రివ్యూస్
How was the movie?
తారాగణం
రామ్ పోతినేని
సూర్యనారాయణ మూర్తి సూరిరాశి ఖన్నా
భానుమతిసత్యరాజ్
నారాయణ మూర్తిSuri father
రావు రమేష్
మంత్రి రాజప్పమురళీ శర్మ
గజా భాయ్నరేష్
నరేష్$నారాయణ మూర్తి స్నేహితుడుతులసి
సూరి తల్లిసాయాజీ షిండే
ఉదయ శంకర్ (ప్రత్యేక అధికారి)సుమన్
ప్రియాంకకు కాబోయే భర్తపోసాని కృష్ణ మురళి
భానుమతి తండ్రిబ్రహ్మాజీ
భానుమతి బాస్హేమ
భానుమతి తల్లిఅన్నపూర్ణ
సూరి అమ్మమ్మశైలజ ప్రియ
గజ భార్యప్రభాస్ శ్రీను
గజ అనుచరుడుఫిష్ వెంకటయ్య
రాజప్ప అనుచరులుకె. విశ్వనాథ్
ముఖ్యమంత్రిచంద్ర మోహన్
పూజారిసుద్దాల అశోక్ తేజ
ప్రధాన కార్యదర్శిజయ ప్రకాష్ రెడ్డి
పార్టీ అధ్యక్షుడుప్రవీణ్
పండిట్సత్యం రాజేష్
ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్జివి సుధాకర్ నాయుడు
లోకల్ గూండాశివన్నారాయణ నారిపెద్ది
రాజప్ప బావప్రియాంక నల్కారి
సూరి సోదరివెంకట గిరిధర్ వజ్జ
సిబ్బంది
సంతోష్ శ్రీనివాస్
దర్శకుడుగోపీచంద్ ఆచంట నిర్మాత
Anil Sunkaraనిర్మాత
జిబ్రాన్
సంగీతకారుడుమణి శర్మ
సంగీతకారుడుSongs:Background Score:సంగీతకారుడు
సమీర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్కథనాలు
Bootcut Balaraju Review: హైపర్ యాక్టివ్ కుర్రాడిలా మెప్పించిన సోహెల్.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్ రోహిణి తదితరులు
దర్శకుడు : కోనేటి శ్రీను
నిర్మాత: ఎండీ పాషా
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటింగ్: వినయ్ రామస్వామి
విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024
బిగ్‌బాస్ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తో మెప్పించిన ఇతడు తాజాగా (ఫిబ్రవరి 2న) ‘బూట్‌కట్ బాలరాజు’ (Bootcut Balaraju)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్గా నటించగా సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సోహెల్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ) కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలరాజు - మహాలక్ష్మి ప్రేమించుకుంటారు. మరోవైపు బాలరాజును సిరి (సిరి హనుమంతు) కూడా ప్రేమిస్తుంటుంది. అయితే బాలరాజు - మహాలక్ష్మి ప్రేమ కథకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
ఇందులో సోహైల్.. హైపర్ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిలా (Bootcut Balaraju Review) మెప్పించాడు. చక్కటి భావోద్వేగాలను పలికించాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. బాలరాజు ఫ్రెండ్స్‌గా అవినాష్, సద్దాం కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి అలరించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కోనేటి శ్రీను తీసుకున్న కథ, సోహెల్ - ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించాడు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశాడనేది చూపించాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా సీన్స్ సినిమాకి బలహీనతగా మారాయి. దర్శకుడు కంటెంట్‌ను స్క్రీన్‌పై బాగా ఎలివేట్ చేసినా.. రొటిన్, బోరింగ్ సీన్స్ వల్ల అది ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bootcut Balaraju Review).. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్యం సంగీతం కూడా కీలక సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది. ఎడిటర్ వినయ్ రామస్వామి తన కత్తెరకు మరింత పని కల్పించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సోహేల్, ఇంద్రజ నటనకామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
కథనంబోరింగ్ సీన్లు
రేటింగ్: 3/5
ఫిబ్రవరి 03 , 2024
Mechanic Rocky Review: విష్వక్ సూపర్.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్ బాస్టరయ్యేది!
నటీనటులు: విష్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేదీ: 22-11-2024
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Review)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విష్వక్ (Vishwaksen) వచ్చేశాడు. అతడు నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో విష్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) చేశారు. రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. విష్వక్ హ్యాట్రిక్ కొట్టాడా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
రాకీ (విష్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేరిపోతాడు. రిపేర్లతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. కాలేజీ మానేయడంతో వారు విడిపోతారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? కథలో రాంకీ రెడ్డి (సునీల్) ఎవరు? అతడి ఎంట్రీతో రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విష్వక్ సేన్ (Mechanic Rocky Review) ఎప్పటిలాగే సెటిల్ నటనతో అదరగొట్టాడు. హుషారైన పాత్రలో ఎంతో యాక్టివ్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైనా పంచ్‌లతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. అందంగా కనిపిస్తూ హావభావాలను చక్కగా పలికించారు. కొన్ని సన్నివేశాల్లో పోటీపడి మరి నటించారు. తెరపై మీనాక్షి, విష్వక్ సేన్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వారి లవ్‌ట్రాక్ కూడా బాగుంది. సునీల్, నరేష్, హర్షవర్ధన్‌కు కూడా బలమైన పాత్రలే దక్కాయి. హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను జోడించి నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రవితేజ ముళ్లపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో బలమైన అంశాలను తెరపై చూపినప్పటికీ, అవసరానికి మించిన కమర్షియల్ హంగులు, కామెడీ సన్నివేశాలు కారణంగా అవి తెలిపోయాయి. ఫస్టాఫ్ మెుత్తం పాత్రల పరిచయానికి, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్, కమర్షియల్ హంగులు, పాటలు మధ్య రొటిన్‌గా సాగిపోతుంది. సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండాఫ్ నుంచి అసలైన కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. ద్వితీయార్థమే సినిమాకు బలం. అనూహ్యమైన ట్విస్టులు, ప్రతీ పాత్ర కథను మరో మలుపుకు తీసుకెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మిడిల్ క్లాస్ వారి కోరికలను ఆసరగా చేసుకొని కొందరు ఎలా మోసం చేస్తారో దర్శకుడు చక్కగా చూపించాడు. ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు జాగ్రత్తపడి ఉంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యేదని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే (Mechanic Rocky Review) సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ (Mechanic Rocky music director) నేపథ్య సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ తనకు ఇచ్చిన బాధ్యతను వందశాతం నెరవేర్చాడు. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విష్వక్ నటనసెకండాఫ్ట్విస్టులు
మైనస్ పాయింట్స్
ప్రథమార్థంకమర్షియల్ హంగులు
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 22 , 2024
Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?
సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం.
కథ
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
సినిమా ఎలా ఉందంటే?
చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి.
భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికత
సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది. వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు.
బలాలు
బలమైన కథ
దుల్కర్ సల్మాన్ నటన
నేపథ్య సంగీతం, ట్విస్టులు
బలహీనతలు
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
చివరగా
‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది?
నటీనటులు : అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ
డైరెక్టర్ : అబ్దుల్ అప్సర్ హుస్సేన్
సంగీతం : వికాస్ బడిశా
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
నిర్మాత : మహేశ్వర రెడ్డి
విడుదల తేదీ : ఆగస్టు 01, 2024
ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్. అబ్దుల్ అప్సర్ హుస్సేన్ రూపొందించిన ఈ చిత్రంలో హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ కథనంలో చూద్దాం.
కథేంటి
చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవ కారణంగా చందుకి కళ్లు పోతాయి. శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ పరిణామంతో అతడి కంటికి ఆపరేషన్ జరిగి చూపు వస్తుంది. అయితే కొత్త కళ్లు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తుంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శత్రుదేశాలతో ఓ సాధారణ రికవరీ ఏజెంట్ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? శివుడి అనుగ్రహంతో చందు నిర్వహించిన కార్యం ఏంటి? కథలో డోగ్రా (కుక్క) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
చందు పాత్రలో హీరో అశ్విన్ బాబు అద్భుత నటన కనబరిచాడు. రెండు డైమన్షన్స్‌లో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. శైలజా పాత్రలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఆకట్టుకుంది. అశ్విన్, దిగంగన మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇక పోలీసు ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ మెప్పించాడు. హాస్య నటుడు హైపర్ అది తన పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, మురళి శర్మ తమదైన సెటిల్ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఒక మిస్టరీ కథకు డివోషనల్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు అబ్దుల్ అప్సర్ హుస్సేన్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ క్రైమ్ డ్రామాలోని కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే శత్రుదేశాల తాడి నేపథ్యంలో అల్లిన స్టోరీ లైన్ కూడా మెప్పిస్తుంది. అయితే కథ బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరపైన ప్రజెంట్ చేయలేకపోయాడు. హత్యలకు సంబంధించిన ట్రాక్ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. హీరో అశ్విన్ బాబు క్యారెక్టర్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ లాజిక్స్ దూరంగా అనిపిస్తాయి. కథ స్లోగా సాగడం, తొలి భాగంలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ మిస్ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. కథతో సంబంధం లేని సీన్స్ ఎక్కువ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్ సీన్స్‌ను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా ప్రజెంట్ చేశారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్
అశ్విన్ బాబు నటనసస్పెన్స్ సీన్స్‌క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
స్లో నారేషన్‌ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంఅసందర్భమైన సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
.
ఆగస్టు 01 , 2024
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్‌లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024
రాశి ఖన్నా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. జైలవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, హైపర్, థ్యాంక్యూ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాశి ఖన్నా తొలుత మోడలింగ్ చేసి నటనవైపు మొగ్గింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ఆపిల్ బ్యూటీకి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇదే క్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు(Some Lesser Known Facts about Raashii Khanna) రాశిఖన్నా గురించి తెలుసుకుందాం.
రాశి ఖన్నా ముద్దు పేరు?
రాశి
రాశి ఖన్నా ఎప్పుడు పుట్టింది?
1990, నవంబర్ 30న జన్మించింది
రాశి ఖన్నా తొలి సినిమా?
మద్రాస్ కేఫ్(2013)
రాశి ఖన్నా తెలుగులో నటించిన తొలి సినిమా?
ఊహలు గుసగుసలాడే(2014)
రాశి ఖన్నా ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
రాశి ఖన్నా ఎక్కడ పుట్టింది?
ఢిల్లీ
రాశి ఖన్నా ఏం చదివింది?
బీఎస్సీ హానర్స్ ఇన్ ఇంగ్లీష్
రాశి ఖన్నా అభిరుచులు?
పాటలు పాడటం, కవితలు రాయడం
రాశి ఖన్నాకి ఇష్టమైన ఆహారం?
లెబనీస్, చైనీస్ వంటలు
రాశి ఖన్నా కు అఫైర్స్ ఉన్నాయా?
క్రికెటర్ జాస్ప్రిత్ బుమ్రా అఫైర్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
రాశి ఖన్నాకు ఇష్టమైన కలర్ ?
వైట్, ఎల్లో
రాశి ఖన్నాకు ఇష్టమైన హీరో?
మహేష్ బాబు, రణబీర్ కపూర్
రాశి ఖన్నా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
రాశి ఖన్నా తల్లిదండ్రుల పేరు?
సరిత, రాజ్ కే ఖన్నా
రాశి ఖన్నా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/raashiikhanna/?hl=en
రాశి ఖన్నా ఫెవరెట్ సినిమాలు?
బొమ్మరిల్లు
రాశి ఖన్నాకు ఇష్టమైన ఐస్ క్రీం
చాకోలెట్ ఐస్‌క్రీం అంటే రాశి ఖన్నాకు చాలా ఇష్టం
రాశి ఖన్నా ఫెవరెట్ హీరోయిన్?
మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా
https://www.youtube.com/watch?v=O0ClAuu8Ito
రాశి ఖన్నాకు ఫెవరెట్ రెస్టారెంట్?
ఎన్ గ్రీల్, హైదరాబాద్
ఏప్రిల్ 06 , 2024
Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
తారాగణం:
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్
డైరెక్టర్: రతినం కృష్ణ
నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి
సంగీతం: అమ్రీష్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్
టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది. మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది.
బలాలు
ఫస్టాప్ కామెడీ ట్రాక్
నెహా శెట్టి గ్లామర్
బలహీనతలు
అనవసరమైన ఎలివేషన్స్
సెకండాఫ్
స్టోరీ
చివరగా.. రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 06 , 2023
Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్ షేడ్స్ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఫహాద్‌కు నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే!
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.
ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి?
ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ADHD వ్యాధి ఎలా వస్తుంది?
ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.
కెరీర్లో బిగ్గెస్ట్ హిట్
ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్ ఫాజిల్ సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఫహాద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ఫహాద్.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.
మే 28 , 2024
Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్.. మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు
దర్శకుడు : వక్కంతం వంశీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీతం: హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్
విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023
'భీష్మ' సినిమా తర్వాత నితిన్ కెరీర్లో సరైన హిట్ పడలేదు. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ చేసిన లేటెస్ట్ చిత్రం 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man). వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ మూవీని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా... రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పాడు. మూవీ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
అభి (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఎక్స్ట్రా ఆర్టిస్ట్‌గా సాగిపోతున్న అభి లైఫ్‌లోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)కి సైతాన్ సంబంధం ఏంటి ? చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా లుక్, స్టైలింగ్ బాగుంది. ఇక శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. నటనకు పెద్దగా స్కోప్ లేదు. పాటలకే ఆమె పరిమితమైంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు రాజశేఖర్ పూర్తి న్యాయం చేశారు. హీరోకి తండ్రిగా రావు రమేష్ చాలా బాగా నటించాడు. తనదైన పంచ్‌లతో ఫన్ క్రియేట్ చేశారు. ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వక్కంతం వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్ బలహీనంగా ఉన్నప్పటికీ కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను నవ్వించడంలో ఆయన కొంతమేర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే తొలి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్‌హాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను లాజిక్కు చాలా దూరంగా చూపించారు డైరెక్టర్. అటు హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్‌ను కూడా బలంగా చూపలేక పోయారు. కేవలం ఎంటర్టైన్మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హారిస్ జయరాజ్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే సాగదీత సీన్లు అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్
నితిన్ నటనహాస్య సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
బలహీనమైన స్టోరీలవ్ ట్రాక్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 08 , 2023
Rashi Khanna: టైట్ జాకెట్లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది
తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.
జోరు, శివం, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి రాశి మెప్పించింది.
గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో రాశీ అలరించింది. తమిళంలోనూ తిరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది.
తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరం పాటించిన రాశి గత కొంత కాలంగా ఆ హద్దులు చెరిపేసింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో కలిసి రుద్ర వెబ్‌సిరీస్ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను రాశి మెరిసింది.
ఇటీవల కాలంలో రాశి సినిమాల జోరు తగ్గింది. దీంతో తన అందాల ఆరబోత ద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని రాశి చూస్తోంది.
ఏప్రిల్ 03 , 2023
Rashi Khanna: జాకెట్ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా.. చూసి తట్టుకోవడం కష్టమే!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్ ఫొటోలను షేర్ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది.
తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రాశీ ఖన్నా క్లీవేజ్ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.
గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.
సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది.
కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు.
అటు తమిళంలో రీసెంట్గా 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్' చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే సినిమాలో మెరిసింది.
ప్రస్తుతం టాలీవుడ్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్గా చేస్తోంది.
అలాగే హిందీలో ఈ చిన్నది 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది.
కెరీర్ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.
జోరు, శివం, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది.
రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది.
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్ చేస్తోంది.
మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్ అవుతూనే వస్తోంది.
జనవరి 30 , 2024
Review: విశ్వక్సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
విశ్వక్సేన్ డ్యుయల్ రోల్లో నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22 థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, విశ్వక్సేన్ హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా, యాక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.
దర్శకుడు: విశ్వక్సేన్
నటీ నటులు: విశ్వక్సేన్, నివేథా పెతురాజ్, రావు రమేశ్, రోహిణి, తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, జార్జ్ విలియమ్స్
కథేంటి?
కృష్ణ దాస్(విశ్వక్సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
అందరికీ తెలిసిన ఫార్ములానే కావడంతో కథలో కొత్తదనం కనిపించలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించాయి. నివేదాతో లవ్ ట్రాక్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తానికి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్ధంలో తొలి పది నిమిషాలు అది కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు రావడం మొదలవుతాయి. అయితే, కథలో అవసరమైన వాటికన్నా ఎక్కువ ట్విస్టులు ఉండటం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ఊహిస్తారు. ఎమోషనల్ సీన్స్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారు?
విశ్వక్సేన్ డ్యుయల్ రోల్లో అలరించాడు. తనలోని భిన్న కోణాలను చూపించడానికి ఈ రెండు పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. నటన పరంగా విశ్వక్ ఆకట్టుకున్నాడు. బోల్డ్ డైలాగ్‌లతో మాస్ ఆడియెన్స్‌ని మురిపించాడు. నివేదా పేతురాజ్ అందంగా కనిపించింది. రావు రమేశ్, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహేశ్, హైపర్ ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ మెప్పించాడు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీని నడిపించడానికి విశ్వక్ బాగానే శ్రమించాడు. తనలోని డైరెక్టర్‌కు పనిచెప్పాడు. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘మావా బ్రో’, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ పాటలు తెరపై సందడి చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వక్సేన్ నటన
సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఎక్కువ ట్విస్టులు
స్క్రీన్ ప్లే
ఫైనల్‌గా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దాస్.. క్లాస్ ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చాడు.
రేటింగ్: 2.5/5
మార్చి 22 , 2023
This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్ హైమర్’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
ఓం భీమ్ బుష్..
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్..’ (Om Bheem Bush). నో లాజిక్ ఓన్లీ మేజిక్ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనన్య
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హద్దులేదురా
ఆశిష్ గాంధీ, అశోక్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓపెన్ హైమర్
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.
సుందరం మాస్టార్
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్లో ప్రసారం కానుంది.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ కీలకపాత్రలు పోషించారు.
అబ్రహాం ఓజ్లర్
జయరాం (Jayaram), అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘అబ్రహాం ఓజ్లర్’ (Abraham Ozler OTT). మిధున్ మేనుయేల్ థామస్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu ETV WinMarch 22
మార్చి 18 , 2024
Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్! ‘ఫ్యామిలీ స్టార్’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్ హిట్ తర్వాత డైరెక్టర్ పరుశురామ్ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్.. తాజాగా ఓ సాంగ్ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.
ఈ సాంగ్ నా ఫేవరేట్: విజయ్
'ఫ్యామిలీస్టార్'కి సంబంధించి మొదటి సాంగ్ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్ చేసింది. 'నంద నందన' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్ BGM అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్ శ్రీరామ్ స్వరపరచగా సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్ చేసిన విజయ్.. 'మొదటిపాట.. నా ఫెవరేట్.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
ఫిదా చేస్తున్న మృణాల్..!
ఈ సాంగ్ ప్రోమోలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'సీతారామం' తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్ లుక్‌లో మృణాల్ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్ ఈ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి.
‘దేవర’ స్థానంలో..!
'ఫ్యామిలీ స్టార్' రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్ (Jr NTR) 'దేవర' (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో 'ఫ్యామిలీ స్టార్'ను రిలీజ్ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. 'ఖుషీతో మంచి హిట్ అందుకున్న విజయ్.. ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్!
గతంలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి?' అని విజయ్ చెప్పిన డైలాగ్ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్పై రీల్స్ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్ ఫెమినిస్ట్ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.
సినిమా కథపై క్రేజీ అప్డేట్!
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్ మూవీ కూడా ‘గ్యాంగ్ లీడర్’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్ రీవెంజ్ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
ఫిబ్రవరి 06 , 2024
Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్ పెంచిన రామ్‌చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
టీజర్ గ్రాండ్ రిలీజ్
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
https://youtu.be/OXe7N7-xMKM?si=BCd-Cbbs34DeiwT2
త్రీ డిఫరెంట్ లుక్స్‌లో…
కాలేజీ బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అన్న డైలాగ్‌తో టీజర్ మెుదలైంది. ఇందులో చరణ్ త్రీ డిఫరెంట్ డైమన్షన్స్‌లో కనిపించాడు. పాతకాలం వ్యక్తిలా, కాలేజీ కుర్రాడిలా, ప్రభుత్వ ఆఫీసర్‌గా ఇలా మూడు లుక్స్ అదరగొట్టాడని చెప్పవచ్చు. టీజర్‌ను ఎక్కువగా యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్‌తో అదిరిపోయే BGMతో పర్ఫెక్ట్గా కట్ చేశారు. చివర్లో చరణ్ ‘ఐ యాం అన్ ప్రిడిక్టబుల్’ అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని రామ్ చెప్పకనే చెప్పాడు.
ఫ్యాన్స్.. మాస్ సెలబ్రేషన్స్
గేమ్ ఛేంజర్ టీజర్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్ణాటకలోని 11 నగరాల్లో 11 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రతిభా థియేటర్లో టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో టీజర్‌ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అటు ఏపీలోని వైజాగ్ (సంగం-శరత్ థియేటర్), రాజమండ్రి (శివజ్యోతి థియేటర్), విజయవాడ (శైలజా థియేటర్), కర్నూల్ (వి మెగా థియేటర్), నెల్లూర్ (S 2 థియేటర్), బెంగళూరు (ఊర్వశి థియేటర్), అనంతపూర్ (త్రివేణి థియేటర్), తిరుపతి (పీజీఆర్ థియేటర్) నగరాల్లో టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్‌కు ముందే భారీగా అయా థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/censorReport_/status/1855228209064759425
https://twitter.com/Rams41380829/status/1855228328787235323
https://twitter.com/sivacherry9/status/1855214405321101433
https://twitter.com/TweetRamCharan/status/1855215658340065747
https://twitter.com/Rishi_JSP/status/1855228307438190787
https://twitter.com/megafanforever3/status/1855228287502414266
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ నిర్వహించాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్ ప్లేసులో ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ అయిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్ ఆహ్వానాన్ని పవన్ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
దిల్ రాజు 50వ చిత్రంగా..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ కెరీర్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్ ఛేంజర్ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు 'గేమ్ ఛేంజర్'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
నవంబర్ 09 , 2024
Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పుతిన్ ఏమన్నారంటే?
ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్ తెలిపారు. 24 గంటలూ ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
https://twitter.com/RT_com/status/1847495389303144506
‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా!
ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్ 8న రష్యాలో నేరుగా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్ రూబెల్స్‌ను కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది.
‘పుష్ప 2’కి కలిసి రానుందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లేటెస్ట్ కామెంట్స్ ‘పుష్ప 2’ టీమ్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్‌కు తాము సహకరిస్తారమని పుతిన్ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్ రిలీజ్లో భాగంగా రష్యన్ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.
హైప్ పెంచేసిన దేవిశ్రీ
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినిమాపై హైప్ పెంచేశారు. అటు 'పుష్ప 2' నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు.
https://twitter.com/Cinema__Factory/status/1845798162478272773
మృణాల్తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/villan_97/status/1845762894119801258
అక్టోబర్ 19 , 2024
Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్.. ఇది మామూలు హైప్ కాదు భయ్యా!
‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ జరగ్గా రానాపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘రానా భయపెట్టాడు’
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్లో హైప్ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్ లుక్ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1843720706057724332
కథ మార్చేసిన రజనీ
వేట్టయన్ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.
రజనీపై తమిళ డైరెక్టర్ ఆరోపణలు
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చేయనున్నారు రజనీ.
అక్టోబర్ 09 , 2024
Pawan Kalyan: ‘సలార్’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్!
టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్ కల్యాణ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘సలార్’.. పవన్ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అలాగే పవన్ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓజీ - సలార్ మధ్య పోలిక!
‘కేజీఎఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్ అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్ రెగ్యులర్ షూట్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.
హై రేంజ్లో ఎలివేషన్స్!
‘ఓజీ’ సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్లో చూపించాడు డైరెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్ ఫ్యాన్స్ తమ కాలర్ ట్యూన్స్, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
సన్నగిల్లుతున్న అంచనాలు!
పవన్ కల్యాణ్ హీరోగా.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్ అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్ కెరీర్లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.
చిరుకు పోటీగా పవన్ కల్యాణ్!
‘హరిహర వీరమల్లు’ షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్ అయినంతవరకూ పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్స్ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ డేట్స్ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.
మార్చి 07 , 2024
SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా ప్రాజెక్ట్ అనౌన్స్ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
SSMB29 ట్రెండింగ్
RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.
https://twitter.com/i/status/1635126271427624961
పూనకాలు లోడింగ్
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా లాంఛ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జక్కన్న, సూపర్ స్టార్ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్లో హైప్ పెంచుతున్నారు.
https://twitter.com/TribhuvanRishi/status/1635290226062147584
హాలీవుడ్ హీరోయిన్
మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/UrsPrakash_07/status/1635172159688671233
మనదే ఆస్కార్
మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/sri_cultdhfm/status/1635131220832165888
శరవేగంగా పనులు
రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.
ప్రస్తుతం బిజీ
రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
మార్చి 14 , 2023
Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా చూడాలన్న కోరిక బలపడుతుంది. అందుకే మేకర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వూలు, సోషల్ మీడియా ప్రకటనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ చేస్తోన్న వినూత్న ప్రమోషన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్రేజీ ప్రమోషన్స్!
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యంగ్ హీరోల్లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. ఇటీవల ‘హరోం హరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ఇప్పుడు మరో సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero) చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్స్‌కు తెర లేపింది. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ చేస్తోంది. యంగ్ హీరోలు వరుణ్ తేజ్, మంచు మనోజ్‌తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వినూత్న ప్రమోషన్స్‌లో తమకు తెలియకుండానే భాగమయ్యారు. దీంతో ఈ ప్రమోషన్స్‌కు నెట్టింట విశేష స్పందన వస్తోంది. స్టార్లను భలే బురిడి కొట్టించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ అండ్ న్యాచురల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు తెలిసే జరిగిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్.
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/i/status/1842791222047367544
https://twitter.com/i/status/1842084097621164229
అవాక్కైనా మంచు మనోజ్!
తనకు తెలియకుండానే మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్‌లో భాగం కావడంపై మంచు మనోజ్ నెట్టింట స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా దానికి అయోమయంగా చూస్తున్న బ్రహ్మీ జిఫ్‌ను జత చేశాడు. స్మైలీ ఎమోజీ ట్యాగ్ చేస్తూ తాను బాగా ఎంజాయ్ చేసినట్లు సంకేతం ఇచ్చారు. దీనిపై సుధీర్ బాబు కూడా ఆసక్తికర రిప్లే ఇచ్చారు. సారి బ్రో ఇంకో ఆప్షన్ దొరకలేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు. మొత్తానికి మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ మాత్రం చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
https://twitter.com/HeroManoj1/status/1842102892628509031
ట్రైలర్‌పై మహేష్ ఏమన్నారంటే!
‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Promotions) ట్రైలర్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మెచ్చుకున్నట్లు నటుడు సుధీర్ బాబు తెలిపారు. ‘మహేష్ బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్ కట్ ట్రైలర్ పంపిస్తే బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్ ట్రైలర్ పంపా. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్ టచ్చింగ్‌గా ఉందన్నారు. ఆఖర్లో వచ్చే మహేష్ పేరున్న డైలాగ్ ఫన్నీగా ఉందన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా. అలా తను సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది’ అంటూ తాజా ఇంటర్వ్యూలో సుధీర్ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 08 , 2024