• TFIDB EN
  • కెరటం
    UTelugu
    సిద్దు - గీత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీరి స్నేహం కాలక్రమేణ ప్రేమగా మారుతుంది. అయితే ఈ లవ్‌ సిద్దుకు కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దాని సిద్ధు ఎలా బయటపడ్డాడు? ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    Devan:Aishwarya Devanas Geetha
    రకుల్ ప్రీత్ సింగ్
    సంగీత
    యమునా
    సిద్ధు తల్లి
    భీమనేని శ్రీనివాసరావు
    సిద్ధు తండ్రి
    శ్రీనాథ్
    గీత తండ్రి
    కవిత
    గీతా తల్లి
    సుమన్
    రవిశంకర్‌
    వేణు మాధవ్
    PT టీచర్‌
    పాండు
    బిక్షపతి
    J. లివింగ్స్టన్
    మోహన్ రావు
    సిబ్బంది
    గౌతం పట్నాయక్దర్శకుడు
    ఆర్. ఎన్. శరణ్దర్శకుడు
    ఎస్.వి.బాబునిర్మాత
    జాషువా శ్రీధర్
    సంగీతకారుడు
    వర్షన్సంగీతకారుడు
    సురేష్ అర్స్
    ఎడిటర్
    కథనాలు
    <strong>HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?</strong>
    HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?
    ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ (Sunny Deol) సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అతడి ఫిల్మ్‌ కెరీర్‌ పూల పాన్పులా సాగలేదు. అతడి కెరీర్‌ అయిపోయిందనుకున్న ప్రతీసారి బౌన్స్‌బ్యాక్‌ అవుతూ వచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం తిరుగులేని స్టార్‌గా బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. నేడు (అక్టోబర్‌ 19) సన్నీ డియోల్‌ 67వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం.&nbsp; ధర్మేంద్ర నటవారసుడిగా.. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ 1957 అక్టోబర్‌ 19న జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఆయన కుమారుడు. ఎవర్‌గ్రీన్‌ బాలీవుడ్‌ చిత్రం ‘షోలే’ (Sholey)లో అమితాబ్‌ బచ్చన్‌తో పోటీ పడి ధర్మేంద్ర నటించారు. అటువంటి ధర్మేంద్ర నట వారసుడిగా సన్నీ డియోల్‌ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిజానికి అతడి అసలు పేరు అజయ్‌ సింగ్‌ డియోల్‌. ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ డియోల్‌గా మార్చుకున్నారు. 1983లో వచ్చిన రొమాంటిక్‌ చిత్రం 'బేతాబ్‌' (Betaab)తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే బెస్ట్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. ’బేతాబ్‌’లో సన్నీ చేసిన గుర్రపు స్వారీ సీన్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఎంతో కఠినమైన గుర్రపు స్వారీ సీన్లను అలవోకగా చేయడంతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. హీరోయిన్‌ అమృత సింగ్‌తో కలిసి అద్భుతంగా రొమాంటిక్‌ సన్నివేశాలను పండించాడు. తొలి మూవీతోనే స్టార్‌ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకున్నారు.  ఒకే ఏడాది 7 చిత్రాలు రిలీజ్‌ 'బేతాన్' సక్సెస్‌తో సన్నీ డియోల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో చిత్రం 'రాజ్‌ ఖోస్లా' (1985) తీసి మరో హిట్‌ అందుకున్నారు సన్నీ. రొమాంటింక్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సన్నీలోని ప్రతిభను మరింత బహిర్గతం చేసింది. సన్నీ క్రేజ్‌ అమాంతం పెరగడం మెుదలైంది. ఆ తర్వాత అర్జున్‌ (1985), డెకాయిట్‌ (1987) చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత నుంచి కథల ఎంపికలో సన్నీ ఉదాశీనంగా వ్యవహరించారు. వచ్చిన కథను వచ్చినట్లు ఓకే చేశారు. తద్వారా 1989వ సంవత్సరంలో ఏకంగా 7 సినిమాలను రిలీజ్‌ చేశారు. కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన ఐదు మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో సన్నీ క్రేజ్‌కు బీటలు వారడం మెుదలైంది. ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న సన్నీ కథల విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడు.&nbsp; ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ 1990లో రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో 'ఘాయల్‌' అనే చిత్రం చేశాడు. ఈ మూవీని అతడి ధర్మేంద్ర నిర్మించడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందించింది. అంతకుముందు వచ్చిన వరుస ఫ్లాప్స్‌ను అందరూ మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్షన్‌లోనే వరుసగా దామిని (1993), ఘటక్‌ (1996) అనే రెండు బ్లాక్‌ బాస్టర్ చిత్రాలు చేశారు. ముఖ్యంగా ‘దామిని’ సినిమాలో వచ్చే కోర్టు సీన్‌లో కెరీర్‌ బెస్ట్ నటనతో సన్నీ డియోల్‌ మెస్మరైజ్‌ చేశారు. అంతేకాదు ఘటక్‌ సినిమాతో మరో నేషనల్‌ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో కలిసి చేసిన ‘డర్‌’ సినిమా సన్నీకి బిగ్‌ మైనస్‌గా మారింది. యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ‘డర్‌’ సాఫ్ట్‌ రోల్‌ చేశాడు. దానికితోడు అందులో షారుక్‌ పాత్ర కనెక్టింగ్‌గా ఉండటంతో షారుక్‌ ముందు సన్నీ తేలిపోయాడన్న భావన ఆడియన్స్‌లో కలిగి ఉంది.&nbsp; ‘గదర్‌’తో చెక్‌! 1990వ దశకంలో పెద్ద ఎత్తున రొమాంటిక్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందుకు అనుగుణంగా షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్.. ప్రేమ కథలను ఎంచుకుని మంచి విజయాలను సాధించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌ అన్న ముద్ర పడటంతో సన్నీకి ఆ తరహా లవ్‌స్టోరీలు రాలేదు. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకు సన్నీ రీచ్‌ కాలేకపోయారు. అటు డ్యాన్స్‌లోనూ సన్నీకి పెద్దగా ప్రావీణ్యం లేకపోవడం కూడా అతడి క్రేజ్‌ను కొద్దిమేర డ్యామేజ్‌ చేసింది. ఇది అతడి కెరీర్‌లో వచ్చిన సెకండ్ స్ట్రగల్‌ ఫేజ్ అని చెప్పవచ్చు. అయితే 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) మూవీతో వాటన్నింటికి సన్నీ చెక్‌ పెట్టాడు. సరిహద్దులు దాటిన ప్రేమకథ చిత్రంలో అతడు అద్భుతంగా నటించారు. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్‌తో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అతి పెద్ద మైలురాయిగా నిలిచింది. తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.&nbsp; 23 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సన్నీకి ఇక తిరుగుండదని అంతా భావించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఓ దశలో హీరోగా అవకాశాలు కోల్పోయి క్యారెక్టర్ అర్టిస్టుగానూ సన్నీ డియోల్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్థిక సమస్యలను సైతం ఆయన ఫేస్‌ చేశారని సన్నిహితులు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్లుగా సాలిడ్‌ హిట్‌ కోసం సన్నీ అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక అతడి కెరీర్‌ అయిపోయిందనుకుంటున్న సమయంలో మరోమారు ‘గదర్‌ 2’ మరోమారు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 691.08 కోట్లు కొల్లగొట్టి మరోమారు సన్నీ డియోల్‌కు స్టార్ స్టేటస్‌ను అందించింది. ప్రస్తుతం 'లాహోర్‌ 1947', బోర్డర్‌ 2, రామాయణం వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో సన్నీ డియోల్ నటిస్తున్నారు. తెలుగు డైరెక్టర్‌తోనూ టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలోనూ సన్నీ డియోల్‌ (Sunny Deol) ఓ బిగ్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'జాట్‌' (Jaat) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్‌ శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకొని ఉండటాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 
    అక్టోబర్ 19 , 2024
    <strong>Rakul Preet Singh: రకూల్ ప్రీత్‌ సింగ్‌ ఉంటే సీక్వెల్స్‌ ఫట్టేనా? నెట్టింట ఆసక్తికర చర్చ!</strong>
    Rakul Preet Singh: రకూల్ ప్రీత్‌ సింగ్‌ ఉంటే సీక్వెల్స్‌ ఫట్టేనా? నెట్టింట ఆసక్తికర చర్చ!
    తక్కువ సినిమాలతో ఎక్కువ స్టార్‌డమ్‌ను సంపాదించిన హీరోయిన్లలో ‘రకుల్‌ ప్రీత్‌ సింగ్’ (Rakul Preet Singh) ఒకరు. ‘కెరటం’ (Keratam) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రకూల్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఇచ్చిన సక్సెస్‌తో కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రవితేజ, మహేష్‌ బాబు, నాగార్జున ఇలా తెలుగులోని టాప్‌ హీరోల సరసన చకా చకా సినిమాలు చేసేసింది. ఓ దశలో అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. అటువంటి రకూల్‌ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఈ అమ్మడికి వచ్చింది. ఈ క్రమంలోనే రకూల్‌పై ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రకూల్‌ ఉంటే సీక్వెల్ ఫట్టే? 2021లో వచ్చిన 'కొండపొలం' (Kondapolam) చిత్రం తర్వాత రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ నేరుగా తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. రీసెంట్‌గా 'భారతీయుడు 2'తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ఓ ఆసక్తికర చర్చ నెట్టింట మెుదలైంది. ఈ అమ్మడు సీక్వెల్స్‌లో నటిస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు సైతం ఇస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన 'కిక్‌ 2', 'మన్మథుడు 2' పరాజయాలను గుర్తు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదలయ్యాయి. కానీ, ఊహించని స్థాయిలో అవి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన 'భారతీయుడు 2' కూడా వాటి తరహాలోనే ఒకప్పటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రానికి సీక్వెల్‌. ఈ మూడు దారుణంగా ఫెయిల్‌ కావడం, ఆ చిత్రాల్లో రకూల్‌ హీరోయిన్‌గా చేయడాన్ని నెటిజన్లు లింక్‌ చేస్తున్నారు. సీక్వెల్స్‌లో ఈ అమ్మడు నటిస్తే ప్లాఫ్ తథ్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; గతంలోనూ ఇలాగే! రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తరహాలోనే గతంలోనూ చాలా మంది హీరోయిన్స్‌పై ఈ తరహా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డేపై పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వచ్చాయి. ఈ అమ్మడిది ఐరెన్‌ లెగ్‌ అని, ఆమె చేసిన సినిమాలు కచ్చితంగా ఫ్లాప్ అవుతాయంటూ ప్రచారం చేశారు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయితే అందుకు కారణాన్ని హీరోయిన్స్‌కు అంటగట్టడం ఇటీవల కామన్‌గా మారిపోయింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఈ తరహా ఫ్లాప్‌ సెంటిమెంట్స్ వెంటాడాయి. ఆయనతో సినిమా చేసిన హీరోకు నెక్స్ట్‌ ఫిల్మ్‌లో ఫ్లాప్‌ తప్పనిసరి అంటూ సోషల్‌ మీడియా ఉవ్వెత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికీ అడపాదడపా ఈ తరహా కామెంట్స్‌ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.&nbsp; రాబోయేవి సీక్వెల్స్‌ చిత్రాలే! ప్రస్తుతం బాలీవుడ్‌లో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. 'మేరి పత్నికా రీమేక్‌' ( Meri Patni Ka Remake), 'దే దే ప్యార్‌ దే 2' (De De Pyaar De 2), 'ఇండియన్‌ 3' (Indian 3) ప్రాజెక్ట్స్‌లో రకూల్‌ ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇందులో రెండు చిత్రాలు మళ్లీ సీక్వెల్స్‌ కావడం ఈ అమ్మడిని మరింత ఒత్తిడికి గురిచేసే అవకాశముంది. అటు ఓటీటీ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. రీసెంట్‌గా ‘బూ’ (Boo) అనే హార్రర్ థ్రిల్లర్‌లో రకూల్‌ నటించింది. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇక బాలీవుడ్‌ నిర్మాత జాకీ&nbsp; భగ్నానీ ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం రకూల్‌ జీవితాన్ని సరదాగా గడుపుతోంది.
    జూలై 20 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ
    2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ
    ]ఆర్మీ గురించి చేసిన వివాదాస్పద కామెంట్లతో ఫక్రే నటి రిచా చద్దా నెటిజన్లు, ప్రజాప్రతినిధులతో పాటు సహచర నటుల నుంచి విమర్శలు వచ్చాయి. తర్వాత ఆమె తన కామెంట్స్ ఉపసంహరించుకొని క్షమాపణ కోరటంతో సద్దుమణిగింది.రిచా చద్ధా కామెంట్స్
    ఫిబ్రవరి 13 , 2023
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా&nbsp; సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక&nbsp; (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    Guntur Kaaram OTT: ‘గుంటూరు కారం’ మరో రికార్డ్.. 28 రోజులకే ఓటీటీలోకి!
    Guntur Kaaram OTT: ‘గుంటూరు కారం’ మరో రికార్డ్.. 28 రోజులకే ఓటీటీలోకి!
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. మహేశ్ మాస్ యాక్షన్, డ్యాన్స్‌ ఫ్యాన్స్‌కు కనెక్ట్‌ అవ్వగా.. ఎమోషనల్‌ సీన్స్‌, మదర్‌ సెంటిమెంట్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. కాగా, థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమా కూడా నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు బజ్‌ వినిపిస్తోంది.&nbsp; ఆ రోజే ఓటీటీలోకి! గుంటూరు కారం (Guntur Kaaram OTT date) ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ చిత్రం ప్రసారమయ్యే అవకాశముందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో రిలీజ్ అయ్యాక 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా మూవీ టీమ్‍తో నెట్‍ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. దీని ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ ఆ తేదీన (ఫిబ్రవరి 9) సాధ్యం కాకపోతే ఫిబ్రవరి 16వ తేదీలోగా ఏదో ఒక రోజు నెట్‍ఫ్లిక్స్‌లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram OTT) స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్‌ ఉంది.&nbsp; 10 రోజుల్లో ఎంత వచ్చింది? సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం నేటితో సరిగ్గా 10 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.231 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. ఒక ప్రాంతీయ చిత్రం పది రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు (Guntur Kaaram All Time Record) అంటూ బహిరంగంగా తమ సంతోషాన్ని ప్రకటించింది.&nbsp;
    జనవరి 22 , 2024
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.&nbsp; ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ పడిందని అంతా భావిస్తున్నారు. సామ్‌ ప్రాజెక్టులు సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.&nbsp; మయోసైటిస్‌ సమస్యలు మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్‌ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. అందం తగ్గిపోయిందా? సమంత లుక్‌ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.&nbsp; సమంత పనైపోయింది నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్‌ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.&nbsp; ఏం మాయ చేశావే నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.&nbsp; ఫ్యాన్‌ బేస్‌ సమంత ఫ్యాన్ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్‌ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి.&nbsp;
    ఏప్రిల్ 17 , 2023
    <strong>Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?</strong>
    Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్‌ చంద్ర, కిషోర్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, మైమ్‌ గోపి, రూపలక్ష్మీ తదితరులు రచన, దర్శకత్వం : కరుణ కుమార్‌ సంగీతం : జి. వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: కిషోర్‌ కుమార్‌ ఎడిటింగ్‌ : కార్తికేయ శ్రీనివాస్‌ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల విడుదల తేదీ: 14-11-2024 మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్‌ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review) కథేంటి మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోనితో పాటు నవీన్‌ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒకప్పటి గ్యాంగ్‌ స్టార్‌ రతన్‌ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్‌ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్‌ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్‌ అయ్యింది. కెమెరామెన్‌ కిషోర్‌ కుమార్‌ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పీరియాడిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి. వి. ప్రకాష్‌ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్&nbsp; వరుణ్‌ తేజ్ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారంటూ ఫైర్‌!&nbsp;</strong>
    Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారంటూ ఫైర్‌!&nbsp;
    మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే సాధించినప్పటికీ అప్పట్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ కామెంట్స్‌ వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ‘గుంటూరు కారం’పై తాజాగా మాట్లాడారు. ఈ చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోట్‌ చేసి తప్పు చేశామని క్లాస్‌ మూవీగా ప్రమోట్‌ చేసి ఉంటే మంచి రిజల్ట్‌ వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ కావడంతో ‘గుంటూరు కారం’ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ తరహాలోనే ఈ మూవీకి అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; నాగవంశీ ఏమన్నారంటే? త్రివిక్రమ్‌ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం చిత్రంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయనకు ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీ కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టిందా అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనిపై నాగవంశీ మాట్లాడుతూ 'గుంటూరు కారం కమర్షియల్‌గా సూపర్ హిట్. ఒక్క నైజాంలో డ్యామేజ్‌ జరిగింది తప్పితే అందరూ సేఫే కదా. అది సంక్రాంతి మూలానా జనం సొంతూర్లకు వెళ్తారు కాబట్టి ఎక్కువ వసూళ్లు రాలేదు. మేము అనుకున్నట్లు సినిమాను మీరు అనుకోలేదు. అందులో మా తప్పు కూడా ఉండొచ్చు. గుంటూరు కారం టైటిల్ పెట్టడం తప్పు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ సినిమాకు మాస్‌ టైటిల్‌ పెట్టడం రాంగ్ ఏమో. ఇంకోటి ఫ్యామిలీ సినిమాకు ఒంటి గంట షో వేయడం ఇంకో తప్పేమో' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/MB_Manish_/status/1845636287744626994 కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్‌ చేశారని ఫైర్‌! గుంటూరు కారం చిత్రాన్ని రీసెంట్‌గా ఓటీటీ, టీవీలో చూసినవారంతా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్‌’ను థియేటర్‌లో తప్ప మళ్లీ చూడలేదని, కానీ గుంటూరు కారంను థియేటర్‌తో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్‌లోనూ రెండుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఇది తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్యూర్‌ అని పోస్టు పెట్టాడు. మహేష్‌ వన్‌ మ్యాన్‌ షోతో ఆకట్టుకున్నాడని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇలా గుంటూరు కారం మూవీని ఆకాశానికెత్తుతూ #GunturKaaram హ్యాష్‌ట్యాగ్‌ను ఒక్కసారిగా ట్రెండ్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ మూవీలోని హైలెట్‌ సీన్స్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.&nbsp; https://twitter.com/NikhilKalyan88/status/1845478831462789400 https://twitter.com/dheeraj_0718/status/1845744116237234401 https://twitter.com/RKMSD147/status/1845562518246396065 https://twitter.com/ursrulymahesh02/status/1845547017428447593 https://twitter.com/Areykrishna_/status/1845539794740216028 https://twitter.com/i/status/1845524403872051336 https://twitter.com/i/status/1845515851140825401 ‘కుర్చి మడతపెట్టి’ మరో రికార్డు! గుంటూరు కారం చిత్రంలోని ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్‌ మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా మహేష్‌, శ్రీలీల స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. &nbsp; తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఈవెంట్‌ జరిగినా ఈ సాంగ్‌ మారుమోగేది. తాజాగా ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో మరో రికార్డు సొంతం చేసుకుంది. 450 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. దీంతో #KurchiMadathapetti హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌ సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/AtTheatres/status/1845773602467053815 https://twitter.com/i/status/1845743865938247921 https://twitter.com/i/status/1845712856580333801 మహేష్‌-త్రివిక్రమ్‌ మూవీలే ఎందుకు? మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు రూపొందాయి. గతంలో వచ్చిన ‘అతడు’ (Athadu), ‘ఖలేజా’ (Khaleja) చిత్రాలు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. కమర్షియల్‌గానూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర ఆడియన్స్‌ను మాత్రం ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అత్యధిక టీఆర్‌పీ సాధించి టెలివిజన్‌ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాను ఎలా ఫ్లాప్‌ చేశారన్న ఫీలింగ్‌ను అందరిలోనూ కలిగించాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోందని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్‌ ఓటీటీ, టెలివిజన్‌లో చూసి ప్రశంసలు కురిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫిల్మ్‌ వర్గాలు సైతం నివ్వేరపోతున్నాయి.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌, అపర్ణ బాలమురళి, వినీత్‌ శ్రీనివాసన్‌, జిమ్మీ జీన్‌ లూయీస్‌, లీనా, సంతోష్‌ కీఝాత్తూర్‌, అకేఫ్‌ నజీం, శోభా మోహన్‌ తదితరులు దర్శకుడు : బ్లెస్సీ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : సునీల్‌ కే.ఎస్‌ నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్‌ లూయీస్‌, స్టీవెన్ ఆడమ్స్‌, కే.జీ అబ్రహం విడుదల తేదీ : 28-03-2024 ‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్‌ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్‌ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్‌ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్‌ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్‌. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్‌ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్‌ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్ స్లో నారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 28 , 2024
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌&nbsp;శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మార్చి 22 , 2024
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    Ooru Peru Bhairavakona Review: సందీప్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘భైరవకోన’తో హిట్‌ కొట్టినట్లైనా!
    నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, రవిశంకర్, వైవా హర్ష, వడివక్కరసి తదితరులు దర్శకుడు: వీఐ ఆనంద్ కథ : భాను భోగవరపు సంగీతం: శేఖర్ చంద్ర&nbsp; నిర్మాణ సంస్థ:&nbsp; ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్&nbsp; నిర్మాత : అనిల్ సుంకర, బాలాజీ గుత్తా విడుదల తేదీ: 16-02-2024 సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ రూపొందించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరో సందీప్‌ కిషన్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథ బసవ (సందీప్ కిషన్) (Ooru Peru Bhairavakona Review) ఓ స్టంట్‌ మ్యాన్‌. అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం తన గ్యాంగ్‌ జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భైరవకోన అనే ఊరిలోకి వెళ్తాడు. అయితే ఈ ఊరికి ఎవరైనా వెళ్లడం తప్ప.. అక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన ఉండరు. మరి భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? భైరవకోన చరిత్ర ఏమిటి? గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు ఆ ఊరికి సంబంధం ఏమిటి? బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే బసవ పాత్రకు సందీప్ కిషన్ (Ooru Peru Bhairavakona Review) న్యాయం చేశాడు. కెరీర్‌ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలో జీవిస్తూ భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు. భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ పర్వాలేదు. ఆమెకు రాసిన సీన్లలో బలం లేకపోవడంతో ఆమె ప్రభావం సినిమాలో తక్కువే. ఇక కావ్య థాపర్ ఉన్నంతలో అందంగా కనిపించింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష కాంబోలో సీన్లు, వాళ్లిద్దరి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ సైతం నవ్వించారు. రవి శంకర్, వడివక్కరసి, జయప్రకాశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభంలోనే ఊరుని చూపించి భైరవకోనపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు దర్శకుడు. కథలో బలం ఉన్నప్పటికీ కథనంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. భైరవకోనలో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లాక ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్లిద్దరి బంధం కూడా సాదా సీదాగానే చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రగలించినా.. విశ్రాంతి తర్వాత దానిని మెయిన్‌టెన్‌ చేయడంలో విఫలమయ్యారు. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష, బ్రహ్మాజీ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్ బృందం (Ooru Peru Bhairavakona ) నుంచి దర్శకుడు వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథలో కొత్తదనంసందీప్‌ నటనట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్ ఆసక్తి లేని సన్నివేశాలుసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    ఫిబ్రవరి 16 , 2024
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.&nbsp; ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ&nbsp; ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా&nbsp; టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌ &nbsp;నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం&nbsp;ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    <strong>Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్‌ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?</strong>
    Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్‌ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?
    ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్‌ హీరోయన్లతో సమానంగా గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.&nbsp; ఒకప్పటిలా హెయిర్‌ను వెనక్కి కాకుండా ముందుకు వదిలేసి బేబీ కటింగ్‌ స్టైల్లో మేకోవర్‌ అయ్యింది.&nbsp; ఆ లుక్‌తోనే బ్యూటీఫుల్‌ శారీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రంగమ్మత్త మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు.&nbsp; అయితే రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపించి అనసూయ కాస్త బోర్ ఫీలై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఛేంజ్‌ ఔట్‌ కోసం ఈ విధంగా రెడీ అయ్యిందని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; జబర్దస్త్‌ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.&nbsp; 2012 - 2022 మధ్య&nbsp; బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.&nbsp; యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.&nbsp; రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.&nbsp; సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Pedda Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది.&nbsp; ఇందులో తెలంగాణ మాండలికం ఓన్‌ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; రీసెంట్‌గా ‘రజాకార్‌’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది.&nbsp;ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.&nbsp; అల్లుఅర్జున్‌ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.&nbsp; గతంలో ‘పుష్ప’లో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; పుష్ప 2తో పాటు తమిళంలో ' ఫ్లాష్‌బాక్‌' (Flashback), ఉల్ఫ్‌ (Wolf) అనే రెండు చిత్రాల్లో అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.
    అక్టోబర్ 09 , 2024
    <strong>Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!</strong>
    Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 40 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.&nbsp; కమల్‌ లుక్‌ కష్టాలు.. ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.&nbsp; మేకప్‌కు కోసం 5 గంటలు కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌&nbsp; (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బుజ్జి కోసం రూ.4 కోట్లు ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.&nbsp; 700VFX షాట్స్‌ కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం.&nbsp; హాలీవుడ్‌ యంత్రాంగం ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది. రికార్డు స్థాయి బడ్జెట్‌ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట. https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
    జూన్ 27 , 2024
    Guntur Kaaram On Netflix: లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ‘గుంటూరు కారం’.. ఎలాగంటే?
    Guntur Kaaram On Netflix: లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ‘గుంటూరు కారం’.. ఎలాగంటే?
    తెలుగు స్టార్‌ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. ఈ అర్ధరాత్రి (ఫిబ్రవరి 9) నుంచి ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో గుంటూరు కారంలోని హైలెట్‌ సీన్లను నెటిజన్లు ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. #GunturKaaramOnNetflix హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్రెండింగ్‌ చేస్తున్నారు.&nbsp; ఐదు భాషల్లో స్ట్రీమింగ్ గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా (Guntur Kaaram On Netflix) గత నెల 12న థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌ సపోర్టుతో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌ సాధించగల్గింది. అయితే థియేటర్ల ఆదరణ రోజు రోజుకూ తగ్గుతూ వస్తుండటంతో నెల రోజులు తిరగకముందే ఈ సినిమా నెట్‌ఫ్లిక్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రం.. ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ గుంటూరు కారం చిత్రం ట్రెండింగ్ అవుతోంది.&nbsp; మహేష్‌ను దెబ్బతీసిన హనుమాన్‌! గుంటూరు కారం మూవీకి మొదటి రోజు రికార్డు కలెక్షన్స్‌ వచ్చాయి.&nbsp; మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్‌డమ్ కలిసి రావడంతో తొలిరోజు ఏకంగా రూ. 90 కోట్ల గ్రాస్.. రూ. 55 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ చిత్రం.. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ‘గుంటూరు కారం’ను దెబ్బతీసింది. అయినప్పటికీ మహేష్‌కు ఉన్న క్రేజ్‌ కారణంగా ‘గుంటూరు కారం’ చెప్పుకోతగ్గ వసూళ్లనే సాధించింది.&nbsp; గురూజీపై తిట్ల పురాణం! ‘గుంటూరు కారం’ (Guntur Kaaram On Netflix) సినిమా మహేష్‌ ఫ్యాన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో అప్పట్లో వారు దర్శకుడు త్రివిక్రమ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మహేష్‌ లాంటి హీరోను పెట్టుకొని కూడా సింగిల్‌ లైన్‌ పాయింట్‌తో సినిమాను చుట్టేసాడని విమర్శించారు. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా మెుత్తం నడిపించారని అసహనం వ్యక్తం చేశారు. మహేష్‌ మాస్‌ లుక్‌పై పెట్టిన శ్రద్ధ స్టోరీతో పాటు స్క్రీన్‌ప్లేపై పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఓవరాల్‌గా మహేష్‌ ఇమేజ్‌, త్రివిక్రమ్‌ స్థాయికి తగ్గట్టు సినిమా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.&nbsp; కలెక్షన్స్‌ ఎంతంటే? ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే.. ఈ సినిమా ఇప్పటివరకూ వరల్డ్‌వైడ్‌గా రూ.126.47 కోట్ల నెట్‌ (రూ. 200 కోట్లు పైగా గ్రాస్) వసూళ్లు రాబట్టినట్లు శాక్‌నిక్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు రూ.132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే లక్ష్యానికి అడుగు దూరంలో అంటే రూ.8 కోట్ల నష్టంతో గుంటూరు కారం తన పరుగును ఆపేసింది. ఏదేమైనా నెగిటివ్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు.
    ఫిబ్రవరి 09 , 2024
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.&nbsp; ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు&nbsp; మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు&nbsp; ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్&nbsp; ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే? పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత&nbsp; రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా&nbsp; ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్&nbsp; తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం&nbsp; ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్‌కు బిగ్‌ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. శరవేగంగా షూటింగ్ ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్‌గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్‌ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు&nbsp; కన్నప్ప గెటప్‌లో&nbsp; విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్‌లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు. టీజర్ డేట్ ఫిక్స్ కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్‌ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మార్చారు. ఈ చిత్రం టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
    మే 15 , 2024
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    Nayakudu 2023 Review: వడివేలు, ఉదయనిధి కెరీర్‌ బెస్ట్‌ నటన… నాయకుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ దేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో మారి సెల్వరాజ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన ప్రజా సమస్యలను టచ్‌ చేస్తుంటారు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు ఉదయనిధి స్టాలిన్ తన చివరి సినిమా అవకాశాన్ని మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కథ: రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు. కాలేజీ అయిపోయాక లీల ఉచిత వైద్యం కోసం ఇన్‌స్టిట్యూట్ స్థాపిస్తుంది. దీనికోసం రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇచ్చేస్తాడు. ఓ రోజు రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) మనుషులు ఇన్‌స్టిట్యూట్‌ దాడి చేసి బిల్డింగ్‌ను ధ్వంసం చేస్తారు. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాకు వడివేలు నటనే హైలెట్‌ అని చెప్పొచ్చు. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురించే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్‌ విషయానికొస్తే ఆయన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ రోల్‌ అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయనిధి తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు ఫహాద్‌ ఫాజిల్‌ కూడా అత్యుత్తమ నటన కనబరిచాడు. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఆమె ఒదిగిపోయింది. మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు నటించారు. ఎలా సాగిందంటే ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీల చుట్టూ తిరుగుతుంది. కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంతోనే ఫస్టాఫ్‌ అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులకు పైఎత్తులు వేయడం ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటివి వీక్షకులకు ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక సినిమాకు డైలాగ్స్‌ ప్రధాన బలం అని చెప్పొచ్చు. టెక్నికల్‌గా మారి సెల్వరాజ్‌ ఈ సినిమాలోనూ తనదైన మార్క్‌ చూపించాడు.&nbsp; హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. పాత్రల పరిచయం వేగంగా చేసిన దర్శకుడు కొన్ని సీన్లను కూడా ట్రిమ్‌ చేసుంటే బాగుండేదని అనిపించింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే&nbsp; ఫ్లాష్ బ్యాక్ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతగానో దోహదం చేశాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆక్టటుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ కథవడివేలు నటనరెహమాన్‌ సంగీతంఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మైనస్ పాయింట్స్ సాగదీత సీన్స్నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3.25/5
    జూలై 14 , 2023
    SRIDEVI: శ్రీదేవితో బాలకృష్ణ అందుకే నటించలేదు...NTR అసలు కారణం కాదు
    SRIDEVI: శ్రీదేవితో బాలకృష్ణ అందుకే నటించలేదు...NTR అసలు కారణం కాదు
    ]అంతే తప్ప ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్లతో నటించొద్దనే నియమం బాలయ్య పెట్టుకోలేదనేది నిజం
    ఫిబ్రవరి 24 , 2023
    <strong>SSMB 29: రాజమౌళిపై మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఫైర్‌.. కారణం ఏంటంటే?&nbsp;</strong>
    SSMB 29: రాజమౌళిపై మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఫైర్‌.. కారణం ఏంటంటే?&nbsp;
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తన లుక్స్ సైతం మార్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని మహేష్‌తో పాటు ఫ్యాన్స్‌ కూడా&nbsp; చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం 'SSMB29' చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్‌ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన లేటెస్ట్‌ బజ్‌పై మహేష్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంతకీ ఏంటా అప్‌డేట్‌? మహేష్‌ ఫ్యాన్స్‌ ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; ఫ్యాన్స్‌ కోపానికి కారణమిదే! మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న 'SSMB29' ప్రాజెక్ట్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలై చాలా కాలమే అయిన్పపటికీ ఇప్పటి వరకూ ఒక్క అధికారిక ప్రకటన టీమ్‌ నుంచి రాలేదు. అయితే ఆగస్టు 9 మహేష్‌ బర్త్‌డే కావడంతో ఆ రోజున ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ కొన్ని రోజులుగా భావిస్తూ వస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఆగస్టు 9న ఈ సినిమాపై ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ ఉండదని తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో మహేష్‌ ఫ్యాన్స్‌ కోపపడుతున్నారు. జక్కన్న ఇలా చేశాడేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజమౌళి కచ్చితంగా బర్త్‌డే ట్రీట్‌ ఇస్తారని మరికొందరు ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. మరి మహేష్ బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు ఏదైన సర్‌ప్రైజ్‌ ఉంటుందో లేదో చూడాలి. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి! 'SSMB29'కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు సమాచారం. మిగిలిన కాస్త వర్క్‌ను కూడా ఫినిష్‌ చేసుకొని సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో మహేష్‌ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి నెగిటివ్‌ షేడ్స్ ఉంటుందని గాసిప్స్‌ వినిపించాయి. మహేష్‌ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్‌ రోల్‌, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేయలేదు. దీంతో ఈ అప్‌డేట్‌ మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఇందులో వాస్తవం ఎంతో రాజమౌళి టీమ్‌ తెలియజేయాల్సి ఉంది.&nbsp; మూడు పార్టులుగా..! 'SSMB 29' ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో క్రేజీ వార్త కూడా నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ మూవీ మూడు పార్టులుగా రాబోతుందని ఆ రూమర్‌ తాలుకూ సారాశం. దర్శకుడు రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీయాలని మేకర్స్‌కు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 'SSMB29'లో గ్రాఫిక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉండే అవకాశముందని, పైగా కథ చెప్పేందుకు కనీసం మూడు పార్ట్స్ అయినా అవసరం అవుతుందని అంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. రెండు పార్టులుగా రూపొందిన బాహుబలి కోసం జక్కన్న ఐదేళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మహేష్‌ చిత్రాన్ని మూడు పార్ట్స్‌ అంటున్నారు. దీనికి ఇంకెన్నేళ్ల సమయం పడుతుందోనని ఫ్యాన్స్ సమాలోచనల్లో పడ్డారు.&nbsp; మూవీ టీమ్‌లోకి నాజర్‌! ఇటీవల ఓ ఆసక్తికర వార్త కూడా నెట్టింట ట్రెండ్ అయ్యింది. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబుతో పాటు పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్‌ షాప్‌లో నాజర్‌ పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో మహేష్‌ బాబుకు ఆయన విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు కూడా నాజర్‌ ఇదే తరహా సేవలు అందించారు. ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా సంభాషణలు ఎలా పలకాలో ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు నేర్పించారు. స్వతహాగా థియేటర్‌ ఆర్టిస్టు అయిన నాజర్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన బాహుబలిలోనూ బిజ్జలదేవగా తన ఎవర్‌గ్రీన్‌ నటనతో నాజర్‌ ఆకట్టుకున్నారు.&nbsp; https://twitter.com/Fukkard/status/1810503350913585650
    జూలై 18 , 2024

    @2021 KTree