• TFIDB EN
  • కన్నప్ప
    రేటింగ్ లేదు
    No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
    ఆసక్తి ఉంది
    UATelugu
    మంచు విష్ణు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పురాతన పురుషుడు, గొప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    తారాగణం
    విష్ణు మంచు
    కన్నప్ప, పరమ శివ భక్తుడు
    ప్రీతి ముకుందన్‌
    మోహన్ లాల్
    శివుడు
    ప్రభాస్
    శివుడు
    మోహన్ బాబు
    ఆర్. శరత్‌కుమార్
    బ్రహ్మానందం
    మధు షా (మధుబాల)
    దేవరాజ్
    ఐశ్వర్య భాస్కరన్
    ముఖేష్ రిషి
    కౌశల్ మంద
    రఘు బాబు
    అర్పిత్ రాంకా
    సిబ్బంది
    ముఖేష్ కుమార్ సింగ్దర్శకుడు
    మోహన్ బాబు
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    పరుచూరి గోపాల కృష్ణ
    కథ
    జి.నాగేశ్వర రెడ్ది
    కథ
    షెల్డన్ చౌసినిమాటోగ్రాఫర్
    ఆంథోనీ
    ఎడిటర్ర్
    కథనాలు
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి!  ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్‌ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్‌ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది. https://twitter.com/GetsCinema/status/1759893440500846829 15 ఏళ్ల తర్వాత.. ప్రభాస్‌-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్‌నిరంజన్‌’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.  కన్నప్పపై విష్ణు ఫోకస్‌ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరిగింది. టీమ్‌లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్‌ టైమ్‌లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.  https://twitter.com/i/status/1730567740325535838 ఆకట్టుకున్న ఫస్ట్‌లుక్‌ గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి  అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.  ‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా! కన్నప్ప సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ఫినిష్‌ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్‌ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్‌ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్‌ భావిస్తోందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్‌ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్‌. 
    ఫిబ్రవరి 21 , 2024
    <strong>Kannappa: ‘ముఖాన బొట్టు.. చేతులకి పారాణీ ఏదీ’.. కాజల్‌పై భారీగా ట్రోల్స్‌!</strong>
    Kannappa: ‘ముఖాన బొట్టు.. చేతులకి పారాణీ ఏదీ’.. కాజల్‌పై భారీగా ట్రోల్స్‌!
    తెలుగు హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' (Kannappa)లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ బ్యానర్స్‌పై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా ఇందులో నటిస్తున్న స్టార్‌ నటీనటుల పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా కాజల్‌కు సంబంధించిన పార్వతి దేవి పోస్టర్‌ను మూవీ టీమ్‌ విడుదల చేసింది. అయితే ఆ లుక్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. పార్వతి దేవిగా కాజల్‌.. కన్నప్ప చిత్రానికి సంబంధించి ప్రతీ సోమవారం ఓ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తామని మూవీ టీమ్‌ గతంలోనే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ప్రతీ వారం కొత్త పాత్రను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే కాజల్‌ పోషిస్తున్న పార్వతి దేవి రోల్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం సోమవారం (జనవరి 6) విడుదల చేసింది. 'ముల్లోకాలు ఏలే తల్లి. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక' అంటూ మూవీ టీమ్‌ పోస్టర్‌పై రాసుకొచ్చింది. కాగా కాజల్‌ ఈ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ 'నా కల నిజమైంది. దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  https://twitter.com/kannappamovie/status/1876139174765690944 ట్రోల్స్ ఎందుకంటే.. పార్వతి దేవిగా కాజల్‌ కనిపించిన పోస్టర్‌ను పలువురు మెచ్చుకుంటుంటే మరికొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. కాజల్‌ అసలు దేవతామూర్తిగానే లేదంటూ విమర్శిస్తున్నారు. నుదుటిన బొట్టు, చేతికి పారాణి ఎక్కడంటూ విమర్శిస్తున్నారు. 'మెడలో ఉన్న నక్లెస్‌ వంకరగా ఉంది.. చెక్‌ చేసుకోలేదా?' అని సెటైర్లు చేస్తున్నారు. ఆ పోస్టర్‌లో కాజల్ పార్వతి దేవిలా లేదని.. ఏదో జ్యూయలరీ యాడ్‌లాగా అనిపించిందని అంటున్నారు. మరికొందరు ఇది ఏఐ జనరేటేడ్‌ పోస్టర్‌లా ఉందంటున్నారు. పోస్టర్‌ డిజైనింగ్‌ క్వాలిటీ కూడా అసలు బాలేదని చెబుతున్నారు. జూమ్‌ చేసి చూస్తే ఒక కన్ను చిన్నదిగా, మరో కన్ను పెద్దదిగా ఉందని పోస్టులు పెడుతున్నారు. కాజల్‌పై వస్తోన్న ట్రోల్స్‌తో ఆమె పేరు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.  ప్రభాస్‌ స్పెషల్‌ రోల్‌.. మంచు ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ‘కన్నప్ప’లో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్‌ సైతం కిరాట అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్రను గత సోమవారం రివీల్‌ చేయడం గమనార్హం. అటు మంచు మోహన్‌బాబు సైతం మహాదేవ శాస్త్రి అనే రోల్‌ పోషిస్తున్నారు. వీరితో పాటు మధుబాల, ప్రీతి ముకుందన్‌, మంచు విష్ణు కూతుర్లు అరియానా - వివియానా, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఆయా పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను మూవీ టీమ్‌ విడుదల చేసింది.&nbsp;
    జనవరి 07 , 2025
    <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
    టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024
    Kannappa: భారీగా ఖర్చు పెట్టాం.. ఆపై దేవుడి దయ: మోహన్ బాబు
    Kannappa: భారీగా ఖర్చు పెట్టాం.. ఆపై దేవుడి దయ: మోహన్ బాబు
    మోహన్‌బాబు యూనివర్సిటీలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కలల ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కన్నప్ప’ గురించి మోహన్‌బాబు కన్నప్ప గురించి మీడియాతో మాట్లాడుతూ..“ఈ ప్రాజెక్ట్‌పై మేము చాలా కష్టపడుతున్నాం. అనుకున్నదానికంటే భారీగా ఖర్చు పెడుతున్నాం,” అని మోహన్‌బాబు తెలిపారు. ఈ సినిమా పనులు ప్రస్తుతం గ్రాఫిక్స్ దశలో ఉన్నాయని, ప్రేక్షకులు ఊహించని రీతిలో సినిమాను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. “శ్రీకాళహస్తీశ్వరుడిపై వచ్చిన అన్ని సినిమాలు విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాల్సిందే. భగవంతుడు ఎల్లప్పుడూ మాతో ఉన్నాడు. నా పేరు భక్తవత్సలం కావడం ఆయన వరం. ఈ ప్రాజెక్ట్‌కు ప్రజల ఆశీర్వాదాలు కావాలి” అని మోహన్‌బాబు పేర్కొన్నారు. https://twitter.com/NtvTeluguLive/status/1876935666161881202 మోహన్ బాబు యూనివర్శిటీలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో మోహన్‌బాబు పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “రాయలసీమ రామన్న చౌదరి’లో చెప్పిన డైలాగ్‌ లాగా, నిన్నటి విషయం మర్చిపోవాలి. నేడు ఏం చేయాలో ఆలోచించాలి. రేపు మరింత మంచిగా ఉండాలని ప్రయత్నించాలి. మన వృత్తిలో విజయమే మనకు పండుగ. సంక్రాంతి రైతుల పండుగ. రైతు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. అందరూ సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా,” అని అన్నారు. ‘కన్నప్ప’ ప్రత్యేకతలు ఈ చిత్రాన్ని మోహన్‌బాబు తనయుడు మోహన్‌విష్ణు కలల ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. “సక్సెస్ లేదా ఫెయిల్యూర్ సహజం. కానీ, ఈ ప్రాజెక్ట్ అత్యుత్తమ విజయాన్ని సాధిస్తుందని మా నమ్మకం,” అని మోహన్‌బాబు వెల్లడించారు. గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి ఈ సినిమా గ్రాఫిక్స్‌ పనులు అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాయని, ప్రేక్షకులకు మంచి అనుభవం అందిస్తామని మోహన్‌బాబు తెలిపారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన ఈ సినిమా, కథను చరిత్రాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సినిమా విశేషాలు: విష్ణు మంజునాథ్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా శ్రీకాళహస్తీశ్వరుడిపై ఆధారపడి ఉంటుంది.కథకు అనుగుణంగా, ప్రాచీన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విజువల్స్ ప్లాన్ చేశారు.మోహన్‌బాబు కుటుంబం ఈ ప్రాజెక్ట్‌ను ఒక ఆధ్యాత్మిక భక్తితో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని, ఒక చరిత్రాత్మక విజయాన్ని సాధించాలని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
    జనవరి 08 , 2025
    <strong>Prabhas: </strong><strong>పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!</strong>
    Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
    ప్రభాస్‌ అనగానే ముందుగా అతడి ఫిజిక్‌ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌ ఎదగడంలో అతడి కటౌట్‌ బాగా ఉపయోగపడింది. ప్రభాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాడంటే స్క్రీన్స్‌పై చూసేవాళ్లకు రియల్‌గా అనిపిస్తుంటుంది. యాక్షన్‌ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్‌ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్‌’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పరుశురాముడిగా ప్రభాస్‌! ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్‌ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్‌కపూర్‌ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్‌ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్‌ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్‌ను కూడా కలిసినట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్‌ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్‌ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.&nbsp; విలన్స్‌గా స్టార్‌ కపుల్స్‌ ‘యానిమల్‌’ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్‌ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్‌’లో కరీనా కపూర్‌ సైతం నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్‌ లైఫ్‌లో కపుల్స్‌ అయిన కరీనా, సైఫ్‌ ‘స్పిరిట్‌’ సినిమాలో విలన్స్‌గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని డైలాగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్‌ 10న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.&nbsp; పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    Preity Mukhundhan: ‘ఓం భీమ్‌ బుష్‌’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్‌ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్‌ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఎవరు? టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్‌ హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం ప్రీతి ముకుందన్‌ పుట్టిన తేదీ? జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఎవరు? తన పేరెంట్స్‌ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఏం చదివారు? ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. ప్రీతి ముకుందన్‌ ఎక్కడ చదివారు? నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T) ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా? ఈ భామకు డ్యాన్స్‌ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు? ప్రీతి తొలుత క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆ తర్వాత హిప్‌హాప్‌, సినీ ఫోక్‌, వెస్టర్న్‌ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.&nbsp; &nbsp;ప్రీతి ముకుందన్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసింది.&nbsp; ప్రీతి ముకుందన్‌ చేసిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఏవి? మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్‌ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రీతి ముకుందన్‌ తొలి చిత్రం ఏది? ‘ఓం భీమ్‌ బుష్‌’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్‌ ఫ్యూజర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం తమిళంలో స్టార్‌ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కెవిన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్‌ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్‌, ఫుడ్‌ ఏవి? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్లు, ఫుడ్‌ గురించి ప్రీతి ముకుందన్‌ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.&nbsp; ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ? https://www.instagram.com/preity_mukhundhan
    మార్చి 22 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.&nbsp; కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌&nbsp; హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి&nbsp; ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా&nbsp; మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.&nbsp; సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది.&nbsp;
    మార్చి 09 , 2024
    Manchu Vishnu: మరో వివాదం.. అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది.. వీడియో వైరల్
    Manchu Vishnu: మరో వివాదం.. అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది.. వీడియో వైరల్
    మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ సుదీర్ బాబు వార్నింగ్‌తో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌తో రాజీకివచ్చారు.  అయితే అంతా సద్దుమణిగిందనుకున్న తరుణంలో మంచు విష్ణు సిబ్బంది తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను  మంచు విష్ణు సిబ్బంది వేటాడి హత మార్చింది. దీంతో మంచు కుటుంబం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉంటున్న మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి సమీపంలో ఉన్న అడవిలోకి మంచు విష్ణు సిబ్బంది అక్రమంగా ప్రవేశించి అడవి పందులను వేటాడినట్లు తెలిసింది.&nbsp; ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవి పందులను ఎందుకు వేటాడారు అన్నదానిపై స్పష్టత లేదు.&nbsp; మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఇదంతా చేసినట్లు వార్లలు వస్తున్నాయి. ఆయన అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు తెలిసింది. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తన భుజంపై అడవి పందిని మోసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. https://twitter.com/TeluguScribe/status/1873958502647160857 &nbsp;రాచకొండ సీపీ సుదీర్‌ బాబు వార్నింగ్‌తో అంతా సద్దుమణిగిందనుకున్న సమయంలో… ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. వన్య ప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరం. ఈ సంఘటనపై అటవీ అధికారులు, పోలీసులు ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.&nbsp; బిజీబిజీగా మంచు విష్ణు తన ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఫైనల్ అపుట్‌పుట్ ఎడిటింగ్‌లో మంచు విష్ణు బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో సినిమా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి హీరోయిన్‌ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించనుంది. సోమవారం ఆమె ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నెమలి అనే రాకుమారి పాత్రలో ఆమె కనిపించనుంది. షూటింగ్‌లో మనోజ్‌.. ప్రస్తుతం మనోజ్‌ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో మనోజ్‌ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. ఇటీవల నారా రోహిత్‌ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. 
    డిసెంబర్ 31 , 2024
    <strong>Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్‌ హీరో.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?&nbsp;</strong>
    Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్‌ హీరో.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?&nbsp;
    ఇండియన్‌ బాక్సాఫీస్‌ రారాజుగా ప్రభాస్‌ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్‌ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్‌ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు తమిళ స్టార్‌ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్‌ ఫిల్మ్‌ ‘ది రాజాసాబ్‌’తో బాక్సాఫీస్‌ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs Dhanush) అంటూ సవాలు విసురుతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రభాస్‌ vs ధనుష్‌ ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌ తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న చిత్రం 'ది రాజాసాబ్‌' (The Rajasaab). డైరెక్టర్‌ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్‌లో తొలిసారి హార్రర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్‌ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో ‘ది రాజాసాబ్‌’పై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో ధనుష్‌, ప్రభాస్‌ (Prabhas vs Dhanush)ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌ రోజునే తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ధనుష్‌ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఇడ్లీ కడై'ను (Idli Kadai) వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ఆ రోజునే ఎందుకంటే! 'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు) చిత్రానికి స్టార్ హీరో ధనుష్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిత్యామీనన్‌ చేస్తోంది. డాన్‌ పిక్చర్స్‌, వండర్ బార్‌ ఫిల్మ్స్‌ పతకాలపై ఆకాశ్ భాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, షాలినీ పాండేలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే బరిలో ప్రభాస్‌ సినిమా ఉన్నప్పటికీ ధనుష్‌ తన ‘ఇడ్లీ కడై’ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం వెనక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. మన తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో తమిళ వాళ్లకు ఏప్రిల్‌లో వచ్చే న్యూ ఇయర్ కూడా అలాంటిదే. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళనాడులో న్యూ ఇయర్ జరుపుకుంటారు. పైగా దానికి లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతోంది. అందుకే ధనుష్ ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారు. మొత్తానికి 'ది రాజా సాబ్'తో పాటు ధనుష్ మూవీ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. మరి ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే. https://twitter.com/dhanushkraja/status/1854758303399919813 అక్కడ ప్రభాస్‌కు ఎదురుదెబ్బ! కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌ (Dhanush)కు తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రభాస్‌తో పోలిస్తే మాత్రం కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రభాస్‌ మార్కెట్‌ రేంజ్‌ కూడా ధనుష్‌ కంటే చాలా పెద్దది. కాబట్టి పాన్‌ ఇండియా స్థాయిలో ‘ది రాజాసాబ్‌’కు 'ఇడ్లీ కడై' నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. అయితే తమిళనాడులో మాత్రం ధనుష్‌కు మంచి మార్కెట్‌ ఉంది. అక్కడ ధనుష్‌ పేరు చెబితే అభిమానులు ఊగిపోతుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ‘ది రాజాసాబ్‌’కు (Prabhas vs Dhanush) గట్టి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. తమిళనాడు కలెక్షన్స్‌లో భారీగా కోత పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; అరడజను పైగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేషన్‌ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    నవంబర్ 09 , 2024
    <strong>Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్‌ - అనుష్క జోడి.. ఎందుకంటే?</strong>
    Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్‌ - అనుష్క జోడి.. ఎందుకంటే?
    టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్‌ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే వీరి పెళ్లికి సంబంధించి వార్తలు సైతం షికారు చేశాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అటు స్వీటీ సైతం ‘ఘాటీ’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్‌ నుంచి ఓ స్పెషల్‌ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం (నవంబర్‌ 8) అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని ఘాటీ నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వచ్చింది. అయితే ఈ రెండు పోస్టర్లు సిమిలర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; నోటిలో సిగార్‌తో.. అనుష్క శెట్టి ఫీమేల్‌ లీడ్‌గా 'ఘాటి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా ఇందులో అనుష్క చాలా డిఫరెంట్‌గా కనిపించింది. ముఖంపై రక్తంతో సిగార్‌ తాగుతూ ఆ పొగ మధ్యలో కనిపించింది. ఇటీవల వచ్చిన రాజాసాబ్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ ఈ తరహా గెటప్‌లోనే కనిపించడం గమనార్హం. అనుష్క తరహాలోనే నోట్లో సిగార్‌ పెట్టుకొని కనిపించాడు. స్మోకీ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇద్దరూ సిగార్‌ తాగుతూ పోస్టర్‌లో కనిపించడంతో ఆ పోస్టర్లు పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ ట్యాగ్‌లు ఇస్తున్నారు అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/subhaashiniii/status/1854377730575397055 కసిగా తల తెంపిన అనుష్క గురువారం ఉదయం 'ఘాటి' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్ అదే రోజు సాయంత్ర సాలిడ్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా చాలా వైలెంట్‌గా స్వీటిని చూపించారు. అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని, అది కూడా బస్‌ మిర్రర్‌లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది.&nbsp; ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా సిగార్‌ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. అది తాగే సమయంలో అనుష్క చేతుల నిండా రక్తం ఉంటుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్‌ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది. https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls స్వీటీ ఆశలన్నీ 'ఘాటి' పైనే! ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టార్‌ హీరోల చిత్రాల్లో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమాతో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా అది ఆమె స్థాయికి తగ్గ హిట్‌ మాత్రం కాదు. దీంతో ఇండస్ట్రీలో తిరిగి నిలదొక్కుకోవాలంటే 'ఘాటి' సక్సెస్‌ చాలా కీలకంగా మారింది. మరోవైపు దర్శకుడు క్రిష్‌కు సైతం ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఇటీవల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ చేజారడంతో ఘాటీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని క్రిష్‌ భావిస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేషన్‌ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?</strong>
    Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 23న స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. తాము ఎక్స్‌పెక్ట్‌ చేసిన స్థాయిలో పోస్టర్‌ లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉందంటే? ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Director Maruti) తెరకెక్కిస్తున్న 'ది రాజాసాబ్‌' (The Raja Saab) చిత్రంలో మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal), రిద్ధి కుమార్‌ (Riddhi Kumar) హీరోయిన్లుగా చేస్తున్నారు. బుధవారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్‌ సింహాసనం మీద నోటిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. https://twitter.com/rajasaabmovie/status/1849400931978240114 అదేం పోస్టర్‌ అంటూ ట్రోల్స్‌! రాజాసాబ్‌ తాజా పోస్టర్ చూసి తాము తీవ్రంగా డిజప్పాయింట్‌ అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ నోట్లో సిగర్ పెట్టుకొని ఉన్న పోస్టర్‌ను ‘సై’ సినిమాలోని బిక్షు యాదవ్‌తో పోలుస్తున్నారు. బర్త్‌డే రోజున ఇలాంటి పోస్టర్‌ రిలీజ్‌ చేసి రాజాసాబ్‌ టీమే ప్రభాస్‌ను ట్రోల్‌ చేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్‌ లుక్‌కు కాంపిటీషన్ ఇచ్చేలా ప్రభాస్‌ పోస్టర్ ఉందని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు. మోషన్‌ వీడియోలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా పూర్‌గా ఉందని, సడెన్‌గా చూసి ఫ్యాన్ మేడ్‌ అనుకున్నానని ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్‌ను ఇలా ఒక్క పోస్టర్‌ గురించి ట్రోల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభాస్‌ను టార్గెట్‌ చేస్తున్న వారికి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్‌ సక్సెస్‌ను తట్టుకోలేకనే ఇలా ట్రోల్స్‌ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.&nbsp; https://twitter.com/apashyam_kiriki/status/1849072391244091807 https://twitter.com/globalstar_ntr/status/1849035870319362545 https://twitter.com/RavirockzNTR/status/1849018605377348020 https://twitter.com/Niteesh__09/status/1849012939560264070 పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జోరు ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.  250 రోజులపాటు ట్రెండింగ్‌ మరోవైపు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన 'సలార్‌' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చి అదరగొట్టింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని హాట్‌స్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. 250 రోజుల పాటు వరుసగా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచినట్లు పేర్కొంది. దీంతో ప్రభాస్‌ దూకుడు ఓటీటీలోనూ కొనసాగుతోందంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సలార్‌ను హై వోల్టేజ్‌ చిత్రంగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సినిమాను నింపేశారు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. https://twitter.com/DisneyPlusHS/status/1849068031244402840
    అక్టోబర్ 24 , 2024
    <strong>HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;</strong>
    HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్‌ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్‌ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం. చదువులో యావరేజ్‌&nbsp; ప్రభాస్‌ చదువు పరంగా యావరేజ్‌ స్టూడెంట్‌. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్‌ పిరియడ్‌ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు. మతిమరుపు ఎక్కువ ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచి తన ఫ్రెండ్స్‌ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.&nbsp; ‘నువ్వు హీరో ఏంట్రా’ కెరీర్‌ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్‌ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్‌ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్‌ తీసుకున్నాక 'ఈశ్వర్‌' ఆఫర్‌ వచ్చింది.&nbsp; డార్లింగ్‌ పిలుపుకు కారణం ఇదే ప్రభాస్‌ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్‌ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్‌ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్‌ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్‌ సినిమా కూడా రావడం గమనార్హం. అతిథి పాత్రలు రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హిందీలో వచ్చిన 'యాక్షన్‌ జాక్సన్‌' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం గమనార్హం.&nbsp; పెదనాన్నతో రెండు చిత్రాలు దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్‌’ వంటి చిత్రాల్లో ప్రభాస్‌ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు. ముచ్చటగా మూడుసార్లు ప్రభాస్‌ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్‌ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.&nbsp; తొలి దక్షిణాది హీరో ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్‌ గుర్తింపు పొందాడు. ప్రభాస్‌ తర్వాత టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రీసెంట్‌గా రామ్‌చరణ్‌ ఈ ఘనత సాధించారు.&nbsp; నటుడు కాకుంటే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో వర్క్‌ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్‌ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్‌ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!</strong>
    The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్‌’ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; లేటెస్ట్ అప్‌డేట్‌ అదుర్స్‌ ప్రభాస్‌ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్‌ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్‌ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్‌ ట్రీట్‌ (టీజర్‌/ట్రైలర్‌ రిలీజ్‌) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్‌ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌ వింటేజ్‌ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్‌ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న 'రాజా సాబ్‌' రిలీజ్‌ కానుంది. రాజా సాబ్‌ ఫొటో లీక్‌! రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రిలీజ్‌ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో ఫుల్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్‌ రిద్ది కుమార్‌ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్‌ సందర్భంగా మానిటర్‌ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్‌ చేసినట్లు కనిపిస్తోంది.&nbsp; https://twitter.com/Baahubali230/status/1848209164553814057 రీ-రిలీజ్‌ల సందడి మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్‌ చేసి స్పెషల్‌ షోస్‌ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్‌’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మిర్చి’, ‘రెబల్‌’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్‌ చేస్తున్నారు.&nbsp; భారీ ధరకు మ్యూజిక్ రైట్స్‌ రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్‌ రాజాసాబ్‌ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్‌ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు! ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!</strong>
    Prabhas Future Projects: 2025లోనూ ప్రభాస్‌ జోరు.. మూడు సినిమాలు పక్కా!
    గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆయన గత చిత్రాలైన ‘సలార్‌’ (Salaar: Part 1 - Ceasefire), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపించాయి. అయితే ‘బాహుబలి 2’ తర్వాతి నుంచి ప్రభాస్‌ చిత్రాల జోరు ఒక్కసారిగా పెరిగింది. ఒకటికి తగ్గకుండా ప్రతీ ఏడాది తన సినిమా రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది రెండు చిత్రాలతో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘కల్కి’ రూపంలో పలకరించాడు. ఇక వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రభాస్‌ ఆడియన్స్‌కు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ మూడు చిత్రాలు లోడింగ్‌..! ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2) చిత్రాల తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్ ఆ రెండు చిత్రాలతో గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా తన ప్రతీ సినిమాకు మరింత పెంచుకుంటూ రెబల్‌ స్టార్‌ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ లైనప్‌లో ఐదు బిగ్‌ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డైరెక్టర్‌ మారుతీతో ‘రాజా సాబ్‌’ (Raja Saab), సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2)తో పాటు హను రాఘవపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. పైన చెప్పుకున్న వాటిలో తొలి మూడు చిత్రాలు 2025లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాజా సాబ్‌’ను 2025 ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అటు ‘కల్కి 2‘ షూటింగ్‌ కూడా కొంతమేర పూర్తైనట్లు నిర్మాత అశ్వనీ దత్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి (జూన్‌ నెలలో) రిలీజ్‌ చేయవచ్చని హింట్ ఇచ్చారు. అటు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ కూడా మరో రెండు నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ మూవీని రిలీజ్‌ చేయాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ నుంచి 2025లో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు! ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను ప్రభాస్‌ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు డార్లింగ్‌ ప్రయత్నిస్తున్నాడు. శరవేగంగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. 2023లో ప్రభాస్‌ నుంచి ‘ఆదిపురుష్’, సలార్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కల్కితో ఇప్పటికే ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్‌ డిసెంబర్‌లో రానున్న ‘కన్నప్ప’లో ఓ క్యామియోతో అలరించనున్నాడు. ఆపై 2025లో మూడు చిత్రాలు, 2026 కోసం ‘సలార్‌ 2’, హను రాఘవపూడి దర్శకత్వంలోని చిత్రాన్ని రెడీ చేసుకున్నాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్‌ చేయడానికి తారక్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు తడబడుతుంటే ప్రభాస్‌ మాత్రం అలవోకగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది కూడా పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలను చక చక పూర్తి చేస్తుండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.&nbsp; రేసుకు తెరలేపిన ప్రభాస్‌! ప్రభాస్ అప్‌కమింగ్‌ చిత్రం 'రాజా సాబ్‌'ను 2025 సమ్మర్‌ కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా ఐదు (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 2025 సమ్మర్‌ రేసులో పలు భారీ చిత్రాలు నిలిచాయి. నాగ చైతన్య 'తండేల్‌' (Thandel), నాగార్జున - ధనుష్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'కుబేర' (Kubera)ను వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అటు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యష్‌ నటిస్తున్న 'టాక్సిక్‌' (Toxic) కూడా సమ్మర్‌ -2025 టార్గెట్‌గా రూపొందుతోంది. అటు హిందీలో సల్మాన్‌ నటిస్తున్న 'సికిందర్‌' కూడా ఈ రేసులో ఉన్నాయి. ప్రభాస్‌ సినిమా డేట్‌ను లాక్‌ చేసుకున్న నేపథ్యంలో ఆయా చిత్రాలు సమ్మర్‌లోనే రిలీజ్‌ అవుతాయా? లేక ప్రీపోన్‌ లేదా పోస్ట్‌ పోన్‌ చేసుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.&nbsp;&nbsp;
    జూలై 30 , 2024
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.&nbsp; ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు&nbsp; మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు&nbsp; ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్&nbsp; ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే? పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత&nbsp; రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా&nbsp; ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్&nbsp; తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం&nbsp; ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్‌కు బిగ్‌ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. శరవేగంగా షూటింగ్ ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్‌గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్‌ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు&nbsp; కన్నప్ప గెటప్‌లో&nbsp; విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్‌లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు. టీజర్ డేట్ ఫిక్స్ కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్‌ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మార్చారు. ఈ చిత్రం టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
    మే 15 , 2024
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.&nbsp; డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఏప్రిల్ 23 , 2024
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు.&nbsp;శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు.&nbsp;శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.&nbsp; భూ కైలాస్ అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ భక్త కన్నప్ప 1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా&nbsp; ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే. https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM మహా శివరాత్రి సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.&nbsp; https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk శ్రీ మంజునాథ శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.&nbsp; https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ జగద్గురు ఆదిశంకర ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు. https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4 ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి.&nbsp;
    మార్చి 08 , 2024
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు కాలింగ్ సహస్ర సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమాకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. సుడిగాలి సుధీర్‌ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా న‌టించింది.&nbsp; హాయ్‌ నాన్న నానీ లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ థాకూర్‌ నటించింది.&nbsp; కంజూరింగ్‌ కన్నప్పన్ గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్‌ కన్నప్పన్‌' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్‌, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు. #90s హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son&nbsp;SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
    జనవరి 05 , 2024
    <strong>Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!</strong>
    Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!
    టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్‌ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ పేరు మరోమారు మార్మోగుతోంది. రూ. 2 కోట్లు విరాళం&nbsp; కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్‌ టీమ్‌ ప్రకటించింది. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్‌ రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. అండగా సెలబ్రిటీలు! ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్‌ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్‌ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్‌ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్‌ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్‌ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్‌ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1821114197213626764 డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు.&nbsp; లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్‌ సభ్యులు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్‌ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఆగస్టు 07 , 2024
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.&nbsp; కుటుంబ నేపథ్యం చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.&nbsp; సినిమా నేపథ్యం చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. లక్కీ హీరోగా గుర్తింపు ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌. సంపాదనలో శూన్యమే! చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం&nbsp; రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.&nbsp;&nbsp; చెయ్యి చాలా మంచిదట! చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
    నవంబర్ 11 , 2023

    @2021 KTree