• TFIDB EN
  • కథనం
    UATelugu1h 57m
    సినీ డైరెక్టర్ అయిన అను.. తన నిర్మాత కోసం ఓ కథ రాస్తుంది. అయితే ఆ కథలోని పాత్రలు నిజ జీవితంలో వరుసగా చనిపోతుంటాయి. ఈ మిస్టరీ ఛేదించేందుకు అను ఓ ఏసీపీ రణధీర్ సాయం కోరుతుంది. మరి ఈ హత్యలు ఎవరు చేశారనేది ట్విస్ట్.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అనసూయ భరద్వాజ్
    అను
    ధనరాజ్
    ధన
    రణధీర్ గట్లACP రణధీర్
    వెన్నెల కిషోర్
    CK అలియాస్ క్రియేటివ్ కిషోర్
    శ్రీనివాస్ అవసరాల
    శ్రీనివాస్ అవసరాల
    పృథివీరాజ్
    సమీర్
    DCP ప్రకాష్
    సంపూర్ణేష్ బాబు
    స్వయంగా అతిధి పాత్ర
    సిబ్బంది
    రాజేష్ నాదెండ్లదర్శకుడు
    బి. నరేంద్ర రెడ్డినిర్మాత
    రోషన్ సాలూరుసంగీతకారుడు
    కథనాలు
    <strong>Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!</strong>
    Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి హిట్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) చేస్తోన్న చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం, సైఫ్ అలీఖాన్‌ లాంటి దిగ్గజ నటుడు విలన్‌ పాత్ర పోషిస్తుండటం సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది. చక చకా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో తారక్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తుండటంతో అసలు ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అని నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ‘దేవర’ స్టోరీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీని కుదిపేసిన యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ఘటన? దేవర స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘దేవర’ స్టోరీ అదేనా? 'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.&nbsp; టీడీపీని ఇరకాటంలో పడేస్తుందా? 1985లో 'కారంచేడు ఘటన' జరిగినప్పుడు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన దళితుల కోసం చాలా కొత్త చట్టాలను తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇది ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా ఉండిపోయింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అప్పటి రక్తం మరకలు టీడీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ‘దేవర’ సినిమాతో మరోమారు ఈ అంశం తెరపైకి వస్తే ఇది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఇరాకటంలో పడేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా తెలుగు దేశం పార్టీ, బాలకృష్ణతో ఎన్టీఆర్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాలో కారంచేడు ఘటనను చూపిస్తే ఈ దూరం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; సోషల్‌ మెసేజ్‌ తప్పనిసరి! తెలుగులో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో కొరటాల శివ (Koratala Siva) ఒకరు. ఆయన ఇప్పటివరకూ తీసిన ప్రతీ సినిమాలోనూ ఏదోక సందేశాన్ని ఇస్తూనే వచ్చారు. లేదంటే సామాజిక అంశాన్నైనా టచ్‌ చేస్తూ వచ్చారు. ‘మిర్చి’ చిత్రంలో ఫ్యాక్షన్‌ గొడవలను, ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ‘జనతా గ్యారేజ్‌’లో బలహీనులకు అండగా నిలబడటం, ‘భరత్‌ అనే నేను’ సినిమాలో రాజకీయాల్లో జవాబుదారి తనం, ‘ఆచార్య’ చిత్రంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని చూపించారు. అలాగే ‘దేవర’ కథలో కారంచేడు విషాద ఘటన తాలూకా సీన్లు ఉండే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; మూడో సాంగ్‌ వచ్చేస్తోంది.. దేవర సినిమా నుంచి సెప్టెంబర్ 4వ తేదీన మూడో పాట రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ పోస్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.&nbsp; 'దావుడి' అంటూ ఈ డ్యూయోట్‌ సాంగ్‌ సాగనున్నట్లు తెలిపింది. ‘ఇది కచ్చితంగా అదిరిపోతుంది. ప్రతీ బీట్‍ కూడా విజిల్ వేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న దావుడి’ అంటూ సోషల్ మీడియాలో దేవర టీమ్ రాసుకొచ్చింది. తాజా పోస్టర్‌లో తారక్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో ఉండగా వైట్‌ కలర్‌ డ్రెస్‌లో జాన్వీ మెస్మరైజ్‌ చేసింది. తారక్‌ అలా వెనక్కి వాలుతుండగా ఆయనను జాన్వీ రొమాంటిక్‍గా పట్టుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. https://twitter.com/DevaraMovie/status/1830601323152289828 తారక్‌ పెద్ద మనసు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా తారక్‌ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తాను కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కష్ట కాలంలో అండగా నిలిచిన ఈ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; https://twitter.com/tarak9999/status/1830825968820244827 https://twitter.com/VishwakSenActor/status/1830826016509759684 https://twitter.com/VishwakSenActor/status/1830830975905079307
    సెప్టెంబర్ 03 , 2024
    Halloween 2022: మీ ప్రేయసితో కలిసి చూడదగ్గ 10 హారర్‌ సినిమాలు
    Halloween 2022: మీ ప్రేయసితో కలిసి చూడదగ్గ 10 హారర్‌ సినిమాలు
    ]భిన్నమైన కథ, కథనం, కెమెరా పనితీరు, సినిమాటోగ్రఫీ, డార్క్‌ మ్యూజిక్‌తో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు మిస్కిన్‌. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని భయపెట్టి మీ మనసు దోచుకుంటుందిపిశాచి- Hotstar
    ఫిబ్రవరి 11 , 2023
    Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
    Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
    ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య  తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం. నటీనటులు విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్. కథ సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ సినిమా ఎలా ఉందంటే? ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్‌ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది.&nbsp; మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో&nbsp; ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే?  హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది.  వైవిధ్యమైన పాత్రలో  కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది.  సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్‌ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా సినిమా టెక్నికల్‌ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్‌ పనిచెబితే బాగుండేది. బలాలు కథనం ప్రీ క్రైమాక్స్ డైరెక్షన్ బలహీనతలు తొలి 20 నిమిషాలు బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్ Telugu.yousay.tv Rating: 3.5/5
    మార్చి 30 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.&nbsp; భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman&nbsp;MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon&nbsp;March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యూత్‌.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్‌ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్‌ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్‌ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్‌ రొమాంటిక్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; When Harry Met Sally (1989) నటి నటులు: మెగ్ ర్యాన్‌, బిల్లీ క్రిస్టల్‌ డైరెక్టర్‌ : రాబ్‌ రీనర్‌ ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్‌ చేసిన హ్యారీ, సాలీ.. న్యూయార్క్‌లో కలుసుకుంటారు. అప్పటికే వారు ప్రేమలో విఫలమై ఉన్నందు వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక పురుషుడు, స్త్రీ లైంగిక సంబంధం లేకుండా స్నేహితులుగా ఉండగలరా? అన్న ప్రశ్న వారికి ఎదురవుతుంది. దానికి వారు ఏం సమాధానం చెప్పారు? అన్నది స్టోరీ. Sleepless in Seattle (1993) నటినటులు : టామ్‌ హ్యాన్క్స్‌, మెగ్‌ ర్యాన్ డైరెక్టర్‌ : నోరా ఎప్రాన్‌ శ్యామ్‌ భార్య చనిపోవడంతో అతడు కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతడు ఓ టీవీ షోలో పాల్గొంటాడు. రిపోర్టర్‌ అన్నీ రీడ్‌.. అతడి మాటలకు ఆకర్షితురాలవుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రేమికుల రోజున అతడికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? వారు కలుసుకున్నారా? లేదా? అన్నది స్టోరీ. The Notebook (2004) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, రచెల్‌ మెక్‌ ఆడమ్స్‌ డైరెక్టర్‌ : నిక్‌ క్యాసావెట్స్‌ నోహ్‌ కాల్హౌన్‌ అనే యువకుడు అల్లీ అనే సంపన్న యువతిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం తరపున పోరాడేందుకు యుద్ధ భూమికి వెళ్తాడు. తమ ప్రేమ ముగిసిందని భావించిన అల్లీ మరోక వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నోహ్‌ తిరిగి రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.&nbsp; Titanic (1997) నటినటులు : లియోనార్డో డికాప్రియా, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : జేమ్స్‌ కామెరాన్ రోజ్‌కు సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆమె తనకు కాబోయే భర్తతో టైటానిక్‌ షిప్‌లో ప్రయాణిస్తుండగా అక్కడ జాక్ అనే యువకుడ్ని ప్రేమిస్తుంది. ఓ ఉపద్రవం వారిద్దరినీ వేరు చేస్తుంది. రోజ్‌ కోసం జాక్‌ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. Titanic (1997) Directed by James Cameron Shown from left: Leonardo DiCaprio, Kate Winslet La la land (2016) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, ఎమ్మా స్టోన్‌ డైరెక్టర్‌ : డామీన్‌ చాజెల్లె సంగీతకారుడు సెబాస్టియన్‌, నటి మియా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే వారి కీర్తి పెరిగే కొద్ది వారి మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. కొందరు వ్యక్తులు వారి ప్రేమను బలహీన పరుస్తారు. చివరికి వారు ఒక్కటిగా ఉన్నారా? లేదా? Carol (2015) నటీనటులు : కేట్‌ బ్లాన్‌చెట్‌, రూనీ మారా డైరెక్టర్‌ : టాడ్ హేయ్‌నెస్‌ 1950లో ఫొటోగ్రాఫర్‌ థెరిస్‌.. కరోల్‌ అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె విచారంగా ఉండటాన్ని గమనించి కరోల్‌కు విడాకులైన విషయాన్ని తెలుసుకుంటాడు. థెరిస్‌ను రోజూ కలుస్తూ ఆమెకు దగ్గరవుతాడు. వారు ఒక్కటయ్యే క్రమంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నైతిక పోరాటం చేస్తారు.&nbsp; Eternal Sunshine of the Spotless Mind (2004) నటీనటులు: &nbsp;జిమ్‌ క్యారీ, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : మైఖేల్‌ గాండ్రీ జోయెల్‌, క్లెమెంటైన్‌ ఒకరినొకరు ప్రేమించుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. జ్ఞాపకాలను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాము ఇప్పటికీ డీప్‌గా లవ్‌ చేసుకుంటున్నట్లు గ్రహించడంతో కథ మలుపు తిరుగుతుంది.&nbsp; The Curious Case of Benjamin Button (2008) నటినటులు: బ్రాడ్‌ పిట్‌, కేట్‌ బ్లాన్‌చెట్‌ డైరెక్టర్ : డేవిడ్‌ ఫిన్‌చెర్‌ బెంజమన్‌ బటన్‌ ఒక అరుదైన సమస్యతో జన్మిస్తాడు. పుట్టడమే వృద్ధుడి శారీరక స్థితితో జన్మించిన అతడు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రివర్స్‌లో అతడి ఏజ్‌ తగ్గుతూ వస్తుంది. బెంజమన్‌.. డైసీ అనే డ్యాన్సర్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. కాలం గడుస్తున్న కొద్ది వారి వయసులు పరస్పరం విరుద్దంగా మారుతుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.&nbsp; 500 Days of Summer (2009) నటీనటులు : జోసెఫ్ గార్డన్‌, జూలీ డెస్‌చానెల్‌ డైరెక్టర్‌ : మార్క్ వెబ్‌ టామ్ ఒక గ్రీటింగ్ కార్డ్‌ రైటర్‌. అతడు సమ్మర్‌ తర్వాత తన ప్రేయసితో విడిపోతాడు. అయితే వేసవిలో ఆ 500 రోజులు ఆమెతో ఎలా గడిపానన్న విషయాన్ని టామ్‌ సమీక్షించుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహిస్తాడు.&nbsp; ‘Before’ Trilogy (1995 – 2013) నటీనటులు : ఈథన్‌ హావ్‌కే,&nbsp; జూలీ డెల్పీ డైరెక్టర్‌ : రిచర్డ్‌ లింక్‌లేటర్‌ ‘బిఫోర్ ట్రయాలజీ’.. హాలీవుడ్‌లోని ఉత్తమ రొమాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీ. ఆ సంస్థ నుంచి వచ్చిన&nbsp; ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunset), ‘బిఫోర్ సన్‌సెట్’ (Before Midnight), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (Before Midnight) మూవీస్‌ అద్భుతమైన రొమాంటిక్‌ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడు సినిమాలు జెస్సీ, సెలిన్ ప్రేమకథల చుట్టు తిరుగుతుంది.&nbsp; Never Let me go (2010) నటీనటులు : క్యారి ముల్లీగన్‌, ఆండ్రూ గర్‌ఫీల్డ్‌, కియారా నైట్లీ, ఎల్లా పుర్నెల్‌ డైరెక్టర్‌: మార్క్‌ రోమనెక్‌ రూత్, కాథీ, టామీ ఓ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటారు. లవ్‌కు సంబంధించిన బాధాలను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఆ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది కథ.&nbsp; Pride &amp; Prejudice (2005) నటీనటులు: కీరా నైట్లీ, మ్యాథ్యూ, కారే ముల్లిగన్‌, రోసముండ్‌ పైక్‌, సిమన్‌ వుడ్స్‌ తదితరులు డైరెక్టర్‌ : జో వ్రైట్ ఇది బెన్నెట్ అనే మహిళకు పుట్టిన నలుగురు కుమార్తెల కథ. ధనవంతులైన భర్తలు కావాలని ఆమె కూతుర్లు పట్టుబడతారు. మరి వారి కలలు ఎలా నెరవేరాయి? వారు ఎలాంటి భర్తలను పొందారు? అన్నది కథ.&nbsp; Broke back mountain (2005) నటీనటులు : హీత్‌ లెడ్జర్‌, జేక్‌ గైలెన్‌హాల్‌, మిచెల్లె విలియమ్స్‌, అన్ని హాథ్‌వే డైరెక్టర్‌ : ఆంగ్‌ లీ ఇద్దరు గొర్రెల కాపరులు.. ఎన్నిస్, జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. లైంగిక, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారిద్దరూ తమ స్నేహితులను వివాహం చేసుకోవడంతో బంధం క్లిష్టంగా మారుతుంది. Dirty Dancing (1987) నటీ నటులు : పాట్రిక్‌ స్వేజీ, జెన్నిఫర్ గ్రే డైరెక్టర్‌ : ఎమిలీ ఆర్డొలినో ఫ్రాన్సిస్‌ తన తల్లిదండ్రులతో విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఓ రిసార్టులోని డ్యాన్స్‌ మాస్టర్‌తో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను యువతి తండ్రి తిరస్కరిస్తాడు. మరి వారు ఒక్కటయ్యారా? Call Me By Your Name (2017) నటీనటులు : టైమోథీ చలామెట్‌, అర్మీ హామర్‌ డైరెక్టర్‌ : లుకా గ్వాడాగ్నినో 1983 వేసవి కాలంలో కథ జరుగుతుంది. 17 ఏళ్ల ఎలియో పెర్ల్‌మాన్.. తన తండ్రి సహాయకుడు ఆలివర్‌ను ఇష్టపడుతుంది. వారు ఆ వేసవిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే, ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.&nbsp; Shakespeare in Love (1998) నటీనటులు : జోసెఫ్‌ ఫ్లెన్నస్‌, గ్వినేత్ పాల్ట్రో డైరెక్టర్‌ :&nbsp; జాన్‌ మాడెన్‌ విలియం షేక్‌ స్పియర్‌.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒక అందమైన యువతిని చూసి ప్రేరణ పొందుతాడు. ఓ నాటకం రాయడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో వారు శరీరకంగా దగ్గరవుతారు. అయితే యువతి చేసిన పని వల్ల వారి జీవితాలు తలకిందులవుతాయి.&nbsp; The fault in our Star (2014) నటీనటులు : షాయ్‌లెనె వూడ్లీ, అన్సెల్‌ ఎల్గర్ట్‌ డైరెక్టర్‌ : జోష్‌ బూన్‌ హాజెల్, అగస్టస్ అనే ఇద్దరు క్యాన్సర్ బాధితులు.. క్యాన్సర్ సపోర్టు గ్రూప్‌ ద్వారా కలుసుకుంటారు.&nbsp; త్వరలోనే వారు ప్రేమలో పడతారు. కష్టకాలంలో వారు ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. అయితే విధి వారిపై కన్నెర్ర చేస్తుంది. . Four Weddings and a Funeral (1994) నటీనటులు : హ్యూజ్‌ గ్రాన్ట్‌, ఆండీ మెక్‌డొవెల్‌ డైరెక్టర్‌ : మైక్‌ నెవెల్‌ ఇంట్రోవర్ట్‌ అయిన చార్లెస్‌.. అమ్మాయిలను దురదృష్టంగా భావిస్తుంటాడు. ఒక పెళ్లిలో క్యారీ అనే అందమైన యువతిని చార్లెస్‌ చూస్తాడు. ఆ అమ్మాయి తనకు అదృష్ట దేవత కాగలదని విశ్వసిస్తాడు. మరి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చార్లెస్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.&nbsp;
    ఫిబ్రవరి 10 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.&nbsp; https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.&nbsp; https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.&nbsp; https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    Game Changer Record: ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి భారతీయ పాటగా గుర్తింపు.. ఆ పాట ఏదంటే?
    Game Changer Record: ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి భారతీయ పాటగా గుర్తింపు.. ఆ పాట ఏదంటే?
    శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) గురించి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా, దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రతి పాటను ఎంతో విశిష్టంగా రూపొందించడమే కాకుండా, వాటి విజువల్స్‌ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయనున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో ఆ పాటల విశేషాలు, వాటి వెనుక ఆసక్తికర విషయాలను చూద్దాం. 1. ‘జరగండి.. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘జరగండి.. జరగండి..’ గ్రాండ్‌ విజువల్స్‌తో అలరిస్తోంది. 70 అడుగుల ఎత్తయిన కొండ, గ్రామీణ వాతావరణంలో నిర్మించిన విలేజ్‌ సెట్‌లో ఈ పాటను షూట్‌ చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, సెట్‌లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్‌ సహా, ఇతర వస్తువులు పూర్తిగా పర్యావరణహితమైన జనపనారతో తయారు చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 13 రోజుల పాటు జరిగిన చిత్రీకరణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. https://www.youtube.com/watch?v=45vS1-xtnp8&amp;pp=ygUYamFyYWdhbmRpIGphcmFnYW5kaSBzb25n 2. ‘రా మచ్చా ఈ పాట యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ‘రా మచ్చా..’ పాటలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు. గుస్సాడీ (ఆదిలాబాద్‌), చావ్‌ (పశ్చిమ బెంగాల్‌), ఘూమ్రా (ఒడిశా), గోరవర (కర్ణాటక) వంటి ప్రాంతీయ నృత్యాలు ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. పాట విజువల్స్‌ గ్రాండ్‌గా ఉండేలా రూపొందించారు. https://www.youtube.com/watch?v=QeMeM87O1ns&amp;pp=ygUgcmEgbWFjaGEgbWFjaGEgZ2FtZSBjaGFuZ2VyIHNvbmc%3D 3. ‘నానా హైరానా..’ శంకర్‌ చిత్రాలకు తగినట్టు ఈ సినిమాకు కూడా సాంకేతికతలో కొత్తదనాన్ని చేర్చారు. ‘నానా హైరానా..’ పాటను తొలిసారి ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా ద్వారా చిత్రీకరించారు. న్యూజిలాండ్‌ అందమైన లొకేషన్లలో తీసిన ఈ మెలోడీ పాటకు మనీశ్‌ మల్హోత్ర కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పాట చిత్రీకరణ వేదికపై అద్భుతంగా కనిపించనుంది. https://www.youtube.com/watch?v=EqDlrimnMCE&amp;pp=ygUebmFuYSBoYXJ5YW5hIGdhbWUgY2hhbmdlciBzb25n 4. ‘దోప్‌’ కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో రష్యా నుంచి 100 మంది ప్రొఫెషనల్‌ డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో రప్పించి ‘దోప్‌’ పాటను రామోజీ ఫిల్మ్‌ సిటీలో 8 రోజుల్లో చిత్రీకరించారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు కూడా మనీశ్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో విడుదలై సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. https://www.youtube.com/shorts/Y131i3ji8oE 5. థ్రిల్‌ పంచే ఐదో పాట ప్రస్తుతం విడుదలైన నాలుగు పాటలు మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఐదో పాటను ప్రేక్షకులు సినిమాను చూస్తున్న సమయంలోనే అనుభవించనున్నారు. ఈ పాట సినిమా క్లైమాక్స్‌లో థ్రిల్‌ పంచుతుందని చిత్రబృందం వెల్లడించింది. ‘గేమ్‌ ఛేంజర్‌’ పాటలు సంగీతం, విజువల్స్‌, నృత్యాలతో ప్రత్యేకతను కలిగించి ప్రేక్షకుల మన్ననల్ని గెలుచుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి పాటకూ ఉన్న ప్రత్యేకత ఈ సినిమాను ప్రేక్షకుల్లో మరింత ఆసక్తికరంగా నిలపనుంది. జనవరి 10న ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాటలు వెండితెరపై ఎలా ఆకట్టుకుంటాయో చూడాల్సిందే!
    జనవరి 02 , 2025
    <strong>UI Movie Dialogues: జీవిత పాఠాలు నేర్పే టాప్ 20 ఉపేంద్ర మార్క్‌ డైలాగ్స్‌</strong>
    UI Movie Dialogues: జీవిత పాఠాలు నేర్పే టాప్ 20 ఉపేంద్ర మార్క్‌ డైలాగ్స్‌
    కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కొత్త తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘A’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ష్‌.’. చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఆ సినిమాల్లోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్‌ అయ్యాయి. తాజాగా ఉపేంద్ర చేసిన 'యూఐ' (UI Movie) చిత్రం కూడా అదే ప్యాట్రన్‌లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ సినిమాలోనూ ఉపేంద్ర మార్క్‌ డైలాగ్స్‌ (UI Movie Dialogues In Telugu) ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  టైటిల్‌ కార్డ్స్‌ సమయంలో..&nbsp; ‘యూఐ’ సినిమా మెుదలవ్వగానే (UI Movie Dialogues In Telugu) అందులో మరో సినిమాను చూపించారు. దాని పేరు కూడా 'యూఐ'నే. టైటిల్స్‌ కార్డ్స్‌ సమయంలో వచ్చే డిస్‌క్లైమర్‌ అందరినీ షాక్‌కు గురిచేస్తుంది.  'మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుంచి బయటకు వెళ్లండి'&nbsp; 'మీరు ఫూల్‌ అయితేనే.. సినిమా మెుత్తం చూడండి' ‘తెలివైన వాళ్లు సినిమా చూసి ఫూల్స్‌ అవుతారు.. ఫూల్స్‌ తెలివైనవారిగా మారిపోతారు’ https://twitter.com/MilagroMovies/status/1869978504915480935 సెన్సార్‌ సభ్యుడి డైలాగ్ ‘యూఐ’ చూసిన ఆడియన్స్‌ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ మూవీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సైతం మెుదలవుతాయి. అసలు ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది ఎవరని ఉన్నతాధికారి ప్రశ్నిస్తాడు. అప్పుడు సెన్సార్ సభ్యుడు ఇచ్చే వివరణ ఆసక్తికరంగా ఉంటుంది.  ‘సార్‌.. ఈ సినిమా సెన్సార్‌ అయ్యి చాలా డేస్‌ అయ్యింది. మన టీమ్‌ వారు 25 టైమ్స్‌ చూశారు' 'మేము అడల్ట్‌ సినిమాకు A సర్టిఫికేట్‌, ఫ్యామిలీ అయితే U, వైలెన్స్ ఉంటే U/A ఇస్తాం సార్‌’ ‘కానీ ఈ సినిమాకు UI ఇచ్చాం సార్‌. అంటే యూనివర్శల్ ఇంటిలిజెంట్‌ సర్టిఫికెట్‌' ఉపేంద్ర ఇంట్రడక్షన్‌ సీన్‌.. సత్య (ఉపేంద్ర) ఇంట్రడక్షన్‌ సీన్‌లో రౌడీలు అతడ్ని కొడుతుంటారు. ఓ వ్యక్తి చేసిన తప్పుకు వారి చేతుల్లో తన్నులు తిని వెళ్లిపోతాడు. అప్పుడు స్థానికుల నుంచి ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌ ఇప్పటి హీరోలకు సెటైరికల్‌గా అనిపిస్తుంది.  ‘నలుగురిని కొట్టి బిల్డప్ ఇచ్చే ఈ కాలంలో అదే నలుగురి కోసం కొట్టించుకునే దమ్ము, ధైర్యం ఉన్న అతడేరా (ఉపేంద్ర) నిజమైన హీరో’ మంచి, చెడుల ఉపేంద్ర మార్క్ డైలాగ్‌ ఇందులో కల్కి (UI Movie Dialogues In Telugu) అనే మరో క్రూరమైన పాత్రలో ఉపేంద్ర నటించాడు. మంచి విలువలతో జీవించే వారిని టార్గెట్‌ చేస్తూ చంపేస్తాడు. ఈ క్రమంలో మంచి తల్లిదండ్రులను చంపేస్తాడు. అనంతరం వారి బిడ్డతో చెప్పే డైలాగ్‌ థియేటర్లలో విజిల్స్‌ వేయించాయి.  'ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. మంచోడు అవ్వాలంటే రోజు చస్తూ బతకాలి' 'నువ్వు నీలా బతకాలంటే చెడ్డోడివి అవ్వు.. నాలాగా. చెడ్డపనులు చేస్తూ సంతోషంగా ఉండు. జనం కూడా నీకు జేజేలు కొడతారు’ 'ఫ్యామిలీ హీరో అవ్వాలనీ ట్రై చేయకు.. కమర్షియల్‌ మాస్‌ హీరో అవ్వు' వేశ్యలతో చెప్పే డైలాగ్‌ కల్కి (ఉపేంద్ర) ఓ వేశ్య ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న పురుషులు అందర్నీ చంపేస్తాడు. అనంతరం అక్కడ వైశ్యలను తీసుకెళ్లి బందిస్తాడు. ఆ సమయంలో వేశ్యలతో చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా అనిపిస్తుంది.&nbsp; 'పండు కొరక్కముందు.. ఆడది పైట చాచకముందు.. విలువ ఎక్కువ.. గుర్తుపెట్టుకోండి' మనిషి వ్యక్తిత్వంపై డైలాగ్‌ కల్కి, సత్య తొలిసారి ఎదురుపడినప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్‌ ఆసక్తికరంగా ఉంటాయి. మనుషులు గొప్పవారని మంచి, చెడు గురించి ఆలోచిస్తారని.. పశువులు అలా కాదని మంచివాడైన సత్య అంటాడు. అప్పుడు కల్కి చెప్పే డైలాగ్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది.&nbsp; 'జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి.. సీజన్‌ వస్తేనే సెక్స్‌ చేస్తాయి' 'మనిషి కడుపు నిండినా కూడా ఇంకా కావాలంటాడు. వాడి అత్యాశకు అంతే లేదు' 'మనుషుల సెక్స్‌కు సీజన్స్‌ లేవు. అన్నీ సీజన్స్‌లో చేసుకుంటూనే ఉంటారు. అదీ చాలక అత్యాచారాలు, రేప్‌లు' ‘జంతు ప్రపంచంలో రేప్‌లు, హత్యలు, యాసిడ్‌ అటాక్స్‌, జాతులు, ధర్మాలు, మంచి, చెడు, చిన్న పెద్ద, పాలిటిక్స్ ఇవేమి ఉండవు' జనాల సైకాలజీపై డైలాగ్‌.. ప్రజల మనస్తత్వం గురించి కల్కి (ఉపేంద్ర) ఓ సీన్‌లో సాయి కుమార్‌ సోదరుడు రవి శంకర్‌తో చెబుతాడు. ఆ డైలాగ్‌ ఏంటో ఓ లుక్కేయండి.  'జనాల సైకాలజీ ఏంటో తెలుసా? కడుపుకి వారం రోజులు ఫుడ్‌ లేకపోయినా కామ్‌గా పడుంటారు.&nbsp; ‘అదే బ్రెయిన్‌కు ఫుడ్‌ లేకపోతే విలవిల లాడిపోతారు.. వాళ్ల బ్రెయిన్‌కు ఫుడ్‌ రెడీ చేశాను’ (అనంతరం రాసలీలల వీడియోను సోషల్‌ మీడియా వైరల్‌ చేస్తాడు) దేవుడిపై చెప్పే డైలాగ్‌ దేవుడి లేని సమాజాన్ని (UI Movie Dialogues In Telugu) సత్య సృష్టిస్తాడు. అక్కడికి వెళ్లిన కల్కి దేవుడి గురించి చెప్పి ప్రశాంతంగా ఉన్న వారి మనుసులో చిచ్చుపెడతాడు. దీంతో అక్కడి ప్రజలు దేవుడ్ని చూపించాలని సత్యను నిలదీస్తారు. అప్పుడు వచ్చే డైలాగ్స్‌ ఆలోజింపచేసేలా ఉంటుంది.&nbsp; 'దేవుడి నుండి మతం.. మతం నుంచి జాతి.. జాతి నుంచి పెద్ద, చిన్న.. ఆపై సంఘర్షణ.. ఇవన్నీ అవసరమా' ప్రజల బాధ్యతపై వచ్చే డైలాగ్‌ 'జనం అచ్చం తేనేటీగలు లాగానే, డబ్బు అనే తేనే సంపాదించి గవర్నమెంట్ అనే రాణి ఈగ బ్యాంకులో దాస్తారు' 'బ్యాంకులు మీకు 5%, 6% వడ్డీకి ఇస్తామని దానిని కార్పోరేట్‌ కంపెనీలకు వడ్డీకి ఇస్తే వాళ్లు దానిని విదేశాలకు ఎత్తుకు పోతారు' దేశాన్ని పాలించడానికి మళ్లీ డబ్బు కావాలి.. అందుకోసం దానికి ఆ ట్యాక్స్‌, ఈ ట్యాక్స్‌ అని మళ్లీ జనం దగ్గరే వసూలు చేస్తారు' 'ఈ విషయాల నుంచి ప్రజల్ని మళ్లించడానికి వారే సృష్టించిన మీడియా వాళ్లు వేరే వేరే ఎమోషన్స్ ఉన్న కథల్ని డైలీ బేసిస్‌లో&nbsp; జనాలపై వదులుతూనే ఉంటారు' సెలబ్రిటీల ప్రైవసీపై డైలాగ్‌.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై (UI Movie Dialogues In Telugu) ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడాన్ని తన దైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ‘కల్కి’ చెబుతాడు.&nbsp; 'ప్రజల దగ్గర ఉన్న తేనేను తీసుకొని ఈ పెద్దోళ్లు వారి జీవితాలను చప్పగా మార్చేశారు' 'వాళ్లకి&nbsp; తియ్యటి వార్తలు కావాలి. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీల వార్తలను సొల్లు కారుస్తూ చూస్తారు'
    డిసెంబర్ 23 , 2024
    <strong>Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!</strong>
    Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!
    2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాలు దేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసు దోచాయి. ప్రతిసారి హీరోల స్టార్ పవర్‌తోనే కాకుండా, కథనం, పాటలు, సంగీతం వంటి అంశాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్లో నిలిపాయి. ఈ సంవత్సరంలో పలు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. హనుమాన్, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు ఈ జాబితాలో చేరి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇప్పుడు 2024లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ప్రధాన తెలుగు చిత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. హనుమాన్ (Hanuman): తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టి. సంక్రాంతి సందర్భంగా విడుదలై, దేశవ్యాప్తంగా సుమారు రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్టార్ హీరోల అవసరం లేకుండానే, మంచి కథ, దర్శకత్వం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. 2. టిల్లు స్క్వేర్ (Tillu Square): సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం, 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా విడుదలైంది. చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. 3. కల్కి 2898 AD (Kalki 2898 AD): ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, జూన్‌లో విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఆరోవది కావడం విశేషం. 4. సరిపోదా శనివారం (Saripoda Sanivaram): నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నానికి మరో విజయాన్ని అందించింది. 5. దేవర (Devara): ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 6. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar): దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. 7. పుష్ప 2 (Pushpa 2): అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలై రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు (రూ.280 కోట్లు)సాధించిన తొలి చిత్రంగా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 8. సలార్ (Salaar): ప్రభాస్ నటించిన ఈ చిత్రం, 2023 డిసెంబర్‌లో విడుదలైనప్పటికీ, 2024లో కూడా గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్‌కు మరో విజయాన్ని అందించింది. 9. అమరన్ (Amaran): శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం, తమిళనాట విడుదలై, పాన్ ఇండియావైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది. 10. గోట్ (G.O.A.T): విజయ్ నటించిన ఈ చిత్రం, పలు చోట్ల మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, విజయ్‌కు మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
    డిసెంబర్ 19 , 2024
    <strong>Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్‌ యానిమేషన్‌ చిత్రం 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్‌ 20న రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్‌ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్‌ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్‌’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.&nbsp; అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్‌ గార్డ్‌’ కామిక్‌ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్‌ రూపంలో ఈ టెలివిజన్‌ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం. టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్‌’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్‌ కింగ్‌’ పేరుతో 1994లో కార్టూన్‌ యానిమేషన్‌ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.&nbsp; ఆ తర్వాత 2016లో ‘ది లయన్‌ కింగ్‌’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్‌ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసింది.&nbsp; 'ది లయన్‌ కింగ్‌' (2019) వరల్డ్‌ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.&nbsp; ఇప్పుడు ది లయన్‌ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్‌ కింగ్‌ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (2019), ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్‌ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్‌ స్టార్స్‌ వర్క్ చేశారు.&nbsp; అరోన్‌ పీరే (ముఫాసా), డొనాల్డ్‌ గ్లోవర్‌ (సింబా), బియాన్స్‌ (నాలా), బ్లూ ఇవి కార్టర్‌ (కియారా), జాన్‌ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్‌ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు. ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్‌ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ యానిమేషన్‌ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.&nbsp; ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.  2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ముఫాసా తెలుగు వెర్షన్‌ ఈసారి మరింత హైలేట్‌ కాబోతోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దీంతో మహేష్‌ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300 ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో స్టార్‌ కమెడియన్స్‌ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్‌ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.  https://twitter.com/thetalkenti/status/1866815051316785331 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్‌ పాత్రలకు వారు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.&nbsp; తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పారు. అర్జున్‌ దాస్‌ (ముఫాసా), అశోక్‌ సెల్వన్‌ (టాకా), నాజర్‌ (కిరోస్‌), వీటీవీ గణేష్‌ (యంగ్‌ రఫీకీ), సింగం పులి (టిమన్‌) డబ్బింగ్‌ చెప్పారు.  https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209 హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి.
    డిసెంబర్ 18 , 2024
    <strong>OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!</strong>
    OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!
    క్రిస్మస్‌ (Christmas 2025)ను పురస్కరించుకొని ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్‌ మూడో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు.. బచ్చల మల్లి (Bachchala Malli) అల్లరి నరేశ్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20న (Bachhala Malli Movie Release Date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. విడుదల పార్ట్‌ 2 (Vidudala Part 2) గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి ఈ వారం థియేటర్లలో సీక్వెల్‌ రాబోతోంది. సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల పార్ట్‌ 2’ (Viduthalai Part 2) డిసెంబర్‌ 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.  సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) కమెడియన్‌ ప్రియదర్శి (Priyadarsi) కథానాయకుడిగా చేసిన ‘సారంగపాణి జాతకం’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్‌ 20 నుంచి థియేటర్లలో ఈ సినిమాను వీక్షింవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూప కొడువాయూర్‌ (Roopa Koduvayur) హీరోయిన్‌గా చేసింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్‌, టీజర్‌ను బట్టి చూస్తే ఫన్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  యూఐ (UI) కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్‌ కేపీ శ్రీకాంత్‌ నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా, సంగీతం పరంగా కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఓటీటీలో విడుదల్లే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు లీలా వినోదం (Leela Vinodam) ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'లీలా వినోదం'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో ఈ వీక్‌ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. డిసెంబర్‌ 19 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనుంది. జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ హీరోలుగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ హీరోయిన్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్‌ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.  Telugu Movies OTT Release Dates 2024 TitleCategoryLanguagePlatformRelease DateZebraMovieTelugu&nbsp;AhaDec 20Leela VinodamSeriesTelugu&nbsp;ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu&nbsp;AmazonDec 13HarikathaSeriesTelugu&nbsp;Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu&nbsp;ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu&nbsp;AhaDec 12Thangalaan&nbsp;MovieTelugu&nbsp;NetflixDec 10 OTT Releases This Week 2024 TitleCategoryLanguagePlatformRelease DateInigmaMovieEnglishNetflixDec 17Love to hate it juliasMovieEnglishNetflixDec 17Stepping StonesDocumentaryEnglishNetflixDec 18The Dragan PrinceSeriesEnglishNetflixDec 18Virgin River 6SeriesEnglishNetflixDec 19The Six Triple EightMovieEnglishNetflixDec 20Yo Yo HoneysinghDocumentaryHindiNetflixDec 21Girls Will Be GirlsMovieHindiAmazonDec 18Beast GamesMovieEnglishAmazonDec 18TwistersMovieEnglishJio CinemaDec 18Moon WalkMovieHindiJio CinemaDec 20TelmaMovieEnglishSonyLIVDec 21
    డిసెంబర్ 16 , 2024
    <strong>Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్‌ సర్కార్‌ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?&nbsp;</strong>
    Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్‌ సర్కార్‌ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?&nbsp;
    తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్‌ (Tollywood)ను రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌ చేసిందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం నాగార్జున విషయంలో మెుదలైన ఈ ప్రచారం తాజాగా అల్లు అర్జున్‌ నేపథ్యంలో మరోమారు ఊపందుకుంది. రేపో మాపో మోహన్ బాబు అరెస్టు కూడా తథ్యం అన్న వార్తలు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలకు తన పవర్‌ ఏంటో రుచి చూపించాలని రేవంత్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్‌ అరెస్టు సందర్భంగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్‌ ప్రభుత్వంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  బన్నీ అరెస్టు నేపథ్యంలో.. అల్లు అర్జున్‌ (Allu Arrest) అరెస్టు నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సర్కార్‌ ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతకుముందు రేవంత్‌ నుంచి ఎదురైన ప్రతీకూల సంఘటనలకు బన్నీ అరెస్టును ముడిపెట్టి చూసినప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. బన్నీ అరెస్టుపై నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఫిల్మ్‌ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ‘చట్టం ముందు అందరూ సమానులే’.. ‘సినిమావాళ్లు సరిహద్దుల్లో యుద్ధం ఏమీ చేయడంలేదు కదా’.. ‘నాకు నేనే సూపర్‌ స్టార్‌’ అంటూ చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ముఖ్యమంత్రులు ఇండస్ట్రీతో ఎంతో సామరస్యంగా ఉన్నారని, రేవంత్‌ ప్రభుత్వం మాత్రం తమపై కన్నెర్ర చేస్తోదంటూ పలువురు దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.  https://twitter.com/profAIPC/status/1867584148153552902 https://twitter.com/narne_kumar06/status/1867753868052115915 మంచు ఫ్యామిలీ గొడవలోనూ.. ఇటీవల మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మంచు మనోజ్‌ (Manchu Manoj)తో పాటు మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్‌బాబు (Mohan Babu) ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలు చేసుకున్నారు. ప్రధాన మీడియా ఛానళ్లు ఈ ఫ్యామిలీ గొడవ గురించే చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైనా మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి సైతం చేశారు. దీనికి సంబంధించి ఆయనపై హత్య కేసు కూడా నమోదైంది. త్వరలో అరెస్టు కూడా చేస్తారని అంటున్నారు. అయితే మనోజ్‌తో వివాదం నేపథ్యంలో పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారని ఆడియో సందేశంలో మోహన్‌ బాబు అసహనం వ్యక్తం చేశారు. మనోజ్‌ కూడా పోలీసుల వ్యవహార తీరును తప్పుబట్టాడు. ఆపై రాచకొండ సీపీ మంచు విష్ణుతో పాటు, మంచు మనోజ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా మీడియాలో హైలెట్ అయ్యింది.  డ్రగ్స్‌ కేసుల విషయంలో..&nbsp; కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్‌ సెలబ్రిటీ (Tollywood)లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో వీడియో సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. అలా చేస్తేనే టికెట్ ధరల పెంపునకు, షూటింగ్‌లకు తమ ప్రభుత్వం అనుమతిస్తుందని హుకుం జారీ చేశారు. అయితే రేవంత్‌ ఇచ్చిన పిలుపు మంచిదే అయిన్పపటికీ ఆయన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడటం చాలా మంది దర్శక నిర్మాతలకు నచ్చలేదని అప్పట్లో టాక్ వినిపించింది.&nbsp; https://twitter.com/Telugu360/status/1808059015038959963 గద్దర్ అవార్డ్స్‌ సందర్భంలో.. సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలోనూ మరోమారు టాలీవుడ్‌ (Tollywood)పై సీఎం రేవంత్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్‌ అవార్డులపై రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని సీఎం రేవంత్‌ కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని జులైలో జరిగిన సి. నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. గద్దర్‌పై గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్‌ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఓ బహిరంగ సమావేశంలో రేవంత్‌ మరోమారు టాలీవుడ్‌పై విమర్శలు చేయడం అప్పట్లో వార్తల్లో హైలెట్ అయ్యింది. https://twitter.com/M9News_/status/1818214759227118067 ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత చెరువులు, కుంటలను ఆక్రమించి భవనాలను నిర్మించిన అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ భవనాన్ని ప్రభుత్వ అధికారులు ఆగమేఘాల మీద కూల్చివేయడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసును సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిని కక్ష్యసాధింపు చర్యగా విపక్షాలు ఆరోపించాయి. దురుద్దేశ్యంతోనే నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారని మండిపడ్డాయి.  https://twitter.com/sudhakarudumula/status/1827197076960375266 సమంతపై కాంగ్రెస్‌ మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)ను టార్గెట్‌ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్‌ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి సంబంధించి సదరు మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.  https://twitter.com/KDRtweets/status/1841433938297807337
    డిసెంబర్ 14 , 2024
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన అగ్ర నటుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్‌ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్‌ స్టార్‌ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్‌ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; నందమూరి తారకరామారావుతో.. టాలీవుడ్‌ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్‌ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్‌’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్‌ రెంటో కథానాయకుడిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా హీరోలుగా ‘ఖూన్‌ పసీనా’ పేరుతో రీమేక్‌ చేశారు.&nbsp; శోభన్‌ బాబుతో..&nbsp; నట భూషణ్‌ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్‌ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్‌ బాబు, రజనీకాంత్‌ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్‌ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్‌ కుమార్‌, శశికపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు.&nbsp; సూపర్‌ కృష్ణతో.. ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్‌ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్‌ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్‌’ (1978), ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.&nbsp; మెగాస్టార్‌ చిరంజీవితో..&nbsp; మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్‌ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.&nbsp; https://twitter.com/atheisttindian/status/1212794102867083265 డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుతో..&nbsp; తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్‌ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్‌ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.&nbsp; అక్కినేని నాగార్జునతో.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్‌ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్‌ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్‌ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్‌ షూట్‌ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు. జగపతి బాబుతో.. రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.  https://twitter.com/SolidLover123/status/1562791842898669568
    డిసెంబర్ 12 , 2024
    <strong>OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే</strong>
    OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్‌ చేయనప్పటికీ డిసెంబర్‌ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ. తంగలాన్‌ (Thangalan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్‌' చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే ‘తంగలాన్‌ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్‌ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్‌ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ. &nbsp;7/G&nbsp; సోనియా అగర్వాల్‌ (OTT Suggestions), స్మృతి వెంకట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘రాజీవ్‌, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్‌ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.   బౌగెన్‌విల్లా (Bougainvillea) మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, కుంచకో బోబన్‌, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం 'బౌగెన్‌విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 13 నుంచి సోని లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్‌ కుమార్తె మిస్సింగ్‌ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్‌ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్‌ నిజాలేంటి? అసలు మినిస్టర్‌ కూతుర్ని కిడ్నాప్‌ చేసింది ఎవరు? అన్నది స్టోరీ. హరికథ (Harikatha) పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.  రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి?’ అన్నది స్టోరీ కంగువా (Kanguva) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' . అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
    డిసెంబర్ 12 , 2024
    <strong>This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ఈ వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ద హీరోల చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. దీంతో చిన్న సినిమాలు ఈ వీక్ (OTT Releases Telugu) సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ యు (Miss You) ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజాగా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని పేర్కొంది.  ప్రణయగోదారి (Pranaya Godari) సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari). ఈ చిత్రానికి పి.ఎల్‌.విఘ్నేష్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌ కీలక పాత్ర పోషించారు. పారమళ్ల లింగయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి తప్పక నచ్చుతుందని మూవీ టీమ్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.  ఫియర్‌ (Fear) ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఈ మూవీ డిసెంబర్‌ 14న విడుదల కాబోతోంది. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ (OTT Releases Telugu) చేస్తారని చిత్ర బృందం చెబుతోంది.&nbsp; పా.. పా.. (Pa Pa) తమిళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'డా.. డా..'ను తెలుగులో ‘పా.. పా..’ పేరుతో రిలీజ్‌ చేయబోతున్నారు. డిసెంబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కెవిన్‌, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. గణేష్‌ కె. బాబు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను సైతం తప్పక అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు హరికథ (Harikatha) పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.&nbsp; రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateOne Hundred Years of SolitudeMovieEnglishNetflixDec 11The Auditors&nbsp;MovieEnglish/KoreanNetflixDec 11How To Make Millions Before Grandma DiesMovieEnglish/ThaiNetflixDec 11Dead list CaughtMovieEnglishNetflixDec 12Law PalmaMovieEnglishNetflixDec 12Miss MatchedMovieEnglishNetflixDec 13Carry on&nbsp;MovieEnglishNetflixDec 131992MovieEnglishNetflixDec 14Inside out 2SeriesEnglishHotstarDec 12Jamay no.1MovieHindiZee 5Dec 09DispatchMovieHindiZee 5Dec 13BougainvilleaMovieTelugu/MalayalamSonyLIVDec 13
    డిసెంబర్ 09 , 2024
    <strong>Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2</strong>
    Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2
    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. గురువారం (డిసెంబర్‌ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ బన్నీ యాక్టింగ్‌ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్‌ నటన బాగుందని ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్‌ హిట్‌ టాక్‌ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్‌ లభించాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; డే 1 కలెక్షన్స్‌ ఎంతంటే.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్‌ బాస్టర్‌ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్‌ వసూలైనట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే హైయస్ట్‌ ఓపెనింగ్స్‌ అని వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.  https://twitter.com/MythriOfficial/status/1865012207060422928 రికార్డులు గల్లంతు తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294  కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్‌ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్‌ ఇచ్చాడు.  https://twitter.com/MythriOfficial/status/1864976017733095871 బెనిఫిట్‌ షోలు రద్దు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్స్‌ (Pushpa 2 Movie Box Office Collection) సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నందున వాటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.&nbsp;
    డిసెంబర్ 06 , 2024
    <strong>OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?</strong>
    OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions) అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. మట్కా (Matka) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్‌ ఏంటి?’ అన్నది స్టోరీ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ&nbsp; భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ. జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్‌ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ. మందిర (Mandira) సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్‌. యువన్‌ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్‌ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చింది. నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్‌ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ. కంగువా (Kanguva) తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. క (Ka) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ. వికటకవి (Vikkatakavi) యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్‌)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.&nbsp; ‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్‌ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్‌ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్‌ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
    డిసెంబర్ 05 , 2024
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్‌ ఫిల్మ్స్‌!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్‌ ఫిల్మ్స్‌!
    యావత్‌ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్‌ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని నిలబడేందుకు ఈ సినిమా సాహించలేదు. దీంతో ఈ వీక్‌ ఒకే ఒక్క సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. మరోవైపు ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మాత్రం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రం పుష్ప 2 (Pushpa 2) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ (Pushpa 2 Advance Booking) సైతం మెుదలయ్యాయి. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.&nbsp; ఓటీటీలోకి వచ్చే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases This Week Telugu) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు.&nbsp; మట్కా (Matka) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka OTT Platform)కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వస్తోంది. మరీ ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా లేదా చూడాలి. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Releases This Week Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ&nbsp; భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. శోభనం రోజు వీడియో చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.&nbsp; జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ 'జిగ్రా' (Jigra OTT Platform). ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కంగువా (Kanguva) తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. TitleCategoryLanguagePlatformRelease DateChurchill At WarDocumentaryEnglishNetflixDec 04That CristamasAnimationEnglishNetflixDec 04The Only Girl In The OrchestraDocumentaryEnglishNetflixDec 04The AlitimatamSeriesEnglishNetflixDec 04Black DovesMovieEnglishNetflixDec 05A Nonsense Cristamas&nbsp;MovieEnglishNetflixDec 06Mary&nbsp;MovieEnglishNetflixDec 06Jack in Time For Cristamas&nbsp;MovieEnglishAmazon&nbsp;Dec 03Pop Culture ZeppadySeriesEnglishAmazon&nbsp;Dec 04AgneeMovieHindiAmazon&nbsp;Dec 06LongingMovieEnglishJio CinemaDec 07The OriginalSeriesEnglish/KoreanHot starDec 03Light ShopSeriesEnglish/KoreanHot starDec 04Mairy&nbsp;MovieHindiZee 5Dec 06Tanav 2MovieHindi/TeluguSonyLIVDec 06
    డిసెంబర్ 02 , 2024
    <strong>This Week Telugu Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!</strong>
    This Week Telugu Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఈ వారం చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వచ్చే వారం 'పుష్ప 2' (Pushpa 2) రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలేవి ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు. అటు ఓటీటీలో రీసెంట్‌ సూపర్ హిట్‌ చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వెబ్‌సిరీస్‌లు సైతం అలరించేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. (This Week Telugu Movies) థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు రోటి కపడా రొమాన్స్‌ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ వారమే రిలీజ్‌ కాబోతోంది. నవంబర్‌ 28న తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.&nbsp; మిస్‌ యూ (Miss You) ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) జంటగా చేసిన తాజా తమిళ చిత్రం ‘మిస్‌ యూ’ (Miss You). ఎన్‌. రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ జానర్లలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.&nbsp; భైరతి రణగల్‌ (Bhairathi Ranagal) కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (Sivaraj Kumar) నటించిన లేటెస్ట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘భైరతి రణగల్‌’. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నవంబరు 29 (This Week Telugu Movies)న విడుదల కానుంది. నర్తన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్‌, రుక్మిణి వసంత్, దేవరాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు క (Ka) యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం వారమే (This Week Telugu Movies) ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ సైతం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్‌ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్‌ నిలిచింది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateBloody BeggarMovieTelugu/TamilAmazonNov 29Sikandar Ka MuqaddarMovieHindiNetflixNov 29The TrunkMovieKoreanNetflixNov 29Our Little SecretMovieEnglishNetflixNov 27Find Me In ParisMovieEnglishNetflixNov 28The Snow SisterMovieEnglishNetflixNov 29The MadnessMovieEnglishNetflixNov 28ParachuteSeriesTelugu/TamilNetflixNov 29VikatakaviSeriesTeluguZee 5Nov 28Divorce Ke Liye Kuch Bhi KaregaSeriesHindiZee 5Nov 29Krishnam Pranaya SakhiMovieTelugu/ KannadaSunNXTNov 29
    నవంబర్ 25 , 2024

    @2021 KTree