రివ్యూస్
How was the movie?
తారాగణం
కృష్ణ
కృష్ణం రాజు
మీనా
కోట శ్రీనివాసరావు
ఆహుతి ప్రసాద్
పేకేటి శివరాం
as (Guest role)ఎం. ప్రభాకర్ రెడ్డి
సిబ్బంది
కృష్ణ
దర్శకుడుజి. నరసింహారావునిర్మాత
బప్పి లాహిరి
సంగీతకారుడుజి. నరసింహారావుసంగీతకారుడు
కథనాలు
EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
https://twitter.com/i/status/1752914245170364419
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.
ఫిబ్రవరి 23 , 2024
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్?
టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్యతో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కామెంట్స్ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో వైవీఎస్ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.
https://twitter.com/i/status/1830519890249421017
బోయపాటే ఎందుకు?
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్ బోయపాటి.. ఛాలెంజ్’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ డైరెక్టర్ వై.వీ.యస్. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.
రంగంలోకి వై.వి.ఎస్..?
ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ మల్టీస్టారర్ రావడం పక్కా అని చెప్పవచ్చు.
ఫ్యాన్ వార్‌పై చిరు క్రేజీ కామెంట్స్
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ అన్నారు.
సెప్టెంబర్ 02 , 2024
Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను ఫైనలైజ్ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
సలార్ (Salaar)
ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.
https://twitter.com/i/status/1756920670112317839
పుష్ప (Pushpa)
సుకుమర్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్‌చరణ్ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్, రామ్‌చరణ్ పాత్రలను హైలెట్ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY
రంగస్థలం (Rangasthalam)
రామ్‌చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.
https://twitter.com/i/status/1508823419013369857
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్ రెడ్డి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.
https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ
బాహుబలి (Baahubali)
తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=poqKN52SKx0
ఇంద్ర (Indra)
మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
https://twitter.com/i/status/1281802257319641090
https://twitter.com/i/status/1286298937746264065
మిర్చి (Mirchi)
ప్రభాస్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.
https://twitter.com/i/status/1653647992283619340
విక్రమార్కుడు (Vikramarkudu)
రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://twitter.com/i/status/1407610528948645889
https://twitter.com/i/status/1672174183395266561
ఛత్రపతి (Chatrapathi)
రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.
https://twitter.com/i/status/1591641776083070978
స్టాలిన్ (Stalin)
చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.
https://twitter.com/i/status/1307524939029688320
తులసి (Tulasi)
వెంకటేష్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.
https://twitter.com/i/status/1377645148671148036
https://twitter.com/i/status/1386233991800360961
సింహాద్రి (Simhadri)
తారక్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్ చేస్తుంది.
https://twitter.com/i/status/1557928081096028160
రక్షకుడు (Rakshakudu)
నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్ అందించాడు.
https://www.youtube.com/watch?v=hX06emC9sb8
ఓజీ (OG)
పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్, కాలర్ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.
https://twitter.com/i/status/1759904474091704446
యానిమల్ (Animal)
ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్. రణ్‌బీర్ మాస్ యాక్షన్‌ను హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్ వేస్తున్నట్లు రణ్‌బీర్ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్.
https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
ఫిబ్రవరి 21 , 2024
Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్ సాధించడం వెనక దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ (Vyjayanthi Movies) బ్యానర్ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్‌కు బడ్జెట్ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
[toc]
వైజయంతీ మూవీస్ ప్రస్థానం
అశ్వనీ దత్.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్ చేశాయి? ఇప్పుడు చూద్దాం.
అగ్నిపర్వతం
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ డబుల్ రోల్స్ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
https://www.youtube.com/watch?v=FaJqLrjanQM
జగదేక వీరుడు అతిలోక సుందరి
వైజయంతీ మూవీస్ రొటిన్ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
శుభలగ్నం
జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’.
గోవిందా గోవిందా
నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్ ఎంతగానో మిస్మరైజ్ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
రాజకుమారుడు
వైజయంతీ మూవీస్ బ్యానర్ ద్వారానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్ ఫిల్మ్ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చిన రాజ్.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.
ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ.
స్టూడెంట్ నెంబర్ 1
దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్ నెం.1' అశ్వనీదత్ నిర్మాత. వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్ అయి స్వప్న సినిమాస్ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
మహర్షి
మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్ నామినేట్ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్) ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్ రవి చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
సీతారామం
2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ & హాట్‌స్టార్
కల్కి 2898 ఏడీ
నిర్మాత అశ్వని దత్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్ హాసన్ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
వైజయంతీ మూవీస్ సబ్ బ్యానర్స్‌లో వచ్చిన హిట్ చిత్రాలు
బాణం
అశ్వని దత్ కుమార్తె ప్రియాంక దత్.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ.
సారొచ్చారు
ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్ రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : హాట్‌స్టార్ & ఆహా
Sir Ocharu Movie Posters TollywoodAndhra.in
ఎవడే సుబ్రహ్మణ్యం
కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’.
ఓటీటీ వేదిక : సన్ నెక్స్ట్
మహానటి
అశ్వని దత్ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
జాతి రత్నాలు
వైజయంతి మూవీస్ సబ్ బ్యానర్ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
అక్టోబర్ 25 , 2024
Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
నటినటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా, నాగ మహేష్, రమేష్ రెడ్డి
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జాదవ్
సంగీతం: సాయిచరణ్ పాకాల
ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. తద్వారా మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్ హిట్ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి:
నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్(అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అసలు ఈ శివకుమార్ ఎవరు?. హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్ ఎలా చెక్ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే:
సీరియస్ పోలీసు ఆఫీసర్ రోల్‌లో అల్లరి నరేష్ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్ మిర్నా మీనన్ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికంగా:
దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్ సీన్ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటననేపథ్య సంగీతంయాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ సీన్స్‌సాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
మే 05 , 2023
Prathinidhi 2 Review: జర్నలిస్టుగా ఆకట్టుకున్న నారా రోహిత్.. ‘ప్రతినిధి 2’తో సక్సెస్ కొట్టినట్లేనా?
నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
విడుదల తేదీ: 10-05-2024
నారా రోహిత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2 Review). గతంలో విడుదలై ప్రతినిధి చిత్రానికి కొనసాగింపుగా ఇది రూపొందింది. ప్రముఖ పాత్రికేయుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. ఏపీ ఎన్నికల సమయంలో ఈ పొలిటికల్ డ్రామా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. మే 10న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. ఫ్రీలాన్స్ రిపోర్టర్‌గా పని చేస్తూ నిజాలను ఎలాంటి భయం లేకుండా వెలుగులోకి తీసుకొస్తుంటాడు. దీంతో అతడ్ని NCC ఛానల్ ఏరికోరి సీఈవోగా నియమిస్తుంది. అప్పటి నుంచి చేతన్ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎం ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జర్నలిస్టు చేతన్ పాత్రలో నారా రోహిత్ (Prathinidhi 2 review In Telugu) అదరగొట్టాడు. భావోద్వేగాలు చక్కగా కనబరిచాడు. పోరాట సన్నివేశాలపైనా ప్రభావం చూపాడు. ఫస్టాఫ్‌లో అతడి నటన హైలెట్‌గా ఉంటుంది. హీరోయిన్ సిరి లెల్లా పాత్ర పరిమితమే. సెకండాఫ్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సీఎంగా సచిన్ ఖేడ్కర్ తనదైన ముద్ర వేశారు. అటు దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా. అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు మెప్పిస్తున్నాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మూర్తి (Prathinidhi 2 review In Telugu).. కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా మూవీని తెరకెక్కించారు. జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు. ఆరంభ సీన్స్‌లో హీరో నైజాన్ని, జర్నలిజం గొప్పతనాన్ని దర్శకుడు తెలియజేశాడు. తొలి సగభాగంలో కలం చేత పట్టిన హీరో.. ద్వితీయార్ధంలో కత్తి పడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఓటు విలువను చాటి చెబుతూ దర్శకుడు తీర్చిదిద్దిన సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా పొలిటికల్ యాంగిల్‌లో వచ్చే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. అయితే రాజకీయ కోణంలో తీసిన కొన్ని సీన్లు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే హీరో కుటుంబ నేపథ్యం చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. సీబీఐను దర్శకుడు సాదాసీదాగా చూపించడం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి బలం. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టాల్సింది. ముఖ్యంగా సెకాండాఫ్‌లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకథలో ట్విస్టులుపొలిటికల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్‌లాజిక్స్‌కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 10 , 2024
Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్ రోల్స్ చేసిన ఏకైక హీరోగా ఘనత!
తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా.
1.Apoorva Sahodarulu (1986)
బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు.
2. Ramudu Bheemudu (1988)
రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు.
3. Brahmarshi Viswamitra (1991)
నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
4. Aditya 369 (1991)
ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు.
5. Maatho Pettukoku (1995)
ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు.
6. Sri Krishnarjuna Vijayam (1996)
సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు.
7. Peddannayya (1997)
బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు.
8. Sultan (1999)
శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు.
9. Chennakesava Reddy (2002)
మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు.
10. Allari Pidugu (2005)
జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు.
11. Okka Magadu (2005)
బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు.
12. Pandurangadu (2008)
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు.
13.Simha (2010)
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది.
14. Parama Veera Chakra (2011)
దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు.
15. Adhinayakudu (2012)
పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు.
16. Legend (2014)
బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు.
Balakrishna's Legend Movie First Look Posters
17. Akhanda (2021)
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది.
18. Veera Simha Reddy (2023)
గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
నవంబర్ 09 , 2023
Gopichand Bhimaa Review: యాక్షన్ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు : గోపిచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్, ముఖేష్ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకుడు : ఎ. హర్ష
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ
నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత : కె. కె. రాధామోహన్
మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్ మెప్పించాడా? లేదా?
కథ
భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్ లవ్ ట్రాక్ ఎలా మెుదలైంది? అన్నది కథ.
ఎవరేలా చేశారంటే
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కటౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో గోపిచంద్ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్, ముఖేష్ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష.. డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. పరశురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
గోపిచంద్ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్
సాగదీత సీన్లుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 08 , 2024
Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్ చేసిన అభినవ్.. ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: అభినవ్ గోమటం, వైశాలి, రాజ్ మెుయిన్, అలీ రెజా
దర్శకత్వం: తిరుపతి రావు
సంగీతం: సంజీవ్ థామస్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభూ
నిర్మాత: ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల
విడుదల తేదీ: 23-02-2023
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా అభినవ్ గోమటం మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
మనోహర్ (అభినవ్ గోమఠం) (Masthu Shades Unnai Ra Review In Telugu) ఓ సాధారణ పెయింటర్. లైఫ్‌లో సెటిల్ కాలేదన్న కారణంతో అతడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పీటలపై నుండి లేచిపోతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి (వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. చేతిలో రూపాయి లేని మనోహర్ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందిన అభినవ్ గోమఠం.. ఈ సినిమాలో కథానాయకుడిగానూ తన మార్క్ ఏంటో చూపించాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పలికించి సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు. ఆమెది నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాదు. ఇక బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు తిరుపతి రావు మంచి కథను ఎంచుకున్నారని చెప్పవచ్చు. స్టోరీపై బాగా హోమ్‌వర్క్ చేయడం ప్లస్ అయ్యింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథకు సంబంధం లేని సీన్లతో తొలి భాగాన్ని చాలా వరకూ నడిపించాడు. స్టోరీలోని మెయిన్ పాయింట్‌లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్. సెకండాఫ్ నుంచి అసలు కథ మెుదలవుతుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలోని మెయిన్ సీక్వెన్స్‌లను దర్శకుడు చాలా బాగా మేనేజ్ చేశారు. మంచి ఫన్ కూడా జనరేట్ అయ్యింది. సెకండ్ పార్ట్ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో సినిమా కొంతమేర గట్టెక్కగల్గింది.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Masthu Shades Unnai Ra Review In Telugu)... ఈ విభాగం పనితీరు చాలా పూర్‌గా ఉంది. సంజీవ్ థామస్.. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సిద్ధార్థ స్వయంభూ కెమెరా పనితనం కూడా నామ మాత్రంగానే అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే మంచి ఔట్‌పుట్ వచ్చేది.
ప్లస్ పాయింట్స్
అభినవ్ నటనకామెడీద్వితియార్థం
మైనస్ పాయింట్స్
తొలి భాగంఅవసరం లేని సీన్లుటెక్నికల్ విభాగం
Telugu.yousay.tv Rating : 2.5/5
ఫిబ్రవరి 23 , 2024
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 29 , 2024
అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2, ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అడవి శేషు అసలు పేరు?
అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర
అడవి శేషు ఎత్తు ఎంత?
5 అడుగుల 11 అంగుళాలు
అడవి శేషు తొలి సినిమా?
సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.
అడవి శేషుకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు?
5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.
అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు.
అడవి శేషుకు ఇష్టమైన కలర్?
బ్లాక్, వైట్
అడవి శేషు పుట్టిన తేదీ?
17 December 1984
అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు?
చంద్ర, భవాని
అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం?
కాలీఫోర్నియా
అడవి శేషు ఏం చదివాడు?
అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు
అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు
అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు?
అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.
అడవి శేషుకు ఇష్టమైన ఆహారం?
అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు
అడవి శేషు ఇల్లు ఎక్కడ?
అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు
https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
మార్చి 21 , 2024
These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రోబో 2.0 - పక్షి రాజు
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.
https://www.youtube.com/watch?v=5OkypaWGYAo
నేను లోకల్ - నవీన్ చంద్ర
హీరో నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను లోకల్’ (Nenu Local) చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్ తండ్రి నవీన్ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
https://www.youtube.com/watch?v=rYcZLAgPLps
‘వి’ - నాని
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf
నిన్నుకోరి - నాని
ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.
https://www.youtube.com/watch?v=ie8feBbd4VA
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్
వెంకటేష్-మహేశ్ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది.
https://www.youtube.com/watch?v=G50OUBEZm-4
మగధీర - శ్రీహరి
మగధీరలో రామ్‌చరణ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.
https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec
పుష్ప - శత్రు
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.
https://www.youtube.com/watch?v=krENzIi3Tto
పరుగు - ప్రకాష్ రాజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, షీలా కౌర్ జంటగా చేశారు. ప్రకాష్ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్ రాజ్.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU
విక్రమ్ - కమల్ హాసన్
ఇందులో హీరో కమల్ హాసన్ మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం (విజయ్ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు.
https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2
రిపబ్లిక్ - రమ్యకృష్ణ
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.
https://www.youtube.com/watch?v=FWg79VONoTY
ఫిబ్రవరి 27 , 2024
This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ రాయ్
బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్ సరోజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య గమనిక
విరాన్ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్ వేణు మురళీధర్ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సైరెన్’ (Siren). ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.
ఆర్టికల్ 370
అందాల తార యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్టికల్ 370’ (article 370). ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
ఫిబ్రవరి 19 , 2024
Devara: కొరియన్ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కలెక్షన్స్ సునామి సృష్టించి తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే సముద్రపు ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. కొరటాల శివ క్రియేటివిటీ అద్భుతమంటూ కామెంట్స్ సైతం వినిపించాయి. అయితే అవన్నీ కొరటాల శివ సొంత ఆలోచనల నుంచి పుట్టినవి కావని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ కొరియన్ సినిమా సీన్లను మక్కీకి మక్కీ దించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ ఓ వీడియోను సైతం ట్రెండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
‘దేవర’ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్స్‌ను గమనిస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. ఒక తెలుగు డైరెక్టర్ సముద్రంలో ఆ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ తీస్తారని ఎవరు ఊహించలేదు. సముద్రపు ఓడలోని ఆయుధాలను దోచుకునేందుకు హీరో తన గ్యాంగ్‌తో కలిసి వెళ్లడం, గన్స్‌తో ఉన్న పెట్టెలను సముద్రంలో పడేయటం మూవీలో చూడవచ్చు. అప్పటికే నాటు పడవలతో సిద్ధంగా ఉన్న హీరో గ్యాంగ్‌లోని మరికొందరు ఆ బాక్స్‌లను తమ నాటు పడవల్లోకి ఎక్కించుకొని నావీ అధికారుల కళ్లుకప్పి స్మగ్లింగ్ చేస్తారు. అయితే అచ్చం ఇలాంటి సీనే కొరియన్ మూవీలో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ సీన్‌నే దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. ఆడియన్స్‌ను భలే బురిడి కొట్టించావంటూ దర్శకుడిపై మండిపతున్నారు. ఆ కొరియన్ మూవీ సీన్‌ను మీరు ఓసారి చూసేయండి.
https://twitter.com/chiruthajsp/status/1849093752683716609
ఆ సీన్ కూడా అంతే!
‘దేవర’ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తొలుత విలన్ గ్యాంగ్‌తో పాటు స్మగ్లింగ్‌లో పాల్గొన్న ‘దేవర’ కొన్ని బలమైన కారణాలతో మంచిగా మారతాడు. అదే సమయంలో సముద్రంలోకి స్మగ్లింగ్ చేయడానికి వస్తోన్న తన వారిలో భయం కలిగిస్తాడు. ఈ క్రమంలో కత్తులతో ఉన్న కుర్చీని తీరం వెంబడి దర్శకుడు చూపించారు. అయితే ఈ సీన్‌ను కూడా కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘వికింగ్స్’ (Vikings)లోని ఓ సన్నివేశం కూడా అచ్చం అలాగే ఉందంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/BackupBrainy/status/1833835236465029376
దేవర కథ కూడా కాపీనా?
దేవర కథను కాపీ రైట్ ఉన్న నవల నుంచి తీసుకున్నట్లు రిలీజ్‌కు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్స్ ఓ సినిమాలో చూసి బాధపడుతున్నానని తమిళ డైరెక్టర్ శంకర్ ఇటీవల ఆరోపించారు. క్రియేటర్స్ దగ్గర ఉన్న రైట్స్ గౌరవించాలని, అధికారం లేకుండా సీన్స్‌ను కాపీ కొట్టడం మానుకోవాలని శంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆయన ఏ సినిమా గురించి ప్రస్తావించారో క్లారిటీ ఇవ్వలేదు. కానీ, శంకర్ ప్రస్తావించిన తమిళ నవల వీరయుగ న్యాయ వేల్పరి కథకు దగ్గరగా దేవర స్టోరీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
శ్రీమంతుడు విషయంలోనూ..
కథను కాపీ చేశారన్న ఆరోపణలు కొరటాల శివపై రావడం ఇదే తొలిసారి కాదు. మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) మూవీ విషయంలోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన స్టోరీని కాపీ కొట్టాడంటూ రచయిత శరత్ చంద్ర కోర్టుకు సైతం వెళ్లారు. అప్పట్లో విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2012లో 'చచ్చేంత ప్రేమ' పేరుతో స్వాతి మాస పత్రికలో తన స్టోరీ ప్రచురితమైందని రచయిత తెలిపారు. దానిని సినిమా చేద్దామని అనుకుంటున్న క్రమంలోనే కొరటాల శివ ‘శ్రీమంతుడు’ తీసేశాడని ఆరోపించారు.
అక్టోబర్ 24 , 2024
Game Changer: టెన్షన్‌లో మెగా ఫ్యాన్స్.. ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది రానట్లేనా?
'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్ కోసం దర్శకుడు శంకర్ వెతుకుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ కంప్లీట్ చేసేసరికి డిసెంబర్ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే మూవీ యూనిట్ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది చరణ్ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
2024 సమ్మర్ కానుకగా!
రామ్ చరణ్ - శంకర్ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' చిత్రం డిసెంబర్ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్ బరిలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్ ఛేంజర్’ను బరిలోకి దింపడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కియారా పోస్టర్ అదుర్స్!
గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్, కియారాలతో పాటు ఎస్.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆగస్టు 06 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024
69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
నాని.. డబుల్ ధమాకా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్ నాన్న) నాని నామినేట్ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్ కేసరి), ధనుష్ (సర్), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఆనంద్ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.
బేబీ చిత్రం హవా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (సాయి రాజేష్), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్ రోహిత్) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164
ఫిల్మ్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే...
ఉత్తమ చిత్రం
బేబీబలగందసరాహాయ్ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టిసామజవరగమనసలార్: పార్ట్-1 సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్ కేసరి)చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)ధనుష్ (సర్)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)నవీన్ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)కీర్తిసురేశ్ (దసరా)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ దర్శకుడు:
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)కార్తిక్ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)సాయి రాజేశ్ (బేబీ)శౌర్యువ్ (హాయ్ నాన్న)శ్రీకాంత్ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం)
ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్ కేసరి)శ్రియారెడ్డి (సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్)శ్వేతరెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి -హాయ్ నాన్న)శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు -సర్)
ఉత్తమ గాయకుడు:
అనురాగ్ కుల్‌కర్ణి (సమయ-హాయ్ నాన్న)హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి -టైటిల్ సాంగ్)పీవీఎన్‌ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్ శ్రీరామ్ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:
బేబీ (విజయ్ బుల్గానిన్)బలగం (భీమ్స్ సిసిరిలియో)దసరా (సంతోష్ నారాయణ్)హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్)ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్)వాల్తేర్ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ -హాయ్ నాన్న)అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్)
జూలై 17 , 2024
Bhimaa Day 1 Collections: ‘గామి’తో పోలిస్తే చతికిలపడ్డ ‘భీమా’.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా మాళవిక శర్మ (Malavika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A. Harsha) రూపొందించిన చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గోపిచంద్ విశ్వరూపం చూపించాడని కథనాలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత గోపిచంద్‌కు సాలిడ్ హిట్ కూడా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? ప్రీ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
భీమా తొలి రోజు కలెక్షన్స్..
భీమా చిత్రాన్ని మేకర్స్ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శనకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా కలిపి 600 స్కీన్లలో, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి తగ్గట్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించినట్లు తెలుస్తోంది. ట్రెడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.35కోట్లు, ఓవర్‌సీస్ ఇతర ప్రాంతాలు కలిపి రూ.1.25 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్ని ఏరియాల్లో మిక్స్‌డ్ టాక్ రావడం భీమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. లేదంటే ఈజీగానే రూ.5 కోట్ల మార్క్‌ను సాధించేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గోపిచంద్ గత చిత్రం ‘రామబాణం’.. తొలిరోజున రూ. 2.5 కోట్ల గ్రాస్ సాధిస్తే.. ‘భీమా’ అంతకు రెట్టింపు వసూలు చేయడం విశేషం.
సాక్నిక్ లెక్కల ప్రకారం
ప్రముఖ సినిమా వెబ్‌సైట్ సాక్నిక్ (Sacnilk) లెక్కల ప్రకారం.. భీమా చిత్రం తొలిరోజు రూ.3.50 కోట్ల నెట్ కలెక్షన్లను (Bhimaa Day1 Net Collections) వసూలు చేసింది. ఓవర్సీస్ లెక్కలను మాత్రం ఈ సైట్ ప్రస్తావించలేదు. ఇక తొలిరోజు ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోస్ 27.58%, మధ్యాహ్నం 33.55%, సాయంత్రం 27.70%, సెకండ్ షో 49.49% నమోదైంది. నేడు, రేపు వీకెండ్ కావడంతో ఆక్యుపెన్సీ శాతం మరింత పెరిగే అవకాశముంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో రూ.6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గోపీచంద్ హీరోగా ఒక హిట్ అందుకునేలోపే.. మూడు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయితే తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్‌లో 'భీమా' చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ (Bhimaa Movie Pre Release Business)ను మంచిగానే చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థ్రియేటికల్ హక్కులు రూ.11.30 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలంగాణ (నైజాం) రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 4.50 కోట్లకు బిజినెస్ జరిగింది. మెుత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కాగా.. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.1.8 కోట్లు జరిగింది. 'భీమా' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ.12 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'భీమా'లో అదరగొట్టిన గోపిచంద్!
భీమా చిత్రంలో గోపిచంద్.. రెండు కోణాల్లో కనిపించే పాత్రల్లో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కటౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో గోపిచంద్ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్, ముఖేష్ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
https://telugu.yousay.tv/gopichand-bheema-review-gopichand-sivathandavam-in-action-sequences-bheema-movie-hit-free.html
మార్చి 09 , 2024
Pushpa 2 Review: అల్లు అర్జున్ మాస్ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల: 05-12-2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించి మరింత హైప్ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో గ్లామర్ డోస్ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్ సుకుమార్ పుష్ప రాజ్ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్, మైండ్ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్ ఇంట్రో, పుష్ప - షెకావత్ టామ్ అండ్ జెర్రీ ఫైట్, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్ వేశారు సుకుమార్.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ నటనయాక్షన్ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం
మైనస్ పాయింట్స్
తేలిపోయిన విలనిజంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3.5/5
డిసెంబర్ 05 , 2024