UATelugu
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
2024 Nov 51 month ago
క చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 26.52 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
రివ్యూస్
YouSay Review
KA Movie Review: ‘ క’ సినిమాను హిట్ చేసిన టాప్ 5 అంశాలు
టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం ‘రాజా వారు రాణి గారు‘తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్ పరంగా సత్...read more
How was the movie?
తారాగణం
కిరణ్ అబ్బవరం
తన్వీ రామ్
నయన్ సారిక
అచ్యుత్ కుమార్
రెడిన్ కింగ్స్లీ
సిబ్బంది
సుజిత్ మద్దెలదర్శకుడు
సందీప్ మద్దెలనిర్మాత
కథనాలు
Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్.. టాప్ ఏదంటే?
క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ పరంగా ఏ సినిమా టాప్‌లో ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.
‘ముఫాసా’ డే 1 కలెక్షన్స్..
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందింది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. మహేష్ వాయిస్ ఓవర్‌తో పంచ్‌లు, ప్రాసలు అదిరిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్స్ విషయాన్ని వస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్ (Mufasa: The Lion King Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇంగ్లీషు వెర్షన్లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.కోటి గ్రాస్ తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, తొలి వీకెండ్లో ‘ముఫాసా’ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్ డాలర్లు (రూ.1529 కోట్లు) వసూలు చేస్తుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి.
‘యూఐ’ కలెక్షన్స్ ఎంతంటే
ఉపేంద్ర (Upendra) హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘యూఐ’ (UI) శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కనెక్ట్ అయితే పక్కా ఎంటర్టైన్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం రూ.Rs 6.75 కోట్ల గ్రాస్ (UI Movie Day 1 Collections) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే రూ.6 కోట్లు తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.70 లక్షలు, తమిళంలో రూ.4 లక్షలు, హిందీ రీజియన్‌లో రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిపాయి. యూత్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున అటెన్షన్ రావడంతో వీకెండ్లో ‘యూఐ’ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి.
‘విడుదల 2’ కలెక్షన్స్..
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల 2’ (Vidudala 2) చిత్రం డిసెంబర్ 20న రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి నటన, వ్యవస్థల లోపాలను దర్శకుడు ఎత్తిచూపిన విధానం బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల గ్రాస్ (Vidudala 2 Movie Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.8 కోట్లు వసూలైనట్లు తెలిపాయి. తెలుగులో రూ.60 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3.5 కోట్లు వచ్చి చేరాయని వివరించాయి. మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి కలెక్షన్స్ పెరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
‘బచ్చల మల్లి’ వసూళ్లు..
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అల్లరి నరేష్ మాస్ పర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.80 లక్షల (Bachchala Malli Day 1 Collections) వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.60 లక్షల వరకూ ఉండొచ్చని చెప్పాయి. యావరేజ్ టాక్ నేపథ్యంలో వీకెండ్స్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి.
డిసెంబర్ 21 , 2024
Kantara Team Accident: 20 మందితో వెళ్తోన్న ‘కాంతార’ మూవీ టీమ్ బస్సు బోల్తా.. షూటింగ్ నిలిపివేత
కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార' సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. సినిమా విశేష ప్రేక్షకదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ కూడా రాబోతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Kantara Team Accident) గురైనట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను సైతం మేకర్స్ నిలిపేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి నటిస్తున్న 'కాంతార చాప్టర్ 1' సినిమా షూటింగ్‌కు అనుకోని విధంగా బ్రేక్ పడింది. ఆదివారం (నవంబర్ 24) రాత్రి షూట్ పూర్తి చేసుకుని చిత్రబృందంలోని 20 మంది సభ్యులు ఓ మినీ బస్సులో కర్ణాటకలోని జడ్కల్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా (Kantara Team Accident) పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారట. పెద్ద స్టార్స్ ఎవరూ వాహనంలో లేరని అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులేనని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
https://twitter.com/BNews2024/status/1861000465582088529
తప్పంతా అతడితే..!
ప్రమాదాని బస్సు డ్రైవర్ (Kantara Team Accident) నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. డ్రైవర్ ఫోన్ నొక్కుతూ బస్సు నడిపాడని, అందుకే ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే డ్రైవర్‌పై దాడి చేసినట్లు కూడా తెలిసింది. సమాచారం అందుకున్న టూరిస్ట్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని సమాచారం అందింది. అలానే పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేశారు.
https://twitter.com/TheFederal_KA/status/1860921151792562233
యుద్ద విద్యలో ప్రత్యేక శిక్షణ
సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. దీంతో 'కాంతార చాప్టర్ 1' మేకర్స్ పట్టాలెక్కించారు. స్టార్ హీరో రిషభ్ శెట్టి సొంత డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపందనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిషబ్ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. 2025 అక్టోబర్ 2న దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని ఇప్పటికే టీమ్ ప్రకటించింది.
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..
'కాంతార చాప్టర్ 1' నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇటీవల మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ‘మహావతార్: నరసింహ’ (Mahavatar Narsimha) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయనుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది.
https://twitter.com/hombalefilms/status/1857730656639303928
నవంబర్ 25 , 2024
This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia & VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
నవంబర్ 18 , 2024
Ashika Ranganath: పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా లెలేత పరువాలు
కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్’ దీపావళి వేళ ఓ యాడ్ ఫొటో షూట్‌లో పాల్గొంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ చాలా హాట్ లుక్‌లో కనిపించి చెమటలు పట్టించింది. తన లేలేత అందాలను ఆరబోసింది.
మెరూన్ కలర్ డ్రెస్, గొల్డ్ కలర్ ఎంబ్రాయిడీలో తళక్కున మెరిసింది. తన ఎద, నడుము ఒంపులను చూపించి కుర్రకారు మతి పొగొట్టింది.
View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోతున్న ఆషికాను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె క్లీవేజ్ షోకు విజిల్స్ వేస్తున్నారు.
మెరూన్ కలర్, గొల్డ్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఈ అమ్మడి అందం మరింత పెరిగింది. Godess Of Beauty అంటూ కామెంట్ బాక్స్‌లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవల తన సిస్టర్ వెడ్డింగ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ బ్లాక్ శారీలో అదరగొట్టింది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ చెక్కీల బ్లాక్ బ్లౌజ్‌వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
నల్లటి శారీలో వెన్నెల లాంటి అందాలను కురిపిస్తున్న ఆషికాను చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆషికా తన గ్లామర్‌తో చెమటలు పట్టిస్తోందని పోస్టులు పెట్టారు.
సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగ (Naa Saami Ranga) చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఈ కుర్ర హీరోయిన్‌కు అవకాశాలు మాత్రం రాలేదు.
‘నా సామిరంగ’ కంటే ముందే టాలీవుడ్‌లో ఆషిక (Ashika Ranganath) ఓ సినిమా చేసింది. 'అమిగోస్' (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌తో చేసిన ఎన్నో రాత్రులు వస్తాయి గాని సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో తన అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపివేసింది.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన దృష్టి తమిళ్‌పై పెట్టింది. తమిళ్‌లో ఈ ముద్దుగుమ్మ హీరో సిద్ధార్థ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆయనతో కలిసి MISS YOU అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది.
ఇక ఆషిక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక ఓ ఇంటర్యూలో తెలిపింది.
ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక (Ashika Ranganath) చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి 'క్రేజీబాయ్' (Crazy Boy) అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక (Ashika Ranganath) ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు తనకు బాగా అర్థం అవుతుందని తెలిపింది.
చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసినట్లు ఆషిక చెప్పింది. ‘బొమ్మరిల్లు’ (Bommarillu), ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) చిత్రాలను చాలా సార్లు చూసినట్లు చెప్పింది.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ (#AshikaRanganath) ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.
నవంబర్ 02 , 2024
Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగాను తన ప్రతిభ చూపించాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్’, ‘కాంచన’, ‘గంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చంద్రముఖి 2 వచ్చిన అతడు బాక్సాఫీస్ వద్ద దారణంగా విఫలయ్యాడు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ‘కాల భైరవ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
గంభీరమైన లుక్‌లో లారెన్స్!
రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘కాల భైరవ’ (Kala Bhairava). తెలుగులో ‘రాక్షసుడు’ (Rakshasudu), రవితేజతో ‘ఖిలాడి’ (Khiladi) వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన రమేష్ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు వర్క్ చేయనుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్‌గా తనదైన ముద్ర వేసిన లారెన్స్ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రానుంది. ఇవాళ (సెప్టెంబర్ 29) లారెన్స్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్‌గా రానున్న ‘కాల భైరవ’ పోస్టర్ ఇంటెన్స్‌గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/DirRameshVarma/status/1851126864137363612
కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్!
లారెన్స్ హీరోగా నటించనున్న ‘కాల భైరవ’ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి (A STUDIOS LLP), గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఎంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్‌లో ఇదే హయేస్ట్ బడ్జెట్‌గా రాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలు కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
రిస్క్ చేస్తున్నారా?
‘కాల భైరవ’ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారని వార్తలు రావడంపై ఫిల్మ్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లారెన్స్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మార్కెట్ పరంగా అతడు వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. అతడు నటించిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ను నమ్మి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే అవుతుందని సూచిస్తున్నారు. రిజల్ట్ ఏమాత్రం అనుకూలంగా లేకపోయిన తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో ఎంతైన ఖర్చు చేసేందుకు మేకర్స్ వెనుకాడటం లేదు.
లారెన్స్ మంచి మనసు
రాఘవ లారెన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్ధను స్థాపించిన ఆయన దాని ద్వారా పేదలు, రైతులకు పలుమార్లు సాయం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోమారు మంచి మనసు చాటుకున్నారు. పేద వితంతు మహిళలకు అండగా నిలుస్తూ కుట్టు మిషన్స్‌ను పంపిణీ చేశారు. వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా లారెన్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తారెన్స్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు.
https://twitter.com/offl_Lawrence/status/1850890389521092953
అక్టోబర్ 29 , 2024
Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్
కావ్య థాపర్ హీరోయిన్‌గా రూపొందిన 'విశ్వం' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1844650013252825352
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్ పాడిన ఈ పాటకు గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.
https://twitter.com/actressspecial/status/1844644160881426905
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
అక్టోబర్ 11 , 2024
Toxic Movie కేజీఎఫ్ హీరో యష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అర్థాంతరంగా ఆగిపోయిన ‘టాక్సిక్’?
‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్ (Yash) పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) సైతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడంతో నేషనల్ వైడ్‌గా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత బలపడింది. దీంతో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘టాక్సిక్’ (Toxic) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను యష్ పట్టాలెక్కించాడు. ఇందులో యష్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దీంతో ‘టాక్సిక్’ కూడా బ్లాక్ బాస్టర్ పక్కా అని అంతా భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
నమ్మకం కోల్పోయిన యష్!
కేజీయఫ్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్ కోసం బాగా గ్యాప్ తీసుకున్న యష్ ఇటీవలే ‘టాక్సిక్’ (Toxic)ను పట్టాలెక్కించాడు. లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) పై నమ్మకముంచి ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకరించాడు. ఈ మూవీలో నయనతార (Nayanthara), శ్రుతి హాసన్ (Shruti Hassan), కియారా అద్వానీ (Kiara Advani)ని హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానున్నట్లు కామెంట్స్ వినిపించాయి. అయితే షూటింగ్ కూడా కొంతవరకూ జరిగాక డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్‌పై యష్ సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. ఆమె ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఆమె హ్యాండిల్ చేయలేదని యష్ భావిస్తున్నారట. దీంతో టాక్సిక్‌ను మధ్యలోనే అతడు ఆపేసినట్లు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అందులో వాస్తవమెంత?
ప్రస్తుతం ‘టాక్సిక్’ ఆగిపోయినట్లు నెట్టింట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ‘టాక్సిక్’ సినిమా ఆగిపోవడం వాస్తవమేనని అలా అని పూర్తిగా రద్దు కాలేదని ఫిల్మ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా సినిమాను నిలిపివేసినట్లు చెబుతున్నాయి. అంతా సెట్ కాగానే త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం అవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. 2025 మిడిల్ నాటికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో యష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్‌కు మించి టాక్సిక్ ఉండేలా చూడాలని చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభాస్‌తో పోటీ లేనట్లే!
వాస్తవానికి ‘టాక్సిక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే అదే రోజున ప్రభాస్ - మారుతీ కాంబోలో రూపొందుతున్న ‘రాజా సాబ్’ రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ‘టాక్సిక్’ షూటింగ్‌కు బ్రేక్ రాడవంతో 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ప్రభాస్- యష్ మధ్య ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జూన్-జులైలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
‘కేజీఎఫ్’తో యష్ కెరీర్ మలుపు!
‘కేజీఎఫ్‌కు’ ముందు యష్ కన్నడలో 19 చిత్రాల్లో నటించాడు. అన్ని మూవీస్ చేసినప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. టైర్-2 హీరోగా మాత్రమే శాండిల్‌వుడ్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘కేజీఎఫ్’ (KGF) చేశాడో అతడి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో అతడి గురించి చర్చించుకున్నారు. 'కేజీఎఫ్ 2' (KGF 2) చిత్రం మరింత సక్సెస్ కావడంతో ఆ ఫేమ్ మరింత బలపడింది. దానిని నిలబెట్టుకునే క్రమంలోనే యష్ ఆచితూచి అడుగువేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ 2 తర్వాత సరైన సబ్జెట్ కోసం రెండేళ్ల పాటు ఎదురు చూశాడు. రీసెంట్‌గా ‘టాక్సిక్’ను పట్టాలెక్కించాడు.
అక్టోబర్ 05 , 2024
Bharateeyudu 3 OTT: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ ఈ ఏడాది జులై 12 'భారతీయుడు 2' రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకా దారుణంగా చతికిల పడింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'భారతీయుడు 3' రానుందని సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌లోనే దర్శకుడు శంకర్ స్పెషల్ ట్రైలర్ చూపించి మరీ కన్ఫార్మ్ చేశారు. అయితే తాజాగా మూడో పార్ట్‌కు సంబంధించి క్రేజీ బజ్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నేరుగా ఓటీటీలోకి ‘భారతీయుడు 3’!
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రానున్న మరో చిత్రం 'భారతీయడు 3'. వీరి కాంబోలో విజయవంతమైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా రెండు, మూడు భాగాలను రూపొందించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన 'భారతీయుడు 2' ప్రేక్షకాదరణ పొందని సంగతి తెలిసిందే. దాంతో మూడో భాగానికి థియేట్రికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. రిస్క్ తీసుకునేందుకు థియేటర్ వర్గాలు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పార్ట్‌ను నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న శంకర్, కమల్ హాసన్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకురావడం ఇది వారికి అవమానేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ధ్రువీకరించిన ఓటీటీ వర్గాలు!
‘భారతీయుడు 3’ చిత్రం ఓటీటీలోకి రావడం ఖాయమని నెట్‌ఫ్లిక్స్ వర్గాలు సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓటీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వెల్లడించనున్నట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘భారతీయుడు 2’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో వ్యూస్ సాధించలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. దీంతో ‘భారతీయుడు 3’ ఓటీటీ హక్కులు తక్కువ ధరకే అమ్ముడుపోయే చాన్స్ ఉందని అంటున్నారు.
‘భారతీయుడు 2’పై దారుణమైన ట్రోల్స్!
'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్ హాసన్ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. అయితే యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పాత్రతో యాక్షన్స్ సీక్వెన్స్ చేయించారు డైరెక్టర్ శంకర్. వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉండే వయసులో అలవోకగా స్టంట్స్ చేస్తుండటం చూడటానికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఇక ‘భారతీయుడు 2’ కథ, కథనం కూడా చాలా పూర్ ఉందన్న విమర్శలు వచ్చాయి. అసలు శంకర్ చిత్రంలాగే లేదని కామెంట్స్ వినిపించాయి.
గేమ్ ఛేంజర్‌తో గట్టెక్కేనా!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అంతకుముందు వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. ఈ సినిమా విజయం సాధిస్తే శంకర్ పేరు మరోమారు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగే ఛాన్స్ ఉంది. లేదంటే అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గేమ్ ఛేంజర్ రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ‘ఫ్యామిలీ స్టార్’ మిగిల్చిన నష్టాలను ‘గేమ్ ఛేంజర్’ పూడ్చాలని దిల్‌రాజు భావిస్తున్నారు.
అక్టోబర్ 04 , 2024
Anthahpuram: సౌందర్యను రీప్లేస్ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్ చేయగలదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
కృష్ణవంశీ ఏమన్నారంటే?
సౌందర్య, సాయికుమాార్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్ ఎంతో టాలెంటెడ్. తమ నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్ బదులిస్తూ నివేతా థామస్, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
సౌందర్యను రీప్లేస్ చేయగలరా!
స్టార్ హీరోయిన్ సమంతకు గ్లామర్ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.
డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్
డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Prabhas Vs Arshad Warsi: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అక్కసు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలుగు హీరోలు!
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంలో ప్రభాస్ (Prabhas) లుక్ జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్ ఫెయిలవుతూ వస్తోందని మండిపడుతున్నారు. అటు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలు సైతం మండిపడ్డారు. ప్రభాస్‌కు మద్దతుగా నిలుస్తూ యువ హీరోలు సుధీర్ బాబు, ఆది గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..!
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘కల్కి’ తాను చూశానని మూవీ తనకు నచ్చలేదని అర్షద్ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్ జోకర్‌లా ఉంది. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1825097374680621099
సుధీర్ బాబు.. స్ట్రాంగ్ కౌంటర్!
ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం సుధీర్ బాబు వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. సుధీర్ బాబు వ్యాఖ్యలను ప్రభాస్ ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు.
https://twitter.com/isudheerbabu/status/1825746561495871657
‘ప్రభాస్ అంటే అసూయేమో’
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సిపై యంగ్ హీరో ఆది సాయికుమార్ కూడా తనదైన రీతిలో స్పందించాడు. అర్షద్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కల్మషం లేని మంచి మనసుకు కలిగిన ప్రభాస్ గురించి ఇలా అనుచితంగా మాట్లాడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360
‘ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కనిపిస్తోంది’
అర్షద్ వర్సీ వ్యవహారంపై తెలుగు డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన పోస్టు కూడా ఆకట్టుకుంటోంది. ‘సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు ప్రభాస్. ఇండియన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆయన మీద, ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ మీ కంట్లోనే నాకు కనిపిస్తోంది. ప్రతీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. మీ మీ అభిప్రాయాాల్ని చెప్పడానికి ఓ పద్దతి పాడు ఉంటాయ్. మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తోంది’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా, కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపిక పదుకొనే కీలక పాత్రలు పోషించారు.
https://twitter.com/DirAjayBhupathi/status/1825448573128806545
ఆగస్టు 20 , 2024
NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా గప్‌చుప్‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అందరినీ షాక్‌కి గురిచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. నేడు (ఆగస్టు 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
https://twitter.com/reddy_tarock/status/1821778632026751223
https://twitter.com/AllHailNTR/status/1821765706507284736
https://twitter.com/Sudha_NTR/status/1821785928798454169
విభిన్నమైన కథాంశంతో..
ప్రశాంత్ నీల్ సినిమా అనగానే భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే హీరోయిజం గుర్తుకువస్తాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో యష్, ప్రభాస్‌లను చూపించినట్లుగానే తారక్‌ను కూడా చాలా పవర్‌ఫుల్‌గా ప్రశాంత్ నీల్ చూపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ‘NTR 31’ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని పేర్కొన్నారు. దీంతో తారక్‌ను కేజీఎఫ్, సలార్‌కు మంచి సరికొత్తగా నీల్ మామా చూపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
డ్యూయల్ రోల్‌లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్ చేసింది. ఆ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
పవర్‌ఫుల్ టైటిల్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
భారీ బడ్టెట్..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
ఆగస్టు 09 , 2024
One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్!
కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గాయత్రి భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్
అల్లు శిరీష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్ తరణ్ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
తన్వీ ఆకాంక్ష - సీరత్ కపూర్
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్ కపూర్ గతంలో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది.
మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky). రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం జెర్సీ, సైంధవ్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.
తమన్నా - రాశి ఖన్నా
అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తమన్నా - కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
జూలై 31 , 2024
Hero Vishal: విశాల్ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతడు చేసే యాక్షన్ చిత్రాలకు మాస్ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింగంటే?
హీరో విశాల్ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విశాల్ కొన్ని కామెంట్స్ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.
విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్!
‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్ కథిరేసన్ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.
https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070
విశాల్ ఎలా పాపులర్ అంటే?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్ టాలీవుడ్ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.
జూలై 27 , 2024
KGF 3: ‘కేజీఎఫ్ 3’లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ డీల్!
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ నటుడు యష్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. యష్ నటన, ప్రశాంత్ నీల్ పనితనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వీరి కాంబోలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ‘కేజీఎఫ్ 3’లో కోలివుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మెుదలయ్యాయి.
‘కేజీఎఫ్ 3’లో అజిత్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'విదా ముయార్చి' (Vidaamuyarchi) మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్న అజిత్ మరో స్టార్ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్. లేటెస్ట్ బజ్ ప్రకారం అజిత్‌తో కలిసి ప్రశాంత్ నీల్ రెండు చిత్రాలు తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి విభిన్నమైన కథాంశం కలిగిన స్టాండలోన్ మూవీ కాగా, మరొకటి కేజీఎఫ్ యూనివర్స్‌కు లింకప్ చేసే కథ అని ప్రచారం జరుగుతోంది. దీంతో 'కేజీఎఫ్ 3' చిత్రంలో యష్‌తో పాటు అజిత్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ మెుదలైంది. దీంతో కేజీఎఫ్ సిరీస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 'కేజీఎఫ్ 3' అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేయడం ఖాయమని ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/nitishyadav1801/status/1816002560731287619
టైమ్ పట్టనుందా?
అజిత్, ప్రశాంత్ నీల్ చేతిలో ఇప్పటికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘విదా ముయార్చి’ తర్వాత అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మంచనుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఇప్పటికే 'సలార్ 2' ప్రాజెక్ట్ ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో 'NTR 31' అనే సినిమాను సైతం అనౌన్స్ చేశారు. ఆ రెండు చిత్రాల తర్వాత అజిత్‌తో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అటు కేజీఎఫ్ హీరో యష్ సైతం ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెుదలైంది. ‘కేజీఎఫ్ 3’కి కీలకమైన ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు.
కలెక్షన్ల సునామీ
యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం 2018 డిసెంబర్ 21 విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల అనంతరం వాటిని అందుకుంటూ వసూళ్లు సునామీ సృష్టించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆపై దీనికి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ 2' అంతకుమించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,225–1,250 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో 'కేజీఎఫ్ 3'పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
జూలై 24 , 2024
Prabhas New Movie: ప్రభాస్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. ‘స్పిరిట్’ ప్లేస్‌లో మరో చిత్రం!
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్ మరో స్థాయికి వెళ్లింది. దీంతో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రభాస్ ఇప్పటికే డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ సీక్వెల్‌లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ తర్వాతి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యూలో ఉన్నారు. వీరిద్దరిలో ముందుగా సందీప్ రెడ్డి సినిమాను ప్రభాస్ సెట్స్‌పైకి తీసుకెళ్తారని అంతా భావించారు. అయితే వీటిని కాదని ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ డైరెక్టర్‌కే ప్రిఫరెన్స్!
'కల్కి 2898 ఏడీ' తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తారని ఫ్యాన్స్ సహా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా సందీప్ ప్లేస్‌లోకి డైరెక్టర్ హను రాఘవపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ గతంలోనే ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్ 'ఫౌజి'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో అక్టోబర్‌లో షూటింగ్ మెుదలు పెట్టేందుకు డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.
జవాన్‌గా ప్రభాస్!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రానున్న ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించే అవకాశముంది. ఇక ఫౌజీ అంటే జవాన్ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘రాజా సాబ్’ టీమ్ బిగ్ ప్లాన్!
ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో 'రాజా సాబ్' (Raja Saab) తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని డైరెక్టర్ మారుతీ భావిస్తున్నారట. అయితే అది తెలుగు పాట కాదని సమాచారం. 1980లో హిందీలో వచ్చిన ఓ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు టాక్. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ 'ఓ కైకే పాన్ బనారస్ వాలా' పాటను రీమేక్ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్ ఒక్కరే ఫిక్స్ కాగా ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో సందీప్ ఉన్నారు. అయితే స్పిరిట్ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్ తాజాగా ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘కొందరు యానిమల్ నా బెస్ట్ వర్క్ అంటున్నారు. నా బెస్ట్ వర్క్ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ తీసిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలకంటే 'స్పిరిట్' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్ చెప్పారు. అతడి క్యారెక్టరైజేషన్, లుక్‌తో పాటు మేనరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జూలై 18 , 2024
Bharateeyudu 2 Day 1 Collections: ‘భారతీయుడు 2’కి ఊహించని షాక్.. భారీగా పడిపోయిన కలెక్షన్స్!
కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వచ్చిన 'భారతీయుడు' చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్రం శుక్రవారం (జులై 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందులేక తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. 'భారతీయుడు 2' తమను తీవ్రంగా నిరాశ పరిచిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడు తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మిశ్రమ స్పందన ఈ సినిమా వసూళ్లపై చూపిన ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని విశ్లేషించాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై పెద్దగా ఆసక్తి కనబరచలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కలెక్షన్స్‌లో భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం 'విక్రమ్' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.
https://telugu.yousay.tv/bharateeyudu-2-review-bharateeyudu-2-is-a-major-disappointment-in-those-aspects-how-is-the-movie.html
జూలై 13 , 2024
Disha Patani Hot: ఎద సొగసులతో హాట్ మీటర్లు బద్దలు కొడుతున్న దిశా పటానీ!
‘కల్కి’ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తన అందాల ఆరబోతతో మరోమారు నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
తాజాగా తన ఎద హోయలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒంపు తిరిగిన నడుముతో కవ్వించింది. ఈ భామ పెట్టిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా ఫొటోల్లో డిజైనర్ జాకెట్ ధరించిన దిశా ఎద పొంగులతో కుర్రకారును కవ్వించింది. మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొట్టింది.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
రీసెంట్‌గా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దిశా పటానీ మెరిసింది. తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రంలోనూ దిశా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.
బాలీవుడ్‌లో 'వెల్‌కమ్ టూ ద జంగిల్' ఫిల్మ్‌లోనూ దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.
ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో దిశా పటానీ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 61.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 12 , 2024
Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్..!
కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది.
తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.
రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్ చేసిన లక్ష్మీ రాయ్.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్ తాగుతూనే హాట్ మీటర్లను బద్దలు కొట్టింది.
లక్ష్మీ రాయ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు మైమరిచిపోతున్నారు. స్టార్ హీరోయిన్ కటౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కర్ణాటకలోని బెంగళూరు జన్మించిన లక్ష్మీ రాయ్.. 2005లో వచ్చిన 'కర్క కసధార' అనే తమిళ చిత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అదే ఏడాది శ్రీకాంత్ పక్కన 'కాంచనమాల కేబుల్ టీవీ'లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో శిరీష / కాంచనమాల పాత్రల్లో ఈ అమ్మడు అదరగొట్టింది.
ఆ తర్వాత 'నీకు నాకు' (2006) సినిమాతో మరోమారు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో ఫోకస్ పెట్టిన లక్ష్మీ రాయ్.. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2011లో లారెన్స్ సరసన కాంచన సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌షోతో మంచి మార్కులే కొట్టేసింది.
ఆ తర్వాత తెలుగులో అధినాయకుడు (2012), బలుపు (2013) చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది. అధినాయుకుడు ఆమె పోషించిన దీప్తి పాత్ర నటిగా లక్ష్మీ రాయ్‌కు గుర్తింపు తీసుకొచ్చింది.
మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ 150’లో ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి లక్ష్మీ రాయ్ ఆకట్టుకుంది. చిరంజీవితో పోటీపడి మరి స్టెప్పులేసి ప్రశంసలు అందుకుంది.
తెలుగులో చివరిగా 2019లో వచ్చిన 'వేర్ ఇజ్ ద వెంకటలక్ష్మీ' చిత్రంలో లక్ష్మీ రాయ్ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు దక్కలేదు.
ఇటీవల ‘డీఎన్‌ఏ’ అనే మలయాళ చిత్రంలో లక్ష్మీ రాయ్ నటించింది. ఇందులో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
క్రమం తప్పకుండా హాట్ ట్రీట్ ఇస్తుండటంతో లక్ష్మీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎక్కువ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
జూన్ 21 , 2024
కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
కాజల్ అగర్వాల్ ఎవరు?
కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్?
కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది.
కాజల్ అగర్వాల్ వయస్సు ఎంత?
కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు 38 సంవత్సరాలు
కాజల్ అగర్వాల్ మందన్న ముద్దు పేరు?
కాజు
కాజల్ అగర్వాల్ మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
కాజల్ అగర్వాల్ ఎక్కడ పుట్టింది?
ముంబాయి
కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా?
2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది
కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు?
కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ
కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు?
వైట్, రెడ్, బ్లూ
కాజల్ అగర్వాల్ అభిరుచులు?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం?
ఎగ్స్, తియ్యని పండ్లు
కాజల్ అగర్వాల్ అభిమాన నటుడు?
జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్
కాజల్ అగర్వాల్ తొలి సినిమా?
లక్ష్మి కళ్యాణం(2007)
కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
మగధీర, బృందావనం, డార్లింగ్
కాజల్ అగర్వాల్ ఏం చదివింది?
మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది
కాజల్ అగర్వాల్ పారితోషికం ఎంత?
కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్ తల్లిదండ్రుల పేర్లు?
వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది.
కాజల్ అగర్వాల్ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
కాజల్ అగర్వాల్ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.
కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు?
నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది.
కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en
కాజల్ అగర్వాల్ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
కాజల్ అగర్వాల్ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది.
కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రామ్ చరణ్, తమన్నా భాటియా
https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
ఏప్రిల్ 27 , 2024
కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh) విషయాలు ఇప్పుడు చూద్దాం.
కీర్తి సురేష్ దేనికి ఫేమస్?
కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
కీర్తి సురేష్ వయస్సు ఎంత?
1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు 31 సంవత్సరాలు
కీర్తి సురేష్ ముద్దు పేరు?
కీర్తమ్మ
కీర్తి సురేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది?
చెన్నై
Screengrab Instagram: keerthysureshofficial
కీర్తి సురేష్‌కు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
కీర్తి సురేష్ అభిరుచులు?
యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్
కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం?
దోశ
కీర్తి సురేష్ అభిమాన నటుడు?
సూర్య, విజయ్
తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా?
నేను శైలజ(2016)
కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా?
శ్రీ
కీర్తి సురేష్ ఏం చదివింది?
ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్
Courtesy Instagram: Keerthy suresh
కీర్తి సురేష్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది.
కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు?
సురేష్ కుమార్, మేనక
కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా?
తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.
కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది?
మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది.
తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/keerthysureshofficial/?hl=en
కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?
ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు
కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్
సిమ్రాన్
కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు
కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది.
https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
ఏప్రిల్ 16 , 2024