• TFIDB EN
  • జిగ్రా
    UATelugu
    సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?

    బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచు...read more

    How was the movie?

    తారాగణం
    అలియా భట్
    ఆదిత్య నంద
    శోభితా ధూళిపాళ
    మనోజ్ పహ్వా
    రవి కిషన్ శుక్లా
    హర్ష్ ఏ సింగ్
    వత్సన్ చక్రవర్తి
    రాహుల్ రవీంద్రన్
    సిబ్బంది
    వాసన్ బాలదర్శకుడు
    కరణ్ జోహార్
    నిర్మాత
    అలియా భట్
    నిర్మాత
    అపూర్వ మెహతానిర్మాత
    షాహీన్ భట్నిర్మాత
    సౌమెన్ మిశ్రానిర్మాత
    స్వప్నిల్ S. సోనావానేసినిమాటోగ్రాఫర్
    ప్రేరణ సైగల్ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలియా భట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వేదాంగ్‌ రైనా, అకాంక్ష రంజన్‌ కపూర్‌, మనోజ్‌ పహ్వా, యువరాజ్‌ విజయన్‌, జసన్ షా, ధీర్‌ హిరా, ఆదిత్య నంద తదితరులు దర్శకత్వం : వాసన్‌ బాల సంగీతం : అచింత్‌ థక్కర్‌ సినిమాటోగ్రఫీ : స్వప్నిల్‌ ఎస్‌. సోనావానే ఎడిటింగ్‌ : ప్రేర్నా సైగల్ నిర్మాతలు : కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, షాహీన్‌ భట్‌, అపూర్వ మెహతా విడుదల తేదీ : 11-10-2024 బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్‌ చేసిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్‌ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్‌ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్‌ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్‌ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వాసన్‌ బాలా జైల్‌ బ్రేక్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్‌ రిలేషన్‌ను ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్‌ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ మూవీని ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; &nbsp;ప్లస్‌ పాయింట్స్‌ అలియా భట్‌ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?</strong>
    Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?
    దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్‌’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్‌ హీరో’, ‘జిగ్రా’ మూవీస్‌ దసరా కానుకగా రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; వేట్టయన్‌ (Vettaiyan) రజనీకాంత్‌ హీరోగా టి. జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్‌ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/Filmy_Track/status/1845727131768082555 విశ్వం (Viswam) మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్‌ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం. https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627 https://twitter.com/Colliderreview/status/1845720361499083121 మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్ బాబు&nbsp; (Sudheer Babu)&nbsp; హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్‌ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.&nbsp; జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ లీడ్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్‌ 11న తెలుగు, హిందీతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్‌ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్‌ విద్యా కా వోహ్‌ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    <strong>New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!</strong>
    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వం (Viswam) ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు&nbsp; 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి. జనక అయితే గనక (Janaka Ithe Ganaka) యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.&nbsp; జిగ్రా (Jigra) అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిగ్రా’.&nbsp; అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.&nbsp; మార్టిన్‌ (Martin) కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు లెవెల్ క్రాస్ అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva&nbsp;MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
    అక్టోబర్ 07 , 2024
    <strong>Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌, జెన్నీఫర్‌, సునీల్‌, సత్య, సత్యరాజ్‌, సురేష్‌ చంద్ర మీనన్‌ తదితరులు దర్శకత్వం : ఈశ్వర్‌ కార్తిక్‌ సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌ ఎడిటింగ్‌: అనిల్ క్రిష్‌ నిర్మాతలు: ఎస్‌.ఎన్‌. రెడ్డి, బాల సుందరం, దినేష్‌ సుందరం విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review). ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్‌ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్‌ అదరగొట్టాడు. సత్యదేవ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్‌. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్‌ఫుల్‌ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్‌ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్‌ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్‌ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్‌ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ రిలేటెడ్‌ కంటెంట్‌ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్‌ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో బ్యాంక్‌ ఎంప్లాయిగా ఈశ్వర్‌ కార్తిక్‌ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్‌ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్‌తో తప్పించుకోవడం కూడా లాజిక్‌కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్‌ - డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్‌ వార్‌, సత్య కామెడీ, సునీల్‌ నటన, డైలాగ్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. బ్యాంక్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్‌ చేసి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేసత్యదేవ్‌, ధనంజయ్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ లాజిక్‌కు అందని సన్నివేశాలుఇరికించినట్లు వచ్చే పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 22 , 2024
    <strong>Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!</strong>
    Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్‌ సేన్‌ మార్కెట్‌.. సత్యదేవ్‌, ఆశోక్‌ గల్లా పరిస్థితి మరీ దారుణం!
    ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌ అయ్యాయి. మాస్‌ కా దాస్‌ విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్‌(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్‌ బరిలో నిలిచింది. అయితే విష్వక్‌, సత్యదేవ్‌ చిత్రాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా అశోక్‌ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్‌ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ‘మెకానిక్‌ రాకీ’ కలెక్షన్స్‌ ఎంతంటే విష్వక్‌ సేన్‌ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్‌ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రాలతో విష్వక్‌ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్‌ టాక్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్‌ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్‌ ఇచ్చారు. యావరేజ్‌ టాక్‌ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్‌ రాకీ తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్‌ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్‌ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్‌ రాకీ డే 1 కలెక్షన్స్‌ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.&nbsp; ‘జిబ్రా’ కలెక్షన్స్‌ ఎంతంటే సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి. దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్‌ ఎంతంటే ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్‌ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్‌ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్‌ టాక్‌ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి.&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;</strong>
    Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్‌ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్‌. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్‌ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్‌ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్‌ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.&nbsp; చిన్న చిత్రాలపై ప్రశంసలు.. చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.‌ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్‌ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్‌ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి. https://twitter.com/GulteOfficial/status/1856370891417932076 యంగ్‌ హీరోలకు భరోసా తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్‌ హీరోలకు మెగాస్టార్‌ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్‌ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్‌ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్‌ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్‌ ఫొటోలో సుహాస్‌ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్‌ రోల్‌ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.&nbsp; జపాన్‌ వెళ్లనున్న మెగాస్టార్‌! మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ&nbsp; మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్‌ వెళ్లనున్నారు.&nbsp; అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం చిరు వెనక్కి తగ్గారు.&nbsp; ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్‌ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.&nbsp;
    నవంబర్ 13 , 2024
    <strong>Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్‌!</strong>
    Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్‌!
    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zebra Movie). ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్‌ కార్తీక్‌ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar), జెన్నిఫర్‌ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్‌తో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబధించిన ప్రోమోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అయితే ఇందులో సత్యదేవ్‌పై బ్రహ్మాజీ నోరుపారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.&nbsp; ప్రోమోలో ఏముందంటే? బ్రహ్మాజీతో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నటుడు సత్యదేవ్‌ తన ఎక్స్ ఖాతాలో పంచున్నారు. ఇందులో బ్రహ్మాజీ వస్తూనే 'ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని చిరగ్గా ముఖంగా పెట్టి సత్యదేవ్‌ను అడిగారు. నువ్వు డ్యాన్స్‌ చేశావా అని ప్రశ్నించగా.. ఏదో హుక్‌ స్టెప్‌ వేశాను అని సత్యదేవ్‌ అంటాడు. 'హుక్కా.. బొక్కా' అల్లు అర్జున్‌ అయితే డ్యాన్స్ కోసం వెయిట్‌ చేస్తారు, నీకోసం ఎవరు చూస్తారు అని బ్రహ్మాజీ విసుక్కుంటాడు. జిబ్రా అనగానే థియేటర్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులు వచ్చేస్తారా అంటు మండిపడ్డాడు. సలార్‌, కేజీఎఫ్‌ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ జిబ్రాకు వర్క్‌ చేశారని సత్యదేవ్‌ చెప్పగానే బ్రహ్మాజీ బిగ్గరగా నవ్వుతాడు. అలా అని పేర్లు వేసేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. అప్పుడు సత్యదేవ్‌ నీలాగా పోస్టులు పెట్టి డిలీట్‌ చేయను అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ప్రోమోను మీరు ఓసారి చూసేయండి. https://twitter.com/i/status/1857340000733720861 మరీ ఓవర్‌ చేశారా? ప్రస్తుతం తమ సినిమాలను వినూత్నంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 'జిబ్రా' టీమ్ ఇలా బ్రహ్మాజీ, సత్యదేవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూను ప్లాన్‌ చేసింది. అయితే ఈ ప్లాన్‌ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరైన సినిమాను ప్రమోట్‌ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రోమోను పరిశీలిస్తే ప్రతీ దశలోనూ బ్రహ్మాజీ 'జిబ్రా' మూవీని ఏకిపారేయడం చూడవచ్చు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సత్యదేవ్‌ను చాలా పర్సనల్‌గా అటాక్‌ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో పోలుస్తూ నీ స్థాయి ఇంతే అన్నట్లు ఇండైరెక్ట్‌గా పంచ్‌లు వేసినట్లు ఉందన్నారు. అలాగే ‘జిబ్రా’ అనేది బ్రహ్మాండమైన సినిమా అనుకోవాలా? జనాలు ఎగబడిపోవాలా? అంటూ చేసిన కామెంట్స్‌ సినిమాపై నెగిటివిటీని పెంచేలా ఉందని చెబుతున్నారు.&nbsp; https://twitter.com/powerstarp1/status/1857413471135998113 https://twitter.com/ganeshmunju11/status/1857355491401154992 https://twitter.com/Rohit_RC_/status/1857383353298600053 బ్రహ్మాజీ అలా.. చిరు ఇలా 'జిబ్రా' సినిమా రిలీజ్‌ నేపథ్యంలో మంగళవారం (నవంబర్‌ 12)న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్‌పై ప్రశంసలు కురిపించాడు. తనకు మూడో తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తాడు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్‌ అతడిలో ఉన్నాయని చెప్పారు. మంచి నటుడు అయినప్పటికీ సరైన సినిమాలు పడదలేన్నారు. అందుకే తన 'గాడ్‌ ఫాదర్‌' సినిమాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. అతడి చేసిన 'జిబ్రా' సూపర్ హిట్‌ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. https://twitter.com/i/status/1856606401709162891
    నవంబర్ 16 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
    Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
    ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. ట్రైలర్ యాంగిల్ ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు. https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc ట్రైలర్‌లో ఏముంది? &nbsp;ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు.&nbsp; లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి&nbsp; కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.&nbsp; శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను&nbsp; తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ట్రైలర్‌ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్‌ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.&nbsp; బలహీనతలు: ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.&nbsp; తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది. డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు. ఫైనల్‌గా భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
    మే 09 , 2023
    <strong>RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!</strong>
    RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్‌ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!
    ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్‌ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్‌ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సేమ్‌ టూ సేమ్‌.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్‌ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్‌ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్‌ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్‌లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్‌ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/SriLakshmi_10/status/1679348363546730496 https://twitter.com/i/status/1858591431201317066 ‘RC 16’ షూటింగ్‌ షురూ.. శుక్రవారం (నవంబర్‌ 22) ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్‌ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్‌ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్‌ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్‌లో మూడు రోజుల పాటు షూట్‌ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్‌ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్‌చరణ్‌ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం.&nbsp; https://twitter.com/BuchiBabuSana/status/1859777297768681631 టీమ్‌లోకి జగ్గుభాయ్‌.. 'RC 16' ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్‌లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్‌ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దీంతో జగ్గుభాయ్‌ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్‌లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్‌చరణ్‌ - జగ్గుభాయ్‌ ప్రత్యర్థులుగా చేసిన 'రంగస్థలం' (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.&nbsp; https://twitter.com/IamJagguBhai/status/1859820964600742352? ‘RC16’ స్టోరీ ఇదే! ‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌తో పోలిస్తే చరణ్‌ బాడీతో పాటు, లాంగ్‌ హెయిర్‌, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఏ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
    నవంబర్ 22 , 2024
    <strong>This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే</strong>
    This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
    కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి&nbsp; చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో&nbsp; 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. దేవకీ నందన వాసుదేవ మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్‌ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్‌ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.&nbsp; మెకానిక్ రాకీ సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్న విష్వక్‌ సేన్‌.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.&nbsp; యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్‌ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్‌ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. రోటి కపడా రొమాన్స్ గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.&nbsp; జీబ్రా విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు&nbsp; రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని&nbsp; హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia &amp; VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
    నవంబర్ 18 , 2024
    <strong>Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్‌ చేసిన పవన్‌.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!</strong>
    Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్‌ చేసిన పవన్‌.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!
    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన రెండు స్థానాల్లో పవన్‌ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకోగా అతను కూడా కొద్ది నెలలకే అధికార వైకాపా ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో పవన్‌ను టార్గెట్‌ చేస్తూ వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం పవన్‌ దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున పవన్‌పై టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పవన్‌ను ట్రోల్‌ చేస్తూ ఏకంగా సినిమా కూాడా తీశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-భాజపా) అధికారంలోకి వచ్చింది. పవన్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పవన్‌ను ఎంతగానో విమర్శించిన ఆర్జీవీ, పోసానిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.&nbsp; ఆర్జీవీపై వరుస కేసులు సినీ డైరెక్టర్​ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఇవాళ (నవంబర్‌ 11) ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ (Nara Lokesh), బ్రాహ్మణి (Nara Brahmani), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్​ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్​ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్జీవీపై గుంటూరు జిల్లా తాళ్లురు పోలీసు స్టేషన్‌లోనూ కేసు పెట్టారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్​లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్​ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; త్వరలో పోసాని అరెస్టు! పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. వైసీపీ స్థాపన తరువాత జగన్‌ పంచకు చేరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. జగన్‌ సీఎం అయ్యాక వైసీపీ నేతల కంటే మరింత ఘాటుగా పవన్‌, చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్‌పై పలు ప్రెస్‌మీట్లలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పవనో మెంటల్‌ కేసని, పైసల కోసమే మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టిందని గతంలో పోసాని మండిపడ్డారు. మట్టిగొట్టుకుపోతావ్‌ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గతంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమోచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను తిరగదోడుతుండటంతో ఓ క్షణమైన పోసాని అరెస్టు కావొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం! సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వైసీపీ మద్దతుదారులనేదీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ తల్లిని సైతం ఆమె దూషించిన సందర్భాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వారిపై ఏపీ పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో శ్రీరెడ్డిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియోను సైతం రిలీజ్‌ చేసింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనిత పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై తన మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టనని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.&nbsp; ప్రకాష్‌ రాజ్‌పై చర్యలుంటాయా? ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్‌ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ప్రకాష్‌ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సందించారు. జస్ట్ ఆస్కింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో పవన్‌ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. పవన్‌ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయంలో దూరి మరి విమర్శలు చేయడంపై జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌పైనా చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత కేసులనే ఏపీ పోలీసులు తిరగదోడుతున్నారు. పైగా ప్రకాష్‌ రాజ్‌పై ఏ స్టేషన్‌లోనూ కేసు నమోదు కానందున ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 11 , 2024
    <strong>Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?</strong>
    Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?
    నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు.. దర్శకత్వం: విరించి వర్మ సంగీతం: గోపి సుందర్ సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్ ఎడిటర్: రామకృష్ణ అర్రం నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి విడుదల తేదీ: నవంబర్‌ 7, 2024 రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకుడిగా పనిచేసిన వ్యక్తుల జీవిత కథను బేస్‌ చేసుకొని రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) ఫ్యామిలీ మెుదటి నుంచి RSS స్వయంసేవకులు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్‌ స్టూడెంట్‌ అయిన జితేందర్‌ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్‌ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? విద్యా వ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSUకి ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలిచింది? కాలేజ్‌ స్టూడెంట్‌ లీడర్‌గా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్‌ రెడ్డి చేసిన సేవలు ఏంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. RSS భావజాలం కలిగిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రజల్లో చైతన్యం కల్పించే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మొత్తంగా రాకేష్‌ వర్రే ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. రాకేష్‌ తర్వాత PDSU నేతగా చేసిన నటుడి యాక్టింగ్‌ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ యాక్టింగ్‌ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్‌పై&nbsp; పాజిటివ్ యాంగిల్‌లోనే సినిమాలు తెరకెక్కాయి. కానీ తొలిసారి నక్సలిజం వెనకున్న చీకటి కోణాన్ని దర్శకుడు విరించి వర్మ ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక పనులకు వారు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నారో కళ్లకు కట్టారు. అప్పట్లో అట్టడగు వర్గాల కోసం పాటుపడిన స్వయంసేవకులను నక్సలైట్స్ ఏ విధంగా కాల్చి చంపారో చూపించారు. కామ్రేడ్స్ ఆగడాలను చూసి చలించిపోయిన హీరో వారిపై చేసే పోరాటాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ వరకూ కాలేజీ రాజకీయాలు చూపించిన దర్శకుడు ఆ తర్వాత మెయిన్‌ స్ట్రీమ్‌ పొలిటికల్ యాంగిల్‌ను టచ్‌ చేశాడు. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో కూడా జితేందర్‌ రెడ్డి పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఫస్ట్‌ హాఫ్‌ స్లోగా సాగడం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. సాంకేతికంగా.. టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సాంగ్‌ గుండెలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరాకేష్‌ వర్రే నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ స్లోగా ఉండటంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 07 , 2024
    <strong>Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!</strong>
    Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!
    యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.&nbsp; భాగ్యశ్రీ ప్రేమలో పడిందా? ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 రౌడీ బాయ్‌తోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;
    ‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్‌ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్‌ జరగ్గా రానాపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.&nbsp; ‘రానా భయపెట్టాడు’ రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్‌’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్‌ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్‌ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్‌ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్‌ చేస్తూ సీరియస్‌ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్‌ లుక్‌ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1843720706057724332 కథ మార్చేసిన రజనీ వేట్టయన్‌ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్‌ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్‌ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేష్‌ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్‌, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్‌ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.&nbsp; రజనీపై తమిళ డైరెక్టర్‌ ఆరోపణలు సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. రజనీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌ 2’ చేయనున్నారు రజనీ.&nbsp;
    అక్టోబర్ 09 , 2024
    <strong>Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే</strong>
    Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
    జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషించారు. సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్‌ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. [toc] బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్: “ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా” అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ… ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా అజయ్ : ఎవడ్రా నువ్వు ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..! సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్… అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది. ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.” ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా? ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“ అజయ్: ఎవరి కథ ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ. “భయం పోవాలంటే దేవుడి కథ వినాలా,&nbsp; భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా” ”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే” దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్‌ కూడా బాగుంటాయి. (Devara Movie Dialogues) వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు! దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు. దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్ “మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..” విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్,&nbsp; సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా? దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది. Jr Ntr Dialogues- Devara దేవర:&nbsp; “చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“ “మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..! “దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”… ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్‌ ఇస్తాయి ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా.. కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా.. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”. అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి. “దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా.. జాన్వీ కపూర్ డైలాగ్స్ తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి. “వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే, నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!! సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. “ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!! యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్‌ కూడా హెలేరియస్‌గా ఉంటుంది. ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది. తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్ వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది. రాయప్ప &nbsp;ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్) “నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు” తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను “ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది” Devara Climax Dialogues క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. “నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!</strong>
    Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!
    టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్‌ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ పేరు మరోమారు మార్మోగుతోంది. రూ. 2 కోట్లు విరాళం&nbsp; కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్‌ టీమ్‌ ప్రకటించింది. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్‌ రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. అండగా సెలబ్రిటీలు! ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్‌ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్‌ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్‌ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్‌ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్‌ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్‌ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1821114197213626764 డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు.&nbsp; లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్‌ సభ్యులు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్‌ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఆగస్టు 07 , 2024
    <strong>Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!</strong>
    Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!
    మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; నిర్మాత ఏమన్నారంటే! జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) బావమరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఆయ్‌' (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్‌ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్‌ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌’ అని సమాధానం ఇచ్చారు.&nbsp; వివాదానికి కేంద్ర బిందువు ఇదే! ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్‌ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్‌ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్‌ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా ఉంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్‌ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద ‘బన్నీ vs చరణ్‌’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్‌ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; సుకుమార్‌తో కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. https://twitter.com/i/status/1813405877908726058
    జూలై 20 , 2024
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.&nbsp; https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.&nbsp; కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.&nbsp; రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.&nbsp; శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.&nbsp; https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.&nbsp; https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.&nbsp; విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.&nbsp; దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024

    @2021 KTree