• TFIDB EN
  • జనక అయితే గనక
    UATelugu
    మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన ప్రసాద్‌ (సుహాస్‌) బెస్ట్ ఇవ్వలేనని భావించి పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ఈ క్రమంలో అనూహ్యంగా భార్య ప్రెగ్నెంట్‌ అవుతుంది. దీంతో కండోమ్‌ కంపెనీపై ప్రసాద్‌ కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగింది? తండ్రయ్యాక ప్రసాద్‌లో వచ్చిన మార్పు ఏంటి? ఇంతకీ కేసు గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    రివ్యూస్
    YouSay Review

    Janaka Aithe Ganaka Review: కండోమ్‌ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?

    యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ ...read more

    How was the movie?

    తారాగణం
    సుహాస్
    రాజేంద్ర ప్రసాద్
    మురళీ శర్మ
    వెన్నెల కిషోర్
    సంగీత విపిన్
    ఆచార్య శ్రీకాంత్
    గోపరాజు రమణ
    సిబ్బంది
    సందీప్ రెడ్డి బండ్లదర్శకుడు
    హన్షిత రెడ్డినిర్మాత
    హర్షిత్ రెడ్డినిర్మాత
    కథనాలు
    <strong>Janaka Aithe Ganaka Review: కండోమ్‌ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?</strong>
    Janaka Aithe Ganaka Review: కండోమ్‌ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?
    నటీనటులు : సుహాస్‌, సంకీర్తన విపిన్‌, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు రచన, దర్శకత్వం : సందీప్‌ రెడ్డి బండ్ల సంగీతం : విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి విడుదల తేదీ: అక్టోబర్‌ 12, 2024 యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా చేసింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా రెండ్రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్‌ వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి వ్యక్తి. తండ్రి తనకు బెస్ట్ ఇవ్వలేకపోవడంతో తాను మాత్రం తన పిల్లలకి అన్నీ విషయాల్లో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. రూ.30 వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్థోమత లేకపోవడంతో పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ప్రసాద్ భార్య (సంగీత విపిన్) కూాడా ఇందుకు అంగీకరిస్తుంది. ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోతాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని భావించిన ప్రసాద్‌ సదరు కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రసాద్ లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? ఈ కేసు ప్రసాద్‌ గెలిచాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే మధ్యతరగతి హీరో పాత్రలో మరోమారు సుహాస్‌ అదరగొట్టాడు. తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించేశాడు. పిల్లలు వద్దు అని మంకు పట్టు పట్టిన వాడు తండ్రైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రసాద్‌ భార్య పాత్రలో సంకీర్తన అద్భుత నటన కనబరిచింది. భర్త చెప్పిన మాటను జవదాటని ఇల్లాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు సైతం మెప్పిస్తాయి. నటీనటులు అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1843884507679863162 డైరెక్షన్‌ ఎలా ఉందంటే కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల వంద మార్కులు కొట్టేశాడు. రొటిన్‌ సినిమాలకు భిన్నంగా కొత్తగా మూవీని ప్రజెంట్‌ చేసే ప్రయత్నం చేశారు. సాధారణ మధ్యతరగతి వాడి బతుకు ఎలా ఉంటుంది? పెళ్లైన తరువాత వాడు పడే తిప్పల్ని, ఖర్చుల్ని లెక్కలతో సహా కళ్లకి కట్టారు. అయితే బిడ్డ కడుపులో పడ్డాక వచ్చే కొన్ని సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. పిల్లలు వద్దనుకునే జంటకు ఈ కథ బాగా కనెక్ట్‌ అయ్యేలా తీశారు. అటు కోర్టు సన్నివేశాలను సైతం ఎంతో సరదాగా తెరకెక్కించి ఆడియన్స్‌కు గిలిగింతలు పెట్టారు దర్శకుడు. కొన్ని కోర్టు సీన్లు, పిల్లల ఖర్చుల విషయంలో లాజిక్‌లు మిస్ అయినా కామెడీతో వాటిని నెట్టుకొచ్చేశారు. ఊహాకందేలా కథనం సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సాంకేతికంగా&nbsp; టెక్నికల్‌ అంశాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనంసుహాస్‌ నటనకామెడీసంగీతం మైనస్ పాయింట్స్‌ మెరుపులు లేకపోవడంఊహాజనితంగా స్టోరీ సాగడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 10 , 2024
    <strong>Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!</strong>
    Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!
    కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్‌ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్‌ లీడర్‌గా మారి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్‌ వేణు అనౌన్స్‌ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్‌ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. వేణు డైరెక్షన్‌లో నితిన్‌! బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌ రాజు బ్యానర్‌లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్‌, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్‌ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ మూవీకి 'యల్లమ్మ' (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని, తేజ సజ్జా రిజెక్ట్! వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 'యల్లమ్మ' స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్‌ హాఫ్‌ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్‌ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్‌ కాలేదు. ఫైనల్‌గా నితీన్‌ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ ఎప్పుడంటే? ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.&nbsp; https://twitter.com/i/status/1844354638587498984 ‘బలగం’కు అవార్డుల పంట హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్‌ రెడ్డి, మురళిధర్‌ గౌడ్‌, కోటా జయరామ్‌, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్‌ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    <strong>New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!</strong>
    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వం (Viswam) ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు&nbsp; 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి. జనక అయితే గనక (Janaka Ithe Ganaka) యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.&nbsp; జిగ్రా (Jigra) అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిగ్రా’.&nbsp; అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.&nbsp; మార్టిన్‌ (Martin) కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు లెవెల్ క్రాస్ అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva&nbsp;MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
    అక్టోబర్ 07 , 2024
    <strong>OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్‌ వీక్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’కు వర్క్‌ చేయడం విశేషం. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; 35 చిన్న కథ కాదు నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.&nbsp; జనక అయితే గనక యంగ్ హీరో సుహాస్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఉరుకు పటేలా తేజస్‌ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉరుకు పటేలా' (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe Perfect CoupleSeriesEnglishNetflixSep 05Apollo 13: SurvicalDocumentaryEnglishNetflixSep 05Bad Boys: Ride or DieMovieEnglishNetflixSep 06Adios AmigoMovieMalayalamNetflixSep 06Sector 36MovieHindiNetflixSep 13Tanav Season 2SeriesHindiSonyLIVSep 06ThalaivanMovieMalayalamSonyLIVSep 10English TeacherMovieEnglishHotstar&nbsp;Sep 03KillMovieHindiHotstar&nbsp;Sep 06Brick ToonsMovieEnglishHotstar&nbsp;Sep 04The Fall GuyMovieEnglishJio CinemaSep 03Fight Night: The Million Dollar HeistSeriesEnglishJio CinemaSep 06
    సెప్టెంబర్ 02 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సార్లు వారే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి ప్రేక్షకుల్లో తమ చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాతలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ హీరో పోస్టర్‌లో గన్‌ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాల పోస్టర్లను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? తుపాకీ పట్టుకున్న స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; భోళా శంకర్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భోళాశంకర్‌’ (Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ కానుండగా.. ఇంకా తొమ్మిది రోజులే ఉందంటూ ఇటీవల మేకర్స్‌ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో చిరు రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. యాక్షన్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌ను ‌అమితంగా ఆకట్టుకుంది.&nbsp; జైలర్‌ సూపర్‌ రజనీకాంత్‌ రీసెంట్‌గా ‘జైలర్‌’ (Jailer) మూవీ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో రజనీ గన్‌తో మెరిసారు. చేతిలో పెద్ద తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా హీరోయిన్‌గా చేసింది.&nbsp; కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ లేటెస్ట్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజయ్యింది. మునుపెన్నడూ చూడని లుక్‌లో ధనుష్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు. తుపాకీని ఫైర్‌ చేస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి అరుణ్‌ మతేశ్వరం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.&nbsp; జవాన్‌ ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘జవాన్‌’ (Jawan) చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో షారుక్‌ రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా ఆమె కూడా తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో తుపాకీతోనే దర్శనమిచ్చింది. కాగా, ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; సలార్‌ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, KGF డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. గన్‌పై చేయి పెట్టుకొని, అగ్రెసివ్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; గాండీవధారి అర్జున మెగా హీరో వరణ్‌ తేజ్‌ తాజాగా ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌లోనూ వరణ్‌ చేతిలో గన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షివైద్య హీరోయిన్‌గా చేస్తోంది. మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘సైంధవ్‌’ (Saindhav) మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఇందులో వెంకటేష్‌ చేతితో గన్‌ పట్టుకొని దాన్ని చూస్తూ కనిపించాడు. కాగా, ఈ చిత్రాన్ని సైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈగల్‌ మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్‌ నాగేశ్వర్‌ (Tiger Nageswara Rao) చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘ఈగల్‌’ (Eagle) సినిమా చేయనున్నాడు. కాగా ఈగల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని కనిపించాడు. చేతిలో గన్‌ కూడా ఉంది. కాగా, ఈ చిత్రంలో కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; స్పై&nbsp; ఇటీవలే విడుదలైన ‘స్పై’ (Spy) చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో నిఖిల్‌ కూడా పిస్టల్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp;
    ఆగస్టు 04 , 2023
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.&nbsp; అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.&nbsp; అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.&nbsp; కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.&nbsp; 1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.&nbsp; ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.&nbsp; వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.&nbsp; విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.&nbsp;
    మార్చి 22 , 2024
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్‌ బాబు.. హిట్ కొట్టాడా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్‌, సునీల్‌, అర్జున్‌ గౌడ, రవి కాలే తదితరులు దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక సంగీతం : చైతన్ భరద్వాజ్‌ ఎడిటర్‌ : రవితేజ గిరిజాల నిర్మాత : సుమంత్‌ జి. నాయుడు విడుదల తేదీ: 14- 05-2024 సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్‌ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్‌ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్‌ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్‌ తెలివితేటలతో గన్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్‌ నటనతో మెప్పించాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్‌ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్‌ పాత్రతో సునీల్‌ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్‌ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్‌.. ఇంటర్వెల్‌ ముందుకు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్‌ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్‌ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్‌ ఇస్తుందని చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సుధీర్‌బాబు నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూన్ 14 , 2024
    <strong>Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?</strong>
    Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?
    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; రన్‌ టైమ్‌ భయాలు! నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా 'సరిపోదా శనివారం' రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ టీమ్‌ యు/ఏ సర్టిఫికేట్‌ జారి చేసింది. అలాగే రన్‌ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్‌ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్‌ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; విలన్‌దే పైచేయి..! 'సరిపోదా శనివారం' చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్‌. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్‌ అండ్‌ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్‌ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్‌.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్‌ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్‌.జే. సూర్య యాక్టింగ్‌ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు.&nbsp; కథని ముందే రివీల్‌ చేస్తున్నాడు! ‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్‌.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్‌ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో నిడివి గురించి సైతం సెన్సార్‌ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్‌ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్‌.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్‌’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’ ‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్‌ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్‌లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్‌ పడుతున్న సమయంలో జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ వింటే ఆ టెన్షన్‌ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్‌ అంతగా పని పెట్టాడు.&nbsp; నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్‌ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్‌ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; హరోం హర (Harom Hara) సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్‌ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ. ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ మ్యూజిక్‌ షాప్‌ మూర్తి (Music Shop Murthy) అజయ్‌ ఘోష్‌ (Ajay ghosh) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్‌ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్‌ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ. బూమర్ అంకుల్‌ (Boomer Uncle) తమిళ స్టార్ కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్‌'. ఇందులో ఓవియా, రోబో శంకర్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్‌ ఎమ్‌.ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'నేసమ్‌ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్‌ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ. హాట్‌స్పాట్‌ (Hotspot) గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్‌'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్‌ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.&nbsp; నాగేంద్రన్స్‌ హనీమూన్‌ (Nagendran's Honeymoons) నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్‌ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.&nbsp; బహిష్కరణ (Bahishkarana) ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో&nbsp; అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.&nbsp; https://twitter.com/i/status/1802226071795896339 త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper) ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్‌ సిరీస్‌ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్‌ అకెంటెంట్‌ త్రిభువన్‌ (మానవ్‌ కౌల్‌) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్‌ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్‌ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్‌ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ. https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
    జూలై 18 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    <strong>Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారంటూ ఫైర్‌!&nbsp;</strong>
    Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారంటూ ఫైర్‌!&nbsp;
    మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ అప్పట్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ కామెంట్స్‌ వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’పై తాజాగా మాట్లాడారు. ఈ చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్‌ చేసి తప్పు చేశామని క్లాస్‌ మూవీగా ప్రమోట్‌ చేసి ఉంటే మంచి రిజల్ట్‌ వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ కావడంతో ‘గుంటూరు కారం’ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తరహాలోనే ఈ మూవీకి అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; నాగవంశీ ఏమన్నారంటే? త్రివిక్రమ్‌ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం చిత్రంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయనకు ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీ కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టిందా అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ 'గుంటూరు కారం కమర్షియల్‌గా సూపర్ హిట్. ఒక్క నైజాంలో డ్యామేజ్‌ జరిగింది తప్పితే అందరూ సేఫే కదా. అది సంక్రాంతి మూలానా జనం సొంతూర్లకు వెళ్తారు కాబట్టి ఎక్కువ వసూళ్లు రాలేదు. మేము అనుకున్నట్లు సినిమాను మీరు అనుకోలేదు. అందులో మా తప్పు కూడా ఉండొచ్చు. గుంటూరు కారం టైటిల్ పెట్టడం తప్పు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ సినిమాకు మాస్‌ టైటిల్‌ పెట్టడం రాంగ్ ఏమో. ఇంకోటి ఫ్యామిలీ సినిమాకు ఒంటి గంట షో వేయడం ఇంకో తప్పేమో' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/MB_Manish_/status/1845636287744626994 కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారని ఫైర్‌! గుంటూరు కారం చిత్రాన్ని రీసెంట్‌గా ఓటీటీ, టీవీలో చూసినవారంతా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్‌’ను థియేటర్‌లో తప్ప మళ్లీ చూడలేదని, కానీ గుంటూరు కారంను థియేటర్‌తో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్‌లోనూ రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూర్‌ అని పోస్టు పెట్టాడు. మహేష్‌ వన్‌ మ్యాన్‌ షోతో ఆకట్టుకున్నాడని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇలా గుంటూరు కారం మూవీని ఆకాశానికెత్తుతూ #GunturKaaram హ్యాష్‌ట్యాగ్‌ను ఒక్కసారిగా ట్రెండ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలోని హైలెట్‌ సీన్స్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.&nbsp; https://twitter.com/NikhilKalyan88/status/1845478831462789400 https://twitter.com/dheeraj_0718/status/1845744116237234401 https://twitter.com/RKMSD147/status/1845562518246396065 https://twitter.com/ursrulymahesh02/status/1845547017428447593 https://twitter.com/Areykrishna_/status/1845539794740216028 https://twitter.com/i/status/1845524403872051336 https://twitter.com/i/status/1845515851140825401 ‘కుర్చి మడతపెట్టి’ మరో రికార్డు! గుంటూరు కారం చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్‌ మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా మహేష్‌, శ్రీలీల స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. &nbsp; తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఈవెంట్‌ జరిగినా ఈ సాంగ్‌ మారుమోగేది. తాజాగా ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో మరో రికార్డు సొంతం చేసుకుంది. 450 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. దీంతో #KurchiMadathapetti హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌ సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/AtTheatres/status/1845773602467053815 https://twitter.com/i/status/1845743865938247921 https://twitter.com/i/status/1845712856580333801 మహేష్‌-త్రివిక్రమ్‌ మూవీలే ఎందుకు? మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు రూపొందాయి. గతంలో వచ్చిన ‘అతడు’ (Athadu), ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. కమర్షియల్‌గానూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర ఆడియన్స్‌ను మాత్రం ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అత్యధిక టీఆర్‌పీ సాధించి టెలివిజన్‌ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాను ఎలా ఫ్లాప్‌ చేశారన్న ఫీలింగ్‌ను అందరిలోనూ కలిగించాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్‌ ఓటీటీ, టెలివిజన్‌లో చూసి ప్రశంసలు కురిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫిల్మ్‌ వర్గాలు సైతం నివ్వేరపోతున్నాయి.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య&nbsp; దర్శకుడు: క్లాక్స్ సంగీతం: మణిశర్మ నిర్మాణ సంస్థ: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌&nbsp; నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)&nbsp; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్&nbsp; విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2023 కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎల్బీ శ్రీరామ్‌, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్‌ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ&nbsp; ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్‌ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్‌ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) పెద్ద ప్లాన్‌ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్‌ ఘోష్‌ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, డేనియల్‌గా రాంప్రసాద్‌ మెప్పించారు. రాజ్‌ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp; ఎలా సాగిందంటే సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడంతో కథలో వేగం మిస్‌ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్‌, బ్రహ్మం, డేనియల్‌ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్‌ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్‌ అవుతుంది.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం&nbsp; జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్‌ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో&nbsp; మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్‌ చేశాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్‌ అని చెప్పవచ్చు. సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్‌ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుహీరో, హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సీన్లు&nbsp; రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=98y83GscKEI
    ఆగస్టు 25 , 2023
    PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
    PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
    ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం. సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్‌ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం. RRR&nbsp; ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.&nbsp; KGF రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.&nbsp; పఠాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.&nbsp; పుష్ప సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మాస్త్ర అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.&nbsp; బీస్ట్ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్‌ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.&nbsp; సలార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.&nbsp; OG పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.&nbsp; LEO లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
    మే 02 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.&nbsp; వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.&nbsp; తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే&nbsp; పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.&nbsp; ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.&nbsp;&nbsp; మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్&nbsp; ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.&nbsp;
    అక్టోబర్ 31 , 2023
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే?
    న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు దర్శకత్వం: రవికాంత్ పేరేపు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 29-12-2023 రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల కుమారుడు రోష‌న్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ర‌వికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఎవరెలా చేశారంటే హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. హర్షవర్ధన్‌, అనుహాసన్‌ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్‌ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్‌ ప్రజెంట్‌ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్‌ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రోషన్‌, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్‌, క్లైమాక్స్‌ మైసన్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సీన్స్ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 29 , 2023
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.&nbsp; ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp;
    మే 28 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024

    @2021 KTree