• TFIDB EN
  • జ్యోతి లక్ష్మి
    UATelugu
    ఇది జ్యోతి లక్ష్మి అనే వేశ్య జీవితం మీద ఆధారపడింది, ఆమె తన వృత్తిని వదిలి మంచి జీవితాన్ని కోరుకుంటుంది. ఈ చిత్రం ఆమె సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మరియు ఆమె గౌరవప్రయాణంను చూపిస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఛార్మీ కౌర్
    జ్యోతి లక్ష్మి
    సత్యదేవ్ కంచరణా
    సత్య
    బ్రహ్మానందం
    కమలాకర్
    అజీజ్ నాజర్
    పాండు
    అజయ్ ఘోష్
    నారాయణ్ పట్వారీ
    మౌర్యాని
    ఉత్తేజ్
    అపూర్వ శ్రీనివాసన్
    శ్రావణి
    సప్తగిరి
    సంపూర్ణేష్ బాబు
    క్యామియో
    సత్యం రాజేష్
    కృష్ణుడు
    ధనరాజ్
    కాదంబరి కిరణ్
    సందీప్ మాధవ్
    సత్య స్నేహితుడు
    ఏంజెలా క్రిస్లింజ్కి
    ఒక ఐటెమ్ నంబర్ రాజా రాజా
    సిబ్బంది
    పూరి జగన్నాధ్
    దర్శకుడు
    ఛార్మీ కౌర్
    నిర్మాత
    వరుణ్నిర్మాత
    తేజనిర్మాత
    సివి రావునిర్మాత
    సి. కళ్యాణ్నిర్మాత
    సునీల్ కశ్యప్
    సంగీతకారుడు
    పిజి విందా
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్  ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం  సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.  సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
    మార్చి 21 , 2024
    Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
    Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్‌ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
    నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు రచన, దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌ సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌ ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌ నిర్మాత: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి విడుదల : 14-06-2024 తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'మహా రాజా' (Maharaja). అతడి కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది రూపొందింది. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. మరి ‘మహా రాజా’ ఎలా ఉంది? ఎప్పటిలాగే విజయ్‌ సేతుపతి తన నటనతో అదరగొట్టాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. కథేంటి బార్బర్‌గా పనిచేసే మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్‌ చేస్తే ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు.  ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మీని ఎత్తుకెళ్లిపోయార‌ని చెబుతాడు. ఎలాగైన ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌ను వేడుకుంటాడు. ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? చివరికీ లక్ష్మీ దొరికిందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే మహారాజా పాత్రలో విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అద్భుత నటన కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై మోశారు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని వెంటాడి హతమార్చే క్రమంలో వచ్చే మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ఇక కూతురు జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె నటన శభాష్‌ అనేలా ఉంటుంది. అటు ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్‌ కశ్యప్‌ ఆకట్టుకున్నారు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, భార‌తీరాజా, మ‌ణికంద‌న్‌, అరుళ్‌దాస్‌ త‌దిత‌రులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు నిథిల స్వామినాథన్‌.. ఒక రొటీన్‌ రివేంజ్‌ డ్రామాను తెరకెక్కించినట్లు అనిపించినా కథకు కర్మ సిద్దాంతాన్ని జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో భావోద్వేగ‌భ‌రితంగా దర్శకుడు సినిమాను ముగించారు. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే మ‌లుపులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్ర‌థమార్ధంలో ఎక్కువ భాగం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌కే కేటాయించినప్పటికీ డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓ వైపు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా.. మరోవైపు లక్ష్మీ, జ్యోతి ఎపిసోడ్స్‌ను సమాంతరంగా చూపిస్తూనే వాటన్నింటిని లింకప్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తుంది.  టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్ర‌తిభ‌.. దినేశ్ సినిమాటోగ్రఫీ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.  ప్లస్‌ పాయింట్‌ విజయ్‌ సేతుపతి నటనట్విస్టులుసంగీతం మైనస్‌ పాయింట్‌ స్లో నారేషన్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 14 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి తెలుగులో సూపర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అంచెలంచెలుగా ఎదిగి లెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసేది. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన అనుష్క శెట్టి(Some Lesser Known Facts Anushka shetty)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ముద్దు పేరు? స్వీటి అనుష్క శెట్టి వయస్సు ఎంత? 1981, నవంబర్ 7న జన్మించింది అనుష్క శెట్టి బిరుదు? లెడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన తొలి సినిమా? సూపర్ (2005) అనుష్క శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు&nbsp; అనుష్క శెట్టి ఎక్కడ పుట్టింది? పుత్తూర్, కర్ణాటక అనుష్క శెట్టి ఉండేది ఎక్కడ? హైదరాబాద్ అనుష్క శెట్టి ఏం చదివింది? డిగ్రీ అనుష్క శెట్టి అభిరుచులు? ట్రావెలింగ్, యోగా, గార్డెనింగ్ అనుష్క శెట్టికి ఇష్టమైన ఆహారం? బిర్యాని, చికెన్ కర్రీ అనుష్క శెట్టికి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్యాక్, వైట్ అనుష్క శెట్టికి ఇష్టమైన ప్రదేశం లండన్ అనుష్క శెట్టికి ఇష్టమైన హీరో? అక్కినేని నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు అనుష్క శెట్టికి ఇష్టమైన హీరోయిన్? జ్యోతిక అనుష్క శెట్టి&nbsp; పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. అనుష్క శెట్టి తల్లిదండ్రుల పేరు? A.N విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? యోగా ట్రైనర్‌గా పనిచేసేది అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/anushkashettyofficial/ అనుష్క శెట్టికి ఎన్ని అవార్డులు వచ్చాయి? అరుంధతి, రుద్రమదేవి చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డును, సైజ్ జీరో, అరుంధతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. బాహుబలి-2 చిత్రానికి గాను బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అందుకుంది. అనుష్క శెట్టి నికర ఆస్తుల విలువ? రూ.100కోట్లు https://www.youtube.com/watch?v=PuExPz-K09U
    ఏప్రిల్ 29 , 2024
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 
    రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.&nbsp; తేజ సజ్జ: యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన&nbsp; టీజర్‌, ప్రచార చిత్రాలు హనుమాన్‌ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది.&nbsp; https://youtu.be/AvjvZ7q2apE దేవ్‌దత్తా నాగే: అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్‌ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్‌, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది.&nbsp; చిరంజీవి: జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు. https://twitter.com/KChiruTweets/status/1247698208077172736?s=20 https://twitter.com/KChiruTweets/status/1247705832940175360?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713378988154881?s=20 https://twitter.com/KChiruTweets/status/1247713383069159424?s=20 https://youtu.be/BfJRVxeIKD8 అర్జున్‌: నితిన్‌ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ హనుమాన్‌ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్‌ అయినా అలవోకగా చేయగలనని అర్జున్‌ ఈ సినిమా ద్వారా నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్‌: నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్‌ అయ్యింది.&nbsp; విందు దర సింగ్‌: సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్‌’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.
    ఏప్రిల్ 04 , 2023
    <strong>Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!</strong>
    Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్‌ సల్మాన్‌ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్​కమింగ్ మూవీ 'కంగువా' (Kanguva) ప్రమోషన్స్​లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్‌, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూర్య సీక్రెట్‌ రివీల్‌ చేసిన కార్తీ! బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కూడా ఫుల్‌ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్‌ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్‌ చేసిన సూర్య బ్లాక్‌ గ్లాసెస్‌ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్‌ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్‌’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్‌ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్‌ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్‌ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు. https://twitter.com/ahavideoIN/status/1853655983760998850 కంటతడి పెట్టిన సూర్య తాజా టీజర్‌ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్‌ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్‌, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.&nbsp; 10 వేల స్క్రీన్స్‌లో విడుదల ‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు.&nbsp; ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. రిలీజ్ ఎప్పుడంటే? ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌</strong>
    Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్‌మెంట్‌
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్‌ 14) మరోమారు రాజుకుంది. పోలీసులు హెచ్చరించినా విష్ణు తనను తన కుటుంబాన్ని వేదిస్తున్నాడని మనోజ్‌ ఆరోపించాడు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో ఇన్‌వర్టర్‌లో షుగర్‌ వేసి పవర్ కట్స్‌కు కారణమయ్యాడని ప్రెస్‌నోట్‌ విడుదల చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై మోహన్‌బాబు రెండో భార్య, మనోజ్‌ కన్నతల్లి నిర్మల తాజాగా స్పందించారు. మంచు మనోజ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘విష్ణు గొడవ చేయలేదు’ మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీ గొడవపై ఆయన భార్య నిర్మల (Manchu Nirmala) మెుదటిసారి రియాక్ట్‌ అయ్యారు. శనివారం నాడు మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పష్టతనిచ్చారు. ఈ మేరకు పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ‘డిసెంబర్‌ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడు. అయితే ఈ విషయంపై విష్ణు మీద మంచు మనోజ్‌ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదు’ అని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.  https://twitter.com/FilmyBowl/status/1868917278437482648 మనోజ్‌ ప్రెస్‌నోట్‌లో ఏముందంటే? తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్‌ ఆదివారం (డిసెంబర్‌ 15) ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశాడు. ‘నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్‌ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా’ అని మనోజ్‌ తన ప్రకటనలో తెలియజేశాడు. అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.  https://twitter.com/pakkatelugunewz/status/1868322391496999391 పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇదిలా ఉంటే సినీ నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారంటూ ప్రధాన మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. తన అత్త శోభా నాగిరెడ్డి జయంతి నేపథ్యంలో మనోజ్‌ సోమవారం భార్య, పిల్లలతో ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామిని మనోజ్‌ దంపతులు సందర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దైవ దర్శనం అనంతరం మనోజ్‌ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తున్న ఆళ్లగడ్డ ప్రజలు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో జనసేనలో చేరికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నో కామెంట్స్‌’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అయితే రాజకీయ ఎంట్రీని ఖండించకపోవడంతో త్వరలోనే ఆయన జనసేనలో చేరే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/abntelugutv/status/1868898831271968798 https://twitter.com/abntelugutv/status/1868886038598602791
    డిసెంబర్ 17 , 2024
    <strong>Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;</strong>
    Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే!&nbsp;
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఒకటి బయటకొచ్చింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణమెంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఫైనల్‌ షెడ్యూల్‌ షురూ పవన్‌ హీరోగా చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను క్రిష్‌, జ్యోతి కృష్ణ డైరెక్ట్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుండగా తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌ ఈ వీకెండ్‌లో విజయవాడలో వేసిన సెట్‌లో మెుదలుకానుంది. సినిమాకు అత్యంత కీలకమైన సీన్స్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా జాయిన్‌ అవుతారని టాక్‌. మెుత్తం 200 మంది ఆర్టిస్టులతో కలిసి పవన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ ఫేమ్‌ బాబి డియోల్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.దీంతో పవన్‌ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన పనిలేదని ఆనందిస్తున్నారు. 500 మందితో ఫైట్‌ సీన్స్‌ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2025 మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా సినిమాను ఫినిష్‌ చేసేందుకు గత కొంతకాలంగా చురుగ్గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్‌ యాక్షన్‌ దర్శకుడు నిక్‌ పావెల్‌ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలను సైతం మూవీ టీమ్‌ చిత్రీకరించింది. పవన్‌తో పాటు దాదాపు 400 నుంచి 500 మంది ఈ యుద్ధ సన్నివేశంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్‌ సినిమాకే హైలెట్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సీన్‌లో పవన్‌ యాక్షన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందని అంటున్నారు. కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బ్యాంకాక్‌ వెళ్లనున్న పవన్‌! హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu)తో పాటే ‘ఓజీ’ (OG) షూటింగ్‌ కూడా ప్యార్లర్‌గా జరుగుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ పవన్‌ లేని సన్నివేశాలను ఎంతో ఫాస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పవన్‌ సైతం ఈ రెండు చిత్రాలను డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌ కల్లా ఫినిష్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వీకెండ్‌ హరి హర వీరమల్లును షూట్‌ను పవన్‌ పూర్తి చేయనున్నారు. అనంతరం ‘ఓజీ’ టీమ్‌లో పవన్‌ జాయిన్‌ కానున్నారు. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌తో పవన్‌ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్‌ వచ్చేవారంలో బ్యాంకాంక్‌ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.&nbsp; పవన్‌తో విజయ్‌ దేవరకొండ బిగ్‌ ఫైట్‌ 2025 సమ్మర్‌ బరిలో పవన్‌ను విజయ్‌ దేవరకొండ ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్‌ కానున్న అదే డేట్‌కు విజయ్‌ నటిస్తున్న 'VD 12' కూడా విడుదల కాబోతోంది. ఆ తేదీని ‘హరి హర వీరమల్లు’ కంటే ముందే&nbsp; 'VD 12' టీమ్‌ లాక్‌ చేసింది. దీంతో పవన్‌తో విజయ్‌ దేవరకొండకు బిగ్‌ ఫైట్‌ తప్పదని చెప్పవచ్చు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే?</strong>
    Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు దర్శకత్వం: పా.రంజిత్‌ సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె. సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్‌ కుమార్‌ నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే విడుదల: 15-08-2024 ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్‌ అయిన నటుడు విక్రమ్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తంగలాన్‌' చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్‌ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ కూడా వాటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరీ తంగలాన్ ఎలా ఉంది? విక్రమ్‌ మరోమారు తన నటనతో మెస్మరైజ్‌ చేశాడా? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? తంగలాన్ పాత్రలో విక్రమ్‌ అదరగొట్టేశారు. అతడు తప్ప మరొకర్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇది విక్రమ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకుంది. తన లుక్స్‌, నటనతో ఆడియన్స్‌ను భయపెట్టింది. విక్రమ్‌ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ చూపిన పాత్ర ఆమెదే. విక్రమ్‌తో ఆమె చేసే యాక్షన్‌ హంగామా అలరిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? తంగలాన్‌ చిత్రం ప్రధానంగా బంగారం అన్వేషణ చుట్టూ తిరిగినా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం చేసే పోరాటంగా దర్శకుడు పా.రంజిత్ ఈ మూవీని తెరెక్కించారు. బ్రిటిషర్ల కాలంలోని వర్ణ వివక్షను కళ్లకు కట్టారు. కథ చెప్పేందుకు దర్శకుడు సృష్టించిన ప్రపంచం, ప్రజల వస్త్రధారణలు ఆడియన్స్‌ను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. బిటిషర్లతో కలిసి తంగలాన్‌ బంగారం వేటకు వెళ్లడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఉత్కంఠను రేపుతాయి. విరామంలో వచ్చే సీన్స్‌ సెకండాఫ్‌పై మరింతగా అంచనాలు పెంచేస్తాయి. అయితే సెకండ్‌ పార్ట్‌కు వచ్చే సరికి కథ గాడితప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో బ్రిటిషర్లు-తంగలాన్-నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు గందరగోళానికి గురిచేస్తుంది. ఏది తంగలాన్‌ ఊహో, ఏది నిజమో తెలియక ఆడియన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతారు. అయితే క్లైమాక్స్‌లో తంగలాన్‌ పాత్రలోని మరో కోణం చూపించి దర్శకుడు మంచి ముగింపును ఇచ్చాడు.&nbsp; టెక్నికల్‌గా ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంవిక్రమ్‌, మాళవిక నటనఫాంటసీ ఎలిమెంట్స్‌ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్‌స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌&nbsp; విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన&nbsp; ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక&nbsp; విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.&nbsp; ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
    డిసెంబర్ 21 , 2023
    <strong>OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్‌.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!</strong>
    OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్‌.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
    పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్‌ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్‌ తిరిగి షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ను సైతం మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో పవన్‌ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; ముందే ‘ఓజీ’ రిలీజ్‌? పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ సుజీత్‌ మూవీని త్వరగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్‌ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ను త్వరగా ఫినిష్‌ చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను స్టార్ట్‌ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.  హరిహర వెనక్కి తగ్గాల్సిందే! పవన్‌ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా రానుంది. అయితే పవన్‌ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్‌ వచ్చినప్పటికీ క్రిష్‌ 60 శాతం షూటింగ్‌ ఫినిష్‌ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి క్రిష్‌ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్‌ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్‌ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్‌ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్‌ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉన్న దృష్ట్యా పవన్‌ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.&nbsp; ఓజీపై ఎందుకంత హైప్‌? పవన్‌ కల్యాణ్‌ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్‌ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్‌ యాక్టింగ్‌ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.  https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385 ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సంగతేంటి? గబ్బర్‌ సింగ్ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత పవన్ కల్యాణ్‌ - హరీశ్‌ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్‌ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్‌ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్‌ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp;
    నవంబర్ 11 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!</strong>
    Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!
    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్‌ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అదే రోజున విజయ్‌ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో పవన్‌ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్‌ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ఫస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం! పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)&nbsp; కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఆ చిత్రాల్లోనూ కదలిక! హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ పవన్‌ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్‌ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్‌ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్‌ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్‌ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్‌ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్‌ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;&nbsp; పవన్‌ vs విజయ్‌ దేవరకొండ! హరి హర వీరమల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్‌' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్‌ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.&nbsp;
    సెప్టెంబర్ 23 , 2024
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
    ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.&nbsp; RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4&nbsp; రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.&nbsp; ఏ మాస్టర్‌ పీస్‌&nbsp; సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.&nbsp; ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.&nbsp; కృష్ణమ్మ&nbsp; సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.&nbsp;
    ఏప్రిల్ 10 , 2024
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
    ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; Ayesha Zeenath స్టార్‌ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్‌ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది.&nbsp;ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'రెడీ స్టడీ పో' అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్‌ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది. సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది. Raksha Goud కన్నడ నటి రక్ష గౌడ్‌ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది.&nbsp; ఈమె లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు.&nbsp; 2017లో కన్నడ సీరియల్‌ 'రాధా రమణ'తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్‌ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.&nbsp; Jyothi Rai ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్‌ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది.&nbsp; కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్‌.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్‌’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; Preethi Sharma తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్‌ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). 'పడమటి సంధ్యా రాగం' (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్‌ సీరియల్‌ 'ఒరు కాదయి పాడతుమా, సార్‌?' ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.&nbsp; తెలుగులోకి 'కావ్యాంజలి' అనే సీరియల్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ సంపాదించి గృహిణుల ఫేవరేట్‌ నటిగా మారిపోయింది.&nbsp; Soundarya Reddy ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. 'రాజీ' అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 20 , 2024
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్‌, కేశవ్‌ దీపక్‌, ఝాన్సీ, హర్షవర్ధన్‌, అభిజ్ఞ, రోషన్‌, సతీష్‌ సరిపల్లి, మహేష్‌ విట్టా తదితరులు డైరెక్టర్‌: విశ్వక్ ఖండేరా సినిమాటోగ్రాఫర్‌ : అదిత్య జవ్వాది సంగీతం : ప్రశాంత్‌ ఆర్. విహారి స్ట్రీమింగ్‌ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ:&nbsp; 02 ఫిబ్రవరి, 2024 లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. కథ లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్‌ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్‌ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్‌ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే మిస్‌ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్‌ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్‌ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్‌, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్‌ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్‌ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్‌ తడబడ్డారు. రైటింగ్‌ ఫెయిల్యూర్‌ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    ఫిబ్రవరి 02 , 2024
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    Top TV Hosts In South India: సౌత్‌ ఇండియాను షేక్‌ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!&nbsp;
    దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్‌, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లు, సక్సెస్‌ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్‌ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్‌ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ‌అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్‌ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; మంజూష (Manjusha) హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్‌ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.&nbsp; వర్షిణి (Varshini) అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో&nbsp; యాంకర్‌ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్‌’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్‌ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.&nbsp; విష్ణు ప్రియ (Vishnu Priya) తెలుగులో డ్యాన్స్‌ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్‌ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్‌ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.&nbsp; అషూ రెడ్డి (Ashu reddy) ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్‌ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్‌ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.&nbsp; సౌమ్యరావు (Sowmya rao) జబర్దస్త్‌ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్‌ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.&nbsp; శ్యామల (Shyamala) అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది. దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu) కెరీర్‌ ప్రారంభంలో ఓ న్యూస్‌ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.&nbsp; అనసూయ (Anasuya) యాంకర్‌ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్‌ హిట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్‌ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్‌ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; రష్మి (Rashmi) జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మరో యాంకర్‌ రష్మి. జబర్దస్త్‌ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.&nbsp;&nbsp; శ్రీముఖి (Srimukhi) యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్‌ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్‌ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.&nbsp; వింధ్య (Vindhya) తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్‌ ఈమెనే. ఐపీఎల్‌ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.&nbsp; రచిత (Rachitha) ప్రముఖ సీరియల్‌ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్‌ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్‌ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.&nbsp; పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty) బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్‌ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్‌ మహిళా’, ‘క్యాష్‌’ వంటి టెలివిజన్‌ షోలలోనూ ఈమె పాల్గొంది. ప్రేమి విశ్వనాథ్‌ (Premi Viswanath) ‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్‌ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్‌ షోలలోను కనిపించి సందడి చేసింది.&nbsp; ప్రీతి అస్రాని (Preeti Asrani) గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్‌’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalakshmi Sarathkumar) ప్రముఖ స్టార్‌ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్‌ అరింధాల్‌' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్‌ తమిళ్‌ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్‌' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) కన్నడలో బాగా పాపులర్‌ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; దీపికా దాస్‌ (Deepika Das) కర్ణాటకకు చెందిన దీపికా దాస్‌.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్‌ గర్ల్‌' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.&nbsp;
    ఫిబ్రవరి 22 , 2024
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
    ]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
    మార్చి 07 , 2023
    <strong>Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?</strong>
    Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్‌ తదితరులు రచన, దర్శకత్వం: సి.ప్రేమ్‌ కుమార్‌ సంగీతం: గోవింద్‌ వసంత సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజు ఎడిటింగ్‌: ఆర్‌.గోవింద రాజు నిర్మాత: జ్యోతిక, సూర్య విడుదల తేదీ: 28-09-2024 తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్‌ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్‌ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్‌ కిరణ్‌, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్‌ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్‌ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024

    @2021 KTree