• TFIDB EN
  • UATelugu3h 8m
    మోడల్‌గా మారిన బాడీ బిల్డర్‌ తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. అతడ్ని చూసి ఓర్వలేని విలన్లు అతడిపైకి ఓ వైరస్‌ను ప్రయోగిస్తారు. దాని ప్రభావంతో అతడు అంద విహీనంగా మారడంతో పాటు వైకల్యానికి గురవుతాడు. ఇందుకు కారణమైన వారిపై అతడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విక్రమ్
    అమీ జాక్సన్
    సురేష్ గోపి
    సంతానం
    ఉపేన్ పటేల్
    రామ్‌కుమార్ గణేశన్
    ఓజస్ రజనీ
    ఎం. కామరాజ్
    మహరు షేక్
    అజగు
    టికె కళా
    మోహన్ కపూర్
    శ్రీనివాసన్
    యోగి బాబు
    ఆల్ఫ్రెడ్ హ్సింగ్
    నమస్కారం కందసామి
    ఆర్. శరత్‌కుమార్
    సిబ్బంది
    ఎస్. శంకర్
    దర్శకుడు
    వి. రవిచంద్రన్
    నిర్మాత
    డి. రమేష్ బాబునిర్మాత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    P. C. శ్రీరామ్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడుగా నిలబెట్టింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’ పేరుతో ఇది రాబోతోంది. టైటిల్‌ కింద ‘ది రూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం.  శరవేగంగా షూటింగ్‌ ఆగస్టు 15న 'పుష్ప 2'ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 'రామోజీ ఫిల్మ్‌ సిటీ'లో చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 12) ‘పుష్ప2’ హీరోయిన్‌ రష్మిక మందన్న సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ను క్యాప్చర్‌ చేసింది. ఓ సింహం బొమ్మపై సుకుమార్ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. శ్రీవల్లి (రష్మిక) ఈ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. చకా చకా షూటింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.  https://twitter.com/PushpaMovie/status/1756931867146907757? ఒకే ఒక్క మార్పు పుష్ప చిత్రం సౌత్‌లో కంటే.. నార్త్‌లోనే ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుంది. దాంతో ‘పుష్ప 2’ పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ‘పుష్ప 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారట. ఒక్క జ‌గ‌ప‌తిబాబు పాత్ర మాత్రమే కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రంలో బన్నీతో పాటు సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  పుష్ప2 డైలాగ్ లీక్‌..! ఇక పుష్ప2 నుంచి రిలీజైన ఓ పోస్టర్‌లో బన్నీ.. గంగమ్మ జాతర గెటప్‌లో కనిపిస్తాడు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీకైదంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. మంగళం శీను (సునీల్‌)కు పుష్ప(బన్నీ) వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ డైలాగ్‌ ఉంటుందని అంటున్నారు. అదేంటంటే.. ‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’ అని సునీల్‌తో బన్నీ అంటాడట. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  లీకుల బెడద..! 'పుష్ప 2' చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్‌ నుంచి అల్లు అర్జున్‌ చీరలో ఉన్న ఫొటో లీక్‌ అయ్యింది. దీంతో సుకుమార్‌ యూనిట్‌పై సీరియస్ అయ్యాడట. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి రావు రమేష్‌ ‘ప్రజా చైతన్య పార్టీ’ అనే ఫ్లెక్సీలు కూడా బయటకు వచ్చాయి. ఈ లీకులను ఆపేందుకు సుకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు మూవీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు లీక్‌ కాకుండా అడ్డుకోవాలని యూనిట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.  https://twitter.com/SrikanthAnu2/status/1751986145318314415
    ఫిబ్రవరి 13 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.  ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.  ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.    ‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’  ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.  https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.  ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.  https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.  ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.   తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ  సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.  https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!
    IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!
    భారత్‌లో ఐపీఎల్‌ మేనియా ప్రారంభమైంది. IPLలోని 10 జట్లు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో క్రికెట్‌ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా తలుపు తట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంబటి రాయుడు ఐపీఎల్‌లో దిగ్గజ తెలుగు బ్యాటర్ అంటే ముందుగా అంబటి రాయుడే గుర్తుకు వస్తాడు. తన ధనాధన్‌ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు తమ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అంబటి.. ముంబయి ఫ్రాంచైజీ తరపున అత్యధిక సీజన్లు ఆడాడు. ప్రస్తుతం CSK ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. క్రితం మ్యాచ్‌లో 27(14) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాది పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా తలుపు  తట్టాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుస్తున్నాడు. RCB జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్‌ ఆ జట్టు కీలక బౌలర్‌గా ఎదిగాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ RCB విజయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.   తిలక్‌వర్మ హైదరాబాద్‌కు చెందిన తిలక్‌వర్మ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌ జట్టుకు తిలక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 వేలంలో తిలక్‌ను ముంబయి ఫ్రాంచైజీ రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో తిలక్ అద్భుతంగా రాణించడంతో అతడ్ని ముంబయి రిటైన్‌ చేసుకుంది. RCBతో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్‌ 84 (46) పరుగులు చేసి సత్తా చాటాడు.  KS. భరత్‌ ఏపీలోని రామచంద్రాపురానికి చెందిన KS. భరత్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో RCB తరపున రాణించిన ఈ యంగ్‌ వికెట్‌కీపర్‌ను రూ. 1.2 కోట్లకు GT దక్కించుకుంది. అయితే గుజరాత్‌ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో భరత్‌కు అవకాశం దక్కలేదు. మరోవైపు ఈ ఏడాది కేఎస్‌ భరత్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌.. వికెట్‌ కీపర్‌గా రాణించాడు. https://twitter.com/i/status/1606292956318560256 షేక్‌ రషీద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి చెందిన షేక్‌ రషీద్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కొనుగోలు చేసింది. రూ.20 లక్షలకు దక్కించుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌-2022 గెలిచిన భారత జట్టులో షేక్‌ రషీద్‌ కూడా ఉన్నాడు. రషీద్‌ తన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం చెన్నై తరపున బ్యాటింగ్‌ చేసే అవకాశం లభిస్తే తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని రషీద్ ఉవ్విళ్లూరుతున్నాడు.  https://twitter.com/i/status/1606583101110751233 నితీష్‌ కుమార్‌ వైజాగ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలకు ఈ యువ ఆటగాడ్ని సొంతం చేసుకుంది. నితీష్‌ ఆంధ్ర కిక్రెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంచి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది SRH జట్టు ద్వారా నితీష్ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ‘మనవాడు వచ్చాడోయ్‌ జరుగు జరుగు’ అంటూ అప్పట్లో సన్‌రైజర్స్‌ చేసిన ట్విట్‌ అందరిని ఆకట్టుకుంది.  https://twitter.com/i/status/1606315679963316224 భగత్‌ వర్మ హైదరాబాది క్రికెటర్‌ భగత్‌వర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. 2023 ఐపీఎల్‌ వేలంలో రూ. 20 లక్షలు వెచ్చించి తమ గూటిలో చేర్చుకుంది. భగత్‌ బ్యాటింగ్‌ చేయడంతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ వేయగలడు. హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా భగత్‌ వర్మకు పేరుంది. ఈ నేపథ్యంలోనే CSK జట్టు భగత్‌ను కొనుగోలు చేసింది. 
    ఏప్రిల్ 05 , 2023
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్‌ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్‌ చేసిన టాప్‌ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్‌ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్‌ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; టాప్‌-20లో బాలీవుడ్‌ తారలు సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేయబడ్డ టాప్‌ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్‌ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్‌ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్‌- 20లో చోటు దక్కించుకున్నారు.&nbsp; దీపిక పదుకొనే (Deepika Padukone)షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)అలియా భట్‌ (Alia Bhatt)ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irrfan Khan)అమీర్‌ ఖాన్‌ (Aamir Khan)సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)&nbsp;అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కత్రినా కైఫ్‌ (Katrina Kaif)అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)సమంత రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu)కరీనా కపూర్‌ (Kareena Kapoor)త్రిప్తి దిమ్రి (Tripti Dimri)తమన్న భాటియా (Tamannaah Bhatia)రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)నయనతార (Nayanthara)రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh)అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) తెలుగులో టాప్‌ ఎవరంటే? ఐఎండీబీ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్‌ తర్వాత తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ (31), అల్లు అర్జున్‌ (47), జూనియర్ ఎన్టీఆర్‌ (67), మహేశ్‌ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్‌-100లో నిలిచారు.&nbsp; టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా? ఐఎండీబీ రిలీజ్‌ చేసిన తాజా జాబితాలో టాప్‌-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ (సలార్‌), అల్లు అర్జున్‌ (పుష్ప), రామ్‌చరణ్‌ - తారక్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్‌ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్‌ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్‌ స్టార్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్‌-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు.&nbsp;
    జూన్ 05 , 2024
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్‌ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
    యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.&nbsp; అసలేం జరిగిందంటే? దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్‌ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్‌ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1785936991726743773 మండిపడుతున్న ఫ్యాన్స్ అనిల్‌ రావిపూడి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగానే బదులిస్తున్నారు.&nbsp; అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్‌ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్‌ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు.&nbsp; ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్‌ డేట్‌ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్‌ డే? జానర్‌? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్‌ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1785935511531511969
    మే 02 , 2024
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.&nbsp; హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.&nbsp; https://twitter.com/i/status/1332879102211096577 ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్‌కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్‌ చెప్పాలని నిర్ణయించుకుందట. కిరణ్‌-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.&nbsp; గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్‌’ (Meter), ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.&nbsp; ప్రస్తుతం ‘దిల్‌ రుబా’ అనే చిత్రం కిరణ్‌ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్‌ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.&nbsp; ఇక రహస్య గోరక్‌ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.&nbsp; ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్‌ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.&nbsp; అదే ఏడాది 'బాయ్స్‌ ఇన్ స్కూల్‌' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్‌' అనే తమిళ్‌ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది.&nbsp;
    మార్చి 11 , 2024
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై&nbsp; ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.&nbsp; పార్కింగ్ స్థలంలో కారు తీసెటప్పుడు ఆమె కారు అడ్డుగా ఉండటంతో ఓసారి తాను డింపుల్‌ను రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుండటం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.&nbsp; ఈరోజు కూడా ఓ ఎమర్జెన్సీ పనిపై వెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న డింపుల్‌ కారును తీయాలని&nbsp; డ్రైవర్&nbsp; రిక్వెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ కారును గుద్దడంతో పాటు కాలుతో తన్నిందని అది సీసీటీవీలో కూడా రికార్డైందని పేర్కొన్నారు. దీంతో తన డ్రైవర్‌ డింపుల్‌పై కేసు పెట్టినట్లు వివరించారు.&nbsp; డింపుల్ రియాక్షన్ తాజా వివాదంపై డింపుల్ హయాతి కూడా రియాక్ట్ అయింది. ‘అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు ఆగదు, అధికార దుర్వినియోగం తప్పులను దాచదు’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/DimpleHayathi/status/1660877913200406529 https://twitter.com/DimpleHayathi/status/1660863210436583424 డింపుల్ కోపానికి కారణం ఇది! తాజా వివాదం నేపథ్యంలో డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత వారం రోజులుగా డింపుల్&nbsp; కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నట్లు తెలిసింది. ట్రాఫిక్‌ డీసీపీతో తలెత్తిన వివాదం వల్లే తన కారుకు అధికంగా చలాన్లు పడుతున్నట్లు డింపుల్‌ హయాతి భావించింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్‌ అంతా రాహుల్‌ హెగ్డే కారుపై చూపించినట్లు తెలుస్తోంది.&nbsp; డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ‘యురేక’ సినిమాలో ఆమె నటించింది. అభినేత్రి 2 సినిమాలో తన నటనతో డింపుల్ ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్‌ చిత్రంలో జర్ర జర్ర పాటలో స్టెప్పులేసి తెలుగు యువతను అలరించింది. ఆ తర్వాత ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ సినిమాలతో డింపుల్‌ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ లోనూ డింపుల్ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    మే 23 , 2023
    iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!
    iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!
    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.&nbsp; ఐక్యూ జెడ్ 7ఎస్ 5జీ (iQOO Z7s 5G) పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ మెుబైల్ సేల్స్‌ భారత్‌లో మెుదలైపోయాయి. ఐక్యూ మెుబైల్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉండటంతో కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఏమున్నాయి? ధర ఎంత? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.&nbsp; ఫోన్ డిస్‌ప్లే iQOO Z7s 5G ఫోన్‌ డిస్‌ప్లేను 6.38 అంగుళాలతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఫుల్‌ HD+ అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్‌ రేటుతో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో ఫోన్‌ తీసుకొచ్చారు.&nbsp; ఫోన్‌ స్టోరేజ్‌ iQOO Z7s 5G ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో ఈ ఫోన్‌ లభించనుంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో అల్ట్రా గేమ్ మోడ్, మోషన్ కంట్రోల్స్ లాంటి గేమింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి కెమెరా&nbsp; iQOO Z7s 5G ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. ఇందులోని ప్రైమరీ కెమెరా 64MP కలిగి ఉంది. ఇది ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) ఫీచర్‌తో వస్తోంది. బ్యాక్‌ కెమెరా సెటప్‌లో 2MP Bokeh కెమెరా కూడా ఉంది. ఫ్రంట్‌ కెమెరాను 16 MPతో తీసుకొచ్చారు. దీనితో నాణ్యమైన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.&nbsp; బ్యాటరీ iQOO Z7s 5G ఫోన్‍ను 4,500mAh బ్యాటరీతో రూపొందించారు. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్‌&nbsp; సపోర్ట్ చేస్తుంది. 23 నిమిషాల్లోనే 50 శాతం మేర ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చని ఐక్యూ కంపెనీ ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.&nbsp; కలర్స్‌ iQOO Z7s 5G ఫోన్‍ రెండు రంగుల్లో మార్కెట్‌లో లభ్యమవుతోంది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. ధర ఎంతంటే? iQOO Z7s 5G ఫోన్‌.. అమెజాన్‌తో పాటు ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 6GB RAM + 128GB వేరియంట్‌ ధర రూ.18,999గా ఉంది.&nbsp; 8GB RAM + 128GB మోడల్‌ను రూ.19,999 కొనుగోలు చేయవచ్చు. Buy Now ఆఫర్లు iQOO Z7s 5G ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.&nbsp;
    మే 22 , 2023
    iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
    iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మే 23న iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే దీన్ని మెుదట చైనాలో తీసుకొస్తామన్న ఐక్యూ.. ఆ తర్వాత భారత్‌లోనూ లాంచ్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఐక్యూ ఫోన్లకు మార్కెట్‌లో మంచి బ్రాండ్ ఉండటంతో కొత్తగా రాబోయే స్మార్ట్‌ఫోన్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో iQoo Neo 8 ప్రత్యేకతలు ఏంటీ? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇందులో ఏమున్నాయి? ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.&nbsp; ఫోన్ డిస్‌ప్లే iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల స్కీన్‌తో రానుంది. దీనిని 1.5K AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్‌ రేటుతో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌ పనిచేస్తుంది.&nbsp; ఫోన్‌ స్టోరేజ్‌ iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 16GB RAMతో తీసుకొస్తున్నారు. ర్యామ్‌ కేపాసిటీ అధికంగా ఉండటంతో ఈ ఫోన్‌ చాలా ఫాస్ట్‌గా పనిచేయనుంది. అలాగే ఫోన్‌ 256GB ఇంటర్నల్‌&nbsp; స్టోరేజీని కలిగి ఉంది. Micro SD కార్డుకు కూడా ఇది సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రొసెసర్‌ వర్క్ చేస్తుంది.&nbsp; కెమెరా&nbsp; iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 50MPతో వస్తోంది. ఈ ఫోన్ అల్ట్రావైడ్‌, డెప్త్‌ సెన్సార్లతో బ్యాక్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్‌ వైపు 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. దీనితో క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు, వీడియోలు తీసుకోవచ్చు. బ్యాక్‌ కెమెరాకు ఫ్లాష్‌ లైట్‌ను కూడా జోడించారు.&nbsp; బ్యాటరీ iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్&nbsp; 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అధిక బ్యాటరీ సామర్థ్యం వల్ల ఫోన్‌ ఛార్జింగ్‌ లైఫ్‌ ఎక్కువగా ఉండనుంది.&nbsp; 5G సపోర్ట్‌ iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 5Gతో తీసుకొస్తున్నారు. అలాగే డ్యూయల్ 4G VoltE, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్‌తో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ బరువుతో విడుదల చేయనున్నట్లు సమాచారం. కలర్స్‌ iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ రెండు వర్షన్‌లలో తీసుకుస్తున్నారు. ఈ ఫోన్‌ iQoo నియో 8, iQoo నియో 8 proగా రానుంది. బ్లాక్‌, గోల్డ్‌ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; ధర ఎంతంటే? iQOO Neo 8 ఫోన్‌&nbsp; భారత్‌లో ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని రూ. 44,990కు విక్రయించవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మే 23న క్లారిటీ రానుంది.&nbsp;
    మే 17 , 2023
    Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?
    Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 02 , 2023
    <strong>Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!</strong>
    Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!
    తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్‌ ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి దీక్ష విరమించారు. అనంతరం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో డీఎంకే, ఉదయనిధి సోషల్‌ మీడియా వింగ్‌ పవన్‌ను టార్గెట్‌ చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి తెరలేపింది. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ సైతం రంగంలోకి దిగి ఉదయనిధి ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు డీఎంకే సోషల్‌ మీడియా విభాగం పూర్తిగా వెనక్కి తగ్గింది. నిన్నటి వరకూ పవన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేసిన పలు అకౌంట్లు ప్రస్తుతం క్లోజ్‌ అయ్యాయి. చెన్నైలోని తమ హాస్టల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన సనాతన ధర్మం గురించే చర్చ జరుగుతోందంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. దీనంతటికీ కారణం పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే ఒక సీటుకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పాడు. https://twitter.com/Deepika_JSP/status/1843293613029200362 పవన్‌పై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌ను సైతం సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లూజర్‌ అయిన ప్రకాష్‌ రాజ్‌ ఆంధ్రాలో రెండో అతిపెద్ద పార్టీ అధినేత పవన్‌కు రాజకీయాలపై సలహాలు ఇవ్వడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఓ సైకియార్టిస్టును కలిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. అంతేకాదు 2019లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ప్రకాష్‌ రాజ్‌ ఏ విధమైన ఘోర ఓటమిని చవి చూశారో గుర్తుచేస్తున్నారు. https://twitter.com/nrkaravindh/status/1843349508127916391 పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం నినాదాన్ని ఖండిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తుల నిజ స్వరూపాలను సైతం ఫ్యాన్స్ బట్టబయలు చేస్తున్నారు. We Dravidians 2.0 అకౌంట్‌ నుంచి పవన్‌పై తీవ్ర అసభ్యకర పోస్టు వచ్చింది. అయితే ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తి వేరే మతస్తుడని, పైగా మలేసియా పౌరసత్వం తీసుకున్నాడని ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టారు. ద్రవిడియన్స్‌ ముసుగులో సనాతన ధర్మపై యుద్దం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.&nbsp; https://twitter.com/HPhobiaWatch/status/1843251985178657133 పవన్‌ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున We Dravidians 2.0 పేజీని టార్గెట్‌ చేయడంతో వారిని తట్టుకోలేక అడ్మిన్‌ తన పేజీను క్లోజ్ చేసుకున్నాడు. ఎగిరెగిరి పడ్డ సీఎంనే 11 సీట్లకు పరిమితం చేశాడని, అంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/lyf_a_zindagii/status/1843309397952598086 https://twitter.com/Nanda_927/status/1843287653699211585 పవన్‌ కంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ బాగా చదువుకున్నాడని చేస్తోన్న ట్రోల్స్‌కి ఫ్యాన్స్‌ గట్టిగానే బదులిస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన పవన్‌.. చెన్నై వరదల సమయంలో రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడని గుర్తు చేశారు. మరి బాగా చదువుకున్న ఉదయనిధి  ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాది బిన్‌లాడెన్‌ కూడా సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాడని, కానీ ఎన్నో బిల్డింగులను బాంబులతో కూల్చి వేశాడని గుర్తు చేశారు. https://twitter.com/parandhamdalit/status/1842842605828415846 ఉదయ నిధి స్టాలిన్‌ ఐటీ సెల్‌ను ధీటుగా ఎదుర్కొవడం ద్వారా సోషల్‌ మీడియాలో మరోమారు పవన్‌ కల్యాణ్‌ సత్తా ఏంటో నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ ఐకమత్యంగా ఏర్పడి పవన్‌ వ్యకతిరేక శక్తులను తిప్పికొట్టారని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/lordshivom/status/1843026533906059587 పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లాలంటే అతడి ఊర మాస్‌ ఫ్యాన్స్‌ను దాటుకొని వెళ్లాలంటూ ఓ అభిమాని పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.&nbsp; https://twitter.com/i/status/1843210460226867648 https://twitter.com/PK_Addicts/status/1843004204392088060 ఏపీలో ఒకప్పటి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని, మాజీ సీఎం జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా ఓడించాడో చూడంటూ పెట్టిన వీడియో సైతం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.  https://twitter.com/i/status/1843210675512086692 https://twitter.com/JSPGovtIn2024/status/1843221542920159417 ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూపై తమిళ యూట్యూబ్‌ ఛానెల్ రీసెంట్‌గా ఓ పోల్‌ నిర్వహించింది. ఈ వ్యవహారంలో పవన్‌కే ఏకంగా 89 శాతం మంది మద్దతు లభించింది.&nbsp; https://twitter.com/_MSD_VK/status/1842860646544630155
    అక్టోబర్ 08 , 2024
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్‌! బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్‌ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ప్రోమోలో ఏముందంటే? సెకండ్‌ సాంగ్‌ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్‌ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్‌ సెట్‌లో రష్మిక మేకప్‌ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&amp;t=19sv పూర్తి సాంగ్‌ ఎప్పుడంటే? పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.&nbsp; ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.&nbsp;
    మే 23 , 2024
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.&nbsp; https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.&nbsp; గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.&nbsp; https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.&nbsp; వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.&nbsp; లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.&nbsp; అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.&nbsp; కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
    మే 08 , 2023
    ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఐదుగురు భారతీయలు ఎవరో తెలుసా?
    ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఐదుగురు భారతీయలు ఎవరో తెలుసా?
    ]బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గుల్జర్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు.
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?</strong>
    The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?
    నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్‌, అశుతోష్‌ రానా, పావని రెడ్డి, కేశవ్‌ దీపక్, సుధా, భానుచందర్‌ తదితరులు డైరెక్టర్‌: అనిష్‌ కురువిల్లా సినిమాటోగ్రఫీ : నవీన్‌ యాదవ్‌ సంగీతం : శక్తికాంత్‌ కార్తిక్‌ ఎడిటింగ్‌: ఉమైర్‌ హాసన్‌, ఫయాజ్‌ రాయ్‌ నిర్మాతలు: గోపిచంద్‌ ఆచంట, రామ్ ఆచంట ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్‌ అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్‌ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్‌ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్‌ సేన్‌ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్‌ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్‌ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్ట‌ర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్‌, నందు, అశుతోష్‌ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్ట‌రీ ఛేదించేందుకు తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడిగా నందు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. క‌న్నింగ్ సైంటిస్ట్ పాత్ర‌కు అశుతోష్‌ రానా వంద‌శాతం న్యాయం చేశాడు. తేజ‌స్వి మ‌దివాడ, అక్ష‌ర గౌడ నటనతో కంటే తమ గ్లామ‌ర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచంద‌ర్‌, సోనియా అగ‌ర్వాల్‌, అజ‌య్ క‌తుర్వార్‌, స‌త్య‌కృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అనిష్‌ కురువిల్లా ఐలాండ్‌ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్‌, క్లాస్ ఇలా విభిన్న నేప‌థ్యాల‌తో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్ వెనుక ఓ తెలియ‌ని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హ‌త్య‌లు చేస్తున్నారు? ఒక‌రిని మ‌రికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వ‌ర‌కు ఐలాండ్ గురించి అనేక ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్‌, బోల్డ్‌ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్‌ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్‌ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్‌ తప్పకుండా నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ వర్క్‌ బాగుంది. బీచ్‌ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్‌ సెటప్‌ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనఆసక్తికర కథనంట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ బోల్డ్‌ కంటెంట్‌లెక్కకు మించిన పాత్రలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 21 , 2024
    TOLLYWOOD ITEM SONGS: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చేసిన టాప్ 10 ఐటెం సాంగ్స్ ఇవే…
    TOLLYWOOD ITEM SONGS: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చేసిన టాప్ 10 ఐటెం సాంగ్స్ ఇవే…
    ]సమీర - కృష్ణం వందే జగద్గురుమ్కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలోని ‘బళ్లారి బావ’ పాటకు సై అంటూ చిందులేసింది సమీర. హోమ్‌లీగా కనిపించే సమీర.. ఈ పాటలో హాట్ అందాలతో వేడి పుట్టించింది.
    ఫిబ్రవరి 17 , 2023
    సినిమాల్లోకి స్నేహరెడ్డి: ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎలా ఎదిగింది?
    సినిమాల్లోకి స్నేహరెడ్డి: ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎలా ఎదిగింది?
    ]స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
    ఫిబ్రవరి 11 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    HBD RAPO: ఈ&nbsp; 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్‌ స్టార్‌ను చేసింది!
    టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో అనగానే ముందుగా రామ్‌ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్‌, యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా ప్రతీదానిలోనూ రామ్‌ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్‌ పోతినేని ఒకరు. తెరపై రామ్‌ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్‌’తోనే తానేంటో రామ్‌&nbsp; నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్‌ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీసిన పాటలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. బుల్లెట్ (వారియర్) రామ్‌ పోతినేని - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా వారియర్‌. దేవిశ్రీ ఇచ్చిన సంగీతానికి రామ్‌ స్టెప్పులు తోడు కావడంతో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ రిబ్బన్‌ పట్టుకొని వేసే హుక్‌ స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు హీరోయిన్‌ కృతి శెట్టి కూడా రామ్ ఎనర్జీని మ్యాచ్‌ చేస్తూ అదరగొట్టింది.&nbsp; https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 2. ఇస్మార్ట్ టైటిల్‌ సాంగ్ (ఇస్మార్ట్‌ శంకర్‌) ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోని ‘ఇస్మార్ట్‌’ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో రామ్‌ ఫుల్‌ ఎనర్జీతో డ్యాన్స్‌ చేశాడు. కొత్త కొత్త స్టెప్పులతో వీక్షకుల మతి పొగొట్టాడు. శరీరాన్ని స్పింగ్‌లా తిప్పుతూ అలరించాడు. ముఖ్యంగా చార్మినార్‌ ముందు మోకాళ్లపై చేసే స్టెప్పు ట్రెండ్‌ సెటర్‌గా నిలిచింది.&nbsp; రామ్ బెస్ట్‌ డ్యాన్సింగ్‌ వీడియోల్లో ‘ ఇస్మార్ట్‌’ పాట కచ్చితంగా టాప్‌-5లో ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Ox4ih-vJu7E 3. వాట్‌ అమ్మా (ఉన్నది ఒకటే జిందగీ) రామ్‌ డ్యాన్స్‌ అంటే స్పీడు స్టెప్పులకు పెట్టింది పేరు. అటువంటి రామ్‌ స్లో డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ‘వాట్‌ అమ్మా’ అనే పాటలో రామ్‌ డ్యాన్స్‌ అప్పటివరకూ చేసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా సాగే పాటకు తగ్గట్లు స్టెప్పులు వేసి రామ్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా చేశారు. https://www.youtube.com/watch?v=UbrbvbA3yD4 4. డిచుకు డిచుకు డంకా (రెడ్‌) రెడ్ సినిమాలోని &nbsp;డిచుకు డిచుకు డంకా ఐటెం సాంగ్‌లో రామ్‌ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఐటెం డాల్‌ హెబ్బపటేల్‌ను టీజ్‌ చేస్తూ సాగే ఈ పాటలో రామ్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఈ పాట యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. https://www.youtube.com/watch?v=2BxxwJiqI_w 5. కల్లోకి దిల్లోకి (మస్కా) రామ్‌ - హన్సిక జంటగా చేసిన మస్కా సినిమా తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని అన్ని పాటలు అప్పట్లో యమా క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా కల్లోకి దిల్లోకి పాట ప్రతీ ఫంక్షన్లలో వినిపించేది. ఇందులో రామ్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సాంగ్‌కు తగ్గట్లే ఫుల్‌ జోష్‌తో స్టెప్పులు వేశాడు. ఇందులో మోకాళ్ల మీద వేసే స్టెప్పులు.. ట్రైనింగ్‌ లేకుండా వేయవద్దని సాంగ్‌లో స్క్రోల్‌ కూడా వచ్చింది. https://www.youtube.com/watch?v=cKpNVmAs-b0
    మే 15 , 2023

    @2021 KTree