UTelugu2h 33m
ఒక ఆర్మీ జవాను భార్య జానకి తన కొడుకు, కుమార్తెతో కలిసి ఒక గ్రామంలో జీవిస్తుంటుంది. ఓ రాత్రి తాగుబోతు వ్యక్తి ఆమెను వేధించడానికి ప్రయత్నించినప్పుడు జానకి కొడుకు అతడ్ని గొడ్డలితో నరుకుతాడు. దీంతో ఆ కుటుంబం సమస్యల్లో పడుతుంది. ఇంతకు తన కొడుకును ఆ హత్య కేసు నుంచి జానకి కాపాడుకుందా? ఇంతకు ఆ తాగుబోతు ఎవరు అనేది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
కృష్ణ
టైగర్ ప్రకాష్రజనీకాంత్
ఇన్స్పెక్టర్ భాస్కర్గీతా కాదంబీ
హేమమాధవి
సౌకార్ జానకి
జానకిఅల్లు రామలింగయ్య
తిరుపతయ్యకవిత
రాజీనాగభూషణం
గిరి బాబు
శంకర్చలం
ప్రభాకర్
సాక్షి రంగారావు
దాసుసిబ్బంది
K. S. R. దాస్
దర్శకుడుపి.ఎస్. వాసన్నిర్మాత
సత్యం
సంగీతకారుడుకథనాలు
HBD Rajinikanth: రజనీకాంత్ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్ స్టార్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నందమూరి తారకరామారావుతో..
టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్ రెంటో కథానాయకుడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా హీరోలుగా ‘ఖూన్ పసీనా’ పేరుతో రీమేక్ చేశారు.
శోభన్ బాబుతో..
నట భూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్ బాబు, రజనీకాంత్ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ కృష్ణతో..
ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్’ (1978), ‘రామ్ రాబర్ట్ రహీమ్’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.
https://twitter.com/atheisttindian/status/1212794102867083265
డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో..
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.
అక్కినేని నాగార్జునతో..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్ షూట్ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు.
జగపతి బాబుతో..
రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.
https://twitter.com/SolidLover123/status/1562791842898669568
డిసెంబర్ 12 , 2024
Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!
ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్ కపుల్ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే?
మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్ రోల్‌లో చేసిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ కూాడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్ యూనిట్ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.
https://twitter.com/i/status/1770184438099410982
చైతు - సమంత మాట్లాడుకున్నారా?
అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1770045272049279412
అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి..
మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్ ఇండియా వెర్షన్’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల ఈ సిరీస్ పేరును మేకర్స్ ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.
https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
మార్చి 20 , 2024
త్వరలో ఒక్కటి కానున్న సమంత - విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు
సమంత - విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్‌గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్‌లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌లో తొలి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాందించి రౌడీ బాయ్‌గా ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తన యాటిట్యూడ్, టాకింగ్ నెస్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మూవీలతోనే కాకుండా సొంతంగా బిజినెస్‌లు ప్రారంభిస్తూ అందులోనూ రాణిస్తున్నాడు. ఇదే దారిలో సమంత కూడా పయనిస్తోంది.
సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే సమంత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకశాలు కొల్లగొడుతూ అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమళంలో దాదాపు అందరు అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
విజయ్ దేవరకొండ ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. యూత్‌లో క్రేజ్ సంపాదించిన విజయ్.. ఆ క్రేజ్‌ను తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించి ఈ రంగంలోనూ సక్సెస్ సాధించాడు.
సొంత బ్రాండ్ కావడంతో తానే ప్రకటనల్లో నటిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రౌడీ బ్రాండ్ మెన్స్‌వేర్‌కి యూత్‌లో మంచి డిమాండ్ ఉంది.
ఇక సామ్ గురించి చెప్పాలంటే.. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇంట్రెస్ట్‌తో 'సాకీ' అనే పేరుతో ఓ ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది సమంత. ఈ ఆన్ లైన్ స్టోర్ కోసం సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.
తన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వ్యాపార ప్రకటనల్లో పాల్గొనడం సామ్, విజయ్‌లో ఉన్న కామన్ పాయింట్. వీటితో పాటు బడా వ్యాపార సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించడమే కాకుండా సామాజిక స్పృహతో సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు ఇద్దరు స్టార్స్. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను రౌడి స్టార్ ప్రారంభించాడు. దీని ద్వారా నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్, ఇంగ్లిష్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
అలాగే కోవిడ్ టైంలో విజయ్ ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు నిత్యవసర సరకులను ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇక లెడీ బాస్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తోంది. ఈ ఫౌండేషన్ తరఫున ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను సామ్ ఆదుకుంటోంది.
అయితే వీరిద్దరు కలిసి ఓ కామన్ బ్రాండ్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రౌడీ బ్రాండ్‌తో విజయ్, సాకీ బ్రాండ్‌తో సమంత సొంత వ్యాపారాలు చేస్తుండగా ఈ రెండింటిని కలపడం లేదా , మరొ కొత్త బ్రాండ్‌తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారట.
ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరు జంటగా నటించిన ఖుషి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఖుషి మూవీ పాటలు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా విజయం ఇద్దరి స్టార్స్ కెరీర్‌కు కీలకం కానున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న విజయ్- సమంతలు ఈ చిత్రం సక్సెస్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఆగస్టు 31 , 2023
Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
చిరంజీవి ఎమోషనల్..
ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాకతో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాకపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20
అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు.
https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20
11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది..
చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది. రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.
డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం
తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హా అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది.
ఐకాన్ స్టార్ రాక..
రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/ANI/status/1671037419255373824?s=20
అటు చరణ్-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
జూన్ 20 , 2023
తెలుగు చిత్రాల్లో బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్స్
]Cream Section Separatorప్రత్యేకంగా శర్వానంద్, నిత్యమీనన్ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్.watch now
ఫిబ్రవరి 13 , 2023
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. లవ్, డేటింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఆ రోజున బయటపెడతా’
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు తెలుగుతోపాటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో మీరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ జాతీయ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. దీనిపై విజయ్ మాట్లాడుతూ ‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా’ అని విజయ్ సమాధానం ఇచ్చాడు.
వ్యక్తిగత జీవితంపైనా..
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం తరుచూ వార్తల్లో నిలవడంపైనా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. ‘పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. మీడియా, సోషల్ మీడియాల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఏదీ మనసుకు తీసుకోనని పరోక్షంగా తెలియజేశాడు.
ప్రేమపై షాకింగ్ కామెంట్స్
‘హద్దులు లేని ప్రేమ’ అనే బంధంపై మీ అభిప్రాయం ఏంటని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనిపై విజయ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’ అని విజయ్ తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ రష్మికను ఉద్దేశించి చేశాడా? అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికను అమితంగా ప్రేమించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నాకు అలాంటివాడే కావాలి: రష్మిక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక కాబోయో వాడు ఎలా ఉండాలో స్పష్టం చేసింది. 'నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా భద్రతనివ్వాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని తెలిపింది. అటు ప్రేమ గురించి సైతం మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు ఉండాలి’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
వచ్చే ఏడాదే పెళ్లి!
‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
డిసెంబర్ 19 , 2024
Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెప్పినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వారిద్దరు కలిసి విహారయాత్రలు, రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. రీసెంట్‌గా 'పుష్ప 2' కి సంబంధించి జరిగిన చెన్నై ఈవెంట్‌లో రష్మిక నేరుగా విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు హింట్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్ (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement)కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్ చేస్తోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ తర్వాత నిశ్చితార్థం?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. గత మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెంచేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 విడుదలైన డిసెంబర్ 5 తర్వాత ఏ క్షణమైన ఈ గుడ్‌న్యూస్ వినొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో రష్మిక, విజయ్ ఫ్యాన్స్ ఈ వార్త నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. అదే జరిగితే తమ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్స్ చేస్తున్నారు.
చెన్నై ఈవెంట్‌లో రష్మిక హింట్
కొద్దిరోజుల క్రితం చెన్నై వేదికగా జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్ ఈవెంట్‌లో రష్మిక మందన్న కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండతో లవ్ (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ‘మీకు చాక్లెట్ బాయ్ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్ అంటే ఇష్టం’ అని రష్మిక అన్నది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పిందని నెటిజన్లు చర్చించుకున్నారు.
https://twitter.com/BRKTelugu_1/status/1860986326138671208
విజయ్-రష్మిక రెస్టారెంట్ పిక్ వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అయ్యింది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేశారు. మరోమారు విజయ్ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెట్టారు.
https://twitter.com/celebspot8688/status/1860540536295424339
డేటింగ్‌పై లీక్ ఇచ్చేసిన విజయ్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల 'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్ షిప్ స్టేటస్ (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ 'VD12' ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు.
విజయ్ తమ్ముడితో చెప్పింది గుర్తుందా!
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా, ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని రష్మిక చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని ‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా’ అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది.
https://twitter.com/GulteOfficial/status/1795136777625403525
డిసెంబర్ 02 , 2024
Sasimadhanam Review: పేరెంట్స్ లేరని లవర్ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
నటీనటులు: పవన్ సిద్ధు, సోనియా సింగ్, రూపలక్ష్మి, ప్రదీప్ రాపర్తి, కృతిక, అశోక్ చంద్ర
దర్శకులు: వినోద్ గాలి
సంగీత దర్శకుడు: సింజిత్ యెర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్
ఎడిటర్ : అనిల్ కుమార్ పి
నిర్మాతలు : హరీష్ కోహిర్కర్
విడుదల తేదీ : జులై 4, 2024
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
వరంగల్‌కు చెందిన మదన్ (సిద్ధూ పవన్).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్ ఎలా మ్యానేజ్ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్ కథ.
ఎవరెలా చేశారంటే
సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే..
బోల్డ్, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్ లవ్‌స్టోరీ సిరీస్ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్ అయ్యారు. రొటీన్ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్ పరంగా రిఫ్రెష్‌మెంట్ ఫీల్ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. కథలో రెండో లవ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్నప్పటికీ.. అది మెయిన్ కథకు చాలా వరకు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్రమిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్ కామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీసెకండ్ లవ్ ట్రాక్‌కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
జూలై 04 , 2024
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
ఈ జనరేషన్ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun), రామ్‌చరణ్ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్.. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
‘పుష్ప 2’ వాయిదా
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
రేసులో గేమ్ ఛేంజర్!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని దిల్‌రాజు ఫిక్స్ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్ బరిలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అల్లు vs మెగా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు ఆర్మీ సవాల్
ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్‌ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/madhavg_Indian/status/1801862004627366096
https://twitter.com/madhavg_Indian/status/1801824969023758738
https://twitter.com/DpAadhf/status/1785639853717082162
జూన్ 18 , 2024
Payal Rajput: ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్ రాజ్‌పుత్… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
RX 100 కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్ పెట్టి పాయల్ రాజ్‌పుత్ టాప్ లెస్ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది.
పాయల్ రాజ్‌పుత్ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.
ఆ సినిమా తర్వాత RDX లవ్, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది పాయల్. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.
సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి షేక్ చేసింది.
ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్ పిక్స్ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్.
సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్ ఎదుర్కొంది ఈ హీరోయిన్.
జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.
మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
RX 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.
ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
అజయ్ భూపతి రిలీజ్ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.
ఏప్రిల్ 25 , 2023
Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం.
గౌతమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
మహాధన్
చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు.
అకీరా నందన్
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
సితార
మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు.
అల్లు అర్హ
అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.
అరియానా, వివియానా
మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
అయాన్, అభిరామ్
అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఏప్రిల్ 19 , 2023
VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు.
గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం. ఈ ఇద్దరి నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.
అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్ ఫింగర్ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు.
https://twitter.com/PrasadAGVR/status/1540383278166814720?s=20
ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది.
మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మార్చి 29 , 2023
'Phalana Abbayi Phalana Ammayi' Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ…
నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది. వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం.
దర్శకుడు: అవసరాల శ్రీనివాస్
నటీ నటులు: నాగశౌర్య, మాళవిక నాయర్
సంగీతం: కల్యాణ్ మాలిక్
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా
కథేంటి?
సంజయ్ ( నాగశౌర్య ), అనుపమ ( మాళవిక నాయర్ ) మధ్య జరిగే లవ్, రొమాంటిక్ డ్రామా. కొన్నేళ్ల పాటు స్నేహంతో కలిసి ఉన్న ఈ ఇద్దరూ ప్రేమించుకోవటం, తర్వాత వాళ్ల మధ్య ఎదురయ్యే సమస్యలు, విడిపోవటం చివరకు మళ్లీ కలుసుకోవటం అనే సింపుల్ కథ.
ఎలా ఉందంటే?
కళాశాల నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభించి ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చేందుకు అవసరాల ప్రయత్నించాడు. పాత్రల పరిచయం సింపుల్‌గా చేసి తన మార్క్ చూపించాడు.
హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. కథనం చాలా నెమ్మదిగా సాగుతుందని సగటు ప్రేక్షకులకు అనిపిస్తుంది.
ప్రేక్షకులు పూర్తిగా ఇబ్బంది కలగకుండా కామెడీతో కవర్ చేయాలని చూశాడు దర్శకుడు. అవి కొంత మేరకు మాత్రమే మెప్పిస్తాయి. అన్ని చోట్ల నవ్వులు పూయించకపోవటంతో ప్రేక్షకులకు ఆ భావన పోదు.
దాదాపు 10 సంవత్సరాలు కలిసి ఉన్న జంట కొన్ని అనుకోని కారణాలతో విడిపోవటంతో ఇంటర్వెల్‌కు చేరుతుంది. ఫస్టాఫ్ ముగిసే సరికే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.
సెకాండాఫ్‌లోనూ కథనంలో వేగం లేదు. క్లైమాక్స్‌ను చిన్న సింపుల్ పాయింట్‌తో ముగించేశాడు అవసరాల శ్రీనివాస్.
సాంకేతికంగా
చిత్రం మెుత్తం నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరుగుతుంది. వీళ్లిద్దరూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరూ మరోసారి నటనలో తమ ప్రతిభ చూపించారు.
నాగశౌర్యతో క్లాసిక్ హిట్స్ తీసిన అవసరాల శ్రీనివాస్‌కు ఓవర్సీస్‌లో మంచి పేరు ఉంది. కానీ, అక్కడ కూడా ప్రేక్షకులను సినిమా నిరాశపర్చింది.
సినిమా చూసిన వాళ్లందరూ చాలా స్లోగా ఉందని చెబుతున్నారు. అవసరాల ఈ సారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయలేదని చెప్పవచ్చు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో ఏదైనా బాగుందంటే అది కళ్యాణ్ మాలిక్ సంగీతం మాత్రమే. ఇందులో ఉన్న రెండు పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. బీజీఎం కూడా బాగుంది.
సునీల్ కుమార్ నామా సినిమాటోఫ్రీతో, కిరణ్ గంటి ఎడిటింగ్‌లో అద్భుతం అనిపించారు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ల నైపుణ్యంతో రాబట్టగలిగారు.
బలాలు
నాగశౌర్య, మాళవిక నాయర్
సంగీతం
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్
బలహీనతలు
స్లో నరేషన్
రేటింగ్ : 2.5/5
ఊహలు గుసగుసలాడే వంటి చిత్రాన్ని చూద్దామనే అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు.
మార్చి 17 , 2023
సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ
ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్‌లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.
ట్విటర్ వార్
గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ ఏదో విధంగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
హ్యాష్‌ట్యాగ్స్‌తో హల్‌చల్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.
https://twitter.com/i/status/1632680528578228224
అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన స్క్రీన్ షాట్లు తీసి తెగ షేర్ చేశారు.
(1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter
షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్‌లో ట్రెండ్ చేయగా.. వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20
యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1633007975412400132
టైటిల్‌పై రచ్చ
మరోవైపు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్‌లో RC15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్‌తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు
RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టైటిల్ ఇదేనా?
సినిమా టైటిల్ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1633351074508845058
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/i/status/1633737854919606273
ఫ్యాన్స్ నిరాశ
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్‌రాజు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
మార్చి 09 , 2023
Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?
నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు.
దర్శకుడు : పవన్ సుంకర
సంగీత దర్శకుడు : టి.ఆర్. కృష్ణ చేతన్
సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్
ఎడిటర్: నరేష్ అదుప
నిర్మాత : సైర్ధర్ మారిస
ఓటీటీ వేదిక: ఈటీవీ విన్
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ ఫిల్మ్ 'లీలా వినోదం' (Leela Vinodham Review). పవన్ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్'లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సినిమా కథ 2008లో జరుగుతుంటుంది. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. క్లాస్ మేట్ లీలా (అనగ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కాలేజీ అయిపోవడంతో ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకుంటారు. అలా సరదాగా రోజూ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రెండ్ రాజేష్ (మిర్చి శరణ్) హెల్ప్‌తో తన ప్రేమ విషయాన్ని లీలాకు చెబుతాడు ప్రసాద్. దీంతో లీలా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమె సైడ్ నుంచి ఒక్క మెసేజ్ గానీ, ఫోన్ కాల్ గానీ రాదు. లీలా ఎందుకు రిప్లే ఇవ్వలేదు? అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు? అతడి ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రసాద్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అతడు జీవించాడు. లవ్ సీన్స్‌లో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ను ఇంప్రెస్ చేస్తాయి. 2008 కాలంలో అబ్బాయిలు ప్రేమ విషయంలో ఎంత బిడియంగా ఉండేవారో తన నటనతో కళ్లకు కట్టాడు. హీరోయిన్ అనగ అజిత్ కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్ పాత్రలు చేసిన మిర్ఛి శరణ్, ప్రసాద్ బెహరా తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు పవన్ సుంకర స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిడ్ ఏజ్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా 30+ ఉన్న వారు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమ టీనేజ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో యువకులు ఎంత ఇబ్బంది పడతారో దర్శకుడు బాగా చూపించాడు. చాటింగ్ చేసుకునే సీన్స్‌ను కూడా చక్కగా తెరకెక్కించారు. మిర్ఛి శరణ్, ప్రసాద్ బెహరా పాత్రలతో కామెడీని రాబట్టాడు. అయితే రొటీన్ స్టోరి, ఆసక్తి లేని కథనం సినిమాకు మైనస్‌గా మారాయి. చాటా చోట్ల కథ నెమ్మదిగా, అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలిగింది. ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది. ఆమని, గోపరాజు రమణ, రూపలక్ష్మీ వంటి సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలకు ప్రాధాన్యం లేదు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Leela Vinodham Review In Telugu) సినిమాటోగ్రఫీ బాగుంది. అనుష్ కుమార్ తన కెమెరా పనితనంతో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. టి.ఆర్. కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది. అతడు ఇచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు చాలా ప్లెజెంట్‌గా సాగిపోయాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
షణ్ముఖ్, అనగ అజిత్ నటనవింటేజ్ లవ్ సీన్స్‌కామెడీ
మైనస్ పాయింట్స్
అసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 19 , 2024
Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ (Raees) సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ (Mahira Khan), తొలి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ సక్సెస్‌ను తగిన విధంగా కెరీర్‌లో కొనసాగించలేకపోయారు. మహిరా కెరీర్‌కి బాలీవుడ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాలు అర్థాంతరంగా తన కెరీర్‌ను ముగించేలా చేశాయి. ముఖ్యంగా, 2017లో నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు మహిరా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపించాయి.
నాటి ఫోటోలపై మహిరా స్పందన
తాజాగా మహిరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు ఓ ప్రముఖ మీడియా ‘ది లిటిల్ వైట్ డ్రెస్’ అనే టైటిల్‌తో ఆర్టికల్ రాసింది. దానిలో నాకు సంబంధించి వచ్చిన వార్తలు చదివినప్పుడు మొదట ఆ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయా. ‘పాకిస్థాన్ నుంచి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటి ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గడం ఏమిటి?’ అనే వాక్యం చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నా కెరీర్ ముగిసిపోతుందా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు.
వ్యక్తిగత జీవితంపై ప్రభావం
‘‘ఆ ఫోటోల కారణంగా నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో విడాకులు పొందాను, సింగిల్ పేరెంట్‌గా జీవించాను. రోజూ ఆత్మన్యూనతతో బాధపడుతూనే ఉండేదాన్ని. అయితే, ఆ కష్టసమయాల్లో నాకు అభిమానుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది’’ అని మహిరా పేర్కొన్నారు.
రణ్‌బీర్‌తో లీకైన ఫొటోల వివాదం
2017లో న్యూయార్క్‌లో రణ్‌బీర్ కపూర్‌తో మహిరా దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా కనిపించడంతో పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని బాలీవుడ్‌లో గాసిప్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ సంఘటన తరువాత మహిరా బాలీవుడ్‌లో మరే సినిమాలోనూ కనిపించలేదు.
వ్యక్తిగత జీవితం
మహిరా ఖాన్ ఆమె స్నేహితుడు అలీ అస్కారీని వివాహమాడి, 2015లో విడిపోయారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మహిరా వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌ను 2023లో వివాహమాడారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా శాంతియుత జీవితం గడుపుతున్నారు.
మహిరా ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ తన అభిమానుల ప్రేమ, మద్దతు ఎప్పటికీ తనతో ఉంటుందని అభిప్రాయపడింది.
డిసెంబర్ 17 , 2024
Unstoppable: బాలయ్య షోలో రియల్ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!
నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో దూసుకు వెళ్తోంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి చేయగా ఆ తర్వాత నుంచి స్టార్ హీరోలు వేదికపై మెరిశారు. ఇప్పటివరకూ దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్ ఈ షోలో పాల్గొని బాలయ్యతో తమ సీక్రెట్స్ పంచుకున్నారు. ఇప్పుడు ఈ వేదికపై స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)తో పాటు, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
‘రీల్ అండ్ రియల్ జాతిరత్నం’
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ (Unstoppable) సీజన్ 4లో స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఎపిసోడ్ సైతం బాలయ్య సిద్ధం చేశారు. ఈసారి స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి బాలయ్యతో ముచ్చట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు షోలో పాల్గొన్న ఫొటోను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో జాతిరత్నాలు ఫోజు పెట్టి నవీన్ నవ్వులు పూయించాడు. ఇందులో బాలయ్య శ్రీలీలకు గిఫ్ట్ ఇస్తుండగా దూరంగా నిలబడి చేత్తో దాన్ని పట్టుకుంటున్నట్లు నవీన్ పోలిశెట్టి నిలబడ్డాడు. అచ్చం ఇలాగే జాతిరత్నాలు సినిమాలోనూ నవీన్ పోలిశెట్టి చేశాడు. దీంతో ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఆహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'రీల్ అండ్ రియల్ జాతిరత్నం ఆఫ్ ఇండియా' అంటూ రాసుకొచ్చింది.
కారణం ఏమైనా ఉందా?
బాలయ్య టాక్ షో (Unstoppable)కు వచ్చిన మెజారిటీ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. మరికొందరు సింగిల్‌గానే షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా గడిపారు. అయితే ఈసారి ఎపిసోడ్‌లో శ్రీలీల - నవీన్ పోలిశెట్టి ఇద్దరూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వారిద్దరు కలిసి ఏ సినిమా చేయడం లేదు. గతంలో ఓ సినిమా పట్టాలెక్కుతున్నట్లు వార్తలు వచ్చినా అది వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో పర్టిక్యూలర్‌గా ఈ యువ హీరో, హీరోయిన్‌నే బాలయ్య పిలవడానికి కారణం ఏమైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిని బాలయ్య అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కొంటే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక అల్లాడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎపిసోడ్ రిలీజయ్యాక ఆ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
https://twitter.com/i/status/1861348565508862042
https://twitter.com/iam_NBKCult/status/1861306464893026701
100% ఫన్ పక్కా
నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఏ విధంగా నవ్వులు పూయిస్తాడో బయట కూడా అదే విధంగా గిలిగింతలు పెడుతుంటాడు. ఏమాత్రం తడుముకోకుండా జోక్స్ వేస్తూ నవ్విస్తుంటాడు. మరోవైపు బాలయ్య అన్‌స్టాబుల్ షో ద్వారా తనలోని కామెడీ టైమింగ్‌కు మరింత పదును పెట్టారు. సరదా క్వశ్చన్స్ వేస్తూ సెలబ్రిటీలను ఇరాకటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి ఒకే షోలో ఎదురుపడుతుండటంతో ఆ ఎపిసోడ్ కామెడీకి కేరాఫ్‌గా మారిపోతుందని నెటిజన్లు అంచనావేస్తున్నారు. 100% పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుర్ర హీరోను బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ శుక్రవారం (నవంబర్ 29) ఈ ఎపిసోడ్ (Unstoppable) స్ట్రీమింగయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్..
గతేడాది నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సక్సెస్ తర్వాత నవీన్ ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌లో చేతికి ఫ్రాక్చర్ కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నయం కావడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు శ్రీలీల విషయానికి వస్తే నితీన్‌తో చేసిన 'రాబిన్‌హుడ్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నవంబర్ 28 , 2024
Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్ కపూర్ ప్లేట్ ఫిరాయించాడా!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్’ (Animal). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో అనేక విమర్శలను సైతం మూటగట్టుకుంది. తీవ్ర హింసతోపాటు పలు సీన్స్‌లో మహిళను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి ఈ విమర్శలపై రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
‘అది నా బాధ్యత’
గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడారు. ‘యానిమల్ (Animal) విషయంలో అందరి అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం తమ బాధ్యతని రణ్‌బీర్ అన్నారు. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. నటీ నటులకు ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను యానిమల్ సినిమా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మూవీ గురించి విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/IFFIGoa/status/1860953456476835977
అలా చెప్పకుండా తప్పుచేశారా?
‘యానిమల్’ గురించి రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. విమర్శకుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పడం తమకు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓ రకంగా వారికి మద్దతు తెలియజేయడమేనని అభిప్రాయపడుతున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని రణ్‌బీర్ నేరుగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలా కాకుండా ‘కర్ర ఇరగొద్దు.. పాము చావొద్దు’ అన్న విధంగా రణ్‌బీర్ వ్యాఖ్యలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఎనిమిది రోజులపాటు..
గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) (IFFI) వేడుకగా జరుగుతోంది. నవంబర్ 20న ప్రారంభమైన ఈ వేడుక నవంబర్ 28 వరకు జరగనుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్ దిగ్గజాలను నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు రణ్‌బీర్ తన ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశమంతా రాజ్‌కపూర్ సినిమాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే వారి సినిమాల గురించి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు.
ఇద్దరూ బిజీ బిజీ
‘యానిమల్’తో సాలిడ్ విజయాన్ని అందుకున్న సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే నెల డిసెంబర్‌లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుంది. మరోవైపు ‘యానిమల్’ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామయణ’ (Ramayana) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా ఆయన చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
నవంబర్ 25 , 2024
Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్ కన్ఫార్మ్ చేసిన రష్మిక.. పెళ్లిపై కూడా హింట్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'పుష్ప 2' (Pushpa: The Rule). ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. మరో పది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో ఐటెం సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బన్నీ, రష్మిక, శ్రీలీల సహా ‘పుష్ప 2’ టీమ్ అంతా హాజరయ్యింది. ఈ క్రమంలో రష్మిక చేసిన కామెంట్స్ ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండతో రిలేషన్, పెళ్లి గురించి ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక ఏమన్నారంటే?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక మందన్న (Rashmika Mandanna) లవ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జోడి చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. ఈ క్రమంలో చెన్నై వేదికగా జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్‌లో తామిద్దరం లవ్‌లో ఉన్నట్లు రష్మిక పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా ఫటా ఫట్ ఆన్సర్స్ ఇచ్చేసింది. ‘మీకు చాక్లెట్ బాయ్ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్ అంటే ఇష్టం’ అని రష్మిక బదులిచ్చింది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో అందరూ అనుకున్నట్లుగానే రౌడీ బాయ్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాని రష్మిక హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
https://twitter.com/BRKTelugu_1/status/1860986326138671208
మళ్లీ దొరికేసిన విజయ్-రష్మిక!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇద్దరూ కలిసే డిన్నర్లు, పర్యటనలు కూడా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మరోమారు విజయ్ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/celebspot8688/status/1860540536295424339
గతంలోనే క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో రష్మికను ఆనంద్ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్ డాగ్ ఫొటోల్లో విజయ్ పెట్ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్మార్ట్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్ కో-స్టోర్ ఎవరు అని ఆనంద్ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్ తీసుకొని “ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్ వెంటనే రౌడీ, రౌడీ స్టార్ అని అరడవంతో రౌడీ బయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది.
https://twitter.com/GulteOfficial/status/1795136777625403525
డేటింగ్ గురించి ఒప్పుకున్న విజయ్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల 'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ 'VD12' ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబర్ 5న ఇది విడుదల కానుంది.
నవంబర్ 25 , 2024
Unstoppable 4: బాలయ్యతో తన వీక్‌నెస్ చెప్పిన బన్నీ.. పెద్ద సమస్యే ఇది!
అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ (Unstoppable 4) షోకి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో పలు ఆసక్తికర విషయాలను బన్నీ పంచుకోగా అవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్‌కు పార్ట్ 2 కూడా ఉంటుందని అహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా పార్ట్ 2కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తన పిల్లలు అల్లు అర్హా, అల్లు అయాన్‌తో పాల్గొనడం విశేషం. అయితే తొలి ఎపిసోడ్‌లో లాగానే ఇందులోనూ పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం ఇచ్చారు. అటు బన్నీ పిల్లలకు సైతం బాలయ్య క్యూట్ ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన వీక్‌నెస్‌ను బాలయ్య ఎదుట అల్లు అర్జున్ రివీల్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
బన్నీ సమస్య ఏంటంటే?
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్‌తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు ఆహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తనను ఎంతోకాలంగా వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రస్తావించారు. 'నీలో నువ్వు మార్చుకుందాం అనుకుంటుంది ఏంటి?' అన్న బాలయ్య ప్రశ్నకు బన్నీ సమాధానం ఇస్తూ 'ఇకపై తొందరగా పడుకొని నాలుగున్నర, ఐదు గంటల కల్లా లేవాలి' అని చెప్తాడు. దీన్ని బట్టి లేటుగా పడుకోని పొద్దెక్కే వరకూ లేగకపోవడం బన్నీకి అలవాటని తెలుస్తోంది. దీనిని వీలైనంత త్వరగా మార్చుకోవాలని బన్నీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రయత్నంలో బన్నీ సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
https://twitter.com/i/status/1858729413354897916
బాలయ్యను ఫిదా చేసిన అర్హా!
అల్లు అర్జున్ (Allu Arjun) పార్ట్ 2 ఎపిసోడ్ (Unstoppable 4)లో అల్లు అర్హ (Allu Arha), అల్లు అయాన్ (Allu Ayaan) పాల్గొని సందడి చేశారు. ఇద్దరూ షోలో అడుగుపెడుతూనే బాలయ్య పాదాలకు నమస్కరించడం ప్రోమాలో చూడవచ్చు. ఈ క్రమంలో బాలయ్య వీళ్లకు తెలుగు వచ్చా? అని బన్నీని ప్రశ్నిస్తారు. వెంటనే అల్లు అర్హ 'అటజని కాంచె పద్యం' చెప్పి బాలయ్య సహా షోలో ఉన్న వారందరినీ ఆశ్చర్య పరిచింది. పదో తరగతి తెలుగు సిలబస్‌లో ఉన్న ఈ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా అర్హ చెప్పడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. బాలయ్య సైతం అర్హను దగ్గరకు తీసుకొని అభినందించారు. బన్నీ తన వారసురాలికి తెలుగుపై పట్టు ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1858769410934403111
అయాన్.. యానిమల్ హీరో టైపు!
ప్రోమోలో అల్లు అయాన్ (Allu Ayaan)ను బాలయ్య (Unstoppable 4) ఆసక్తికర ప్రశ్న అడుగుతారు. ‘నాన్నకు నీకంటే చెల్లి మీదే ప్రేమ ఎక్కువ కదా?’ అని అయాన్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు అయాన్ 'ఏం కాదు' అని జవాబిస్తాడు. దీంతో బన్నీ కలుగుజేసుకొని 'యానిమల్ సినిమాలో రణ్‌బీర్ టైపు తను' అని అయాన్ గురించి చెప్తాడు. నాన్నకు ఇబ్బంది కలుగుతుంటే అస్సలు తగ్గడని వ్యాఖ్యానిస్తాడు. ఈ మాట బాలయ్య విని “ఐకాన్ స్టార్ కు అమ్మ మొగుడు అయ్యేలా ఉన్నాడు” అంటాడు. అప్పుడు వెంటనే అయాన్ 'తగ్గేదే లే' అన్న పుష్ప మ్యానరిజాన్ని చూపించి అందరినీ నవ్వించాడు. మెుత్తం బన్నీ, అతని పిల్లలతో సెకండ్ ఎపిసోడ్ సరదా సరదాగా సాగిపోతుందని ప్రోమోను బట్టి తెలిసిపోతోంది.
స్టార్స్ గురించి ఏమన్నారంటే?
ఫస్ట్ ఎపిసోడ్ (Unstoppable 4)లో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బన్నీని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోల్లో వావ్ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ జనరేషన్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ అంటే చాలా ఇష్టమని స్పష్టం చేశాడు.
https://twitter.com/pakkafilmy007/status/1857292801391628444
నవంబర్ 19 , 2024