UATelugu1h 43m
హైదరాబాద్ శివార్లలో జంట హత్యలు జరుగుతాయి. ఆ హత్యల వెనక కారణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చనా ప్రసాద్ (రుహానీ శర్మ) రంగంలోకి దిగుతుంది. పలు కోణాల్లో పరిశోధిస్తున్న క్రమంలో కేసు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇంతకీ ఆ హత్యల్ని ఎవరు చేశారు? హంతకుల్ని పట్టుకునే క్రమంలో అర్చనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
వికాస్ వశిష్ట
శేషాద్రి ప్రసన్రుహాని శర్మ
అర్చన ప్రసాద్జీవన్ కుమార్నరరాజ్
ప్రదీప్ రుద్రకపిల్
సంజయ్ స్వరూప్డిసిపి
రవి వర్మ
అనిల్రవి ప్రకాష్
NIA విక్రాంత్పద్మజ లంకరాధిక
అభిజ్ఞ వూతలూరుస్వాతి
సిబ్బంది
శ్రీధర్ స్వరాఘవ్దర్శకుడు
రఘు సంకురాత్రినిర్మాత
దీప సంకురాత్రినిర్మాత
శ్రీధర్ స్వరాఘవ్రచయిత
పవన్సంగీతకారుడు
విష్ణు బేసిసినిమాటోగ్రాఫర్
చాణక్య టూరుపుఎడిటర్ర్
కథనాలు
HER movie review: ‘హిట్’ మూవీని తలపిస్తున్న ‘ హర్ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?
నటీనటులు: రుహానీ శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ
దర్శకత్వం: శ‌్రీధర్ స్వరాఘవ్
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
సంగీతం: పవన్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి
ఈ శుక్రవారం (జులై 21) బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువైంది. చిన్న చిత్రాలు కట్ట కట్టుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. అందులో ఒకటే ‘హర్’. రుహానీశర్మ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. ‘చి.ల.సౌ’ మొదలుకొని పలు సినిమాల్లో తన నటనతో మెప్పించిన రుహానీ ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగా సినిమా ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాద్ శివార్లలో జంట హత్యలు జరుగుతాయి. ఆ హత్యల వెనక కారణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చనా ప్రసాద్ (రుహానీ శర్మ) రంగంలోకి దిగుతుంది. పలు కోణాల్లో పరిశోధిస్తున్న క్రమంలో కేసు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇంతకీ ఆ హత్యల్ని ఎవరు చేశారు? హంతకుల్ని పట్టుకునే క్రమంలో అర్చనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మరోవైపు ఆమె NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? తదితర అంశాలపై స్పష్టత కావాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కథానాయిక రుహానీశర్మ తన నటనతో ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది. పోలీస్ అధికారిణి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినిమాకి బలాన్నిచ్చింది. కథ మెుత్తాన్ని తన భుజాలపై మోస్తూ ఆమె పరిణతి ప్రదర్శించింది. ప్రథమార్ధంలో పాటలో వికాస్ వశిష్టతో కలిసి ఆమె అందంగా కనిపించి మెప్పించింది. జీవన్‌కుమార్ తనదైన నటనతోనూ, తన మార్క్ సంభాషణలతోనూ అక్కడక్కడా నవ్వించారు. ప్రదీప్ రుద్ర మరో పోలీస్ అధికారిగా కనిపించారు. అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఎలా సాగిందంటే
‘హిట్’ సినిమా ప్రేరణతో ఈ మూవీని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. జంట హత్యలతో మొదలయ్యే ఈ చిత్రంలో మరో కేస్ కూడా కీలకమే. ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళతాయి. ఆ తర్వాతే సినిమా గాడి తప్పుతుంది. కేసు పరిశోధనలోనే బలం లేదు. బాధితుల కుటుంబ సభ్యుల్ని, అనుమానితుల్ని కలిసి వివరాలు సేకరించే క్రమం సాగదీతగా అనిపిస్తుంది. ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు ఇంత హంగామానా? అనిపిస్తుంది. సినిమాలోని మలుపుల విషయానికొస్తే గతంలో ఎక్కడో చూసిన భావన కల్గుతుంది. దీంతో ఏ దశలోనూ సినిమా ప్రభావం చూపించదు. ఓ పోలీస్ అధికారి పరిశోధిస్తున్న రెండు కేసుల్ని ఒకదానితో మరొకటి ముడిపెట్టిన విధానమే మాత్రం మెప్పిస్తుంది.
డైరెక్షన్ & టెక్నికల్‌గా
దర్శకుడు స్వరాఘవ్ మేకింగ్ మెప్పించినా, ఆయన రాసుకున్న కేసులోనే బలం లేదు. కొన్ని మలుపులున్నా అవి పెద్దగా థ్రిల్‌ని పంచలేవు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చక్కటి పనితీరుని ప్రదర్శించాయి. నిడివి తక్కువ ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చింది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగానే ఉంది.
ప్లస్ పాయింట్స్
రుహానీ నటనసంగీతం
మైనస్ పాయింట్స్
కథకథనంకొత్తదనం లేకపోవడం
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=5QTyvR0wIiY
జూలై 21 , 2023
Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
హాట్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్ షోతో మరోమారు సోషల్ మీడియాను హీటెక్కించింది. రెడ్ కలర్ జాకెట్‌లో ఎద అందాలను ఆరబోసింది.
ఎర్రటి జాకెట్‌తో తెల్లటి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలకు స్మైలింగ్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టి కుర్రకారుకు కొంటె వల విసిరింది.
రుహానీ శర్మ అందాలతో పాటు ఫిట్‌నెస్ కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె ఫిజిక్ అద్భుతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.
‘చిలసౌ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
ఈ ఏడాది సంక్రాంతికి రీలైజన 'సైంధవ్' చిత్రంలో డా.రేణు పాత్రలో కనిపించి రుహానీ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే సినిమాలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూహానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం రుహానీ.. హిందీలో ‘బ్లాకౌట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
బ్లాక్ బాస్టర్ హిట్స్ రానప్పటికీ రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
జూన్ 01 , 2024
Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
గ్లామర్ డాల్ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను అట్టుడికించింది. తన ఎద అందాలను బయటపెడుతూ చెమటలు పట్టించింది.
జాకెట్ లేకుండా చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సమ్మర్‌లో తన అందంతో మరింత హీట్ పెంచేసింది.
తాజా ఫొటోల్లో క్రేజీ ఔట్ ఫిట్‌తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేసింది.
రుహానీ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చి ల సౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.
చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
రీసెంట్‌గా 'సైంధవ్' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది
ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
రుహాని శర్మ సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ.. టాలీవుడ్‌లో ఈ హాట్ డాల్‌కు అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి.
మే 16 , 2024
Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ హీరోయిన్ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా వెంకటేష్ ‘సైంధవ్’, వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రుహానీ శర్మ ఎవరు?
రుహానీ.. ప్రముఖ హీరోయిన్. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది.
రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది?
సోలన్, హిమాచల్ ప్రదేశ్
రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది?
18 సెప్టెంబర్, 1994
రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు?
సుభాష్ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది.
రుహానీ శర్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ)
రుహానీ శర్మ వయసు ఎంత?
30 సంవత్సరాలు (2024)
రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు
రుహానీ శర్మ ఏం చదువుకుంది?
బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేసింది.
రుహానీ శర్మ.. కెరీర్ ఎలా మెుదలైంది?
సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'కుడి టూ పటాకా' పంజాబి సాంగ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయ్యింది.
రుహానీ శర్మ.. మెుదటి చిత్రం?
2017లో తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది?
2018లో వచ్చిన 'చి ల సౌ' (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యింది.
రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్: ఛాప్టర్ 1’, ‘సైంధవ్’, ‘ఆపరేషన్ వాలెంటైన్’
రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం?
శ్రీరంగ నీతులు
రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు?
కడైసి బెంచ్ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం)
రుహానీ శర్మ ఫేవరేట్ హీరో ఎవరు?
టాలీవుడ్‌లో వెంకటేష్, బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది.
రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్ ఏవి?
బ్లాక్ (Black), గ్రే (Grey)
రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం?
ఫ్లోరిడా
రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది?
క్రికెట్
రుహానీ శర్మ ఇన్‌స్టాగ్రామ్ లింక్?
https://www.instagram.com/ruhanisharma94/?hl=en
https://www.youtube.com/watch?v=pTdgQNy8BxI
ఏప్రిల్ 12 , 2024
Ruhani Sharma: స్ట్రాప్‌లెస్ బ్రాలో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ..!
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. తన ఎద పొంగులతో కుర్రకారు హృదయాలను మెలికలు తెప్పేసింది.
తాజా సెల్ఫీ ఫొటోల్లో క్రేజీ ఔట్ ఫిట్‌తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో యూత్‌ను మైండ్ బ్లాక్ చేసింది.
రుహానీ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.
చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది 'హర్ ; చాప్టర్ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
రీసెంట్‌గా 'సైంధవ్' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.
అలాగే టాలీవుడ్‌లో ‘శ్రీరంగ నీతులు’ అనే మరో చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ రుహానీ బిజీ బిజీగా గడుపుతోంది.
ఫిబ్రవరి 27 , 2024
OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
హిడింబ
అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై 20) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.
అన్నపూర్ణ ఫొటో స్టూడియో
చైతన్య రావ్, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది.
హత్య
‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్ తెరకెక్కించారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.
ఒప్పెన్ హైమర్
ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్ హైమర్’. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్ ఒప్పెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్ షాట్స్ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది.
హర్
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్.ఇ.ఆర్.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది.
అలా ఇలా ఎలా
ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది.
ఇతర సినిమాలు
పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateThe deepest breathMovieEnglishNetflixJuly 19Sweet magnoliasWeb SeriesEnglishNetflixJuly 20The cloned tyroneMovieEnglishNetflixJuly 21BawaalMovieHindiAmazon PrimeJuly 21EstateMovieTamilZee5July 18Spider-Man: Across the Spider-VerseMovieEnglishZee5July 18Trial periodMovieHindiJioCinemaJuly 21
జూలై 21 , 2023
Sundaram Master Review: ‘సుందరం మాస్టర్’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు
రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
సంగీతం : సాయి చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా
ఎడిటర్ : కార్తిక్ ఉన్నవ
నిర్మాతలు : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
విడుదల తేదీ : 23-02-2024
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.
టెక్నికల్‌గా
ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
హర్ష నటనకామెడీ సంగీతం
మైనస్ పాయింట్స్
పసలేని క్లైమాక్స్ లాజిక్‌కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 23 , 2024
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
Kajal Karthika OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కాజల్ అగర్వాల్ హర్రర్ చిత్రం.. ఎందులో అంటే?
కాజల్ (Kajal Aggarwal), రెజీనా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’ (Karungaapiyam). ‘కాజల్ కార్తీక’ (Kajal Karthika) పేరుతో ఈ సినిమా గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
నలుగురు హీరోయిన్లు
‘కాజల్ కార్తీక’ సినిమాలో మెుత్తం నలుగురు హీరోయిన్లు నటించారు. కాజల్, రెజీనాతో పాటు రైజా విల్సన్, జనని కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు హీరోయిన్లు ఒకే తెరపై కనిపించనుండటం, అది కూడా హార్రర్ సినిమా కావడంతో తమిళంలో ‘కరుంగాపియం’పై అప్పట్లో మంచి హైప్ ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్‌కు చాలా సమయం తీసుకోవడంతో మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. దీంతో థియేటర్లలో సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తమిళంలో ఎక్కువగా హైప్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఆహాలో సక్సెస్ అయ్యేనా?
ఆహా (Aha)లో విడుదలయిన తర్వాత ‘కాజల్ కార్తిక’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందని చిత్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు. తమిళంలో పేవ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షెర్లీస్ సేత్, యోగి బాబు, జాన్ విజయ్ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇందులో కమెడియన్ యోగి బాబు పాత్ర మాత్రం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది.
https://twitter.com/Telugu70mmweb/status/1675141362306646016
కథేంటంటే
ఈ సినిమాను లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఐదు కథలతో తెరకెక్కించారు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక.. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. ఆమె పగ ఎలా తీరింది? ఆమె మరణానికి కారణం ఏంటి? కార్తీక (రెజీనా), కార్తీక (కాజల్)కు ఉన్న సంబంధం ఏంటి? మిగిలిన నాలుగు కథలు ఏవి? అన్నది కథ.
ఏప్రిల్ 02 , 2024
Yukti Thareja: టాలీవుడ్‌కు మరో అందాల తెగింపు.. సొగసులతో బాణాలు వదులుతున్న హర్యానా అందం
రంగబలి హీరోయిన్ యుక్తి తరేజా తాజా హాట్ లుక్స్‌లో అదరగొట్టింది. రంగబలి మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగుతెరకు పరిచయం కానుంది.
రంగబలి ట్రైలర్ లాంచ్ తర్వాత ఇలా హాట్ హాట్ లుక్స్‌తో ఫొటోలకు పొజులిచ్చింది
ట్రైలర్‌లో యుక్తి తరేజ అందం కుర్రకారును ఆకట్టుకుంది. ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరో నాగశౌర్యతో యక్తి తరేజ రొమాన్స్ చేయనుంది. రంగబలి మూవీ జులై 7న రిలీజ్ కానుంది
సినిమాల్లోకి రాకముందు ఈ సొగసుల సంచలనం మోడలింగ్ చేసేది
యుక్తి తరేజ స్వస్థలం హర్యానా, మాతృభాష హిందీ. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్యానా అందం... కాలేజీలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది
ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో గెలుపొందిన తర్వాత మోడలింగ్ మొదలుపెట్టి.. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ వచ్చింది
తెలుగులో నటించేటప్పుడు భాషాపరమైన సవాళ్లు ఎదుర్కొదంట ఈ పుత్తడి బొమ్మ.. పెద్దపెద్ద పారాల డైలాగులు నేర్చుకుని చెప్పడం కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట.
యాక్టింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ చాలా సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది
తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని యుక్తి తరేజ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ పక్కన నటించేందుకు ఉబలాట పడుతోంది.
అల్లు అర్జున్ డాన్స్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమని ప్రశంసలతో ముంచెత్తింది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని చెప్పింది.
ప్రస్తుతానికి తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదని చెప్పిన తరేజ.. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నానని, ఏదైనా నచ్చితే సైన్ చేస్తానని తెలిపారు.
జూలై 04 , 2023
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
ప్రతీ సంవత్సరం స్టార్ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
శౌర్యువ్
నాని హీరోగా తెరక్కిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.
కళ్యాణ్ శంకర్
కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సుమంత్ ప్రభాస్
షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.
క్లాక్స్
చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
వేణు యెల్దండి
ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.
షణ్ముఖ ప్రశాంత్
ఈ ఏడాది విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మురళి కిషోర్
కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్.
డిసెంబర్ 16 , 2023
Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన 'బేబీ' చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌లో బిజీ బీజీగా గడుపుతోంది. దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే. 1996లో జనవరి 4న 1996 విజయవాడలో జన్మించింది.
యాక్టింగ్‌లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి ఫేమస్ అయింది
యుట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరిస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అలవైకుంఠాపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇంకా పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ కెరీర్‌లో జెట్ వేగంతో దూసుకెళ్తోంది
నటిగా, మోడల్‌గా , డ్యాన్సర్‌గా బహుముఖ పాటవాన్ని చూపుతూ తాజాగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ విజయవాడ పిల్ల
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు ఈ మధ్య భారీగానే పెంచుకుంటోంది. లెలేత అందాల ప్రదర్శనతో కుర్రకారుకు వల విసురుతోంది.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
మరో మూడు రోజుల్లో బేబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ జోడీగా నటిస్తోంది
ఇప్పటికే బేబీ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.
ఇద్దరు యువకుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువతి పాత్రలో వైష్ణవీ కనిపించనుంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది.
ఇప్పటికే ఈ చిత్రం బృందం వినూత్నంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.
సోమవారం హైదరాబాద్- బోరబండలో ఆటో డ్రైవర్లతో కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
జూలై 11 , 2023
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : సుధీర్ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్ సుందరం, శశాంక్, సాయి చంద్, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు
దర్శకత్వం : అభిలాష్ కంకర
సంగీతం : జై కృష్ణ
సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి
ఎడిటింగ్ : అనిల్ కుమార్. పి
నిర్మాత : సునీల బలుసు
విడుదల తేదీ: 11-10-2024
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రకాష్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్ బాబు)ని స్టాక్ బ్రోకర్ శ్రీనివాస్ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్ సుధీర్ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్ మిస్ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్ కంకర ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్ మెుత్తం సుధీర్ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్లో న్యారేషన్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్ సక్సెస్ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
నటీనటులు : చైతన్యరావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు
దర్శకుడు : సంతోష్ కంభంపాటి
సంగీతం : రీ
సినిమాటోగ్రాఫర్ : బాల సరస్వతి
ఎడిటర్ : శశాంక్ ఉప్పుటూరి
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్ శ్రీనివాసన్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. బార్ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సంతోష్ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్ మూవీగా మారిపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
దర్శకత్వం : వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి
నిర్మాత: అఖిలేష్ కలారు
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం నటింటిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్ శంకర్ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్ ఏం చేశాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అటు మార్కెట్ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్ పాత్రలో ముక్కు అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్ శంకర్, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వీఎస్ ముఖేష్ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా
ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ నటనసందేశండైలాగ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ లవ్ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
Bharatanatyam Review: డైరెక్టర్ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, సత్తన్న తదితరులు
దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
నిర్మాత : పాయల్ సరాఫ్
నిర్మాణ సంస్థ : పీఆర్ ఫిల్మ్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024
కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా?
కథేంటి
రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్ మీనాక్షి గోస్వామితో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్ కూడా పెద్ద సింక్ కాలేదు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం
Telugu.yousay.tv Rating : 1.5/5
ఏప్రిల్ 05 , 2024
Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 29-12-2023
రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోషన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ.
ఎవరెలా చేశారంటే
హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనుహాసన్ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్, క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సీన్స్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 29 , 2023