రివ్యూస్
YouSay Review
Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Kat...read more
How was the movie?
తారాగణం
విశ్వంత్ దుడ్డుంపూడి
సునీల్
రఘు బాబు
సత్యం రాజేష్
శ్రీజితా ఘోష్
మధునందన్
సిబ్బంది
కృష్ణ చైతన్య
దర్శకుడుదండమూడి అవనీంద్ర కుమార్నిర్మాత
కథనాలు
Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం.
నటీనటులు
విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్.
కథ
సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది. మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారంటే?
హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది. వైవిధ్యమైన పాత్రలో కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది. సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా
సినిమా టెక్నికల్ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్ పనిచెబితే బాగుండేది.
బలాలు
కథనం
ప్రీ క్రైమాక్స్
డైరెక్షన్
బలహీనతలు
తొలి 20 నిమిషాలు
బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్
Telugu.yousay.tv Rating: 3.5/5
మార్చి 30 , 2024
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
కస్టడీ (మే 12)
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్ చేశారు
భువన విజయం (మే 12)
భువన విజయంలో సునీల్ లీడ్ రోల్‌లో చేశారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించారు.
కథ వెనుక కథ (మే 12)
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్, విశ్వంత్ లీడ్ రోల్స్ చేశారు
మ్యూజిక్ స్కూల్ (మే 12)
ఈ సినిమాలో శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు
ఛత్రపతి (మే 12)
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు.
ఫర్హానా (మే 12)
ఐశ్వర్య రాజేశ్ కీ రోల్‌లో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’.
అన్నీ మంచి శకునములే (మే 18)
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం.
సామజవరగమన (మే 18)
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక
బిచ్చగాడు 2 (మే 19)
ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది.
మళ్ళీ పెళ్లి (మే 26)
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం మళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు.
టక్కర్ (మే 26)
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహించారు.
మేమ్ ఫేమస్ (మే 26)
మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు.
అహింస (జూన్ 02)
రాణా బ్రదర్ అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది.
విమానం (జూన్ 02)
సముద్రఖని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అనసూయ కీలక పాత్ర పోషించింది.
ఆదిపురుష్ (జూన్ 16)
రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ డైరెక్షన్ చేశాడు.
స్పై (జూన్ 29)
హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
మే 11 , 2023
Viral Video: ‘దేవర కంటే పొట్టేల్ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్ ‘దేవర’తో ‘పొట్టేల్’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘దేవర కన్నా చాలా బెటర్’
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్ వంటి టాప్ నాచ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1849871631818293722
కంటెంట్‌కే ప్రాధాన్యత
సినిమాలో కంటెంట్ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
పొట్టేల్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ‘పొట్టేల్’లో ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
కథ ఇదే
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
https://telugu.yousay.tv/pottel-movie-review-comparisons-with-rangasthalam-before-release-is-pottel-at-that-level.html
అక్టోబర్ 26 , 2024
Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్’ ఆ స్థాయిలో ఉందా?
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు
రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
విడుదల తేదీ: 25-10-2024
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రంపై మంచి ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.
ప్లస్ పాయింట్స్
కథప్రధాన తారాగణం నటనసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి.
[toc]
Drushyam
దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్) ఊరిలో కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.
Karthikeya 2
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే…
కార్తికేయ (నిఖిల్)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
Bichagadu 2
ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ
F2
2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్(వరుణ్ తేజ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ.
Ante Sundaraniki
గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
Tholiprema
ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే..
అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
Pelli Choopulu
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
ఓటీటీ సన్ నెక్ట్స్
Spyder
స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే…
ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్
Raja The Great
రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా
Ori Devuda
వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా
Bichagadu
ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో
Jalsa
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
ఓటీటీ: ఆహా
Nenu
అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
Sye Raa Narasimha Reddy
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే..
భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
Bharat Ane Nenu
సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా
Ye Maaya Chesave
ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Baahubali: The Beginning
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
Businessman
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్
Good Luck Sakhi
బంజార యువతి సఖి (కీర్తి సురేష్) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Oxygen
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
Adipurush
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
SR Kalyanamandapam
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ: ఆహా
Disco Raja
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
ఓటీటీ: సన్ నెక్స్ట్
Goutham Nanda
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
Kirrak Party
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Teja
తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
Pelli Sandadi
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
ఓటీటీ:యూట్యూబ్
Swathi Muthyam
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
ఓటీటీ: జియో టీవీ
Dhruva
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
KGF 2
రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
Baadshah
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: యూట్యూబ్
Pushpa
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
Nannaku Prematho
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
Ala Modalaindi
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Sir
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
Jersey
అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: జీ5
Hit: The First Case
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Aditya 369
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
Aha Naa Pellanta
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Vikram Vedha
వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ: ప్రైమ్
Bro
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Khaidi
ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
Uppena
మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్ తేజ్) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Geetha Govindam
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
Acharya
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
Rang De
అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5
ఓటీటీ: ప్రైమ్
Induvadana
వాసు (వరుమ్ సందేశ్) ఫారెస్ట్ పోలీసాఫీసర్. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Maharshi
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Aakaasam Nee Haddhu Ra
సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Ala Vaikunthapurramuloo
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Munna
కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
RRR
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
Dear Comrade
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Jathi Ratnalu
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Dirty Hari
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
ఓటీటీ: ఆహా
Arjun Reddy
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా, ప్రైమ్
Rangasthalam
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
జూన్ 25 , 2024
Save The Tigers 2 Review: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్.. ‘సేవ్ ద టైగర్స్ 2’ నవ్వించిందా?
నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి..
దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి
సంగీతం: అజయ్ అరసద
రచన & నిర్మాత: మహి వి రాఘవ్
స్ట్రీమింగ్ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్
విడుదల తేదీ: 15-03-2024
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చింది. ‘సేవ్ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథ
'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ... ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్ లీడ్ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘సేవ్ ద టైగర్స్ 2’లో మహి వి రాఘవ్ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్ న్యూస్.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి - సుజాత, చైతన్యకృష్ణ - దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'సేవ్ ద టైగర్స్ 2'... సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్ ఈ సిరీస్ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనకామెడీ సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 15 , 2024
Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
విష్వక్‌సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న విజువల్స్ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్ అటెంషన్ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం.
అసలేంటి ఆ సింబల్?
గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉన్న సింబల్ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్ సేన్ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్ ట్రైల్స్‌కు, అఘోర శంకర్ (విష్వక్ సేన్)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్ విద్యాధర్.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.
భూత- భవిష్యత్- వర్తమాన కాలంలో కథ సాగుతుందా?
‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్ గతంలో ఆ హ్యూమన్ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.
దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం?
అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్ డైరెక్టర్ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.
గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు
ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 06 , 2024
VIRUPAKSHA FULL REVIEW: హారర్, సస్పెన్స్ కథాంశంతో విరూపాక్ష… సాయి ధరమ్ తేజ్ సూపర్ కమ్ బ్యాక్!
సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం
దర్శకుడు: కార్తీక్ దండు
నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సోనియా సింగ్, రవికృష్ణ
సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
కథ
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
ఎలా ఉందంటే?
రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది.
ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.
ఎవరెలా చేశారు?
సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక పనితీరు
సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.
విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
బలాలు
కథ, కథనం
సాయిధరమ్, సంయుక్త మీనన్
నేపథ్య సంగీతం
బలహీనతలు
క్లైమాక్స్, లవ్ ట్రాక్
రేటింగ్
3.25/5
ఏప్రిల్ 21 , 2023
These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రోబో 2.0 - పక్షి రాజు
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.
https://www.youtube.com/watch?v=5OkypaWGYAo
నేను లోకల్ - నవీన్ చంద్ర
హీరో నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను లోకల్’ (Nenu Local) చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్ తండ్రి నవీన్ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
https://www.youtube.com/watch?v=rYcZLAgPLps
‘వి’ - నాని
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf
నిన్నుకోరి - నాని
ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.
https://www.youtube.com/watch?v=ie8feBbd4VA
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్
వెంకటేష్-మహేశ్ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది.
https://www.youtube.com/watch?v=G50OUBEZm-4
మగధీర - శ్రీహరి
మగధీరలో రామ్‌చరణ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.
https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec
పుష్ప - శత్రు
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.
https://www.youtube.com/watch?v=krENzIi3Tto
పరుగు - ప్రకాష్ రాజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, షీలా కౌర్ జంటగా చేశారు. ప్రకాష్ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్ రాజ్.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU
విక్రమ్ - కమల్ హాసన్
ఇందులో హీరో కమల్ హాసన్ మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం (విజయ్ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు.
https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2
రిపబ్లిక్ - రమ్యకృష్ణ
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.
https://www.youtube.com/watch?v=FWg79VONoTY
ఫిబ్రవరి 27 , 2024
Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!
రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్‌లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం.
[toc]
Arthaminda Arunkumar Season 2
ఈ చిత్రం మంచి అడల్ట్ స్టఫ్‌తో వచ్చింది. చాలా సన్నివేశాల్లో రొమాంటిక్ సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరుణ్ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
Citadel Honey Bunny
ఈ సినిమాలోని బెడ్రూమ్ సీన్లలో సమంత రెచ్చిపోయి నటించింది. వరుణ్ ధావన్‌తో లిప్‌లాక్ సీన్స్ మరి ఘాటుగా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్ గ్యాంగ్ హనీ వెంట ఎందుకు పడుతోంది? అన్నది స్టోరీ.
Honeymoon Express
చైతన్యరావు , హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. హీరోయిన్ హెబ్బా పటేల్ తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. బెడ్రూమ్ సీన్లలో చైతన్యరావు, హెబ్బా పటెల్ రెచ్చిపోయి నటించారు. బొల్డ్ కంటెంట్ ఇష్టపడేవారికి మంచి మాజాను ఇస్తుంది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..ఇషాన్, సోనాలి పెళ్లైన కొత్త జంట. భిన్నమైన మనస్తత్వాలు ఉండటంతో తరచూ వీరి కాపురంలో గొడవలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ సీనియర్ కపుల్స్.. వీరికి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెప్తారు. ఏంటా గేమ్? దాని వల్ల ఇషాన్, సోనాలి ఎలా దగ్గరయ్యారు? ఇంతకీ గేమ్‌ను సూచించిన సీనియర్ జంట ఎవరు? అన్నది కథ.
స్త్రీ 2
స్త్రీ 2 చిత్రంలో టైమ్ లెస్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అందాలను అప్పనంగా ఆస్వాదించవచ్చు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ బొల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. యూత్‌కు మంచి మజాను అందిస్తుంది ఈ చిత్రం.
ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలిగింది అనే అంతా భావించే లోపు సర్కటతో కొత్త సమస్య మొదలువుతుంది. ఈ సమస్యను విక్కీ(రాజ్ కుమార్), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన(అభిషేక్ బెనర్జీ)తో కలిసి దెయ్యం(శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది అన్నది కథ.
Nakide First Time
రాంరెడ్డి మస్కీ దర్శకత్వంలో వచ్చిన 'నాకిదే ఫస్ట్ టైమ్' చిత్రంలో ధనుష్ బాబు, సిందూర రౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో టీనేజీలో యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణలను ప్రధానంగా చూపించారు.
Silk Saree
అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి టైం పాస్ ఇస్తుంది. ఈ సినిమాలో వాసుదేవ్‌రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి, ప్రధాన పాత్రల్లో నటించారు.
Naughty Girl
ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కావాల్సినన్ని మసాల సీన్లు అందుబాటులో ఉన్నాయి.
Hi Five
ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు.ఈ సినిమాలోనూ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఎవోల్
రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్‌ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని
ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే..
చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ.
https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps
హాట్ స్పాట్
నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
లవ్ మౌళి
2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
Mr & Miss
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్‌లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ.
ఏడు చేపలా కదా
ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్ అవుతున్నారన్నది మిగతా కథ.
RGV’s Climax
తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ.
రాజ్
ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
నేను
మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
BA పాస్
బాలీవుడ్‌లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…
ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ.
కుమారి 21F
తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్‌ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
సిద్దు(రాజ్ తరుణ్) హోటల్ మెనేజ్‌మెంట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్‌గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ.
మిక్స్ అప్
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్ సూచన మేరకు వారు గోవా టూర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి.
సిద్ధార్థ్ రాయ్
రీసెంట్‌గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్.. ఏ ఏమోషన్స్ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్‌ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఆట మొదలైంది
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
భక్షక్
సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్‌గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
బబుల్గమ్
ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
యానిమల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
పర్‌ఫ్యూమ్
అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు? అతడు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ.
మంగళవారం
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ
ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఒదెల రైల్వే స్టేషన్
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు.
హెడ్స్ అండ్ టేల్స్
హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
క్రష్
ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
ఏక్ మినీ కథ
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్ శోభన్ (సంతోష్) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ హరి
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.
RDX లవ్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్‌పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.
చీకటి గదిలో చితక్కొట్టుడు
ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
నాతిచరామి
ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.
24 కిసెస్
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
RX 100
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
దండుపాళ్యం 3
దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ.
జూలీ 2
నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించి స్టార్‌గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
బాబు బాగా బిజీ
తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
గుంటూరు టాకీస్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
అవును2
ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఐస్ క్రీమ్ 2
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
నా బంగారు తల్లి
దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్‌లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
ప్రేమ ఒక మైకం
మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
పవిత్ర
శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు.
దండుపాళ్యం
క్రూరమైన ఓ గ్యాంగ్ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్‌ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా నేరుగా చూడవచ్చు.
ది డర్టీ పిక్చర్
ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్‌తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్‌తో(Telugu hot movies) ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ.
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్‌లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
అరుంధతి
ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్‌గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ దుర్యోధన
ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
రా
శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడొచ్చు.
సముద్రం
సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్‌నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉంది.
10th Class
టినేజ్‌లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది.
ఆరుగురు పతివ్రతలు
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
4 లెటర్స్
ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ.
రొమాంటిక్ క్రిమినల్స్
ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
ఈరోజుల్లో
ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో చూడవచ్చు.
అల్లరి
అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్‌గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
నవంబర్ 14 , 2024
Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్.. ‘హైడ్ అండ్ సీక్’ మెప్పించిందా?
నటీనటులు : విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్ వెరేళ్ల తదితరులు
రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా
సంగీతం : లిజో కె. జోస్
ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల
నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
విడుదల తేదీ: 20-09-2024
‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కర్నూల్ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్ వార్ ఫేర్‌ను కర్నూల్ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్ ఇంకాస్త బాగా ఎలివేట్ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వాంత్ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 20 , 2024
Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : అజ్మల్ అమీర్, మానస రాధాక్రిష్ణన్, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్ ప్రభూనే, కోటా జయరామ్, ఎలెనా టుతేజా తదితరులు
దర్శకుడు : రామ్‌గోపాల్ వర్మ
సంగీతం : బాలాజీ
సినిమాటోగ్రఫీ : సజీష్ రాజేంద్రన్
ఎడిటింగ్ : మనీష్ థాకూర్
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.
కథ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్ (ధనుంజయ్ ప్రభునే), పవన్ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్ పాత్రకు పాత్రకు మైలేజ్ ఇస్తూ.. చంద్రబాబు, పవన్ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్ రాజేంద్రన్ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అజ్మల్ అమీర్ నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంద్వితీయార్థంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మార్చి 02 , 2024
Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు: టీజీ కీర్తి కుమార్
సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ కెవిన్ ఎ
ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్
నిర్మాత: అదితి సోని
వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్ కె. సింగ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్ స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
వెన్నెల కిషోర్ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్ లైన్ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్ అయ్యింది. ఏజెంట్ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్‌ను కూడా డైరెక్టర్ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది.
టెక్నికల్‌గా
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
వెన్నెల కిషోర్ నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్‌రక్తి కట్టించే సీన్లు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
మార్చి 01 , 2024
Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్ కెరీర్ బెస్ట్ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: పాయల్ రాజ్‌పూత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమిర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకత్వం: అజయ్ భూపతి
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి
నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
విడుదల: 17-11-2023
‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమాతోనే నటి పాయల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి దగ్గరైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్లు ఈ ఆసక్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మంగళవారం కథేంటి? తెరపై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయల్- అజయ్‌లకు విజయాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.
కథ
మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామదేవత మాలచ్చమ్మ జాతర జరిపించకపోవడమే ఇందుకు కారణమని ఊరి ప్రజలు భావిస్తారు. అయితే ఈ మిస్టరీ మర్డర్స్ వెనుక ఏదో కుట్ర ఉందని ఎస్ఐ (నందితాశ్వేత) భావిస్తుంది. కానీ, ఊరి జమీందారు ప్రకాశం (చైతన్య కృష్ణ) మాటలకు కట్టుబడి ఇమె ఇన్వేస్టిగేషన్‌కు ఎవరూ సరిగా సహకరించరు. మరి ఆ హత్యలకు వెనుక ఉన్న మర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయల్ రాజ్‌పుత్) తిరుగుతోందని ఊరి ప్రజలు ఎందుకు భ్రమపడ్డారు? ఈ హత్యలకు శైలుకు సంబంధం ఉందా? మహాలక్ష్మీపురం నుంచి ఆమె వెలివేయబడటానికి కారణం ఏమిటి? అన్నదే మంగళవారం సినిమా కథ.
ఎలా సాగిందంటే?
సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్నతనం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరి గోడలపై రాయడం.. వారంతా గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్ ఇస్తాయి. ద్వితీయార్ధం మళ్లీ శైలు గతంతోనే మొదలవుతుంది. శైలుకు జరిగిన అన్యాయం, ఆమెకున్న మానసిక రుగ్మత, దానివల్ల తను పడే యాతన రెండో పార్ట్‌లో చూపించారు. పతాక సన్నివేశాలు మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?
శైలు పాత్రలో పాయల్ చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్‌తో పాటు నటనలోనూ అదరగొట్టింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కగా జీవించింది. ఎస్సై పాత్రలో నందితా శ్వేత ఆద్యంతం సీరియస్ లుక్‌లో కనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. అజయ్ ఘోష్ - లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. జమిందారుగా చైతన్య కృష్ణ పాత్రను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు అజయ్ ఈ సినిమాను మిస్టీక్ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్ టచ్ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్రమ సంబంధాల వ్యవహారం, డబల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజయ్ రాసుకున్న కథ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. కానీ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. అజనీష్ నేపథ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాటను స్వరపరిచిన తీరు.. దాన్ని తెరపై చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్రహణం మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
పాయల్ నటన, గ్లామర్‌అజనీష్ సంగీతంట్విస్ట్‌లు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం ముగింపు
రేటింగ్ : 3/5
నవంబర్ 17 , 2023
GOD MOVIE REVIEW TELUGU: సైకో థ్రిల్లర్‌గా వచ్చిన గాఢ్ మెప్పించిందా? రేటింగ్ ఇదే!
నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిశ్ విద్యార్థి, రాహుల్ బోస్, వినోద్ కిషన్, విజయలక్ష్మి
నిర్మాతలు: సుధన్ సందరం, జయరాం, సతీష్‌కుమార్
డెరెక్టర్: ఐ.అహ్మద్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: హరి కే.వేదాంతం
జయం రవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాఢ్' నేడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సైకోథ్రిల్లర్‌గా డైరెక్టర్ అహ్మద్ తెరకెక్కించారు. ఆద్యంతం ట్విస్ట్‌లు, ఎమోషనల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ డబ్బింగ్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా ఎలా ఉంది? చిత్రంలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
గాడ్ స్టోరీ విషయానికి వస్తే దూకుడు స్వభావం కలిగిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్జున్ (జయం రవి)కి అతడి స్నేహితుడు ACP ఆండ్రూ (నరైన్) అంటే చాలా ఇష్టం. సాఫిగా సాగుతున్న వారి జీవితానికి సైకో కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) రూపంలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో కిల్లర్ బ్రహ్మ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్యలు చస్తూ తప్పించుకు తిరుగుతుంటాడు. అతన్ని పట్టుకునేందుకు అర్జున్, ఆండ్రూ టీం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆండ్రూ మరణించడంతో మనస్తాపం చెందిన అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. అయితే అరెస్టయిన సైకో కిల్లర్ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.. ప్రియ (నయనతార)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
అర్జున్ పాత్ర పరిచయంతోనే కథ మొదలు పెట్టిన దర్శకుడు.. నగరంలో ఉండే 25 ఏళ్ల లోపు అమ్మాయిలు కిడ్నాప్ కావడం.. వారంతా సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురికావడం.. వాటిని ఛేదించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగడం.. ఇలా పది నిమిషాల పాటు కథ వేగంగా సాగుతుంది. ఆ తర్వాత కథ నెమ్మదిస్తుంది. హత్యలు జరిగే తీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. అయితే హత్య సీన్స్ నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది. అర్జున్ సైకో కిల్లర్‌ను పట్టుకోవడం, అతడు జైలు నుంచి తప్పించుకోవడం, కిల్లర్ వెనుక మరో సైకో కిల్లర్ ఉన్నాడని తెలియడంతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. చనిపోయిన సైకో కిల్లర్‌నే మళ్లి హత్యలు చేస్తున్నాడా.. లేదా మరొకరు ఉన్నాడా.. సైకో కిల్లర్ జైలులో ఉన్నప్పుడు తనలాంటి వ్యక్తిని తయారు చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే సైకో కిల్లర్ వ్యక్తి వెనకున్న మరో సైకోను పట్టుకునేందుకు హీరో పెద్దగా కష్టపడాల్సి ఉండకపోవడం, వ్యక్తిని చూడగానే అతడే హత్యలు చేస్తున్నాడని తెలుసుకోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ మంచి థ్రిల్లింగ్‌గా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే
పోలీస్ కమిషనర్ పాత్రలో జయం సూపర్బ్‌గా నటించాడు. సైకో కిల్లర్స్‌గా నటించిన ఇద్దరు నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నయనతార పాత్రకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు. రెండు మూడు సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కనిపించదు. నరైన్, ఆశిశ్ విద్యార్థి, వినోద్ కిషన్, విజయలక్ష్మి తమ పరిధి మేరకు నటించారు.
డెరెక్షన్
సైకో కిల్లర్స్ హత్యలు చేసే తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అయిన్పటికీ కథను ఆసక్తికరంగా మలచుకోవడంతో డెరెక్టర్ ఐ.అహ్మద్ కాస్త తడబాటుకు గురయ్యాడు. సైకో కిల్లర్స్ వరుస హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏంటనేది చెబితే బాగుండేది.
టెక్నికల్ పరంగా
గాఢ్ మూవీ నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో అది కనిపిస్తుంది.
సినిమాటోగ్రఫీ పర్వాలేదు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ తెచ్చింది. నేపథ్య సంగీతం క్లైమాక్స్ సీన్లు, పోరాట సన్నివేశాలను ఎలివేట్ చేశాయి.
బలాలు
జయం రవి నటన
ఇంటర్వెల్ సీన్స్
సెకండ్ హాఫ్‌లో ఆసక్తికర ట్విస్టులు
బలహీనతలు
ఫస్ట్ హాఫ్ సీన్లు
పసలేని స్క్కీన్ ప్లే
నయన తారకు స్కోప్ లేకపోవడం
చివరగా
ఫస్ట్ హాఫ్‌లో నార్మల్‌గా సాగే ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 13 , 2023
Pushpa 2: పుష్ప2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్? ఒక్కటి కాబోతున్న మెగా-అల్లు ఫ్యామిలీ!
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘పుష్ప’పై పవన్ కల్యాణ్ నెగిటివ్ కామెంట్స్ చేయడం, ఆ తర్వాత ‘నాకు ఇష్టమైతే వస్తా’ అంటూ బన్నీ వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే ఈ వివాదానికి ‘పుష్ప 2’తో చెక్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్, బన్నీ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘పుష్ప 2’ ఈవెంట్‌కు పవన్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ ఆఖరి వారంలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని పుష్ప టీమ్ భావిస్తోంది. ఏపీలో భారీ ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించి దానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో అల్లు అర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో భేటి అవుతారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బన్నీ రిక్వెస్ట్‌ను పవన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పవన్, బన్నీ ఒకే వేదికపై కనిపించనున్నారు. తద్వారా గత కొంతకాలంగా జరుగుతున్న అల్లు vs మెగా ఫ్యాన్ వార్‌కు చెక్ పడే ఛాన్స్ ఉంది. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య ఏమైనా వివాదాలు ఉన్నా కూడా ఈ దెబ్బతో తొలగిపోతాయని చెప్పవచ్చు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించడం వెనుక ఓ వ్యూహం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ డిజాస్టర్ చేస్తామంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపు సైతం ఇస్తున్నారు. తొలి నుంచి బన్నీకి అండగా నిలిచిన మెగా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తుండటంతో ‘పుష్ప 2’ టీమ్ ఆలోచనల్లో పడినట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ‘పుష్ప 2’ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతోంది. దీంతో ఎలాగైన ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశ్యంతో పవన్‌ను గెస్ట్‌గా పిలవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. దానివల్ల బన్నీపై ఉన్న నెగిటివ్ తగ్గి ఎప్పటిలాగే ‘పుష్ప 2’ను మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.
హైప్ పెంచిన అనసూయ
‘పుష్ప 2’ చిత్రంలో ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ (Anasuya) కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఇటీవల బిగ్‌బాస్ షోకు అతిథిగా వచ్చిన అనసూయకు 'పుష్ప 2'కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. హోస్ట్ నాగార్జున ఈ మూవీకి సంబంధించి చెప్పాలని కోరారు. దీంతో అనసూయ స్పందిస్తూ ‘పుష్ప 2’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని చెప్పింది. గతంలో వచ్చిన ‘పుష్ప’ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమేనని ‘పుష్ప 2’ లోనే అసలు సినిమా అని వ్యాఖ్యానించింది. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంచనాలు పెంచేసింది.
‘పుష్ప 3’ పక్కా
‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ సైతం మూడో పార్ట్ గురించి హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్ 3 కి సంబంధించి సాలిడ్ లీడ్ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని పునరుద్ఘటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు.
https://twitter.com/i/status/1849383805657690194
రూ.1000 కోట్ల బిజినెస్!
'పుష్ప 2' చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించినట్లు(Pushpa 3) తెలిపాయి. నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్ రూ.120 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
అక్టోబర్ 29 , 2024
HBD Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక 'ఈశ్వర్' ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్‌గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 23 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్ వెనక రాజమౌళి!
దేశంలో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. గత కొన్ని నెలలుగా ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘ప్రేమలు’ (Premalu) కూడా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత నెలలో మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మార్చి 8న తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. రాజమౌళి తనయుడు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. టాలీవుడ్‌లో తొలి పది రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ‘ప్రేమలు’ కథ ఏంటి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
వరల్డ్ వైడ్‌గా రికార్డ్ కలెక్షన్స్
మలయాళం సెన్సేషన్ ‘ప్రేమలు’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళ వెర్షన్‌లో వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.117 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ ఇండస్ట్రీలో హైయస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ‘ప్రేమలు’ ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను డబ్ చేశారు.
https://twitter.com/TheNewsDome/status/1769981699675611495?s=20
చరిత్ర సృష్టించిన ‘ప్రేమలు’
దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. మార్చి 8న తెలుగు వెర్షన్‌లో రిలీజైన ఈ చిత్రం.. తొలి పది రోజుల్లో రూ.10.54 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక మలయాళ డబ్బింగ్ చిత్రం తెలుగులో మెుదటి పది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విడుదలై పది రోజులు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రదర్శితమవడం ఆశ్చర్యపరుస్తోంది.
సక్సెస్ వెనక రాజమౌళి!
‘ప్రేమలు’ చిత్రం ఈ స్థాయిలో తెలుగులో విజయవంతం కావడం వెనక దర్శకధీరుడు రాజమౌళి ప్రమేయం ఉంది. ఆయన కుమారుడు స్వయంగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడంతో మూవీ ప్రమోషన్స్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. రాజమౌళి లాంటి ప్రపంచస్థాయి దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. అలాగే మహేష్ బాబు, అనిల్ రావిపూడి వంటి సినీ ప్రముఖులు ‘ప్రేమలు’పై ప్రశంసలు కురిపించడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. ఎటు చూసిన ప్రేమలు గురించి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా 10 రోజులు దాటినా విజయవంతంగా రన్ అవుతోంది.
ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం
ప్రేమలు చిత్రం తెలుగు వెర్షన్.. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మలయాళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా అత్యధిక డాలర్లను వసూళ్లు చేయడం విశేషం. ఈ సినిమా ఇప్పటివరకూ 3 లక్షల డాలర్లు రాబట్టినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. రెండో వారంలోనూ అత్యధిక వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతున్నట్లు ప్రకటించారు.
ఓటీటీలోకి ఎప్పుడంటే?
ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేమలు రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8న, తమిళ వెర్షన్ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
ప్రేమలు కథేంటి?
‘ప్రేమలు’ సినిమాను దర్శకుడు గిరీష్.. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు. కథలోకి వెళ్తే.. సచిన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఓ వేడుకలో అతడికి రీనూ పరిచయం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు సచిన్. అప్పటికే లవ్‌లో ఓ సారి ఫెయిలైన సచిన్. .రీనుకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తున్న ఆది ఎవరు? భిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన సచిన్ - రీనూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మార్చి 19 , 2024
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ లవ్ అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం.
దిల్ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్
నితీన్ హీరోగా చేసిన ‘దిల్’ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుకు సుకుమార్ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్ అయిన అతడు.. ‘దిల్’ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్’.. బ్లాక్ బాస్టర్ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడింది.
మిస్ చేసుకున్న అల్లరి నరేష్
ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్ ‘100%లవ్’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్ అన్నారు.
https://twitter.com/i/status/1787548147520061468
బన్నీని అలా ఫైనల్ చేశారు!
ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్ మూవీ స్పెషల్ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్ చలాకీ తనం, కామెడీ టైమింగ్ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్ రాజుతో సుకుమార్ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్ కావడంతో సినిమా పట్టాలెక్కింది.
అసిస్టెంట్‌గా చేసిన స్టార్ డైరెక్టర్
కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్ లవ్ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.
https://twitter.com/i/status/1787674074585714980
120 రోజుల్లో షూటింగ్ పూర్తి
ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే పూర్తి చేశారు. అటు సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్.. మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.
ఆర్యతో వారికి స్టార్‌డమ్
ఆర్య సినిమా సక్సెస్.. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్, డ్యాన్స్, గ్రేస్, యాక్షన్ చూసి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
మే 07 , 2024