ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Netflix
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
పంజా వైష్ణవ్ తేజ్
కటారు రవీంద్రనాథ్ యాదవ్ రవిరకుల్ ప్రీత్ సింగ్
ఓబులమ్మ ఓబుసాయి చంద్
రవి తండ్రి.కోట శ్రీనివాసరావు
రవి తాతనాసర్
UPSC ఇంటర్వ్యూ బోర్డు (కేమియో) హెడ్అన్నపూర్ణ
రవి అమ్మమ్మ.హేమ
గ్రామస్థుడుఆంథోనీ
రవి ప్రకాష్
అంకయెన్నమహేష్ విట్టభాస్కర్
రాచ రవిసిరిపెల్లు
అశోక్ వర్ధన్
ఆనంద్ విహారి
ప్రణితరవి సోదరి
సిబ్బంది
క్రిష్ జాగర్లమూడి
దర్శకుడుసాయిబాబు జాగర్లమూడినిర్మాత
రాజీవ్ రెడ్డినిర్మాత
ఎంఎం కీరవాణి
సంగీతకారుడుజ్ఞాన శేఖర్ VS
సినిమాటోగ్రాఫర్కథనాలు
Tollywood Heroines: యంగ్ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
స్టార్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్ ప్రీత్‌సింగ్‌లు యంగ్ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.
సమంత
అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.
సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్ హీరో దేవ్ మోహన్ నటిేంచాడు. సినిమా ఫ్లాప్ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.
అనుష్క శెట్టి
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్ ఆకట్టుకుంది.
వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్
మహేష్, రవితేజ, అల్లుఅర్జున్, రామ్‌చరణ్, తారక్, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్ సింగ్ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన రకూల్ నటించింది.
కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్ - రకూల్ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.
2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.
కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్ నాగశేఖర్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
మే 24 , 2023
Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
వైష్ణవ్ తేజ్ అసలు పేరు?
పంజా వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు?
హీరో బాబు
వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత?
6 అడుగులు
వైష్ణవ్ తేజ్ తొలి సినిమా?
ఉప్పెన
వైష్ణవ్ తేజ్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్
వైష్ణవ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1995, జనవరి 13
వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా?
ఇంకా జరగలేదు.
వైష్ణవ్ తేజ్ ఫస్ట్ క్రష్?
సొనాక్షి సిన్హా
వైష్ణవ్ తేజ్ ఫెవరెట్ హీరో?
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్
వైష్ణవ్ తేజ్ తొలి హిట్ సినిమా?
ఉప్పెన
వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం?
కొండపొలం
వైష్ణవ్ తేజ్ ఇష్టమైన కలర్?
వైట్, బ్లాక్
వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రుల పేరు?
విజయ దుర్గ, శివప్రసాద్
వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం?
తిరుమల
వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు?
రజనీకాంత్ నటించిన శివాజి సినిమా
వైష్ణవ్ తేజ్ ఏం చదివాడు?
డిగ్రీ
వైష్ణవ్ తేజ్ అభిరుచులు?
సినిమాలు చూడటం, ట్రావలింగ్
వైష్ణవ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.
వైష్ణవ్ తేజ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
మార్చి 21 , 2024
Rakul Preet Singh: రకూల్ ప్రీత్ సింగ్ ఉంటే సీక్వెల్స్ ఫట్టేనా? నెట్టింట ఆసక్తికర చర్చ!
తక్కువ సినిమాలతో ఎక్కువ స్టార్‌డమ్‌ను సంపాదించిన హీరోయిన్లలో ‘రకుల్ ప్రీత్ సింగ్’ (Rakul Preet Singh) ఒకరు. ‘కెరటం’ (Keratam) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రకూల్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఇచ్చిన సక్సెస్‌తో కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు, నాగార్జున ఇలా తెలుగులోని టాప్ హీరోల సరసన చకా చకా సినిమాలు చేసేసింది. ఓ దశలో అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. అటువంటి రకూల్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఈ అమ్మడికి వచ్చింది. ఈ క్రమంలోనే రకూల్‌పై ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
రకూల్ ఉంటే సీక్వెల్ ఫట్టే?
2021లో వచ్చిన 'కొండపొలం' (Kondapolam) చిత్రం తర్వాత రకూల్ ప్రీత్ సింగ్ నేరుగా తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. రీసెంట్‌గా 'భారతీయుడు 2'తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో రకూల్ ప్రీత్ సింగ్ గురించి ఓ ఆసక్తికర చర్చ నెట్టింట మెుదలైంది. ఈ అమ్మడు సీక్వెల్స్‌లో నటిస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు సైతం ఇస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన 'కిక్ 2', 'మన్మథుడు 2' పరాజయాలను గుర్తు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదలయ్యాయి. కానీ, ఊహించని స్థాయిలో అవి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన 'భారతీయుడు 2' కూడా వాటి తరహాలోనే ఒకప్పటి బ్లాక్ బాస్టర్ చిత్రానికి సీక్వెల్. ఈ మూడు దారుణంగా ఫెయిల్ కావడం, ఆ చిత్రాల్లో రకూల్ హీరోయిన్‌గా చేయడాన్ని నెటిజన్లు లింక్ చేస్తున్నారు. సీక్వెల్స్‌లో ఈ అమ్మడు నటిస్తే ప్లాఫ్ తథ్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.
గతంలోనూ ఇలాగే!
రకూల్ ప్రీత్ సింగ్ తరహాలోనే గతంలోనూ చాలా మంది హీరోయిన్స్‌పై ఈ తరహా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డేపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ అమ్మడిది ఐరెన్ లెగ్ అని, ఆమె చేసిన సినిమాలు కచ్చితంగా ఫ్లాప్ అవుతాయంటూ ప్రచారం చేశారు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయితే అందుకు కారణాన్ని హీరోయిన్స్‌కు అంటగట్టడం ఇటీవల కామన్‌గా మారిపోయింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఈ తరహా ఫ్లాప్ సెంటిమెంట్స్ వెంటాడాయి. ఆయనతో సినిమా చేసిన హీరోకు నెక్స్ట్ ఫిల్మ్‌లో ఫ్లాప్ తప్పనిసరి అంటూ సోషల్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికీ అడపాదడపా ఈ తరహా కామెంట్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.
రాబోయేవి సీక్వెల్స్ చిత్రాలే!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రకూల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీగా గడుపుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'మేరి పత్నికా రీమేక్' ( Meri Patni Ka Remake), 'దే దే ప్యార్ దే 2' (De De Pyaar De 2), 'ఇండియన్ 3' (Indian 3) ప్రాజెక్ట్స్‌లో రకూల్ ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇందులో రెండు చిత్రాలు మళ్లీ సీక్వెల్స్ కావడం ఈ అమ్మడిని మరింత ఒత్తిడికి గురిచేసే అవకాశముంది. అటు ఓటీటీ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. రీసెంట్‌గా ‘బూ’ (Boo) అనే హార్రర్ థ్రిల్లర్‌లో రకూల్ నటించింది. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇక బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం రకూల్ జీవితాన్ని సరదాగా గడుపుతోంది.
జూలై 20 , 2024
69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్.. అవార్డ్స్ విజేతలు వీరే!
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు.
https://twitter.com/i/status/1714234869629558869
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714263091029107087
పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు.
https://twitter.com/bharatidubey/status/1714279017837474231
'ఆర్‌ఆర్‌ఆర్' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714256005079704005
'ఆర్‌ఆర్‌ఆర్'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253448215228480
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714255504153993419
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253832241422699
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం.
https://twitter.com/i/status/1714266870713647487
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714230631885062219
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714224832316080266
ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714218637362659515
జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.
https://twitter.com/alluarjun/status/1714300482934751553
అక్టోబర్ 18 , 2023
MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
ఒకప్పుడు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్
చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్ తీసిన వకీల్ సాబ్ (Vakeel saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్ బిజీగా ఉన్నాడు.
రామ్‌చరణ్
చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా ఉండనుంది.
అల్లుఅర్జున్
చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్
చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరణ్ తేజ్
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వరణ్ తేజ్(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అల్లు శిరీష్
చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్ లేటెస్ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఏప్రిల్ 11 , 2023
Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చిత్రాలు ఇవే!
సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
యాత్ర (Yatra)
దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.
ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్.. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్ తెరపై ఆవిష్కరించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi's NTR)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు.
అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)
2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana)
తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్, మీరానందన్ ప్రధాన పాత్రలు పోషించారు.
యాత్ర 2 (Yatra 2)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
వ్యూహాం (Vyuham)
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.
శపథం (Sapadam)
'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.
రజాకార్ (Razakar)
సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.
రాజధాని ఫైల్స్ (Rajadhani Files)
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.
లీడర్ (Leader)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
భరత్ అనే నేను (Bharath Ane Nenu)
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.
నోటా (Nota)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్ చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్ (విజయ్).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్ చేసింది.
మార్చి 13 , 2024
Samantha Ruth Prabhu: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సమంత? ముఖం మారడంపై అనుమానాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సామ్ యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సిటాడెల్’కి ఇది అధికారిక రీమేక్. ఇందులో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో నటించిన నటీనటులు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌తో అలరించింది. ముఖ్యంగా సమంత చేసిన యాక్షన్ సీన్స్ అలరించాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ సిరీస్‌పై భారీ అంచనాలు పెంచింది.ఇప్పుడు విడుదలైన రెండో ట్రైలర్ కూడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (Samantha)యాక్షన్ సన్నివేశాలతో కడుపు కట్టేసే విధంగా ట్రైలర్‌లో కనిపించిన సమంత ఆకట్టుకుంది. తన స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అభిమానులు అయితే, సమంత నటనను ప్రియాంక చోప్రా వెర్షన్ కంటే మెరుగ్గా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ సిరీస్‌లో సమంత “హనీ”గా, వరుణ్ ధావన్ “బన్నీ”గా అదరగొట్టారని అభిమానులు చెబుతున్నారు. సామ్ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే యాక్టింగ్‌తో సరికొత్తగా కనిపించింది. ఇప్పటివరకు సమంత చేసిన ఇతర యాక్షన్ రోల్స్ కంటే మరింత బలంగా, పవర్‌ఫుల్‌గా ఆమెను ఈ సిరీస్‌లో చూపిస్తున్నారు.
అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సమంత ఫేస్‌పై నెటిజన్లు చర్చిస్తున్నారు. మళ్లీ ఆమె ముఖానికి ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు.(Samantha Ruth Prabhu) సామ్ ముఖం, హీరోయిన్ సంయుక్త మీనన్‌లాగా మారిపోయిందంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటో చూస్తే నిజంగానే ఆమె ఐస్ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉన్నాయి.
ఇంకొంత మంది సమంత తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వాదిస్తున్నారు. మమోసైటిస్ వ్యాధి భారిన పడ్డ తర్వాత ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసుకునేందుకు ఆమె పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం మయోసైటిస్ వ్యాధి నయం కోసం సామ్ చాలా పవర్‌ఫుల్ ట్యాబ్లెట్ వాడిందని.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఆమె ముఖంపై ప్రభావం చూపించిందని చెబుతున్నారు.
రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఏడాదికిపైగా పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ పొందింది. మయోసైటిస్ వ్యాధి వల్ల శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంది. విజయ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా ద్వారా తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శాకుంతలం సినిమాలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించకపోవడంతో ప్రస్తుతం సామ్.. సిటాడెల్ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకుంది.
అక్టోబర్ 30 , 2024
Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్, గుండె, డయాలసిస్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.
కుటుంబ నేపథ్యం
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.
సినిమా నేపథ్యం
చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.
చంద్రమోహన్ మెచ్చిన చిత్రాలు
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.
లక్కీ హీరోగా గుర్తింపు
ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్ అయినా నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్-సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. అటు చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్.
సంపాదనలో శూన్యమే!
చంద్రమోహన్ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లపైనే. శంషాబాద్ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.
చెయ్యి చాలా మంచిదట!
చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
నవంబర్ 11 , 2023
Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్ అని తెలుసా? గెస్ట్ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్ వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్ మెుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్‌ఫుల్ క్యామియో లేదా రోల్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
చిరు క్యామియో
చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్ రీమేక్ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.
https://twitter.com/i/status/1212794102867083265
అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు
మిస్టర్ బచ్చన్
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్ వేసేలా చేసింది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్ అదిరిపోయే క్యామియోస్ ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలు పోషించారు.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించాడు.
జైలర్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
విక్రమ్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్‌బంప్స్ తెప్పించారు.
బ్రహ్మాస్త్ర
రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ క్యామియో ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తన మార్క్ చూపించి అదరగొట్టాడు.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్ చేసిన ’మగధీర’, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేయడం విశేషం.
లాల్ సింగ్ చద్దా
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్’ చిత్రంలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ ‘మైక్ టైసన్’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సెప్టెంబర్ 18 , 2024
Vijay Deverakonda: ఆ రోజు చాలా బాధపడ్డా… కానీ ఇప్పుడు 400 మిలియన్ల లవ్ సాధించా
నేషనల్ క్రష్ రష్మిక మంధాన(Rashmika Mandanna), రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫేయిర్ అంటే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీరు చేసింది రెండు సినిమాలే అయినా సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. అంతలా వీరి మధ్య కెమిస్ట్రీ కుదురిందని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి నటించినా తొలి చిత్రం 'గీతా గోవిందం'బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఏకంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం అయింది. ఈ చిత్రంలో విజయ్- రష్మిక జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మరో సినిమా వీరి కాంబినేషన్‌లో రావాలని ఆశపడ్డారు.దీంతో ఈ జోడి మళ్లి కలిసి పనిచేసింది. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రెడ్(Dear Comrade) చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో సూపర్బ్‌గా నటించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రంలో లిల్లి క్యారెక్టర్‌లో రష్మిక మంధాన క్రికెటర్‌గా అద్భుతంగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లకు ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలించాయి. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. సోషల్ మీడియాలో విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపైన కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే అవేమీ విజయ్ సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఈ థియేటర్లలో రాణించకపోయినప్పటికీ.. ఓటీటీలో దుమ్ము రేపింది. డబ్ అయిన అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించి విజయం సాధించింది.
డియర్ కామ్రెడ్ రికార్డు..
తాజాగా.. డియర్ కామ్రెడ్ హిందీ డబ్‌డ్ వెర్షన్ రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో డబ్ అయిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఏకంగా 40 కోట్ల ప్లస్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే విషయాన్ని డియర్ కామ్రెడ్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తన సంతోషాన్ని ట్వీట్ చేసింది. తెలుగులో ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకు ఎక్కకున్నా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. విజయ్- రష్మిక బాండింగ్ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయ్ నుంచి రావాలని మెసెజేస్ పెడుతున్నారు. ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.
ఆ రోజు బాధపడ్డాం..
మరోవైపు విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 400 మిలియన్ లవ్ సాధించాము. 2019లో డియర్ కామ్రెడ్ విడుదలైన రోజున కొంత బాధపడ్డాం. కానీ ఇప్పుడు 400 మిలియన్ లవ్ మమ్మల్ని తడిసి ముద్ధచేసింది. ఎన్ని సినిమాలు వచ్చినా తన లైఫ్‌లో డియర్ కామ్రెడ్ చిత్రం ప్రత్యేకమంటూ రాసుకొచ్చాడు. ఇదే పోస్ట్‌ను రష్మిక మంధానకు సైతం ట్యాగ్ చేశాడు. రష్మిక మంధాన సైతం దీనిపై స్పందించింది. విజయ్ దేవరకొండ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా రీల్‌లో పోస్ట్ చేసింది.
విజయ్ బిజీ బిజీ
ఇక ఇదిలా ఉంటే విజయ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫెమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న VD12 చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్తయన్ డెరెక్షన్‌లో VD14 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ది లెజెండ్ ఆఫ్ కర్స్‌డ్ ల్యాండ్ అంటూ ఈ సినిమా ట్యాగ్ లైన్ ఉంది. ఈ రెండు సినిమాలు విజయ్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఈ సినిమాలను చాలా జాగ్రత్తగా విజయ్ టెకప్ చేస్తున్నాడని తెలుస్తోంది.
మరోవైపు రష్మిక మంధాన పుష్ప2 ప్రమోషన్‌లో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లైన చావా(హిందీ), కుబెరా(తమిళ్) సినిమాల్లో నటిస్తోంది.
జూన్ 15 , 2024
RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ అనగానే ముందుగా అందరికీ ‘రామ్ గోపాల్ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆరాధ్య దేవి (Aaradhya Devi)
ఆర్జీవీ అప్‌కమింగ్ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Aaradhya Devi Hot images gallery
ఇర్రా మోర్ (Irra Mor)
ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)
హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది.
Shanvi Srivastava Hot images gallery
పూజా భలేకర్ (Pooja Bhalekar)
హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్ అందాలను ఆర్జీవీ క్యాప్చర్ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ హాట్ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.
Pooja Bhalekar Bikini images gallery
నైనా గంగూలి (Naina Ganguly)
ఆర్జీవీ టాలెంటెడ్ హీరోయిన్లతో పాటు బోల్డ్ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్ షో చేసింది.
అప్సర రాణి (Apsara Rani)
ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్ బాంబ్ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ పోస్టులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Apsara Rani Hot images gallery
ఊర్మిళ (Urmila Matondkar)
ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్’, ‘జంగిల్’, ‘దావుద్’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్, అందమైన హీరోయిన్ ఉంటే సినిమాను సక్సెస్ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.
అక్కినేని అమల (Akkineni Amala)
స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.
శ్రీదేవి (Sridevi)
రామ్‌గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం.
రేవతి (Revathi)
ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్’, ‘అబ్ తక్ ఛాపన్’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మహేశ్వరి (Maheswari)
ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్ రోల్‌లో నటించింది. హర్రర్ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేశాయి.
మనీషా కోయిరాలా (Manisha Koirala)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్ హిట్ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్ రిటర్న్స్’, ‘దర్వాజ బంద్’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.
సుస్మితా సేన్ (Sushmita Sen)
ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్ మెరిసింది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)
ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌త
https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
ఏప్రిల్ 24 , 2024
Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!
టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్‌బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్-10 చిత్రాలు మీకోసం..
1. సీతాకోక చిలుక
1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్ కరుణకు అన్నగా శరత్ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్‌బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది.
https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0
2. అన్వేషణ
1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్ అనే ఫారెస్టు రేంజ్ అధికారి పాత్రను శరత్ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
3. సితార
1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్‌కు అన్నగా శరత్ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్‌బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.
https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc
4. సంసారం చదరంగం
‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్‌బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.
https://www.youtube.com/watch?v=esucI1zKcM4
5. సాగర సంగమం
కె. విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హసన్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో రఘుపతి పాత్ర పోషించిన శరత్‌బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్‌కు స్నేహితుడిగా ఇందులో శరత్‌బాబు నటించారు.
https://www.youtube.com/watch?v=CtBi8524GAc
6. స్వాతి ముత్యం
కమల్ హాసన్ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్‌బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి.
7. ముత్తు
రజనీకాంత్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్‌తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk
8. అన్నయ్య
చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్‌బాబు విలన్ పాత్ర పోషించారు.
సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్‌బాబు మంచి నటన కనబరిచాడు.
https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg
9. మగధీర
రామ్‌చరణ్ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్ కుమార్ నటించారు. కాజల్‌కు తండ్రిగా, విక్రమ్ సింగ్ మహారాజ్‌గా మెప్పించాడు.
https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw
10. వకీల్‌సాబ్
పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ వకీల్‌సాబ్ సినిమాలోనూ శరత్‌కుమార్ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నటించారు. పవన్‌ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్ బాబు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
మే 22 , 2023
RAM CHARAN BIRTHDAY: గ్లోబల్ స్టార్‌తో ఉన్న ఫోటోలు పంచుకున్న సెలబ్రిటీలు
RRRతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #RC15 టైటిల్ అప్డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తారలంతా చరణ్‌పై పుట్టిన రోజు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్ సహా అందరూ రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో కొంత మంది రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అరుదైన ఫోటోలు మీకోసం
కుమారుడు గ్లోబల్ స్టార్‌గా ఎదగడం..ఆస్కార్ వేదికపైకి వెళ్లడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొడుకుకు ముద్దు పెడుతూ ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20
మంచు ఫ్యామిలీలో ట్రోల్స్‌కు గురి కాని ఒకే ఒక్కడు మంచు మనోజ్. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దాదాపుగా దూరంగా ఉంటాడు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ మనోజ్ మాత్రం…రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మిత్రమా రియల్లీ సూపర్ డూపర్ హ్యాపీ బర్త్‌డే అంటూ రామ్ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
https://twitter.com/HeroManoj1/status/1640258933918171136?s=20
బాలివుడ్ అందగాడు వివేక్ ఒబెరాయ్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. క్రిష్, రక్త చరిత్ర వంటి సినిమాలతో అందరికీ సుపరిచితుడు. రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించిన వివేక్ ఒబెరాయ్ అప్పుడు తనతో దిగిన ఫోటోను పంచుకున్నారు.
https://twitter.com/vivekoberoi/status/1640253518471913472?s=20
విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, KTR, రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
https://twitter.com/Ganta_Srinivasa/status/1640229869257887744?s=20
మెగా ఫ్యామిలీలో హాలివుడ్ కటౌట్ ఉన్న హీరో వరుణ్ తేజ్. చిన్నప్పటి నుంచి చరణ్‌తో కలిసి పెరిగిన వారే. ఇక ‘ఆట మొదలైంది’ అంటూ వరుణ్ తేజ్, రామ్‌చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
https://twitter.com/IAmVarunTej/status/1640261128071835648?s=20
RRR సినిమా తెర వెనక పనిచేసిన వారిలో రాజమౌళి తనయుడు కార్తికేయ ఒకరు. కార్తికేయ గురించి సినిమా ప్రమోషన్లలోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. వీరి మధ్య మంచి బంధం కూడా ఉంది. ‘బ్రదర్ ఫ్రం అనదర్ మదర్’ అంటూ కార్తికేయ RRR సెట్‌లోని ఫోటో షేర్ చేశారు.
https://twitter.com/ssk1122/status/1640258402285924354?s=20
రామ్ చరణ్‌తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది బ్రహ్మానందంతో కలిసి ఉన్న ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు.
https://twitter.com/IamSampathNandi/status/1640230847315087361?s=20
యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రామ్ చరణ్‌తో ఉన్న ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడి నుంచి ‘హనుమాన్’ అనే ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
https://twitter.com/PrasanthVarma/status/1640193538393804801?s=20
కియారా అద్వానీ, శంకర్ సహా ‘గేమ్ చేంజర్’ టీం రామ్ చరణ్‌కు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫోటోలతో కియారా కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.
https://twitter.com/NP_App/status/1640266153653317632?s=20
మార్చి 28 , 2023
Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?
అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్ అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా చూపించిన ఈ సిరీస్, రెండో సీజన్‌లో తన ఉద్యోగ జీవితంలో పైకి ఎలా ఎదిగాడు, పలు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆకర్షణీయంగా చూపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరు౦ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
సిరీస్ విశేషాలు
ఈ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతీ ఎపిసోడ్ దాదాపు 25-30 నిమిషాల నిడివి కలిగి ఉంది. మొత్తం రెండు గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్‌ను చాలా సులభంగా వీక్షించవచ్చు. ఎపిసోడ్ల మధ్య ఎక్కడా బోర్ అనిపించకుండా స్టోరీ సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 4వ ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్‌గా సాగి, కొన్ని సందర్భాల్లో నాటకీయత ఎక్కువై అసలు కథకు అంతరాయం కలిగిస్తుంది. అయితే, 5వ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కుటుంబంతో కలసి చూడటం కాస్త అసౌకర్యంగా ఉంటుంది, కపుల్స్ మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు.
నటీనటులు
తేజస్వి మదివాడ ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ పాత్ర పోషించారు. ట్రైలర్‌లో బికినీ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె తన గ్లామర్ పాత్రతో అందరినీ ఆకర్షించింది. తేజస్వి గతంలో ఈ విధమైన పాత్ర చేయకపోయినా, ఈసారి తన రొమాంటిక్ పాత్రలో కొత్తగా కనిపించారు. అరుణ్ కుమార్ పాత్రలో నటించిన పవన్ సిద్ధు పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా తేజస్వితో ఉన్న సన్నివేశాల్లో సీన్లను బాగా మెప్పించాడు. అనన్య శర్మ తన క్యారెక్టర్‌కు అనుగుణంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఆమె అరుణ్ కుమార్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించారు.
దర్శకత్వం
దర్శకుడు ఆదిత్య కేవీ మొదటి సీజన్‌లో అమెచ్యూర్ నుంచి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదురుకెళ్లే అరుణ్ కథను చక్కగా చూపించారు. రెండో సీజన్‌లో అతను ఉద్యోగంలో ఎదగడం, కొత్త సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే, 4వ ఎపిసోడ్‌లో ఎక్కువగా కేవలం సంభాషణలే ఉండడంతో కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా ఈ సిరీస్ ఎంతో ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ రిచ్ లుక్‌ను కలిగి ఉండి, అజయ్ అరసాడా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరింత మెరుగ్గా ఆవిష్కరించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ఉంది.
చివరగా:
వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ సరైన ఎంపిక. పూర్తి వినోదాన్ని అందిస్తుంది.
రేటింగ్:
3/5
నవంబర్ 02 , 2024
Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగలింది. గతంలో ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
సాయిపల్లవి వీడియో వైరల్
అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
కశ్మీర్ హింసాకాండ పైనా..
ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్‌గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
https://twitter.com/divya_gandotra/status/1784199470219251986
వాళ్లే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అక్టోబర్ 26 , 2024
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు?
సిద్ధార్థ జొన్నలగడ్డ
సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత?
5’.7” (175 cms)
సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా?
జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'
సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు?
1992
సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్?
అనుష్క శెట్టి
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా?
అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో?
వెంకటేష్
సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా?
గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్?
బ్లాక్
సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు?
శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు?
ఇంజనీరింగ్, MBA
సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు
బైక్ రైడింగ్, మోడలింగ్
సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు?
సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.
సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత?
రూ. 7కోట్లు
సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు .
సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా?
చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు
సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?
అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు
సిద్దు జొన్నలగడ్డ నిక్ నేమ్ ఏంటి?
స్టార్ బాయ్ సిద్ధూ
సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా?
ఒక అన్నయ్య ఉన్నారు. అతని పేరు చైతన్య జొన్నల గడ్డ
సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు?
సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్, సింగర్, లిరికిస్ట్, ఎడిటర్ కూడా. 'క్రిష్ణ అండ్ హీస్ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.
సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి?
గుంటూరు టాకీస్ ‘టైటిల్ ట్రాక్’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్-ఈ-ఇష్క్’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి?
జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్)
సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్?
2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?
గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.
సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్ బాలీవుడ్ హీరో ఎవరు?
రణ్‌బీర్ కపూర్
సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్ ఏంటి?
నలుపు
సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్ హెయిర్ స్టైల్ ఏది?
డీజే టిల్లు కోసం అతడు యూనిక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.
సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవి?
'జాక్', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్'..
సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది?
టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు.
సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ ఏవి?
సిద్ధు కెరీర్‌లో మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్. ఇందులో యాంకర్ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్ కిస్ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?app=desktop&v=mw9Jn_BsPZE&vl=hi
https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g
సిద్దు జొన్నలగడ్డ బెస్ట్ డైలాగ్స్
డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్ ది బెస్ట్ అని చెప్పవచ్చు.
రాధిక: హేయ్.. అక్కడ రాయి ఉంది చూస్కో
టిల్లు: ఐ హావ్ వన్ సజిషన్ ఫర్ యూ.. పోయి కారులో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్ వాటర్ మిలాన్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.
“మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్ లేదు నీది. పైగా ఉప్పర్ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్”
“ ప్లీజ్ నువ్వేళ్లి రిలాక్స్ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్ చేసుకొని వస్తా.
కొద్దిసేపటి తర్వాత..
టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా?
రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు
టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్ సీ సక్సెస్ బీకాజ్ ఆఫ్ యూ
https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt
టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్ డైలాగ్స్ ఏవి?
ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
డైలాగ్
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
https://twitter.com/i/status/1774992506087944622
డైలాగ్
ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
https://twitter.com/i/status/1773542640488784015
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
https://twitter.com/i/status/1773655054655856994
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8
టాలీవుడ్ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు
సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ స్టైలిష్ ఫొటోలు
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్ రోవర్ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
ఏప్రిల్ 27 , 2024
Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్, తారక్‌కు బండ్ల గణేష్ చురకలు!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 9) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.
https://twitter.com/ganeshbandla/status/1855087509103165519
తారక్, ప్రభాస్‌కు చురకలు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్, ప్రభాస్ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విష్ చేసిన స్టార్స్ వీరే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం రేవంత్ రెడ్డిని విష్ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు.
https://twitter.com/KChiruTweets/status/1854736624749625361
https://twitter.com/PawanKalyan/status/1854776671339262428
https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522
https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039
నంది అవార్డుల విషయంలో రగడ!
ఈ ఏడాది జనవరిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ పెద్దలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
నవంబర్ 09 , 2024
SSMB 29:కెన్యాలో లోకేషన్ వేటలో రాజమౌళి, వీడియో వైరల్
‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. మహేష్ లుక్ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
లొకేషన్‌లో వేటలో జక్కన్న
మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం దృష్టంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆయన మహేష్ సినిమా కోసం లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్‌డేట్ షేర్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.
View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
ఆ ప్లేస్ కన్ఫార్మ్ అయినట్లేనా!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సెర్చ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి షేర్ చేసిన ఫొటో సైతం అక్కడ తీసిందే. దానితో పాటు మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ఓ సవారి వెహికల్‌లో ప్రయాణిస్తూ కనిపించాడు. నేషనల్ పార్కులో ప్రయాణిస్తూ అక్కడి లొకేషన్స్‌ను రాజమౌళి పరిశీలించడం గమనించవచ్చు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో కెన్యాలోని నేషనల్ పార్కులోనే కొంత భాగం షూట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/ch76891/status/1851175580273631275
ఏఐ టెక్నాలజీ వినియోగం!
గ్లోబల్ స్థాయిలో రూపొందున్న 'SSMB 29' ప్రాజెక్ట్ కోసం జక్కన్న ఏఐ టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నట్లు టాక్. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. మాములుగానే రాజమౌళి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి. ఏఐ కలయిక నేపథ్యంలో ఈ సినిమాలో అవి రెట్టింపుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
‘కాపీ కొట్టడం తప్పుకాదు’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అటువంటి జక్కన్నపై సినిమా రిలీజైన ప్రతీసారి కొన్ని విమర్శలు వస్తుంటాయి. హాలీవుడ్ చిత్రాల్లోని సీన్స్‌ను రాజమౌళి కాపీ కొట్టారని నెట్టింట ప్రచారం జరుగుతుంటుంది. ఇదిగో ప్రూఫ్స్‌ను అంటూ కొన్ని వీడియోలను సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుంటారు. దీనిపై స్పందించిన రాజమౌళి తాను హాలీవుడ్ సినిమాలను కాపీ చేస్తానన్న విషయాన్ని అంగీకరించారు. ‘చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కాపీ చేసామంటున్న ప్రతి సారి మేం ఒరిజినల్ కంటే బాగా తీసాం. దీని వల్ల ఎవరికి నష్టం ఉండదు. అదే నేను ఓ తమిళ్ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు' అని సమర్థించుకున్నారు.
https://twitter.com/i/status/1565532933183930368
కథ.. ఆ నవలల ఆధారమేనా?
రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి & టీమ్ రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. విల్బర్ స్మిత్ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్ వినిపించింది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో ఆ నవలల ఆధారంగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం కలుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అక్టోబర్ 29 , 2024
Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి పనులు షురూ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది.
‘పెళ్లి గురించి కలలు కనలేదు’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో 'లవ్, సితారా' అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
అక్టోబర్ 21 , 2024