• TFIDB EN
  • హ్యాపీ వెడ్డింగ్
    UTelugu
    విజయ్ (రాజా)తో బ్రేకప్ చెప్పిన అక్షర (నిహారిక కొణిదెల) మళ్లీ ఆనంద్‌ (సుమంత్ అశ్విన్)తో ప్రేమలో పడుతుంది. అయితే ఏ కారణాల వల్ల బ్రేకప్ జరిగిందో అవే కారణాలు ఆనంద్‌ రిలేషన్‌లో రిపీట్ అవుతాయి. అప్పుడు అక్షర ఏం చేసింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుమంత్ అశ్విన్
    ఆనంద్
    నిహారిక కొణిదెల
    అక్షర
    మురళీ శర్మ
    అక్షర తండ్రి
    నరేష్
    ఆనంద్ తండ్రి
    పవిత్ర లోకేష్
    ఆనంద్ తల్లి
    తులసి
    అక్షర తల్లి
    ఇంద్రజ
    అక్షర
    పూజిత పొన్నాడ
    లవీనా
    రాజా చెంబోలువిజయ్
    అన్నపూర్ణ
    ఆనంద్ అమ్మమ్మ
    జహాన్జేబ్ ప్రకాష్
    ప్రీతి అస్రానీ
    అక్షర సోదరి
    సిబ్బంది
    లక్ష్మణ్ కార్యదర్శకుడు
    ఎం. సుమంత్ రాజునిర్మాత
    V. వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
    ప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    కథనాలు
    <strong>Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్</strong>
    Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్
    మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా, నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర ఇండస్ట్రీపై వేసింది. అటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. 2020 డిసెంబర్‌లో చైతన్య కృష్ణను వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతేడాది జులైలో అతడితో విడిపోవడంతో తిరిగి ఈ అమ్మడి దృష్టి సినిమాలపై పడింది. ఇటీవలే ప్రొడ్యుసర్‌గా మారి 'కమిటీ కుర్రోళ్లు' అనే బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం తీసింది. అటు తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా సైతం నటిస్తోంది. అందులో నిహారిక చేసిన రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  రొమాంటిక్‌ సాంగ్‌లో.. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) అనే చిత్రంలో నిహారిక (Niharika Konidela) నటిస్తోంది. షాన్‌ నిగమ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారికతో పాటు ఐశ్వర్య దుత్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైనర్‌ రిలీజ్‌ చేయగా దానికి విశేష స్పందన వచ్చింది. తాజాగా షాన్‌ నిగమ్‌, నిహారిక మధ్య సాగే ఓ రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్‌, షాలిని మధ్య వచ్చే 'నగిన నగిన' పాటను రీమిక్స్‌ చేసి దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ - రొమాంటిక్‌ డ్యాన్స్‌ ఉన్నాయి. నిహారిక ఈ స్థాయిలో రొమాన్స్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.  https://twitter.com/SivareddE/status/1865713969794806123 నెటిజన్ల మండిపాటు 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) మూవీ సాంగ్‌ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బోల్డ్‌ రొమాంటిక్‌ పాటల్లో నటించి మెగా ఫ్యామిలీ పరువు తీసిందని ఆరోపిస్తున్నారు. గ్లామర్‌ పాత్రలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చక్కగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావొచ్చు కదా అని సూచిస్తున్నారు. మూడు నిమిషాల సాంగ్‌లోనే ఈ స్థాయిలో గ్లామర్‌ షో చేస్తే ఇక సినిమాలో ఇంకెంత ఎక్స్‌పోజింగ్ ఉంటుందోనని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. దారుణంగా విమర్శించేంత ఎక్స్‌పోజింగ్‌ నిహారిక చేయలేదని మద్దతిస్తున్నారు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేస్తున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/naprapanchamm/status/1865716593709244888 https://twitter.com/Manaki_Enduku_/status/1866059745263484992 గతంలో విజయ్ సేతుపతితో.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం కాదు. ఆమె గతంలో తమిళంలో ఓ చిత్రం చేసింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌' చిత్రంలో నిహారిక నటించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్‌ కారణ్‌'తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
    డిసెంబర్ 09 , 2024
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం.. సుహాసిని బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్‌ సక్సెస్‌ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.&nbsp; ప్రీతి అస్రాని బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్‌ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్‌, మిన్నాలే 9 ఆవర్స్‌ వంటి ప్రముఖ&nbsp; షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్‌, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; నవ్య స్వామి నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్‌ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.&nbsp; ఐశ్వర్య పిస్సే 33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్‌ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.&nbsp; శోభా శెట్టి కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్‌’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.&nbsp; ప్రియాంక జైన్‌ నటి ప్రియాంక జైన్‌ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది.&nbsp;\రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్‌ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్‌ అద్భుతంగా నటించింది.&nbsp;
    ఏప్రిల్ 13 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్‌ ఎక్కడ అంటే?&nbsp;
    Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్‌ ఎక్కడ అంటే?&nbsp;
    టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.&nbsp;కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్. ఆశీస్సులు కోరుకుంటూ.. “మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు. https://twitter.com/i/status/1634070240366850049 హనీమూన్‌ ఎక్కడంటే? వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ&nbsp; హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని దుబాయి మొత్తం కలియతిరుగుతున్నారు.&nbsp; శుభాకాంక్షలు నరేశ్, పవిత్ర జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఫ్యాన్స్ ఆశీర్వదిస్తున్నారు. మరికొందరూ ఈసారైన విడాకులు ఇవ్వకుండా జీవితాంతం పవిత్రతో కలిసి ఉండాలని సూచిస్తున్నారు. ఆయనకి 3 ఆమెకి 2 ఇప్పటికే నరేశ్‌కు మూడుసార్లు పెళ్లి అయ్యింది. పవిత్రతో ఆయనకు నాలుగో వివాహం. పవిత్రకి కూడా ఇది రెండో పెళ్లి.&nbsp; పవిత్ర మొదటి భర్త పేరు సుచేంద్ర. ఆయన కన్నడ సీరియళ్లలో నటించాడు. కొద్దిరోజులుగా సహజీవనం భార్యతో విడిపోయిన తర్వాత నుంచి నరేశ్, పవిత్ర మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి కొద్దిరోజులుగా కలిసే ఉంటున్నారు. ముద్దుతో ప్రకటన కొత్త సంవత్సరం రోజున పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ జంట. అదర చుంబనంతో వీడియో విడుదల చేసి అందరికి షాకిచ్చారు. https://twitter.com/i/status/1609067421507407873 మా ఎన్నికలే సాక్ష్యం మా అసోసియేషన్ ఎన్నికల వేళ నరేశ్‌కు మద్దతుగా ప్రచారం చేసింది పవిత్ర. విజయం తర్వాత ఆయన ఐ లవ్‌యూ పవిత్ర అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కలిసి నటించిన సినిమాలు వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. లక్ష్మి రావే మా ఇంటికి, మిడిల్‌ క్లాస్ అబ్బాయ్‌, సమ్మోహనం, హ్యపీ వెడ్డింగ్, ఎంత మంచివాడవురా, అంటే సుందరానికిలో నటనతో మెప్పించారు. రమ్య రఘుపతి నరేశ్, పవిత్రలు ఒకే హోటల్‌లో ఉన్నప్పుడు రమ్య అక్కడ రచ్చరచ్చ చేసింది. వారిద్దరికి పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకుంటానని విమర్శలు చేసింది రమ్య. ఫిర్యాదుల వెల్లువ నరేశ్, రమ్యల వివాదం పోలీస్ స్టేష్‌కు చేరింది. తనని చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు నరేశ్.
    మార్చి 10 , 2023
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.&nbsp; వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.&nbsp; ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది. ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.&nbsp; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్‌ వివాహ ఫొటోలను షేర్‌ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్‌ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్‌ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2023
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    ]సినిమాల విషయంలో తనకు తానే స్ఫూర్తి అని, ఎవరూ తనని ప్రభావితం చేయబోరని చెబుతుంటుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    ]శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరీ’ ఎటువంటి క్రెడిట్స్‌ తీసుకోకుండానే వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. అంతే రానా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. సినిమాయే తన ప్రపంచమని సురేశ్‌ బాబు చెబుతుంటారు.వాయిస్ ఓవర్‌
    ఫిబ్రవరి 13 , 2023
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రణ్‌బీర్ కపూర్‌ - అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (40)&nbsp; - అలియా భట్‌ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్‌ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.&nbsp; ఫహద్‌ - నజ్రియా మలయాళం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ (40) నటి నజ్రియా నజిన్‌ (28)ను 2014లో లవ్‌ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్‌ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.&nbsp; ప్రియాంక చోప్రా - &nbsp;నిక్ జోనాస్‌ బాలీవుడ్ ‌అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు నిక్ జోనాస్‌ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్‌ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి. సైఫ్ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్‌ అలీఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్‌ వైఫ్‌ అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.&nbsp; ఆర్య - సయేషా సైగల్&nbsp; తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్‌ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.&nbsp;&nbsp; ప్రకాష్‌ రాజ్‌ - పోనీ వర్మ ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌(58) కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్‌ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్‌ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.&nbsp; దిల్‌ రాజు - తేజస్విని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.&nbsp;&nbsp; అర్జున్‌ కపూర్‌ - మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.&nbsp;
    మే 16 , 2023
    <strong>Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;</strong>
    Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;
    తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు.&nbsp; ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్‌. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.&nbsp; ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది.&nbsp; 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్‌ జంట తల్లిదండ్రులయ్యారు.&nbsp;ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌.శివన్‌, ఉలగ్‌ దైవాగ్‌ ఎన్‌. శివన్‌ అని పేర్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.&nbsp; నయనతార ప్రస్తుతం టెస్ట్‌’, ‘డియర్ స్టూడెంట్స్‌’, ‘తన్ని ఒరువన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.&nbsp; ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి. తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది. ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి&nbsp; విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ. ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్‌ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఈ ‌అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
    సెప్టెంబర్ 18 , 2024
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.&nbsp; ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.&nbsp; https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్,&nbsp; తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ... ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తమన్నా భాటియా ఎవరు? తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమన్నా దేనికి ఫేమస్? తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. తమన్నా భాటియా వయస్సు ఎంత? డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 34 సంవత్సరాలు&nbsp; తమన్నా భాటియా ముద్దు పేరు? తమ్మి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది? ముంబై తమన్నా భాటియాకు వివాహం అయిందా? ఇంకా కాలేదు తమన్నా భాటియా అభిరుచులు? డ్యాన్సింగ్, కవితలు రాయడం తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం? హైదరాబాద్ బిర్యాని తమన్నా భాటియా అభిమాన నటుడు? మహేష్ బాబు, హృతిక్ రోషన్ తమన్నా భాటియా తొలి సినిమా? చాంద్ సా రోషన్ చెహరా తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ తమన్నా భాటియా ఏం చదివింది? BA చదివింది తమన్నా భాటియా పారితోషికం ఎంత? తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు? సంతోష్ భాటియా, రజని భాటియా తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా? తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/tamannaahspeaks/?hl=en తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? తమన్నా భాటియా లస్ట్‌ స్టోరీస్ 2 వెబ్‌ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది. తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సమంత, విజయ్ వర్మ తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు? తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది? తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది. https://www.youtube.com/watch?v=4pZvW7izZDw
    ఏప్రిల్ 16 , 2024
    నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. కార్తికేయ2, సూర్య Vs సూర్య, శంకరాభరణం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు ఉన్న నిఖిల్ గురించి మీకు తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం. నిఖిల్ సిద్ధార్థ&nbsp; ముద్దు పేరు? "బేగంపేట బోయ్" నిఖిల్ సిద్ధార్థ ఎత్తు ఎంత? 5 అడుగుల 10అంగుళాలు నిఖిల్ తొలి సినిమా? హ్యాపీ డెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో రాజేష్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ నిఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు? జూన్ 1, 1985 నిఖిల్‌కు వివాహం అయిందా? నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ అనే యువతిని 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు. విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు? తన ఫస్ట్ స్టాండర్డ్‌లో అయేష అనే అమ్మాయిని ఇష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిఖిల్‌కు ఇష్టమైన సినిమా? హ్యాపీడేస్ విశ్వక్‌ సేన్ ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ నిఖిల్ సిద్ధార్థ్ తొలి హిట్ సినిమా? హ్యాపీ డేస్ చిత్రం నిఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. కార్తికేయ2, 18 పెజేస్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. నిఖిల్‌కు ఇష్టమైన కలర్? బ్రౌన్ కలర్ నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రుల పేర్లు? తల్లి వీణా సిద్ధార్థ(మాజీ పాఠశాల ప్రిన్సిపాల్), తండ్రి శ్యామ్ సిద్ధార్థ(ప్రొఫెసర్) నిఖిల్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ నిఖిల్ సిద్ధార్థ చదువు? ఇంజినీరింగ్ నిఖిల్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? కార్తికేయ2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకానిక్ గోల్డ్, సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. నిఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు? నిఖిల్ 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.&nbsp; నిఖిల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ నిఖిల్ తొలి పారితోషికం? హ్యాపీడేస్ చిత్రానికి గాను నిఖిల్ రూ.25,000 తీసుకున్నట్లు చెప్పాడు నిఖిల్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? నిఖిల్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.5 నుంచి రూ.10కోట్ల వరకు తీసుకుంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ అభిరుచులు? పుస్తకాలు చదవడం, ఫుట్‌బాల్ ఆడటం నిఖిల్‌కు ఇష్టమైన హీరోయిన్?  భూమిక చావ్లా నిఖిల్‌కు ఇష్టమైన హిందీ సినిమాలు? షోలే, 3 ఇడియట్స్ https://www.youtube.com/watch?v=waTLUNgxueo
    మార్చి 21 , 2024
    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
    Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్‌ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ సినిమా రిలీజ్‌ అంటే థియేటర్స్‌ దగ్గర పూనకాలే. బన్నీకి బయటనే గాక సోషల్‌ మీడియాలోనూ భారీగా క్రేజ్‌ ఉంది. ఇవాళ బన్నీ గారాల పట్టి అల్లు అయాన్‌ పుట్టిన రోజు కావడంతో నెటిజన్లు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘అల్లు అయాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ తమదైన శైలిలో బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. దీంతో ట్విటర్‌లో #AlluAyan పేరు ట్రెండింగ్‌గా మారింది.&nbsp; అయాన్‌ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే మై స్వీటెస్ట్‌ ‘చిన్నిబాబు’ అంటూ అయాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టును బన్నీ ప్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1642732690700111877 https://twitter.com/ShivaBoya1231/status/1642805820370063360 అటు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా అయాన్‌కు బెస్ట్ విషెస్‌ చెబుతున్నారు. ‘చెర్రీ మామ’ అంటూ అయన్‌ ముద్దుగా పిలిచిన వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేగాక రంగస్థలంలో చరణ్‌ ఫోజును అనుసరిస్తూ అయాన్‌ దిగిన ఫొటోను పంచుకుంటున్నారు. నటుడిగా తనకు రామ్‌చరణ్‌ ఇష్టమని ఓ సందర్భంలో అయాన్ చెప్పడం గమనార్హం.&nbsp; https://twitter.com/IMPravallikaM17/status/1642825725471346688 https://twitter.com/BBhanuTweets/status/1642733395859099650 సైరా ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా అయాన్‌పై అల్లుఅర్జున్‌ ప్రేమ చూపించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్‌ తెగ వైరల్ చేస్తున్నారు. అమితంగా ప్రేమించే బన్నీ లాంటి నాన్న దొరికినందుకు అయాన్ అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1642785636104171520 బన్నీ చిన్నప్పుడు అయాన్‌ను ఎత్తుకున్న ఫొటోలను ఫ్యాన్స్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అలాగే అల్లు అర్హాతో అయాన్‌ దిగిన పిక్‌ను వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/iam_naveen66/status/1642706542188453888 డీజే టిల్లు ఆడియో ఫంక్షన్‌ వేదికపై అయాన్‌ నమస్కరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న అయాన్‌ను చూసి బన్నీ మురిసిపోవడం వీడియోలో కనిపిస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1642749681167138817 అల్లు అర్జున్‌తో కలిసి అయాన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో దూకే వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1642713358968451072 మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ఘనీ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అప్పట్లో&nbsp; అల్లు అయాన్ చేసిన వీడియో ఇప్పడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తూ అయాన్ కనిపిస్తాడు.&nbsp; https://twitter.com/i/status/1642727327212929024 అల్లు అరవింద్‌ శతజయంతి వేడుకల్లో అయాన్‌ తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు https://youtu.be/YKOZYqSLRbM &nbsp; మెుత్తంగా అల్లుఅర్జున్‌కు సరైన వారసుడు అయాన్‌ అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జూనియర్‌ అల్లుఅర్జున్‌ అంటూ ఇప్పటినుంచే ఆకాశానికి ఎత్తుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 03 , 2023
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RAM CHARAN BIRTHDAY: గ్లోబల్‌ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
    RRRతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్‌ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్‌ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం కుమారుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్‌ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు&nbsp; మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ&nbsp; పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20 మంచు ఫ్యామిలీలో ట్రోల్స్‌కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్‌. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్‌ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ మిత్రమా రియల్లీ సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే అంటూ రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/HeroManoj1/status/1640258933918171136?s=20 బాలివుడ్‌ అందగాడు వివేక్‌ ఒబెరాయ్‌ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్‌, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్‌ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు. https://twitter.com/vivekoberoi/status/1640253518471913472?s=20 విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్‌ చరణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. https://twitter.com/Ganta_Srinivasa/status/1640229869257887744?s=20 మెగా ఫ్యామిలీలో హాలివుడ్‌ కటౌట్‌ ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌. చిన్నప్పటి నుంచి చరణ్‌తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. https://twitter.com/IAmVarunTej/status/1640261128071835648?s=20 RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది.&nbsp; ‘బ్రదర్‌ ఫ్రం అనదర్‌ మదర్‌’ అంటూ కార్తికేయ RRR సెట్‌లోని ఫోటో షేర్ చేశారు. https://twitter.com/ssk1122/status/1640258402285924354?s=20 రామ్‌ చరణ్‌తో రచ్చ సినిమా చేసిన సంపత్‌ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. https://twitter.com/IamSampathNandi/status/1640230847315087361?s=20 యంగ్‌ సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా రామ్‌ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్‌’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1640193538393804801?s=20 కియారా అద్వానీ, శంకర్‌ సహా ‘గేమ్ చేంజర్‌’ టీం రామ్‌ చరణ్‌కు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. https://twitter.com/NP_App/status/1640266153653317632?s=20
    మార్చి 28 , 2023
    <strong>Pushpa 2: సుకుమార్‌కు షాకిచ్చిన థమన్‌.. ‌ఆందోళనలో ‘పుష్ప 2’ ఫ్యాన్స్‌!</strong>
    Pushpa 2: సుకుమార్‌కు షాకిచ్చిన థమన్‌.. ‌ఆందోళనలో ‘పుష్ప 2’ ఫ్యాన్స్‌!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ ప్రాజెక్ట్‌ 'పుష్ప 2' (Pushpa 2). యావత్‌ దేశంలోని సినీ లవర్స్‌ ఈ మూవీ రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇంకా పూర్తికాకపోవడంతో ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్లు 'పుష్ప 2' కోసం శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే 'పుష్ప 2' మ్యూజిక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; నేపథ్య సంగీతంపై క్రేజీ బజ్‌.. 'పుష్ప 2' (Pushpa 2) చిత్రానికి నలుగురు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన థమన్‌ 'పుష్ప 2' కోసం తనతో పాటు పలువురు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ బజ్‌ ప్రకారం యాక్షన్‌ సీక్వెన్స్‌కు ఎస్‌.ఎస్‌. థమన్ (S.S. Thaman) నేపథ్య సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీ ఇంపార్టెంట్‌ ఫైట్‌ సీక్వెన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌కు బీజీఎం అందిస్తున్నారట. ఇక ‘కాంతారా’ ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ సెకండాఫ్‌లో ఎంతో కీలకమైన జాతర ఎపిసోడ్‌కు BGM ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో సంగీత దర్శకుడు శ్యామ్‌ సి.ఎస్‌ మరికొన్ని సన్నివేశాలకు నేపథ్య సంగీతం ఇస్తున్నట్లు టాక్‌. ఇలా సినిమాను పార్ట్స్‌గా డివైడ్‌ చేసి నలుగురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పనిచేయడం తెలుగు సినిమా హిస్టరీలో ఇదే తొలిసారని చెప్పవచ్చు. థమన్‌ వర్క్‌పై సుకుమార్‌ అసంతృప్తి! ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ తనకు ఇచ్చిన భాగానికి నేపథ్య సంగీతం ఫినిష్‌ చేసి సుకుమార్‌కు చూపించినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అటు శ్యామ్‌ సి.ఎస్‌, అజనీష్‌ లోకనాథ్‌ కూడా తమకు ఇచ్చిన పనిని పూర్తి చేసి సుకుమార్‌కు పంపారట. అయితే థమన్ ఇచ్చిన బీజీఎం స్కోర్‌ సుకుమార్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయిందని టాక్‌. కానీ, శ్యామ్‌ సి.ఎస్‌, అజనీష్‌ ఇచ్చిన ఔట్‌పుట్‌ చూసి సుకుమార్‌ ఫిదా అయిపోయారట. తాను అనుకున్న దానికంటే వారు బాగా ఇచ్చారని సుకుమార్ చాలా హ్యాపీ అయినట్లు మూవీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు థమన్‌ను మరోమారు వర్క్‌ చేసుకొని రావాలని సుక్కు సూచించినట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి అది కూడా మెుత్తం కాదని, కొంత పోర్షన్‌ వరకూ మాత్రమే బెటర్‌గా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రెండ్రోజుల్లో థమన్ అది కూడా పూర్తి చేస్తారని అంటున్నారు. ఇంకా పెండింగ్‌లో మరో సాంగ్! ‘పుష్ప 2’ (Pushpa 2)లో ఎంతో కీలకమైన ఐటెం సాంగ్‌ను ఇటీవల చిత్రీకరించారు. తెలుగు స్టార్ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) ‘కిస్సిక్‌’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌లో చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం. లేటెస్ట్ బజ్‌ ప్రకారం నాల్గో సాంగ్‌ను షూట్‌ చేసేందుకు సుకుమార్‌ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 22 నుంచి ఫోర్త్‌ సాంగ్‌ షూటింగ్ మెుదలవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. డిసెంబర్‌ 5న రిలీజ్‌ పెట్టుకుని ఇంకా షూటింగ్‌ జరగడం చూసి అల్లు అర్జున్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా చెప్పిన తేదీకే వస్తుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి సుకుమార్‌ ఫాస్ట్‌గా మ్యూజిక్‌ వర్క్‌, పెండింగ్‌ షూట్‌ను ఫినిష్‌ చేయాలని కోరుకుంటున్నారు.&nbsp;
    నవంబర్ 20 , 2024
    <strong>Allu Arjun – Allu Sneha Reddy: భార్యకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్</strong>
    Allu Arjun – Allu Sneha Reddy: భార్యకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
    పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ సక్సెస్‌తో ఆయన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ బన్నీ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ చిన్న ఈవెంట్‌ అయినా గుర్తుండిపోయేలా సెలబ్రేట్‌ చేస్తారు. ఈ క్రమంలోనే బన్నీ సతీమణి స్నేహా రెడ్డి 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు అల్లు అర్జున్‌. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సర్‌ప్రైజ్‌ ఏంటంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన 40 పుట్టినరోజును ఆదివారం (సెప్టెంబర్‌ 29) ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1840610091973611849 ఫోటోలు షేర్‌ చేసిన స్నేహా గోవాలో తన బర్త్‌డేకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అల్లు స్నేహారెడ్డి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్‌ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. గార్డెన్‌లో భర్త అల్లు అర్జున్‌,&nbsp; పిల్లలు అల్లు అయాన్‌, ఆద్య సమక్షంలో స్నేహా కేక్ కట్ చేశారు. తన బర్త్‌డేకు వచ్చిన ఫ్రెండ్స్‌తోనూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ బర్త్‌డే సందర్భంగా ఇచ్చిన సర్‌ప్రైజ్‌, గిప్ట్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ స్నేహాకు కామెంట్ బాక్స్‌లో విష్‌ చేయడం గమనార్హం.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) స్నేహాకు షాకిచ్చిన మెగా ఫ్యామిలీ! అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్లు గత కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు స్నేహారెడ్డి బర్త్‌డే సందర్భంగా ఈ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి స్నేహా రెడ్డికి ఎలాంటి బహిరంగ విషెస్‌ రాకపోవడం చర్చకు తావిస్తోంది. ఈ ఏడాది జులై 20న మెగా కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో విషెస్‌ చెప్పింది. మహేష్‌ భార్య నమ్రత, తారక్‌ వైఫ్‌ లక్ష్మీ ప్రణతి, వరుణ్‌ తేజ్‌ భార్య లావణ్య త్రిపాఠితో పాటు పలువురు సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మెగా ఫ్యాన్స్‌ సైతం ఉపాసనకు విషెస్‌ చెప్తూ పోస్టులు పెట్టారు. అయితే స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి హడావుడి కనిపించలేదు. అటు ఫ్యాన్స్‌ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు మరోమారు భగ్గుమన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ఫైనల్‌ స్టేజ్‌కి ‘పుష్ప 2’ షూటింగ్‌! ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ను తెరకెక్కిస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, బన్నీపై సీన్స్‌ షూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ‘పుష్ప 2’ టీమ్‌ను సైతం కలిశారు. ఇక ‘పుష్ప 2’ చిత్రాన్ని డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో బన్నీ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది.&nbsp;
    అక్టోబర్ 01 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. ముఖ్యంగా కమెడియన్‌ సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు సాలిడ్‌ వసూళ్లు సాధించి ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వసూళ్ల జాతర 'మత్తు వదలరా 2' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజుల్లో (శుక్ర, శని) రూ.11 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా సాలిడ్‌ వసూళ్లనే రాబట్టింది. ఫస్ట్‌ త్రీ డేస్‌లో ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ.16.2 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 'పదహారేళ్ల వయసు.. పదహారు కోట్ల గ్రాసూ’ అంటూ ఈ పోస్టర్‌కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అటు ఓవర్సీస్‌లో 600K డాలర్లకు పైగా రాబట్టినట్లు మేకర్స్‌ మరో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. రానున్న రోజుల్లో ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్‌ మరింత పెరగడం ఖాయమని, ఈ వీకెండ్‌ నాటికిి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1835560518255255726 https://twitter.com/MythriOfficial/status/1835533814803894507 తొలి రోజు ఎంతంటే కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేశాయి.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1834823161281757529 వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-day-1-collections-mathu-vadalara-2-has-a-great-opening-what-are-the-collections.html
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాలిడ్‌ ఓపెనింగ్స్‌ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా కమెడీ సత్య కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. తొలి రోజున ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వీకెండ్‌లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్‌ కాకపోవడంతో 'మత్తు వదలరా 2' ఈజీగానే రూ.15 కోట్ల గ్రాస్ అందుకుంటుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.&nbsp; వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-movie-review-comedian-satyas-one-man-show-how-is-mathu-vadalara-2.html
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024

    @2021 KTree