• TFIDB EN
 • జవాన్ (2023)
  U/ATelugu
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌

  సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  షారుఖ్ ఖాన్ద్విపాత్రాభినయంలో
  సంచిత పదుకొనేప్రత్యేక ప్రదర్శనలో
  సన్యా మల్హోత్రా
  సునీల్ గ్రోవర్
  రిద్ధి డోగ్రా
  అస్తా అగర్వాల్
  సంజీత భట్టాచార్య
  కెన్నీ బసుమతరీ
  లెహర్ ఖాన్
  బెనెడిక్ట్ గారెట్
  విజయ్అతిధి పాత్రలో
  సంజయ్ దత్అతిధి పాత్రలో
  సిబ్బంది
  అట్లీదర్శకుడు
  గౌరీ ఖాన్నిర్మాత
  అనిరుధ్ రవిచందర్సంగీతకారుడు
  అట్లీస్క్రీన్ ప్లే
  జి.కె.విష్ణుసినిమాటోగ్రాఫర్
  రూబెన్ఎడిటర్ర్
  కథనాలు
  Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది! 
  Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది! 
  తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్‌తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్‌తో కూడిన కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్‌లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.  అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం. కథేంటంటే.. భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా  గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్‌ ఖాన్‌ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు  ఆ బుడ్డోడికి షారుఖ్‌ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్‌ రాథోడ్‌కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే? ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్‌ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్‌కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో షారుఖ్ లుక్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్‌ లెవల్లో ఉంది. విలన్‌గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.  నయనతార షారుఖ్‌తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఎలా ఉందంటే? డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్‌ను చాలా ఎంగేజింగ్‌ నడిపించి ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు.  ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.  సెకండాఫ్‌లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.  టెక్నికల్ పరంగా జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్‌లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు. బలాలు: షారుఖ్ నటన ఇంటర్వల్ ట్విస్ట్ క్లైమాక్స్ సీన్స్ BGM బలహీనతలు సెకాండాఫ్‌లో ముందే ఊహించదగిన సీన్లు చివరగా: జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్‌లు లాజిక్‌లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్‌ను పరిచయం చేస్తుంది.  రేటింగ్ 4/5
  సెప్టెంబర్ 07 , 2023
  Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
  Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
  షారుక్‌ ఖాన్ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్‌ బాక్సాఫీస్‌ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌.  ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్‌ డే నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. తాజాగా జవాన్‌ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్‌ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్‌ 7) రిలీజైన జవాన్‌ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పైగా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్‌ లెక్కల విషయానికి వస్తే వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్‌ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్‌ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్‌ గ్రాస్‌ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూళ్లను సాధించిన టాప్‌-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం.  1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.  3. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.  4. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 5. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.  6. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.  7. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  8. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.  9. కబాలి (2016) 2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. జైలర్‌ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్‌ డే హైయస్ట్ గ్రాసింగ్‌ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది.  10. పొన్నియన్ సెల్వన్‌ (2022) మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. 
  సెప్టెంబర్ 08 , 2023
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచిసెప్టెంబర్‌ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు జవాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు జైలర్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘జైలర్‌’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు.   TitleCategoryLanguagePlatformRelease DateShane GillisMovieEnglishNetflixSep 05Scout’s HonorMovieEnglishNetflixSep 05kung fu panda 3SeriesEnglishNetflixSep 07top boy season 2SeriesEnglishNetflixSep 07One shotSeriesEnglishAmazon primeSep 07Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06i'm groot season 2SeriesEnglishDisney + HotstarSep 06LoveMovieTamilAhaSep 08Love on the roadMovieEnglishBook My ShowSep 08 .
  సెప్టెంబర్ 04 , 2023
  Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
  Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
  ‘వంద కోట్లు కొల్లగొట్టిన సినిమా రా అది’ అని జనరల్‌గా మాట్లాడుకుంటుంటాం. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి కలెక్షన్లు ఒక ప్రామాణికత. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయ్? వసూళ్లెంత? అనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కలెక్షన్ల కౌంట్ ఎగబాకిన కొద్దీ సినిమా సక్సెస్ స్థాయి పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే సంప్రదాయం ఉంటుంది. ఎన్నో సినిమాలు హిట్టవుతాయి. కానీ, కొన్నే ల్యాండ్‌మార్క్ వసూళ్లను అందుకుంటాయి. రానున్న సినిమాలపై కూడా ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయగల సినిమాలేంటో చూద్దాం.  జవాన్(JAWAN) షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార.. ఇలా ప్రధాన తారాగణం నటించిన సినిమా ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెప్టెంబర్‌ 7న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. చిత్రంపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. షారూక్ ఖాన్‌ని గుండుతో చూపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటుల మార్కెట్‌, కంటెంట్‌ని బట్టి ఈ సినిమా రూ.500 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.  https://www.youtube.com/watch?v=k8YiqM0Y-78 సలార్(SALAAR) మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా ప్రభాస్ సలార్‌ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ అనంతరం, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా, సినిమాలోని నటీనటులు మూవీ గురించి గొప్పగా చెబుతుండటం మరింత ఆసక్తిని పెంచింది. కేజీఎఫ్2కి, దీనికి లింక్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్‌తో సినిమా వస్తోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీకి హొంబలే ఫిల్మ్ భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లపై కన్నేసింది. సినిమా టాక్ బాగుంటే ప్రభాస్ మార్కెట్‌కి ఇది సాధ్యమే.  https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso లియో(LEO) ‘విక్రమ్’ మూవీ బ్లాక్‌బస్టర్ అనంతరం లోకేష్ కనగరాజ్ తీస్తున్న చిత్రమే ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు దీనిని దక్కించుకున్నట్లు టాక్. దీంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఇందులో కనిపించనున్నారట. LEO - Bloody Sweet Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh యానిమల్(ANIMAL) రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించింది. ఈ మూవీ కూడా 5 భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్‌ 1కి వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  https://www.youtube.com/watch?v=EywX_uxreYA డంకీ(DUNKI) రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, సంజూ వంటి సినిమాలను తీశాడు. యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించగలడు. ఇప్పుడు షారూక్ ఖాన్‌ని ‘డంకీ’(DUNKI)గా చూపించబోతున్నాడు. పూర్తి కామెడీ చిత్రంగా రాజ్‌కుమార్ హిరాణీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ మూవీ సైతం రూ.500 కోట్లకు పైగా వసూళ్లపై కన్నేసింది.  https://www.youtube.com/watch?v=aNxd01VzJsw&t=1s
  ఆగస్టు 10 , 2023
  <strong>Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?</strong>
  Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
  ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
  జనవరి 17 , 2024
  <strong>Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!</strong>
  Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
  నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌&nbsp; విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన&nbsp; ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక&nbsp; విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.&nbsp; ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
  డిసెంబర్ 21 , 2023

  @2021 KTree