• TFIDB EN
  • జై భీమ్
    UATelugu2h 44m
    రాజన్న నిజాయతీ గల గిరిజనుడు. స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లో చోరి జరగడంతో రాజన్నను పోలీసులు అరెస్టు చేస్తారు. నేరం ఒప్పుకోమని చిత్రవదకు గురిచేస్తారు. ఈ క్రమంలో రాజన్న స్టేషన్‌ నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్తారు. దీంతో భర్త రాజన్న కోసం చిన్న తల్లి ఎలాంటి పోరాటం చేసింది? అడ్వొకేట్‌ చంద్రు (సూర్య) ఆమెకు ఎలా అండగా నిలిచాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సూర్య
    అడ్వా. చంద్రు
    లిజోమోల్ జోస్
    కె. మణికందన్
    రజిషా విజయన్
    ప్రకాష్ రాజ్
    గురు సోమసుందరం
    బేబీ జోషికా మాయ
    రావు రమేష్
    తమిస్హ్
    సూపర్‌గుడ్ సుబ్రమణి
    బాల హసన్
    ఎం. చినరాసు
    సుబత్రా రాబర్ట్
    రాజేంద్రన్
    జయప్రకాష్
    ఎంఎస్ భాస్కర్
    ఇళవరసు
    ఎలాంగో కుమారవేల్
    జయ రావు
    సుజాత శివకుమార్
    బావ చెల్లదురై
    సిబ్బంది
    T. J. జ్ఞానవేల్దర్శకుడు
    జ్యోతిక
    నిర్మాత
    సూర్య
    నిర్మాత
    T. J. జ్ఞానవేల్రచయిత
    సీన్ రోల్డాన్
    సంగీతకారుడు
    SR కతీర్
    సినిమాటోగ్రాఫర్
    ఫిలోమిన్ రాజ్
    ఎడిటర్ర్
    కథనాలు
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.  రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.  భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.  గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.  రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు.  
    జూన్ 28 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే? 
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే? 
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.  టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.  గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన  తాజా చిత్రం  ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    <strong>HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?</strong>
    HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
    తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్‌ నటనతో సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్‌ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; సూర్య అసలు పేరు ఇదే! సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్‌ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్‌ (Vijay)తో కలిసి సూర్య నటించాడు. ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి! సూర్య తండ్రి శివ కుమార్‌ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్‌ శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్‌ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.&nbsp; రూ.600 జీతంతో ఉద్యోగం హీరోగా నటించిన తండ్రి శివకుమార్‌, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.&nbsp; కెమెరా ఫియర్‌ కెరీర్‌ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్‌ చెప్పడం, ఎమోషన్స్‌ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్‌ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట. రఘువరన్‌ వ్యాఖ్యలతో మార్పు సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు. తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు షార్ట్‌ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై’వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.&nbsp; సూర్య డబ్బింగ్‌ చెప్పారని తెలుసా! ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్‌ వెర్షన్‌లో హీరో అభిషేక్‌ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్‌ చూపించారు. అవార్డులే అవార్డులు 27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్‌, 5 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌, 2 సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డ్స్‌, 2, ఎడిసన్‌ అవార్డ్స్‌, 2 సైమా అవార్డ్స్‌, 6 విజయ్ అవార్డ్స్‌ అందుకున్నారు.&nbsp; సేవా కార్యక్రమాలు మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్‌’ను ప్రారంభించడం గమనార్హం. ‘కంగువా’గా రాబోతున్న సూర్య&nbsp; సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్‌ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
    జూలై 23 , 2024
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ &amp; శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.&nbsp; గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.&nbsp; చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో&nbsp; 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్‌ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; రాజమౌళి ఏమన్నారంటే? రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం గ్లోబల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. 'మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను' అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1769897700923990284 జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ! జపాన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్‌ (తారక్‌)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్‌) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; రాజమౌళికి అపురూప కానుక బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
    మార్చి 19 , 2024
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్‌ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్‌ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఎవరు? టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం ప్రీతి ముకుందన్‌ పుట్టిన తేదీ? జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఎవరు? తన పేరెంట్స్‌ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఏం చదివారు? ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ప్రీతి ముకుందన్‌ ఎక్కడ చదివారు? నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T) ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా? ఈ భామకు డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు? ప్రీతి తొలుత క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆ తర్వాత హిప్‌హాప్‌, సినీ ఫోక్‌, వెస్టర్న్‌ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఏవి? మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్‌ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రీతి ముకుందన్‌ తొలి చిత్రం ఏది? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఫ్యూజర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం తమిళంలో స్టార్‌ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కెవిన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్‌ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్‌, ఫుడ్‌ ఏవి? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్లు, ఫుడ్‌ గురించి ప్రీతి ముకుందన్‌ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ? https://www.instagram.com/preity_mukhundhan
    మార్చి 22 , 2024
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా డబుల్ గుడ్‌న్యూస్‌ ప్రకటించారు.  డబుల్‌ ధమాకా ఏంటంటే? ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్‌.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్‌ ప్రసారం అవుతుందని డైరెక్టర్‌ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ‌అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్‌ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది. https://twitter.com/PrasanthVarma/status/1766116151636140450 మరి తెలుగులో ఎప్పుడు? హనుమాన్‌ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్‌ భరించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.  తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు! హనుమాన్‌ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్‌ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్‌ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్‌ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్‌’ హౌస్‌ఫుల్‌ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1766064148956532944 సీక్వెల్‌లోనూ విలన్‌ అతడేనా? ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్‌ విలన్‌గా నటించిన 'వినయ్ రాయ్‌' (Vinay Roy) పార్ట్‌ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్‌ రాయ్‌కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పోస్టు చేశారు. వినయ్‌ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కు మాస్క్, బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్‌ సిబ్బందికి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు.. 'జై హనుమాన్‌'లోనూ వినయ్‌ విలన్‌గా కనిపిస్తాడా? అనే డౌట్‌ను రెయిజ్‌ చేస్తున్నారు. https://twitter.com/PrasanthVarma/status/1765336587184034177
    మార్చి 09 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.&nbsp; ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.&nbsp; https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు&nbsp; దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..&nbsp; డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Jr.NTR: తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
    Jr.NTR: తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? ఫొటో వైరల్!
    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్‌ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. భీమ్‌ పాత్రలో తారక్‌ నటన చూసి బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్‌ 2’ (War 2)లో తారక్‌ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్‌ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తారక్‌ లుక్‌ పూర్తిగా మారిపోయింది. దీంతో తారక్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా? అన్న సందేహాలను సోషల్‌ మీడియాలో వ్యక్తమయ్యాయి. అసలేం జరిగిదంటే? బాలీవుడ్‌ స్టార్స్ హృతిక్‌ రోషన్‌, టైగర్ ష్రాఫ్‌ నటించిన 'వార్‌' చిత్రం.. 2019లో విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్‌ 2’లో తారక్‌ నటిస్తుండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వార్ 2 షూటింగ్‌ కోసం ముంబయి వెళ్లిన తారక్‌తో ఈ బ్యూటీ ఓ సెల్ఫీ దిగింది. వీరిద్దరు జిమ్‌లో ఈ సెల్ఫీ దిగగా.. ఇందులో తారక్‌ చాలా యంగ్‌గా కనిపించాడు. ఈ ఫొటోలో తారక్‌ లుక్‌ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తారక్‌.. ప్లాస్టిక్‌ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఊర్వరి ఈ ఫోటోను ఫిల్టర్‌ చేసి పోస్టు చేసిందని తెలియడంతో అంతా నవ్వుకుని ఊరుకున్నారు. ఫిల్టర్‌ ద్వారా నీ అందం పెంచుకునేందుకు.. మా తారక్‌ అన్నను ఇలా మార్చేశావా? అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) తారక్‌ జోడీగా యానిమల్‌ బ్యూటీ! బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri).. యానిమల్ చిత్రంలో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రే ఈ భామకు పెద్ద ఎత్తున&nbsp; ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారంలో 'వార్‌ 2' కోసం దీప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే త్రిప్తిని తారక్‌కు జోడీగా తీసుకున్నారా? లేదా హృతిక్‌ రోషన్‌కి జంటగానా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైన నేపథ్యంలో త్రిప్తి దిమ్రీ తారక్‌కు జోడీగా నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; పది రోజులు అక్కడే.. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తారక్‌ కాస్త నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఓ ఇండియన్‌ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం తారక్‌ రెండ్రోజుల క్రితం ముంబయిలో అడుగుపెట్టాడు. పది రోజుల పాటు అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. వార్‌ 2 కోసం తారక్‌ 60 రోజుల కాల్షీట్స్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబయిలో తారక్‌ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
    ఏప్రిల్ 15 , 2024
    Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
    Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
    ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్‌ (Jai Shree Ram) నినాదాలతో యావత్‌ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం. ఆదిపురుష్‌ రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Aadipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్‌ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్‌’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.&nbsp; శ్రీరామ రాజ్యం బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి. శ్రీ రామదాసు శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్‌ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు. దేవుళ్లు తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్‌, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్‌ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.&nbsp; బాల రామాయణం చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం 'బాల రామాయణం' (Bala Ramayanam). గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.&nbsp; శ్రీ సీతారామ జననం 1944లో విడుదలైన 'శ్రీ సీతా రామజననం' (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్‌ కూడా ఇచ్చారు. సీతారామ కళ్యాణం&nbsp; నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్‌, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్‌.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.&nbsp; సంపూర్ణ రామాయణం టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.&nbsp; లవకుశ నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్‌ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.&nbsp;
    జనవరి 23 , 2024
    <strong>Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!</strong>
    Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!
    జూ.ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్‌ అడిగిన ప్రశ్నలకు తారక్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఫన్నీ చిట్‌చాట్‌.. యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీమ్‌ చిట్‌ చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో సందీప్‌ రెడ్డి వంగాతో పాటు తారక్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.&nbsp; https://twitter.com/i/status/1834829086482698288 'దేవర' ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు? దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మహేష్‌ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్‌ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 'దేవర'పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; హైదరాబాద్‌లో ఈవెంట్‌ ‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు&nbsp; సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్‌ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. సందీప్‌ మూవీలో తారక్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>68th Filmfare Awards South 2023: బెస్ట్‌ యాక్టర్స్‌గా రామ్‌చరణ్‌, తారక్‌.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!</strong>
    68th Filmfare Awards South 2023: బెస్ట్‌ యాక్టర్స్‌గా రామ్‌చరణ్‌, తారక్‌.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!
    దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్‌ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్‌ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; ఫిల్మ్‌ఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్క్‌ 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్‌చరణ్‌, తారక్‌), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ (ప్రేమ్‌ రక్షిత్‌), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (సాబు సిరిల్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ('కొమురం భూముడో' సాంగ్‌ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.&nbsp; ‘సీతారామం’కు అవార్డుల పంట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత టాలీవుడ్‌ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం&nbsp; చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రెండు అవార్డులు, పవన్‌ కల్యాణ్‌ నటించిన 'భీమ్లా నాయక్‌'కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp;&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డ్స్‌ ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్ ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్) ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్) ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్‌) - కాల భైరవ (కొమురం భీముడో పాటకు) సీతారామం అవార్డ్స్‌ ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి) ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్&nbsp; (సీతారామం) ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం) ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్‌) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..) ఇతర చిత్రాలు ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం) ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాటపర్వం) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
    జూలై 12 , 2024
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (Vey Dharuvey). యషా శివకుమార్‌ హీరోయిన్‌. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రజాకార్‌&nbsp; బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; తంత్ర యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్‌ ధ్రువన్‌ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.&nbsp; షరతులు వర్తిస్తాయి! చైతన్యరావ్‌, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌ సంయుక్తంగా నిర్మించారు.&nbsp; లైన్‌మ్యాన్‌ త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్‌’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.&nbsp; రవికుల రఘురామ ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్‌ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది. లంబసింగి&nbsp; భరత్‌ రాజ్‌ హీరోగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్‌ తన్నీరు నిర్మించారు.&nbsp; యోధ సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఇతర చిత్రాలు పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateHanuman&nbsp;MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution&nbsp;MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean&nbsp;SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
    మార్చి 11 , 2024
    <strong>Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!</strong>
    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!
    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్‌ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; ‘స్పిరిట్‌’లో విలన్‌గా తారక్‌? ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్‌ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp; ఎక్కడ కలిశారంటే? సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్‌ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్ ఉన్న సందీప్‌ రెడ్డి వంగాను తారక్‌ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.&nbsp; తారక్‌తో స్పెషల్‌ ఇంటర్యూ! దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్‌ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్‌, సందీప్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.&nbsp; ట్రైలర్‌ రన్‌టైమ్‌ ఫిక్స్‌! రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌&nbsp; 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్‌ కూడా యాక్షన్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్‌ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; లవ్‌ గురు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ చిత్రం.. ‘లవ్‌ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్‌ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. డియర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌’ (Dear). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.&nbsp; బడేమియా ఛోటేమియా బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.&nbsp; మైదాన్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో చేశాడు. అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఓం భీమ్ బుష్‌ ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.&nbsp; గామి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.&nbsp; ప్రేమలు&nbsp; మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu&nbsp;AhaApril 09PremaluMovieTelugu&nbsp;AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
    ఏప్రిల్ 08 , 2024
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో&nbsp; అంతం చేస్తాడు. అటువంటి&nbsp; బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.&nbsp; భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.&nbsp; కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.&nbsp; కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.&nbsp; రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో&nbsp; రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.&nbsp; పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.&nbsp; అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.&nbsp; పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.&nbsp; సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.&nbsp; బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.&nbsp; అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.&nbsp;
    ఫిబ్రవరి 29 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024

    @2021 KTree