• TFIDB EN
  • కంత్రి
    UATelugu2h 46m
    హాంకాంగ్‌లో ఓ నేరస్తుడి వద్ద పనిచేసే క్రాంతి ఓ వివాదం కారణంగా బయటకు వచ్చేస్తాడు. కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. అయితే తాను పని చేసిన నేరస్తుడిని చంపే డీల్ క్రాంతికి వస్తుంది. అప్పుడు క్రాంతి ఏం చేశాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఎన్టీ రామారావు జూనియర్.
    కంత్రి (క్రాంతి)
    హన్సిక మోత్వాని
    వరలక్ష్మి / హంస
    తనీషా ముఖర్జీ
    ప్రియా
    ప్రకాష్ రాజ్
    PR / పోతురాజు
    ఆశిష్ విద్యార్థి
    శేషు
    కోట శ్రీనివాసరావు
    దైవ సహాయం
    ముఖేష్ రిషి
    కంత్రి తాత
    సాయాజీ షిండే
    దాస్
    బ్రహ్మానందం
    బ్రహ్మి
    అలీ
    చాంగ్ లీ
    సునీల్
    రజనీ హాసన్
    మురళీ శర్మ
    (గ్యాంగ్‌స్టర్)
    సుబ్బరాజు
    భైరాగి
    రఘు బాబు
    యాసిడ్ దుర్గ
    కృష్ణ భగవాన్
    సింగపూర్ టూర్ గైడ్
    పృధ్వీ రాజ్
    సెటిల్మెంట్ రాజు
    గుండు హనుమంత రావు
    దేవరాజు
    శ్రీనివాస రెడ్డి
    కటింగ్ శీను
    ప్రభాస్ శ్రీను
    స్పైడర్ రెడ్డి
    ఎంఎస్ నారాయణ
    తెలుపు రామకృష్ణ
    మాస్టర్ భరత్
    రాంబో
    హేమ
    రణధీర్ రెడ్డి
    కంత్రి స్నేహితుడు
    జివి సుధాకర్ నాయుడు
    సిబ్బంది
    మెహర్ రమేష్
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    కథనాలు
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు  జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.  ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.  ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.  ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.  ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.  హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.  తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌  ఫేవరేట్‌ సాంగ్‌ & సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.  రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.  రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి. 
    మే 20 , 2024
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?
    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా చిత్రాలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అటువంటి చిత్రాలు ఏవి? ఇందుకు గల కారణాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  భోళాశంకర్‌ (Bhola Shankar) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మేహర్‌ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన రీసెంట్‌ చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందే నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మేహర్‌ రమేష్‌.. గతంలో ఇచ్చిన డిజాస్టర్ల నేపథ్యంలో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందుకు అనుగుణంగానే రిలీజ్‌ తర్వాత ‘భోళాశంకర్‌’ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం గమనార్హం.  ఆదిపురుష్‌ (Aadi Purush) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా విడుదలకు ముందే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైనప్పటి నుంచి నెట్టింట విపరీతంగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. గ్రాఫిక్స్ మరి అద్వాన్నంగా ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే విడుదల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సంభాషణలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. షాడో (Shadow) వెంకటేష్‌ (Venkatesh) హీరోగా మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘షాడో’. మేహర్‌ రమేష్‌ గత చిత్రాలు ‘కంత్రి’, ‘శక్తి’ డిజాస్టర్‌గా నిలవడంతో దాని ప్రభావం ‘షాడో’పై కూడా పడింది. ఈ మూవీ ట్రైలర్‌.. అంచనాలను అందుకోకపోవడంలో విఫలం కావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్‌ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. లాంగ్‌ హెయిర్‌లో వెంకీ లుక్‌ బాలేదని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. మెుత్తానికి విడుదల తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ నిలిచి ఆ విమర్శలను నిజం చేసింది.  స్కంద (Skanda) హీరో రామ్‌ (Ram), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో రూపొందిన ‘స్కంద’పై ట్రైలర్‌ రిలీజ్‌ ముందు వరకూ భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్‌ రిలీజ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ మరి ఓవర్‌ డోస్‌ అయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ‘స్కంద’ రిలీజ్‌ తర్వాత బి లో యావరేజ్‌గా నిలిచింది. ముఖ్యంగా రామ్‌కు నటుడు శ్రీకాంత్‌ ఎలివేషన్‌ ఇచ్చే డైలాగ్‌ ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రోల్‌ కావడం గమనార్హం. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌ హీరోగా (Tollywood Films Got Flop Talk Before The Release) బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తొలి ఆట నుంచే ట్రోల్స్‌ చుట్టుముట్టాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ విలన్ సోదరుడి తల నరకడం.. గద్ద దాన్ని ఎత్తుకెళ్లడానికి సంబంధించిన సీన్‌ విపరీతంగా ట్రోల్‌కు గురైంది. అలాగే రైలు పై నుంచి పరిగెత్తుకుంటూ రామ్‌చరణ్‌ బిహార్‌ వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌ ఫ్లాప్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.  లైగర్‌ (Liger) విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్‌ అయ్యింది. ప్రమోషన్స్‌ సందర్భంగా నిర్మాత చార్మీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. పైగా సిక్స్‌ ప్యాక్‌తో ఎంతో దృఢంగా ఉన్న విజయ్‌కు సినిమాలో నత్తి ఉన్నట్లు చూపించడం కూడా ట్రోల్స్‌కు కారణమైంది. రాధే శ్యామ్‌ (Radheshyam)  బాహుబలి తర్వాత ప్రభాస్‌ తీసిన రెండో చిత్రం ‘రాధేశ్యామ్‌’. సాహో ఫ్లాప్‌ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 1976 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికం తెలిసిన జ్యోతిష్కుడిగా కనిపిస్తాడని తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు సోషల్‌ మీడియాలో ఈ సినిమా కూడా డౌటే అంటూ ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విడుదలైన రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకొని.. ఆ రూమర్స్‌ను నిజం చేసింది.  వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం టీజర్‌ రిలీజ్‌ నుంచే విమర్శలను మూటగట్టుకుంది. టీజర్‌ బోల్డ్‌గా ఉండటంతో పాటు విజయ్‌ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయడం చూపించారు. అర్జున్‌ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌ ఎక్కువైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు మహిళ సంఘాలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించాయి. ఇన్ని ట్రోల్స్‌, విమర్శల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది.  సన్‌ ఆఫ్‌ ఇండియా (Son of India) మంచు మోహన్‌బాబు (Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Tollywood Films Got Flop Talk Before The Release) చిత్రం విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మీమ్స్‌ క్రియేట్‌ చేశాయి. మరో ఫ్లాప్‌ లోడింగ్‌ అంటూ ట్రోల్స్‌ చేశాయి. ఈ పరిణామాల మధ్య వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. 
    మార్చి 16 , 2024
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.   గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?  ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.  మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    Hansika Motwani: బాత్‌ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!
    Hansika Motwani: బాత్‌ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!
    అందాల భామ హన్సికా మోత్వానీ గత కొంతకాలంగా తన బోల్డ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. అయితే తాజాగా తన రూట్‌ మార్చిన ఈ అమ్మడు చీరలో తళుక్కుమని మెరిసి ఆశ్చర్య పరిచింది.  View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) లైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో శారీ కనిపించిన హన్సికా ట్రెడిషనల్‌ లుక్‌లోనూ తాను మెప్పించగలనని నిరూపించుకుంది.  గత కొన్ని రోజులుగా హన్సికను బోల్డ్‌ లుక్స్‌లో చూస్తు వచ్చిన ఫ్యాన్స్‌ ఇవాళ చీరలో చూసి ఆశ్యర్యపోతున్నారు. చీరలో అద్భుతంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.  శారీ ఫొటోలకు ముందు బాత్‌ టబ్‌లో ఉన్న ఫొటోలను హన్సిక పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని మైమరిచిపోతున్నారు.  సముద్రంలో బోటుపై ప్రయాణిస్తూ హన్సికా పెట్టిన బోల్డ్‌ ఫొటోలు అప్పట్లో చాలా బాగా వైరల్‌ మారాయి. నీలి సంద్రంపై హన్సికా తెల్లటి అందాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 2007లో దేశముదురు సినిమా ద్వారా హన్సికా  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వైశాలి పాత్రలో ఈ అమ్మడు చాలా గొప్పగా నటించింది.  దేశముదురు చిత్రం హిట్‌ కావడంతో హన్సికకు అవకాశాలు క్యూ కట్టాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కల్యాణం, కందిరీగా, ఓ మై ఫ్రెండ్‌ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల హన్సికాకు పెళ్లి కాగా సినిమాలకు గుడ్‌బై చెబుతుందేమోనని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను తలకిందు చేస్తూ వరుస షూటింగ్‌లతో హన్సికా బిజీ బిజీగా గడుపుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ  హన్సికా చురుగ్గా ఉంటోంది. మత్తెక్కించే ఫోజులతో ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. 
    ఏప్రిల్ 06 , 2023
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్  డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.  శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.  పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.  రాజమౌళి ఆసిస్టెంట్  డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.  అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.  ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.  రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. 
    ఏప్రిల్ 06 , 2023
    Amy Aela: కత్రినా కైఫ్‌ను తలపించే అందం.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న హాట్‌ బ్యూటీ..!
    Amy Aela: కత్రినా కైఫ్‌ను తలపించే అందం.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న హాట్‌ బ్యూటీ..!
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    ఆగస్టు 23 , 2023
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
    నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,  ఇమ్రాన్ హష్మీ,  సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,  అనీష్ కురువిల్లా,  కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే. డైరెక్టర్: ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా మ్యూజిక్: తనూజ్ టికు ఎడిటర్: రామేశ్వర్ S. భగత్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున) సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.  కథ:  అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ ఎలా ఉందంటే? టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.  భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి  న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్. టెక్నికల్ పరంగా సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది. బలాలు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్ బలహీనతలు స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం చివరగా: హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.5/5
    నవంబర్ 12 , 2023
    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!
    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!
    ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘డీప్‌ ఫేక్‌ సాంకేతికత’ (Deep Fake Technology)కు కృత్రిమ మేధ (AI) మూల కారణమని చెప్పొచ్చు. ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు సినిమా రూపురేఖలనే మార్చేస్తున్నారు. పలు సూపర్‌ హిట్ సినిమాలకు సంబంధించిన సీన్లను తమకు నచ్చిన హీరో ముఖాలతో మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు డీప్‌ ఫేక్‌ (Deep Fake) అంటే ఏమిటీ? అది ఎలా పనిచేస్తుంది? దీనికి సంబంధించిన వైరల్‌ వీడియోలు ఏవి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  ఎలా పనిచేస్తుంది? ‘డీప్‌ ఫేసింగ్‌’ గురించి సాధారణ భాషలో చెప్పాలంటే మార్ఫింగ్‌ అని అర్ధం. డీప్‌ ఫేకింగ్‌ కోసం ఎన్‌కోడర్స్‌, డీకోడర్స్‌ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఎన్‌కోడర్స్‌ రెండు చిత్రాల కదలికలను క్షుణ్నంగా పరిశీలించి, వాటి మధ్య సారూప్యతను పసిగడుతుంది. ఇక డీకోడర్స్‌ ముఖాలను మార్చేస్తుంది. అయితే ఎంత బాగా మార్ఫింగ్‌ చేసినా కొంత లోటు ఉంటుంది. చూసే కళ్లకు అది డీప్‌ ఫేకింగ్‌ ఏమో అన్న అనుమానం కచ్చితంగా కలుగుతుంది. అయితే కొందరు మాత్రం మరింత అడ్వాన్స్‌డ్‌ సాంకేతికతను సంధించి డీప్‌ ఫేక్‌ వీడియోను మరింత సహజంగా మార్చేస్తున్నారు. షోలే.. డీప్‌ ఫేక్‌ బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘షోలే’ చిత్రాన్ని కూడా ఇటీవల డీప్‌ ఫేక్‌ చేశారు. అందులోని పాత్రలను హాలీవుడ్‌ యాక్టర్ల ముఖాలతో మార్ఫింగ్‌ చేశారు. హాలీవుడ్‌ వర్షన్‌ షోలే మూవీ ఈ స్టైల్‌లో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ డీప్‌ ఫేక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. సినిమాలోని జై (అమితాబ్‌ బచ్చన్‌) పాత్రలో అలనాటి హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డి నిరో (Robert De Niro) ఫేస్‌ను మార్ఫింగ్‌ చేశారు. ధర్మేంద్ర పాత్రలో అల్‌ పాసినో (Al Pacino), బాసంతి క్యారెక్టర్‌ను జులియా రాబర్ట్స్‌ , గబ్బర్‌ సింగ్‌ పాత్రను జాక్‌ నికోల్సన్‌ (Jack Nicholson), థాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ పాత్రలో కెవిన్‌ స్పేసీ (Kevin Spacey) ముఖాలను మార్ఫింగ్‌ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్‌ అవుతున్నారు. పాత్రలు చాలా బాగా సింక్‌ అయ్యాయని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రయత్నం అసలు బాగోలేదని బదులిస్తున్నారు.  View this post on Instagram A post shared by Shadygraphics.ai (@shadygrqphics.ai) కంగనా, హృతిక్‌  హాలీవుడ్‌లో రిలీజైన బార్బీ (Barbie) ఇటీవల ఓ వ్యక్తి డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్‌ చేశాడు. బార్బీ చిత్ర ట్రైలర్‌ను బాలీవుడ్‌ నటులు కంగనా రనౌత్, హృతిక్‌ రోషన్‌లతో డీప్‌ ఫేక్‌ చేయడం విశేషం. ఇందులో బార్బీ గార్ల్‌గా కంగనా కనిపించింది. ర్యాన్‌ గోస్లింగ్‌ (Ryan Gosling) పాత్రలో హృతిక్‌ సైతం అద్బుతంగా సెట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంగనా నిజంగానే బార్బీ గార్ల్‌ లా ఉందని పోస్టులు పెడుతున్నారు.  View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker) స్క్విడ్‌ గేమ్‌  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, తమన్నా బాయ్ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో ఓ వ్యక్తి స్వ్కిడ్‌ గేమ్‌ సిరీస్‌ను డీప్‌ ఫేక్‌ చేశాడు. అందులోని వివిధ పాత్రలకు బాలీవుడ్‌ స్టార్‌ క్యాస్ట్‌ నసీరుద్దీన్‌ షా, తాప్సీ పన్ను, ఆలియా భట్‌, కంగనా రనౌత్, ఇషాన్‌ ఖట్టర్‌, నితిన్‌ ముఖేశ్‌ ముఖాలను మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కూడా నెట్టింట తెగ పాపులర్ అయ్యింది.  View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker) టెర్మినేటర్‌  హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ టెర్మినేటర్‌ను సైతం డీప్‌ ఫేక్‌ చేశారు. ఇందులా ఆర్నాల్డ్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.  View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker)
    ఆగస్టు 04 , 2023
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..  మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..  మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్‌ జెండర్‌గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్‌ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్‌ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్‌ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి. 1. నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.  2. విరాట్‌ కోహ్లీ అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అటువంటి విరాట్‌ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్‌ వేయండి. https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20 3. ఎలాన్‌ మస్క్‌ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్‌ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.  4. అజయ్‌ దేవ్‌గన్‌ బాలీవుడ్‌  సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ అలరించాడు. యాక్షన్‌, ఫైట్‌ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్‌గన్‌ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20 5. అలియాభట్‌ బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తన ‌అందం, అభినయం, నటనతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో కదా.  6. మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ సృష్టికర్త మార్క్‌ జూకర్‌బర్గ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారో AI చూపించింది.  https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20 7. దీపికా పదుకొనే బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.  8. అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ మోస్ట్‌ ఎనర్జిటిక్‌ హీరోగా అక్షయ్‌ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.  https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20 9. ప్రభాస్‌ బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కెరీర్‌ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్‌కు పాన్‌ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్‌ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.  10. లియోనార్డో డికాప్రియో టైటానిక్‌  సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్‌ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్‌ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్‌లో లియోనార్డో ఉన్నాడు.  https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20 11. లియోనెల్ మెస్సీ అర్జెంటినా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనాల్‌ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్‌లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్‌ చేసి చూపించింది.  12. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్‌ ఎలా ఉందో చూసేయండి.  https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20 13. రాక్ హాలీవుడ్‌ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్‌ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్‌ హిట్‌ యాక్షన్‌ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. 14. నోరా ఫతేహి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి. https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20 15. షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుక్‌ ఖాన్‌.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‌అటువంటి షారుక్‌ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.  16. బాబా రాందేవ్‌ యోగా గురు బాబా రాందేవ్‌ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్‌ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్‌గా మాత్రమే మన ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20 17. ముకేష్‌ అంబానీ దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ ‌అంబానీ ఒకరు. రిలయన్స్‌ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.  18. మోనాలిసా ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.  https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
    మే 05 , 2023
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘టైగర్‌3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ (Katrina Kaif) నటించింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.  జపాన్‌ కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలా నిన్ను చేరి దినేశ్‌ తేజ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.  ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.  ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer MovieHindiZee 5Nov 10 ………………………………………………………………………………………………………………. APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 06 , 2023
    Heroes as old men: ప్రభాస్‌, మహేష్‌ ముసలివారైతే ఇలా ఉంటారా? పాపం హృతిక్‌, షారుఖ్‌.. స్టార్లను వృద్ధులుగా మార్చేసిన AI..!
    Heroes as old men: ప్రభాస్‌, మహేష్‌ ముసలివారైతే ఇలా ఉంటారా? పాపం హృతిక్‌, షారుఖ్‌.. స్టార్లను వృద్ధులుగా మార్చేసిన AI..!
    ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతోంది. మనిషి చేసే ప్రతీ పనిని చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ‌అంతేగాక మనుషుల ఆకృతులను మార్చేస్తూ AI నవ్వులు పూయిస్తోంది. సెలబ్రిటీల జెండర్లు మారుస్తూ వారి ఫొటోలను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కు స్టార్‌ హీరోలు వృద్దులైతే ఎలా ఉంటారో అన్న ఆలోచన వచ్చింది. వెంటనే AIకి పని చెప్పాడు. AI ఇచ్చిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  1. అల్లుఅర్జున్‌: పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు బయట కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. నయా ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌కు అలరిస్తాడు. అటువంటి అల్లుఅర్జున్‌ వృద్దుడుగా ఎలా ఉంటాడో కృత్రిమ మేధ (AI) ఒక ఫొటో రూపంలో చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ముఖాన ముడతలు, మెరిసిన జట్టు-గడ్డంతో అల్లుఅర్జున్ ఇందులో కనిపించాడు.  Image Courtesy: Instagram(SAHID) 2. మహేష్‌ బాబు టాలీవుడ్‌లోని మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోల్లో మహేష్‌ ముందు వరుసలో ఉంటాడు. 47 ఏళ్ల వయసులోని పాతికేళ్ల కుర్రాడిగా మహేష్ కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్‌కు వయసు ‌అయిపోతే ఎలా ఉంటాడో AI ఒక ఇమేజ్‌ను తయారు చేసి చూపించింది.  Image Courtesy: Instagram(SAHID) 3. ప్రభాస్‌  పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫిజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌కు ఏ హీరోకి లేని యూనిక్‌ పర్సనాలిటీ ఉంది. అటువంటి ప్రభాస్‌ను కూడా AI తన ఊహాజనితమైన ఫొటోలో వృద్ధుడిగా మార్చేసింది. ఆ ఫొటోను మీరూ చూసేయండి. Image Courtesy: Instagram(SAHID) 4. షారుఖ్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్‌షాగా షారుఖ్‌ ఖాన్‌కు పేరుంది. ఎంతో హ్యాండ్సమ్‌గా ఉండో షారుఖ్‌ ఓ దశలో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‌అటువంటి షారుఖ్‌ లుక్‌ను కూడా AI మార్చివేసింది. వయసైపోతే షారుఖ్ ఎలా ఉంటాడో ఫ్యాన్స్‌కు చూపించింది.  Image Courtesy: Instagram(SAHID) 5. హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్‌ అగ్రహీరోల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు. కండల తిరిగిన దేహంతో హృతిక్‌ ఇప్పటికీ ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నాడు. అతడి ఫొటోను కూడా AI తన సాంకేతికతతో వృద్దుడిగా మార్చేసింది. ముఖంపై ముడతలు, తెల్లటి గడ్డంతో ఉన్న హృతిక్‌ను గుర్తు పట్టడం కష్టమే.  Image Courtesy: Instagram(SAHID) 6. అమీర్‌ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌ వయసును కూడా AI ‌అమాంతం పెంచేసింది. వృద్దుడిగా మారిన అమీర్‌ఖాన్‌ ఊహాజనీత ఫొటోను రూపొందించింది. ఆ ఫొటో ఏంటో మీరు చూడండి. Image Courtesy: Instagram(SAHID) 7. సల్మాన్ ఖాన్‌ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా వయసైపోతే ఎలా ఉంటాడో AI ఫొటో రూపంలో చూపించింది. అయితే ఈ ఫొటోలో సల్మాన్‌ లుక్‌ ఓ సైంటిస్టును పోలి ఉంది.  Image Courtesy: Instagram(SAHID) 8. అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను కూడా AI ఓల్డ్‌ మ్యాన్‌గా మార్చేసింది. ఈ లుక్‌లో అక్షయ్‌ హాలీవుడ్‌ నటుడిలాగా అనిపిస్తున్నాడు.  Image Courtesy: Instagram(SAHID) 9. షాహిద్‌ కపూర్‌ బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను కూడా AI తన సాంకేతికతతో వయసు మళ్లిన వ్యక్తిగా మార్చేసింది. AI చేసిన ఫొటోలో షాహిద్‌ పూర్తి డిఫరెంట్‌గా కనిపించాడు.  Image Courtesy: Instagram(SAHID) 10. రణబీర్‌ కపూర్ బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ రణబీర్ కపూర్‌ను AI కురువృద్దుడిగా మార్చేసింది. ముడతలు పడిన చర్మంతో రన్‌బీర్‌ కనిపించాడు. Image Courtesy: Instagram(SAHID)
    మే 15 , 2023
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్‌ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్‌ చేసిన టాప్‌ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్‌ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్‌ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం.  టాప్‌-20లో బాలీవుడ్‌ తారలు సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేయబడ్డ టాప్‌ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్‌ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్‌ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్‌- 20లో చోటు దక్కించుకున్నారు.  దీపిక పదుకొనే (Deepika Padukone)షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)అలియా భట్‌ (Alia Bhatt)ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irrfan Khan)అమీర్‌ ఖాన్‌ (Aamir Khan)సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కత్రినా కైఫ్‌ (Katrina Kaif)అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)సమంత రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu)కరీనా కపూర్‌ (Kareena Kapoor)త్రిప్తి దిమ్రి (Tripti Dimri)తమన్న భాటియా (Tamannaah Bhatia)రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)నయనతార (Nayanthara)రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh)అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) తెలుగులో టాప్‌ ఎవరంటే? ఐఎండీబీ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్‌ తర్వాత తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ (31), అల్లు అర్జున్‌ (47), జూనియర్ ఎన్టీఆర్‌ (67), మహేశ్‌ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్‌-100లో నిలిచారు.  టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా? ఐఎండీబీ రిలీజ్‌ చేసిన తాజా జాబితాలో టాప్‌-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ (సలార్‌), అల్లు అర్జున్‌ (పుష్ప), రామ్‌చరణ్‌ - తారక్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్‌ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్‌ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్‌ స్టార్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్‌-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు. 
    జూన్ 05 , 2024
    War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!
    War 2: ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌.. టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై బజ్‌ ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్‌ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీగా హైప్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా సాగుతోంది. తారక్ గత కొన్నిరోజులుగా ముంబయిలోనే ఉంటూ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘వార్‌ 2’కు సంబంధించిన క్రేజీ న్యూస్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  సిక్స్‌ ప్యాక్‌లో తారక్‌! ‘వార్‌ 2’ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫైట్‌ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘వార్‌ 2’ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ  YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ‘వార్‌ 2’లో మరో బాలీవుడ్‌ బ్యూటీ! ‘వార్‌ 2’ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరోయిన్‌ను కత్రీనా కైఫ్‌ ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ స్పెషల్‌ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమే మేకర్స్‌ సంప్రదించగా ఇందుకు కత్రీనా గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హృతిక్‌, తారక్‌ లాంటి టాప్‌ డ్యాన్సర్లు ఉన్న సినిమాలో ఐటెం సాంగ్‌ను కత్రినా చేస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే అని చెప్పవచ్చు. దేవర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2'తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మే 20న తారక్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక రోజు ముందే ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ను లాంఛ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. మే 19న సా. 7.02 ని.లకు ఈ పాట విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేయగా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  https://twitter.com/UrsVamsiShekar/status/1791707613316763915
    మే 18 , 2024
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌ శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  
    మార్చి 22 , 2024
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.  యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.  ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
    ఫిబ్రవరి 29 , 2024
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    RC16: జూ.ఎన్టీఆర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న రామ్‌ చరణ్?
    తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే జంట చిరంజీవి-శ్రీదేవి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రంలో వీరి కెమెస్ట్రీకి సినీ అభిమానులు దాసోహం అయ్యారు. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటలో చిరు-శ్రీదేవి వేసిన స్టెప్పులను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ ఫిదా అవుతుంటారు. అయితే మూడు దశాబ్దాల తర్వాత వారి వారసులు జత కట్టబోతున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ నటించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ జోడీ ఒకప్పటి చిరు - శ్రీదేవి జంటను గుర్తు చేస్తుందని ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. జత కట్టే సినిమా అదే! రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ను తాజాగా చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల తనయ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor)ను చరణ్‌కు జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ (Boney Kapoor) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1759275401048649821 ‘దేవర’ను ఆస్వాదిస్తోంది’ తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోనూ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా జాన్వీ తండ్రి బోనీకపూర్‌ తాజా ఇంటర్యూలో స్పందించారు. ‘దేవర సెట్‌లో ప్రతి క్షణాన్ని మా అమ్మాయి ఆస్వాదిస్తోంది. తన నటన, భాషను పెంచుకునేందుకు వీలు కుదిరినప్పుడల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తోంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. వారి పక్కన నటించడం జాన్వీకి లభించిన మంచి అవకాశం. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’ అని అన్నారు.  https://twitter.com/i/status/1759489211156341061 సౌత్‌ ఇండస్ట్రీపై జాన్వీ కన్ను! బాలీవుడ్‌లో తొమ్మిదికి పైగా చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్‌కు ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ విజయం దక్కలేదు. దీనికి తోడు దీపికా పదుకొనే, అలియా భట్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా వంటి స్టార్‌ హీరోయిన్ల నుంచి జాన్వీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీంతో ఈ భామ దృష్టి దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. టాలీవుడ్‌ సహా పలు దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో వాటిలో నటించడం ద్వారా తన క్రేజ్ పెంచుకోవాలని జాన్వీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తారక్‌ సరసన ‘దేవర’, రామ్‌చరణ్‌ చిత్రాలతో పాటు తమిళ స్టార్‌ సూర్యతో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే ఇక తన కెరీర్‌కు ఢోకా ఉండదని ఈ అమ్మడి ప్లాన్‌. జాన్వీ.. మరో శ్రీలీల కానుందా! టాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలు అంతా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్లతో దాదాపుగా నటించారు. దీంతో వారితో సినిమాలు రూపొందిస్తున్న డైరెక్టర్లు కొత్త హీరోయిన్‌ను జోడీగా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల (Sreeleela)కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు ఉప్పెన (Uppena Movie) ఫేమ్‌ కృతి శెట్టి (Krithi Shetty)కి సైతం ఈ కోవలోనే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం కృతి శెట్టికి ఛాన్సెస్‌ లేకపోవడం.. శ్రీలీల నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడకపోవడంతో దర్శక నిర్మాతల దృష్టి ప్రస్తుతం జాన్వీ కపూర్‌పై పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ మరో శ్రీలీలగా మారవచ్చని అంటున్నారు. 
    ఫిబ్రవరి 19 , 2024
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    Actress Samantha: సోషల్‌ మీడియాలో అకస్మాత్తుగా సమంత ట్రెండింగ్‌.. ఎందుకంటే?
    స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోమారు తన క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలుచటి శారీలో స్లివ్‌లెస్‌ జాకెట్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.  ఫెయిర్‌ లుక్‌లో తళతళ మెరిసిపోతున్న సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దగ్గర్లో  సమంత చిత్రాలు లేకపోవడంతో ఇలా ఫొటోల్లో ఆమెను చూసుకుంటూ సంబరపడుతున్నారు.  తాజాగా సంక్రాంతికి తాను ఏం చేశానో చెప్తూ సామ్‌ పలు ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, పెంపుడు జంతువులు, లైటింగ్‌ డెకరేట్‌ చేసిన ఇల్లు.. ఇలా పలు ఫొటోలను షేర్ చేసింది. గతేడాది ఖుషితో అలరించిన సమంత త్వరలో సిటాడెల్‌ (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్ సిటాడెల్‌ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.  మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితమే నిర్మాతగానూ మారింది.  ‘ట్రా లా లా మూవీంగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.  కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సామ్‌ గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప2' చిత్రంలోనూ ఆమె ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 'పుష్ప' పార్ట్‌-1లో సామ్ చేసిన ఐటెమ్‌ సాంగ్‌ అప్పట్లో ఉర్రూతలూగించింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో సమంత సత్తా చాటింది. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్లలో సమంత రెండో స్థానంలో నిలిచింది.  బాలీవుడ్ భామ ఆలియా భట్‌ మెుదటి ప్లేస్‌ స్థానంలో నిలవగా.. దీపికా పదుకునే , కత్రినా కైఫ్‌, నయనతార వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్థానంలో రష్మిక నిలవడం గమనార్హం. ప్రస్తుతం సామ్ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 31.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జనవరి 17 , 2024
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్‌ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా. 1.Apoorva Sahodarulu (1986) బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు. 2. Ramudu Bheemudu (1988) రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు. 3. Brahmarshi Viswamitra (1991) నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 4. Aditya 369 (1991) ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు. 5. Maatho Pettukoku (1995) ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు. 6. Sri Krishnarjuna Vijayam (1996) సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు. 7. Peddannayya (1997) బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు. 8. Sultan  (1999) శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్‌ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్‌ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు. 9. Chennakesava Reddy (2002) మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు. 10. Allari Pidugu (2005) జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు. 11. Okka Magadu  (2005) బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు. 12. Pandurangadu  (2008) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు. 13.Simha  (2010) మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది. 14. Parama Veera Chakra  (2011) దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు. 15. Adhinayakudu  (2012) పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు. 16. Legend  (2014) బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు. Balakrishna's Legend Movie First Look Posters 17. Akhanda (2021) బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది. 18. Veera Simha Reddy  (2023) గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్  అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
    నవంబర్ 09 , 2023
    HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్... ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?
    HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్... ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?
    తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.   'బాద్షాహో', 'రుస్తోమ్' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.   2018లో మెకాఫీ 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె,  ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది 10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది.  ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి.  ఆమె ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. ఇలియానా సినీ కెరీర్ హిట్‌ అయినంతగా... పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్‌లో కొనసాగుతోంది.
    నవంబర్ 01 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.  View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం.   ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.  తండ్రి ఎవరు?  ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా  ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.  పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి. 
    ఏప్రిల్ 18 , 2023

    @2021 KTree