• TFIDB EN
  • హైవే
    UTelugu2h 3m
    విష్ణు (ఆనంద్‌ దేవరకొండ) ఫొటోగ్రాఫర్‌. ఈవెంట్‌ కోసం ఫ్రెండ్‌ (సత్య)తో కలిసి హైవేపై బెంగళూరు బయల్దేరతాడు. వారికి దారిలో అమాయకురాలైన తులసి (మానస రాధాకృష్ణన్‌) పరిచయమవుతుంది. మరోవైపు ఐదుగుర్ని హత్య చేసిన ఓ సైకో కిల్లర్‌ అదే హైవేపై పారిపోతుంటాడు. అతడి కోసం పోలీస్ ఆఫీసర్‌ (సయామీ ఖేర్‌) గాలిస్తుంటుంది. ఈ నలుగురు ఒకానొక సందర్భంలో ఎదురుపడతారు? ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఆనంద్ దేవరకొండ
    విష్ణు
    మానస రాధాకృష్ణన్
    తులసి
    అభిషేక్ బెనర్జీ
    డి
    సయామి ఖేర్
    ఆశా భరత్
    జాన్ విజయ్
    రేష్మా పసుపులేటి
    సత్య అక్కల
    సముద్రం
    సిబ్బంది
    KV గుహన్
    దర్శకుడు
    వెంకట్ తలతినిర్మాత
    సైమన్ కె కింగ్
    సంగీతకారుడు
    కథనాలు
    మానస రాధాకృష్ణన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మానస రాధాకృష్ణన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మానస రాధాకృష్ణన్  భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2022లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం హైవే (2022)తో ఆమె తెలుగుతెరకు పరిచయం అయింది. ఆమెను తిరిగి రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం చిత్రంలో వైఎస్ భారతి పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఈ పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మానస రాధాకృష్ణన్ పుట్టిన తేదీ? సెప్టెంబర్ 29, 1998 మానస రాధాకృష్ణన్ ఎక్కడ పుట్టింది? ఎర్నాకుళం, కేరళ మానస రాధాకృష్ణన్ తెలుగులో నటించిన తొలి సినిమా? హైవే(2022) మానస రాధకృష్ణన్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా? వ్యూహం(2024). ఈ చిత్రంలో వైఎస్ భారతి క్యారెక్టర్‌లో నటించింది. మానస రాధాకృష్ణన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  మానస రాధాకృష్ణన్‌ తల్లిదండ్రుల పేర్లు? శ్రీకళ రాధాకృష్ణన్, VK రాధకృష్ణనన్ మానస రాధాకృష్ణన్ అభిరుచులు? క్లాసికల్ డ్యాన్సింగ్, కుకింగ్, గీటార్ వాయించడం మానస రాధాకృష్ణన్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ మానస రాధాకృష్ణన్‌కు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ మానస రాధాకృష్ణన్ ఏం చదివింది? కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ మానస రాధాకృష్ణన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. మానస రాధాకృష్ణన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/me.radhakrishnan/?hl= https://www.youtube.com/watch?v=KlyWpYN2XrY
    ఏప్రిల్ 29 , 2024
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్‌ పని అయినట్లే!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్‍లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  https://twitter.com/MilagroMovies/status/1759613635327107364 ‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌’ డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్‌ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1759574622213947537 షమీ ఫేవరెట్‌ స్టార్లు వీరే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ అంటూ ప్రకటించాడు. సౌత్‌ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్‌ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్‌, తారక్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1759506059331338533 ఛత్రపతి శివాజీగా ప్రభాస్‌! మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్‌ స్టార్‌ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు. https://twitter.com/i/status/1759409716114190363 ప్రభాస్‌కు హనుమాన్‌ ఎలివేషన్‌ ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్‌ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్‌ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు ‌అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్‌ చేస్తూ వీడియోను ఎడిట్‌ చేశారు.  https://twitter.com/i/status/1759832540071027104 మే 9న ఫ్యాన్స్‌కు పండగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
    ఫిబ్రవరి 20 , 2024
    <strong>Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!</strong>
    Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!
    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్‌ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉంది? అందులో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ వాయిసే హైలేట్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక క‌థ చెప్పే స‌మ‌యం వ‌చ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల క‌థ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. పుట్టుక‌తోనే అన్న‌ద‌మ్ములు కాక‌పోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువ‌బ‌డిన టాకాల క‌థ ఇది అంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మ‌ధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడ‌ప్పుడు ఈ చ‌ల్ల‌ని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాప‌కాల్ని గుర్తుచేస్తున్న‌ట్లు అనిపిస్తుంది’ అంటూ మ‌హేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ‘మ‌నం ఒక్క‌టిగా పోరాడాలి, నేను ఉండ‌గా నీకు ఏం కాదు టాకా, భ‌య‌ప‌డ‌కు’ అంటూ మ‌హేష్ బాబు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివ‌ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు మహేష్‌. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.&nbsp; మ‌హేష్ వాయిస్ కోస‌మైనా సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129 ‘ఇది నాకెంతో ప్రత్యేకం’ ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్‌ చెప్పడంపై మహేష్‌ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తెలుగులో మహేష్‌.. హిందీలో షారుక్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్‌ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp; 'SSMB29'తో బిజీ బిజీ దర్శక ధీరుడు రాజ‌మౌళితో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఇందులో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకోసం లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 26 , 2024
    <strong>KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!</strong>
    KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!
    నటీనటులు: రాకింగ్‌ రాకేష్‌, అనన్య కృష్ణన్‌, లోహిత్‌, మైమ్‌ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, జోర్దార్‌ సుజాత తదితరులు దర్శకత్వం: అంజి గరుడవేగ&nbsp; సంగీతం: చరణ్‌ అర్జున్‌ ఎడిటర్‌: చింతాల మధు నిర్మాత: రాకింగ్‌ రాకేష్‌ నిర్మాణ సంస్థ: గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కేశవ చంద్ర రమావత్‌’&nbsp; (Kesava Chandra Ramavat Movie) . షార్ట్‌ కట్‌లో ‘కేసీఆర్‌’ (కేసీఆర్‌)'. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్‌ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్‌ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్‌ హీరోయిన్‌గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్‌, రచ్చరవి, లోహిత్‌ కుమార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్‌ రాకేష్‌ మెప్పించాడా? కేసీఆర్‌ అభిమానిగా హిట్‌ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review) కథేంటి వరంగల్‌ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్‌ అలియాస్‌ కేసీఆర్‌ (రాకింగ్‌ రాకేష్‌) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్‌) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్‌) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్‌ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్‌ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్‌ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేష్‌ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్‌ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్‌ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్‌ నటుడు లోహిత్‌, మామ పాత్రలో మైమ్‌ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్‌, జోర్దార్‌ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్‌ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్‌ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ ఏవిధంగా డెవలప్‌ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్‌ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్‌ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. ‌అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్‌ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్‌, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్‌ కంపోజ్‌ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాకింగ్‌ రాకేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ పొలిటిషియన్‌ను హైలేట్ చేయడంకొన్ని సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?</strong>
    Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్‌, మీరా జాస్మిన్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం : హసిత్‌ గోలి సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ శంకరన్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌&nbsp; నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్‌ విడుదల తేదీ: 04-10-2024 వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్‌ (Meera Jasmine), దక్ష నగర్కర్‌ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్‌ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్‌ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్‌ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. రవి బాబు, సునీల్‌, గెటప్‌ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్‌ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్‌. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్‌ తక్కువే అయినా మంచి రిచ్‌ ఔట్‌పుట్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథశ్రీవిష్ణు నటనకామెడీ మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్‌.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!&nbsp;</strong>
    This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్‌.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!&nbsp;
    సెప్టెంబర్‌ మూడో వారంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్‌ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్‌ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు రీరిలీజ్‌ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గొర్రె పురాణం టాలీవుడ్‌ యువ నటుడు సుహాస్‌ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. యుద్ర సిద్ధాంత్‌ చతుర్వేది, మాళవిక మోహనన్‌ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్‌, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్‌ చేశారు.&nbsp; కహా షురూ.. కహా ఖతం ధ్వని భానుశాలి, ఆషిమ్‌ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్‌ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ మూవీకి కథను అందించడం విశేషం. బొమ్మరిల్లు&nbsp; సిద్ధార్థ్‌, జెనీలియ జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే.&nbsp; 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది.&nbsp; సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది. జర్నీ తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్‌, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్‌ యాక్సీడెంట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్‌ కానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు తంగలాన్‌ తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్‌ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుస‌న్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం. తిరగబడరా సామి రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘తిర‌గ‌బ‌డ‌రా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp; స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.&nbsp; హంట్ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబ‌ర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 29న థియేట‌ర్ల‌లో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. భావ‌న యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కార‌ణంగా హంట్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్ అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal&nbsp;SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!</strong>
    Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 4) థర్డ్‌ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'దావూదీ' (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్‌ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’ ‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్‌’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్‌ బుధవారం (సెప్టెంబర్‌ 4) సాయంత్రం 'దావూదీ' పేరుతో ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తారక్‌ తన ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.&nbsp; యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌.. ‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్‌, జాన్వీ కపూర్‌ బ్యూటీఫుల్‌ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్‌ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్‌ పెంచుకుంటూ 50 మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతోంది.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1831578339078787537 మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌ దావూదీ సాంగ్‌లో తారక్‌ డ్యాన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్‌ ఎనర్జిటిక్‌ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్‌ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్‌ జోష్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్‌ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్‌ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. దావూదీ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్‌ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్‌ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Thyview/status/1831302488340725836 https://twitter.com/krrishnolan/status/1831335770289820070 వెంటాడుతున్న ట్రోల్స్‌ దేవర థర్డ్‌ సింగిల్‌ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని 'అరబిక్‌ కుత్తు'ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్‌, తారక్‌ వేసిన స్టెప్స్‌ కూడా సేమ్‌ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్‌ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్‌ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్‌ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్‌ హైహీల్స్‌ లాంటి షూస్‌ను&nbsp; వేసుకోవాడాన్ని కొందరు హైలేట్‌ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.&nbsp; https://twitter.com/iam_venkatsai_/status/1831547990722671066 https://twitter.com/Sunnykesh/status/1831302199160299619 సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర' ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారోనని తారక్‌ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా,&nbsp; 'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌ం, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.
    సెప్టెంబర్ 05 , 2024
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్‌, సెంటీమెంట్‌ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ మాత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్‌ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్‌ మెప్పిస్తాయి.&nbsp; https://twitter.com/i/status/1760698195787870606 ఆర్‌ఆర్‌ఆర్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గ్లోబల్‌ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్‌ బంగ్లాలోకి తారక్‌ జంతువులతో ప్రవేశించే సీన్‌ హైలేట్‌ అని చెప్పవచ్చు. అటు తారక్‌ - రామ్‌చరణ్‌ ఫైటింగ్‌ కూడా మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1758341886304284738 బాహుబలి 2 (Bahubali 2) బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ అదరహో అనిపిస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=TloNJQKZiFg జెర్సీ (Jersey) నేచురల్‌ స్టార్‌ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్‌ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్‌ వెళ్తుండగా నాని అరిచే సీన్‌.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw రేసుగుర్రం (Race Gurram) అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్‌ పాండే పాత్రతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్‌ చిత్రానికే హైలెట్ https://www.youtube.com/watch?v=jxBLgrppzpc వేదం (Vedam) క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్‌ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్‌ డబ్బులు కొట్టేసే సీన్‌ సినిమాలో హైలెట్‌ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్‌ హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk పోకిరి (Pokiri) మహేశ్‌ బాబు (Mahesh Babu), డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్‌.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=PvkITH66FEc ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్‌ సుదీప్‌ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్‌ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్‌ ఆకట్టుకుంటుంది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ ఫ్యాన్స్ చేత విజిల్స్‌ వెేయిస్తుంది. ప్రభాస్‌ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది. https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc జనతా గ్యారేజ్‌ (Janatha Garage) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’లో తారక్‌ పవర్‌ ప్యాక్డ్‌ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్‌ సీన్‌ మెప్పిస్తుంది. రాజీవ్‌ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్‌ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు. https://www.youtube.com/watch?v=FmAak259Its టెంపర్‌ (Temper) తారక్‌-పూరి కాంబోలో వచ్చిన టెంపర్‌ చిత్రంలో.. కోర్టు సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్‌ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1668264361469591558 https://twitter.com/i/status/1668264361469591558 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్‌ రాథోడ్‌ అనే పోలీసు ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. https://www.youtube.com/watch?v=aorA5S083W4 మగధీర (Magadheera) రామ్‌చరణ్‌ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ షేర్‌ఖాన్‌ పంపిన వందమంది సైనికులను చంపే సీన్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్‌ సినిమాను మలుపు తిప్పుతుంది.&nbsp; https://www.youtube.com/watch?v=9NJya1B8mvI మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్‌ తరపు మనుషులకు ప్రభాస్‌ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది. https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ ఆడవారి మాటలకు అర్థాలే&nbsp; ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్‌, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్‌ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్‌ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=L26KInZYQcI ఇంద్ర (Indra) మెగాస్టార్‌ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్‌ గతాన్ని రివీల్‌ చేసే ఇంటర్వెల్‌ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I సింహాద్రి (Simhadri) రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్‌ ప్రతీకారం తీర్చుకునే సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్‌ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌గా అనిపిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo తులసి (Thulasi) బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్‌ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్‌ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
    ఫిబ్రవరి 24 , 2024
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.&nbsp; https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.&nbsp; https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.&nbsp; https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.&nbsp; https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.&nbsp; https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.&nbsp; https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది.&nbsp; మ్యూజిక్‌ రికార్డు ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది.&nbsp; హైలేట్‌ సంగీతం యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే 'ఎవరెవరో' సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే 'నాన్న నువ్వు నా ప్రాణం'.. క్లైమాక్స్‌తో వచ్చే 'యాలో యాలో' పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు. బీజీఎంతో గూస్‌బంప్స్‌ అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. లాభాలే లాభాలు.! డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.&nbsp;&nbsp;&nbsp;&nbsp;
    ఫిబ్రవరి 12 , 2024
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.&nbsp; థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    AKHIL  AGENT  REVIEW: ఏజెంట్‌ సినిమాతో అఖిల్ హిట్‌ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్‌ అయ్యిందా ?
    AKHIL AGENT  REVIEW: ఏజెంట్‌ సినిమాతో అఖిల్ హిట్‌ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్‌ అయ్యిందా ?
    అఖిల్‌ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్‌ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.&nbsp; దర్శకుడు: సురేందర్ రెడ్డి నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు సంగీతం: హిపాప్ తమిజా సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్ కథేంటి? రిక్కీ ( అఖిల్‌ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్‌ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్‌ ప్రారంభించిన మాఫియా డాన్‌ ది గాడ్‌ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్‌. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ. &nbsp; ఎలా ఉంది? సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్‌ ఫామ్‌ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్‌ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.&nbsp; తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; సెకాండాఫ్‌ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్‌ కొడతాయి. హైవోల్డేజ్‌ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్‌ లెవల్‌.  ఎవరెలా చేశారు సినిమాకు పెద్ద అసెట్‌ అఖిల్‌ అక్కినేని. తన రోల్‌ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్‌ ఏజెెంట్‌గా అతడి లుక్‌ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్‌ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్‌ డ్రామాలు సెట్‌ కాలేదు. సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్‌ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్‌ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.&nbsp; సాంకేతిక పనితీరు ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్‌ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్‌ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్‌ స్టోరీ ఇది.&nbsp; ఏజెంట్ చిత్రానికి మరో మెనస్‌ పాయింట్‌ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్‌ తమీజా ఒక్క చాట్‌ బస్టర్‌ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.&nbsp; ఎడిటింగ్‌ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.  బలాలు అఖిల్ యాక్షన్ సీన్స్‌ బలహీనతలు కథ కథనం సంగీతం రేటింగ్ : 2.5/5
    ఏప్రిల్ 28 , 2023
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఓ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలంతా దాదాపు తమ చిత్రాల్లో సిగరేట్లతో దర్శనమిస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఉద్దేశ్యంతో డైరెక్టర్లు కూడా స్మోకింగ్‌ వైపు హీరో పాత్రలను ప్రోత్సహిస్తున్నారు. సిగరేట్‌ పీకను నోట్లో పెట్టించి స్టైల్‌గా హీరోల చేత దమ్ము లాగిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌ సైతం తమ హీరోను మాస్‌ లుక్‌లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే సిగరేట్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవచ్చని కొన్ని సినిమాలలోని సీన్లు నిరూపించాయి. వాటిలో హీరోలు నోట్లో సిగరేట్‌తో చాలా కూల్‌గా కనిపిస్తారు. అటువంటి క్రేజీ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌ చాలా క్రేజీగా ఉంటుంది. లాంగ్‌ హెయిర్‌ &amp; గడ్డం, ముఖాన బ్లాక్‌ కళ్లద్దాలు.. నోట్లో సిగరేట్‌తో ఓ అమ్మాయి వద్దకు వెళ్లే సీన్‌ అదిరిపోతుంది.&nbsp; https://youtu.be/fguH-dGjfVs?si=lOjPlRybnmb-RZkp యానిమల్‌ (Animal) యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం పదే పదే సిగరేట్లు తాగుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా సూట్‌లో లాంగ్‌ హెయిర్‌తో రణ్‌బీర్‌ సిగరేట్‌ తాగుతూ నడవడం ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. అలాగే నోట్లో సిగరేట్‌తో రణ్‌బీర్‌ ఎంట్రీ సీన్‌ చాలా క్లాసిక్‌గా అనిపిస్తుంది. https://youtu.be/jeQYEIQ6eHw?si=9frMB1-0RO0Wx8p4 సలార్‌ (Salaar) సినిమాల్లో ప్రభాస్‌ (Prabhas) చాలా రేర్‌గా స్మోక్‌ చేస్తూ కనిపిస్తాడు. కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘సలార్‌’లో మాత్రం డార్లింగ్‌.. సిగరేట్‌ తాగుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రౌడీలను చితకబాదిన ప్రభాస్ ఆ తర్వాత కూల్‌గా సిగరేట్‌ తాగడం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1734970904613126484 రెబల్‌ (Rebel) రెబల్‌ సినిమాలో ప్రభాస్‌ సిగరేట్‌ తాగే స్టైల్‌ చాాలా యునిక్‌గా ఉంటుంది. ఓ సీన్‌లో విలన్లు అటాక్‌ చేయడానికి రాగా.. ప్రభాస్‌ ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా స్టైల్‌గా సిగరేట్‌ తాగుతూ ముందుకు వెళ్తాడు.&nbsp; https://youtu.be/LUWy8Kv-SuU?si=EpInRjYM0ukrR-1u గుంటూరు కారం (Guntur Kaaram) గుంటూరు కారం చిత్రంలో మహేష్‌ బాబు (Mahesh Babu) ఎంట్రీ సీన్‌ అదరహో అనిపిస్తుంది. నోట్లో బీడితో కారు నుంచి మహేష్‌ దిగే ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల చేత విజిల్‌ వేయిస్తుంది.&nbsp; https://youtu.be/DAa3crqj5-c?si=0IXCK7j_-kwXYdNv ఒక్కడు (Okkadu) ఒక్కడు సినిమాలో మహేష్‌ బాబు (Mahesh Babu)&nbsp; స్మోకింగ్‌ స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మహేష్‌ సిగరేట్‌ వెలుగించుకొని దాన్ని ఆస్వాదించిన తీరు అద్భుతంగా మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/cPDWfvdj0ug?si=MU_TQkIlEWb9nnuf పుష్ప (Pushpa) పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ బీడీ తాగే యాటిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మంగళం శ్రీను (సునీల్‌) అగ్గిపెట్టే అవసరం అవుతుంది. సరిగ్గా అప్పుడే పుష్ప చాలా స్టైల్‌గా అగ్గిపుల్లను కాల్చి తన బీడీని వెలుగించుకుంటాడు. ఆ తర్వాత కొంత మంగళం శ్రీనుకు కొంత దూరంలో కాలుతున్న అగ్గిపుల్లను పెట్టగా అతడు వంగి సిగరేట్‌ వెలుగించుకునే సీన్‌ హైలెట్‌ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/31woB__nwHU?si=yMBs9-OdpbLRTIBr అంతపురం (Anthahpuram) ఈ సినిమాలో హీరో జగపతి బాబు (Jagapathi Babu)కు సిగరేట్‌ అంటే అమితమైన ఇష్టం. క్లైమాక్స్‌లో ఒంటి నిండా గాయాలతో రైలు పట్టాల పక్కన కదలలేని స్థితిలో కూర్చుండిపోతాడు. అప్పుడు సిగరేట్‌ తాగుతూ అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెవర్‌ బీఫోర్ అన్నట్లు అనిపిస్తాయి. https://youtu.be/TqU-51z0ct4?si=_T7lNiqeWgM5YSlL రక్త చరిత్ర (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో ఓ సీన్‌లో వివేక్‌ ఓబరాయ్‌ రౌడీలందర్నీ ఇంటికి పిలిపిస్తాడు. తన ఏరియాలో ఇకపై ఎవరూ నేరాలు చేయడానికి వీల్లేదని సిగరేట్‌ తాగుతూ చాలా ప్రశాంతంగా వార్నింగ్‌ ఇస్తాడు. ఈ సీన్‌ సినిమాకే హైలేట్‌.&nbsp; https://youtu.be/Qw7fa7583_0?si=QJXZqptCp4jeYOPm వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్‌ సీన్ మెప్పిస్తుంది. సుమో నుంచి సిగర్‌ తాగుతూ బాలయ్య బయటకు వచ్చే ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/YUAhLONLVs8?si=hFjdcNcUWR_lw2jP ‘వి’ (V) హీరో నాని (Nani) ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ది బెస్ట్‌ ఎంట్రీ సీన్‌ ఈ సినిమాలోనే లభించిందని చెప్పవచ్చు. నోటి నుంచి వచ్చే సిగరేట్‌ పొగతో నాని ఇచ్చే క్లాసిక్‌ ఎంట్రీ వాహ్వా అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/hNgs0iFDhik?si=P8rZK2EtBXNk6-Ym కొదమ సింహం (Kodama Simham) ఈ సినిమాలో మెగాస్టార్‌.. కౌబాయ్‌ డ్రెస్‌లో సిగర్‌ తాగుతూ చాలా సీన్లలో కనిపిస్తాడు. ముఖ్యంగా ఓ క్లబ్‌లో సిగర్‌ తాగుతూ కూల్‌గా పేకాట ఆడే సీన్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/ldmg-QK0bYM?si=ZNdkNWLUjlMPRQhx
    మార్చి 01 , 2024
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    దేశంలో భారీ స్థాయిలో మెట్రో సేవలు అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ (Hyderabad Metro) ఒకటి. రోజుకు వేలాది మంది నగర వాసులు మెట్రో ద్వారా ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను తప్పించుకొని మెట్రో ద్వారా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రో తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అది స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు సంబంధించిన డ్యాన్స్‌ వీడియో కావడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ హైదరాబాద్‌ మెట్రో విజయ్‌ వీడియోను ఎందుకు షేర్ చేసింది? ఆ వీడియో కింద ఇచ్చిన క్యాప్షన్ ఎందుకు వైరల్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.&nbsp; విజయ్‌ల ఎవరూ చేయలేదు: మెట్రో విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) టీజర్‌ తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులో విజయ్‌.. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణిస్తూ స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన హైదరాబాద్‌ మెట్రో.. విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ.. 'మేము ఈ వీడియోను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాం. విజయ్‌ దేవరకొండతో పాటు ఫ్యామిలీ స్టార్‌ చిత్ర యూనిట్‌కు మా ధన్యవాదాలు. ఇంతకన్నా బెటర్‌గా మేము ఏం చెప్పగలము' అంటూ రాసుకొచ్చింది. అటు వీడియోలోనూ టెక్ట్స్‌ రూపంలో విజయ్‌ను ప్రశంసించింది. విజయ్‌లా ఇప్పటివరకూ మెట్రోను ఎవరూ ప్రమోట్‌ చేయలేదని పేర్కొంది.&nbsp; https://twitter.com/ltmhyd/status/1764660143340286442 మిడ్‌క్లాస్‌ను టచ్‌ చేసిన టీజర్‌! విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. ఇందులో మీడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ను టచ్‌ చేసే సీన్స్‌ను అలా ఒక ఫ్లాష్‌లో చూపించేశారు. ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ బాధ్యతలతో పాటు హీరోయిజంను డైరెక్టర్‌ పరుశురాం ఈ చిన్న టీజర్‌లో చూపించాడు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా గోవిందం తర్వాత విజయ్‌ - పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్‌’ భారీగా అంచనాలు ఉన్నాయి.&nbsp; https://www.youtube.com/watch?v=9z83t3gB9vE మృణాల్‌ - విజయ్‌ కెమెస్ట్రీ మాముల్గా లేదుగా! విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’లో హీరో విజయ్.. హీరోయిన్‌ రష్మికను ‘మేడం మేడం’ అంటూ వెంట తిరుగుతాడు. ఆ మేడం అనే పిలుపు అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఫ్యామిలీ స్టార్‌లో ‘ఏవండీ’ అనే పిలుపు కూడా ఆ స్థాయిలోనే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ ఈ ‘ఏవండీ’ అనే పిలుపు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. ఇక టీజర్‌లోనూ మళ్లీ అదే పిలుపు మృణాల్‌ నోట వినిపించింది. తాజాగా విజయ్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియోలోను మృణాల్‌ విజయ్‌ను ఏవండి అంటూ ప్రేమగా పిలుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరి కెమెస్ట్రీ తెరపై కనువిందు చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.&nbsp; https://twitter.com/TheDeverakonda/status/1765018796358775059 సరిగ్గా 30 రోజుల్లో రిలీజ్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో వాసుకి, రోహిణితో పాటు మరికొందరు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గా 30 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది. విజయ్‌ తర్వాతి సినిమా ఫ్యామిలీ స్టార్‌ సినిమా పూర్తిగానే విజయ్ తన పన్నెండో చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ షూట్‌కు కూడా వెళ్లనుంది. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా శ్రీలీల నటించనుంది.&nbsp;
    మార్చి 06 , 2024
    బీ టౌన్‌లో సెగలు పుట్టిస్తున్న హైదరాబాద్‌ అందం శ్రేయా ధన్వంతరి
    బీ టౌన్‌లో సెగలు పుట్టిస్తున్న హైదరాబాద్‌ అందం శ్రేయా ధన్వంతరి
    ]యూసే తరఫున శ్రేయకు తన భవిష్యత్‌ ప్రాజెక్ట్‌లకు శుభాకాంక్షలు.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు&nbsp; మోకళ్లపై దండం పెట్టిన సూర్య!&nbsp;</strong>
    Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు&nbsp; మోకళ్లపై దండం పెట్టిన సూర్య!&nbsp;
    తమిళ స్టార్‌ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్‌ చురుగ్గా మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్‌ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య &amp; టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్‌ కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్‌ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్‌’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్‌ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1853842396104020062 https://twitter.com/i/status/1853810428616597938 https://twitter.com/AnushanSfc/status/1854009930233123020 https://twitter.com/RamuNaiduEdit/status/1853848902769967531 ఫ్యాన్స్‌కు సూర్య ‌అభివాదం ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/ARMedia28524249/status/1853816589130293352 10 వేల స్క్రీన్స్‌లో విడుదల ‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు.&nbsp; ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్‌ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్‌.. మరి హైట్ సెట్‌ అవుతుందా?
    టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష డైరెక్టర్‌తో.. సాయిధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్‌ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్‌ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్​ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast)​, ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus)​, ‘కిసి కా భాయ్​ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan)​ వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్‌ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్​ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.  ‘తండేల్‌’తో వస్తోన్న చైతూ ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.&nbsp; డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి! టాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్‌ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. డిసెంబర్‌ 2న సంగీత్‌, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 10న గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్‌. వీరి వివాహం హైదరాబాద్‌ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్‌, డెకరేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.&nbsp;
    నవంబర్ 16 , 2024
    <strong>Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?</strong>
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?
    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    <strong>Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?</strong>
    Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?
    హైదరాబాద్‌లో ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అకస్మాత్తుగా రద్దైన సంగతి తెలిసిందే. నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో గందరగోళం ఏర్పడి ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అటు తారక్‌ సైతం స్పెషల్‌ వీడియోను షేర్ చేసి మరి బాధపడ్డారు. అయితే కావాలనే దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్‌ ప్రకారమే ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లాజికల్‌గా కొన్ని ప్రశ్నలు సైతం సంధిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈ ప్రశ్నలకు ఆన్సర్‌ ఎక్కడ! 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి పని చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్‌, విలన్‌గా చేసిన సైఫ్‌ అలీఖాన్‌ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క ఎయిర్‌పోర్ట్‌ విజువల్ కూడా బయటకి రాలేదు. అంతేకాదు దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందే సైఫ్ అలీఖాన్‌ తన ఫ్యామిలితో ముంబయి వీధుల్లో కనిపించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌ రద్దు అనంతరం జాన్వీ పోస్టు చేసిన వీడియో కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. సదరు వీడియోలో తెలుగులో మాట్లాడిన జాన్వీ ఎక్కడా ఈవెంట్‌ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ముందుగానే ఈ వీడియోను సిద్ధం చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.&nbsp; https://twitter.com/SaiTweetzz/status/1838199126569447796 తారక్‌ పైనా అనుమానాలు! దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో తారక్‌ చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ను కలుసుకునే అవకాశం చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసుకున్న అదే రోజు రాత్రి 11 గంటలకు తారక్‌ అమెరికాకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈవెంట్‌ జరిగినా అది రాత్రి 9:30 వరకు ఉండేదని నెటిజన్లు అంటున్నారు. అంటే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను దాటుకొని గంటన్నర వ్యవధిలో తారక్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాలిపోవడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని అభిప్రాయపడుతున్నారు. ఈవెంట్‌ జరగదని ముందే తెలిసే తారక్‌ యూఎస్‌కు ఫ్లైట్ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాడని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్‌ టికెట్‌ను ఒక్కొటి రూ.1000-3000 మధ్య విక్రయించారని, వాటిని రిఫండ్‌ చేసిన దాఖలాలు కూడా లేవని పేర్కొంటున్నారు. టికెట్ల విషయంలోనూ పెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు.  టికెట్ల రేటు పెంపు తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.&nbsp; మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
    సెప్టెంబర్ 24 , 2024
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సేగల్‌ తదితరులు దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ సంగీతం : సంజయ్‌ లీలా భన్సాలీ, బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్‌ మహాపాత్రా, రగుల్‌ ధరుమాన్‌ ఎడిటర్‌ : సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ : నెట్ ఫ్లిక్స్‌&nbsp; విడుదల తేదీ : 1 మే, 2024 గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ 'హీరామండి ; ది డైమండ్‌ బజార్‌' (Heeramandi: The Diamond Bazaar). బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తోనే ఆయన తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. &nbsp;ఈ వెబ్‌సిరీస్‌లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్‌ (Sanjeeda Sheikh)లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సిరీస్‌ అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి? ఈ సిరీస్‌ కథ బ్రిటీష్ పాలనలో 1930-1940ల మధ్య జరుగుతుంటుంది. పాకిస్తాన్‌ లాహోర్‌లోని హీరామండి ప్రాంతంలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్‌ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరికొందరు కూడా మల్లికాజాన్‌ పీఠంపై కన్నేస్తారు. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే? మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కోయిరాలా అదరగొట్టింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. పాత్రలోని గ్రేస్‌, ఆథారిటీ, కామాండింగ్‌ను తన హావాభావాలతో చూపిస్తూ ఆకట్టుకుంది. మల్లికా జాన్‌కు సవాలు విసిరే పాత్రలో సోనాక్షి సిన్హా మెరిసింది. జిబ్బోజాన్ పాత్రలో అదితిరావ్ హైదరి ఆకట్టుకుంది. హీరామండిలోని దుర్భర పరిస్థితులపై పోరాడే యువ వేశ్య పాత్రలో ఆమె మెప్పించింది. విధి నుంచి తప్పించుకోవాలనుకునే అమాయకమైన యువతి పాత్రలో షర్మిన్‌ సెగల్‌ కనిపించింది. తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ తదితరులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ మరోమారు ఈ సిరీస్‌ ద్వారా తన మార్క్ ఏంటో చూపించాడు. సంఘర్షణ, డ్రామా చాలా స్ట్రాంగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ కథపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో వేశ్యల స్థితిగతులు, వారి మధ్య ఆదిపత్య పోరు ఎలా ఉండేదో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కథకు దేశ భక్తిని జోడించడం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వీక్షకులు బోర్‌గా ఫీలవుతారు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు మ్యూజిక్‌ బాగా ప్లస్ అయ్యింది. బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాటోగ్రాఫర్ల పని తనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా చక్కటి పనితీరు కనబరిచింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనకథ, కథనంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుస్లో న్యారేషన్ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    మే 01 , 2024

    @2021 KTree