UTelugu
శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. అయితే శివరామ్ మంచి తనాన్ని క్యాష్ చేసుకొని సొంతవారే అతడి ఆస్తిని కొట్టేస్తారు. దీంతో ఆత్మహత్యకు యత్నిస్తున్న శివరామ్‌ను కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) అడ్డుకుంటాడు. అతడి రాకతో శివరామ్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కలి‘ (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్, సి.వి.ఎ...read more
How was the movie?
తారాగణం
ప్రిన్స్ సెసిల్
నరేష్ అగస్త్య
నేహా కృష్ణ
సివిఎల్ నరసింహారావు
మణి చందన
కేదార్ శంకర్
మధుమణి నాయుడు
గుండు సుదర్శన్
సిబ్బంది
శివ సాషుదర్శకుడు
టి.లీలా గౌతమ్ వర్మనిర్మాత
కథనాలు
HBD Rajinikanth: రజనీకాంత్ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్ స్టార్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నందమూరి తారకరామారావుతో..
టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్ రెంటో కథానాయకుడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా హీరోలుగా ‘ఖూన్ పసీనా’ పేరుతో రీమేక్ చేశారు.
శోభన్ బాబుతో..
నట భూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్ బాబు, రజనీకాంత్ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ కృష్ణతో..
ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్’ (1978), ‘రామ్ రాబర్ట్ రహీమ్’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.
https://twitter.com/atheisttindian/status/1212794102867083265
డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో..
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.
అక్కినేని నాగార్జునతో..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్ షూట్ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు.
జగపతి బాబుతో..
రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.
https://twitter.com/SolidLover123/status/1562791842898669568
డిసెంబర్ 12 , 2024
OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ నగరానికి ఏమైంది
సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
జాతిరత్నాలు
ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
డీజే టిల్లు
డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.
హుషారు
మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
బ్రోచెవారెవరురా
స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు.
ఒకే ఒక జీవితం
టైమ్ ట్రావెల్ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది.
మిషన్ ఇంపాజిబుల్
చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
హృదయం
కాలేజ్ లైఫ్, లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
చిచ్చోరే
ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది.
రొమాంచనమ్
హారర్ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు.
మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్ చేయండి.
ఏప్రిల్ 21 , 2023
Halloween 2022: మీ ప్రేయసితో కలిసి చూడదగ్గ 10 హారర్ సినిమాలు
]భిన్నమైన కథ, కథనం, కెమెరా పనితీరు, సినిమాటోగ్రఫీ, డార్క్ మ్యూజిక్‌తో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు మిస్కిన్. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని భయపెట్టి మీ మనసు దోచుకుంటుందిపిశాచి- Hotstar
ఫిబ్రవరి 11 , 2023
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్ రిలీజ్ చేసిన దేవర టీమ్ మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్‌నూ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తారక్ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూయల్ అంటే ఫసక్కేనా!
‘దేవర’ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్’ కేవలం రెండు కోట్ల మార్జిన్ (రూ.28 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. అయితే తారక్ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.
‘దేవర’ హిట్ కష్టమేనా!
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్ చెక్ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్!
తారక్ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడే ప్రమాదం ఉంది.
దేవర ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.
https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
సెప్టెంబర్ 11 , 2024
Ram Gopal Varma: స్వర్గంలో శ్రీదేవిని కలిసిన ఆర్జీవీ..! అతడి ఫెయిల్డ్ లవ్‌స్టోరీ గురించి తెలుసా?
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాట.. వెలువడే ట్వీట్ ప్రతీది హాట్ టాపిక్‌గా మారిపోతుంటాయి. ఇక వ్యక్తులను టార్గెట్ చేసి ఆయన చేసే సెటైరికల్ కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో చర్చకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా ఆర్జీవీ పెట్టిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఎంతో అభిమానించే దివంగత నటి శ్రీదేవికి సంబంధించి ఈ పోస్టు పెట్టడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
‘స్వర్గంలో శ్రీదేవిని కలిశా..’
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi)ని.. రామ్ గోపాల్ వర్మ ఎంతగానో ఆరాధించేవాడు. ఆమెను ఆర్జీవీ మనస్పూర్తిగా ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్ ఉండేది. ఇందుకు అనుగుణంగానే చాలా ఇంటర్యూల్లో శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని ఆర్జీవీ బహిరంగంగానే తెలియజేశాడు. అయితే చనిపోయిన శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆర్జీవీ పెట్టిన AI ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. 'ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను' అంటూ ఆర్జీవీ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పైగా ఈ ఫొటోలో ఆర్జీవీ సిగరేట్ తాగుతూ కెమెరాకు ఫోజు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘చనిపోయినా వదలవా’
ఆర్జీవీ తాజా పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ పోస్టును సమర్థిస్తుంటే ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఇలా ఎడిటింగ్ చేసి పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. శ్రీదేవిపై ఇష్టం ఉంటే ఉండొచ్చు గానీ, ఇలా మార్ఫింగ్ ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చనిపోయినా కూడా శ్రీదేవిని వదలవా అంటూ నిలదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీదేవిని ఆర్జీవి మర్చిపోలేకపోతున్నాడని అంటున్నారు. ఇలా ఆమెకు సంబంధించిన పోస్టులు పెట్టి శ్రీదేవి జ్ఞాపకాలను ఆర్జీవీ గుర్తు చేసుకుంటున్నాడని పేర్కొంటున్నారు.
ఆర్జీవీ ఫస్ట్ లవ్ ఈమే!
ఆర్జీవీ మనసుకు నచ్చిన మహిళ శ్రీదేవి కంటే ముందు ఒకరున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆర్జీవీనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాదు ఆమె బికినీలో ఉన్న ఫొటోలను సైతం షేర్ చేసి తన ఫ్యాన్స్‌కు పరిచయం చేశాడు. ‘బ్లూకలర్ స్విమ్ సూట్‌లో ఉన్న సత్య అనే మహిళ.. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు తన ఫస్ట్ లవ్ అని ఆర్జీవీ చెప్పాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో వైద్యురాలిగా స్థిర పడినట్లు తెలిపాడు. తాను తీసిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పేరు కూడా సత్య అని ఆర్జీవీ గుర్తుచేశాడు. అలాగే తనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'సత్య' మూవీ కూడా ఉందని అన్నాడు.
https://twitter.com/RGVzoomin/status/1430379804382023680
రంగీలా స్టోరీ అలా వచ్చిందే!
డా. సత్యతో తనకున్న ఓ క్యూట్ మూమెంట్‌ను కూడా అప్పట్లో ఆర్జీవీ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తాను చదివే రోజుల్లో సిద్ధార్థ కాలేజీలో మెడికల్ & ఇంజనీరింగ్ విభాగాలు ఒకే కాంపౌండ్‌లో ఉండేవని ఆర్జీవీ తెలిపాడు. కొన్ని సంఘటనల తర్వాత సత్యను వన్‌సైడెడ్‌గా లవ్ చేయడం మెుదలు పెట్టానని పేర్కొన్నాడు. కానీ ఆమె తనను పట్టించుకోలేదని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆమె డబ్బున్న యువకుడితో సన్నిహితంగా ఉండేదని ఆర్జీవీ తెలిపాడు. ఈ అనుభవం నుంచే రంగీలా స్టోరీ పుట్టిందని గతంలో స్పష్టత ఇచ్చాడు.
మే 02 , 2024
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 29 , 2024
Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.
లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్ ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.
విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది.
కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి.
రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.
ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు. ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.
ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు.
విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే... శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.
అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు.
రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
సెప్టెంబర్ 06 , 2023
PKSDT: టాలీవుడ్‌లో ఒకే కుటుంబం నుంచి హీరోలు కలిసి చేసిన సినిమాలు ఇవే
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 23 , 2023
కృష్ణ, మహేశ్ బాబు కలిసి నటించిన సినిమాలేంటో తెలుసా..?
]ఇందులో కృష్ణ ప్రత్యక్షంగా నటించలేదు. కానీ, ‘అల్లూరి సీతారామరాజు’ సన్నివేశాలను ఈ చిత్రంలో ప్రదర్శించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.సరిలేరు నీకెవ్వరు..ArrowDownload Our App
ఫిబ్రవరి 11 , 2023
Jr NTR తీరులో మార్పు.. హిందీ స్టార్లతో కలిసి నైట్ డేట్!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్‌చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్‌లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్‌లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్లాడు. తారక్‌తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1784800640054784018
https://twitter.com/i/status/1784782516681073070
https://twitter.com/i/status/1784737249713619077
https://twitter.com/i/status/1784857172771279114
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్‌తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్‌ను బందించబోయారు. దీంతో తారక్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్‌ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్‌కు కోపం వచ్చింది.
https://twitter.com/i/status/1783491705049886808
ఏప్రిల్ 29 , 2024
Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?
నటీనటులు : ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి, గుండు సుదర్శన్ తదితరులు
దర్శకత్వం : శివ శేషు
సంగీతం : జీవన్ బాబు
సినిమాటోగ్రాఫర్ : రమణ జాగర్లమూడి
ఎడిటర్ : విజయ్ వర్ధన్ కావురి
నిర్మాత : టి. లీలా గౌతమ్
విడుదల తేదీ : 04-10-2024
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'కలి' (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరామ్ మంచి తనాన్ని క్యాష్ చేసుకొని ఆస్తి కొట్టేయాలని సొంత వారే కుట్రలు చేస్తుంటారు. సొంత తమ్ముడు, బాబాయ్ మోసం చేయడంతో శివరామ్ తీవ్రంగా నిరాశ చెందుతాడు. వచ్చే జన్మలోనైనా మనిషిలా పుట్టకూడదంటూ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ క్రమంలో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా సూసైడ్ చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్ బెల్ కొట్టి అతడ్ని రక్షిస్తాడు. కలి రాకతో శివరామ్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? శివరామ్ జీవితానికి కలి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు. చాలా సీన్లలో డైలాగ్స్ లేనప్పటికీ ఎక్స్ ప్రెషన్స్‌తోనే మెప్పించాడు. సీన్లను రక్తికట్టిస్తూ నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్ అగస్త్య మెరిశాడు. స్టైలీష్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరే కథ మెుత్తాన్ని నడిపించారు. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్ ఉన్నంతలో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. మిగిలిన పాత్ర దారులు కూడా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సమస్యలకు పరిష్కారం సూసైడ్ కాదని, ఆత్మహత్యే అసలైన ప్రాబ్లమ్ అని దర్శకుడు శివ శేష్ ఈ చిత్రం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సందేశాత్మక కథనే ఎంచుకున్నప్పటికీ కమర్షియల్ అంశాలకూ ప్రయారిటీ ఇచ్చారు. కథను ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభంలో శివరామ్ పాత్ర, అతడి కుటుంబ నేపథ్యం, లవ్ ట్రాక్, కుటుంబ సభ్యుల మోసం చూపించారు. కలి అయిన అగస్త్య రాకతో కథలో వేగం పెంచారు డైరెక్టర్. శివరామ్‌ను అగస్త్య ప్రశ్నించిన తీరు, అతడు చేస్తున్న తప్పేంటో చెప్పే ప్రయత్నం మెప్పిస్తుంది. బతకాలనే ఆశని పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్, నరేష్ అగస్త్యా మధ్య వచ్చే సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథను మరీ సాగదీసినట్లు అనిపించడం, సినిమా మెుత్తం రెండు పాత్రల చుట్టే తిరగడం, కామెడీ లేకపోవడం మైనస్‌లుగా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంగీతం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవన్ బాబు అందించిన నేపథ్యం సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథప్రిన్స్, అగస్త్య నటనసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
Niharika Konidela Divorce: అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా? నిహారిక- చైతన్య, సమంత- నాగచైతన్యకు కలిసి రాని డెస్టినేషన్ వెడ్సింగ్స్!
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న వీరికి డైవర్స్ మంజూరు అయ్యాయి. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 2 ఏళ్లపాటు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలం దూరంగా జీవనం సాగించారు. ఆ తర్వాత ఇక కలిసి ఉండలేమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోయారు.
విడాకులకు అసలు కారణం ఇదేనా?
నిహారిక- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత నిహారిక చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఒకసారి ఓ పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఓసారి అపార్ట్‌మెంట్ వాళ్లతో గొడవతో నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో చైతన్య- నిహారికల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసినట్లు సమాచారం. పెళ్లికి ముందు గారాల పట్టిగా పెరిగిన నిహారిక వివాహా అనంతరం కాస్త ఫ్రీడమ్‌ను కోల్పోయినట్లు తెలిసింది.
https://twitter.com/Ferrari_Monk/status/1676291467445440512?s=20
విడాకులపై నిహారిక స్పందన
చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంపై మెగా డాటర్ నిహారిక తొలిసారి స్పందించింది. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని ఇబ్బంది పెట్టవద్దని కోరింది. అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో తాము ప్రైవసీని కోరుకుంటున్నట్లు పోస్టులో తెలిపింది. దీనిని అందరూ గౌరవించి సహకరించాలని నిహారిక కోరింది. ఇంత కాలం తనకు అండగా ఉన్న కుటుంబసభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తన పోస్టును నిహారిక ముగించింది.
https://twitter.com/SureshPRO_/status/1676474938033840128?s=20
చైతన్య ఎమన్నారంటే?
నిహారికతో విడాకుల నేపథ్యంలో చైతన్య జొన్నలగడ్డ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటా. 10 రోజులుగా నా జీవితంలో వచ్చిన 'విపాసన' ప్రక్రియ అద్భుతం. మనం ఒక ప్రాంతానికి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి.. అద్భుత జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం చైతన్య మానసిక ప్రశాంతత పొందేందుకు ముంబైలోని విపాసన మెడిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలిసింది.
అక్కడ పెళ్లి చేసుకుంటే అంతేనా?
టాలీవుడ్‌లో సమంత- నాగచైతన్య (Samantha- Nagachithanya) విడాకులు పొందిన తీరును కొంతమంది.. నిహారిక- చైతన్య డైవర్స్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు జంటలు సొంత ప్రాంతంలో కాకుండా బయటి ప్రదేశంలో (డెస్టినేషన్ వెడ్డింగ్) వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిహారిక- చైతన్య.. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination wedding) చేసుకున్నారు. అలా చేసుకున్న రెండేళ్లకే ఈ జంట విడిపోయింది.
అంతకు ముందు 2017 అక్టోబర్ 6న గోవాలో నాగచైతన్య- సమంత ఇదే తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట కాపురం కూడా కొద్ది కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ టాలీవుడ్ సెలబ్రెటీలకు డెస్టినేషన్ మ్యారెజెస్ కలిసి రావడం లేదని వాదిస్తున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి అయినా ఇక్కడే పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.
జూలై 05 , 2023
Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్’ సరసన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్ కాదు భయ్యా!
2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్ - కలెక్షన్స్ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
ఆయ్ (Aay)
నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ కూడా కలుపుకుంటే ‘ఆయ్’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ & ఫ్యూచరిక్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటివారు స్పెషల్ క్యామియోలతో అలరించారు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
హనుమాన్ (Hanuman)
తేజసజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్ క్రేజ్‌తో ప్రశాంత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టనున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
ఉదిత్ నారాయణ్ తెలుగు సూపర్ హిట్ సాంగ్స్
]మిథువా- లగాన్ చిత్రంలో స్ఫూర్తి కలిగించే పాట హిందీ హిట్స్Listen now
ఫిబ్రవరి 14 , 2023
కొత్త సంవత్సరం రోజు ఫుల్ జోష్‌లో హీరోయిన్లు… హాట్ లుక్స్‌లో కవ్విస్తూ..
]మెహ్రీన్ దుబాయ్‌లో తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో
ఈ ముద్దుగుమ్మ అందాలు కుర్రకారు మతిపోగుడుతున్నాయి.మెహ్రీన్ కౌర్ పిర్జాదా
ఫిబ్రవరి 13 , 2023
Happy Wedding Anniversary మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్
]మహేశ్-నమ్రత జంట ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ YouSay తరఫున జంటతారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఫిబ్రవరి 10 , 2023
Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
ఈ ఏడాది టాలీవుడ్ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
శ్రీలీల
ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్ కేసరి', పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్, విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తోంది.
కీర్తి సురేష్
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్ పక్కన ‘మామన్నన్’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న
ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిస్టర్ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
సమంత
ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్ ఫిల్మ్ ‘చెన్నై స్టోరీస్’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.
సంయుక్త మీనన్
ఈ ఏడాది సంయుక్త మీనన్ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్ సరసన ఆమె నటించిన 'సార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అనుష్క శెట్టి
గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్ లభించిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
శ్రుతి హాసన్
టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్ సరసన 'సలార్' సినిమాలోనూ శ్రుతి హాసన్ నటించింది.
డిసెంబర్ 19 , 2023
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024
Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ స్ట్రాంగ్ కౌంటర్? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్!
పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కల్యాణ్ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
‘నా మనసుకు నచ్చితే వస్తా’
రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్ భార్య తబిత ప్రెజెంట్ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
https://twitter.com/i/status/1826302303244091491
‘నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి’
ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్ ఫ్యాన్స్. నా ఆర్మీ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీని సెపరేట్ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిరుకి సింపుల్ విషెస్..!
నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
https://twitter.com/alluarjun/status/1826438293350711467
బన్నీకి పవన్ చురకలు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్ వారే జరిగింది.
ఆగస్టు 22 , 2024
Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024