• TFIDB EN
  • కితకితలు
    UTelugu
    పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన రాజాబాబు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. అయితే రాజాబాబు తల్లిదండ్రులు అతని ఇష్టానికి వ్యతిరేకంగా.. ఓ లావున్న అమ్మాయితో వివాహం చేస్తారు. వారి హనీమూన్ ట్రిప్‌లో రాజాబాబుకు రంభ అనే అందమైన యువతితో పరిచయమవుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లరి నరేష్
    రేలంగి రాజబాబు
    గీతా సింగ్
    సౌందర్య
    మధు శాలిని
    రంభ
    గిరి బాబు
    రాజబాబు తండ్రి
    జయ ప్రకాష్ రెడ్డి
    సౌందర్య తండ్రి
    ఎంఎస్ నారాయణ
    సౌందర్య తాతయ్య
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    లక్ష్మీపతి
    కారు డ్రైవర్
    AVS
    సౌందర్య పొరుగు
    ఎల్బీ శ్రీరామ్
    పురోహితుడు వేటూరి సీతారామ శాస్త్రి
    కృష్ణ భగవాన్
    నగేష్
    బ్రహ్మానందం
    బ్రోకర్
    అల్లరి సుభాషిణి
    AVS భార్య
    రఘు బాబు
    ఒక లాయర్
    వేణు మాధవ్
    చైన్ స్నాచింగ్ దొంగ
    అలీ
    రూమ్ బాయ్
    సిబ్బంది
    ఈవీవీ సత్యనారాయణ
    దర్శకుడు
    ఈవీవీ సత్యనారాయణనిర్మాత
    సత్యంసంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లరి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కితకితలు, బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. నాంది చిత్రం వంటి సూపర్ హిట్ తర్వాత యాక్షన్ చిత్రాల వైపు తన పంథాను మార్చుకున్నాడు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ మీకోసం. అల్లరి నరేష్ అసలు పేరు? ఎడారా నరేష్ అల్లరి నరేష్ ముద్దు పేరు? సడెన్ స్టార్ అల్లరి నరేష్ ఎత్తు ఎంత? 6 అడుగులు అల్లరి నరేష్ తొలి సినిమా? రఘుబాబు డైరెక్షన్‌లో వచ్చిన అల్లరి అతని మొదటి చిత్రం. ఈ చిత్రం పేరే తర్వాత అతని ఇంటి పేరుగా మారిపోయింది.  అల్లరి నరేష్ ఎక్కడ పుట్టాడు? చెన్నై, తమిళనాడు అల్లరి నరేష్ పుట్టిన తేదీ ఎప్పుడు? జూన్ 30, 1982 అల్లరి నరేష్‌కు వివాహం అయిందా? విరూప కంటమనేనితో (2015) అల్లరి నరేష్‌కు పెళ్లి జరిగింది. అల్లరి నరేష్ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫర్జానా. ఈమె అల్లరి నరేష్‌తో కలిసి సీమశాస్త్రి సినిమాలో నటించింది. అల్లరి నరేష్ ఫెవరెట్ హీరో? నాగార్జున అల్లరి నరేష్ తొలి హిట్ సినిమా? తొలి చిత్రం అల్లరి మంచి గుర్తింపు తెచ్చింది. బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌, నాంది, కితకితలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అల్లరి నరేష్‌కు ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లాక్ అల్లరి నరేష్‌కు ఇష్టమైన సినిమా? గీతాంజలి అల్లరి నరేష్ తల్లిదండ్రుల పేర్లు? సరస్వతి కుమారి, ఈవీవీ సత్యనారాయణ అల్లరి నరేష్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా అల్లరి నరేష్ చదువు? B.com అల్లరి నరేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.  అల్లరి నరేష్‌కు ఇష్టమైన ఆహారం? చేపల పులుసు అల్లరి నరేష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.2.5 నుంచి రూ.3 వరకు తీసుకుంటున్నాడు అల్లరి నరేష్ అభిరుచులు? క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్? రఘుబాబు https://www.youtube.com/watch?v=L6NPy-viALo
    మార్చి 21 , 2024
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా, నాగ మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.   సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్  పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా   టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ మీకోసం..  1. ట్రైన్‌ సీన్‌ (వెంకీ) హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్‌ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.  https://www.youtube.com/watch?v=pcpuYeqwloY 2. బ్రహ్మీ vs నాజర్‌ (బాద్‌షా) బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్‌, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు.  https://www.youtube.com/watch?v=dxRDHXsQ2YQ 3. MS నారాయణ డైలాగ్స్‌ (దూకుడు) దూకుడు సినిమాలో ఎం.ఎస్‌ నారాయణ, మహేష్‌ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్‌ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్‌ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్‌ చెప్తున్న సమయంలో మహేష్‌ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది.  https://www.youtube.com/watch?v=uR3mdOT8DWY 4. సునీల్‌ కాలేజ్‌ సీన్స్ (సొంతం)  శ్రీను వైట్ల తీసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో  ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్‌ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్‌ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్‌ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు.  https://www.youtube.com/watch?v=d5rZgi9JHXU 5. బ్రహ్మీ ఫన్‌ వరల్డ్‌ సీన్స్‌ ( నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.  https://www.youtube.com/watch?v=D87NXZXotWY 6. క్విజ్‌ సీన్‌ (ఆగడు) ఆగడు సినిమాలో వచ్చే క్విజ్‌ సీన్‌ కూడా తెలుగు టాప్‌ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్‌ యాంకర్‌గా, వెన్నెల కిషోర్‌ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్‌గా నవ్వులు పూయించాడు.  https://www.youtube.com/watch?v=ufmXlnz9R4w 7. బ్రహ్మీ సీన్స్ (అతడు) మహేష్‌ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్‌ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు.  https://www.youtube.com/watch?v=UhmDHGt81l4 8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం) సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.  https://www.youtube.com/watch?v=9sUIkrR2U9c 9. ఎస్కేప్‌ సీన్‌ (నమో వెంకటేశా) ‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్‌ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది.  https://www.youtube.com/watch?v=Llwxco8Ek2o 10. బ్రహ్మీ రివేంజ్‌ (ఢీ) మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్‌, జయ ప్రకాష్‌ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్‌ తీర్చుకునే సీన్‌ సినిమాకే హైలెట్‌. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ‌అని చెప్పాలి.  https://www.youtube.com/watch?v=m7B4qtmgHkk
    మే 03 , 2023
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!
    దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.  బ్రహ్మానందం టాలీవుడ్‌ దిగ్గజ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. తన కామెడితో హాస్య బ్రహ్మగా బ్రహ్మీ గుర్తింపు పొందారు. వెయ్యికి పైగా చిత్రాల్లో కమెడియన్‌గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇటీవల రంగమార్తండ సినిమాలో నటించిన బ్రహ్మనందం ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా నటించారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మీ.. ఈ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.  ఆలీ టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఆలీ కూడా ఒకరు. ఆలీ కూడా బ్రహ్మీ లాగే 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. యాంకర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఆలీ రాణించాడు. కామెడి అంటే ఆలీదే అనే స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆలీ చురుగ్గా వ్యవహిస్తున్నాడు. తన తండ్రి మహ్మద్‌ బాషా పేరుమీద ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నాడు. ఇటీవల ఆలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.  వెన్నెల కిషోర్‌ వెన్నెల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వెన్నెల కిషోర్‌ ఆ సినిమాతోనే స్టార్‌ కమెడియన్‌గా మారిపోయారు. కోపిష్టిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టాడు. వెన్నెల కిషోర్‌ ఉంటే ఇక ఆ సినిమా హిట్టే అన్నంత రేంజ్‌కు ఎదిగాడు. దూకుడు, దేనికైనా రెడి, బిందాస్‌ వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది.  సునీల్‌ టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్స్‌లో సునీల్‌ కూడా ఒకరు. తన విభిన్నమైన భాష, నటనతో సునీల్‌ ఎంతో పేరు సంపాదించాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా సునీల్‌ హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం మళ్లీ సపోర్టింగ్ రోల్స్‌లో సునీల్‌ కనిపిస్తున్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రల్లో కూడా నటిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించాడు.  పృథ్వీ థర్టీ ఇయర్స్‌ అనగానే నటుడు పృథ్వీ ఠక్కున గుర్తుకువస్తాడు. తనదైన కామెడి టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో పృథ్వీ మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్యను ఇమిటేట్‌ చేస్తూ ఆయన చేసి కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.  ప్రియదర్శి పెళ్లిచూపులు చిత్రం ద్వారా నటుడు ప్రియదర్శి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియదర్శి జాతిరత్నాలు చిత్రంతో మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఓ వైపు హాస్యనటుడిగా చేస్తూనే మధ్య మధ్యలో హీరోగా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇటీవల ప్రియదర్శి చేసిన బలగం సినిమా ఘన విజయం సాధించింది.  సప్తగిరి పరుగు సినిమా ద్వారా సప్తగిరి టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత గణేష్, సాధ్యం, కందిరీగ, నిప్పు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటాద్రి సినిమాలో సప్తగిరి కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రంతో సప్తగిరి స్టార్‌ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన సప్తగిరి ప్రేక్షకులను తనదైన కామెడితో అలరిస్తున్నాడు.  సత్య అక్కల టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా సత్య అక్కాల ఎదుగుతున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమాల్లో సత్యం అక్కాల తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూరు వ్యక్తిగా, కోపిష్టిగా  సత్యం చేసే కామెడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.  శ్రీనివాస రెడ్డి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇడియట్‌ సినిమాతో గొప్ప కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాస్యనటుడిగా చేస్తూనే పలు సినిమాల్లో హీరోగా కూడా శ్రీనివాసరెడ్డి కనిపించాడు. గీతాంజలి, జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అలరించాడు.  షకలక శంకర్‌ జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ఆరంభించిన షకలక శంకర్‌ సినిమాల్లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ చేసే శంకర్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో కమెడియన్‌గా శంకర్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. రాజుగారి గది సినిమాలో తన అద్భుతమైన కామెడితో శంకర్‌ ఆకట్టుకున్నాడు. 
    ఏప్రిల్ 07 , 2023

    @2021 KTree