• TFIDB EN
  • హరోం హర
    U/ATelugu
    కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?

    సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశ...read more

    How was the movie?

    తారాగణం
    సుధీర్ బాబు
    సుబ్రహ్మణ్యం
    మాళవిక శర్మ
    దేవి
    జయప్రకాష్
    శివా రెడ్డి
    సునీల్
    పళని సామి
    కేశవ్ దీపక్
    రవి కాలే
    బసవ రెడ్డి
    రాజశేఖర్ అనింగివెంకటేశులు
    లక్కీ లక్ష్మణ్తమ్మి రెడ్డి
    అర్జున్ గౌడశరత్ రెడ్డి
    సిబ్బంది
    జ్ఞానసాగర్ ద్వారకదర్శకుడు
    సుమంత్ జి నాయుడునిర్మాత
    చైతన్ భరద్వాజ్
    సంగీతకారుడు
    అరవింద్ విశ్వనాథన్సినిమాటోగ్రాఫర్
    రవితేజ గిరిజాలఎడిటర్ర్
    కథనాలు
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్‌, సునీల్‌, అర్జున్‌ గౌడ, రవి కాలే తదితరులు దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక సంగీతం : చైతన్ భరద్వాజ్‌ ఎడిటర్‌ : రవితేజ గిరిజాల నిర్మాత : సుమంత్‌ జి. నాయుడు విడుదల తేదీ: 14- 05-2024 సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్‌ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్‌ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి 1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్‌ నటనతో మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్‌ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్‌ పాత్రతో సునీల్‌ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌.. ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు.  సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సుధీర్‌బాబు నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 14 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి  యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.  మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
    సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్‌ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్‌ దశలోనే ఉన్న టాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్‌ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్‌ అయిన టాలీవుడ్‌ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ క్రిష్‌ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్‌ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్‌.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్‌ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్‌ స్వయంగా పోస్టర్‌ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్‌ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్‌ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టీజర్‌ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఫ్యామిలీ స్టార్‌ (Family Star) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది.  తమ్ముడు (Thammudu) స్టార్‌ హీరో నితిన్‌ (Nithiin) అప్‌కమింగ్‌ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.  ఘాతీ (GHAATI) స్టార్‌ హీరోయిన్‌ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్‌ మూవీ 'ఘాతీ' కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. కాంతారా 2 (Kantara 2) రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్‌ దక్కించుకోవడం విశేషం.  కంగువా (Kanguva) 2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.
    ఏప్రిల్ 03 , 2024
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    Hari Hara Veera Mallu: పవన్‌ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌.. టీజర్‌ కోసం సిద్ధంకండి!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్‌ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్‌ వస్తూనే ఉంది. దీంతో పవన్‌ - క్రిష్‌ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  శ్రీరామ నవమి (ఏప్రిల్‌ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్‌ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో! పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్‌ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్‌ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.   ఆందోళనలకు చెక్‌! పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్‌ క్రిష్‌.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్‌ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
    ఏప్రిల్ 17 , 2024
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి సంగీతం : రీ సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌ సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 19 , 2024
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్‌ సంగీతం : సాయి చరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా ఎడిటర్‌ : కార్తిక్ ఉన్నవ నిర్మాతలు : రవితేజ, సుధీర్‌ కుమార్ కుర్రు విడుదల తేదీ : 23-02-2024 హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్‌ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్‌ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్‌ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్‌ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్‌ సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.  టెక్నికల్‌గా ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్‌ చేసిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్‌ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ హర్ష నటనకామెడీ సంగీతం మైనస్‌ పాయింట్స్ పసలేని క్లైమాక్స్‌ లాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    HER movie review: ‘హిట్‌’ మూవీని తలపిస్తున్న ‘ హర్‌ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?
    HER movie review: ‘హిట్‌’ మూవీని తలపిస్తున్న ‘ హర్‌ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?
    న‌టీన‌టులు: రుహానీ శ‌ర్మ‌, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్ స్వ‌రాఘ‌వ్‌ సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి సంగీతం: పవన్ నిర్మాతలు:  ర‌ఘు సంకురాత్రి, దీప సంకురాత్రి ఈ శుక్రవారం (జులై 21) బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువైంది. చిన్న చిత్రాలు క‌ట్ట క‌ట్టుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేశాయి. అందులో ఒక‌టే ‘హర్‌’. రుహానీశ‌ర్మ కీల‌క పాత్ర పోషించిన చిత్ర‌మిది. ‘చి.ల‌.సౌ’ మొద‌లుకొని ప‌లు సినిమాల్లో త‌న న‌ట‌న‌తో మెప్పించిన రుహానీ ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మ‌రి ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి హైద‌రాబాద్ శివార్ల‌లో జంట హ‌త్య‌లు జరుగుతాయి. ఆ హ‌త్య‌ల వెన‌క కార‌ణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చ‌నా ప్ర‌సాద్ (రుహానీ శ‌ర్మ‌) రంగంలోకి దిగుతుంది. ప‌లు కోణాల్లో ప‌రిశోధిస్తున్న క్ర‌మంలో కేసు ఊహించ‌ని మ‌లుపులు తీసుకుంటుంది. ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు? హంతకుల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో అర్చ‌న‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? మ‌రోవైపు ఆమె NIA (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ)లోకి వెళ్లాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది? త‌దిత‌ర అంశాలపై స్పష్టత కావాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. ఎవ‌రెలా చేశారంటే క‌థానాయిక రుహానీశ‌ర్మ తన నటనతో ఎప్పటిలాగే ఆక‌ట్టుకుంటుంది. పోలీస్ అధికారిణి పాత్ర‌లో ఆమె ఒదిగిపోయిన తీరు సినిమాకి బ‌లాన్నిచ్చింది. క‌థ మెుత్తాన్ని త‌న భుజాల‌పై మోస్తూ ఆమె  ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌థ‌మార్ధంలో పాట‌లో వికాస్ వ‌శిష్ట‌తో క‌లిసి ఆమె అందంగా క‌నిపించి మెప్పించింది. జీవ‌న్‌కుమార్ త‌న‌దైన న‌ట‌న‌తోనూ, త‌న మార్క్ సంభాష‌ణ‌ల‌తోనూ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. ప్ర‌దీప్ రుద్ర మ‌రో పోలీస్ అధికారిగా క‌నిపించారు. అభిగ్న్య‌, సంజ‌య్ స్వ‌రూప్‌, బెన‌ర్జీ, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  ఎలా సాగిందంటే ‘హిట్‌’ సినిమా ప్రేరణతో ఈ మూవీని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. జంట హ‌త్య‌లతో మొద‌ల‌య్యే ఈ చిత్రంలో మ‌రో కేస్ కూడా కీల‌కమే. ఆరంభ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ‌తాయి. ఆ త‌ర్వాతే సినిమా గాడి త‌ప్పుతుంది. కేసు ప‌రిశోధ‌న‌లోనే బ‌లం లేదు. బాధితుల కుటుంబ స‌భ్యుల్ని, అనుమానితుల్ని క‌లిసి వివ‌రాలు సేక‌రించే క్ర‌మం సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు ఇంత హంగామానా? అనిపిస్తుంది. సినిమాలోని మలుపుల విషయానికొస్తే గతంలో ఎక్కడో చూసిన భావన కల్గుతుంది. దీంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ప్ర‌భావం చూపించ‌దు. ఓ పోలీస్ అధికారి ప‌రిశోధిస్తున్న రెండు కేసుల్ని ఒక‌దానితో మ‌రొక‌టి ముడిపెట్టిన విధాన‌మే మాత్రం మెప్పిస్తుంది.   డైరెక్షన్‌ & టెక్నికల్‌గా ద‌ర్శ‌కుడు స్వ‌రాఘ‌వ్ మేకింగ్ మెప్పించినా, ఆయ‌న రాసుకున్న కేసులోనే బ‌లం లేదు. కొన్ని మ‌లుపులున్నా అవి పెద్ద‌గా థ్రిల్‌ని పంచ‌లేవు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించాయి. నిడివి త‌క్కువ ఉండ‌టం ఈ సినిమాకి క‌లిసొచ్చింది. నిర్మాణ విలువలు స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ రుహానీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ కథకథనంకొత్తదనం లేకపోవడం రేటింగ్‌: 2.25/5 https://www.youtube.com/watch?v=5QTyvR0wIiY
    జూలై 21 , 2023
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం :  వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌ శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  
    మార్చి 22 , 2024
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రాజీవ్‌ కనకాల, రవి కృష్ణ దర్శకత్వం : అరుణ్  భీమవరపు సంగీతం : ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్‌ ఆర్ట్ డైరెక్టర్‌ : కొల్లా అవినాష్‌ నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది విడుదల తేదీ : 25 మే, 2024 ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్‌.. ఈ సినిమాలో డెవిల్స్‌ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్‌ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్‌ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్‌ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అరుణ్‌.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్‌ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్‌ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్‌ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్‌ చేసే రీసెర్చ్‌.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్‌ రివీల్‌ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్‌ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్‌ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్‌ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు. టెక్నికల్‌గా   సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఆస్కార్ విన్నర్‌ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ఆశిష్‌, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ సీన్స్‌ఏమోషన్స్‌ లేకపోవడం Telugu.youSay.tv Rating : 2.5/5   https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
    మే 25 , 2024
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
    రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది. రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్‌ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట. యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.  అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది. అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.  ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
    జూలై 04 , 2023
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. నాయికగా కెరీర్‌లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలంటే ఒకట్రెండు పెద్ద సినిమాల్లో నటించాల్సిందే. అప్పుడే రీచ్ పెరిగి హీరోయిన్లకు ఆదరణ మొదలవుతుంది. బడా ప్రాజెక్టులో నటిస్తున్నారంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ చూపు కూడా హీరోయిన్‌పై పడుతుంది. అలా అవకాశాలు మెరుగవుతాయి. అచ్చం ఇలాగే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఫీలయ్యింది. కానీ, బర్త్ డే(Nidhi Agarwal BirthDay) రోజున ఈ అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. కారణం ఏంటో చూద్దాం.  అదృష్టమేనా.. టాప్ హీరోతో బడా సినిమాలో ఛాన్స్ రావడం ఒక రకంగా అదృష్టమే. చాలా మంది ఎగిరి గంతేస్తారు. నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలాంటి ఫీలింగ్‌‌నే ఎక్స్‌ప్రెస్ చేసింది. ప్రస్తుతం నిధి చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ బ్యూటీ. చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా గొప్ప విషయమని ఇటీవల నిధి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. కల నిజమైందంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే కల కలగానే మిగిలి పోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం.. ‘హరిహర వీరమల్లు’ భవితవ్యమే.  https://twitter.com/AgerwalNidhhi/status/1680791420440023040?s=20 రెండేళ్లకు పైగా.. సాధారణంగా పెద్ద సినిమా చిత్రీకరణకు కాస్త సమయం పడుతుంది. ప్రారంభం నుంచి రిలీజ్ వరకు కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. కానీ, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వచ్చిన పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ 2021లో వచ్చింది. భారీ తారాగణంతో బిగ్ బడ్జెట్ చిత్రంగా దీనిని తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో మళ్లయోధుడి పాత్ర పోషిస్తున్నారు. నిధితో పాటు సోనాల్ చౌహాన్, బాబీ డియోల్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న ఆందోళన.. ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ పది కాలాల పాటు సాగాలంటే కచ్చితంగా చిత్రాలు విజయం సాధించాలి. అప్పుడే అవకాశాల ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. గ్లామర్ డోజ్ ఏ మాత్రం తగ్గకూడదు. వీటన్నిటితో పాటు సమయ పాలన తప్పనిసరి. ఎక్కడ చిన్న లోపం జరిగినా సినిమా అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే రిలీజైన సినిమాలు హిట్ కావాలి. నిధి అగర్వాల్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతా ప్రాజెక్టులు పెద్దగా ఆదరణను పొందలేక పోయాయి. కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ అవకాశంతో ఇక సెట్ అయిపోయినట్లేనని భావించింది. కానీ, చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్న కొద్దీ నిధిలో ఆందోళన పెరిగిపోతోందని టాక్. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు నిధిని భయపెట్టిస్తున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్. దీంతో ఈ సినిమానైనా త్వరగా వస్తుందేమో అన్న ఆశ అమ్మడిలో నెలకొంది.  వెయిట్ చేయాల్సిందే హరిహర వీరమల్లు, ప్రభాస్-మారుతిల సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు లేవు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలంటే నిధి మరో ఏడాది కాలం ఆగాల్సిందే. ఆ లోపు తనని మరచిపోకుండా ఉండటానికి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. నిధి మల్టీ టాలెంటెడ్. ఈ అమ్మడు డ్యాన్సర్ కూడా. జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేస్తుంది.  
    ఆగస్టు 17 , 2023
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ  ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.  లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌  దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ  ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
    టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఓజీ - సలార్‌ మధ్య పోలిక! ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.  హై రేంజ్‌లో ఎలివేషన్స్‌! ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.  సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.  చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌! ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.  
    మార్చి 07 , 2024
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు దర్శకత్వం : వియస్ ముఖేష్ సంగీతం: జో ఎన్మవ్   నేపథ్య సంగీతం: సృజన శశాంక సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి నిర్మాత: అఖిలేష్ కలారు విడుదల తేది: ఏప్రిల్‌ 19, 2024 ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం నటింటిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్‌ ముఖేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్‌ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్‌ శంకర్‌ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్‌ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్‌ ఏం చేశాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అటు మార్కెట్‌ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్‌ పాత్రలో ముక్కు అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్‌ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్‌ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్‌ శంకర్‌, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్‌ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.  టెక్నికల్‌గా ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ హీరో, హీరోయిన్‌ నటనసందేశండైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5
    ఏప్రిల్ 19 , 2024
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు దర్శకత్వం: రవికాంత్ పేరేపు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 29-12-2023 రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల కుమారుడు రోష‌న్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ర‌వికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఎవరెలా చేశారంటే హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. హర్షవర్ధన్‌, అనుహాసన్‌ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్‌ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్‌ ప్రజెంట్‌ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.   టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్‌ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రోషన్‌, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్‌, క్లైమాక్స్‌ మైసన్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సీన్స్ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 29 , 2023
    తెలుగు హీరోల్లో అత్యధిక  రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం. ప్రభాస్‌: హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  మహేశ్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.  పవన్‌ కళ్యాణ్‌: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు. పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.  రామ్‌ చరణ్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.  జూ. ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.  RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో  రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.  https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html అల్లు అర్జున్‌: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  చిరంజీవి అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్. బాలకృష్ణ: నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.  విజయ్‌ దేవరకొండ: అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 
    ఏప్రిల్ 01 , 2023
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ ఎడిటింగ్: జి.సత్య నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ : మే 31, 2024 యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్‌ టైసన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో బొమ్మాళి రవిశంకర్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్‌.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్‌ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్‌ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్‌ కాకుండా క్లైమాక్స్‌ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్‌ కాలేదు. కొన్ని లాజికల్‌ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కపిల్‌ కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్‌ సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఆర్‌.డి రాజశేఖర్‌ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ కార్తికేయ నటనఇంటర్వెల్‌ ట్విస్ట్‌సెకండాఫ్‌ మైనస్‌ పాయింట్ హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌రొటిన్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 05 , 2024
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌ నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌ విడుదల తేదీ: 03-05-2024 సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.  కథేంటి రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్‌) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్‌) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్‌ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్‌ ఓకే అనిపించింది. వారి మ‌ధ్య వచ్చే  స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే డిజార్డర్‌ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్‌ వైకే ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు క‌థ‌ని న‌డిపించిన విధాన‌ం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్‌ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్ సుహాస్‌ నటనమలుపులుసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్ ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5 
    మే 03 , 2024

    @2021 KTree