రివ్యూస్
YouSay Review
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్...read more
How was the movie?
తారాగణం
విశ్వ కార్తికేయ
ఆయుషి పటేల్
చిత్ర శుక్లా
రూపా లక్ష్మి
అనీష్ కురువిల్లా
దేవీ ప్రసాద్
నరేన్ రామ్
సిబ్బంది
రమాకాంత్ రెడ్డిదర్శకుడు
కందుల చంద్ర ఓబుల్ రెడ్డినిర్మాత
గడ్డం మహేశ్వర రెడ్డినిర్మాత
కాటం రమేష్నిర్మాత
అజయ్ అరసాడసంగీతకారుడు
గ్యారీ BH
ఎడిటర్ర్కథనాలు
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 29 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్’, ‘ది గోట్ లైఫ్’.. అటు ఓటీటీలో ఏవంటే?
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
ది గోట్‌లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్’. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్ తెలిపింది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్
మరో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. ఆడమ్ విన్‌గార్డ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది.
కలియుగం పట్టణంలో
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సుందరం మాస్టర్
వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది.
ఏం చేస్తున్నావ్?
విజయ్ రాజ్‌కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’ (Em chesthunnav OTT Release). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది.
ట్రూ లవర్
జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె.మణికందన్ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ లవర్’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
మార్చి 25 , 2024
Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
Stree 2
అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల్లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక స్త్రీ 2 సినిమా స్టోరీ విషయానికొస్తే... చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.
Kalki 2898 AD
రెండో స్థానంలో నిలిచిన ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌గా నిలిచింది.
ఇక కల్కి స్టోరీ విషయానికొస్తే…కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
12th Fail
మూడో స్థానంలో ‘12వ ఫెయిల్’ నిలవడం విశేషం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుని మంచి వసూళ్లు సాధించింది. స్ఫూర్తివంతమైన కథనం ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది.
ఇక స్టోరీ విషయానికొస్తే…మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
Laapataa Ladies
ఆస్కార్ రేసులో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన ‘లపాటా లేడీస్’ నాలుగో స్థానంలో ఉంది, ఇది మహిళల సెంట్రిక్ కథతో సక్సెస్ సాధించింది.
Hanu-Man
తెలుగు సినీ ప్రియులకు గర్వకారణంగా, ‘హనుమాన్’ ఐదో స్థానంలో నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలై అనేక రికార్డులను తిరగరాసింది. ₹300 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సూపర్ హీరో సినిమా, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే…సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
Maharaja
ఆరవ స్థానంలో విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’, ఏడో స్థానంలో నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే… మహారాజా ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మహారాజా గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాడు. ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి దాడి చేశారని చెప్తాడు. తన బిడ్డను కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్నది కథ.
Manjummel Boys
మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
The Greatest of All Time
తమిళ్ సూపర్ విజయ్ నటించిన ‘గోట్’ 8వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? అన్నది స్టోరీ.
Salaar
ప్రభాస్ నటించిన ‘సలార్’ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే………ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
Aavesham
మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ పదవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కల్కి 2898 AD మరియు హనుమాన్ వంటి తెలుగు చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం కాదు. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన హైప్ అలాంటిది. హనుమాన్ సంక్రాంతి సమయంలో విడుదలై పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది.
మొత్తంగా గూగుల్ ట్రెండ్స్ జాబితాలో ఈ ఏడాది మూడు తెలుగు సినిమాలు, మూడు హిందీ చిత్రాలు, రెండు తమిళ సినిమాలు, రెండు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 సంవత్సరానికి మరింత ఆసక్తికరమైన సినిమాల జాబితా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
డిసెంబర్ 12 , 2024
Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా పుష్పరాజ్ సృష్టిస్తున్న రికార్డ్స్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్ నడుస్తున్న సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్ యాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
హరికథ ప్రీరిలీజ్ ఈవెంట్..
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హరికథ వెబ్ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్ బృందమంతా పాల్గొంది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.
https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM
‘రూ.1000 టికెట్ పెట్టి వెళ్లక్కర్లా’
‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా ఒక్కో టికెట్ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546
తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్ చేశారు. ఈ సిరీస్ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
డిసెంబర్ 09 , 2024
Kalki 2: స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్ (Kamal Hassan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్ క్యాస్ట్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కి 2’ షూట్ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.
షూటింగ్స్‌కు బ్రేక్!
'కల్కి 2' చిత్రం వచ్చే ఏడాది జూన్ - జులై కల్లా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వని దత్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం 'కల్కి 2' రీమైనింగ్ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి 'కల్కి 2' షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.
దీపికనే కీలకం!
‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్ సిద్ధం చేసుకున్న డేట్స్ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.
అసలు కథ ‘పార్ట్ 2’లోనే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విలన్ సుప్రీమ్ యాష్కిన్‌గా కమల్ హాసన్ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్ సుప్రీమ్ యాష్కిన్ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్, విలన్ సుప్రీమ్ యాష్కిన్ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
కమల్ హాసన్ విశ్వరూపం
కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్ చేసుకొని సుప్రీమ్ యాష్కిన్ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్ హాసన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్ యాష్కిన్ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్ హాసన్ విశ్వరూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.
కల్కి పాత్రలో ఎవరు?
పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్ ఝలక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్ ఉంది. కలి అయిన సుప్రీమ్ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సాయం చేయవచ్చు.
ఆగస్టు 06 , 2024
Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్ చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్ పార్ట్ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.
అసలు కథ ‘పార్ట్ 2’లోనే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విలన్ సుప్రీమ్ యాష్కిన్‌గా కమల్ హాసన్ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్ సుప్రీమ్ యాష్కిన్ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్, విలన్ సుప్రీమ్ యాష్కిన్ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
కమల్ హాసన్ విశ్వరూపం
కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్ చేసుకొని సుప్రీమ్ యాష్కిన్ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్ హాసన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్ యాష్కిన్ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్ హాసన్ విశ్వరూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.
భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు?
భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్ పార్ట్‌లో రానుంది.
విజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్!
కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ పోషించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కల్కి పాత్రలో ఎవరు?
పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్ ఝలక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్ ఉంది. కలి అయిన సుప్రీమ్ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సాయం చేయవచ్చు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 08 , 2024
Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్ సక్సెస్ చేసిన డైలాగ్స్ ఇవే..!
ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ అదరగొట్టాడని, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్ గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ సహా కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కల్కి మూవీ డైలాగ్స్
కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.
కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా?
అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి.
కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.
అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని.
కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం.
అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా?
కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.
అశ్వత్థామ : నేనా?
కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి.
డైలాగ్
కాంప్లెక్స్ ఒక యువకుడిపై 5000 యూనిట్స్ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్ గ్యాంగ్ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్ భైరవ (ప్రభాస్)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది.
బుజ్జి : హేయ్.. స్టాప్. నన్ను షూట్ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్ వచ్చి మీ అందరిని స్మాష్ చేస్తాడు.
విలన్ గ్యాంగ్: ఎవరు మీ బాస్?
బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్. ఇంత వరకూ ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్ అండ్ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు)
భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు..
బుజ్జి : భైరవ గెటప్.. చాలా బిల్డప్ ఇచ్చాను లే.
భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్ 5 మినిట్స్ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఫైట్ ఉంటుంది)
డైలాగ్
సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.
సుప్రీమ్ యాస్కిన్: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్?
సైంటిస్టు : మంచి కోసం..
సుప్రీమ్ యాస్కిన్ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి?
సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి
సుప్రీమ్ యాస్కిన్ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా?
సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు?
సుప్రీమ్ యాస్కిన్ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.
డైలాగ్
కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్ యస్కిన్ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్, డైలాగ్స్ హైలెట్‌గా నిలుస్తాయి.
రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు?
అశ్వత్థామ : నేను కాపాడతాను
రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా?
అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్ బీజీఎం వస్తుంది)
రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్.. ల్యాబ్ నుంచి ఎస్కేప్ అయిన మామూలు ప్రెగ్నెంట్ ఉమెన్. ఏమీ స్పెషల్ ఉమెన్ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం.
*ఆ డైలాగ్ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
డైలాగ్
మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్ మిస్మరైజింగ్ చేస్తాయి.
అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్ అమ్మా?
సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి?
అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా.
సుమతి : కానీ, నేనే ఎందుకు?
అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.
అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత.
డైలాగ్
శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది.
భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు.
ఛటర్జీ : ముసలోడా?
భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్ చేయలేదు. నేను తప్పా.
ఛటర్జీ : వీడెవడు అసలు?
కమాండర్: భైరవ అని బౌంటీ ఎంటర్ సర్. మన వాళ్లని కొడితే బ్లాక్ లిస్ట్ చేశాను.
భైరవ: ఎలాగైనా బ్లాక్ లిస్ట్ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్ లేదు.
ఛటర్జీ : అంత ష్యూర్ ఆ..
భైరవ : రికార్డ్స్ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.
డైలాగ్
కల్కి క్లైమాక్స్‌లో.. కమల్ హాసన్ మీద వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్ సెకండ్ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old)
డైలాగ్
కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీనను షేక్ చేస్తాడు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి.
అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు.
కర్ణుడు: ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు.
అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.
అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.
కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు). నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.
కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్ ముగుస్తుంది).
జూలై 02 , 2024
Kalki 2898 AD Review: ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్ తదితరులు
రచన, దర్శకత్వం : నాగ్ అశ్విన్
సంగీతం : సంతోష్ నారాయణన్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు : అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్
నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్ మేకర్స్
విడుదల తేదీ : 27 జూన్, 2024
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్‌హాసన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
'కల్కి 2898 ఏడీ' కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్ చేశాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్ బీఫోర్ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్ హాసన్ నెక్స్ట్ లెవెల్ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి అతిపెద్ద బలం నాగ్ అశ్విన్ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్ టేకింగ్, విజన్, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్ వెహికల్స్, ఆయుధాలు, సెట్స్ విజువల్ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్. దీపికా డబ్బింగ్ విషయంలోనూ నాగ్ అశ్విన్ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్ అశ్విన్.. డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ అయినట్లు చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్ చాలా రిచ్‌గా ఉంది.
ప్లస్ పాయింట్స్
కథ, దర్శకత్వంప్రభాస్ ప్రధాన తారాగణం నటనహాలీవుడ్ రేంజ్ విజువల్స్‌కురుక్షేత్రం ఎపిసోడ్
మైనస్ పాయింట్స్
తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌దీపికా డబ్బింగ్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 4/5
Public Talk On Kalki 2898 AD
ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.
కల్కి సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1806243116405723294
కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1806146620867912015
అటు దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1806187132450406624
కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు.
https://twitter.com/i/status/1806177761280578043
‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/saidevendla/status/1806199250327359793
కల్కి సూపర్ హిట్ టాక్ చూసి.. మూవీ యూనిట్ మెుత్తం ఫుల్ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనిదత్ చిందులు వేస్తునట్లుగా మాస్టర్ సినిమాలోని డ్యాన్స్ క్లిప్‌ను ఎడిటింగ్ చేసి పంచుకున్నాడు.
https://twitter.com/i/status/1806199186813288713
ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్ చేసి పోస్టు చేశారు.
https://twitter.com/i/status/1806199040368910540
ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు.
https://twitter.com/SALAARSURYAA/status/1806198851164066271
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా కల్కి థియేటర్ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1806198649107755236
కల్కి.. రెగ్యులర్ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
https://twitter.com/btrsir/status/1806056337714864288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806056337714864288%7Ctwgr%5E340e81c546b0e7d2540bbcb78327e8a93b350cf2%7Ctwcon%5Es1_&ref_url=http%3A%2F%2Fnewsroom.etvbharat.org
కల్కి సెకండాఫ్ ఒక మాస్టర్ పీస్ అని, చివరి 45 నిమిషాలు గూస్ బంప్స్ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్, అమితాబ్ తమ నటనతో థియేటర్లను షేక్ చేశారని చెప్పుకొచ్చాడు.
https://twitter.com/SivaHarsha_23/status/1806175733125132706
కల్కి సినిమా సక్సెస్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1806134805542941036
జూన్ 27 , 2024
Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్ కంటే అమితాబ్ పాత్రనే హైలెట్ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 10) కల్కి ట్రైలర్ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ప్రభాస్.. కల్కినే కాదట!
'కల్కి 2898 ఏడీ' చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్ చూసిన తర్వాత అసలు ప్రభాస్ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ఏం ట్విస్ట్ ప్లాన్ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
https://www.youtube.com/watch?v=y1-w1kUGuz8
ప్రభాస్ ప్రాధాన్యత తగ్గిందా!
కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్ కంటే బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. 'రికార్డ్స్ చెక్ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్ ఓడిపోలేదు' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్ 27న ప్రభాస్ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.
దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్
కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్ అశ్విన్ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్‌కు వాడేస్తున్నారు.
https://twitter.com/i/status/1800179235677778142
వీటిపైనా నెట్టింట చర్చ..!
‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ - ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్ లుక్, రోల్ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్‌కు ఫుల్ మార్క్‌లు పడ్డాయి.
జూన్ 11 , 2024
Kalki 2898 AD: ప్రభాస్ కోసం రంగంలోకి మహేష్.. ఎందుకంటే?
సలార్ (Salaar) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ న్యూస్ బయటకొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు డబ్బింగ్? (Mahesh Babu Dubbing)
కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్ వాయిస్ ఇస్తే సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ఇలాగే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన అనుభవం ఉంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సంజయ్ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్ చేత ఎలాగైన డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘SSMB29’ సినిమా షూట్ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి.
కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
మే 08 , 2024
EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్ అశ్విన్.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్- K (Project-K). అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి స్టార్లతో నిండిపోయిన ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ పూర్తైనట్లు సమాచారం. విలన్ పాత్ర పోషించడానికి కమల్ హాసన్ 10 అంకెల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే, ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.
ఒక్కో పోస్టర్‌లో ఒక్కో ప్రత్యేకత..
విరిగి పడిన చేతికి ఎక్కుపెట్టిన తుపాకులు, పిడికిలి బిగించిన చేతులు, దూరంగా కొండ అంచుపై చీకటిలో నిలబడిన మనిషి, ఆశతో నిండిన కళ్లు.. ఇవీ ప్రాజెక్ట్ K చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు. ఒక్కో పోస్టర్‌పై ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ని విడుదల చేసి పాత్రల గురించి టీం హింట్ ఇచ్చింది.
తాజాగా దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురిని ముస్తాబు చేస్తున్నట్లు ఉంది. దిశా పటాని కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లను చూస్తే ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరి, ఈ ఎదురు చూపు ఎవరికోసం? ఎందుకోసం? అసలు దిశ క్యారెక్టర్ ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.
శివరాత్రి సందర్భంగా చిత్రబృందం రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ఓ భారీ చేయి విరిగిపడి ఉండగా, ఆ చేతివైపు ముగ్గురు వ్యక్తులు (ప్రత్యేక సూట్ వేసుకుని) అత్యాధునిక తుపాకులు గురిపెట్టి నిల్చొని ఉండటం ఇందులో చూపించారు. అక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే చుట్టు పక్కల విధ్వంసం జరిగినట్లు తెలిసిపోతోంది. మరి, ఈ విధ్వంసం ఆ చేయి సృష్టించిందా? లేదా అసుర సంహారమా? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందనే క్యాప్షన్ పెట్టి దీనిని మరింత ఆసక్తికరంగా మలిచారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ ప్రాజెక్ట్ K టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. పిడికిలి బిగించిన చేతి ఫొటోను ఇందులో చూపించింది. చేతికి రక్షణగా ఓ వస్త్రాన్ని కట్టుకున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌లోనే ‘Legends are Immortal’ (ధీరులకు మరణం ఉండదు) అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే, అమితాబ్ పాత్ర పోరాట సన్నివేశాలకు మిళితమై ఉంటుందని తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు ఇలాంటి పోస్టర్‌నే విడుదల చేసింది టీమ్. చేతికి రక్షణగా పెట్టుకున్న సూట్ ఇందులో ఉంది. ఆ పోస్టర్‌కు ‘Heroes are Not Born, They Rise’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఎవరీ సేవియర్?
దీపిక పదుకునె బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజైంది. పోరాడి అలసిపోయిన ఓ సేవియర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో దీపిక ముఖం చూపించలేదు. కానీ, కొండపై నిల్చొని పిడికిలిని బిగించినట్లుగా ఉంది.
పోస్టర్‌పై ‘A Hope in The Dark’ అని క్యాప్షన్ ఉంది. అంటే, దారులన్నీ చీకటిగా మారినప్పుడు మార్గం చూపి ముందుకు నడిపించే వెలుగు దివ్వె అని చెప్పకనే చెప్పారు. సినిమాలో కథానాయకులు దిగ్బంధంలో ఉన్నప్పుడు వీరిని రక్షించేందుకు దీపిక వస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.
ఇదేనా స్టోరీ?
‘ప్రాజెక్ట్ K’ స్టోరీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు మూర్తి దశావతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట. కల్కికి తండ్రిగా అశ్వథ్థామ పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కలియుగాంత సమయంలో సృష్టి రక్షణకు చేయూతనిచ్చేందుకు కల్కిగా వస్తాడని, దుష్ట సంహారానికై చేసే పోరాటంలో వీరందరూ ఏకమైతారని తెలుస్తోంది.
https://twitter.com/VyjayanthiFilms/status/1645313158955802625?s=20
మరోవైపు, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి తండ్రి ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని లేటెస్ట్ హంగులతో సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండనుందట. రైడర్స్‌ని విలన్లుగా పరిచయం చేయడంతో మరింత హైప్ పెరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతుందని చిత్రబృంద సభ్యులు వెల్లడిస్తున్నారు.
స్పెషల్ ఫోకస్..
సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే సింగీతం చెప్పారు.
ఈ సినిమాలో ఉపయోగించే కార్ల విషయంలో నాగ్ అశ్విన్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అధునాతన ఈవీ వెహికల్స్ డిజైన్ విషయంలో సాయం అందించాలని అభ్యర్థించగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాలు తనకు ఇష్టమని కచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల కానుంది.
జూన్ 15 , 2023