• TFIDB EN
  • ఇందువదన
    U/ATelugu2h 14m
    వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ సందేశ్
    వాసు
    ఫర్నాజ్ శెట్టి
    ఇందు
    రఘు బాబు
    అలీ
    ధనరాజ్
    ప్రవీణ్ రాజ్
    పార్వతీశం
    మహేష్ విట్టా
    సురేఖ వాణి
    నాగినీడు
    జ్యోతి లాబాలా
    దువ్వాసి మోహన్
    తాగుబోతు రమేష్
    బేబీ కృతిక
    అంబరుషి
    వంశీ ఆకేటి
    జబర్దస్త్ మోహన్
    సిబ్బంది
    ఎం. శ్రీనివాస్ రాజుదర్శకుడు
    మాధవి ఆదుర్తినిర్మాత
    చైతు కొల్లిసంగీతకారుడు
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    కథనాలు
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.  అరవింద సమేత వీరరాఘవ హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.  https://www.youtube.com/watch?v=qmqQHtla20w S/O సత్యమూర్తి ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’  (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది. https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ అజ్ఞాతవాసి ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు. https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc జులాయి తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.  https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U ఖలేజా  మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.  https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.  https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
    జూన్ 12 , 2023
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..  మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..  మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్‌ జెండర్‌గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్‌ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్‌ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్‌ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి. 1. నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.  2. విరాట్‌ కోహ్లీ అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అటువంటి విరాట్‌ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్‌ వేయండి. https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20 3. ఎలాన్‌ మస్క్‌ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్‌ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.  4. అజయ్‌ దేవ్‌గన్‌ బాలీవుడ్‌  సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ అలరించాడు. యాక్షన్‌, ఫైట్‌ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్‌గన్‌ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20 5. అలియాభట్‌ బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తన ‌అందం, అభినయం, నటనతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో కదా.  6. మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ సృష్టికర్త మార్క్‌ జూకర్‌బర్గ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారో AI చూపించింది.  https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20 7. దీపికా పదుకొనే బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.  8. అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ మోస్ట్‌ ఎనర్జిటిక్‌ హీరోగా అక్షయ్‌ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.  https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20 9. ప్రభాస్‌ బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కెరీర్‌ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్‌కు పాన్‌ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్‌ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.  10. లియోనార్డో డికాప్రియో టైటానిక్‌  సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్‌ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్‌ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్‌లో లియోనార్డో ఉన్నాడు.  https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20 11. లియోనెల్ మెస్సీ అర్జెంటినా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనాల్‌ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్‌లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్‌ చేసి చూపించింది.  12. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్‌ ఎలా ఉందో చూసేయండి.  https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20 13. రాక్ హాలీవుడ్‌ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్‌ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్‌ హిట్‌ యాక్షన్‌ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. 14. నోరా ఫతేహి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి. https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20 15. షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుక్‌ ఖాన్‌.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‌అటువంటి షారుక్‌ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.  16. బాబా రాందేవ్‌ యోగా గురు బాబా రాందేవ్‌ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్‌ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్‌గా మాత్రమే మన ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20 17. ముకేష్‌ అంబానీ దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ ‌అంబానీ ఒకరు. రిలయన్స్‌ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.  18. మోనాలిసా ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.  https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
    మే 05 , 2023
    Adipurush Memes: ఆదిపురుష్‌ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..! 
    Adipurush Memes: ఆదిపురుష్‌ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..! 
    ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద మిక్స్‌డ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తోంది. అయితే, రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. ఇందులోని పాత్రల చిత్రీకరణ, గెటప్, తదితర విషయాల్లో మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సినిమా విడుదలయ్యాక కూడా ఈ విమర్శలు ఆగట్లేదు. కొందరైతే పాత్రలను ఇంతకు ముందు సినిమాలతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరీ, ముఖ్యంగా ఇందులో ఓ పాత్ర అయితే అచ్చం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని పోలి ఉందని పిక్స్ షేర్ చేస్తున్నారు.  ఆదిపురుష్‌లో ఏక్‌నాథ్ షిండే.. ఆదిపురుష్‌లో వేసిన ఓ వానర పాత్ర గెటప్‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాత్ షిండే ముఖ కవలికలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ముఖాన్ని చూస్తే డిట్టో షిండేనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండింటికీ తేడా.. నెటిజన్లు మరొక అడుగు ముందుకేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు. సినిమాలో ప్రభాస్ తెల్లటి వస్త్రాలు ధరించి కనిపిస్తాడు. ఈ ఫొటోను గుర్తు చేస్తూ ఎక్కడో చూసినట్లుందే అంటూ కమెడియన్ రఘు బాబు ఫొటో షేర్ చేస్తున్నారు. దరువు సినిమాలోని పండిట్‌జీ గెటప్‌కి, ప్రభాస్ గెటప్‌కి ఏమైనా తేడా ఉందా చెప్పండంటూ కామెంట్లు పెడుతున్నారు.  రావణ క్యారెక్టర్‌పై.. ఆదిపురుష్‌లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అయితే, లంకేశుడి పాత్రను చూపించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకీ రామాయణంలో లేని రావణుడిని సృష్టించారంటూ గుణ గణాలను పోలుస్తున్నారు. ఇప్పటివరకు చూసిన రావణుడు, ఆదిపురుష్ రావణుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.  వీఎఫ్ఎక్స్‌పై.. గతేడాది ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక కూడా ఇవి ఆగట్లేదు. సినిమా కోసం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా, విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇతర సినిమాల గ్రాఫిక్స్‌తో పోల్చుతూ కామెంట్ చేస్తున్నారు. https://twitter.com/Lordofbattles8/status/1669609782595170305 మరికొందరు, ఇతర లోకల్ వీడియోలను షేర్ చేస్తూ ఆదిపురుష్ కన్నా ఇదే నయం అంటున్నారు.  https://twitter.com/DoctorrSays/status/1669622038544400384 ఇప్పుడొచ్చిన ఆదిపురుష్ కన్నా 20 ఏళ్ల కిందట విడుదలైన అంజి సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.  https://twitter.com/superking1816/status/1669611748188622848 2010లోనే షారూక్ ఖాన్ సినిమాలో ఇంత చక్కని గ్రాఫిక్స్ ఉపయోగించడం గొప్ప విషయం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కర్మ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు. https://twitter.com/KaranAr37362920/status/1669563764017086464
    జూన్ 16 , 2023
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.  https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.  https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.  https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)  కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.  https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.  https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.  https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.  https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్‌ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్‌ వెనక్కి తగ్గలేదు. అజిత్‌ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్‌ స్టంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పల్టీ కొట్టిన అజిత్‌ కారు! ప్రస్తుతం అజిత్‌ (Ajith) తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’ (Vida Muyarchi)లో నటిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.  https://twitter.com/Fukkard/status/1775813515233878447 ‘ధైర్యానికి హద్దులు ఉండవు’ ఈ వీడియోను షేర్‌ చేసిన లైకా ప్రొడక్షన్స్‌.. దీనికి అదిరిపోయే క్యాప్షన్ సైతం ఇచ్చింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా, ‘విదా ముయార్చి’ చిత్రానికి మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
    ఏప్రిల్ 04 , 2024
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?  టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.  లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.  టిల్లు:  పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.  టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.  అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'  https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..  టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..  టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:  డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..  లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..  టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..  మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:  లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:  నాదా...? నా హార్ట్ చాలా వీకూ..  ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:  నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..  పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్:  ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.  ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.  ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.    ‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’  ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.  https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.  ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.  https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.  ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.   తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ  సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.  https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.  ఊరు పల్లెటూరు ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు. https://www.youtube.com/watch?v=KpBksxKsrIU బతుకమ్మ సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్‌ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.  https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I చమ్కీల అంగీలేసి దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY దండికడియాల్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.  https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY దిల్ కుష్ తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE సౌ శర(పరేషాన్) పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని  చెబుతున్నాయి.  https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.  https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
    జూన్ 07 , 2023
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.  https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే  జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది. రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.  https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.  https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.  https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను  ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.  https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.  https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో  హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.  ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.  సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.  జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.  మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.  ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌  సిద్ధపడుతున్నట్లు  తెలుస్తోంది.  RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.  అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. 
    ఏప్రిల్ 25 , 2023
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్‌ 10) కల్కి ట్రైలర్‌ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.  ప్రభాస్‌.. కల్కినే కాదట! 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్‌) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్‌ చూసిన తర్వాత అసలు ప్రభాస్‌ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్‌ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఏం ట్విస్ట్ ప్లాన్‌ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  https://www.youtube.com/watch?v=y1-w1kUGuz8 ప్రభాస్‌ ప్రాధాన్యత తగ్గిందా! కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్‌ కంటే బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్‌ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్‌ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. 'రికార్డ్స్‌ చెక్‌ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్‌ ఓడిపోలేదు' అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్స్‌ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్‌ 27న ప్రభాస్‌ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.  దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్‌ కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్‌ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్‌ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్‌ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్‌ అశ్విన్‌ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్‌ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్‌ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్​కు వాడేస్తున్నారు. https://twitter.com/i/status/1800179235677778142 వీటిపైనా నెట్టింట చర్చ..! ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్​ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ - ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్​ లుక్, రోల్​ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి. 
    జూన్ 11 , 2024
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.  తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.  యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.  ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి! 
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి! 
    సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్‌ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్‌ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? సత్యరాజ్ (బాహుబలి) బాహుబలిలో ప్రభాస్‌, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు. ప్రకాష్‌ రాజ్‌ (అతడు) మహేష్‌ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్‌ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR సుకుమారి (మురారి) మహేష్‌ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్‌ నటి మెప్పించింది. మహేష్‌ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.  https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18 శ్రీకాంత్‌ (శంకర్‌దాదా MBBS) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్‌ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లోనూ శ్రీకాంత్‌ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు. https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3 రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు) డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.  https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0 శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) సిద్ధార్థ్‌ - త్రిష జంటగా డ్యాన్స్‌ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయి.  https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd గొల్లపూడి మారుతిరావు (లీడర్‌) దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్‌’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్‌ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్‌ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.  https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y అభినవ్‌ గోమఠం (ఈ నగరానికి ఏమైంది) తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్‌ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.  https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ - ఆర్తి అగర్వాల్‌ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్‌ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్‌ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.  https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
    మే 01 , 2024
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.  ప్రకాష్‌ రాజ్‌  ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్‌ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్‌.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈ సీన్‌లో నటించమని ప్రకాష్‌ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్‌ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్‌ తెగ ఆలోచిస్తుంటారు.  https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp మహేష్‌ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన స్పైడర్‌ (Spyder) సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్‌ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్‌ కెరీర్‌లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.  మోహన్‌ బాబు 2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్‌ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్‌ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్‌ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.  https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X వెంకటేష్‌  టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్‌ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్‌.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.  రామ్‌ చరణ్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్‌ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్‌ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. అసలు చరణ్‌.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.  https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db ప్రభాస్‌ ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్‌’.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్‌ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ను డైరెక్టర్‌ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.  https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
    ఏప్రిల్ 30 , 2024
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ నవ్వించిందా?
    నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి.. దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి సంగీతం: అజయ్‌ అరసద రచన & నిర్మాత: మహి వి రాఘవ్ స్ట్రీమింగ్‌ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ: 15-03-2024 ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌ కూడా వచ్చింది. ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.  కథ 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య  కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్‌ లీడ్‌ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే ‘సేవ్‌ ద టైగర్స్‌ 2’లో మహి వి రాఘవ్‌ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్‌ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్‌ న్యూస్‌.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్‌ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్‌ ఈ సిరీస్‌ ద్వారా మంచి సందేశం ఇచ్చారు. టెక్నికల్‌గా  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్‌ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనకామెడీ సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  
    మార్చి 15 , 2024
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Mamita Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    మలయాళ నటి 'మమితా బైజు' (Mamita Baiju) పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఇటీవల వచ్చిన 'ప్రేమలు' (Premalu) చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూగా కనిపించి యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. దీంతో నెట్టింట ఆమె పేరు తెగ ట్రెండ్‌ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మమితా బైజు’ ఎవరు? ఆమె నటించిన చిత్రాలు ఏంటి? ఆమె కుటుంబ నేపథ్యం? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  కేరళ కొట్టాయం జిల్లాలోని కిడంగూర్‌ ప్రాంతం.. మమితా బైజు స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు డా.బైజు క్రిష్ణణ్‌, మిని. మమితా సోదరుడి పేరు మిథున్‌.  కిడంగూర్‌లోని మేరి మౌంట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌ హైయర్‌ సెకండరీ స్కూల్స్‌లో మమిత పాఠశాల విద్యను అభ్యసించింది. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.  పాఠశాల రోజుల నుంచి మమిత సాంస్కృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ సమయంలోనే 'సర్వోపరి పలక్కరన్‌' (2017) అనే మలయాళ చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది.  ఆమె రెండో చిత్రం ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’ కూడా అదే ఏడాదిలో విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్‌ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌’, ‘ఆపరేషన్‌ జావా’ వంటి విభిన్నతరహా చిత్రాల్లో మమిత నటించింది.  2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్‌ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకుంది.  గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్‌ అండ్‌ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.  'ఖోఖో' సినిమాలోని ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో 'కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్ అవార్డ్‌' అందుకుంది.  మమిత 16వ చిత్రం 'ప్రేమలు'.. మలయాళంతోపాటు తెలుగులోనూ ఘన విజయం అందుకుంది. ఇందులోని ఆమె అందం, నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఈ సినిమాని తెలుగులో రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ హక్కులు తీసుకొని విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకధీరుడు రాజమౌళి.. మమితపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు అందరూ అంతర్జాలంలో వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'రెబల్‌' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.  తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని మమిత తాజా ఇంటర్యూలో తెలిపింది.  తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని పేర్కొంది. ‘మగధీర’ ‘ఈగ’ సినిమాలను ఎన్నోసార్లు చూశానని చెప్పింది.  తెలుగులో ఇష్టమైన నటుడు 'అల్లు అర్జున్' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆయనతో నటించే ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపింది.  మమితకు కూచిపూడి నృత్యంలో ప్రవేశం ఉంది. ఓసారి స్కూల్‌లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో.. ఆమెకు తొలి చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టిందట. ఆమె తండ్రి బైజు క్రిష్ణన్‌ వైద్యుడు కావడంతో తనలాగే కుమార్తెనూ డాక్టర్‌ని చేయాలని ఆయన భావించారట. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.
    మార్చి 14 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.  కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.  https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.  గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి  ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా  మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.  సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. 
    మార్చి 09 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.  భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.  దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.  గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు.   తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.   అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.  https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -  మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.   https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.  https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)  - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.  https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.  https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.  https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.  https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.  https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.  https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.  https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.  https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023

    @2021 KTree