికీి సీక్వెల్‌ను ఎప్పుడో రిలీజ్ చేసేవాళ్లమని పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. దీంతో 'జై హనుమాన్'పై మరింత బాధ్యతగా వర్క్ చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'జై హనుమాన్' కోసం ఎంతో కష్టపడుతున్నామని ప్రశాంత్ వర్మ అన్నారు. స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సీక్వెల్ అందరి అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు స్క్రీన్‌పై ఏ అంశాలైతే చూడాలని భావిస్తున్నారో అవి కచ్చితంగా చూపిస్తామని ప్రశాంత్ వర్మ హామి ఇచ్చారు.
‘ముందే వీఎఫ్‌ఎక్స్ పనులు’
‘హనుమాన్’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వందల కోట్లతో రూపొందిన ‘ఆదిపురుష్’ కంటే ‘హనుమాన్’ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. దీనిపై కూడా ప్రశాంత్ వర్మ తాజాగా స్పందించారు. ‘హనుమాన్ సమయంలో మొదట షూటింగ్ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులు ప్రారంభించాం. కానీ దీని సీక్వెల్ (జై హనుమాన్)కు మాత్రం వీఎఫ్‌ఎక్స్ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం పట్టవు. ప్రస్తుతానికైతే షూటింగ్ మెుదలవ్వలేదు’ అంటూ జై హనుమాన్‌పై ప్రశాంత్ వర్మ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్స్ పక్కా!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాల కోసం కొందరు బాలీవుడ్ స్టార్స్‌ను కలిసినట్లు చెప్పారు. వారితో తన ఆలోచనలు పంచుకున్నట్లు తెలిపారు. ఇందులో వారు కచ్చితంగా భాగం అవుతారని స్పష్టం చేశారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని తెలిపారు. అటు ‘జై హనుమాన్’ పట్టాలెక్కేందుకు కూడా సమయం పట్టనుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు. దాని కంటే ముందు ‘అధీరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతర దర్శకులు కూడా వాటి కోసం వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో మోక్షజ్ఞ ఫిల్మ్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు.
మోక్షజ్ఞతో మూవీ షురూ
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్ లుక్‌లో స్మైలింగ్ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407
‘జై హనుమాన్’తో లింకప్!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోరానున్న చిత్రానికి 'PVCU 2' అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్'తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
Hanuman Movie OTT: హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన తొలి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంక్రాంతికి రిలీజైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో హనుమాన్ రాక ఎప్పుడంటూ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 16న హనుమాన్ హిందీ వెర్షన్ విడుదలవుతున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాపై ఓ అపడేట్ ఇచ్చాడు.
డైరెక్టర్ ఏమన్నారంటే!
హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై సినిమా లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు’ అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1768483659928265154
తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5' (Zee 5) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందీలో స్ట్రీమింగ్ డేట్ కన్ఫార్మ్ కాగా తెలుగు ఆడియన్స్‌కు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 'జీ 5' కూడా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. డైరెక్టర్‌తో పాటు ఓటీటీ సంస్థ కూడా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించకపోవడంతో ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హనుమాన్ రేపే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/ZEE5Telugu/status/1768250898784854434
హిందీలో డబుల్ ధమాకా
ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 16 నుంచి ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల ట్వీట్ రూపంలో ప్రకటించాడు. ఇక అదే రోజూ టెలివిజన్ ప్రీమియర్‌గానూ హనుమాన్ రానుంది. మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) ఛానల్‌లో హనుమాన్ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు ‘కలర్స్ సినీప్లెక్స్’ సంస్థ తమ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ధ్రువీకరించింది. దీంతో హిందీ ప్రేక్షకులు.. హనుమాన్‌ను ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.
మార్చి 15 , 2024
Hanuman Movie: ‘హనుమాన్’ టీమ్ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా డబుల్ గుడ్‌న్యూస్ ప్రకటించారు.
డబుల్ ధమాకా ఏంటంటే?
ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్.. డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్ ప్రీమియర్‌గానూ హనుమాన్ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) ఛానల్, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్ ప్రసారం అవుతుందని డైరెక్టర్ తన పోస్టులో చెప్పుకొచ్చారు. అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్ సినీప్లెక్స్’ సంస్థ తమ సోషల్ మీడియా ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) ఖాతాలో పోస్ట్ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్ వర్మ రీట్వీట్ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.
https://twitter.com/PrasanthVarma/status/1766116151636140450
మరి తెలుగులో ఎప్పుడు?
హనుమాన్ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్’ స్ట్రీమింగ్ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్ భరించాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు!
హనుమాన్ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ హౌస్‌ఫుల్ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.
https://twitter.com/PrasanthVarma/status/1766064148956532944
సీక్వెల్‌లోనూ విలన్ అతడేనా?
ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్ విలన్‌గా నటించిన 'వినయ్ రాయ్' (Vinay Roy) పార్ట్ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్ రాయ్‌కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ పోస్టు చేశారు. వినయ్ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కు మాస్క్, బ్లాక్ డ్రెస్ ధరించి హోటల్ సిబ్బందికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు.. 'జై హనుమాన్'లోనూ వినయ్ విలన్‌గా కనిపిస్తాడా? అనే డౌట్‌ను రెయిజ్ చేస్తున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1765336587184034177
మార్చి 09 , 2024
Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాలు దేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసు దోచాయి. ప్రతిసారి హీరోల స్టార్ పవర్‌తోనే కాకుండా, కథనం, పాటలు, సంగీతం వంటి అంశాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్లో నిలిపాయి. ఈ సంవత్సరంలో పలు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. హనుమాన్, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు ఈ జాబితాలో చేరి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇప్పుడు 2024లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ప్రధాన తెలుగు చిత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. హనుమాన్ (Hanuman):
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టి. సంక్రాంతి సందర్భంగా విడుదలై, దేశవ్యాప్తంగా సుమారు రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్టార్ హీరోల అవసరం లేకుండానే, మంచి కథ, దర్శకత్వం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది.
2. టిల్లు స్క్వేర్ (Tillu Square):
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం, 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా విడుదలైంది. చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
3. కల్కి 2898 AD (Kalki 2898 AD):
ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, జూన్‌లో విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఆరోవది కావడం విశేషం.
4. సరిపోదా శనివారం (Saripoda Sanivaram):
నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నానికి మరో విజయాన్ని అందించింది.
5. దేవర (Devara):
ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
6. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar):
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది.
7. పుష్ప 2 (Pushpa 2):
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలై రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు (రూ.280 కోట్లు)సాధించిన తొలి చిత్రంగా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
8. సలార్ (Salaar):
ప్రభాస్ నటించిన ఈ చిత్రం, 2023 డిసెంబర్‌లో విడుదలైనప్పటికీ, 2024లో కూడా గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్‌కు మరో విజయాన్ని అందించింది.
9. అమరన్ (Amaran):
శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం, తమిళనాట విడుదలై, పాన్ ఇండియావైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది.
10. గోట్ (G.O.A.T):
విజయ్ నటించిన ఈ చిత్రం, పలు చోట్ల మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, విజయ్‌కు మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
డిసెంబర్ 19 , 2024
Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
మెగా హీరో సరసన..!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.
https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941
మెగా హీరోతో రొమాన్స్!
'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కొత్తవారికి ప్రేరణగా అనన్య!
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్' వంటి సైన్స్ ఫిక్షన్ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ హీరోగా చేసిన 'వకీల్ సాబ్'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్ అయితే అనన్య కెరీర్ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.
1947-67 బ్యాక్‌డ్రాప్‌లో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954
పడిలేచిన కెరటంలా..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
నవంబర్ 12 , 2024
Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘హనుమాన్’గా కాంతార నటుడు!
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టితో ప్రశాంత్ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా?
‘జై హనుమాన్’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్ పాత్రకు పలానా స్టార్ హీరోను ఫైనల్ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, కేజీఎఫ్ ఫేమ్ యష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
‘కాంతార’తో పాన్ ఇండియా క్రేజ్
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్టోబర్ 18 , 2024
Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్ చేసింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
మార్చి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఏప్రిల్
2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది.
జూన్
ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
జులై
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్ పాన్ ఇండియా స్థాయికి తెలిసింది.
ఆగస్టు
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్
గత నెల సెప్టెంబర్ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.
డిసెంబర్
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది.
అక్టోబర్ 17 , 2024
SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్ హిట్ కొట్టిన తేజ్ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ చేరిపోయాడు. అదే ఏడాది పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు.
ధైర్యాన్నే కవచంగా..
సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. నేడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్ బ్యాక్ సైడ్ లుక్‌ను చూపించారు.
https://twitter.com/Primeshowtweets/status/1846065983091536150
రాయలసీమ నేపథ్యంలో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు తాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954
యాక్సిడెంట్‌తో కోమాలోకి..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
అక్టోబర్ 15 , 2024
PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్ హీరో.. ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761
పోస్టర్‌లో ఇవి గమనించారా?
‘మహా కాళీ’ పోస్టర్ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాళికాదేవి శక్తితో..
మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ!
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అక్టోబర్ 10 , 2024
Indian Oscar Entry 2025: ఆస్కార్ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘కల్కి’కి అన్యాయం జరిగిందా?
కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్ తరపున నామినేట్ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్ స్థాయిలో సక్కెస్ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ బాటలో కల్కి!
గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్ తరపున ‘ఆర్ఆర్‌ఆర్’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్ కూడా భారత్ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్ చిత్రాల కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్ పంపాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్’ టీమ్ కూడా జనరల్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘లాపతా లేడీస్’ ఎంపికకు కారణం ఇదే
లాపతా లేడీస్ చిత్రాన్ని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
సౌత్ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే!
ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు కాగా, కోలివుడ్ నుంచి 6 చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్ - ఎస్.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే భారత్ నుంచి ‘లాపతా లేడిస్’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.
లాపతా లేడీస్ ప్రత్యేకత ఏంటి?
సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్’కు దర్శకత్వం వహించిన కిరణ్, 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
సెప్టెంబర్ 24 , 2024
Jai Hanuman: ‘జై హనుమాన్’లో మెగాస్టార్ చిరంజీవి? ప్రశాంత్ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. తాజాగా 'హనుమాన్ 2'కి సంబంధించి క్రేజీ బజ్ బయటకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావొచ్చన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
మెగాస్టార్‌తో సంప్రదింపులు!
హనుమాన్ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' (Jai Hanuman) ఉండనున్నట్లు తొలి భాగం క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో హనుమాన్ పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. సీక్వెల్ మెుత్తం హనుమంతుడి పాత్ర మీదే ఉండటంతో దానికి మెగాస్టార్ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారట. లేదంటే రామ్‌చరణ్‌ను అయిన హనుమాన్ పాత్రకు తీసుకోవాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈమేరకు తాజాగా సంప్రదింపులు కూడా మెుదలైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. హనుమాన్‌గా చిరంజీవి లేదా రామ్‌చరణ్‌ను తాము ఊహించుకుంటున్నట్లు రీసెంట్‌గా చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకురుస్తున్నాయి. చిరు, చరణ్‌లలో ఏ ఒక్కరు ఓకే చెప్పిన 'హనుమాన్ 2'పై అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
‘హనుమాన్ 2’కి సమయం పట్టనుందా?
'జై హనుమాన్' (Jai Hanuman) చిత్రం పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోకజ్ఞ తేజ (Mokshagna Teja)తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెున్నటి వరకూ బొద్దుగా కనిపించిన మోకజ్ఞ కూడా రీసెంట్‌గా బరువు తగ్గి హ్యాండ్సమ్‌గా మేకోవర్ అయ్యాడు. దీంతో త్వరలోనే వీరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోకజ్ఞతో సినిమా తర్వాతనే ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’పై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చురుగ్గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అటు రామ్ చరణ్ సైతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నాడు. ఆపై ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ‘జై హనుమాన్’ షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముంది.
మోక్షజ్ఞ వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద హీరో మెటీరియల్ కాదని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. ఈ వీడియోను నందమూరు అభిమానులు విపరీతంగా షేర్ చేయడంతో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
https://twitter.com/UrsVamsiShekar/status/1815971676414435711
జూలై 25 , 2024
Hanuman Viral Video: ‘హనుమాన్’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
సంక్రాతికి విడుదలైన హనుమాన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.
మహిళ విచిత్ర ప్రవర్తన
హనుమాన్ క్లైమాక్స్ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1752014453342969952
ఒంట్లోకి దేవుడు వచ్చాడా?
ఉప్పల్‌లోని ఏసియన్ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
దుష్టశక్తే ఈ పని చేసిందా?
మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అసలు నిజం ఇదే!
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.
రూ.300 కోట్ల దిశగా పరుగులు
ఇక హనుమాన్ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తూ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టారు.
జనవరి 30 , 2024
Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్ బడా చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా మరికొన్ని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్ కల్యాణ్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్ వాటెండ్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.
హనుమాన్
ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్ విడుదల కానుంది.
భారతీయుడు 2
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు.
పుష్ప 2
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్‌సింగ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ
సలార్ సూపర్ హిట్ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్ 'స్పిరిట్' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్ స్టార్ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు.
డిసెంబర్ 30 , 2023