UATelugu
ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
2024 Nov 1627 days ago
కంగువా చిత్రం విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
2024 July 234 months ago
కంగువా సినిమా నుంచి ఫైర్ సాంగ్ విడుదలైంది.
రివ్యూస్
YouSay Review
Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Dish...read more
How was the movie?
తారాగణం
సూర్య
బాబీ డియోల్
దిశా పటాని
నటరాజన్ సుబ్రమణ్యం
జగపతి బాబు
యోగి బాబు
రెడిన్ కింగ్స్లీ
కోవై సరళ
ఆనందరాజ్
జి. మరిముత్తు
దీపా వెంకట్
రవి రాఘవేంద్ర
కెఎస్ రవికుమార్
బి. ఎస్. అవినాష్
సిబ్బంది
శివ
దర్శకుడుకెఇ జ్ఞానవేల్ రాజా
నిర్మాతజయంతిలాల్ గదా
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడువెట్రి పళనిసామి
సినిమాటోగ్రాఫర్నిషాద్ యూసుఫ్ఎడిటర్ర్
కథనాలు
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
అక్టోబర్ 30 , 2024
Kanguva: రాజమౌళిని అనుసరించి దెబ్బతిన్న 'కంగువా'.. ఆ సినిమాలు కూడా ఇంతే!
దేశం గర్వంచతగ్గ డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి అగ్రస్థానంలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ లేకుండా ఆయన తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకొని సినిమాలు తీయడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటివరకు జక్కన్న నుంచి వచ్చిన 12 చిత్రాలు దేనికదే ఎంతో ప్రత్యేకతను సాధించాయి. ఆడియన్స్ దృష్టిలో ఎవర్‌గ్రీన్ సినిమాలుగా నిలిచాయి. అయితే రాజమౌళి తరహాలో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రాజమౌళి చిత్రాలను పోలిన కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. రీసెంట్‌గా కంగువా సైతం రాజమౌళి చిత్రాల ప్యాట్రన్‌లోనే వచ్చి ఆడియన్స్‌ను నిరాశపరిచింది. అందుకు కారణాలు ఏంటి? కంగువా తరహాలో జక్కన్నను అనుసరించి దెబ్బతిన్న చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
‘బాహుబలి’తో పోల్చి తప్పు చేశారా?
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ చిత్రం నవంబర్ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళిని ఆహ్వానించడం, టాలీవుడ్‌కు బాహుబలి ఎలాగో కోలివుడ్‌కు 'కంగువా' అంటూ ప్రచారాలు హోరెత్తించడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కంగువా రిలీజ్ తర్వాత పరిస్థితులు తలకిందులైనట్లు తెలుస్తోంది. బాహుబలితో పోల్చే విధంగా సినిమాలో స్టఫ్ లేదని చూసినవారు చెబుతున్నారు. కథ చెప్పడంలో దర్శకుడు శివ పూర్తి తడబడ్డాడని అంటున్నారు. భావోద్వేగాలను రగిలించడంలో రాజమౌళి దిట్ట. కానీ కంగువాకు వచ్చే సరికి ఎమోషన్స్ ఏమాత్రం పండలేదని అంటున్నారు. సినిమాలోని పాత్రలతో ఆడియన్స్ ప్రయాణం చేయలేకపోయామని చెబుతున్నారు. ఒక్క సూర్య నటన కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు.
ఆ చిత్రాలు కూడా అంతే!
‘కంగువా’ తరహాలో గతంలో పలు చిత్రాలు జక్కన్నను అనుసరించి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. జూ.ఎన్టీఆర్ - మేహర్ రమేష్ కాంబోలో వచ్చిన 'శక్తి' (2011) కూడా ‘మగధీర’ తరహాలో మెప్పించాలని వచ్చి బోల్తా పడింది. ‘మగధీర’ లాగే ‘శక్తి’ కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రణ్‌బీర్ కపూర్, అలీయా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' భారీ బడ్టెట్‌తో వచ్చి మెప్పించలేకపోయింది. జక్కన్న తరహాలో మంచి విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుందని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. సాలిడ్ కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే కోలివుడ్‌లో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. తొలి భాగం బాగున్నా సెకండాఫ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. RRR తరహాలో బ్రిటిష్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షంషేరా’ సైతం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళంలో వచ్చిన ‘పులి’, మలయాళంలో వచ్చిన ‘మరక్కర్’ జక్కన్న మూవీ తరహాలో పెద్ద బజ్ క్రియేట్ చేసినప్పటికీ సక్సెస్ మాత్రం కాలేకపోయాయి.
జక్కన్న సక్సెస్ మంత్ర ఇదే!
రాజమౌళి సినిమా అనగానే చాలా మంది గొప్ప తారాగణం, భారీ బడ్జెట్, అద్భుతమైన గ్రాఫిక్స్, ఎవర్‌గ్రీన్ స్టోరీ అని అనుకుంటారు. అవన్నీ ఉండబట్టే రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని భావిస్తుంటారు. కానీ రాజమౌళి సక్సెస్ వాటిలో లేదు. అవి సక్సెస్‌కు దోహదం చేసే కీలక అంశాలు మాత్రమే. జక్కన్న సక్సెస్ ఫార్మూలా మరోటి ఉంది. అదే ఎమోషనల్ డ్రామా. చాలా సినిమాల్లో మిస్ అయ్యేది, జక్కన్న మాత్రమే క్యారీ చేసేది ఇదే. తన సినిమాల్లో ఎమోషన్స్‌కు రాజమౌళి పెద్ద పీట వేస్తారు. సినిమా సక్సెస్‌కు అది ఎంతో కీలకమని నమ్ముతారు. ప్రేక్షకుడు, తన సినిమాలోని పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్‌ను రాజమౌళి క్రియేట్ చేస్తుంటారు. తద్వారా ఆడియన్స్‌ను తన మూవీ లీనం చేస్తారు. అందుకే జక్కన్న సినిమా చూసి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. తిరిగి మళ్లీ మళ్లీ చూసేలా ప్రోత్సహిస్తాయి. అసలు జక్కన్న ఏం తీశాడురా అన్న భావనను ఆడియన్స్‌లో కలుగుచేస్తాయి. అందుకే చాలా మంది దర్శకులు దీనిని అందిపుచ్చుకోలేక విఫలమవుతున్నారు.
జక్కన్న బిజీ బిజీ..
RRR తర్వాత రాజమౌళి (S.S. Rajamouli), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)ల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా SSMB 29 ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండటంతో మంచి లోకేషన్స్ కోసం సౌతాఫ్రికాలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్ (Naomi Scott)ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసే వారణాసి సెట్‌లో ఫినిష్ చేసి ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
నవంబర్ 14 , 2024
Kanguva Movie: ‘కంగువా’ టీమ్ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్ ఇండిలిజెన్స్)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
ధూమ్ 4 విలన్‌గా సూర్య!
హిందీలో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్, పార్ట్ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
రోలెక్స్‌గా మార్క్!
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. రోలెక్స్ పాత్రలో అతడి లుక్ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్ రోల్.
అక్టోబర్ 14 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?
ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
కంగువా కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంగువా' (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 14) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి కంగువాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.
‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే!
దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్రణవకోన, కపాల కోన, సాగర కోన, అరణ్యకోన, హిమ కోన అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఏ కోనతోనూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.
మట్కా ఓపెనింగ్స్ మరీ దారుణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూసి ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు కరుణ కుమార్ చాలా రొటీన్ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్ తేజ్ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఒక్క పాయింట్ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?
నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్, కోవై సరళ, ఆనంద్‌రాజ్ తదితరులు..
దర్శకత్వం : శివ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: నిషాద్ యూసఫ్
నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్, వంశీ ప్రమోద్
విడుదల తేదీ: 14-11-2024
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం 'కంగువా' (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్య ఖాతాలో మరో విజయం పడినట్లేనా? ఇప్పుడు తెలుసుకుందాం. (Kanguva Movie Review)
కథేంటి
ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie Review) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తమిళ స్టార్ హీరో సూర్య (Kanguva Movie Review) ఎప్పటిలాగే ఈ సినిమాలోనే అదరగొట్టేశాడు. ఫ్రాన్సిస్, కంగువా అనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ముఖ్యంగా కంగువా పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో సూర్య తన విశ్వరూపం చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాల వ్యక్తీకరణ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటాడు. ఇక విలన్‌గా బాబీ డియోల్ దుమ్మురేపారు. సూర్యకు సమఉజ్జీగా, క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడు. హాట్ బ్యూటీ దిశా పటాని తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాన్సిస్ పాత్రతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కమెడియన్ యోగిబాబు అక్కడక్కడ నవ్వులు పూయించాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్, హరీష్ ఉత్తమన్‌లకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శివ సరికొత్త కథతో కంగువాను రూపొందించారు. ఫ్రాన్సిస్ పాత్రతో సినిమాను మెుదలుపెట్టిన దర్శకుడు కథలోకి వెళ్లేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. ఓ చిన్న పాప ఫ్రాన్సిస్ లైఫ్‌లోకి రావడం, ఆమె ద్వారా గత జన్మను లింకప్ చేసి కథలోకి తీసుకెళ్లాడు. కంగువా ఎంట్రీ నుంచి అసలు కథను ప్రారంభించారు డైరెక్టర్. 1000 ఏళ్ల కిందట తెగలు ఎలా ఉండేవి? వారి మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నది ఆసక్తిగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశారు డైరెక్టర్. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, యాక్షన్ సీక్వెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్ గూస్‌బంప్స్ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాలు, విలన్ పాత్ర కాస్త బలహీనంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Kanguva Movie Review)అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ డిపార్ట్‌మెంట్ సినిమాకు మంచి ఔట్‌పుట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా కలిసొచ్చాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.
ప్లస్ పాయింట్స్
సూర్య నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంకొరవడిన ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 14 , 2024
Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి 'కంగువా' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండంతో నటుడు సూర్యతో పాటు కంగువా టీమ్ చురుగ్గా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి గతంలో సూర్యతో సినిమా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. గతంలో రాజమౌళి తీసిన ఆ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తొలుత సూర్యతోనే తీద్దామని అనుకున్నట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూవీ ఏదంటే?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో ‘మగధీర’ (Magadheera) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో చరణ్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాను తొలుత సూర్యతో చేయాలని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికే సూర్యను తీసుకోవాలని భావించినట్లు స్ట్రాంగ్‌గా రూమర్లు వచ్చినా అందులో వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ కటౌన్‌ను చూసే ‘బాహుబలి’ స్టోరీ సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కాబట్టి ‘మగధీర’ కోసమే రాజమౌళి సూర్యను సంప్రదించి ఉండొచ్చని అంటున్నారు. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య చేసిన ‘గజిని’ చిత్రాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లెక్కన చూసినా ‘గజిని’ 2005లో రిలీజైంది. 2009లో మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగధీర చిత్రీకరణ మూడేళ్లపాటు జరిగింది కాబట్టి 2006 సమయంలోనే మగధీర స్క్రిప్ట్‌ను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ లాజిక్స్ పరంగా చూస్తే ‘మగధీర’ సినిమానే సూర్య చేయాల్సిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
అదే జరిగి ఉంటే?
ఒకవేళ నిజంగానే మగధీర చిత్రాన్ని గనుక రామ్‌చరణ్ చేయకుండా ఉండుంటే అతడి ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఎందుకంటే ‘మగధీర’ వంటి బ్లాక్ బాస్టర్ లేకుండా చరణ్ సినీ జీవితాన్ని ఊహించుకోలేము. తొలి చిత్రం ‘చిరుత’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ దృష్టిలో చరణ్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఆ తర్వాత చేసిన సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’తోనే చిరు తనయుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు చరణ్. మగధీర తర్వాత చాలా చిత్రాలే చేసినప్పటికీ ‘రంగస్థలం’ (2018) వరకూ సరైన బ్రేక్ రాలేదు. అప్పటివరకూ మగధీరతో వచ్చిన ఫేమ్‌తోనే చరణ్ నెట్టుకు వచ్చాడు. అటువంటి ‘మగధీర’ సినిమా చరణ్ కెరీర్‌లో లేకపోయి ఉంటే అతడి కెరీర్‌లో కచ్చితంగా డౌన్‌ఫాల్‌లో ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్ సైతం బయటకు చెప్పకపోయిన ఇదే ఫీలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
‘సూర్యతో చేసే ఛాన్స్ మిస్ అయ్యా’
కంగువా’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్ నటుడు సూర్య (Suriya)పై దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ఆ నటుడి స్ఫూర్తితోనే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో సూర్యనే తనకు స్పూర్తి అని జక్కన్న అన్నారు. ‘గజిని’ చిత్ర సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. వేరే చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగువారికి ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్న కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పినట్లు తెలిపారు. అలా తన పాన్ ఇండియా మూవీ బాహుబలికి సూర్య ప్రేరణగా నిలిచాడని గుర్తుచేశారు. సూర్య సినిమా చేయాలనుకున్నామని కానీ అది కుదర్లేదని స్పష్టం చేశారు. సూర్యతో చేసే ఛాన్స్ తాను మిస్ అయ్యాయని పేర్కొన్నారు.
https://twitter.com/AadhanTelugu/status/1854710204740309097
‘కథ చెప్పారు.. వర్కౌట్ కాలేదు’
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య (Suriya), కార్తీ (Karthi) కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నించారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
నవంబర్ 08 , 2024
Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు మోకళ్లపై దండం పెట్టిన సూర్య!
తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్ చురుగ్గా మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య & టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్
కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1853842396104020062
https://twitter.com/i/status/1853810428616597938
https://twitter.com/AnushanSfc/status/1854009930233123020
https://twitter.com/RamuNaiduEdit/status/1853848902769967531
ఫ్యాన్స్‌కు సూర్య అభివాదం
ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/ARMedia28524249/status/1853816589130293352
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.
నవంబర్ 06 , 2024
This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia & VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
నవంబర్ 18 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లలో రెండే బడా చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!
గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి. అయితే నవంబర్ మూడో వారంలో రెండు బిగ్ ఫిల్మ్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకదానితో ఒకటి ఢీ కొడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
కంగువా (Kanguva)
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నటి దిశా పటానీ, బాబీ దేవోల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌లో కంగువాను రిలీజ్ చేస్తున్నారు. త్రీడీలోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
ఉషా పరిణయం (Usha Parinayam)
కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ కె. విజయ్‌భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యువతను మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నవంబరు 14 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (Freedom At Midnight)
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించారు. 1947 స్వాతంత్రం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, గాంధీ పాత్ర నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సిరీస్ నవంబరు 15వ తేదీ నుంచి ఓటీటీ వేదిక సోనీలివ్‌లో (SonyLiv) స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateTelisinavallu MovieTeluguAhaNov 8VettaiyanMovieTeluguAmazonNov 8ViswamMovieTeluguAmazonNov 1Return Of The King Documentary MovieEnglishNetflixNov 13Hot FrastySeriesEnglishNetflixNov 13Emilia PérezSeriesEnglishNetflixNov 13Cobra KaiSeriesEnglishNetflixNov 15Jake Paul vs. Mike TysonMovieEnglishNetflixNov 15In Cold WaterSeriesEnglishAmazon Nov 12CrossSeriesEnglishAmazon Nov 14Last World WarMovieEnglishAmazon Nov 8Deadpool & WolverineSeriesEnglishHotstarNov 12On Almost Christmas StoryAnimationTeluguHotstarNov 15Saint Denis MedicalSeriesEnglishJio CinemaNov 13The Day of the JackalSeriesEnglishJio CinemaNov 13Unstoppable S4 (Allu arjun)Talk ShowTeluguAhaNov 15
నవంబర్ 11 , 2024
Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్‌కమింగ్ మూవీ 'కంగువా' (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సూర్య సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ!
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్ చేసిన సూర్య బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు.
https://twitter.com/ahavideoIN/status/1853655983760998850
కంటతడి పెట్టిన సూర్య
తాజా టీజర్ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నవంబర్ 05 , 2024
Rajanikanth vs Suriya: స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. బాక్సాఫీస్ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
రజనీకాంత్ vs సూర్య
తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్ ఫిల్మ్ వేట్టయాన్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.
భారీ తారాగణం
సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్ డాల్ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతిబాబు, డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.
గిరిజన యోధుడిగా 'సూర్య'
కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
రజనీకాంత్- అమితాబ్
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన 'వేట్టయాన్' సినిమాకి 'జై భీమ్' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, రావు రమేష్ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్ అయిన పోలీసు ఆఫీసర్.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్ యాక్షన్ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అటు టాలీవుడ్‌లోనూ..
టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ vs రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్ మెుదటి వారంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు.
జూన్ 28 , 2024
Disha Patani Hot: మరోసారి పరువాల దాడి చేసిన దిశా పటానీ.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోమారు తన మత్తెక్కించే అందాలతో సోషల్ మీడియాను మాయ చేస్తోంది. గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేస్తూ పిచ్చెక్కిస్తోంది.
తాజాగా బిగుతైన పొట్టి గౌనులో ఫొటో షూట్ చేసిన ఈ అమ్మడు వాటి తాలుకా ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
తన ఎద పొంగులను చూపిస్తూ కుర్రకారుని మరోమారు మంత్ర ముగ్దుల్ని చేసింది. కసి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
రొమాంటిక్ ఫోజులో థైస్ అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది. దిశా పటానీ లేటెస్ట్ ఘాటు అందాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఇది కామన్ అయిపోయింది.
ఇటీవల ఎల్లో కలర్ బికినీలో పరిగెడుతూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
‘లోఫర్’ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే (Radhe) వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మార్చిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇటీవల ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దిశా పటానీ మెరిసింది. తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో సూర్య సరసన ‘కంగువా’ (Kanguva)లో దిశా మెరిసింది. ఇందులో నటనకంటే గ్లామర్ పరంగానే ఎక్కువ మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో 'వెల్‌కమ్ టూ ద జంగిల్' ఫిల్మ్‌లో దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.
ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో దిశా పటానీ బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 61.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
నవంబర్ 22 , 2024
Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్’.. ఎంత వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్ (Amaran). అమరుడైన మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.
రూ.300 కోట్ల క్లబ్‌లోకి..
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్ బాస్టర్’ అంటూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.
https://twitter.com/Dasarathan_1720/status/1858698464630063231
తెలుగులో లాభాలే లాభాలు..
‘అమరన్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్ (Amaran Collections) వసూళ్లను అమరన్ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్ చూసి అమరన్ టీమ్ తెగ ఖుషీ అవుతోంది.
కలిసొచ్చిన కంగువా ఫ్లాప్..
నిజానికి అమరన్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్ రన్ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్ అమరన్ మెయిన్ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెలాఖరులో ఓటీటీలోకి..
థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే డిసెంబర్ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 19 , 2024
Matka Movie Trolls: వరుణ్ తేజ్ ‘మట్కా’ను ఏకిపారేస్తున్న బన్నీ ఫ్యాన్స్.. గట్టి రివేంజే ఇది!
వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ చిత్రం ‘మట్కా’ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటీవల మట్కా ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్ తేజ్ పరోక్షంగా బన్నీకి చురకలు అంటించారు. ‘జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు’ అంటూ వరుణ్ వ్యాఖ్యానించాడు. దీనిని పర్సనల్‌గా తీసుకున్న బన్నీ ఫ్యాన్స్ ‘మట్కా’పై రివేంజ్ తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మట్కా వన్ వర్డ్ రివ్యూ అంటు బన్నీ అభిమాని ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. మట్కా చూసి బయటకు వచ్చిన ఓ ఆడియన్ ‘ఈ మూవీ పెద్ద డిజాస్టర్. దీనిని తెలంగాణ వాదులు, సమైక్యవాదులు ఆపోద్దు. ఎందుకంటే మధ్యాహ్నానికి ఇదే ఆగిపోతుంది’ అంటూ చెప్తాడు. దీనిని బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/___AkAsh_____/status/1856912632692740516
వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రాన్ని చూసేందుకు ఎవరు ఇష్టపడటం లేదంటూ రెడీ సినిమాలోని బ్రహ్మీ తలబాదుకునే సీన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
https://twitter.com/PawanbunnyAADHF/status/1856917030836081144
టికెట్స్ బుకింగ్స్‌లో ‘సన్ ఆఫ్ ఇండియా’ రికార్డ్స్‌ను మట్కా బద్దలు కొట్టిందని బన్నీ అభిమాని ఓ పోస్టు పెట్టాడు. ఓ థియేటర్‌లో ఖాళీగా ఉన్న సీట్లను హైలెట్ చేశాడు.
https://twitter.com/Ravanaroy/status/1856930066988408967
అందరూ సూర్య నటించిన కంగువా గురించే మాట్లాడుకుంటున్నారని, మరి మట్కా పరిస్థితి ఏంటంటూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/memessmingle/status/1856921713692254531
మట్కా ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటాన్ని హైలెట్ చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ‘మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేదా సార్‌కి?’ అంటూ పోస్టు చేశాడు.
https://twitter.com/OGFILESi7/status/1856695949411659987
మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌ను మోసం చేశారని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. మెగా అభిమానుల మద్దతు ట్విటర్ వరకే ఉంటుందని, థియేటర్లకు వారు వెళ్లరని అతడు ఆరోపించారు.
https://twitter.com/omcreem9/status/1856948964387651762
https://twitter.com/GowTam_Naidu/status/1856947427313418573
మట్కాకు పోయే ధైర్యం లేక టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సినిమా అంత దారుణంగా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/nameissujith/status/1856944444391448715
‘మట్కా’ గురించి మెగా ఫ్యాన్స్ తప్పా మరే ఇతర హీరో అభిమానులు పాజిటివ్‌గా చెప్పడం లేదంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
https://twitter.com/narasimha_chow2/status/1856944192834203682
అల్లు అర్జున్ ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌పై ఏ విధంగా దాడి చేస్తున్నారో అద్దంపట్టేలా మహేష్ అభిమాని పెట్టిన వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతోంది.
https://twitter.com/BasavaMBFan/status/1856943054592303335
‘మట్కా’ డే 1 కలెక్షన్స్ గురించి కూడా నెట్టింట ట్రోల్స్ మెుదలయ్యాయి. తొలి రోజు వసూళ్లు చూసి షాకవ్వడం పక్కా అని అర్థం వచ్చేలా బ్రహ్మీ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/kiranabbavaramd/status/1856951768753868909
ఇదిలా ఉంటే మెగా ఆడియన్స్ నుంచి మాత్రం మట్కాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ ర్యాంప్ ఆడించాడని వారు పోస్టులు చేస్తున్నారు.
https://twitter.com/arunkalyan5/status/1856942771266850963
మెగా ఫ్యామిలీ నుంచి ఒక బ్లాక్ బాస్టర్ మట్కా రూపంలో వచ్చేసిందని ఓ ఫ్యాన్ పోస్టు పెట్టాడు. తర్వాత ‘గేమ్ ఛేంజర్’తో మరో బ్లాక్ బాస్టర్ రాబోతోందని రాసుకొచ్చాడు.
https://twitter.com/Girish_212/status/1856948877246828877
మట్కా విజయవంతం అయినందుకు పవన్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/Dr_Pawan_Kalyan/status/1856947874698850651
మట్కా సినిమా చాలా బాగుందని కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు.
https://twitter.com/dhruva1128885/status/1856944727465365552
https://twitter.com/i/status/1856944348296089848
నవంబర్ 14 , 2024
Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్, కూల్ డ్రింక్స్.. ఫొటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహించేందుకు థియేటర్స్ యజమానులు రెడీ అయ్యారు.
నెల రోజుల్లో పుష్పగాడి రాక
'పుష్ప 2' రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి పుష్ప టీమ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 5) సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పుష్పరాజ్ (అల్లు అర్జున్), భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే ట్రైలర్‌ను (pushpa 2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
https://twitter.com/PushpaMovie/status/1853694508623683871
గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్!
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్ అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేయోచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
పాప్‌కార్న్ డబ్బాలతో ప్రమోషన్స్
‘పుష్ప2’ విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉండటంతో అటు విదేశాల్లోనూ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు. పుష్ప బ్రాండ్ పాప్‌కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను యూఎస్‌లోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13న విడుదలయ్యే ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా ఇలాంటి ప్రత్యేక ప్రమోషన్ చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 టీమ్ వీటికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకోవడం విశేషం.
https://twitter.com/RegalMovies/status/1853467449280082009
ఈనెల 6 నుంచి ఐటెం సాంగ్ షూట్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా ఫైనల్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 6 నుంచి సాంగ్ షూట్ కూడా మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో ఏ స్థాయిలో స్టెప్పులు ఇరగదీస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
‘పుష్ప 3’ పక్కా
‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ సైతం మూడో పార్ట్ గురించి పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్ 3 కి సంబంధించి సాలిడ్ లీడ్ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అటు సుకుమార్ సైతం రామ్‌చరణ్‌తో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత ‘పుష్ప 3’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
https://twitter.com/i/status/1849383805657690194
నవంబర్ 05 , 2024
Jagapathi Babu: ‘వెదవల’కే అవార్డులు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapati Babu)కి ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో మంచి పేరుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా నెగిటివ్ రోల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ మూవీకి సంబంధించి బెస్ట్ విలన్‌గా ఐఫా అవార్డ్ సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. జగపతి బాబు లాంటి సీనియర్ నటుడి నుంచి ఇలాంటి మాటలు అసలు ఊహించలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
‘ఎదవలకే అవార్డులు’
కన్నడ నటుడు దర్శన్ హీరోగా నటించిన 'కాటేరా' చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్ర పోషించాడు. నెగిటివ్ రోల్‌లో అత్యుత్తమ నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. పైగా కన్నడలో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ (Dubai)లో జరిగిన ఐఫా 2024 అవార్డు (IIFA Awards-2024)ల వేడుక కార్యక్రమంలో జగ్గుబాయ్‌కు బెస్ట్ విలన్ (villain) అవార్డ్ (award) వచ్చింది. దీనిపై స్పందించిన జగపతి బాబు ‘ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి’ అనే క్యాప్షన్ ఇచ్చి అవార్డుకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అవార్డులు తీసుకోవడం ఇష్టం లేకపోతే తిరిగి ఇచ్చేయాలని సూచిస్తున్నారు.
https://twitter.com/IamJagguBhai/status/1848652810327666783
జగ్గుభాయ్ మాటలకు కారణమదేనా?
ప్రముఖ నటుడు జగపతి బాబు కెరీర్ ప్రారంభంలో హీరోగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేశారు. అయితే హీరోగా ఎన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయనకు అవార్డులు రాలేదు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మెుదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన వద్దకు అవార్డులు క్యూ కట్టాయి. ముఖ్యంగా విలన్ రోల్స్‌కు పెద్ద ఎత్తున అవార్డ్స్ దక్కాయి. ‘లెెజెండ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’, ‘మన్నెం పులి’ (తెలుగు డబ్బింగ్), తాజాగా ‘కాటేరా’ చిత్రాలకు నంది, ఫిల్మ్‌ఫేర్, సైమా, ఐఫా అవార్డులు వరించాయి. పాజిటివ్ రోల్స్ చేసినప్పుడు రాని అవార్డ్స్ విలన్ పాత్రలకే ఎక్కువగా వస్తుండటంతో ఆయన ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు.
లెజెండ్‌తో లైఫ్ టర్నింగ్!
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి దిగ్గజ నటుల నుంచి పోటీని తట్టుకొని జగపతిబాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అన్నయ్యగా, పోలీసు ఆఫీసర్‌గా, కుటుంబ పెద్ద పాత్రల్లో కనిపించి అలరించారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జగ్గుభాయ్‌కు పేరు రాలేదు. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో బోయపాటి నుంచి విలన్ ఆఫర్ జగ్గుభాయ్‌కి వచ్చింది. అది కూడా బాలకృష్ణకు ప్రత్యర్థిగా చేసే ఛాన్స్ దక్కింది. ‘లెజెండ్’లో బాలయ్యకు పవర్‌ఫుల్ ప్రత్యర్థిగా నటించి జగపతి బాబు అందరినీ ఆశ్చర్యపరిచాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ఆ సినిమా తర్వాత తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం జగపతిబాబుకు రాలేదు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2' (Pushpa). ఇందులో జగపతి బాబు నటిస్తున్నారు. ఆయన పాత్ర ఏవిధంగా ఉంటుందో సినీ వర్గాలు ప్రకటించలేదు. అయితే కచ్చితంగా నెగిటివ్ రోల్‌లోనే ఆయన అలరిస్తారన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువా' (Kanguva)లోనూ జగ్గుభాయ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జగపతి బాబు బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో ఏ మూవీ సక్సెస్ అయినా దేశవ్యాప్తంగా మరోమారు ఆయన పేరు మార్మోగడం ఖాయమని చెప్పవచ్చు.
అక్టోబర్ 23 , 2024
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ (Tollywood), కోలివుడ్ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్ ఇండస్ట్రీస్ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్ వార్స్ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ vs కోలీవుడ్
గతంలో ఫ్యాన్ వార్ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ చేసిన చిత్రాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.
https://twitter.com/iammvengence/status/1758435868799377642
https://twitter.com/RAO_Offl/status/1759121949656318267
నష్టం ఏంటంటే?
కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోల్స్ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్ ట్రోల్స్ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్ కంటే కలెక్షన్స్ పరంగా వెనకబడిపోతున్నాయి.
ఆ సినిమాలకు దెబ్బ!
త్వరలో రిలీజ్ అయ్యేందుకు సౌత్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోగా కోలీవుడ్ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్స్ రచ్చకు చెక్ పెట్టాల్సిందే!
సౌత్‌లో బిగ్ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్’, ‘రాయన్’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.
పొలిటికల్ టర్న్
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.
https://twitter.com/i/status/1841876236840374698
పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్
టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17 , 2024
#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్ నుంచి ‘వేట్టయన్’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు.
‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’
రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/thenaani29/status/1843888854568431666
https://twitter.com/Kadirodu/status/1843694483508211884
https://twitter.com/kannayyaX/status/1843899836732743696
https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639
ఆ సినిమాలు కూడా అంతే!
కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు భాష వద్దా!
గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అక్టోబర్ 09 , 2024
Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమేనా!
బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్ చిత్రాల సిరీస్‌లో 'ధూమ్' (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అవన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
సూర్య పాత్ర అదే?
హిందీలో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్, పార్ట్ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
రోలెక్స్‌గా మార్క్!
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్‌ప్రైజ్ చేశారు. రోలెక్స్ పాత్రలో అతడి లుక్ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్ రోల్.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
12 వేల థియేటర్లలో ‘కంగువా’!
సూర్య ప్రస్తుతం 'కంగువా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్‌లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్ 15న కంగువాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
సెప్టెంబర్ 16 , 2024