రివ్యూస్
How was the movie?
తారాగణం
రజనీకాంత్
అశోక్ కుమార్జగపతి బాబు
బాలకృష్ణ అకా బాలుమీనా
శ్రీదేవిసునీల్
షణ్ముగంషఫ్నా నిజాం
బాలకృష్ణ పెద్ద కూతురురేవతి శివకుమార్బాలకృష్ణ చిన్న కూతురు
అలీ
ఎంఎస్ నారాయణ
ధర్మరాజు సహాయకుడుదువ్వాసి మోహన్
ధర్మరాజు సహాయకుడునర్సింగ్ యాదవ్
ధర్మరాజు సహాయకుడువేణు మాధవ్
తనికెళ్ల భరణి
స్కూల్ టీచర్ఆర్. సుందరరాజన్
మనోబాల
కానిస్టేబుల్చిన్ని జయంత్
కొండవలస లక్ష్మణరావు
కొండవలసరాళ్లపల్లి
విజయరంగ రాజు
నల్ల వేణు
రాజబాబు
చిట్టి బాబు
గుండు హనుమంత రావు
గౌతమ్ రాజు
అనంత్ బాబు
అనంత్మోహన్ రామన్
అశోక్ కుమార్ PAతలపతి దినేష్
తలపతి దినేష్ఆజం
పొట్టి రాంబాబు
గరిమళ్ల విశ్వేశ్వరరావు
గీతా కాదంబీ
ప్రధానోపాధ్యాయురాలురజిత
ఫాతిమా బాబు
సిస్టర్ మారియాసోనా హైడెన్
సోనాసైరా బాను
భావన
శిల్పా
మాస్టర్ అమల్
బేబీ రేవతి
సిబ్బంది
పి వాసు
దర్శకుడుGP విజయ్ కుమార్నిర్మాత
సి. అశ్వని దత్
నిర్మాతజివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడుశ్రీనివాసన్
కథకథనాలు
Devara Prepone: పవన్ ప్లేస్‌లో తారక్.. అనుకున్న దానికంటే ముందే ‘దేవర’ రిలీజ్!
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ (Devara). పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కాగా, ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను మార్చాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముందే రానుందట..!
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి ఆదరణ సంపాదించింది. ఇదిలా ఉంటే.. 'దేవర' చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలోకి రానున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10 కంటే రెండు వారాలు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-పోన్‌కు కారణం ఇదే!
వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా పవన్.. ఏపీ రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించడం.. తాజాగా మంత్రిగానూ ప్రమాణం స్వీకారం చేయడంతో ఇప్పట్లో ఓజీ షూటింగ్లో పాల్గోనే అవకాశం లేదని అంటున్నారు. దీంతో 'ఓజీ' (OG) సినిమా.. ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఓజీకి లాక్ చేసిన తేదీనే 'దేవర'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని కొరటాల శివ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 27న ‘దేవర’తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
గోవాలో షూటింగ్..
ప్రస్తుతం.. 'దేవర' టీమ్ గోవాలో బిజీ బిజీగా గడుపుతోంది. తారక్, జాన్వీ కపూర్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను గోవా చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. మరి కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ అందించిన ఫస్ట్ సింగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. రెండో పాటను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రొమాంటింక్ మెలోడీని రిలీజ్ చేసే అవకాశమున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
భారీ ధరకు ఓటీటీ హక్కులు!
దేవర చిత్రం థియేటర్లలోకి రాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడు పోయాయి. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) దేవర ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్.. దాదాపు రూ.155 కోట్లు ఖర్చుపెట్టిందని వార్తలు వచ్చాయి. దేవర విడుదలైన 56 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. తెలుగు, హిందీతో పాటు మరిన్ని సౌత్ భాషలలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
‘దేవర’లో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా తారక్.. దేవరలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో పతాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు టాక్. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూన్ 12 , 2024
Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.
రన్ టైమ్ భయాలు!
నేచురల్ స్టార్ నాని హీరోగా 'సరిపోదా శనివారం' రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టీమ్ యు/ఏ సర్టిఫికేట్ జారి చేసింది. అలాగే రన్ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
విలన్‌దే పైచేయి..!
'సరిపోదా శనివారం' చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్ అండ్ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్.జే. సూర్య యాక్టింగ్ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు.
కథని ముందే రివీల్ చేస్తున్నాడు!
‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో నిడివి గురించి సైతం సెన్సార్ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’
‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్ పడుతున్న సమయంలో జేక్స్ బిజోయ్ మ్యూజిక్ వింటే ఆ టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్ అంతగా పని పెట్టాడు. నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు.
ఆగస్టు 27 , 2024
Nani HBD: నాని గురించి స్టార్ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని.. తన కృషి, పట్టుదలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఇవాళ నాని పుట్టిన రోజు (#HappyBirthdayNani) కావండంతో ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నాని అప్‌కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’ (#SaripodhaaSanivaaram) విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ సినిమా హ్యాష్‌ట్యాగ్‌తోనూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియోను షేక్ చేస్తున్న నాని వీడియోలపై ఓ లుక్కేద్దాం.
ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ నచ్చిన హీరో నాని. పలు వేదికలపై మహేష్, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ, డైరెక్టర్ సుకుమార్ వంటి ప్రముఖులు నానిపై చేసిన ప్రశంసల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1761065464669864301
నాని సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో ముఖ్య అతిథి పాల్గొన్న పవన్ కల్యాణ్.. నేచురల్ స్టార్ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నానికి భగవంతుడు గొప్ప విజయాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1761097491502772606
టాలీవుడ్ సంచలనాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్యూలో హీరో నానిని కొనియాడాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అందరితో కలిసి స్టీల్ ప్లేట్‌ను తుడుచుకొని తిన్న నాని.. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగాడో అంటూ సందీప్ ప్రశంచించాడు. .
https://twitter.com/i/status/1761098448496115970
‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి.. నానితో ‘కృష్ణగాడి ప్రేమకథ’ చిత్రం తీశారు. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నానిపై ప్రశంసలు కురిపించారు. నాని ఒక్క క్షణం కూడా పాత్ర నుంచి బయటకు రాడని.. ఆ క్యారెక్టర్లోనే కూర్చుండిపోతాడని పేర్కొంటాడు.
https://twitter.com/i/status/1761214343755256110
నాని హీరోగా చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని ఓ ఆడియో ఫంక్షన్లో అల్లుఅర్జున్ పేర్కొంటాడు. నాని నటన చాలా బాగుందంటూ ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియోను సైతం నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1480588099688153089
నాని బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో మరో ఆసక్తిర వీడియో వైరల్ అవుతోంది. తోటి స్టార్స్ అయిన ప్రభాస్, తారక్ ఇతర హీరోల గురించి నాని చేసిన హెల్తీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఏమన్నాడో కింద వీడియోలో మీరే చూడండి.
https://twitter.com/i/status/1761060076645711983
ఈ జనరేషన్ యువతలో ప్రేరణ కలిగిస్తూ నాని చేసిన ఓ వీడియో సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ కలలను నేరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బలంగా నిలబడాలని నాని ఈ వీడియో సూచించాడు.
https://twitter.com/i/status/1761106534715797807
మరోవైపు నాని స్ఫూర్తిదాయక వీడియోలు సైతం #HappyBirthdayNani హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో తాను పడ్డ ఇబ్బందులను నాని స్వయంగా పలు వేదికలపై చెప్పుకొస్తాడు. వాటన్నింటిని జోడిస్తూ ఫ్యాన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1761124945327747406
ఒక అమీతాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి ఆ తర్వాత నాని.. అంటూ సాగే వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సౌత్ ఇండియాలో నాని ఓ అద్భుతమైన నటుడు అంటూ రవితేజ ఈ వీడియో ప్రశంసిస్తాడు.
https://twitter.com/i/status/1761229505295745273
నాని కెరీర్లో ఇప్పటివరకూ జరిగిన మెమోరబుల్ మూమెంట్స్, హైలెట్ మూవీ సీన్లను ఒక చోట చేర్చి చేసిన మరో వీడియో కూడా ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1761018169005584453
ఇక నాని బర్త్‌డే సందర్భంగా.. తన అప్‌కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ఆసక్తికర పోస్టు విడుదలైంది. చుట్టూ మంటలు.. ముఖాన ముసుగుతో నాని చాలా అగ్రెసివ్‌గా పోస్టర్లో కనిపించాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 14 లేదా ఆగస్టు 28 తేదీల్లో రిలీజయ్యే అవకాశముందని సినీ వర్గాల టాక్.
https://twitter.com/TheAakashavaani/status/1761255871374614584?s=20
ఫిబ్రవరి 24 , 2024
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 24) పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పవన్ ఏఐ పోస్టు..?
తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్ జీపీటీ లేదా ఏఐ సాయంతో పదాల కూర్పును జనరేట్ చేయించి పవన్ ఈ ట్వీట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
https://twitter.com/PawanKalyan/status/1838587619745087518
‘ఏఐ’ వినియోగంలో తప్పుందా!
కార్తీపై పవన్ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రమిటికల్ తప్పులు లేకుండా ఏఐ సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్ ఏఐ టూల్ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్ ఏఐ ట్వీట్ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
కార్తీ చేసిన తప్పేంటి?
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ లడ్డు టాపిక్ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470
పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్!
కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్టైన్మెంట్ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్ రియాక్షన్ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సెప్టెంబర్ 25 , 2024
AKHANDA 2: టార్గెట్ AP ఎలక్షన్స్.. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా బాలయ్య, బోయపాటి సినిమా!
నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడింట్లోనూ కామన్‌గా పొలిటికల్ టచ్ ఉంటుంది. నాటి వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనువదించుకుని వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్.. ఈ సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే, మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. అఖండ పార్ట్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి పొలిటికల్ డోజ్ మరింత పెంచనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.
స్టోరీ ఇదేనట..
రాష్ట్రంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లోని పరిస్థితుల చుట్టూ సినిమా కథ ఉంటుందని టాక్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న దాడులు, అధికార యంత్రాంగం ప్రవర్తనా తీరును ఎండగట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ అన్య మతస్థుడు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని ఆలయాల దుస్థితి ఎలా ఉంటుంది? వీటిని రక్షించడానికి కథానాయకుడు ఎలాంటి పోరాటం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం తెరకెక్కనుందట. ప్యూర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తూనే మాస్ ఎలివేషన్స్‌ని హైలైట్ చేయనున్నట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో..
రాజకీయాలే లక్ష్యంగా అఖండ పార్ట్ 2 రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారట. సరిగ్గా ఏపీ ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు టాక్. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ విధానాలను సినిమా ద్వారా ఎండగట్టాలని చూస్తున్నారట. ఎన్నికల ప్రచారానికి ఈ సినిమాను ఓ ఆయుధంలా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమాకు బాలయ్య పుట్టినరోజు నాడు శ్రీకారం చుట్టునున్నట్లు టాక్. జూన్ 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు సమాచారం.
లెజెండ్ కూడా..
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’. ఈ సినిమా 2014 మార్చి 24న విడుదలైంది. సరిగ్గా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇదే నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులోని డైలాగులు కూడా పొలిటికల్ టచ్‌తో ఉన్నాయి. నాడు ఈ సినిమా ఎలక్షన్లకు కలిసొచ్చింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగ్గా బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సెంటిమెంట్‌ని మరోసారి వర్కౌట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది.
అఖండ టీంతోనే..
అఖండ పార్ట్ 2 సినిమాలో కూడా దాదాపు అదే టీం పనిచేయనుంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఎస్.ఎస్.థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో దద్దరిల్లింది. దీంతో పార్ట్ 2కి సైతం థమన్‌నే కొనసాగించనున్నారట. ఇతర టెక్నికల్ టీం కూడా మరోసారి కలిసి పనిచేయనుంది.
వరుస సినిమాలు..
ఓ వైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డితో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ అనంతరం బోయపాటితో అఖండ2 కు బాలయ్య రెడీ కానున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకు మేకప్ వేసుకోనున్నట్లు సమాచారం.
మే 01 , 2023
Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?
అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేసింది. రవితేజ, రామ్, బాలకృష్ణ, నితీన్, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రీసెంట్గా 'పుష్ప 2' చిత్రంలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఈ యంగ్ బ్యూటీ ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరోతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 ద్వారా ఈ విషయం తేటతెల్లమైందని అంటున్నారు.
ఆ హీరో ఎవరంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha)లో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాల్గవ సీజన్లో భాగంగా 6వ ఎపిసోడ్‌ను ఓటీటీ వర్గాలు తాజాగా రిలీజ్ చేశాయి. ఇందులో యంగ్ హీరో శ్రీలీల (Sreeleela)తో పాటు యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఎంతో ఫ్రీడమ్‌తో జోకులు వేసుకుంటూ సందడి చేశారు. అయితే వీరిద్దరు ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ ఇంత క్లోజ్‌గా ఉండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుర్ర హీరోతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అటు నవీన్ పొలిశెట్టి సైతం ఈ షోలో శ్రీలీలతో చాలా చనువుగా కనిపించారు. ఆమెపై సెటైర్లు వేస్తూ ఆధ్యంతం షోను రక్తి కట్టించాడు. దీనికి తోడు ఎంతో మంది యువ హీరో, హీరోయిన్లు ఉండగా వీరిద్దరినే షోకు పిలవడం వెనక కారణం ఇదే అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన జీ తెలుగు మహోత్సవం వేడుకల్లో ఈ శ్రీలీల, నవీన్ పోలిశెట్టి పాల్గొన్నారు. మనిద్దరం కలవడం ఇదే తొలిసారి కదా అని శ్రీలీల అనగా చివరిసారి మాత్రం కాదులే అంటూ పోలిశెట్టి అంటాడు. ఈ డైలాగ్‌తో ఈవెంట్‌కు వచ్చిన వారంతా బిగ్గరగా కేకలు వేస్తారు.
https://twitter.com/ahavideoIN/status/1863460168291234133
https://www.youtube.com/watch?v=0yXwmYMQfaM
చేతికి మూడు ఫ్యాక్చర్స్..
'అన్‌స్టాబబుల్ సీజన్ 4' పాల్గొన్న నవీన్ పోలిశెట్టి తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి బాలయ్యతో మాట్లాడారు. తనకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, చేతికి ఏకంగా మూడు ఫ్యాక్చర్లు అయినట్లు నవీన్ తెలిపాడు. పూర్తిగా రికవరీ కావడానికి కనీసం 8 నెలలు పడుతుందని డాక్టర్ చెప్పారన్నారు. దీంతో ఆ గ్యాప్‌లో కథలు వినడం ప్రారంభించానని, త్వరలో 'అనగనగా ఒక రాజు' స్టోరీ రాబోతున్నట్లు చెప్పాడు. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ'లో నటిస్తున్నారన్న రూమర్లపైనా అతడు స్పందించాడు. ఇలాంటివి వినడానికి చాలా బాగుంటాయని, నిజమైతే ఇంకా బాగుండు అని వ్యాఖ్యానించాడు. ఇలాంటి రూమర్స్ ఇంకా స్ప్రెడ్ చేస్తేనైనా అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో అవకాశం లభిస్తుందేమోనని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కాగా, హిందీ రామయణలో లక్షణుడిగా నవీన్ పోలిశెట్టి ఎంపికైనట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
రానాకు శ్రీలీల బంధువా?
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి టాక్‌షో అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ కాగా అందులో శ్రీలీల, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో మీరు మాకు బంధువులు అవుతారా? అంటూ శ్రీలీల (Sreeleela)ను రానా అడుగుతాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మీవాళ్లు తగులుతున్నట్లు చెబుతాడు. ఈ క్రమంలో తన అమ్మది ఒంగోలు దగ్గర ఓ విలేజ్ అని శ్రీలీల చెబుతుంది. అప్పుడు రానా కూడా తన తాతది ఒంగోలు జిల్లానే అంటూ బదులిస్తాడు. కాగా, దిగ్గజ నిర్మాత, రానా తాత డి. రామానాయుడుది ప్రకాశం జిల్లాలోని కారంచేడు ప్రాంతం. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో దూరపు చుట్టరికం ఉండి ఉండొచ్చని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శ్రీలీల మాకు రిలేటివ్స్: డైరెక్టర్
బాలయ్య హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు శ్రీలీల దగ్గరి బంధువు అవుతుందని సీక్రెట్ రివీల్ చేశారు. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని చెప్పారు. అదే ఊరు తన అమ్మమ్మది కూడా అని అనిల్ తెలిపారు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని ఆయన అన్నారు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుందన్నమాట. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందు డైరెక్టర్ గారు అని తనను శ్రీలీల పిలుస్తుందని, ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టిస్తుందని కూడా చెప్పారు. కాగా, శ్రీలీల పుట్టింది తెలుగు నేలపైనే అయినా పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే. ఆమె తన అమ్మమ్మ ఊరు పొంగులూరుకు ప్రతీ ఏటా వస్తుంటుంది.
డిసెంబర్ 07 , 2024
Pragya nagra Viral Video: ప్రైవేట్ వీడియోపై స్పందించిన హీరోయిన్ ప్రగ్యా నగ్రా
తెలుగు ప్రేక్షకులను లగ్గం సినిమాతో ఆకట్టుకున్న ప్రగ్యా నగ్రా తన జీవితంలో ఎదురైన ఒక అసహజ అనుభవంపై స్పందించారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఆమెపై ఎవరో సృష్టించిన ఒక ఫేక్ వీడియో (pragya nagra viral video) వైరల్ కావడం, ఆమె పేరును ఎక్స్ వేదికలో ట్రెండింగ్ చేయడం జరిగిన ఘటన ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆ వీడియోపై ఆమె స్పందించారు.
ప్రగ్యా నగ్రా స్పందన
సోషల్ మీడియాలో తనదిగా వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై ప్రగ్యా ఎక్స్ వేదిక ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు.
‘‘ఆ వీడియో నిజం కాదని మీరు అందరూ తెలుసుకోండి. ఈ వ్యవహారం ఒక భయంకరమైన కల అనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచాలి, కానీ అతి దుర్మార్గమైన వ్యక్తులు దాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెత్త వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో ప్రాచుర్యం చేయడం నన్ను తీవ్రంగా బాధ పెట్టింది.’’ అని పేర్కొన్నారు.
తనను అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ‘‘ఇలాంటి సంఘటన (pragya nagra viral video)మరొక అమ్మాయికి జరగకూడదని ఆకాంక్షిస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేయడం జరిగింది.
ప్రగ్యా నగ్రా కెరీర్ ప్రారంభం
హరియాణాలోని అంబాలాకు చెందిన ప్రగ్యా నగ్రా మోడల్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. వివిధ ఉత్పత్తులకు సంబంధించి 100కు పైగా ప్రకటనల్లో మోడల్‌గా నటించి గుర్తింపు పొందారు.
ప్రగ్యా నగ్రా విద్యాభ్యాసం మెుత్తం ఢిల్లీలోనే జరిగింది. స్కూలింగ్, కాలేజ్ స్టడీస్‌తో పాటు మోడలింగ్ కెరీర్ కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే మెుదలైంది. ఆమె తండ్రి భారత మిలటరీలో పని చేశారు. దీంతో కాలేజీ డేస్‌లో ఆర్మీలో చేరాలని భావించింది. ఇందుకోసం ఎన్సీసీ స్టూడెంట్‌గా చేసింది.
మోడలింగ్‌లోకి వచ్చాక ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. దీంతో నటిగా కెరీర్లో (pragya nagra viral video)స్థిరపడాలని నిర్ణయించుకొని సినిమాల వైపు అడుగులు వేసింది.
సినీ ప్రయాణం
ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జీవా కథానాయకుడు. ఆ తర్వాత మలయాళంలో నథికళిల్ సుందరి యుమనా, N4 చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె తొలి చిత్రం లగ్గం. ఈ చిత్రంలో సాయి రోనక్ హీరోగా రూపొందింది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు.
లగ్గం మూవీ డిజిటల్ విడుదల
ప్రస్తుతం లగ్గం చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారాలపై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
మహిళల భద్రతపై ప్రగ్యా నగ్రా ఆందోళన
ఈ సంఘటన ప్రగ్యాను కుదిపేసింది. ఆమె ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ కంటెంట్‌ను పంచుకోవడాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘టెక్నాలజీని ఉపయోగించే విధానం బాధ్యతతో ఉండాలి’’ అనే సందేశాన్ని అందించారు.
ప్రగ్యా నగ్రా తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ సద్వినియోగం మాత్రమే మన జీవితాలను మెరుగుపరుస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు.
డిసెంబర్ 07 , 2024
Vishwambhara: జపాన్ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చిరుకి జోడీగా నటిస్తోంది. ‘అమిగోస్’ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషతో చిరు రొమాంటిక్ సాంగ్!
‘విశ్వంభర’ (Viswambhara) టీమ్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్ సభ్యులు రీసెంట్గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్!
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది.
https://twitter.com/i/status/1849101610762522837
2025 సమ్మర్ బరిలో..
చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 20 , 2024
Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్, తారక్‌కు బండ్ల గణేష్ చురకలు!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 9) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.
https://twitter.com/ganeshbandla/status/1855087509103165519
తారక్, ప్రభాస్‌కు చురకలు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్, ప్రభాస్ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విష్ చేసిన స్టార్స్ వీరే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం రేవంత్ రెడ్డిని విష్ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్ రెడ్డి లీడర్షిప్ను ప్రశంసించాడు.
https://twitter.com/KChiruTweets/status/1854736624749625361
https://twitter.com/PawanKalyan/status/1854776671339262428
https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522
https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039
నంది అవార్డుల విషయంలో రగడ!
ఈ ఏడాది జనవరిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ పెద్దలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
నవంబర్ 09 , 2024
OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!
గతవారం లాగే ఈ వీక్ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సి 202 (C 202)
మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె.ఏ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో ఒక్క డైలాగ్ లేకుండా తమ హావాభావాలతోనే నటీనటులు ఆకట్టుకున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.
పొట్టేల్ (Pottel)
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna) జంటగా చేసిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకుడు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 25న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana)
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ‘నరుడి బ్రతుకు నటన’ రూపొందింది. శ్రుతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. టి.జి.విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా.సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
లగ్గం (Laggam)
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా చేసిన చిత్రం ‘లగ్గం’. ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అక్టోబరు 25న విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
రోటి కపడా రొమాన్స్ (Roti Kapda Romance)
సందీప్ సరోజ్, తరుణ్, హర్షా నర్రా, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మించారు. అక్టోబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ (Venom The Last Dance)
ఈ వారం హాలీవుడ్లో సూపర్ హీరో చిత్రం రాబోతోంది. బ్లాక్బాస్టర్ మూవీ సిరీస్ ‘వెనమ్’కు కొనసాగింపుగా పార్ట్ 3 రాబోతోంది. 'వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో అక్టోబర్ 24న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. 3డి వెర్షన్లోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కెల్లీ మార్సెల్ దర్శకుడు. ఈ సిరీస్‌లో ఇదే తన చివరి చిత్రమని కథానాయకుడు టామ్ హార్డీ ఇప్పటికే ప్రకటించాడు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateFamily PackMovieEnglishNetflixOct 23The Comeback 2004 Boster Red SacksSeriesEnglishNetflixOct 23Beauty In BlackSeriesEnglishNetflixOct 24TerritorySeriesEnglishNetflixOct 24Do PattiMovieHindiNetflixOct 25Don't MoveMovieEnglishNetflixOct 25Hell Bound 2 MovieEnglish/KoreanNetflixOct 25Satyam SundaramMovieTelugu/TamilNetflixOct 25NautilusSeriesEnglishAmazon Oct 25JigawattMovieHindiAmazon Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon Nov 7The Bike RidersMovieEnglishJio CinemaOct 21Furiosa: A Mad Max SagaMovieTelugu Dub Jio CinemaOct 23The Miranda BrothersMovieHindiJio CinemaOct 25The Legend Of Hanuman 5SeriesTelugu DubHotstarOct 25Aindham VedhamMovieTamilZee 5Oct 25A Zindagi MovieHindiZee 5Oct 25Maa Nanna SuperheroMovieTelugu Zee 5Oct 31
అక్టోబర్ 21 , 2024
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్ ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.
‘ఓ పిల్ల’ సాంగ్ రిలీజ్
విష్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s
సాంగ్ ఎలా ఉందంటే?
రాఖీ (విష్వక్ సేన్), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్ అజీజ్ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్ ఎప్పటిలాగే తన క్లాసిక్ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
‘లైలా’గా విష్వక్
విష్వక్ మెకానిక్ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
https://twitter.com/HanuNews/status/1808353426721407104
పోలీసు ఆఫీసర్‌గా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్ చేశాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేసింది.
సెప్టెంబర్ 18 , 2024
Telugu Actress Debut In Bollywood 2024: బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ భామలు.. సక్సెస్ అయ్యేనా!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీంతో హీరోయిన్లు ఒకే ఇండస్ట్రీకే పరిమితం కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోయిన్లు బాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో హిందీ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన కథానాయికలు తెలుగులో తమ ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఆ భామలకు మల్టిపుల్ ఆఫర్లు రావడం విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? వారు ఓకే చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సాయిపల్లవి (Sai Pallavi)
సౌత్ స్టార్ సాయిపల్లవి.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా మారింది. ఇప్పుడామె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అమిర్‌ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా చేస్తోన్న చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayanam)లోనూ భాగస్వామ్యమైంది. ఇందులో సీతగా సాయిపల్లవి కనిపించనుంది.
కీర్తి సురేశ్ (Keerthy Suresh)
దక్షిణాది స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) సైతం బాలీవుడ్లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఆమె ఇప్పటికే వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ‘బేబీ జాన్’ (Baby Jaan) సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్‌కు కీర్తి శ్రీకారం చుట్టింది. 'అక్క' (Akka Series)పేరుతో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఆ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధికా ఆప్టే కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
శ్రీలీల (Sreeleela)
‘పెళ్లి సందడి’ (Pelli SandaD)తో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన శ్రీలీల వరుసగా చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఎక్కువ సినిమాలు ఫ్లాప్‌గా నిలవడంతో ఈ అమ్మడు ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కనున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదింకా చిత్రీకరణ ప్రారంభించుకోక ముందే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రం కోసమూ శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్‌ను సైతం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. రానా (Daggubati Rana) కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీనిధి కథానాయికగా చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి తెలుగులో ఈ అమ్మడు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఇప్పుడా అమ్మడు ఎన్టీఆర్ ‘దేవర’ (Devara)తో తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్నీ దక్కించుకుంది. ఈసారి తను కథానాయకుడు రామ్‌చరణ్‌కు జోడీగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే జాన్వీ తెలుగులోనూ బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)తో తెలుగు తెరపై కాలుమోపేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా తెరపైకి రాకముందే భాగ్యశ్రీ మరో రెండు టాలీవుడ్ ప్రాజెక్ట్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ చేయనున్న కొత్త తెలుగు సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం దక్కించికున్నట్లు తెలుస్తోంది.
జూలై 10 , 2024
Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్ హీరోయిన్ లాక్!
యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్ చేయగా.. సీక్వెల్లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్ హీరోయిన్ను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ!
ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్ బజ్ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
సమంత, తమన్నా లేనట్లే!
‘టిల్లు స్క్వేల్’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.
పూజాకు మంచి ఛాన్స్!
ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్’లో ఆఫర్ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్ సంపాదించే అవకాశం ఉంది.
టిల్లు క్యూబ్ కథ అదే!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్ మాత్రం మరో లెవల్లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
మే 03 , 2024
Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్ సక్సెస్ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
నటీనటులు : చైతన్యరావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు
దర్శకుడు : సంతోష్ కంభంపాటి
సంగీతం : రీ
సినిమాటోగ్రాఫర్ : బాల సరస్వతి
ఎడిటర్ : శశాంక్ ఉప్పుటూరి
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్ శ్రీనివాసన్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. బార్ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సంతోష్ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్ మూవీగా మారిపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్ 3’లో ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అయితే తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆ స్టార్ హీరోయిన్లు ఎవరంటే?
‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బాస్టర్ కావడంతో ‘టిల్లు క్యూబ్’ను అంతకుమించి రూపొందించేలా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. కీలకమైన హీరోయిన్ పాత్రకు స్టార్ హీరోయిన్ను తీసుకుంటే ఎలా ఉంటుందా? అన్న యోచనలో చిత్ర యూనిట్ ఉంది. అంతేకాదు వారి పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నట్లు లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుస్తోంది. సమంత (Samantha), తమన్నా (Tamannah Bhatia)ను ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. షూటింగ్ ప్రారంభం లోపు దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్ పరంగానూ ఈ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్లాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా అంతా ఫారెన్‌లోనే!
‘డీజే టిల్లు’లో అందాలు ఆరబోసిన హీరోయిన్ నేహా శెట్టి.. ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. దీంతో ఇదే ఫార్మూలాను టిల్లు క్యూబ్లోనూ రిపీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టితో పాటు సీక్వెల్లో చేసిన అనుపమా పరమేశ్వరన్ కూడా మెరవనున్నట్లు సమాచారం. అయితే మెయిన్ హీరోయిన్గా మాత్రం స్టార్ నటి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పార్ట్-3’ కథ అంతా ఫారెన్‌లోనే జరుగుతుందట.కాగా,ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్‌తో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘టిల్లు క్యూబ్’ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ.. సిద్దూకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు తెలుస్తోంది.
టిల్లు క్యూబ్ కథ అదే!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్ మాత్రం మరో లెవల్లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెడతానని స్పష్టం చేశాడు.
https://twitter.com/i/status/1774843442021196268
ఏప్రిల్ 12 , 2024
Prabhas: 9 పార్టులుగా ‘కల్కీ 2898AD?... ఇక హాలీవుడ్ పని అయినట్లే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై అంచనాలు చాలా హైరేంజ్లో ఉన్నాయి. గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
9 పార్ట్‌లుగా కల్కీ!
‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్ తన ఫోకస్ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
https://twitter.com/MilagroMovies/status/1759613635327107364
‘నేను ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్’
డార్లింగ్ ప్రభాస్‌కు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని పలు వేదికలపై వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రభాస్‌పై తనకున్న అభిమాన్ని చాటుకున్నాడు. మెగా హీరోల తర్వాత తనకు నచ్చిన కథానాయకుడు ప్రభాస్ అని వరుణ్ తెలిపాడు. సూపర్ స్టార్ కావాలని ప్రభాస్ ఎప్పుడు అనుకోలేదని.. అతడి శ్రమ, కృషి డార్లింగ్‌ను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1759574622213947537
షమీ ఫేవరెట్ స్టార్లు వీరే
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో తాను ప్రభాస్ ఫ్యాన్ అంటూ ప్రకటించాడు. సౌత్ ఇండియాలో మీకు నచ్చిన స్టార్స్ ఎవరని షమీని జర్నలిస్టు ప్రశ్నిస్తుంది. ఇందుకు షమీ సమాధానం ఇస్తూ.. సౌత్ సినిమాలు చాలా బాగుంటాయని.. తనకు ప్రభాస్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను కూడా ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1759506059331338533
ఛత్రపతి శివాజీగా ప్రభాస్!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిన్న (ఫిబ్రవరి 19) దేశ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తే ప్రస్తుత ఇండియన్ స్టార్ హీరోల్లో ఆ పాత్రకు ఎవరు సరిపోతారన్న ప్రశ్న తలెత్తింది. దీంతో మెజారిటీ నెటిజన్లు ఛత్రపతి శివాజీ పాత్రకు ప్రభాస్ అయితేనే బాగుంటుందని బదులిచ్చారు. శివాజీ పాత్రకు ప్రభాస్ ఒక్కడే ఛాయిస్ అని పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1759409716114190363
ప్రభాస్‌కు హనుమాన్ ఎలివేషన్
ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన సమాచారం #Prabhas హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఎడిటింగ్ వీడియో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి శక్తిని వివరిస్తూ నటుడు సముద్రఖని చెప్పే డైలాగ్‌ను ఆ వీడియోలో ప్రభాస్‌కు అన్వయించారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను సముద్రఖని డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ వీడియోను ఎడిట్ చేశారు.
https://twitter.com/i/status/1759832540071027104
మే 9న ఫ్యాన్స్‌కు పండగే
‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్లో కూడా క్రేజ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలకపాత్రలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 20 , 2024
Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్ బడా చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా మరికొన్ని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్ కల్యాణ్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్ వాటెండ్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.
హనుమాన్
ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్ విడుదల కానుంది.
భారతీయుడు 2
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు.
పుష్ప 2
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్‌సింగ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ
సలార్ సూపర్ హిట్ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్ 'స్పిరిట్' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్ స్టార్ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు.
డిసెంబర్ 30 , 2023
Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు:
అన్ని మంచి శకునములే
యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది.
బిచ్చగాడు-2
‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్ ఆంటోని తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ కూడా విజయ్ తెరకెక్కించాడు. బిచ్చగాడు-2 పేరుతో దానిని 19న ధియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ అంటోని ద్విపాత్రాభినయం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.
ఫాస్ట్ X
ఫాస్ట్ అండ్ ఫూరియస్ నుంచి మరో సిరీస్ ఈ వారం రానుంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో.. జాసన్ మొమోవా ప్రతినాయకుడిగా ఫాస్ట్ X ను తెరక్కించారు. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కూడా మే 19న విడుదల కానుంది. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
ఏజెంట్
భారీ అంచనాలతో రిలీజైన అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరి ఓటీటీలోనైనా ఏజెంట్ చిత్రం ఆకట్టుకుంటుందేమో చూడాలి.
డెడ్ పిక్సెల్స్
వివాహానంతరం నిహారిక కొణిదెల నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
TitleCategoryLanguagePlatformRelease DateAnt Man and Wasp: QuantumaniaMovieEnglishDisney+ HotstarMay 17Modern Love ChennaiSeriesTamilAmazon PrimeMay 18kadina kadoramee andakadahamMovieTamilSony LIVMay 19AyalvashiMovieMalayalamNetflixMay 19KathalMovieHindiNetflixMay 19Bayi AjaibMovieEnglishNetflixMay 19MutedMovieEnglishNetflixMay 19faithfully yoursMovieEnglishNetflixMay 17Selling Sunset: Season 6SeriesEnglishNetflixMay 19Young, Famous & African: Season 2SeriesEnglishNetflixMay 19
మే 15 , 2023