• TFIDB EN
 • జపాన్ (2023)
  U/ATelugu
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌

  హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  కార్తీజపాన్ ముని
  సునీల్శ్రీధర్
  S. D. విజయ్ మిల్టన్కరప్పుసామి
  కెఎస్ రవికుమార్మంత్రి పజానిసామి
  వాగై చంద్రశేఖర్పెరిన్బామ్ (ఇన్బామ్)
  మహమ్మద్ ఇర్ఫాన్యూట్యూబర్
  సిబ్బంది
  రాజు మురుగన్దర్శకుడు
  SR ప్రభునిర్మాత
  రవి వర్మన్ ISCసినిమాటోగ్రాఫర్
  కథనాలు
  Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?
  Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?
  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ తొలిసారి ప్రజ్ఞాన్ రోవర్‌ను దించింది. దీంతో ఆ ప్రాంతంలో నీటి జాడకు సంబంధించిన సమాచారంతో పాటు జాబిల్లి రహస్యాల ఛేదించే ఛాన్స్‌ ఏర్పడింది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సక్సెస్‌తో ప్రస్తుతం అందరి దృష్టి చంద్రయాన్‌ 4 (Chandrayaan 4)పై పడింది. మరి ఈ ప్రయోగం ఎలా జరగనుంది. ఆ మిషన్‌ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  జపాన్‌ భాగస్వామ్యంతో.. చంద్రయాన్‌ 4 ప్రయోగం 2026లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మిషన్‌లో జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (JAXA) కూడా ఇస్రోతో కలిసి పాలుపంచుకుంటుందని సమాచారం. ఈ కొత్త ప్రాజెక్టును ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్- ల్యూపెక్స్‌ (LUPEX) అని పిలుస్తారని అంటున్నారు. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా సాగనుందని తెలిసింది.  https://twitter.com/TheIndianJosh/status/1695079947164082656?s=20 ఆ ప్రశ్నలకు ల్యూపెక్స్‌తో చెక్‌.! చంద్రయాన్‌-3 ద్వారా పంపిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నీటి జాడను మాత్రమే అన్వేషిస్తుంది. అయితే ఆ నీరు తాగడానికి అనువుగా ఉన్నాయా? లేదా? అని అది పరీక్షించలేదు. కాబట్టి చంద్రయాన్‌ 4 ద్వారా ఆ ప్రశ్నలకు చెక్‌ పెట్టనున్నారు శాస్త్రవేత్తలు. చందమామపై ఉన్న నీటి నాణ్యత ఎలా ఉంది? ఎంత నీరు ఉంది? మెుక్కల పెరుగుదలకు అనువుగా ఉందా? అనే ప్రధాన ప్రశ్నలకు ల్యూపెక్స్ మిషన్ సమాధానం వెతుకుతుంది. https://twitter.com/NorbertElikes/status/1694952827851005994?s=20 జపాన్‌ అండతో బెటర్‌ ఔట్‌పుట్‌..! చంద్రయాన్‌ 4 మిషన్‌ ద్వారా జాబిల్లిపై మనుషులు జీవించేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అనేది కూడా తెలుసుకోనున్నారు. ఇందులో ఇస్రోకు జపాన్‌ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్‌కి తిరుగులేదు. అలాంటి జపాన్ శాస్త్రవేత్తలు, ఇస్రోతో కలిస్తే బెటర్ ఔట్‌పుట్‌ రానుంది. చంద్రయాన్-4 భారీ సక్సెస్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఇస్రో టార్గెట్ అదే..! జాబిల్లిపై మానవళి అడుగు పెట్టేందుకు వీలుగా సానుకూల ఫలితాలు వస్తే ఇక ఇస్రో పూర్తిస్థాయిలో దానిపై ఫోకస్‌ పెట్టనుంది. దక్షిణ ధృవంలో కాలనీలను నిర్మించడం ఇస్రో నెక్ట్స్ టార్గెట్ కావొచ్చని అంటున్నారు. అప్పుడు ఇండియాతో పాటు అమెరికా, చైనా, తదితర దేశాలు కూడా పోటీగా వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా చందమామను రెండో ఇల్లుగా ఆయా దేశాలు మార్చుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.  https://twitter.com/dollynaaz/status/1694705190736454084?s=20 ఆందోళనలో పర్యావరణ వేత్తలు ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆశలన్నీ చందమామపైనే ఉన్నాయి. కానీ పర్యావరణ వేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి నాశనం చేస్తున్నట్లు చందమామను కూడా చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. మనుషులు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విధ్వంసం తప్ప, మంచి ఉండదని విమర్శిస్తున్నారు. 
  ఆగస్టు 28 , 2023
  HYDERABAD: హైదరాబాద్‌లో 11 వేల మంది మిలియనీర్లు… ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం!
  HYDERABAD: హైదరాబాద్‌లో 11 వేల మంది మిలియనీర్లు… ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం!
  హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. వ్యాపార అవకాశాలు, నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఎక్కువమంది మహానగరాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. నగరంలో చాలామంది మిలియనీర్లు ఉన్న కారణంగా 65వ స్థానంలో నిలిచింది. సంపన్న నగరం  ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు అవకాశం దక్కింది. హెండ్లీ అండ్ పార్టనర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 65వ స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నగరంలో మెుత్తం 11,100 మిలియనీర్లు ఉన్నారు. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని నివేదికలో వెల్లడయ్యింది. ఈ లెక్కన రోజురోజుకి సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మహానగరంలో ఉన్న అవకాశాలు ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాప్‌లో ఎవరంటే? అమెరికాలోని న్యూయార్క్ సిటీ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి అక్కడ 3,40,000 మంది మిలీయనీర్లు ఉన్నారు. జపాన్ రాజధాని టోక్యో 2,90,000 మంది మిలియనీర్లతో రెండో ప్లేస్‌లో ఉంది. శాన్‌ ఫ్రాన్సిస్కో 2,85,000, లండన్ 2,58,000, సింగపూర్ 2,40,100, లాస్ ఏంజెల్స్‌ 2,05,400 మంది సంపన్నులతో తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి.  భారత్‌లోని రాష్ట్రాలు భారత్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. 59,400 మిలియనీర్లతో ముంబయి 21వ స్థానం సంపాదించింది. దిల్లీ 30,200 మందితో 36వ స్థానంలో ఉండగా… 12,600 మంది సంపన్నులతో బెంగళూరు 60వ ప్లేస్‌లో నిలిచింది. కోల్‌కతా 12,100 మంది మిలియనీర్లతో 63వ స్థానం దక్కించుకుంది.  ఆ తర్వాత 65వ ప్లేస్‌లో నిలిచింది హైదరాబాద్‌. ఎలా నిర్ణయించారు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, సీఐఎస్, తూర్పు ఆసియా, ఐరోపా, ఆగ్నేయాసియా ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించి హెన్లీ అండ్ పార్ట్‌నర్స్‌ సంపన్న నగరాల జాబితాను రూపొందించింది. ఇందులో అమెరికా నుంచి అత్యధిక నగరాలు చోటు దక్కించుకున్నాయి. 2000 సంవత్సరంలో తొలిస్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో ప్లేస్‌కు పడిపోవడం గమనార్హం.
  ఏప్రిల్ 19 , 2023
  <strong>Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?</strong>
  Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
  నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు&nbsp; దర్శకత్వం: రాజు మురుగన్ ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్ సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు విడుదల తేదీ: నవంబర్ 10, 2023&nbsp;&nbsp; టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్‌ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్‌’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, ప్రమోషనల్‌ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ &amp; ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్‌ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్‌ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్‌, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కార్తీ నటనకామెడీ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ రేటింగ్‌: 2.5/5
  నవంబర్ 10 , 2023
  <strong>This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!</strong>
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘టైగర్‌3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ (Katrina Kaif)&nbsp;నటించింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.&nbsp; జపాన్‌ కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలా నిన్ను చేరి దినేశ్‌ తేజ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.&nbsp; ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.&nbsp; ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer&nbsp;MovieHindiZee 5Nov 10 ………………………………………………………………………………………………………………. APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
  నవంబర్ 06 , 2023
  Best Sunroof Cars below 12L: రూ.12 లక్షల లోపు లభ్యమయ్యే బెస్ట్ సన్ రూఫ్ కార్లు ఇవే..!&nbsp;
  Best Sunroof Cars below 12L: రూ.12 లక్షల లోపు లభ్యమయ్యే బెస్ట్ సన్ రూఫ్ కార్లు ఇవే..!&nbsp;
  వాహనంలో నుంచి బయటకు చూస్తే పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా, కారు లోపల నిలబడినప్పుడు ఎదురుగా వచ్చే గాలి శరీరాన్ని తాకుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు తాజా గాలిని ఆస్వాదిస్తే ఎంతో బాగుంటుంది. ఈ లగ్జరీ టచ్‌ని సన్‌రూఫ్(Sunroof) ఫీచర్ అందిస్తుంది. తొలి నాళ్లలో ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ, దీని అవసరాన్ని తెలుసుకున్న వాహన తయారీ కంపెనీలు బడ్జెట్ అనుకూల ధరల్లోనే సన్‌రూఫ్ ఫీచర్‌ని అందిస్తున్నారు. మీరు కూడా సన్‌రూఫ్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అధునాతన ఫీచర్లతో కొన్ని కార్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. మరి, రూ.12 లక్షల లోపు సన్‌రూఫ్ కలిగిన కార్లేవో చూద్దాం.&nbsp; హ్యుందాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter) సరసమైన ధరకే సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది హ్యుందాయ్ ఎక్స్‌టర్. సొగసైన డిజైన్‌తో స్పేషియస్ ఇంటీరియర్‌తో ఈ వాహనం ఆకట్టుకుంటుంది. ఇందులో కూర్చుని జర్నీ చేస్తుంటే వచ్చే కిక్కే వేరు. ఇక లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు సన్‌రూఫ్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. రూ.10.87 లక్షలకు ఈ వాహనం అందుబాటులోకి వస్తోంది.  మారుతీ సుజుకీ బ్రెజ్జా(Maruti Suzuki Brezza)&nbsp; మారుతీ సుజుకీ వాహనాలకు ఉండే గిరాకీనే వేరు. ముఖ్యంగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన మారుతి సుజుకీ బ్రెజ్జా కార్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. సన్ రూఫ్‌తో అత్యాధునిక ఫీచర్లతో బ్రెజ్జాలోని ZXI MT వేరియంట్ అందుబాటులోకి వస్తోంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.11.04 లక్షలుగా ఉంది. మార్కెట్లో మంచి ఆదరణను కలిగి ఉన్న ఈ వాహనం.. చూడ్డానికి సొగసుగానూ కనిపిస్తుంది. సబ్‌కాంపాక్ట్ SUV క్యాటగిరీలో విశేష ఆదరణను పొందింది. టాటా నెక్సాన్(TATA NEXON)&nbsp;&nbsp; దేశీయంగా నమ్మకం పొందిన వాహన తయారీ కంపెనీ టాటా(Tata). ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన టాటా నెక్సాన్ XM(S) MT వేరియంట్ సన్‌రూఫ్‌తో వస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ వాహనానికి మంచి గిరాకీ ఉంది. ఆకట్టుకునే సేఫ్టీ ఫీచర్లతో అత్యాధునిక డిజైన్‌తో ఈ వాహనం ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. టాటా నెక్సాన్ XM(S) MT వేరియంట్ ఎక్స్ షో రూం ధర రూ.9.50 లక్షలతో అందుబాటులోకి వస్తోంది.&nbsp;&nbsp;&nbsp; https://twitter.com/TataMotors_Cars/status/1692159346292244814?s=20 హ్యుందాయ్ వెన్యూ(Hyundai VENUE)&nbsp; హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎస్‌యువీ మోడల్ వాహనం హ్యుండయ్ వెన్యూ. ఇందులోని SX MT వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తోంది. ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్‌కి, అత్యాధునికి టెక్నాలజీ ఫీచర్లకు ఇది పెట్టింది పేరు. స్లీక్ డిజైన్ వెహికల్ లవర్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. సన్ రూఫ్ ఫీచర్‌ని ఆస్వాదించేందుకు అనువైన వాహనం ఇది. ఈ వాహనం ఎక్స్ షో రూం ధర రూ.11.93 లక్షలుగా ఉంది.&nbsp; కియా సోనెట్(KIA Sonet)&nbsp; కియా నుంచి విడుదలైన సబ్ కాంపాక్ట్ ఎస్‌యువీనే కియా ‘సోనెట్’. HTX MT వేరియంట్‌కి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వస్తోంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లకు ఇది కేరాఫ్. గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యువీల్లో ఇదొకటి. మార్కెట్లో కియా సోనెట్ సన్ రూఫ్ వేరియంట్‌కి మంచి పాపులారిటీ ఉంది. జర్నీలో ఉండగా రూఫ్‌ని ఓపెన్ చేస్తే తాజా, చల్లని గాలిని పొందే వెసులు బాటు ఉంటుంది. ఎక్స్ షో రూం ధర రూ.11.45 లక్షలు.&nbsp; https://twitter.com/kia_uganda/status/1691367613970972673?s=20 టొయోటా అర్బన్ క్రూయిజర్(URBAN CRUISER)&nbsp; &nbsp; జపాన్ కంపెనీ టొయోటా నుంచి విడుదలైన వాహనమే ‘అర్బన్ క్రూయిజర్’. సన్ రూఫ్ సౌలభ్యంతో టొయోటా ఈ వాహనాన్ని తీసుకొచ్చింది. అదనంగా లగ్జరీ ఫీచర్లు ఉండటం ఈ వాహనం ప్రత్యేకత. ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.9 నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉంటుంది.&nbsp; హ్యుందాయ్ ఐ20 అస్టా(Hyundai i20 Asta) పనోరమిక్ సన్‌రూఫ్‌ని ఆఫర్ చేసే వాహనాలలో హ్యుందాయ్ ఐ20 అస్టా ఒకటి. మోడర్న్ డిజైన్‌తో, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఇంటీరియర్ విశాలంగా ఉంటుంది. కాబట్టి, ఎంచక్కా కూర్చుని సన్‌రూఫ్‌ని ఓపెన్ చేసుకుంటే ఆ మజానే వేరు. తాజా గాలిని ఆస్వాదించొచ్చు.
  ఆగస్టు 18 , 2023

  @2021 KTree