రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
చంటిగాడురక్షిత
సుచిత్ర అకా సుచిప్రకాష్ రాజ్
పోలీస్ కమీషనర్ విప్ర నారాయణకోట శ్రీనివాసరావు
హెడ్ కానిస్టేబుల్ వెంకట స్వామిసంగీత
చంటి తల్లిఅలీ
మోటార్ సైకిల్ దొంగకైకాల సత్యనారాయణ
డిజిపిగిరి బాబు
పోలీస్ ఆఫీసర్జీవా
పోలీస్ ఆఫీసర్పృధ్వీ రాజ్
పోలీస్ ఆఫీసర్జూనియర్ రేలంగిపోలీస్ ఆఫీసర్
విద్యావతి
చంటి సోదరిసాయిరామ్ శంకర్
చంటి స్నేహితుడుశ్రీనివాస రెడ్డి
చంటి స్నేహితుడుఎంఎస్ నారాయణ
కళాశాల ప్రిన్సిపాల్నర్సింగ్ యాదవ్
యాదవ్సిబ్బంది
పూరి జగన్నాధ్
దర్శకుడుపూరి జగన్నాధ్నిర్మాత
చక్రి
సంగీతకారుడుశ్యామ్ కె. నాయుడు
సినిమాటోగ్రాఫర్మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఇడియట్, కిక్, విక్రమార్కుడు, వంటి చిత్రాలు సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో యూత్ ప్రేక్షకులకు రవితేజ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాస్ మహారాజా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రవితేజ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రవితేజ అసలు పేరు?
రవి శంకర్ రాజు భూపతి రాజు
రవి తేజ ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
రవితేజ హీరోగా తొలి సినిమా?
నీకోసం
రవితేజ ఎక్కడ పుట్టాడు?
జగ్గంపేట, ఆంధ్రప్రదేశ్
రవితేజ పుట్టిన తేదీ ఎప్పుడు?
1968 జనవరి 26
రవితేజ భార్య పేరు?
కళ్యాణి
రవితేజ ఫెవరెట్ హీరోయిన్
శ్రీదేవి
రవితేజకు ఇష్టమైన సినిమా?
షోలే
రవితేజకు ఇష్టమైన హీరో?
అమితాబ్ బచ్చన్, చిరంజీవి
రవితేజ తొలి హిట్ సినిమా?
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
రవితేజకు ఇష్టమైన కలర్?
బ్లాక్
రవితేజ హీరోగా రాకముందు ఏం చేసేవాడు?
కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు
రవితేజ తల్లిదండ్రుల పేర్లు?
భూపతిరాజు రాజగోపాల్, భూపతిరాజు రాజ్యలక్ష్మి
రవితేజ ఏం చదివాడు?
BA
రవితేజ అభిరుచులు
సినిమాలు చూడటం, ట్రావెలింగ్
రవితేజ ఎన్ని సినిమాల్లో నటించాడు?
70కి పైగా సినిమాల్లో నటించాడు.
రవితేజకు ఇష్టమైన ఆహారం?
ఏదైనా తింటానని రవితేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే స్వీట్స్ అంటే ఇష్టం
https://www.youtube.com/watch?v=Mw8TtBVTsG4&lc=UgxKe8s8VAfg-Rljt214AaABAg
రవితేజ నికర ఆస్తుల విలువ ఎంత?
రూ. 70కోట్లు
రవితేజ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.25కోట్లు తీసుకుంటాడు .
రవితేజకు స్మోకింగ్ అలవాటు ఉందా?
స్మోకింగ్ అలవాటు ఉంది
రవితేజ మద్యం తాగుతాడా?
తెలియదు
మార్చి 19 , 2024
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.
నవంబర్ 06 , 2024
Comedian Ali Roles: ‘డబుల్ ఇస్మార్ట్’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
పూరి జగన్నాథ్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్స్, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బైక్‌ల దొంగ (ఇడియట్)
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇడియట్ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.
స్కెచ్ ఆర్టిస్టు (సూపర్)
నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్ సీన్ ఎప్పటికీ మర్చిపోలేరు.
బిక్షగాడు (పోకిరి)
మహేష్, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.
హిమాలయ బాబా (దేశ ముదురు)
అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తాడు. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.
గోలి (దేవుడు చేసిన మనుషులు)
రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.
నచ్చిమి (చిరుత)
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫస్ట్ ఫిల్మ్ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.
బోకా (ఇస్మార్ట్ శంకర్)
రామ్ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్ ఫారెస్ట్ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్ చేసినట్లు అలీ తెలిపారు.
ఆగస్టు 13 , 2024
Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్ హ్యాట్రిక్ కొట్టినట్లేనా!
నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, దియా మిర్జా, సతీశ్ షా, అనిల్ గ్రోవర్ తదితరులు
దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరాణీ
సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్, మనుశ్ నందన్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్
విడుదల తేదీ: 21-12-2023
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ - షారుక్‌ఖాన్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ (పఠాన్, జవాన్)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశాల్ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి జవాన్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లండ్‌లోకి ప్రవేశించాలని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్ పాత్రలో షారుక్ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ, సాహసోపేతమైన డంకీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని భాగం చేశారు. మన్ను, బుగ్గు, బల్లిల కుటుంబ నేపథ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్రయాణంలో వలసదారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. హార్డీ, మన్ను ప్రేమకథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. పతాక సన్నివేశాల్లోనూ ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ‘లుట్ పుట్ గయా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ మరోసారి తనదైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం
రేటింగ్ : 3/5
డిసెంబర్ 21 , 2023
HBD Pawan Kalyan: పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇంత మంది స్టార్ హీరోలు అయ్యారా? లిస్ట్ పెద్దదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించి 25 ఏళ్లు దాటింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక్కడ అభిమానులు అనే కంటే భక్తులను సంపాదించుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ సెట్ చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన కేరీర్ ఆరంభంలో సినిమాల ఎంపికను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆయన్ను విమర్శించిన వారే తిరిగి పవన్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయిన వారు కొకోల్లలు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. ఈ సందర్భంగా ఆయన రిజెక్ట్ చేసిన హిట్ సినిమాల జాబితాను ఓసారి చూద్దాం. ఈ సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్నారన్న మాటలో అతిశయోక్తి లేదు.
ఇడియట్
మెగా ఫ్యామిలీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెద్ద భక్తుడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు పూరి. అప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇడియట్ కథను తొలుత పూరి జగన్నాత్ పవన్ కళ్యాణ్‌కు వినిపించారట. కానీ పవన్ నో చెప్పడంతో ఆ స్టోరిని రవితేజ దగ్గరకు వెళ్లాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రవితేజ తన పర్ఫామెన్స్‌తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టాడు. 2002లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్‌తో రవితేజ తన సినీ ప్రస్థానానికి రాచమార్గం వేసుకున్నాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ సినిమా స్టోరీని కూడా మొదట పవన్ కళ్యాణ్‌కు వినిపించాడు పూరి జగన్నాథ్. అయితే ఎందుకనో పవన్ ఈ సినిమాకు సైతం నో చెప్పాడు. దీంతో మళ్లీ ఈ కథతో పూరి రవితేజతో కలిసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో రవితేజ స్టార్ హిరోగా మారిపోయాడు.
అతడు
అతడు సినిమా కథను తొలుత పవన్ కళ్యాణ్‌కు వినిపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కథకు పవన్ నో చెప్పటంతో మహేష్ దగ్గరకు వెళ్ళింది. 2005 లో విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మహేష్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
పోకిరి
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. ఈ స్టోరీని పవన్ చేయాలనుకున్నా ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. దీంతో ఈ కథను పూరి.. మహేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్‌ని అడిగారు. కానీ పవన్ తిరస్కరించడంతో స్టోరీ మహేష్ దగ్గరకు వెళ్లింది. వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. 2013లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
వీటితో పాటు గోపిచంద్ నటించిన గోలిమార్ సినిమా, రవితేజ నటించిన మిరపకాయ్, రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాల కథలు తొలుత పవన్ కళ్యాణ్ తలుపు తట్టినవే అని ఇండస్ట్రీలో టాక్.
ఆగస్టు 31 , 2023
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
నవంబర్ 05 , 2024
నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. కార్తికేయ2, సూర్య Vs సూర్య, శంకరాభరణం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు ఉన్న నిఖిల్ గురించి మీకు తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం.
నిఖిల్ సిద్ధార్థ ముద్దు పేరు?
"బేగంపేట బోయ్"
నిఖిల్ సిద్ధార్థ ఎత్తు ఎంత?
5 అడుగుల 10అంగుళాలు
నిఖిల్ తొలి సినిమా?
హ్యాపీ డెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో రాజేష్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిఖిల్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
నిఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జూన్ 1, 1985
నిఖిల్‌కు వివాహం అయిందా?
నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ అనే యువతిని 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు.
విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు?
తన ఫస్ట్ స్టాండర్డ్‌లో అయేష అనే అమ్మాయిని ఇష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నిఖిల్‌కు ఇష్టమైన సినిమా?
హ్యాపీడేస్
విశ్వక్ సేన్ ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్
నిఖిల్ సిద్ధార్థ్ తొలి హిట్ సినిమా?
హ్యాపీ డేస్ చిత్రం నిఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. కార్తికేయ2, 18 పెజేస్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి.
నిఖిల్‌కు ఇష్టమైన కలర్?
బ్రౌన్ కలర్
నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రుల పేర్లు?
తల్లి వీణా సిద్ధార్థ(మాజీ పాఠశాల ప్రిన్సిపాల్), తండ్రి శ్యామ్ సిద్ధార్థ(ప్రొఫెసర్)
నిఖిల్‌కు ఇష్టమైన ప్రదేశం?
దుబాయ్, లండన్
నిఖిల్ సిద్ధార్థ చదువు?
ఇంజినీరింగ్
నిఖిల్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి?
కార్తికేయ2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకానిక్ గోల్డ్, సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు.
నిఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
నిఖిల్ 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.
నిఖిల్‌కు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్
నిఖిల్ తొలి పారితోషికం?
హ్యాపీడేస్ చిత్రానికి గాను నిఖిల్ రూ.25,000 తీసుకున్నట్లు చెప్పాడు
నిఖిల్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
నిఖిల్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.5 నుంచి రూ.10కోట్ల వరకు తీసుకుంటున్నాడు
నిఖిల్ సిద్ధార్థ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, ఫుట్‌బాల్ ఆడటం
నిఖిల్‌కు ఇష్టమైన హీరోయిన్?
భూమిక చావ్లా
నిఖిల్‌కు ఇష్టమైన హిందీ సినిమాలు?
షోలే, 3 ఇడియట్స్
https://www.youtube.com/watch?v=waTLUNgxueo
మార్చి 21 , 2024
Nupur Sanon: బ్లాక్ శారీలో నుపూర్ నడుమందాలను చూసి తట్టుకోగలరా?
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్.. మరోమారు సోషల్ మీడియాలో తళతళ మెరిసిపోయింది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లను ఊర్రూతలూగించింది.
https://twitter.com/MoviesUpdatez/status/1760945753596576055
నల్లటి శారీలో దగ దగ మెరుస్తూ నుపుర్ హాట్ ట్రీట్ ఇచ్చింది.. తన ఒంపుసొంపులతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది.
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్.. ‘టైగర్ నాగేశ్వర్’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది.
రవితేజతో పోటీపడి మరి నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్‌కు నుపుర్ స్వయాన సోదరి.
View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon)
నుపుర్.. 2019లో వచ్చిన ‘ఫిల్హాల్’ అనే ప్రైవేటు ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది.
ఆ పాటలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన డ్యాన్స్ చేసి అదరగొట్టింది.
తర్వాత 'పాప్ కౌన్' అనే టీవీ సిరీస్‌లో నటించి నుపుర్ అందరి దృష్టిలో పడింది.
ప్రస్తుతం హిందీలో 'నూరానీ చెహ్రా' అనే సినిమాలో నుపుర్ నటిస్తోంది.
యంగ్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీకు జోడీగా ఆమె తెరను పంచుకుంటోంది.
నుపుర్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్ 15, 1993లో డిల్లీలో జన్మించింది.
ఈ భామకు బాలీవుడ్‌లో షారుఖ్, హృతిక్, వరుణ్ ధావన్ అంటే చాలా ఇష్టమట.
హీరోయిన్స్‌లో అక్క కృతి సనన్‌తో పాటు దీపికా, జాక్వెలిన్, ప్రియాంక చోప్రా అంటే ఇష్టమట.
సినిమాల్లో ‘తాల్’, ‘దిల్ చాహతా హై’, ‘3 ఇడియట్స్’ మూవీస్ అంటే నుపుర్‌కు ప్రాణమట.
నుపుర్ స్వతహాగా సింగర్ కూడా. ఆమె అద్భుతంగా పాటలు పాడగలదు.
గాయకుల్లో మహ్మద్ రఫీ, సునీధి చౌహాన్, శ్రేయా ఘోషల్, సోను నిగమ్, రెహమాన్ అంటే ఇష్టమట.
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రానున్నాయి.
ప్రస్తుతం హిందీలో ‘నురానీ చెహ్రా’ అనే చిత్రంలో నుపుర్ నటిస్తోంది.
ఫిబ్రవరి 24 , 2024
Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు
మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విక్రమార్కుడు, రావణాసుర, శంభో శివ శంభో వంటి సీరియస్ క్యారెక్టర్ల తర్వాత మరోసారి సీరియస్ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రంలో రవితేజ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌లో కూడా రవితేజ లుక్స్, యాక్షన్ సీన్లు అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు ఇంతవరకు ఎవరు టచ్ చేయని స్టువర్ట్‌పురం సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. మరి ఇంత హైప్ సృష్టించిన టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? దసరా బరిలో నిలిచిన ఈ సినిమా విజయం సాధించిందా? అనే విషయాలను YouSay రివ్యూలో చూద్దాం.
తారాగణం: రవితేజ, గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా
డైరెక్టర్: వంశీ కృష్ణా
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సినిమాటోగ్రఫీ: మది ఐ.ఎస్.సి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సంగీతం: జీవీ ప్రకాశ్
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2023
కథ:
టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? తాను దోచుకున్న డబ్బు ఏంచేశాడు? స్టువర్టుపురంలో ఎలాంటి మార్పుని అతను తీసుకు వస్తాడు..? టైగర్ నాగేశ్వరరావును పట్టుకోవాలని ప్రధానమంత్రి ఎందుకు ఆర్డర్ వేశారు? చివరకు టైగర్ నాగేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇక సినిమా విషయానికి వస్తే... 1970లో స్టువర్టుపురంలో పేరు మోసిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ కథలో భారీగానే మార్పులు చేశారు వంశీ. సినిమా స్టార్టింగ్ నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. ఊరిలో జరిగే సంఘటనలను చక్కగా చూపించారు. సారా(నుపురు సనన్) టైగర్ నాగేశ్వరరావు మధ్య జరిగే లవ్ ట్రాక్.. ఇడియట్ సినిమా సీన్లను గుర్తు చేస్తుంది. అయితే మాములు జీవితం సాగిస్తున్న నాగేశ్వరరావు దొంగగా ఎలా మారాడు అనే సంఘటనలను డైరెక్టర్ వంశీ బాగా డీల్ చేశాడు అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రాబిన్ హుడ్ స్టైల్‌కి మూవీ ట్రాక్ వెళ్తుంది. ధనికుల నుంచి టైగర్ నాగేశ్వరరావు అందినంత దోచేస్తుంటాడు. అలా దోచుకున్న సొమ్మును టైగర్ నాగేశ్వరరావు ఏం చేస్తాడు అనేది కూడా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపూ 1970 దశకంలోని వాతావరణానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం దొంగనే కాదు.. ఆయనలోని పాజిటివ్ కోణాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఎవరెలా చేశారంటే
రవితేజ మరోసారి తన యాక్షన్ పవర్‌ను బయట పెట్టాడు. లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ జీవించేశాడు. యాక్షన్ సిక్వెన్స్ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు తమకు ఇచ్చిన రోల్స్‌లో మెప్పించారు. టైగర్ నాగేశ్వరరావు గజ దొంగ గ్యాంగ్‌లో యాక్ట్ చేసినవారు కూడా ఇంప్రెస్ చేస్తారు. ఈ సినిమాలో స్పేషల్ రోల్ చేసిన రేణు దేశాయ్ సామాజిక కార్యకర్తగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నాజర్, జిషు సేన్ గుప్తా తమ పాత్రల్లో రాణించారు. అనుపమ్ ఖేర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వంశీకృష్ణ .. కెరీర్ ఆరంభంలోనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రతి సీన్‌ను జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ఫ్రేష్‌గా తీశాడు. రవితేజను టైగర్ నాగేశ్వరరావుగా చూపించడంలో విజయం సాధించాడు. ఫస్టాఫ్‌ను సెకండాఫ్‌తో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అయితే సెకండాఫ్‌లో లాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు తీసివేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే నుపుర్- రవితేజ మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. సింక్ లేకుండా వచ్చే పాటలు కూడా చికాకు తెప్పిస్తాయి. సెకండాఫ్‌పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో మాత్రం డైరెక్టర్ వంశీ సక్రెస్ అయ్యాడు.
టెక్నికల్ పరంగా..
నిర్మాణ విలువల పరంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సినిమా కోసం పెట్టిన భారీ ఖర్చు సీన్లలో ప్రతిబింబిస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఇక టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు అంత ఆకట్టుకోకపోయినా… బీజీఎం మెప్పిస్తుంది. యాక్షన్ సిక్వెన్స్, రవితేజ డైలాగ్స్‌కు కొట్టిన BGM బాగుంది. మది ఐ.ఎస్.సి అందించిన సినిమాటోగ్రఫి, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
బలాలు
రవితేజ యాక్టింగ్
యాక్షన్ సిక్వెన్స్
డైరెక్షన్
బలహీనతలు
సింక్ లేకుండా మధ్య మధ్యలో వచ్చే పాటలు
సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్లు
చివరగా:
టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం గజ దొంగ కథ మాత్రమే కాదు... ఓ పాజిటివ్ వైబ్రెషన్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా మంచి వినోదాన్ని పంచుతుంది.
రేటింగ్: 3/5
అక్టోబర్ 20 , 2023
Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!
‘వంద కోట్లు కొల్లగొట్టిన సినిమా రా అది’ అని జనరల్‌గా మాట్లాడుకుంటుంటాం. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి కలెక్షన్లు ఒక ప్రామాణికత. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయ్? వసూళ్లెంత? అనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కలెక్షన్ల కౌంట్ ఎగబాకిన కొద్దీ సినిమా సక్సెస్ స్థాయి పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే సంప్రదాయం ఉంటుంది. ఎన్నో సినిమాలు హిట్టవుతాయి. కానీ, కొన్నే ల్యాండ్‌మార్క్ వసూళ్లను అందుకుంటాయి. రానున్న సినిమాలపై కూడా ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయగల సినిమాలేంటో చూద్దాం.
జవాన్(JAWAN)
షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార.. ఇలా ప్రధాన తారాగణం నటించిన సినిమా ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. చిత్రంపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. షారూక్ ఖాన్‌ని గుండుతో చూపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటుల మార్కెట్, కంటెంట్‌ని బట్టి ఈ సినిమా రూ.500 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=k8YiqM0Y-78
సలార్(SALAAR)
మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా ప్రభాస్ సలార్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ అనంతరం, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా, సినిమాలోని నటీనటులు మూవీ గురించి గొప్పగా చెబుతుండటం మరింత ఆసక్తిని పెంచింది. కేజీఎఫ్2కి, దీనికి లింక్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్‌తో సినిమా వస్తోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీకి హొంబలే ఫిల్మ్ భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లపై కన్నేసింది. సినిమా టాక్ బాగుంటే ప్రభాస్ మార్కెట్‌కి ఇది సాధ్యమే.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
లియో(LEO)
‘విక్రమ్’ మూవీ బ్లాక్‌బస్టర్ అనంతరం లోకేష్ కనగరాజ్ తీస్తున్న చిత్రమే ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు దీనిని దక్కించుకున్నట్లు టాక్. దీంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఇందులో కనిపించనున్నారట.
LEO - Bloody Sweet Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh
యానిమల్(ANIMAL)
రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించింది. ఈ మూవీ కూడా 5 భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్ 1కి వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=EywX_uxreYA
డంకీ(DUNKI)
రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, సంజూ వంటి సినిమాలను తీశాడు. యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించగలడు. ఇప్పుడు షారూక్ ఖాన్‌ని ‘డంకీ’(DUNKI)గా చూపించబోతున్నాడు. పూర్తి కామెడీ చిత్రంగా రాజ్‌కుమార్ హిరాణీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ మూవీ సైతం రూ.500 కోట్లకు పైగా వసూళ్లపై కన్నేసింది.
https://www.youtube.com/watch?v=aNxd01VzJsw&t=1s
ఆగస్టు 10 , 2023
Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్..!
దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.
బ్రహ్మానందం
టాలీవుడ్ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.
ఆలీ
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
వెన్నెల కిషోర్
వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్ ఆ సినిమాతోనే స్టార్ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది.
సునీల్
టాలీవుడ్ టాప్ కమెడియన్స్‌లో సునీల్ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగా సునీల్ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్ కనిపిస్తున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.
పృథ్వీ
థర్టీ ఇయర్స్ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.
ప్రియదర్శి
పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.
సప్తగిరి
పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.
సత్య అక్కల
టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.
శ్రీనివాస రెడ్డి
హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.
షకలక శంకర్
జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ఆరంభించిన షకలక శంకర్ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్ ఆకట్టుకున్నాడు.
ఏప్రిల్ 07 , 2023
ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు!
సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్ గురించి కూడా అతడి ఫ్యాన్స్ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్ర. అల్లుఅర్జున్ ఇల్లు ఎక్కడ?
గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను.
ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు?
గూ: 8th ఏప్రిల్ 1983
ప్ర. అల్లుఅర్జున్ ఫోన్ నెంబర్?
గూ: ... 98480 ..... అర్థమైందా?
ప్ర: అల్లుఅర్జున్, రామ్‌చరణ్ కజిన్స్ అవుతారా?
గూ: అవును.. అల్లు అర్జున్ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్. కాబట్టి అల్లుఅర్జున్ రామ్‌చరణ్ కజిన్స్ అవుతారు.
ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు?
గూ. అల్లుఅర్జున్ కేరళలో చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు.
ప్ర: అల్లుఅర్జున్ బాలీవుడ్ సినిమాలు ఎందుకు తీయట్లేదు?
గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు.
ప్ర: నార్త్ ఇండియాలో అల్లుఅర్జున్ ఎందుకు ఫేమస్?
గూ: నార్త్ ప్రజలు అతని డ్యాన్స్, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు
ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్ నెంబర్?
గూ. 666
ప్ర: అల్లుఅర్జున్ హిందీలో మాట్లాడగలడా?
గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.
ఇటీవల ‘4 ఇడియట్స్ రియాక్ట్’ అనే యూట్యూబ్ ఛానెల్ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.
ప్ర: మీరు బ్రాహ్మణులా?
బన్నీ: నో (నవ్వుతూ)
ప్ర: మీరు చిరంజీవికి బంధువా?
బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని
ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు?
బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు
ప్ర. మీ ఫేవరేట్ రంగు?
బన్నీ: బ్లాక్
ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు?
బన్నీ: షూటింగ్ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా.
అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్ వీడియోలో చూడండి.
https://youtu.be/yoRVoy8hqmI
ఏప్రిల్ 07 , 2023
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
యంగ్ ఇండియన్ క్రెకెటర్స్ గర్ల్‌ఫ్రెండ్స్
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 14 , 2023
GMA: రాజమౌళి ఓ ఇండియన్ స్పీల్‌బర్గ్.. టాక్ షోలో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 23 , 2023
Citadel Honey Bunny Review: ఇండియన్ స్పైగా అదరగొట్టిన సామ్.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ ధావన్, సమంత, కేకే మేనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్ తదితరులు
రచన: సీత.ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్ నిడిమోరు
సంగీతం : అమన్ పంత్
సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్
ఎడిటింగ్ : సుమిత్ కొటియన్
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : నవంబర్ 7, 2024
హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man), 'ఫర్జీ' (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్ సిరీస్ ‘సిటాడెల్’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), గ్లామర్ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్) ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్ గ్యాంగ్ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review)
ఎవరెలా చేశారంటే
బన్నీ పాత్రలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తనమార్క్ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్ లిప్‌లాక్ సీన్స్ యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్ మెుత్తం వరుణ్, సామ్ స్క్రీన్ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్, సిమ్రన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్ అండ్ డీకే టీమ్ తమ మార్క్ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్ గ్యాంగ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సమంత, వరుణ్ధావన్యాక్షన్ సీక్వెన్స్టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Kalki 2898 AD Review: ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్ తదితరులు
రచన, దర్శకత్వం : నాగ్ అశ్విన్
సంగీతం : సంతోష్ నారాయణన్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు : అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్
నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్ మేకర్స్
విడుదల తేదీ : 27 జూన్, 2024
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్‌హాసన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
'కల్కి 2898 ఏడీ' కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్ చేశాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్ బీఫోర్ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్ హాసన్ నెక్స్ట్ లెవెల్ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి అతిపెద్ద బలం నాగ్ అశ్విన్ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్ టేకింగ్, విజన్, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్ వెహికల్స్, ఆయుధాలు, సెట్స్ విజువల్ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్. దీపికా డబ్బింగ్ విషయంలోనూ నాగ్ అశ్విన్ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్ అశ్విన్.. డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ అయినట్లు చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్ చాలా రిచ్‌గా ఉంది.
ప్లస్ పాయింట్స్
కథ, దర్శకత్వంప్రభాస్ ప్రధాన తారాగణం నటనహాలీవుడ్ రేంజ్ విజువల్స్‌కురుక్షేత్రం ఎపిసోడ్
మైనస్ పాయింట్స్
తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌దీపికా డబ్బింగ్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 4/5
Public Talk On Kalki 2898 AD
ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.
కల్కి సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1806243116405723294
కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1806146620867912015
అటు దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1806187132450406624
కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు.
https://twitter.com/i/status/1806177761280578043
‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/saidevendla/status/1806199250327359793
కల్కి సూపర్ హిట్ టాక్ చూసి.. మూవీ యూనిట్ మెుత్తం ఫుల్ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనిదత్ చిందులు వేస్తునట్లుగా మాస్టర్ సినిమాలోని డ్యాన్స్ క్లిప్‌ను ఎడిటింగ్ చేసి పంచుకున్నాడు.
https://twitter.com/i/status/1806199186813288713
ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్ చేసి పోస్టు చేశారు.
https://twitter.com/i/status/1806199040368910540
ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.
https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా కల్కి థియేటర్ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1806198649107755236
కల్కి.. రెగ్యులర్ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org
కల్కి సెకండాఫ్ ఒక మాస్టర్ పీస్ అని, చివరి 45 నిమిషాలు గూస్ బంప్స్ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్, అమితాబ్ తమ నటనతో థియేటర్లను షేక్ చేశారని చెప్పుకొచ్చాడు.
https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706
కల్కి సినిమా సక్సెస్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1806134805542941036
జూన్ 27 , 2024
Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పుతిన్ ఏమన్నారంటే?
ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్ తెలిపారు. 24 గంటలూ ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
https://twitter.com/RT_com/status/1847495389303144506
‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా!
ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్ 8న రష్యాలో నేరుగా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్ రూబెల్స్‌ను కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది.
‘పుష్ప 2’కి కలిసి రానుందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లేటెస్ట్ కామెంట్స్ ‘పుష్ప 2’ టీమ్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్‌కు తాము సహకరిస్తారమని పుతిన్ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్ రిలీజ్లో భాగంగా రష్యన్ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.
హైప్ పెంచేసిన దేవిశ్రీ
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినిమాపై హైప్ పెంచేశారు. అటు 'పుష్ప 2' నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు.
https://twitter.com/Cinema__Factory/status/1845798162478272773
మృణాల్తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/villan_97/status/1845762894119801258
అక్టోబర్ 19 , 2024
Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్ మూవీగా మరో రికార్డు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరో రెండ్రోజుల్లో సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. దీనికి తోడు తారక్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే దేవర పలు రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తాజాగా తన పేరిట మరో రికార్డును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది.
ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
బాహుబలి స్థాయిలో క్లైమాక్స్
‘దేవర’ సినిమాలో చివరి 40 నిమిషాలు హైలైట్ అని ఎన్టీఆర్ (NTR) ఇటీవల స్వయంగా చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ దేవర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ దేవర క్లైమాక్స్ బాహుబలిని పోలి ఉంటుందని తెలిపారు. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ మూవీపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పైనా రత్నవేలు స్పందించారు. ఇందులో తారక్ మూడు పాత్రలు పోషించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఫ్యాన్స్‌కు నాగవంశీ రిక్వెస్ట్
దేవర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ అభిమానులకు ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమాతోనైనా ఫ్యాన్ వార్‌కు ముంగింపు పలకాలని కోరారు. అలాగే ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూసే వారు సినిమాకు సంబంధించిన సీన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టవద్దని కోరారు. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్ చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తారక్ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దామని పిలుపునిచ్చారు. పోస్ట్ చివర్లో 'దేవర సెప్పిండు అంటే సేసినట్టే' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ విజ్ఞప్తిని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
https://twitter.com/vamsi84/status/1838795481406726608
రన్‌టైమ్‌లో మార్పులు
‘దేవర’ (Devara) సినిమా నిడివిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఫైనల్ చేసిన నిడివిలో దాదాపు 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు సమాచారం. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్టైమ్తో (Devara Movie RunTime) ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలాంటివి మినహాయిస్తే ఈ మూవీ లెంగ్త్ 2:42 గంటలుగా ఉండనుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా నిడివి ఇంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది. ప్రాధాన్యం లేని సన్నివేశాలను తీసివేసినట్లు తెలుస్తోంది.
టికెట్ల రేటు పెంపు
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్లలో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
సెప్టెంబర్ 25 , 2024
S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్ మస్క్ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్ డైరెక్టర్‌గా రికార్డు!
భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్ దేశం అలెర్ట్ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం అయిపోతాయి. రాజమౌళి రీసెంట్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంతటి కీర్తిని గడించిన రాజమౌళి తాజాగా మరో అందలం ఎక్కారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించారు.
https://twitter.com/DVVMovies/status/1646532105067966466
2023 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ ఘనత సాదించిన తొలి ఇండియన్ డైెరెక్టర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో జక్కన్నతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, రచయిత సల్మాన్ రష్దీ, న్యాయ నిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ చోటు సంపాదించారు. అలాగే ప్రఖ్యాత గాయని బియాన్స్, సిరియా స్విమ్మర్స్ సారా మర్దిని, యుస్రా మర్దిని, సూపర్ మోడల్ బెల్లా హడిడ్ చోటు దక్కించుకున్నారు. ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జక్కన్న స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు.
View this post on Instagram A post shared by Bella ? (@bellahadid)
టైమ్ మేగజీన్‌లో S.S. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్ నటి అలీయా భట్ ప్రొఫైల్ రాసింది. సినిమాపై రాజమౌళికి ఉన్న విజన్‌పై ప్రశంసలు కురిపించింది. ‘ఆడియన్స్ గురించి రాజమౌళికి బాగా తెలుసు. సినిమాను ఎలా తీస్తే హిట్ కొడుతుందో ఆయనకు కొట్టిన పిండి. కథల ఎంపికలో రాజమౌళికి ఎంతో నైపుణ్యం ఉంది. భారత్‌లోని జనాభా విభిన్న సంస్కృతులు, అభిరుచులను కలిగి ఉంటారు. వారందరినీ రాజమౌళి తన సినిమాల ద్వారా ఏకం చేశారు’ అని అలియా భట్ రాసుకొచ్చింది. అటు బాలీవుడ్ నటుడు షారుక్ గురించి నటి దీపికా పదుకొనే కూడా ప్రొఫైల్ రాసింది. ప్రపంచ ప్రసిద్ధ నటుల్లో షారుక్ ఒకరిని పేర్కొంది. షారుక్.. గొప్ప మనసు, దాతృత్వం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.
https://twitter.com/TIME/status/1646737043290980354
రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్‌బాబుతో తీయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. మహేష్ సినిమాను రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని రాజమౌళి ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు అని ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయితే అది రూ.1500 కోట్లకు కూడా చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా మూడు పార్ట్స్ రిలీజ్ చేయడానికి రాజమౌళి కనీసం 8 ఏళ్లు తీసుకుంటాడని కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయితే ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Harmindarboxoff/status/1643961285615427586
ఏప్రిల్ 14 , 2023