• TFIDB EN
  • కలియుగం పట్టణంలో (2024)
    U/ATelugu

    విజయ్-సాగర్‌ కవల పిల్లలు. విజయ్‌ రక్తాన్ని చూసి భయపడుతుంటే సాగర్‌ ఆనందిస్తుంటాడు. దీంతో భయపడి సాగర్‌ను మెంటల్‌ ఆస్పత్రిలో చేరుస్తారు పేరెంట్స్‌. కొన్నేళ్ల తర్వాత నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. వాటితో ఈ కవల సోదరులకు ఉన్న లీంకేంటి? తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    సిబ్బంది
    రమాకాంత్ రెడ్డిదర్శకుడు
    కందుల చంద్ర ఓబుల్ రెడ్డినిర్మాత
    గడ్డం మహేశ్వర రెడ్డినిర్మాత
    కాటం రమేష్నిర్మాత
    అజయ్ అరసాడసంగీతకారుడు
    గ్యారీ BHఎడిటర్ర్
    కథనాలు
    <strong>Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌, చిత్ర శుక్లా, రూపా&nbsp; లక్ష్మీ, అనీష్‌ కురువిల్ల, దేవి ప్రసాద్‌ తదితరులు.. దర్శకత్వం : రమాకాంత్‌ రెడ్డి సంగీతం : అజయ్‌ అరసద సినిమాటోగ్రాఫర్‌ : చరణ్‌ మాధవనేని నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ విడుదల తేదీ: 29-03-2024 విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విజయ్-సాగర్‌ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్‌ భయపడుతుంటే సాగర్‌ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్‌ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్‌ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్‌ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్‌ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్‌ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి&nbsp; క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్‌. ఓవరాల్‌గా రమాకాంత్‌ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్‌ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. చాలా సీన్లు లైవ్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్‌ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తోంది.&nbsp; ప్లస్ పాయింట్స్ కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 29 , 2024
    <strong>This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;</strong>
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.&nbsp; గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన&nbsp; తాజా చిత్రం&nbsp; ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter&nbsp;MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    <strong>Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?</strong>
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp; మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.&nbsp;
    మే 08 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    Project K: మూవీ పోస్టర్లతో కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.! కళ్లు, వేళ్లు ఏం చెబుతున్నాయో తెలుసా?
    ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్- K (Project-K). అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి స్టార్లతో నిండిపోయిన ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ పూర్తైనట్లు సమాచారం. విలన్ పాత్ర పోషించడానికి కమల్ హాసన్ 10 అంకెల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే, ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.&nbsp; ఒక్కో పోస్టర్‌లో ఒక్కో ప్రత్యేకత.. విరిగి పడిన చేతికి ఎక్కుపెట్టిన తుపాకులు, పిడికిలి బిగించిన చేతులు, దూరంగా కొండ అంచుపై చీకటిలో నిలబడిన మనిషి, ఆశతో నిండిన కళ్లు.. ఇవీ ప్రాజెక్ట్ K చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు. ఒక్కో పోస్టర్‌పై ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌ని విడుదల చేసి పాత్రల గురించి టీం హింట్ ఇచ్చింది.&nbsp; తాజాగా దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురిని ముస్తాబు చేస్తున్నట్లు ఉంది. దిశా పటాని కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లను చూస్తే ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరి, ఈ ఎదురు చూపు ఎవరికోసం? ఎందుకోసం? అసలు దిశ క్యారెక్టర్ ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.&nbsp; శివరాత్రి సందర్భంగా చిత్రబృందం రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది. ఓ భారీ చేయి విరిగిపడి ఉండగా, ఆ చేతివైపు ముగ్గురు వ్యక్తులు (ప్రత్యేక సూట్ వేసుకుని) అత్యాధునిక తుపాకులు గురిపెట్టి నిల్చొని ఉండటం ఇందులో చూపించారు. అక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే చుట్టు పక్కల విధ్వంసం జరిగినట్లు తెలిసిపోతోంది. మరి, ఈ విధ్వంసం ఆ చేయి సృష్టించిందా? లేదా అసుర సంహారమా? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందనే క్యాప్షన్ పెట్టి దీనిని మరింత ఆసక్తికరంగా మలిచారు.&nbsp; బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ ప్రాజెక్ట్ K టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. పిడికిలి బిగించిన చేతి ఫొటోను ఇందులో చూపించింది. చేతికి రక్షణగా ఓ వస్త్రాన్ని కట్టుకున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌లోనే ‘Legends are Immortal’ (ధీరులకు మరణం ఉండదు) అని క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే, అమితాబ్ పాత్ర పోరాట సన్నివేశాలకు మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు ఇలాంటి పోస్టర్‌నే విడుదల చేసింది టీమ్‌. చేతికి రక్షణగా పెట్టుకున్న సూట్ ఇందులో ఉంది. ఆ పోస్టర్‌కు ‘Heroes are Not Born, They Rise’ అని క్యాప్షన్ ఇచ్చారు.&nbsp; ఎవరీ సేవియర్? దీపిక పదుకునె బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజైంది. పోరాడి అలసిపోయిన ఓ సేవియర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో దీపిక ముఖం చూపించలేదు. కానీ, కొండపై నిల్చొని పిడికిలిని బిగించినట్లుగా ఉంది.&nbsp; పోస్టర్‌పై ‘A Hope in The Dark’ అని క్యాప్షన్ ఉంది. అంటే, దారులన్నీ చీకటిగా మారినప్పుడు మార్గం చూపి ముందుకు నడిపించే వెలుగు దివ్వె అని చెప్పకనే చెప్పారు. సినిమాలో కథానాయకులు దిగ్బంధంలో ఉన్నప్పుడు వీరిని రక్షించేందుకు దీపిక వస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.&nbsp; ఇదేనా స్టోరీ? ‘ప్రాజెక్ట్ K’ స్టోరీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు మూర్తి దశావతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట. కల్కికి తండ్రిగా అశ్వథ్థామ పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కలియుగాంత సమయంలో సృష్టి రక్షణకు చేయూతనిచ్చేందుకు కల్కిగా వస్తాడని, దుష్ట సంహారానికై చేసే పోరాటంలో వీరందరూ ఏకమైతారని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1645313158955802625?s=20 మరోవైపు, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి తండ్రి ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని లేటెస్ట్ హంగులతో సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండనుందట. రైడర్స్‌ని విలన్లుగా పరిచయం చేయడంతో మరింత హైప్ పెరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతుందని చిత్రబృంద సభ్యులు వెల్లడిస్తున్నారు.&nbsp; స్పెషల్ ఫోకస్.. సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే సింగీతం చెప్పారు. ఈ సినిమాలో ఉపయోగించే కార్ల విషయంలో నాగ్ అశ్విన్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అధునాతన ఈవీ వెహికల్స్ డిజైన్ విషయంలో సాయం అందించాలని అభ్యర్థించగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాలు తనకు ఇష్టమని కచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల కానుంది.&nbsp;
    జూన్ 15 , 2023

    @2021 KTree