• TFIDB EN
  • కళింగ
    UATelugu
    కళింగ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారు. ఆ అడవిలో కళింగ రాజు సంపద ఉందని, దానికి ఓ దుష్టశక్తి కాపలాకాస్తుందని ప్రజల నమ్మకం. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం గ్రామానికి చెందిన లింగా (ధ్రువవాయు) ఫ్రెండ్స్‌తో కలిసి అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కళింగ రాజు మిస్టరీ ఏంటి? లింగా ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా?’ అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Prime
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ధ్రువ వాయు
    ప్రగ్యా నయన్
    లక్ష్మణ్ మీసాల
    ఆడుకలం నరేన్
    బలగం సుధాకర్
    షిజు
    మురళీధర్ గౌడ్
    తనికెళ్ల భరణి
    బలగం సంజయ్ కృష్ణ
    సిబ్బంది
    ధ్రువ వాయుదర్శకుడు
    దీప్తి కొండవీటినిర్మాత
    కథనాలు
    <strong>This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!</strong>
    This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!
    థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్‌ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు స్వాగ్‌ (Swag) వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ కీలక పాత్రలు పోషించారు.&nbsp; చిట్టి పొట్టి (Chitti Potti) రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ&nbsp; చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; దక్షిణ (Dakshina) తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తుల‌సిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియ‌ల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్‌గా సాయిధ‌న్సిక ఇందులో కనిపించనున్నారు.&nbsp; కలి (Kali) ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘కలి’ (Kali). ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; బహిర్భూమి (Bahirbhoomi) నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని&nbsp; మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) ప్రముఖ నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్‌ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; బ్లింక్‌ (Blink) ‘దసర’ ఫేమ్‌ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'బ్లింక్‌'. మేలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.&nbsp; ఆహా వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; కళింగ (Kalinga) ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్‌ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan&nbsp;MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers&nbsp;SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
    సెప్టెంబర్ 30 , 2024
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్  సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్ సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    ]ప్రస్తుతం డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో 2024లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో కూడా పఠాన్ తరహా యాక్షన్ ఉంటే&nbsp; ఆ ఏడాది ఊపేస్తుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.&nbsp; మార్టిన్ లూథర్&nbsp; కింగ్&nbsp; పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల&nbsp; ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న&nbsp; దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.&nbsp; బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం. నటీనటులు నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్ కథ ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ. డైరెక్షన్ ఎలా ఉందంటే? కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు.&nbsp; కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు.&nbsp; ఎక్కడ ఎమోషన్స్ మిస్‌ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.&nbsp; సినిమా ఎలా ఉందంటే? నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది.&nbsp; దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే? నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్‌ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్‌ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్‌ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్‌ అదిరిపోయింది.&nbsp; అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్&nbsp; గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు. టెక్నికల్ విషయాలు… సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు.&nbsp; చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్‌&nbsp; చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.&nbsp; బలాలు నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్ బలహీనతలు ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు. రేటింగ్: 3/5
    జనవరి 14 , 2024
    <strong>Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!</strong>
    Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!
    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్‌ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉంది? అందులో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ వాయిసే హైలేట్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక క‌థ చెప్పే స‌మ‌యం వ‌చ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల క‌థ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. పుట్టుక‌తోనే అన్న‌ద‌మ్ములు కాక‌పోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువ‌బ‌డిన టాకాల క‌థ ఇది అంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మ‌ధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడ‌ప్పుడు ఈ చ‌ల్ల‌ని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాప‌కాల్ని గుర్తుచేస్తున్న‌ట్లు అనిపిస్తుంది’ అంటూ మ‌హేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ‘మ‌నం ఒక్క‌టిగా పోరాడాలి, నేను ఉండ‌గా నీకు ఏం కాదు టాకా, భ‌య‌ప‌డ‌కు’ అంటూ మ‌హేష్ బాబు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివ‌ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు మహేష్‌. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.&nbsp; మ‌హేష్ వాయిస్ కోస‌మైనా సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129 ‘ఇది నాకెంతో ప్రత్యేకం’ ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్‌ చెప్పడంపై మహేష్‌ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తెలుగులో మహేష్‌.. హిందీలో షారుక్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్‌ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp; 'SSMB29'తో బిజీ బిజీ దర్శక ధీరుడు రాజ‌మౌళితో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఇందులో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకోసం లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 26 , 2024
    Upcoming Telugu movies: అక్టోబర్‌లో విడుదల కానున్న సినిమాలు
    Upcoming Telugu movies: అక్టోబర్‌లో విడుదల కానున్న సినిమాలు
    ]అక్టోబర్ 27 , 2023మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా)
    సెప్టెంబర్ 26 , 2023
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్‌.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు దర్శకుడు: టీజీ కీర్తి కుమార్ సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్ సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్ నిర్మాత: అదితి సోని వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్‌ కె. సింగ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్ప‌డూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే వెన్నెల కిషోర్‌ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్‌ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్‌ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్‌ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్‌ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్‌ లైన్‌ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్‌ అయ్యింది. ఏజెంట్‌ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్‌ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్‌ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌ను కూడా డైరెక్టర్‌ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్‌ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది. టెక్నికల్‌గా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేప‌థ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్ర‌ాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌రక్తి కట్టించే సీన్లు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 01 , 2024
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి&nbsp; పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం. ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie) కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా&nbsp; ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.&nbsp; మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ (GHOST) కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది. ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal&nbsp;MoviePortuguese&nbsp;NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series&nbsp;SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie&nbsp;KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul&nbsp;MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece&nbsp;SeriesTelugu Dubbed&nbsp;Disney Plus HotstarOctober 25&nbsp; Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist&nbsp;SeriesEnglishApple Plus TVOctober 27
    అక్టోబర్ 26 , 2023
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
    ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్‌ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.&nbsp; ‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్‌. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; టీం సభ్యుల ప్రచారం.. సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.&nbsp; కెమెరా.. సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్‌ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.&nbsp; సరికొత్తగా ప్రభాస్.. సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.&nbsp; https://twitter.com/Attitudist/status/1671201399584227328 మ్యూజిక్ కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ&nbsp; https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
    జూన్ 21 , 2023
    <strong>Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;
    నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ కోసం స్పెషల్‌ పోస్ట్‌! ‘హనుమాన్‌’తో టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్‌ వర్మ పెట్టిన మరో పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; ఒక ఫొటో షేర్‌ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471 ముహోర్తం ఫిక్స్‌..! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్‌ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మోక్షజ్ఞ లుక్స్‌ వైరల్‌.. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్‌ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
    సెప్టెంబర్ 03 , 2024
    <strong>Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!</strong>
    Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్‌ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్‌ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సింహానికి మహేష్ డబ్బింగ్‌ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) డబ్బింగ్‌ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్‌ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1826142693149327810 డబ్బింగ్‌పై మహేష్‌ ఏమన్నారంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ యానిమేషన్‌ చిత్రంలో మెయిన్‌ లీడ్‌కు డబ్బింగ్‌ చెప్పడంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ను బిగ్‌ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హిందీలో డబ్బింగ్ ఎవరంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్‌ చేయడంపై షారుక్‌ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు.&nbsp; ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    <strong>Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే</strong>
    Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే
    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ చిత్రం 'విశ్వంభర'. ఇందులో చిరు సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటు&nbsp; చిరంజీవి కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత చిత్రం ‘భోళా శంకర్‌’ డిజాస్టర్‌ నుంచి ఈ మూవీ సక్సెస్‌తో బయటపడాలని చిరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో ఆ రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని విశ్వంభర టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది.&nbsp; గ్రాండ్‌ ట్రీట్‌ లోడింగ్‌..! మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డేను మెగా అభిమానులు ఏ స్థాయిలో సెలబ్రేట్‌ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్లెక్సీలు కట్టించి కేక్‌ కటింగ్స్‌ చేయడంతో పాటు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హంగామా చేస్తారు. చిరు గొప్పతనం గురించి గుర్తుచేసుకుంటారు. ఆ రోజున ఫుల్‌ జోష్‌లో ఉండే మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ‘విశ్వంభర’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్క్‌ కూడా మెుదలైపోయినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్/టీజర్‌ తాలుకూ ఫైనల్‌ వర్క్‌ జరుగుతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘ఇంద్ర’ మూవీ 4K వెర్షన్‌ రీరిలీజ్‌ సందర్భంగా థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను ప్రసారం చేయాలని విశ్వంభర టీమ్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/CinemaBrainiac/status/1825454972777197590 ‘ఇంద్ర’ రీ-రిలీజ్ రికార్డులు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను ఈసారి మరింత స్పెషల్‌ కాబోతోంది. చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ను ఆగస్టు 22న రీరిలీజ్‌ చేయబోతున్నారు. 4K వెర్షన్‌లో రానున్న ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ను శనివారం (ఆగస్టు 17) ప్రారంభించారు. అయితే రిలీజ్‌ చేసిన అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయినట్లు థియేటర్‌ వర్గాలు ప్రకటించాయి. అదనపు&nbsp; షోలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపాయి. అయితే ఇంద్ర రిలీజై ఇప్పటికీ 22 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత ఈ సూపర్‌ హిట్‌ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ‘ఇంద్ర’తో పాటు మరో బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ను సైతం రీరిలీజ్‌ చేయబోతున్నారు.&nbsp; విశ్వంభరలో సిస్టర్‌ సెంటిమెంట్‌! విశ్వంభర సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యువ నటి రమ్య పసుపులేటి క్లారిటీ ఇచ్చింది. 'మారుతినగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ హీరోయిన్‌గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇపుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెళ్లుగా చేస్తునారు’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/PraveeGv/status/1825121103187964326
    ఆగస్టు 20 , 2024
    Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
    Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
    సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ రామ్ పాత్ర‌లో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ను తమ క‌ళ్ల‌తోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్ర‌దాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; హిట్ పేయిర్ రిపీట్ సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మృణాల్ హవా కొనసాగేనా? దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో&nbsp; ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్‌ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు. షూటింగ్ ఎప్పుడంటే? ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
    మే 14 , 2024
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ. &nbsp; బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో&nbsp; ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao&nbsp;MovieHindiJio CinemaAugust 25Invasion 2&nbsp;SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
    VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
    ‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్‌ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.&nbsp; సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.&nbsp; సమంత మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.&nbsp; ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.&nbsp; సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.&nbsp; శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.&nbsp; ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.&nbsp; మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.&nbsp; బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.&nbsp; గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్‌ అని కామెంట్ చేస్తున్నారు.&nbsp; లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.&nbsp;
    జూన్ 14 , 2023
    17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
    17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
    తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్‌…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్‌ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.&nbsp; మాస్‌ టచ్‌ “ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్‌ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్‌ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్‌ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్‌ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.&nbsp; స్టైల్ సాలా సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్‌. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్‌ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్‌ సెట్ అయ్యింది.&nbsp; మాటల తూటాలు పూరీ జగన్నాథ్ అంటే మాస్‌ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్‌ ప్యాక్డ్‌ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.&nbsp; స్వాగ్ సాంగ్స్‌ పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్‌ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్‌ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.&nbsp; https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU కృష్ణమనోహర్ IPS గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్‌ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది. ఇండస్ట్రీ హిట్&nbsp; సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.&nbsp; ఎందరిని దాటుకుని మహేశ్‌ దగ్గరికి వచ్చిందో తెలుసా? పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్‌ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయ్యింది. పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్‌&nbsp; పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్‌ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.&nbsp;
    ఏప్రిల్ 28 , 2023
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు&nbsp; కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.&nbsp; మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.&nbsp; డెడ్‌ లైన్&nbsp; ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.&nbsp; కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
    ఫిబ్రవరి 22 , 2023
    <strong>The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్‌’ డైరెక్టర్‌ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌). సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్‌'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్‌ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; ‘అందుకే నచ్చలేదు’ తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్‌’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్‌ ప్రభు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్‌ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్‌ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్‌ ప్రభు కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918 తెలుగు ఆడియన్స్ ఫైర్‌..! డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్‌' డిజాస్టర్‌ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్‌ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్‌ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్‌’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.&nbsp; తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే! దర్శకుడు వెంకట్‌ ప్రభు రొటిన్‌ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్‌ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్‌ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్‌ తెలుగు ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్‌ ట్రాక్‌ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.&nbsp; నో చెప్పిన ధోని! ‘ది గోట్‌’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) విజువల్స్‌ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్‌ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ క్రికెట్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp; నెగిటివ్‌ రివ్యూలపైనా మండిపాటు ‘ది గోట్‌’ సినిమాపై వచ్చిన నెగిటివ్‌ రివ్యూలపై దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్‌ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?</strong>
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!</strong>
    LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్‌ అయితే లేదు.&nbsp; శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు బడ్డీ చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా&nbsp; థియేటర్లలో విడుదలకానుంది. శివం భజే యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది. ఉషా పరిణయం తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్‌ భాస్కర్‌&nbsp; కుమారుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది. తిరగబడర సామి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్‌ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలనాటి రామచంద్రుడు&nbsp; కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి&nbsp; డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన&nbsp; డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్‌, డ్యూన్ పార్ట్ 2,&nbsp; కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి&nbsp; తెలుగు డబ్బింగ్&nbsp; సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి. PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
    జూలై 29 , 2024

    @2021 KTree