• TFIDB EN
  • ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
    UATelugu
    మారేడుమిల్లి గ్రామంలో ఎన్నికలు నిర్వహించడానికి శ్రీపాద శ్రీనివాస్ (నరేశ్ ) ఉపాధ్యాయుడిగా వెళతాడు. నరేశ్ అక్కడకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది ? గ్రామంలో పేరుకుపోయిన ఒక్కో సమస్యలు నరేశ్‌ను ఎలా కదిలించాయి? అన్నది మిగతా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లరి నరేష్
    శ్రీపాద శ్రీనివాస్
    ఆనంది
    లచ్చిమి
    వెన్నెల కిషోర్
    ఇంగ్లీషు టీచర్
    ప్రవీణ్
    బాబు
    శ్రీతేజ్
    కంద
    కామాక్షి భాస్కర్ల
    పొల్లమ్మ
    కుమనన్ సేతురామన్ గ్రామ అధిపతి
    రవి ప్రకాష్
    పోలీస్ ఎస్పీ
    ఖయ్యూమ్
    పోలీస్ ఆఫీసర్
    జెమినీ సురేష్ఎన్నికల అధికారి
    శని సాల్మన్
    రఘు బాబు
    మార్కెట్ యార్డు కార్యదర్శి కోటేశ్వరరావు
    సంపత్ రాజ్
    జిల్లా కలెక్టర్
    సిబ్బంది
    ఏఆర్ మోహన్దర్శకుడు
    రాజేష్ దండానిర్మాత
    శ్రీచరణ్ పాకాల
    సంగీతకారుడు
    కథనాలు
    REVIEW: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం హిట్టా? ఫట్టా?
    REVIEW: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం హిట్టా? ఫట్టా?
    ]కథ అల్లరి నరేశ్ నటన మాటలుబలాలుబలహీనతలుకథనం ఎమోషనల్ మిస్ అవ్వటం కథ అంచా వేసే విధంగా ఉండటంరేటింగ్‌: 2.5Download Our App
    ఫిబ్రవరి 14 , 2023
    <strong>హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    వరంగల్‌కు చెందిన ఆనంది(Anandi).. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ తెలుగింటి అందం మెయిన్‌ హీరోయిన్‌గా చేసింది. మరి ఆనంది గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆనంది అసలు పేరు? రక్షిత ఆనంది ముద్దు పేరు? హసిక ఆనంది ఎప్పుడు పుట్టింది? 1993, జులై&nbsp; 30న జన్మించింది ఆనంది ఎక్కడ పుట్టింది? ఆనంది వరంగల్‌లో జన్మించింది. ఆనంది నటించిన తొలి సినిమా? ఈరోజుల్లో(2012)&nbsp; ఆనంది తమిళ్‌లో నటించిన తొలి సినిమా పోఱియాళన్ ఆనంది ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; ఆనంది అభిరుచులు? డ్యాన్సింగ్ ఆనందికి&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ ఆనందికి ఇష్టమైన కలర్?&nbsp; &nbsp;బ్లాక్ ఆనందికి ఇష్టమైన హీరో? మహేష్ బాబు ఆనంది&nbsp; ఏం చదివింది? డిగ్రీ ఆనంది పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 50లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఆనంది సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది ఆనంది వివాహం ఎప్పుడు జరిగింది? 2021 జనవరి 7న తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆనంది పెళ్లి జరిగింది. https://www.youtube.com/watch?v=LzEupj3YxAc ఆనంది&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kayal_anandhi/
    అక్టోబర్ 22 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    2022 Round Up : టాలీవుడ్‌లో టాప్- 5 సంగీత దర్శకులు వీరే!
    2022 Round Up : టాలీవుడ్‌లో టాప్- 5 సంగీత దర్శకులు వీరే!
    ]శ్రీచరణ్ పాకాలసినిమాలు : డీజే టిల్లు, మేజర్, ఇట్లు మారేడిమిల్లు ప్రజానీకంవివేక్ సాగర్సినిమాలు : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అంటే సుందరానికీలిస్టులో వీరు కూడా..
    ఫిబ్రవరి 13 , 2023
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,&nbsp; కౌషిక్‌ మెహతా, నాగ&nbsp;మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,&nbsp; కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. &nbsp; సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఇడియట్, కిక్, విక్రమార్కుడు, వంటి&nbsp; చిత్రాలు సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో యూత్ ప్రేక్షకులకు రవితేజ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాస్ మహారాజా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రవితేజ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రవితేజ అసలు పేరు? రవి శంకర్ రాజు భూపతి రాజు రవి తేజ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రవితేజ హీరోగా తొలి సినిమా? నీకోసం రవితేజ ఎక్కడ పుట్టాడు? జగ్గంపేట, ఆంధ్రప్రదేశ్ రవితేజ పుట్టిన తేదీ ఎప్పుడు? 1968 జనవరి 26 రవితేజ భార్య పేరు? కళ్యాణి రవితేజ ఫెవరెట్ హీరోయిన్ శ్రీదేవి రవితేజకు ఇష్టమైన సినిమా? షోలే రవితేజకు ఇష్టమైన హీరో? అమితాబ్ బచ్చన్, చిరంజీవి రవితేజ తొలి హిట్ సినిమా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజకు ఇష్టమైన కలర్? బ్లాక్ రవితేజ హీరోగా రాకముందు ఏం చేసేవాడు? కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు రవితేజ తల్లిదండ్రుల పేర్లు? భూపతిరాజు రాజగోపాల్, భూపతిరాజు రాజ్యలక్ష్మి రవితేజ ఏం చదివాడు? BA రవితేజ&nbsp; అభిరుచులు సినిమాలు చూడటం, ట్రావెలింగ్ రవితేజ ఎన్ని సినిమాల్లో నటించాడు? 70కి పైగా సినిమాల్లో నటించాడు.&nbsp; రవితేజకు ఇష్టమైన ఆహారం? ఏదైనా తింటానని రవితేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే స్వీట్స్ అంటే ఇష్టం https://www.youtube.com/watch?v=Mw8TtBVTsG4&amp;lc=UgxKe8s8VAfg-Rljt214AaABAg రవితేజ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 70కోట్లు రవితేజ సినిమాకి ఎంత తీసుకుంటాడు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.25కోట్లు తీసుకుంటాడు . రవితేజకు స్మోకింగ్ అలవాటు ఉందా? స్మోకింగ్ అలవాటు ఉంది రవితేజ మద్యం తాగుతాడా?&nbsp; తెలియదు
    మార్చి 19 , 2024
    Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!
    Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!
    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా- ఫుల్టా ట్విస్ట్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ఆరోవారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన&nbsp; అశ్వినీ శ్రీ బిగ్‌బాస్‌ హౌస్‌లో సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. నామినేషన్ల నుంచి టాస్క్‌ల వరకు తనదైన మాటతీరు బిహేవియర్‌తో ఆటను రక్తికట్టిస్తోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో అశ్వినీ శ్రీ ఎవరు అనే విషయంపై ఆసక్తి మొదలైంది. అశ్వీని శ్రీ గురించి నెటిజన్లు ఇంటర్నెట్‌లో భారీగా సెర్చ్ చేస్తన్నారు. ఆమె వయసు, చదువు, కెరీర్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకు ఈ అందాల అశ్వినీ శ్రీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్‌ కార్డు ద్వారా భోలే షవాలీ, పూజామూర్తి, నయనీ పావనీ, అంబటి అర్జున్‌తో సహా అశ్వినీ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌లో జన్మించిన అశ్వినీ శ్రీ.. చదువులో దిట్ట. ప్రతిష్టాత్మక వరంగల్ ఎన్‌ఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ అభ్యసించింది.  అంతటి మంచి కాలేజీలో చదివిన ఈ ముద్దుగుమ్మ ఏ సాప్ట్‌వేర్ జాబో మరేదో చేయకుండా మోడలింగ్, నటన వైపు అడుగు పెట్టింది. తన పెరెంట్స్‌కు తాను సినీరంగం వైపు వెళ్లడం ఇష్టం లేకున్నా తాను మాత్రం అదే రూట్‌లో ప్రయాణించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటూ ఇన్‌స్టా వీడియోలు, రీల్స్‌తో ఆకట్టుకుంటూ ఉండేది అప్పుడప్పుడూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రకారు దృష్టిలో పడుతుండేది. దీంతో భారీగా ఇన్‌స్టా ఫాలోవర్లను అయితే సంపాదించింది. తన అందానికి తగ్గట్టే ఇన్‌స్టాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్‌ను స్టేటస్‌గా పెట్టుకుంది. నన్ను సరిగా ట్రీట్ చేస్తే... డబుల్ ఫేవర్ చేస్తాను.. ఇట్లు అరేబియన్ గుర్రం అంటూ తనేంటో ఒక్కమాటలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కొంత మంది కళాకారులు అందమైన అమ్మాయిల అందాన్ని అరేబియన్ గుర్రంతో పోలుస్తుంటారు. అయితే తాను కూడా అంతటి అందగత్తెను అని చెప్పకనే చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అశ్వినీ శ్రీ సినిమా కెరీర్ పరంగా చూస్తే తాను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ... పెద్దగా గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి. బీటెక్ బాబులు, అమీర్ పేటలో వంటి సినిమాల్లో నటించింది. ఇక పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యూజిక్ షోల్లో స్టేజ్ అప్పియరెన్స్ మాత్రం ఇచ్చింది. అయితేనేం... తన అందచందాలతో కుర్రాళ్ల కామెంట్లలో ఎప్పుడూ అశ్వినీ శ్రీ నలుగుతూనే ఉంటుంది. ఇక ఇన్‌స్టాలో తాను పెట్టిన ఫోటోల గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. చీరకట్టినా, సింగిల్ పీస్ డ్రెస్‌ వేసినా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈ గుమ్మ సొంతం. హాట్ క్లివేజ్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పుడూ హుషారెత్తిస్తునే ఉంటుంది ఈ అరెబియన్ గుర్రం ప్రస్తుతం తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది.. అశ్వినీ శ్రీ.  మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ హాట్ డాల్ ఎంతవరకు నెగ్గుకొస్తోందో వేచి చూడాలి. ప్రతి వీక్‌ నామినేట్ అవుతున్న అశ్వినీ శ్రీ భారీగానే ఓట్లు సాధిస్తూ సేవ్ అవుతూ వస్తోంది.
    అక్టోబర్ 25 , 2023
    <strong>Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?</strong>
    Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్‌ తదితరులు రచన, దర్శకత్వం: సి.ప్రేమ్‌ కుమార్‌ సంగీతం: గోవింద్‌ వసంత సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజు ఎడిటింగ్‌: ఆర్‌.గోవింద రాజు నిర్మాత: జ్యోతిక, సూర్య విడుదల తేదీ: 28-09-2024 తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్‌ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్‌ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్‌ కిరణ్‌, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్‌ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్‌ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
    PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
    పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్.&nbsp; మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఆయన క్రేజ్‌ను మ్యాచ్ చేయడం అంటే అంత తేలిక కాదు. &nbsp; అటు సినీరంగంలోనూ, రాజకీయాల్లోనూ కొనసాగుతూ తనదైన ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గురించి నెటిజన్లు గూగుల్‌లో శోధన మొదలు పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ? దానికి గూగుల్ ఇచ్చిన క్రేజీ సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్ర: పవన్ కళ్యాణ్ ఇళ్లు ఎక్కడ? గూ: హైదరాబాద్‌- జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2021లో ఓ ఇళ్లును కొనుగోలు చేశాడు. అక్కడే తన&nbsp; భార్య&nbsp; అన్నా లెజ్నెవా వారి కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటంతో తన నివాసాన్ని అమరావతికి మార్చాడు. ప్ర: పవన్ కళ్యాణ్ పట్టిన రోజు ఎప్పుడు? గూ: పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 1971లో జన్మించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఎత్తు ఎంత? గూ: 1.78 మీటర్లు ప్ర: పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ పేరు? గూ: కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్ర: పవన్ కళ్యాణ్ పూర్తిగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ ఏది? గూ: కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఏ ప్రొడక్షన్ నెట్‌వర్క్‌ క్రింద సినిమాలను నిర్మిస్తున్నారు? గూ: అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్ర: పవన్ కళ్యాణ్‌ తొలి హీరోయిన్ పేరు ఏమిటి? గూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ పవన్ ఫస్ట్ హీరోయిన్ ప్ర: పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు పొందిన మొదటి భార్య గురించి? గూ: నందిని. పవన్ కళ్యాణ్‌కు నందిని సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం కావడం జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. విడాకుల అనంతరం నందిని తన పేరును జాన్వీగా మార్చుకుని డా. కృష్ణా రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? గూ: ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారు.." నాకు ఒక వ్యక్తితో బంధం కుదరలేదు. నేను మరొకరిని వివాహం చేసుకోవలసి వచ్చింది. అలాగే ఇది కోరికతోనో, వ్యామోహంతోనో జరగలేదు. అవి అలా జరిగాయి. కానీ బాధను మాత్రం మిగిల్చాయి. ప్ర: పవన్ కళ్యాణ్ ఫొన్ నంబర్? గూ: 99047081XX లాస్ట్ రెండు డిజిట్స్ మాత్రం తెలియదు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఎవరు? గూ: అన్నా లెజ్నెవా రష్యన్ మోడల్, నటి.&nbsp; తీన్‌మార్ చిత్రం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.&nbsp; వీరి వివాహం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్- ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయంలో జరిగింది. ప్ర: పవన్ కళ్యాణ్‌కు ఎంత మంది పిల్లలు? గూ: పవన్‌ కళ్యాణ్‌కు నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సంతానంగా అకీరా, ఆద్య. మూడో భార్య అన్నా లెజ్నెవాకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా జన్మించారు.
    మార్చి 19 , 2024
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
    కుర్ర హీరోయిన్ రాశి సింగ్ హాట్ ఫోటో షూట్‌తో పరువాల విందు చేస్తోంది. అందాల ప్రదర్శనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.  బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ ముద్గుగుమ్మ జీన్స్ బటన్ తొలగించి హాట్ ఫొటో షూట్ చేసింది. rashi singh ఎద, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.  దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే పంథాలో సాగుతున్నట్లు రాశి సింగ్ కనిపిస్తోంది. ఇన్‌స్టాలో హాట్ ఫోటో షూట్ తాలుకు ఫోటోలు పెడుతూ కవ్విస్తుంటుంది. ముఖ్యంగా తనకు ఇష్టమైన బ్లాక్, లైట్ పింక్ కలర్ డ్రెస్సులో నిండైన అందాలను ఎర వేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే రాశి సింగ్(Rashi singh Hot) చలాకీగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు. తెలుగులో జమ్ (2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు . అయితే ఆది సాయికుమార్ నటించిన శశి చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో మెప్పిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.  రాశి సింగ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఈమె ఛత్తీస్ గఢ్‌లోని బిలాయిలో 1994 జనవరి 5న జన్మించింది.  బిలాయిలోని కృష్ణ పబ్లిక్ స్కూల్‌లో సెకండరీ విద్యను, ముంబైలో పీజీ చదివింది. రాశి సింగ్‌కు డ్యాన్స్ చేయడం, సాంగ్స్ వినడమంటే ఇష్టం ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన "భూతద్దం భాస్కర్ నారాయణ'' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విలేజ్ క్లైమ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమా విజయంపై రాశి సింగ్(Rashi singh Movies) గంపెడు ఆశలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే అవకాశాలు దారి చూపుతాయని కలలు కంటోంది. 
    ఫిబ్రవరి 26 , 2024
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోమారు తన క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్‌ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.&nbsp; ఫెయిర్‌ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో&nbsp; సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.&nbsp; తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్‌ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్‌ డెకరేట్‌ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది. గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్‌ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.&nbsp; మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.&nbsp; ‘ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.&nbsp; కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌ గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్‌-1లో సామ్ చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అప్పట్లో ఉర్రూతలూగించింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.&nbsp; బాలీవుడ్ భామ ఆలియా భట్‌ మెుదటి ప్లేస్‌ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్‌, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జనవరి 17 , 2024
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; 1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రోల్స్ రాయిస్ ఫాంటమ్&nbsp; ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్&nbsp; చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్&nbsp; ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. 2. విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన &amp; విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. 3. ప్రైవేటు జెట్‌ చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 4. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.&nbsp; 5. అంజనా ప్రొడక్షన్స్‌ 1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి.&nbsp; 6. కేరళ బ్లాస్టర్స్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.&nbsp; 7. చిరంజీవి బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్‌ 1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.&nbsp; 8. చిరంజీవి నెట్‌వర్త్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. &nbsp;
    ఆగస్టు 22 , 2023
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్‌ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్ర. అల్లుఅర్జున్‌ ఇల్లు ఎక్కడ? గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను. ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు? గూ: 8th ఏప్రిల్‌ 1983 ప్ర. అల్లుఅర్జున్ ఫోన్‌ నెంబర్‌? గూ: ... 98480 ..... అర్థమైందా? ప్ర: అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ కజిన్స్‌ అవుతారా? గూ: అవును.. అల్లు అర్జున్‌ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్‌. కాబట్టి అల్లుఅర్జున్‌ రామ్‌చరణ్‌ కజిన్స్ అవుతారు.&nbsp; ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు? గూ. అల్లుఅర్జున్‌ కేరళలో చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు. ప్ర: అల్లుఅర్జున్‌ బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు తీయట్లేదు? గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్‌ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు. ప్ర: నార్త్‌ ఇండియాలో అల్లుఅర్జున్‌ ఎందుకు ఫేమస్‌? గూ: నార్త్‌ ప్రజలు అతని డ్యాన్స్‌, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్‌ నెంబర్‌? గూ. 666 ప్ర: అల్లుఅర్జున్‌ హిందీలో మాట్లాడగలడా? గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.  ఇటీవల ‘4 ఇడియట్స్‌ రియాక్ట్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.&nbsp; ప్ర: మీరు బ్రాహ్మణులా? బన్నీ: నో (నవ్వుతూ) ప్ర: మీరు చిరంజీవికి బంధువా? బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు? బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు ప్ర. మీ ఫేవరేట్‌ రంగు? బన్నీ: బ్లాక్ ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు? బన్నీ: షూటింగ్‌ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా. అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్‌ వీడియోలో చూడండి. https://youtu.be/yoRVoy8hqmI
    ఏప్రిల్ 07 , 2023
    <strong>EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;</strong>
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; [toc] సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    అక్టోబర్ 22 , 2024
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan) టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.&nbsp; సింగపూర్‌లో మైనపు విగ్రహం నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nilzrav/status/1840120654193897699 ఫస్ట్‌ తెలుగు హీరోగా రికార్డు! టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్‌ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో చరణ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్‌ తెలుగు యాక్టర్‌ రామ్ చరణ్‌ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్‌ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్‌ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.&nbsp; చరణ్‌ కంటే ముందే..&nbsp; మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్‌ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బాలీవుడ్‌ స్టార్స్‌ విగ్రహాలు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ కండల&nbsp; వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.&nbsp; చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్‌, సుకుమార్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?</strong>
    Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : టొవినో థామస్‌, చెంబన్‌ వినోద్‌, రోషన్‌ మ్యాథ్యూ, రీమా క‌ల్లింగ‌ల్‌, షైన్‌ టామ్‌ చాకో, అభిరామ్‌ రాధా కృష్ణ డైరెక్టర్‌: ఆషిక్‌ అబు సినిమాటోగ్రఫీ : గిరిష్‌ గంగాధరన్‌ ఎడిటింగ్‌ : వి. సాజన్‌ సంగీతం : బిజిబాల్‌, రెక్స్‌ విజయన్‌ నిర్మాతలు : అషిక్‌ అబు, రీమా కల్లింగల్‌ ఓటీటీ : ఆహా డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఈ వారం ఓ మ‌ల‌యాళ హ‌ర్ర‌ర్ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1964లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీల‌వెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామ‌స్‌, రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అశిక్ అబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి స‌ముద్ర‌తీరానికి స‌మీపంలో ఉన్న ప‌ల్లెటూళ్లో భార్గ‌వి నిల‌యం చాలా రోజులుగా మూత‌ప‌డి ఉంటుంది. ఆ బంగ‌ళా పేరు వింట‌నే ఊరివాళ్లు వ‌ణికిపోతుంటారు. భార్గ‌వి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ‌గా మారి ఆ ఇంట్లో తిరుగుతుంద‌ని అందులో అడుగుపెట్టిన వారిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బ‌షీర్ (టోవినో థామ‌స్‌) అనే రైట‌ర్ ఆ ఊరికి కొత్త‌గా వ‌స్తాడు. భార్గ‌వి నిల‌యం చ‌రిత్ర గురించి తెలియ‌క అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్‌ (రోష‌న్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్ట‌రీని బ‌షీర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ర‌చ‌యిత పాత్ర‌లో టోవినో థామ‌స్ న‌ట‌న బాగుంది. అత‌డి లుక్‌, డైలాగ్ డెలివ‌రీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్‌ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంట‌గా రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మ‌థ్యూ ప‌ర్వాలేద‌నిపించారు. విల‌న్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్‌ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఆషిక్‌ అబు ఒక రొటిన్‌ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ ర‌చ‌యిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్‌ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్‌ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్‌ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్‌ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్‌ స్టోరీ, బోరింగ్‌ లవ్ ట్రాక్‌, రెగ్యులర్ హార్రర్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టోవినో థామస్‌ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ హార్రర్‌ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్‌ అంశాలు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!</strong>
    Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!
    గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్‌’ (Salaar: Part 1 - Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్‌ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్‌ ఆడియన్స్‌కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ మూడు చిత్రాలు లోడింగ్‌..! ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్‌ స్టార్‌ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ లైనప్‌లో ఐదు బిగ్‌ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్‌ మారుతీతో ‘రాజా సాబ్‌’ (Raja Saab), సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్‌’ను 2025 ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్‌ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్‌ నెలలో) రిలీజ్‌ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్‌ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు! ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్‌ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్‌ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్‌ నుంచి ‘ఆదిపురుష్’, సలార్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్‌ డిసెంబర్‌లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్‌ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్‌ చేయడానికి తారక్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు తడబడుతుంటే ప్రభాస్‌ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.&nbsp; రేసుకు తెరలేపిన ప్రభాస్‌! ప్రభాస్ అప్‌కమింగ్‌ చిత్రం 'రాజా సాబ్‌'ను 2025 సమ్మర్‌ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్‌ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య 'తండేల్‌' (Thandel), నాగార్జున - ధనుష్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'కుబేర' (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యష్‌ నటిస్తున్న 'టాక్సిక్‌' (Toxic) కూడా సమ్మర్‌ -2025 టార్గెట్‌గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్‌ నటిస్తున్న 'సికిందర్‌' కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్‌ సినిమా డేట్‌ను లాక్‌ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్‌లోనే రిలీజ్‌ అవుతాయా? లేక ప్రీపోన్‌ లేదా పోస్ట్‌ పోన్‌ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.&nbsp;&nbsp;
    జూలై 30 , 2024
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2,  ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అడవి శేషు అసలు పేరు? అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర అడవి శేషు ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు అడవి శేషు తొలి సినిమా? సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.  అడవి శేషుకు వివాహం అయిందా? ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు? 5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.&nbsp; అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్? అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అడవి శేషుకు ఇష్టమైన కలర్? బ్లాక్, వైట్ అడవి శేషు పుట్టిన తేదీ? 17 December 1984 అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు? చంద్ర, భవాని అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం? కాలీఫోర్నియా అడవి శేషు ఏం చదివాడు? అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు? అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.&nbsp; అడవి శేషుకు ఇష్టమైన ఆహారం? అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు అడవి శేషు ఇల్లు ఎక్కడ? అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
    మార్చి 21 , 2024
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్&nbsp; ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.&nbsp; వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్‌ వర్క్స్ రీ సెల్లింగ్&nbsp; వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
    మార్చి 21 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.&nbsp; https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.&nbsp; https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024

    @2021 KTree